సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో గాంధీ జయంతి రోజున ఘోరం చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొని సైకిల్‌పై ఇంటికి వెళ్లున్న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని (15)పై ముగ్గురు దుండగులు అత్యాచారయత్నం చేసి హత్య చేశారు. ఈ ఘటన మెయిన్‌పురి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరుగుపయనమైన బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచార యత్నం చేశారు.
బాలిక తీవ్రంగా వ్యతిరేకించడంతో విచక్షణారహితంగా ఆమెపై భౌతిక దాడికి దిగారు. చిత్రవధ చేసి హింసించారు. తీవ్ర గాయాల కారణంగా బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నేరం నుంచి తప్పించుకోవాలని చూసిన కర్కోటకులు ఆమె మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఈ అమానుష ఘటన గ్రామస్తుల కంటబడడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న హత్య, అత్యాచార ఉదంతాలు.. యోగి ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలపాలు చేస్తున్నాయి.కారు ఆపలేదన్న కారణంతో లక్నోలో గతవారం పోలీసులు ఆపిల్ ఉద్యోగిని కాల్చి చంపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment