గొంతు నులిమి గోనె సంచిలో కుక్కి.. | Seven Year Old Girl Body Found On Roof Of Shrine In Ghaziabad | Sakshi
Sakshi News home page

Oct 8 2018 1:44 PM | Updated on Oct 8 2018 1:47 PM

Seven Year Old Girl Body Found On Roof Of Shrine In Ghaziabad - Sakshi

అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని హత్య చేసి గోనె సంచిలో కుక్కి పడేశారు

గజియాబాద్ ‌: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని హత్య చేసి గోనె సంచిలో కుక్కి పడేశారు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజియాబాద్‌కి చెందిన ఏడేళ్ల చిన్నారి గత శనివారం కిడ్నాప్‌కి గురై ఆదివారం శవమై కనిపించింది. ఇంటి సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లిన చిన్నారి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు చట్టుపక్కల వెతికినా చిన్నారి జాడ తెలియలేదు. దీంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి సీసీ పుటేజీని పరిశీలించారు. చిన్నారి చివరిసారిగా ఇంటి సమీపంలో ఉన్న మసీదు దగ్గరలో కనిపించింది. దీంతో పోలీసులు అటువైపుగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఆ ఏరియాకి చెందిన ఓ వ్యక్తి మసీద్‌ మీదుగా వెళ్తుండగా గోనె సంచి మూట కనిపించింది. విప్పి చూడగా చిన్నారి మృత దేహం కన్పించింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేశాడు. దీంతో బాలిక తల్లిదంద్రులు, పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. చిన్నారి గొంతు నులిపి అనంతరం గోనె సంచిలో మూట కట్టి పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

అత్యాచారానికి పాల్లపడ్డారు!
శనివారం అదృశ్యమైన చిన్నారి ఆదివారం ఉదయం శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం గొంతునులిపి చంపేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రాణంతో ఉండగా గోనె సంచిలో మూటకట్టి పడేశారని భావిస్తున్నారు. బాలికపై అత్యాచారం చేశారా లేదా అనె విషయాలు పోస్టుమార్టం అనంతరం తెలియజేస్తామని గజియాబాద్‌ ఎస్పీ తెలిపారు. 

రాజకీయ కక్షతోనే హత్య : బాలిక తండ్రి
రాజకీయ కక్షతోనే స్థానిక కౌన్సిలర్‌ అజాజ్‌ బాగ్‌ తన కూతురిని హత్య చేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. ఇటీవలే జరిగిన లోకల్‌ ఎన్నికల్లో అజాజ్‌కి వ్యతిరేకంగా బాలిక మేన మామ పోటీ చేశాడు. దీంతో కక్ష కట్టిన అజాజ్‌ బాలికను కిడ్నాప్‌ చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తునారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement