
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'మహాత్మా గాంధీ గొప్పనేత. ప్రపంచ దేశాలకు గాంధీజీ ఆశయాలు ఆదర్శం. నోబెల్ బహుమతి కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. (కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం)
మహాత్ముని ఆశయాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. పేదల కోసం నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెట్టింది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన వైఎస్ జగన్ ఎక్కడ కూడా హింసాత్మకంగా వ్యవహరించలేదు. గాంధీజీ పుట్టిన రోజునే లాల్ బహుదూర్ శాస్త్రి కూడా జన్మించారు. ఆయన పాలించింది కొద్ది రోజులే అయినా మంచి పాలన చేశారు' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూచా తప్పక అమలు చేస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. జగన్ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ మహాత్ముని అడుగుజాడల్లోనే నడుస్తుందని స్పష్టం చేశారు. (బాపు కల నెరవేరిందిలా..)
కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి పైసా సీఎం జగన్ పేదవాడి కోసం ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 16 నెలల్లో 59 వేల కోట్లు సీఎంఖర్చు చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సైలెంట్ మెన్. ప్రతిపక్ష పార్టీ ఎన్ని విమర్శలు చేసిన ఆయన పని ఆయన చేసుకుపోతాన్నారు. ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మహాత్మాగాంధీ ఆశయాలను సీఎం కొనసాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ చేస్తున్న అనేక పనులకు టీడీపీ రకరకాలుగా అడ్డుపడుతోంది' అని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment