Gandhi Jayanti celebrations
-
తిరుపతిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
-
గాంధీ కలల్ని నిజం చేశాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎక్స్ అకౌంట్లో ఆయన నివాళి సందేశం ఉంచారు. ‘‘మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా... రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం.మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారాయన. మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా…రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సంద… pic.twitter.com/9fEwN6KFf4 — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023 -
గాంధీ జయంతి సందర్భంగా ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చిన విజయ్
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి నగరం, ఊరు వాడల్లోని గాంధీ మహాత్ముని శిలా విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ వందనం సమర్పించాలని నటుడు విజయ్ తన సంఘం కార్య నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని విజయ్ ప్రజా సంఘం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో మన ప్రజాసంఘం అధ్యక్షుడు విజయ్ ఆదేశాల మేరకు తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంఘం నిర్వాహకులు కార్యకర్తలు వారివారి ఊళ్లలోని గాంధీ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ వందనం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా తమ జిల్లాల్లోని స్వతంత్య్రం కోసం పాటుపడ్డ జాగుల జిల్లాకు వెళ్లి వారిని సత్కరించాలని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రతిక ఎలిమినేట్.. 'బిగ్‌బాస్'లో రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే!) ఈ కార్యక్రమంలో జిల్లాల అధ్యక్షులు, యువభాగం అధ్యక్షులు, నిర్వాహకులు, అందరూ పాల్గొని సమైక్యంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయా కార్యక్రమాలకు సంబంధించిన పెండేసి ఫొటోలను తమ సంఘం కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొన్నారు. -
డిఫెన్స్‌లో ప్రైవేట్‌కు అనుమతిస్తే దేశ భద్రతకే ముప్పు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'దేశ యువత గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఫాసిస్టులకు వ్యతిరేకంగా గాంధీ చూపిన దారిలో యువత పోరాటం చేయాలి. మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారు. దేశ భవిష్యత్‌ను వారి చేతుల్లో పెడుతున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి. డిఫెన్స్‌లో ప్రైవేట్‌కు అనుమతిస్తే దేశ భద్రతకే ముప్పు. తెలంగాణలో అమరుల కుటుంబాలు అనాధలైనవి. యువత రోడ్లమీద పడ్డది. గులాబీ చీడ నుంచి విముక్తి కల్పించడానికి కాంగ్రెస్ కార్యక్రమం తీసుకుంది. విద్యార్థి, నిరుద్యోగుల ఆశయాల కోసం జంగ్ సైరన్ మోగిస్తుంది. ర్యాలీ కోసం వస్తున్న కాంగ్రెస్ నేతలను, విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్‌కు కాలం చెల్లింది. శాంతియుతంగా జరగాల్సిన ర్యాలీని రసాభాసగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి లేదంటే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత' అంటూ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ.. 'త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. శాంతి యుతంగా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల కోసం జంగ్ సైరన్ ప్రారంభించాం. శాంతి యుతంగా చేయబోతున్న కాంగ్రెస్ నాయకుల పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. పోలీస్‌లు టీఆర్‌ఎస్‌గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారు. అరెస్టులు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేసి పాదయాత్ర శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి' అని అన్నారు. చదవండి: (గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు) -
‘గాంధీ ఆశయాలను నిజం చేసిన సీఎం జగన్’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ(అక్టోబర్ 2) మహత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగాం సురేష్, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గాంధీ ఆశయ సాధన కోసం అందరం పునరంకితం కావాలన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. గాంధీజీని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. గ్రామ స్వరాజ్యం ఆచరణలో చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్) ఇక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశ్వం ఉన్నంత వరకు తలుచుకోవాల్సిన మహ మనిషి గాంధీజీ అని చెప్పారు. ఆయనను స్మరించుకోవడమే కాకుండా గాంధీ ఆశయాలను నిజం చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజల ముంగిటకే తీసుకేళ్లిందని, సచివాలయ వ్యవస్థ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా అయిందని తెలిపారు. ప్రతి ఇంటికి వాలంటిర్లు వెళ్లి పెన్షన్‌లుఇవ్వడమే ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వం వదిలిపోయిన భయంకరమైన ఆర్థిక పరిస్థితిలో కూడా సీఎం వైఎస్ జగన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. గాంధీజీ కలలు కన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టుల ద్వారా ప్రతిపక్షం అడ్డుపడుతోందని వచ్చే మూడేళ్లలో సమస్యలు లేని గ్రామాలు ఉండేలా చేస్తామన్నారు. పట్టణాలకు ధీటుగా గ్రమాలను తయారు చేస్తామని సజ్జల వ్యాఖ్యానించారు. -
నోబెల్‌ను మించి ఎదిగిన వ్యక్తి మహాత్మా గాంధీ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'మహాత్మా గాంధీ గొప్పనేత. ప్రపంచ దేశాలకు గాంధీజీ ఆశయాలు ఆదర్శం. నోబెల్ బహుమతి కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. (కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం) మహాత్ముని ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. పేదల కోసం నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెట్టింది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన వైఎస్ జగన్ ఎక్కడ కూడా హింసాత్మకంగా వ్యవహరించలేదు. గాంధీజీ పుట్టిన రోజునే లాల్ బహుదూర్ శాస్త్రి కూడా జన్మించారు. ఆయన పాలించింది కొద్ది రోజులే అయినా మంచి పాలన చేశారు' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తూచా తప్పక అమలు చేస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ మహాత్ముని అడుగుజాడల్లోనే నడుస్తుందని స్పష్టం చేశారు. (బాపు కల నెరవేరిందిలా..) కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్లో కేటాయించిన ప్రతి పైసా సీఎం జగన్ పేదవాడి కోసం ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 16 నెలల్లో 59 వేల కోట్లు సీఎంఖర్చు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి సైలెంట్ మెన్. ప్రతిపక్ష పార్టీ ఎన్ని విమర్శలు చేసిన ఆయన పని ఆయన చేసుకుపోతాన్నారు. ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మహాత్మాగాంధీ ఆశయాలను సీఎం కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేస్తున్న అనేక పనులకు టీడీపీ రకరకాలుగా అడ్డుపడుతోంది' అని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు. -
‘గాంధేయవాద విస్తరణకు ప్రవాసుల కృషి అమోఘం’
టెక్సాక్ : శాంతి, ప్రేమ, అహింస వంటి ఆశయాల సమాహారమైన గాంధేయవాదానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం కల్పించడంలో విశేష కృషి చేస్తున్న ప్రవాస భారతీయుల చొరవ, కృషి అభినందనీయమని భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా కొనియాడారు. డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్‌లో గల మహాత్మా గాంధీ స్మారకస్థలి వద్ద గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రాయబారి ష్రింగ్లా మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించి ప్రసంగించారు. తాను దక్షిణాఫ్రికా దేశంలోని డర్బన్ నగరంలో భారత కాన్సుల్ జనరల్‌గా సేవలందించినప్పుడు గాంధీజి గత చరిత్రను అతి సమీపంగా సున్నితంగా స్పృశించానని, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారిని అహింసాయుత పోరాటాల వైపు ప్రేరేపించడం గాంధీయిజానికి పాశ్చాత్య దేశాలు పట్టిన గొడుగు అని ఆయన పేర్కొన్నారు. 150వ జయంతి ఉత్సవాలను అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో సైతం నిర్వహించామని అన్నారు. భారత్-అమెరికా మధ్య జీవ వారధులుగా ప్రవాస భారతీయులు వర్థిల్లుతున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యలు నిజం చేసేలా గాంధేయవాదానికి కూడా ప్రవాసులు బ్రహ్మరథం పడుతున్నారని వారందరికీ తన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ గాంధీ స్మారకస్థలిని సందర్శించిన ప్రప్రథమ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా కావడం ఆనందంగా ఉందని, మహాత్మా గాంధీ స్మారకస్థలి ఏర్పాటులో జరిగిన కృషి, స్మారకస్థలి విశేషాలు, స్థానిక పాఠశాల విద్యార్థులకు అది ఎలా ఉపయుక్తమవుతుందనే విషయాలను రాయబారికి వివరించారు. గాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల సభను ప్రారంభించగా, అక్రం సయాద్ తుది పల్కులు పల్కారు. అనంతరం మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా ను ఘనంగా శాలువతో సత్కరించి, స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గాంధీజి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రత్యేక అతిధిగా పాల్గొని బాపూజీ కి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హ్యూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ డా. అనుపమ్ రే, కాన్సులేట్ అధికారులు సురేంద్ర అదానా, అశోక్, గాంధీ మెమోరియల్ డైరెక్టర్స్ రావు కల్వల, జాన్ హామేండ్, కమల్ కౌశల్, అక్రం సయాద్, షబ్నం మాడ్గిల్, జాక్ గద్వాని, స్వాతి షా, శాంటే చారి, శ్రీకాంత్ పోలవరపు, మురళీ వెన్నం తదితరులు పాల్గొన్నారు. -
భారత తపాలా శాఖ వినూత్న ప్రయత్నం
సాక్షి, జ్యోతినగర్ (కరీంనగర్) : ప్రస్తుతం అంతా ఆధునిక పోకడ.. సమాచారం పంపించాలన్నా.. తీసుకోవాలన్నా.. ప్రతీ ఒక్కరు ‘ఆన్లైన్’ సేవలపై ఆధారపడి ఉన్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు, మారుమూలలో ఉన్న పల్లె ప్రజల చేతిలో నేడు స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాలు రాయడం అనే మాట కనిపించదు.. వినిపించదు.. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానికి, చిన్నారులకు టెలీగ్రాం, పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ కవర్లు, రిజిష్టర్ పోస్టు, స్పీడ్ పోస్ట్, పోస్టల్ స్టాంపుల వినియోగం గురించి అంతగా తెలియదు. ఈ క్రమంలో చిన్నారుల్లో ఉత్తరాలు రాసే అభిరుచితో పాటు జాతీయభావం పెంపొందించేందుకు భారత తపాలా శాఖ ఒక చిన్న ప్రయత్నం ప్రారంభించింది. మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాలను పురస్కరించుకొని జాతీయస్థాయిలో ఉత్తరాల పోటీ నిర్వహించాలని నిర్ణయించింది. చిన్నారుల్లో జాతీయభావం, సృజనాత్మకతను వెలికితీసేందుకు తోడ్పడే జాతీయ ఉత్తరాల పోటీలో పాల్గొనేవారు పలు భారతీయ భాషల్లో ఉత్తరాలను రాయొచ్చు. ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు, ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో భావాలను వ్యక్తీకరించేందుకు వీలు కల్పించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ‘దాయ్ ఆఖర్’ అని పేరు పెట్టారు. నవంబర్ నెలాఖరు వరకు ఉత్తరాలు రాసేందుకు అవకాశం ఉంది. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’ అనే శీర్షికతో గాంధీ మహాత్ముడిని ఉద్దేశించి ఉత్తరాలు రాయాలి. ప్రధానంగా విద్యార్థి లోకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పోటీల నిర్వహణకు కార్యాచరణ రూపకల్పన చేశారు. ఇందులో అన్ని వయసుల వారు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయసు వారు ఒక కేటగిరీగా, 18 ఏళ్లు దాటినవారు మరో కేటగిరీగా విభజించారు. విజేతలకు నగదు పురస్కారాలు.. ► జాతీయస్థాయి ఉత్తరాల పోటీలో విజేతగా నిలిచేవారికి రూ.59 వేల నగదు. ద్వితీయ స్థానానికి రూ.25 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు అందజేయడం జరుగుతుంది. రాష్ట్రస్థాయిలో విజేతకు రూ.25 వేలు, ద్వితీయ స్థానానికి రూ.10వేలు, తృతీయ స్థానానికి రూ.5వేలు ఇస్తారు. ► ఈ విధంగా రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారి ఉత్తరాలు జాతీయస్థాయి పోటీలకు నామినెట్ అవుతాయి. ఉత్తరాలు చేరడానికి ఈనెల చివరి వరకు గడువు ఉంది. రాష్ట్రస్థాయి ఫలితాలను 31 జనవరి, 2020న వెల్లడిస్తారు. జాతీయస్థాయి ఫలితాలను 2020 మార్చి31న విడుదల చేస్తారు. వ్యాసరచన పోటీ కాదు.. ► వ్యాసరచన పోటీ ఎంతమాత్రం కాదు. ఎందుకంటే మహాత్మాగాంధీని ఉద్దేశించి రాసిన ఉత్తరం మాదిరిగా ఉండాలి. రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచే వ్యక్తికి(రూ.25వేలు), జాతీయ స్థాయిలో విజేతకు రూ.50వేలు, రెండు పోటీల్లో విజేతగా నిలిస్తే గరిష్టంగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. తపాలా శాఖ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు సైతం ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. బాపూ ఎందుకు అమరులయ్యారనే విషయంపై అవగాహన, ఆలోచన, భావ వ్యక్తీకరణ తదితర అంశాలపై గెలుపు ఆధారపడి ఉంటుందని గమనించాలి. చేతిరాతతోనే రాయాలి.. మీరు రాసే ఉత్తరంలో వయసుకు సంబంధించిన వివరాలను తప్పక రాయాలి. గెలుపొందాక మీ వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడం జరుగుతోంది. పాల్గొనదలిచిన వారు ‘దాయ్ ఆఖర్ జాతీయ ఉత్తరాల రాత పోటీ’ శీర్షికన ఇన్లాండ్ లెటర్లో అయితే 500 పదాలు మించకుండా, ఎన్వలప్ కవర్లో అయితే ఏ–4 సైజు పేపర్‌పై 1000 పదాలకు మించకుండా రాయాలి. టైపు చేసి పంపితే తిరస్కరించబడతాయి. సొంత చేతిరాతతో రాసి పంపినవాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పూర్తి వివరాలకు సమీపంలోని పోస్ట్ ఆఫీసులలో సంప్రదించవచ్చు. ‘నేను పాల్గొంటున్నా’.. మీరు కూడా.. భారత తపాలా శాఖ తలపెట్టిన ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’ అనే ఉత్తరాల పోటీలో నేనూ పాల్గొంటున్నా.. మీరందరు కూడా పాల్గొనాలి.. అని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్‌షిప్‌కు చెందిన చిన్నారి అరిగెల అనుశ్వి కోరుతోంది. మహాత్మాగాందీ 150వ జయంతోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వ తపాల శాఖ నిర్వహిస్తున్న ఉత్తరాల పోటీల్లో పాల్గొనాలని ఉపాధ్యాయురాలితో కలిసి విజయసంకేతం చూపిస్తోంది. ఉత్తరాలు పంపించాల్సిన అడ్రస్.. చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ తెలంగాణ సర్కిల్ ఆబిడ్స్, హైదరాబాద్. -
బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: మహాత్ముని 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ శనివారం తన అధికార నివాసంలో ప్రముఖ బాలీవుడ్ నటులు, నిర్మాతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దిన వేడుకలపైనా చర్చించారు. ‘గాంధీ ఎట్ 150’ ఇతివృత్తంగా తీసిన వీడియోలను ప్రధాని విడుదల చేశారు. 1857 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్య్ర పోరాటం, 1947–2022 కాలంలో దేశాభివృద్ధికి సంబంధించి స్ఫూర్తిదాయక కథనాలపై సినీ, టీవీ పరిశ్రమ దృష్టి సారించాలని వారిని కోరారు. కళారంగంలో చూపిసున్న సృజనాత్మకతను దేశంలో పర్యాటకరంగ అభివృద్ధికి ఉపయోగించాలని వారిని కోరారు. ‘మీరెంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. కళాకారులుగా మీ ప్రతిభ ప్రపంచమంతటికీ సుపరిచితం. మీ సృజనాత్మకతను మరింత విస్తరింపజేయడానికి ప్రభుత్వ పరంగా చేతనైనంత సాయం అందిస్తా’అని ప్రధాని మోదీ వారికి తెలిపారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల మామల్లపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను జరిపిన సమావేశం అనంతరం ఆ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగిందని తమిళనాడు సీఎంతెలిపారని ప్రధాని వారికి వివరించారు. ‘కళాకారులుగా దేశానికి మేం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రధాని మోదీ కూడా ఎన్నో పనులు చేస్తున్నారు’అని అనంతరం ఆమిర్ ఖాన్ అన్నారు. గాంధీజీని మరోమారు దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని షారుఖ్ ఖాన్ అన్నారు. ‘సినీ రంగానికి ప్రతినిధులుగా భావిస్తున్న మమ్మల్ని గాంధీజీ ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు భాగస్వాములుగా చేయడం ద్వారా మా బాధ్యత పెంచారు’అని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ అన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన వారిలో బోనీ కపూర్ తదితరులు ఉన్నారు. -
జాతిపితకు మహా నివాళి
లంగర్‌హౌస్: మహాత్మా గాంధీ 150వ జయంతి సంద్భంగా బుధవారం లంగర్‌హౌస్ త్రివేణి సంగమంలోని బాపూ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు నివాళులు అర్పించారు. అనంతరం బాపూధ్యాన మందిరానికి వెళ్లి అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే బాపూఘాట్‌లోని గాం«దీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చేమకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, బాల్క సుమన్, వివేక్, అరికెపుడి గాం«దీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్, మల్లే‹Ù, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి ఉన్నారు. -
ఖమ్మంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఖమ్మం గాంధీ చౌక్‌లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీ నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఖమ్మంలోని తెరాస నేత వద్దిరాజు రవిచంద్ర నివాసంలో తేనీటి విందులో మంత్రులు పాల్గొన్నారు. -
ప్రజాతీర్పు దుర్వినియోగం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజలిచ్చిన తీర్పును చాలా ప్రమాదకరమైన రీతిలో ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి సోనియా అధ్యక్షత వహించారు. బీజేపీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు దూకుడుగా ముందుకు వెళ్తున్నామన్న అక్కసుతోనే కాంగ్రెస్‌ను అణగదొక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని సోనియా ఆరోపించారు. ‘దేశ ఆర్థికస్థితి ఆందోళనకరంగా ఉంది. నష్టం తీవ్ర స్థాయిలో ఉంది’అని అన్నారు. ఆర్థిక వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వం వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్ వంటి మహనీయుల ప్రబోధాలను వక్రీకరించి తమ అజెండాకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి మందగించింది. పరిస్థితి మరింత అధ్వానంగా మారనుంది. వాస్తవమేంటో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మున్ముందు నిరుద్యోగం తీవ్రత మరింత పెరగనుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. -
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్తుండగా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో గాంధీ జయంతి రోజున ఘోరం చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొని సైకిల్‌పై ఇంటికి వెళ్లున్న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని (15)పై ముగ్గురు దుండగులు అత్యాచారయత్నం చేసి హత్య చేశారు. ఈ ఘటన మెయిన్‌పురి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరుగుపయనమైన బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచార యత్నం చేశారు. బాలిక తీవ్రంగా వ్యతిరేకించడంతో విచక్షణారహితంగా ఆమెపై భౌతిక దాడికి దిగారు. చిత్రవధ చేసి హింసించారు. తీవ్ర గాయాల కారణంగా బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నేరం నుంచి తప్పించుకోవాలని చూసిన కర్కోటకులు ఆమె మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఈ అమానుష ఘటన గ్రామస్తుల కంటబడడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న హత్య, అత్యాచార ఉదంతాలు.. యోగి ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలపాలు చేస్తున్నాయి.కారు ఆపలేదన్న కారణంతో లక్నోలో గతవారం పోలీసులు ఆపిల్ ఉద్యోగిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
ఓ మహత్మా ఓ మహర్షి
-
రైలు ప్రమాదాలు తగ్గాయ్..
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాద మృతుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గినట్లు రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 75 ప్రమాదాలు జరిగాయి. 40 మంది మృతి చెందారు. గత ఐదేళ్లలో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. భద్రతా పరంగా రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ప్రమాదాలతో పాటు మృతుల సంఖ్య కూడా తగ్గించగలిగామని రైల్వే శాఖ పేర్కొంటోంది. 2016 సెప్టెంబర్ నుంచి 2017 ఆగస్టు మధ్య 80 ప్రమాదాలు జరగ్గా 249 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 2016 నవంబర్‌లో కాన్పూర్ దగ్గర ఇండోర్–పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘోర ప్రమాదంలో 150 మంది చనిపోయారు. 2017 ఆగస్టులో ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 20 మంది చనిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్వ్యాన్ను రైలు ఢీకొట్టడంతో 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ కాలంలో ఈ రెండే పెద్ద ప్రమాదాలని రైల్వే శాఖ తెలిపింది. గాయాలయిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు మధ్య రైలు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 272 నుంచి 12కు క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. మెరుగ్గా రైల్వే ట్రాక్ నిర్వహణ , పాత బోగీల స్థానంలో అధునాతన కోచ్‌ల ఏర్పాటు, బోగీల నిర్వాహణపై గత నాలుగేళ్లుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గించగలిగామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పట్టాలను ఎప్పటికప్పుడు మార్చడం, భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, మెరుగైన భద్రతా చర్యల కోసం ఉద్యోగులకు నిరంతర శిక్షణ, పర్యవేక్షణ కూడా ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య తగ్గడానికి కూడా కారణాలుగా చెబుతున్నారు. కాపలాలేని క్రాసింగ్ వద్ద కూడా వాహనచోదకులు నిర్లక్ష్యంగా పట్టాలు దాటడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల సంఖ్య కూడా ఇటీవల తగ్గిందని కూడా రైల్వే శాఖ అధికారులు చెప్పారు. 2016–17లో 13 ప్రమాదాలు జరగ్గా గత సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు ఎనిమిది మాత్రమే ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ తరహా ప్రమాదాలను కూడా తగ్గించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. గాంధీ జయంతి రోజు రైళ్లలో శాకాహారమే జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రైళ్లలో ఐఆర్సీటీసీ శాకాహార భోజనమే సరఫరా చేయనుంది. ఆ రోజు ప్రత్యేక శాకాహార వంటకాలను ప్రయాణికులకు అందజేయనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ప్రయాణికులు ఆ రోజు మాంసాహారాన్ని ఆర్డర్ చేసే అవకాశం లేదని పేర్కొంది. ఇది ఆ ఒక్క రోజుకు మాత్రమే పరిమితమని ఐఆర్సీటీసీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైల్వే బోర్డు గతవారం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అన్ని జోన్ల రైల్వే శాఖలు ఆ రోజు శాకాహార మెనును అమలు చేయనున్నాయి. ఈ స్పెషల్ మెనూలో స్టఫడ్ పరాటాలు, కుల్చా, పన్నీరు వంటకాలను భోజనంలో అందించనున్నారు. -
డల్లాస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..
డల్లాస్: జాతిపిత మహాత్మా గాంధీ 148వ జయంతి వేడుకలను మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్( ఎమ్జీఎమ్ఎన్టీ) ఆధ్వర్యంలో ఆదివారం డల్లాస్ నగరంలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ‘గాంధీ పీస్ వాక్’లో వందలాది మంది ప్రజలు పాల్లొన్నారు. శాంతికి నిదర్శనంగా పిల్లలు, పెద్దలందరూ తెల్లని దుస్తులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇర్వింగ్ నగర మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్, హుస్టన్ నగరం నుంచి కాన్సుల్ ఆఫ్ ఇండియా ఆర్.డి జోషిలు హాజరయ్యారు. ఇర్వింగ్ నగర్ మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అతిధిగా వచ్చి, గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు గర్వంగా ఉందన్నారు. చాలా ఏళ్లుగా సిటీ గవర్నమెంట్ తో కలిసి పని చేస్తూ, ఇలాంటి కమ్యూనిటీ సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డు సభ్యులను ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలన్నింటికి తమ పూర్తి మద్దతు, సహాయం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్జీఎమ్ఎన్టీ చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, డైరెక్టర్ శ్రీమతి, సెక్రటరీ రావుకల్వల, ఐ.ఏ ఎన్.టి అధ్యక్షుడు సల్మాన్ ఫర్షోరి, ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డు సభ్యులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
ఘనంగా గాంధీ జయంతి
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్‌లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీష, కలెక్టర్ ఎం.జగన్మోహన్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ షాహిద్ మసూద్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. చీపుళ్లతో రోడ్డు శుభ్రపర్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ సాజిదొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్, ఆదిలాబాద్ ఎంపీపీ నైతం లక్ష్మీ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి రామన్న సారథ్యంలో వేడుకలు నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి నిర్వహించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి మహాత్ముని సందేశాన్ని అందించారు. నాయకుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, నాయకులు సునందరెడ్డి, గణేష్‌రెడ్డి, తుమ్మ ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అలల అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రిమ్స్ ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు గాదె వినోద్‌కుమార్, నాయకులు జనగం సంతోష్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు. -
విభిన్నంగా గాంధీ జయంతి అందరి చేతిలో చీపురు
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ జయంతి వేడుకలు ఈ ఏడాది విభిన్నంగా జరిగాయి. ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు, రాజకీయ నేతలు, అధికారులు... అంతా చీపుళ్లు పట్టారు. గాంధీజీ కలలు కన్నవిధంగా భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ్ భారత్ అభియాన్ని గురువారం ప్రారంభించడంతో వీవీఐపీల నుంచి మొదలుకుని సామాన్యుల వరకు అందరూ లాంఛనంగా చీపుళ్లు పట్టి ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందించారు. వీధులు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అనేక ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. ఇదో వరం లాంటిది: హర్షవర్ధన్ స్వచ్ఛ్ భారత్ అభియాన్ దాచిఉంచిన ఓ వరం లాంటిదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర ్ధన్ పేర్కొన్నారు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’లో భాగంగా లేడీ హార్డింగే ఆస్పత్రి ఆవరణలో గురువారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రత్యేకించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇదో మంచిరోజు. ఇంకా చెప్పాలంటే దాచిఉంచిన వరం లాంటిది. కార్యాలయాలు, ఆవాసాల పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టడం వల్ల వ్యాధులను నియంత్రించేందుకు వీలవుతుంది. ఇందువల్ల మన సొమ్మేమీ ఖర్చు కాదు. పారిశుధ్యం, ఆరోగ్య పరిరక్షణ ఏకకాలంలో జరిగిపోతుంటాయి’ అని అన్నారు. పోలియో నిర్మూలన కార్యక్రమం తొలుత జాతీయ రాజధాని నగరంలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా అమలైందని అన్నారు. కాగా అంతకుముందు ఆయన తన మంత్రిత్వ శాఖ సిబ్బందితో స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో... జనక్‌పురిలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్టీ రామారావు మెమోరియల్ సీనియర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పాలుపంచుకున్నారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ లత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞచేసి తరగతి గదులతోపాటు పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రసాద్‌నగర్‌లో: ప్రసాద్‌నగర్‌లోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ డా. బి.వి. నాథ్ అండ్ టి. ఆర్ రావు మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూలులో గురువారం స్వచ్ఛ్ విద్యాలయ్, స్వచ్ఛ్ ఢిల్లీ కార్యక్రమం జరిగింది. మేనేజర్ ఐ.ఎస్. రావు, ప్రిన్సిపల్ ధనలక్ష్మి, వైస్‌ప్రిన్సిపల్ ఉమాపతినాయుడు ,ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కాగా ఈ కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిర్విహ స్తామని ఇకో క్లబ్ అధ్యక్షురాలు బి.వి. ప్రసన్నలక్ష్మి తెలిపారు. మురుగుకాల్వను శుభ్రం చేసిన కేజ్రీవాల్ స్వచ్ ్ఛ భారత్ అభియాన్‌కు మద్దతు ఇస్తానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రధానమంత్రి నివాసం వద్ద నున్న ఓ కాలనీలో మురికికాలువను శుభ్రం చేశారు. దిగువ ఆదాయ వర్గాలు ఎక్కువగా నివసించే బీఆర్ క్యాంపులో ఆయన నాలాను శుభ్రం చేశారు. ఎన్డీఎంసీ పారిశుధ్య పనివారితో కలిసి నాలాను శుభ్రం చేసిన కేజ్రీవాల్ ఆ తరువాత వారితో కలిసి తేనీరు తాగారు. బీఆర్ క్యాంపు కేజ్రీవాల్ నియోజకవర్గమైన న్యూఢిల్లీ పరిధి కిందికి వస్తుంది. మిగతా ఆప్ శాసనసభ్యులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక బీజేపీ నేతలు కూడా తమ కార్యకర్తలతో కలసి పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిలర్లు, ఇంకా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తన డిపోలు, పరిసరాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) అధికారులు బస్టాపులతోపాటు షెల్టర్లలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ు. జామియా మిలియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తలత్ అహ్మద్ ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేయిం చారు. ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దినేష్‌సింగ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని గాంధీభవన్‌లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు. కాగా, స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో ఢిల్లీ పోలీసు శాఖ, ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ), ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ తదితర ప్రభుత్వ సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ విషయమై ప్రభుత్వ కార్యదర్శి మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులు, అన్ని విభాగాల అధిపతులను ఆదేశించినట్టు తెలిపారు. తరచూ తాము తనిఖీలు చేపడతామన్నారు.