
ఘజియాబాద్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేకి చెందిన బంధువును శుక్రవారం ఆగంతకులు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని తన ఇంటి సమీపంలో ఈ ఘటన జరిగింది. రోజువారి మార్నింగ్ వాక్‌లో భాగంగా తన పనుల్లో ఉండగా, గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. దీంతో బాధితుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెనక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు మురద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే అజిత్ పాల్ త్యాగి బంధువు. కాల్పుల ఘటనతో సదరు ఎమ్మెల్యేకి సైతం భద్రత పెంచారు. (కోల్‌కతాలో యుద్ధ వాతావరణం)