girl killed
-
జీన్స్ వేసుకుంటానంటే బాలికను కొట్టి చంపేశారు
డియోరియా: జీన్స్ ప్యాంట్ వేసుకుంటానని పట్టుబట్టిన ఓ బాలికను ఆమె కుటుంబీకులే కొట్టి చంపారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా సవ్రేజీ ఖర్గ్ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నేహా పాశ్వాన్ (17) జీన్స్, టాప్ ధరిస్తానంటూ మొండికేయగా కుటుంబసభ్యులు సోమవారం ఆమెను తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డియోరియా–కస్య మార్గంలోని పటన్వా వంతెనపై నుంచి విసిరేశారు. అయితే, ఆ మృతదేహం రైలింగ్‌కు చిక్కుకుని అక్కడే ఉండిపోయింది. గమనించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అమ్మమ్మ, తాత సహా 10 మంది కుటుంబసభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, బాలికను జీన్స్ వేసుకుంటానని చెప్పినందుకే కోపంతో కొట్టి చంపామంటున్న మృతురాలి కుటుంబసభ్యుల మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన వెనుక వేరే కారణాలు ఉండి ఉండొచ్చుననీ, అవేంటో దర్యాప్తులో వెలుగులో చూస్తాయని చెబుతున్నారు. -
అనుమానాస్పద స్ధితిలో విద్యార్ధిని మృతి
-
వారాసిగూడలో దారుణం, ఉద్రికత్త
సాక్షి, సికింద్రాబాద్: చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. కాగా బాలికపై దుండగులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రెండు అపార్ట్మెంట్ల మధ్య పడిఉన్న బాలిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి,పోస్ట్‌మార్టం చేయిస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా బాలిక నిన్న సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఉద్రిక్తంగా వారాసిగూడ ప్రాంతం కాగా ఈ సంఘటనతో వారాసిగూడ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలి ఇంటి వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు మృతురాలి బంధువులు..బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రేమ పేరుతో బాలికను ఓ యువకుడు వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వారాసిగూడలో భారీగా మోహరించారు. -
గీజర్ నుంచి విషవాయువు.. బాలిక మృతి
ముంబై : గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన ధృవి గోహిల్ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్ మోనాక్సైడ్‌ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు. -
మరో మొగ్గ రాలిపోయింది..
సాక్షి, సీతంపేట: ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లింది..సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటిలో కొంత సమయం ఉండి తోటి స్నేహితులతో ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. అంతలోనే విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఇక ఆ ఇంటిలో చిన్నారి ముద్దులొలికే మాటలు, పట్టీల చప్పుడు ఉండదని తెలియడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. మండలంలోని దేవనాపురం గ్రామానికి చెందిన కుండంగి శరణ్య (8) గిరిజన బాలిక విద్యుదాఘాతానికి బలైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఇంటి బయట తోటి చిన్నారులతో ఆడుకుంటూ గ్రామంలో కొండగొర్రి చొక్కారావు ఇంటిపైకి మెట్లు ఎక్కుతుండగా దగ్గర్లో ఉన్న విద్యుత్ వైరు తగిలి కొంతదూరం తుళ్లి పోయింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను సీతంపేట సీహెచ్‌సీకి తరలించినప్పటకీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనను చూసి తల్లిదండ్రులు నాగభూషణరావు, కృష్ణవేణిలు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. చిన్నారి శరణ్యకు సోదరుడు, సోదరి ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. బాలిక మృతిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ బి.హైమావతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
బాలిక హత్యపై స్పందించిన సాధ్వి నిరంజన్
లక్నో : సమాజంలో సంప్రదాయ విలువలు, సంస్కృతి మంటగలిశాయని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. అలీగఢ్‌లో రెండేళ్ల చిన్నారిని చంపిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని, కుటుంబ పెద్దలు తమ పిల్లల్లో మంచి విలువలు నెలకొల్పేలా చొరవ చూపాలని ఆకాక్షించారు. చిన్నారి మరణం దురదృష్టకరమని, ఈ తరహా ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం సత్వరమే స్పందిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు అప్పు తీర్చలేదన్న కోపంతో వడ్డీ వ్యాపారి వారి రెండున్నరేళ్ల కూతురిని గొంతునులిమి చంపిన ఘటన అలీఘడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే . ఆ వ్యాపారి చిన్నారి కను గుడ్లు బయటకు పీకేసి పాశవికంగా హత్యచేశాడు. బాలిక హత్యపై అలీగఢ్ జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. నిందితుడికి మరణ శిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిందితుడి కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ దారుణం చోటుచేసుకున్నందున వారిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. -
దారుణం..పాఠశాలకు వెళుతుందని..
సాక్షి, పట్నా: ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు. కానీ ఆ చదువే ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. కేవలం కట్టుబాట్లను కాదన్నందుకు 17 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు. తమ కుల నియమానికి విరుద్ధంగా పాఠశాలకు వెళుతుందని కక్ష పెంచుకొన్న ఏడుగురు వ్యక్తులు.. 17 ఏళ్ల బాలికను కిరాతకంగా హతమార్చారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సాన్‌పురా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తమ కుల కట్టుబాటు ప్రకారం పదో తరగతి తర్వాత అమ్మాయిలను ఉన్నత చదువుల కోసం పంపించడం నేరంగా పరిగణిస్తారని, ఈ నియమాన్ని ఉల్లంఘించి.. బాధిత బాలిక వెళుతుందని గ్రహించిన ఏడుగురు వ్యక్తులు... ఈ విషయమై బాలిక కుటుంబాన్ని బెదిరించారని గ్రామస్తులు తెలిపారు. అయినా, బాలిక స్కూలుకు వెళుతుండటంతో.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారం బాలిక సోదరుడిని, వదినను వారింట్లోనే బంధించిన నిందితులు అనంతరం బాలికను చంపేశారని వారు తెలిపారు. బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ కేఎం ప్రసాద్ తెలిపారు. -
పిక్నిక్లో విషాదం
పొందూరు: పిక్నిక్లో పెను విషాదం చోటుచేసుకుంది. పొందూరు మండలం జాడపేటలో తేనెటీగలు దాడి చేసిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా ముగ్గురు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జాడపేట ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు శనివారం సమీప తోటలో పిక్నిక్ జరుపుకొన్నారు. అందరూ సందడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేశాయి. అందరూ తలోవైపు పరుగులు తీశారు. అయితే బైరోతు అనూష(2) అనే రెండో తరగతి విద్యార్థిని మాత్రం తేనెటీగల నుంచి తప్పించుకోలేకపోయింది. ఒక్కసారిగా గుంపు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతిచెందింది. తేనెటీగల దాడిలో ముగ్గురు ఉపాధ్యాయులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. విషాదంలో తల్లిదండ్రులు.. బైరోలు అనూష స్వగ్రామం విజయనగరం జిల్లా కురుపాం గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మి, సింహాచలం వలస కూలీలు. తోటపని, ఇటుకల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా జాడపేటలో ఉంటున్నారు. అనూష ఇటీవలే గుండె జబ్బుతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడుతున్న సందర్భంలో తేనెటీగల దాడితో పాప భయభ్రాంతులకు గురై మృతి చెంది ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు. రెండు గ్రామాల్లో విషాదం.. పొందూరు మండలంలోని జాడపేట, జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వాండ్రంగిలో అనూష తాత కంది రమణ, అమ్మమ్మ విజయలక్ష్మి ఉంటున్నారు. మనవరాలు మృతి చెందిందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కాగా, అనూష చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
గొంతు నులిమి గోనె సంచిలో కుక్కి..
గజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని హత్య చేసి గోనె సంచిలో కుక్కి పడేశారు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజియాబాద్‌కి చెందిన ఏడేళ్ల చిన్నారి గత శనివారం కిడ్నాప్‌కి గురై ఆదివారం శవమై కనిపించింది. ఇంటి సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లిన చిన్నారి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు చట్టుపక్కల వెతికినా చిన్నారి జాడ తెలియలేదు. దీంతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి సీసీ పుటేజీని పరిశీలించారు. చిన్నారి చివరిసారిగా ఇంటి సమీపంలో ఉన్న మసీదు దగ్గరలో కనిపించింది. దీంతో పోలీసులు అటువైపుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఆ ఏరియాకి చెందిన ఓ వ్యక్తి మసీద్ మీదుగా వెళ్తుండగా గోనె సంచి మూట కనిపించింది. విప్పి చూడగా చిన్నారి మృత దేహం కన్పించింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేశాడు. దీంతో బాలిక తల్లిదంద్రులు, పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. చిన్నారి గొంతు నులిపి అనంతరం గోనె సంచిలో మూట కట్టి పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అత్యాచారానికి పాల్లపడ్డారు! శనివారం అదృశ్యమైన చిన్నారి ఆదివారం ఉదయం శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం గొంతునులిపి చంపేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రాణంతో ఉండగా గోనె సంచిలో మూటకట్టి పడేశారని భావిస్తున్నారు. బాలికపై అత్యాచారం చేశారా లేదా అనె విషయాలు పోస్టుమార్టం అనంతరం తెలియజేస్తామని గజియాబాద్ ఎస్పీ తెలిపారు. రాజకీయ కక్షతోనే హత్య : బాలిక తండ్రి రాజకీయ కక్షతోనే స్థానిక కౌన్సిలర్ అజాజ్ బాగ్ తన కూతురిని హత్య చేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. ఇటీవలే జరిగిన లోకల్ ఎన్నికల్లో అజాజ్‌కి వ్యతిరేకంగా బాలిక మేన మామ పోటీ చేశాడు. దీంతో కక్ష కట్టిన అజాజ్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తునారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్తుండగా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో గాంధీ జయంతి రోజున ఘోరం చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొని సైకిల్‌పై ఇంటికి వెళ్లున్న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని (15)పై ముగ్గురు దుండగులు అత్యాచారయత్నం చేసి హత్య చేశారు. ఈ ఘటన మెయిన్‌పురి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరుగుపయనమైన బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచార యత్నం చేశారు. బాలిక తీవ్రంగా వ్యతిరేకించడంతో విచక్షణారహితంగా ఆమెపై భౌతిక దాడికి దిగారు. చిత్రవధ చేసి హింసించారు. తీవ్ర గాయాల కారణంగా బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నేరం నుంచి తప్పించుకోవాలని చూసిన కర్కోటకులు ఆమె మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఈ అమానుష ఘటన గ్రామస్తుల కంటబడడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న హత్య, అత్యాచార ఉదంతాలు.. యోగి ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలపాలు చేస్తున్నాయి.కారు ఆపలేదన్న కారణంతో లక్నోలో గతవారం పోలీసులు ఆపిల్ ఉద్యోగిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
కన్ను పీకి..కాలునరికి..
జయపురం : నవరంగ్‌పూర్ జిల్లాలో అమానుష చర్య బయల్పడింది. 8 ఏళ్ల బాలికను హత్య చేసి పొదల్లో పడేశారు. హత్య చేసిన వారు ఆ బాలిక రెండు చెవులు కోసేశారు. అంతే కాకుండా బాలిక కడుపుపై, తలపైన తీవ్రంగా గాయపరిచారు. ఆమె ఎడమ కాలిని నరికేశారు. ఎడమ కన్ను పీకేశారు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టి ముక్కు పచ్చలారని బాలికను చంపిన ఆ కసాయిలు ఎవరో తెలియలేదు. దుష్టశక్తుల పేరిట ఆ బాలికను ఎవరో బలి ఇచ్చి ఉంటారని, అందుకే బాలిక అంగాలను తొలగించారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెండు రోజులుగా కానరాని బాలిక నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కొచరాపర ఆదివాసీ గ్రామస్తుడు సుఖా గోండ్ కుమార్తె పూజా గోండ్ బుధవారం సాయంత్రం నుంచి కనిపించలేదని, గ్రామంలో ఎవరి ఇంటిలోనైనా ఆడకుంటుందేమోనని తల్లి దండ్రులు అన్ని ఇళ్లకు వెళ్లి వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో గ్రామ పరిసర ప్రాంతాల్లోని తోటల్లో , పొలాల్లో గాలించారు. ఆమె జాడ లేకపోవడంతో సమీప గ్రామంలో ఉంటున్న తమ బంధువులకు ఫోన్ చేసి బాలిక ఏమైనా వచ్చిందా అని ఆరాతీశారు. వారింటికి కూడా వెళ్లకపోవడంతో బంధువులు, తల్లిదండ్రులు బిడ్డ ఏమైందోనని విచారంలో మునిగిపోయారు. గురువారం తిరిగి బాలిక బంధువులు, గ్రామస్తులు బాలిక జాడ కోసం గాలిస్తుండగా గ్రామానికి కొంత దూరంలోని ఒక గడ్డి వాములో బాలిక శవమై ఆమె పెద్దనాన్న సుధురాం గోండ్‌కు కనిపించింది. దీంతో ఆయన తమ్ముడికి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు బాలిక మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. మృతదేహాన్ని పరిశీలించి క్షుద్రపూజలు చేసి చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి తాను ఈ ప్రాంతంలో వెతికినప్పుడు అక్కడ ఎటువంటి మృతదేహం లేదని, అంటే ఎవరో దుండగులు ఎక్కడో క్షుద్ర పూజలు చేసి హత్య చేసి పడేశారని సుధారాం గోండ్ ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దీంతో బాలిక బంధువులు కుందెయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోవింద చం ద్ర బురద, కుందెయి పోలీసు అధికారి పితాంబర సాగర్, సబ్ ఇన్స్పెక్టర్ భవానీ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులు, మృతురాలి తల్లిదండ్రులను విచారణ చేశారు. ఇంత చిన్న పిల్లను ఎవరు హత్య చేశారో కనిపెడతామని పోలీసులు తెలిపారు. బాలిక పెదనాన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం బాలికను ఎక్కడో చంపి ఇక్కడ పడేసిఉంటారన్నారు. అభంశుభం తెలియని బాలికను చంపిన హంతకులను కఠినంగా శిక్షిం చాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు. -
టీచర్ల ముందే తలనరికిన ఉన్మాది
-
టీచర్ల ముందే తలనరికిన ఉన్మాది
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. టీచర్లు, విద్యార్థుల ముందే ఆమెను తలనరికి కిరాతకంగా హతమార్చాడు. అనుప్పూర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట్మా పట్టణానికి చెందిన 17 ఏళ్ల పూజా పనికా, నిగ్వాని రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లిన పూజను ఓ యువకుడు వెంబడించాడు. పాఠశాల గేట్ వద్దకు చేరుకోగానే అప్పటిదాకా తనతో దాచుకున్న తల్వార్‌ను తీసి ఆమెపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. పూజ వీపు, మెడ, గొంతు భాగంలో పొడిచాడు. కత్తి పోట్లకు ఆమె తల తెగిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్లు, విద్యార్థులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఇదంతా చూస్తున్న స్థానికులు పారిపోతున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ‘బాలిక వెనకాలే అతను రావటం చూశాం. కానీ, ఆమె ఇంట్లో వ్యక్తి అయి ఉంటాడని భావించాం. చివరకు కత్తితో ఆమెపై దాడి చేశాడు. మేమంతా అప్రమత్తం అయ్యే లోపు ఘోరం జరిగిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అనుమానితుడి అరెస్ట్... కాగా, 2014లో యువతిని వేధించాడన్న కారణంగా దిలీప్ సాహూ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని బాలిక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీస్ అధికారి విజయ్ సింగ్ తెలిపారు. స్కూల్ ఆవరణలోనే అందరి ముందు ఈ భయానక ఘటన చోటు చేసుకోవటంతో వారం రోజులు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. -
బాలికను చిదిమేసిన కాలేజీ బస్సు
హైదరాబాద్: అదుపుతప్పిన ఓ కళాశాల బస్సు బాలికను చిదిమేసింది. శుభకార్యానికి వెళ్తున్న బాలిక కాలేజీ బస్సు కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లింది. బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన బొడ్డుపల్లి బాలకిషన్ కూతురు మధుశాలిని (12) చైతన్యపురిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లే క్రమంలో తన బాబాయ్ వెంకటేశ్‌తో కలసి బైకుపై వెళ్తుండగా.. పెద్దఅంబర్‌పేట గ్రామం నుంచి ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతుండగా నగరం వైపు నుంచి వస్తున్న సెయింట్‌మేరీస్ కాలేజీకి చెందిన బస్సు ఢీ కొట్టింది. దానిని తప్పించే క్రమంలో కాలేజీ బస్సు వెంకటేశ్ బైకును వెనుకనుంచి ఢీ కొట్టింది. దీంతో బైకు వెనుకసీటులో కూర్చున్న మధుశాలిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో వెంకటేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డమ్మీ శవం కోసం బాలిక హత్య
-
డమ్మీ శవం కోసం బాలిక హత్య
జీవితాంతం ప్రియుడితో కలసి ఉండేందుకు దారుణం మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళ ఎప్పటికీ.. అతడితోనే ఉండేందుకు దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి దగ్గర నుంచి కుటుంబీకులు తరచూ వెనక్కి తీసుకొస్తుండడంతో తాను చనిపోయినట్లు అందర్నీ నమ్మించేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఇందుకోసం అన్నెంపున్నెం తెలియని బాలికకు తన దుస్తులు వేసి హత్య చేసి.. బావిలో పడేసి పరారైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో జరిగిన ఈ హత్య కేసు మిస్టరీ.. వారం తర్వాత వీడింది. ఆదివారం ఎస్పీ కోటిరెడ్డి ఈ హత్య వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌లోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన పువ్వల భవ్యకు 15 ఏళ్ల క్రితం తన మేనమామ పూర్ణచందర్‌రావుతో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు. భవ్య బైపాస్ రోడ్డులో చిన్నహోటల్ నడుపుతోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన హోటల్ ఎదురుగా ఉన్న అమ్మా ట్రాన్స్‌పోర్టుకు వచ్చే విజయవాడ పడమటకు చెందిన జంగిలి శ్రీనివాస్‌తో భవ్యకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భవ్య విజయవాడ వెళ్లి ప్రియుడితోనే ఉంటోంది. ఆమె భవ్య కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లి భవ్యను తీసుకొచ్చారు. అయినా భవ్య విజయవాడకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే తన పోలికలతో ఉండే మరో మహిళను చంపేసి తాను చనిపోయినట్లు నమ్మించాలని భవ్య భావించి శ్రీనివాస్‌తో చెప్పింది. ఈ నెల 13న తన హోటల్‌కు చాక్లెట్ కోసం వచ్చిన ఓర్సు అనూష(8)పై భవ్య కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి తన నైటీ ఇచ్చి, ఆమెను వేసుకోమంది. అనం తరం ఇంట్లోకి తీసుకెళ్లి కర్రతో అనూష తలపై బాదడంతో స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత అనూషపై భవ్య కిరోసిన్ చల్లి నిప్పంటించింది. పెద్దమ్మ విజయలక్ష్మితో కలసి భవ్య... శవాన్ని సంచిలో మూటకట్టి ఆటోలో తీసుకెళ్లి ఈదులపూసపల్లి నల్లాల బావిలో పడేసింది. తర్వాత భవ్య నేరుగా విజయవాడకు వెళ్లి తన ప్రియుడు శ్రీనివాస్ తో జరిగిన విషయం చెప్పింది. అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులు 13న పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ నెల 16న మహబూబాబాద్ మండలంలోని ఈదులపూసపల్లి గ్రామశివారులోగల నల్లాల బావిలో అనూష మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఈ మృతదేహం అనూషదిగా తొలుత పోలీసులు పోల్చుకోలేకపోయారు. ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక నివేదిక, బాలిక తల్లిదండ్రుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. భవ్య, జంగిలి శ్రీనివాస్, కస్తూరి విజయలక్ష్మి ఈ హత్య కేసులో నిందితులుగా తేలడంతో... వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోస్టుమార్టం కోసం 14కి.మీ. నడక
- చెరువులో పడి బాలిక మృతి - కొద్ది దూరం మోసుకొని.. ఆ తరువాత బైక్‌పై ఆస్పత్రికి మృతదేహం తరలింపు పాడేరు: ఆ గిరిజన పల్లెల్లో వైద్యానికే కాదు పోస్ట్‌మార్టం కోసమూ కష్టాలు తప్పడంలేదు. అయిన వారు చనిపోరుున బాధను దిగమింగుకుంటూ కిలోమీటర్ల కొద్దీ దూరం మృతదేహాన్ని మోసుకొచ్చిన తీరు చూపరులకు కంట తడిపెట్టించింది. విశాఖ జిల్లా పాడేరు మండలం వంజంగి పంచాయతీ పోతురాజుమెట్టలో కొర్ర సంధ్య అనే ఐదేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం పూలుకోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పంట చెరువులో పడిపోరుుంది. కొన ఊపిరితో ఉన్న బాలికలను బైటకు తీశారు. 108 ద్వారా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మారుమూలన ఉన్న ఈ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో వాహనం రాలేదు. సకాలంలో వైద్యం అందక కొద్ది సేపటికే బాలిక తుది శ్వాస విడిచింది. ప్రమాదవశాత్తు మృతి చెందినందున బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చింది. మరో మార్గంలేక బాలిక మేనమామ సుమారు 14 కి.మీ. దూరంలో ఉన్న పాడేరు ఏరియా ఆస్పత్రికి శనివారం ఉదయం మృతదేహం మోసుకుంటూ బయలు దేరాడు. ఇది తెలిసిన మరో బంధువు బైక్ తీసుకురావడంతో చివరలో బైక్‌పై తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆస్పత్రికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. -
నిద్రపోతున్న కూతురిని నరికి చంపేశాడు!
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గాఢంగా నిద్రపోతున్న తన కన్న కూతురిని ఓ తండ్రి నరికి చంపేశాడు. తెల్లవారుజాము సమయంలో ఆశారామ్ అనే వ్యక్తి తన కూతురు సోనియా (19)ను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. గౌరవ్ అనే వ్యక్తిని సోనియా ప్రేమించిందని, అది వద్దని ఆశారామ్ తరచు చెప్పేవాడని సీనియర్ ఎస్పీ దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. వృత్తిరీత్యా టైలర్ అయిన ఆశారామ్.. తన భార్య రేఖ తెల్లవారుజామునే పాల కోసం సమీపంలోని డెయిరీ వద్దకు వెళ్లినప్పుడు సమయం చూసుకుని మరీ కూతుర్ని హతమార్చాడు. ఆమె మెడమీద పదునైన ఆయుధంతో కోసినట్లు గాయాలున్నాయి. ఆ సమయంలో సోనియా తన చెల్లెళ్లతో కలిసి నిద్రపోతోంది. కుమార్తెను చంపేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని వీధిలో పెట్టి, నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఆశారామ్‌ను జైలుకు పంపినట్లు సీనియర్ ఎస్పీ చెప్పారు. -
ప్రాణాలు తీసిన రాంగ్‌రూట్
స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు చెల్లెలు దుర్మరణం అన్నకు తీవ్రగాయాలు ..పరిస్థితి విషమం నెల్లూరు (క్రైమ్) : రాంగ్రూట్లో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న చెల్లెలు దుర్మరణం చెందగా, అన్న తీవ్రగాయాలతో ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద సంఘటన ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన నాగిరెడ్డి మల్లికార్జునరెడ్డి, విజయ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె తేజస్విని (17) ప్రస్తుతం ఆమె నారాయణ మెడికల్ కళాశాలలో బిఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల కిందట విజయ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి ప్రతి రోజు రాత్రి ఎవరో ఒకరు ఆమెకు తోడుగా హాస్పిటల్లో ఉండేవారు. ఈ నేపథ్యంలో మల్లికార్జునరెడ్డి బుధవారం రాత్రి విజయకు తోడుగా ఉండాలని తన తమ్ముడు కుమారుడు అభిలాష్, కుమార్తె తేజశ్వినిని హాస్పిటల్‌కు పంపాడు. దీంతో అన్న, చెల్లెలు ఇద్దరూ రాత్రంతా హాస్పిటల్లో ఉన్నారు. గురువారం తెల్లవారు జామున మల్లికార్జునరెడ్డి హాస్పిటల్‌కు వచ్చాడు. అభిలాష్, తేజశ్వినిని ఇంటికి వెళ్లమని చెప్పడంతో ఇద్దరు తమ స్కూటీపై బయలుదేరారు. ఆత్మకూరు బస్టాండ్ మీదుగా వెళ్తుండగా మినీ లారీస్టాండ్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా రాంగ్రూట్లో నెల్లూరు టూ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో అన్నా చెల్లెలు ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. బస్సు ముందు చక్రం తేజశ్విని తలపైకి ఎక్కడంతో తల పగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అభిలాష్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కు, నార్త్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. నార్త్ ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడు అభిలాష్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సింహపురి హాస్పిటల్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని నార్త్ ట్రాఫిక్ ఎస్ఐ కొండయ్య, ఏఎస్ఐ రమణయ్య పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ రమణయ్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నార్త్ ట్రాఫిక్ ఎస్ఐ కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో కుటుంబసభ్యులు తేజశ్విని మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కుమార్తె మృతిని జీర్ణించుకోలేక తండ్రి కుప్పకూలిపోయాడు. తమ ఆశలన్నీ కల్లలైపోయాయని కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె మృతి విషయం తెలుసుకున్న విజయ సైతం గుండెలవిసేలా రోదించింది. అభిలాష్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అభిలాష్‌రెడ్డి చెన్నైలోని పరిమళ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు దసరా సెలవలు కావడంతో ఇంటికి వచ్చాడు. -
బతుకమ్మ పూలకోసం వెళ్లి..
అశ్వరావుపేట: బతుకమ్మ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూలను తెచ్చేందుకు వెళ్లిన ఓ బాలిక చెరువులో పడి మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం అనంతారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కావ్య(12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు బతుకమ్మ పేర్చడానికి పూలను కోసుకొచ్చేందుకు వెళ్లిన కావ్య ఊర చెరువులో పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బాలిక దారుణ హత్య
- పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు - మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన గోపాల్పేట : ఓ గుర్తుతెలియని బాలికను దుండగులు అతి కిరాతంగా హత్యచేసి, ఆపై మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికం గా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్తు తెలియని బాలిక(14)ను ఎక్కడో చంపి తాడిపర్తి సమీపంలోని ప్రధాన రహదారి పక్కనుంచి జమ్మికుంటకు వెళ్లే దారిలో వ్యవసాయ పొలంలో పడేసి నిప్పంటించారు. శనివారం అటువైపు వెళ్తున్న కొందరు రైతులు గమనించి గ్రామస్తులకు విషయం తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వనపర్తి టౌన్ ఎస్ఐ గాంధీనాయక్, గోపాల్పేట ఏఎస్ఐ ఇలియాజ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు. నీళ్లు పోయించి మంటలను ఆర్పించారు. తెల్లవారుజామునే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. మృతదేహం పక్కనే మోటార్ సైకిల్ టైరు గుర్తులున్నాయి. బైకుపై తీసుకొచ్చి ఉంటారని, శరీ రంపై బురఖా ధరించి ఉండటంతో ముస్లిం బాలికగా పోలీసులు భావిస్తున్నారు. బాలిక ముఖం పూర్తిగా కాలిపోవడంతో ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. మృతదేహం పక్కనే బెడ్‌షీట్, చున్నీ, లోదుస్తులు, ఓ చిన్న కత్తి పడి ఉంది. కుడికాలి బోటన వేలు పూర్తిగా రాసుకుపోయి ఉంది. మృతదేహాన్ని బైకుపై తీసుకొచ్చేవేళ రోడ్డుపై రాసుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తలపై కొట్టి.. ఆపై ఈడ్చుకొచ్చి మృతురాలి కుడి చేతికి ఓ ఎర్రని దారం ఉంది. తల వెనుక భాగంలో బలమైన రక్తపు గాయాన్ని పోలీసులు గుర్తించారు. తలపై కొట్టిచంపి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. బెడ్‌షీట్, దుస్తులు ఉండటంతో బాలికను హాస్టల్ నుంచిగానీ, ఇంటినుంచి గానీ తీసుకువచ్చారా, ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికలను గుర్తించడం కోసం అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారమిచ్చి మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికతో భర్త కలిసుండటం చూసి..
రామచంద్రపురం : తాళ్లపొలంలో గత నెల ఏడున అనుమానాస్పదంగా మరణించిన పప్పుల ఆదిలక్ష్మిది హత్యేనని ప్రత్యేక దర్యాప్తు అధికారి, కాకినాడ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం విలేకరులకు వివరాలు చెప్పారు. గ్రామానికి చెందిన కట్టా రాధాకృష్ణ, ఇదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికను ఇంటిలో పనిచేసేందుకు తల్లిదండ్రుల వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాలికను పాఠశాలలో చేర్పించి చదివించేందుకు, పెద్దయ్యాక పెళ్లి చేసేలా మాట్లాడుకున్నారు. బాలికను 7వ తరగతి వరకు చదివించిన రాధాకృష్ణ, ఆ తర్వాత స్కూల్‌కు పంపలేదు. ఏడాదిన్నర క్రితం నుంచి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యంగా ఉన్న తన భార్య అన్నపూర్ణను గత నెల 7న రాధాకృష్ణ కాకినాడ వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు. భార్య నిద్రపోయాక రాధాకృష్ణ ఆ బాలికతో కలిసి ఉండగా, అదే సమయంలో మెలకువ వచ్చిన ఆదిలక్ష్మి వారిని గమనించింది. భర్తతో, బాలికతో ఆమె గొడవకు దిగింది. ఈ క్రమంలో భార్యాభర్తలు కలిసి బాలికను కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని భావించిన రాధాకృష్ణ తన భార్యతో కలిసి ఇంటిలోనే బాలికను హతమర్చారు. గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనుచరుడు పంపన త్రిమూర్తులు సహకారంతో, ఆ బాలిక ఇంటిలో ఉరివేసుకున్నట్టు చిత్రీకరించారు. కేసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూడడంతో, నిందితులు వీఆర్వో వద్ద మంగళవారం లొంగిపోయారు. రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ పి.కాశీవిశ్వనాథ్, ఎస్సైలు ఫజల్ రహ్మాన్, ఎల్.శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ వ్యాను కిందపడి చిన్నారి మృతి
షాద్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని రైతు కాలనీ వద్ద శనివారం స్కూల్ బస్సుకిందపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. కాకతీయ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను ఎక్కించుకునేందుకు రైతు కాలనీలో ఆగింది. అదే సమయంలో స్థానికులురాలు మానస కుమార్తె నందిని(2) ఆడుకుంటూ ఆగి ఉన్న బస్సు కిందికి వెళ్లి పోయింది. బస్సుకింద చిన్నారి ఉన్న విషయం గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో ఆ చిన్నారి బస్సు చక్రాలకింద నలిగిపోయి మృతి చెందింది. చిన్నారి మృతితో కాలనీలో విషాదం నెలకొంది. -
రేబీస్‌తో చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం రేబీస్‌తో ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు.. కర్మన్‌ఘాట్‌లో నివాసముండే మిర్యాల శ్రీనివాసులు, మానస దంపతులు ఏకైక కుమార్తె ఉషశ్రీ(3)ను మూడు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. ఆ సమయంలో స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. రిగ్ ఇంజక్షన్ చేయించలేదు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని ఆదివారం చికిత్సల కోసం నీలోఫర్‌కు తీసుకు వెళ్లారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు చిన్నారికి రేబిస్ లక్షణాలు కనిపిస్తున్నాయని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆదివారం రాత్రి చిన్నారిని ఫీవర్ ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి చికిత్సలు ప్రారంభించారు. కాగా సోమవారం సాయంత్రం చిన్నారి మృతి చెందింది. మరో బాలునికి రేబిస్ నిజామాబాద్ జిల్లా బీల్‌గల్ మండలం తాళ్లపల్లికి చెందిన రవి కుమారుడు గణేష్(9)ని రెండు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు బాలునికి రిగ్ ఇంజక్షన్ చేయించలేదు. కాగా రెండు రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తున్న బాలున్ని స్థానిక ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం రాత్రి బాలున్ని ఫీవర్ ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు రేబిస్‌గా నిర్ధారించి ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు ప్రారంభించారు. అయితే ఆ బాలుని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పిస్తామంటూ సోమవారం ఉదయం బాలున్ని తీసుకు వెళ్లారు. -
కిరాతకం !
అదృశ్యమైన బాలిక హత్య బిల్లలమెట్ట ప్రాంతంలో శవమై కనిపించిన దివ్య కిరాతకంగా గొంతుకోసి హత్యచేసిన వైనం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు ఏ పాపం ఎరుగని ముక్కుపచ్చలారని ఈ పాపాయి చేసిన నేరమేంటో తెలియదు... ఆ చిట్టితల్లి గొంతును అత్యంత కిరాతంగా కోసి హత్య చేశారు...నిర్యానుష్య ప్రాంతంలో నిర్దాక్షణ్యంగా పడేశారు... వేల దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులు నిష్ఫలమయ్యాయి...తమ గారాల పట్టి క్షేమంగా వస్తుందనుకున్న వారి ఆశలు ఆడియాసలయ్యాయి... మంగళవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దివ్య గురువారం శవంగామారింది... దేవరాపల్లి: మేనమామ ఇచ్చిన డబ్బులతో తినుబండారాలు కొనుక్కునేందుకు వెళ్లి అదృశ్యమైన బాలిక మూడో రోజు రైవాడ జలాశయం గేట్లుకు ఆనుకొని ఉన్న బిల్లల మెట్ట ప్రాంతంలో శవమై కనిపించడంతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. తన కుమార్తె దివ్య అదృశ్యమైందని స్థానిక మహేశ్వరి థియేటర్ సమీపంలో నివాపముంటున్న ధనలక్ష్మి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. కుటుం బ సభ్యులు అనుమానం మేరకు బాలికకు మేనమామ వరుసైన గుణశేఖర్పైను విచారించినా ఫలితం లేకపోయింది. పోలీసు జాగిలాలు జీనబాడు రహదారిలో బ్లిల మెట్ట క్వారీ ప్రాంతం, రైవాడ జలాశయం పరిసరాలకు వెళ్లి గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో అప్పటికి గాలింపు నిలిపివేసి, గురువారం ఉదయం ప్రారంభించారు. జాగిలాల సహాయంతో గాలిస్తుం డగా ఆ బాలిక శవమై కనిపించింది. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్యచేసినట్టు ఆనవాళ్లున్నాయి. దేవరాపల్లికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలపై ఉన్న నిర్మాణుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి బాలిక గొంతుకోసి హతమార్చారు. మేనమామే హత్యచేశాడు.. అన్యంపుణ్యం ఎరుగని తమ కుమార్తెను వరుసకు మేనమామ అయిన సుబ్బాచారి గుణశేఖర్ హత్య చేశాడని బాలిక తల్లిదండ్రులు మురుగాన్, ధనలక్ష్మిలు ఆరోపిస్తున్నారు. పోలీ సులు కూడా గుణశేఖర్పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నా రు.అలాగే వివాహేతర సంబంధాలేమైనా కారణమా? అన్నకోణంలో కూడాదర్యాప్తుచేస్తున్నట్టు తెలిసింది. మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ.. దివ్య హత్యకు గురైన ప్రాంతాన్ని, బాలిక మృతదేహాన్ని అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం స్థానిక సీఐ కిరణ్‌కుమార్, ఎస్ఐ జి.ఎన్.అప్పన్నలు పరిశీలించి ఆధారాలు సేకరిం చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణ నిమితం ఏఎస్పీ కె.సత్యనారాయణ ఇక్కడకు వచ్చారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కుమార్తే అత్యంత కిరాతకంగా హత్యకు గురికావడంతో దివ్య తల్లిదండ్రులు మురుగన్,ధన లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. బాలిక హత్యకు గురైందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
కోరిక తీర్చనందుకే బాలిక హత్య
చాంద్రాయణగుట్ట: భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. కోరిక తీర్చనందుకే మృతురాలి ఇంటి సమీపంలో ఉండే యువకుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసిన భవానీనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పురానీహవేళీలోని పాత కమిషనరేట్ కార్యాలయంలో సిటీ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన నజ్మల్ హుస్సేన్, నసీం బేగం కుమార్తె హుదా బేగం(12) ఈ నెల 11వ తేదీన మాంసం తెచ్చేందుకు బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 12వ తేదీ భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీ అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి సంప్‌లోని దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు మృతదేహాన్ని వెలికి తీసి మృతురాలు హుదాబేగంగా గుర్తించి, హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న డీసీపీ వి.సత్యనారాయణ వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా 11వ తేదీ రాత్రి మాంసం తీసుకుని ఇంటికి తిరిగి వెళుతున్న హుదా బేగాన్ని ఓ యువకుడు అనుసరించడాన్ని గుర్తించారు. ఈ వీడియోను బస్తీ వాసులకు చూపగా వారు నిందితుడిని గుర్తించలేకపోయారు. అయితే అదేరోజు సాయంత్రం గౌలిపురా మార్కెట్లో ఉన్న ‘మాత వైన్స్’ వద్ద మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తి వేసుకున్న చొక్కా... బాలికను వెంబడించిన యువకుడి చొక్కా ఒకేలా ఉన్నట్లు గుర్తించి ఆ వీడియోను బస్తీ వాసులకు చూపించగా అతను సయ్యద్ షౌకత్ కుమారుడు దస్తగిర్(22)గా గుర్తించారు. పోలీసులు తన కొరకు గాలిస్తున్నట్లు తెలుసుకున్న దస్తగిర్ కర్ణాటక కు పారిపోయాడు. పోలీసులు అక్కడికి వెళ్లగా అతను నగరానికి తిరిగి రావడంతో శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడితో పాటు మద్యం కొనుగోలు చేసిన యువకుడిపై కూడా పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. కోరిక తీర్చనందుకే.. హుదాబేగం ఇంటి సమీపంలో నివసిస్తున్న దస్తగిర్ ఆమెపై ఎప్పటి నుంచో కన్నేశాడు. ఈ క్రమంలో 11వ తేదీ మాంసం తీసుకొని ఇంటికి వస్తుండగా ఆమెను వెంబడించి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి లాక్కెళ్లాడు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో ఎవరైనా చూస్తారన్న భయంతో చున్నీతో మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సంప్‌లో పడేసినట్లు కమిషనర్ వివరించారు. సమావేశంలో డీసీపీ సత్యనారాయణతో పాటు అదనపు డీసీపీ కె.బాబురావు, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసారావు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: కమిషనర్. ప్రతి 50 మీటర్లకు ఒకటి చొప్ను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి సూచించారు. వ్యాపార సముదాయాలతో పాటు ప్రతి ఇంటి పరిసరాల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవానీనగర్ ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. -
పసికందు మృతి వివాదాస్పదం
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఓ పసికందు మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రుల అవగాహన లోపమే ప్రాణం పోవడానికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. అనంతపురం రూరల్ :నగరంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన మహబూబ్‌బాష, అయిషా తమ మూడు నెలల బాలుడు ఏడుస్తున్నాడని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి గురువారం తెల్లవారు జామున నాలుగు గంటలకు తీసుకెళ్లారు. చిన్నారికి గురువారం రాణినగర్ ఎంసీహెచ్ సెంటర్లో బీపీటీ టీకా వేరుుంచామని, అప్పటి నుంచి ఏడుస్తోందని వైద్యులకు తెలిపారు. బిడ్డను పరిశీలించిన డాక్టర్ హేమలత పారాసిట్మాల్ సిరప్, ఓ ఆరుుల్మెంట్ రాసి ఇవ్వాలని హౌస్ సర్జన్‌ను ఆదేశించారు. వైద్యులు ఇచ్చిన సిరప్ తీసుకుని 4.15 నిమిషాలకు బిడ్డతో సహ వారు బయటకు బయలుదేరారు. మళ్లీ బాలుడు ఏడవడంతో ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. దీంతో వైద్యురాలు హేమలత అడ్మిషన్‌కు సిఫార్సు చేశారు. ఆ సమయంలో పిల్లర్ ద్వారా బాలుడికి పాలు పట్టించారు. దీంతో బాలుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే బాలుడిని వార్డులోకి తీసుకెళ్లారు. డాక్టర్ మల్లేశ్వరి అంబు పరికరం ద్వారా కృత్రిమ శ్వాస అందించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో బిడ్డ నోటి వెంట బాలు బయటకు వచ్చారుు. ఉదయం 6.05 నిమిషాలకు బాలుడు మృతి చెందాడు. డీఐఓ డాక్టర్ డేవిడ్ దామోదర్ బాధితులను పరామర్శించారు. మృతి చెందిన విషయంపై ఆరా తీశారు. ఎవరూ పట్టించుకోలేదు ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. సకాలంలో స్పందించి ఉంటే నా బాబు బతికి ఉండేవాడు. తెల్లారుజామునే తీసుకువచ్చాం. మా కర్మకే ఏం చేద్దాం. గతంలోనూ ఇదే ఆస్పత్రిలో మూడు రోజుల మా పాప మృతి చెందింది. ఎవరితో చెప్పుకోవాలి....యా అల్లా.. -మహబూబ్‌బాష, అయిషా ఏడుస్తున్నప్పుడు పాలు పట్టారు సకాలంలో వైద్యం అందించాం. మా తప్పేమి లేదు. గంటన్నర పాటు ప్రయత్నించాం. బాబు ప్రాణం కాపాడేందుకు అన్ని విధాల కృషి చేశాం. బాబు ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లాయి. అందుకే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. పాలు పట్టించవద్దని ముందుగానే చెప్పాం. - డాక్టర్ హేమలత -
పాక్ కాల్పులు, 17 ఏళ్ల యువతి మృతి
శ్రీనగర్ : పాకిస్తాన్ మళ్లీ తెగబడింది. అంతర్జాతీయ వేదికలపై నీతులు వల్లిస్తున్న పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఫూంచ్ సెక్టార్ సౌజెయిన్ ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 17 ఏళ్ల యువతి జహీరా అక్తర్‌తో పాటు మరో నలుగురు గాయడ్డారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో పాక్ సైన్యం ఇలా కాల్పులు జరపడం ఇది మూడోసారి. పాక్ సైనికులు గురువారం జరిపిన కాల్పుల్లో కూడా ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. -
రాకెట్ దాడిలో బాలిక మృతి
ఈజిప్టులోని సినాయ్ ప్రాంతంలో ఓ ఇంటిపై రాకెట్ దాడి జరగడంతో తొమ్మిదేళ్ల బాలిక మరణించింది. వాస్తవానికి ఆ ఇంటికి సమీపం నుంచి వెళ్తున్న భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు రాకెట్ ప్రయోగించగా, అది కాస్తా ఆ ఇంటిమీద పడటంతో బాలిక మరణించింది, మరో బాలిక తీవ్రంగా గాపడింది. ఇజ్రాయెల్ సరిహద్దులోని ఉత్తర సినాయ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. గత వారం రోజుల్లో భద్రతాదళాల చేతుల్లో దాదాపు 40 మంది ఉగ్రవాదులు మరణించారు. దానికి ప్రతీకారంగా భద్రతాదళాలను హతమార్చాలని ఈ రాకెట్ దాడి చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఉగ్రవాదులను హతమార్చేందుకు సైన్యం భారీస్థాయిలో దాడులు చేసింది. అంతకుముందు ఇద్దరు పోలీసులను, సైనికాధికారులను ఉగ్రవాదులు హతమార్చారు. ఇలా ప్రతీకార దాడులు అక్కడ నిరంతరం కొనసాగుతున్నాయి. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలు మృతి
పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం మండలం సందుపాలెంకోడూరులో ఆ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రేమికురాలు మృతి చెందగా, ప్రియుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... సందుపాలెంకోడూరుకు చెందిన యువకుడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ క్రమంలో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలిపారు. ప్రేమ పెళ్లికి తాము అంగీకరించమని పెద్దలు వెల్లడించారు. దాంతో తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆ ప్రేమ జంట భావించారు. దీంతో గత అర్థరాత్రి గ్రామ శివారులో ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ప్రేమికులును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రేమికురాలు మరణించిందని వైద్యులు వెల్లడించారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.