vasupalli ganesh
-
లడ్డూ తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: వాసుపల్లి గణేష్
-
దేవుడితో పెట్టుకుంటే బతకలేరు: వాసుపల్లి
సాక్షి, విశాఖపట్నం: లడ్డూ తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నిలదీశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ మీద ఓ నింద వేసేస్తే సరిపోతుందనుకున్నారు. జగన్, చంద్రబాబు హయాంలో ఆలయాల పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. తిరుమలకు వేలాది మందిగా తరలివస్తాం. దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరు.’’ అని వాసుపల్లి గణేష్ చెప్పారు.‘‘విజయవాడ వరదలు మీద సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు నిర్లక్ష్యం వలనే వరద సంభవించింది. 50 మరణాలు అంటే సామాన్య విషయం కాదు. వంద రోజుల పాలనలో కూటమి నేతలు ఒకరిని మరొకరు కీర్తించుకుంటున్నారు. వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. వరద బాధితులకు వైఎస్ జగన్ అయితే 25 వేలకు బదులు లక్ష రూపాయలు ఇచ్చేవారు.’’ అని వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం -
మా డిమాండ్ ఇదే..
-
అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది
-
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు సూర్య, రాశి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. వారిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా దీవించారు. ఎమ్మెల్యే వాసుపల్లి కుమారుడి రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో రాలేకపోయారు. కాగా, నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ అక్కడ నుంచి నేరుగా వాసుపల్లి ఇంటికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జన్మ ధన్యమైంది: ఎమ్మెల్యే వాసుపల్లి సీఎం జగన్ ఇంటికి రావడంతో మా జన్మ ధన్యమైందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రిసెప్షన్‌కు సీఎం రాలేకపోయారు. సీఎం రాలేకపోతున్న విషయాన్ని నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. మత్స్యకారుడైన నా ఇంటికి సీఎం జగన్ రావడం చాలా సంతోషం. నిండు మనసుతో నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ రోజును మేము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. చదవండి: (అదానీ, అంబానీల చూపు.. ఏపీ వైపు: సీఎం జగన్) -
ఘనంగా ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్
సాక్షి, సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు సూర్య, రాశిల వివాహ రిసెప్షన్ బీచ్ రోడ్డులోని ఎంజీఎం పార్కులో మంగళవారం ఘనంగా జరిగింది. నూతన వధూవరులకు ఉమ్మడి విశాఖ వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తిరుపతి ప్రసాదం అందించారు. తిరుమల నుంచి వచ్చిన అర్చక బృందం వేద మంత్రాలతో దంపతులను ఆశీర్వదించారు. వధూవరులను ఆశీర్వదిస్తున్న టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి రజిని, మంత్రి బూడి తదితరులు ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, రాజన్న దొర, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కొలగట్ల వీరభద్రస్వామి, గంటా శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, బి.అప్పలనాయుడు, అప్పలనర్సయ్య, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, పి.వి.ఎన్.మాధవ్, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి, రైల్వే డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి, కలెక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ జి.లక్ష్మీశ, పోర్ట్ చైర్మన్ రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వైఎస్సార్సీపీ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనందరావు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ మేయర్లు కటుమూరి సతీష్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు జాన్‌వెస్లీ, కోలా గురువులు, సీతంరాజు సుధాకర్, వడ్డాది మధుసూదనరావు, జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, వివిధ విభాగాల అధికారులు కొత్తజంటను దీవించారు. -
‘ఓటమిని ఊహించే టీడీపీ-జనసేన కవ్వింపు చర్యలు’
సాక్షి, విశాఖపట్నం: పోలింగ్ ముగిసిన దశలో 31వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఉమెన్స్ కాలేజీ వద్ద టీడీపీ-జనసేన వర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఓటమిని ఊహించే టీడీపీ-జనసేన కవ్వింపు చర్యలకు దిగాయని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తే.. టీడీపీ-జనసేన రెచ్చగొట్టే చర్యలు చేపట్టిందన్నారు. ఓడిపోతామనే టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమ్మా.. నేనున్నాను..
సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖపట్నం): ప్రేమోన్మాది దాడిలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న వలంటీర్ ప్రియాంకకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ భరోసా ఇచ్చారు.అమ్మా...నీ శ్రేయస్సుకు ప్రభుత్వంతో పాటు నేను అండగా ఉన్నాం అని ఓదార్చారు. పాతనగరం 25వ వార్డు పరిధి కన్వేయర్ బెల్టు కింద నివాసం ఉంటున్న ప్రియాంక ఇంటికి గురువారం ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రియాంక గొంతు నయమయ్యేలా హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీఇచ్చారు. ప్రియాంక ఎదుటే ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్‌తో మాట్లాడి త్వరితగతిన మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు రూ.20వేల నగదు వాసుపల్లి అందజేశారు. తమ కుమార్తెకు మెరుగైన వైద్యం అందుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటూ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవే కారణమని ప్రియాంక తల్లి రవణమ్మ చెప్పారు. కార్యక్రమంలో 39వ వార్డు అధ్యక్షుడు సూరాడ తాతారావు, కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం, ముస్లిం మైనార్టీ నాయకుడు మహ్మద్ సాధిక్, బాబ్జి, 38వ వార్డు అధ్యక్షుడు సన్యాసిరావు, మాధురి పాల్గొన్నారు. -
‘సీఎం జగన్‌కు మత్స్యకారులు రుణపడి ఉంటారు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోడని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం జిల్లాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అప్పట్లో చంద్రబాబు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదు కిలోమీటర్లుకు ఒక జెట్టి నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. చదవండి: ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన మత్స్యకార దినోత్సవం రోజు చంద్రబాబు కేవలం కేకు మాత్రమే కట్ చేసి.. మత్స్యకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే చంద్రబాబు కన్నెర్ర చేసేవారని ప్రస్తావించారు. నేడు నాలుగు షిప్పింగ్ హార్బర్స్‌కు శంకుస్థాపన చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు. వైఎస్ జగన్ పాలన మత్స్యకారులకు స్వర్ణయుగం వంటిదని కొనియాడారు. మత్స్యకారులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని, మత్స్యకారులు ఇచ్చిన హామీలను సీఎం 17 నెలల్లోనే అమలు చేశారని ప్రశంసించారు. పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులను సీఎం జగన్ దేశానికి తిరిగి తీసుకువచ్చారన్నారు. చదవండి: సీఎం జగన్‌ని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి -
సీఎం జగన్‌ని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను ఆయనకు విన్నవించారు. వీటితోపాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సీఎం చెప్పడం సంతోషం అనిపించిందని వాసుపల్లి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సీఎం కోరారని చెప్పారు. (దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
నోబెల్‌ను మించి ఎదిగిన వ్యక్తి మహాత్మా గాంధీ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'మహాత్మా గాంధీ గొప్పనేత. ప్రపంచ దేశాలకు గాంధీజీ ఆశయాలు ఆదర్శం. నోబెల్ బహుమతి కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. (కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం) మహాత్ముని ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. పేదల కోసం నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెట్టింది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన వైఎస్ జగన్ ఎక్కడ కూడా హింసాత్మకంగా వ్యవహరించలేదు. గాంధీజీ పుట్టిన రోజునే లాల్ బహుదూర్ శాస్త్రి కూడా జన్మించారు. ఆయన పాలించింది కొద్ది రోజులే అయినా మంచి పాలన చేశారు' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తూచా తప్పక అమలు చేస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ మహాత్ముని అడుగుజాడల్లోనే నడుస్తుందని స్పష్టం చేశారు. (బాపు కల నెరవేరిందిలా..) కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్లో కేటాయించిన ప్రతి పైసా సీఎం జగన్ పేదవాడి కోసం ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 16 నెలల్లో 59 వేల కోట్లు సీఎంఖర్చు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి సైలెంట్ మెన్. ప్రతిపక్ష పార్టీ ఎన్ని విమర్శలు చేసిన ఆయన పని ఆయన చేసుకుపోతాన్నారు. ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మహాత్మాగాంధీ ఆశయాలను సీఎం కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేస్తున్న అనేక పనులకు టీడీపీ రకరకాలుగా అడ్డుపడుతోంది' అని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు. -
మనసు చంపుకొని టీడీపీలో ఉండలేకపోయా..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో సముద్రమంత మార్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపిస్తోందని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'డైనమిక్ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేని పనులు వైఎస్ జగన్ పాలనలో జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. 14 నెలల్లో 59 వేల కోట్లు ప్రజాసంక్షేమానికి ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. 14 నెలలు మనుసు చంపుకొని టీడీపీలో పని చేశాను. ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక సూచన చేయాలి, కానీ అది జరగడం లేదు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా చేశారు. ప్రతిపక్ష పార్టీగా పేదవాడి నోట్లో మట్టి కొట్టొద్దు. నాకు పార్టీలో ఏ పని అప్పగించిన బాధ్యతతో పని చేస్తా. సౌత్ నియోజకవర్గ పనుల కోసం బంట్రోతులా తిరిగిన టీడీపీ హయాంలో పనులు జరగలేదు. సూటు బూటు వేసుకున్న వారికే టీడీపీ ప్రభుత్వంలో పనులు జరిగాయి. అభివృద్ధికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సూచన చేసింది. పేదల కోసం ఉద్యమాలు చేయమని టీడీపీ చెప్పలేదు. కోర్టులకు వెళ్లి పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ లేదు. 20 లేదా 30 ఏళ్లు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. మనుసు చంపుకొని పార్టీ ఆదేశాల మేరకు సీఎంపై విమర్శలు చేశాను. మనసు చంపుకొని టీడీపీలో ఉండలేకపోయాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. నాపై అనర్హత ఫిర్యాదు చేసుకోమనండి. రాష్ట్రానికి, పేద ప్రజలకు సీఎం జగన్ ఒక లైఫ్ ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా వంటి కార్యక్రమాలు అమలు చేశారు. విశాఖపట్నంలో లేని ఉద్యమాలు చేయమంటే ఎలా చేస్తాను. రాజ్యాంగం మీద సీఎం జగన్ ప్రమాణం చేసినప్పుడే కులాలు, మతాలకు సంబంధం లేదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ అనడం కరెక్ట్ కాదు. (తప్పు చేయకుంటే భయమెందుకు?) పరిపాల రాజధాని ప్రకటించిన రోజే నేను స్వాగతించాను. కొంతమంది రాక్షసుల్లా పరిపాలన రాజధాన్ని అడ్డుకుంటున్నారు. వైజాగ్ కు పరిపాలన రాజధాని అయ్యే అర్హత లేదా. నా పేరు మీద అమరావతికి మద్దతుగా నాకు తెలియకుండా లేఖ విడుదల చేశారు. నేను పార్టీ ద్రోహిని అయితే చంద్రబాబు పేదల ద్రోహి' అంటూ విశాక సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అమిత్ షాతో చర్చ) -
సీఎం జగన్‌పై వాసుపల్లి గణేశ్ ప్రశంసలు
-
సీఎం జగన్‌పై వాసుపల్లి గణేశ్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా పాలనతో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు ఆకర్షితులతున్నారు. యువతీయువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ ఇద్దరు కుమారులు సీఎం జగన్ సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుల్లి గణేశ్, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేశ్ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా కుమారులు వైఎస్సార్సీపీలో చేరడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు. ఆయన ధైర్యమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. టీడీపీ ఇక ముందుకు వస్తుందని నాకు అనిపించడం లేదు’అని పేర్కొన్నారు. (చదవండి: ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు) ప్రతిపక్షం ఉంటే కదా వాసుపల్లి గణేష్ కుటుంబం విశాఖ ప్రజల కోసం చేస్తున్న సేవలు హర్షణీయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం చాలా మంచిదని పేర్కొన్నారు. వాసుపల్లి గణేష్ కుమారులు పార్టీలోకి రావడం బలాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో విద్యావంతులు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో వైఎస్సార్సీపీలోకి చాలా మంది వస్తారని జోస్యం చెప్పారు. విశాఖలో టీడీపీ తుడుచుపెట్టుకు పోతుందనడంలో సందేహం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటే కదా ప్రతిపక్ష నాయకుడు ఉండేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని అన్నారు. (చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్) -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్ కలిశారు. శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో తన కుమారులతో కలిసి ఆయన ...ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మ్మెల్యే కుటుంబంతో పాటు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై విశ్వాసం సన్నగిల్లడంతో తెలుగు తమ్ముళ్లు దారి వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు మాటలను వాసుపల్లి గణేష్ ఇప్పటికే విభేదించారు. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రిని వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారులు ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
లక్షల్లో ఫీజులు.. పురుగులతో భోజనం
గాజువాక: టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ గాజువాక క్యాంపస్‌లో దుర్మార్గం చోటు చేసుకుంది. అడ్మిషన్ సమయంలో తమకు ఇస్తామన్న సౌకర్యాలను ఎందుకివ్వడం లేదని ప్రశ్నించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం బంధించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గేట్లను తెరిపించి విద్యార్థులను చెర నుంచి విడిపించారు. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విషయాలను వివరించారు. వారి కథనం ప్రకారం.. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం ఇంటర్‌తోపాటు ఆర్మీ, నేవీలో చేరడానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం గ్యారంటీ, విశాలమైన ఆట స్థలం, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలతో పాటు హాస్టల్లో మంచి భోజనం కల్పిస్తామని అడ్మిషన్ల సమయంలో చెప్పింది. దీంతో వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 400 మంది విద్యార్థులు చేరారు. అయితే, అడ్మిషన్ల సమయంలో చెప్పిన సౌకర్యాలేవీ కల్పించకపోగా.. పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. మొదట్లో రూ. 1.40 లక్షల ఫీజు చెప్పిన యాజమాన్యం తమ నుంచి రూ. 1.90 లక్షలను వసూలు చేసిందని పేర్కొన్నారు. ఆటల కోసం దూరంగా ఉన్న జీవీఎంసీ గ్రౌండ్‌కు తీసుకెళ్తున్నారని, హార్స్ రైడింగ్ ఊసెత్తడం లేదని, స్విమ్మింగ్ పూల్ లేదని తెలిపారు. ఎన్నిసార్లు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో వైజాగ్ డిఫెన్స్ అకాడమీ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి బయలుదేరుతుంటే ఇలా సెల్లార్లలో పెట్టి అడ్డుకున్నారని వివరించారు. విద్యార్థుల ఆవేదనను విన్న గాజువాక సీఐ సూరినాయుడు కళాశాలలో దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక బ్రాంచ్ అడ్మినిస్ట్రేటివ్ అఫీసర్ భాస్కర్‌రావుతో విద్యార్థుల సమక్షంలో సీఐ మాట్లాడారు. 5 రోజుల్లో సదుపాయాలన్నీ కల్పిస్తామని భాస్కర్‌రావు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అరాచకం..
-
వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అరాచకం..
సాక్షి, విశాఖపట్నం: సరైన వసతులు లేవని అడిగిన విద్యార్థులను యాజమాన్యం సెల్లార్లో బంధించి నరకం చూపించిన సంఘటన శుక్రవారం వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో చోటు చేసుకుంది. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ప్లే గ్రౌండ్, హార్స్‌రైడింగ్, సరైన భోజన వసతులు లేవని నిర్వాహకుల్ని విద్యార్థులు ప్రశ్నించారు. ఆందోళన నేపథ్యంలో 100 మంది విద్యార్థులను నిర్వాహకులు సెల్లార్లోనే బంధించారు. విషయం తెలుకున్న ఢిపెన్స్ అకాడమీకి చేరుకున్న పోలీసులు సంఘటనపై విచారణ చేస్తున్నారు. విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని డిఫెన్స్ అకాడమీపై పలు ఆరోపణలు ఉన్నాయి. -
టీడీపీ మహిళా నేత దౌర్జన్యం
సాక్షి, విశాఖ : అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు, పార్టీ కార్యకర్తలు అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అండదండలతో విశాఖ జిల్లాలో టీడీపీ మహిళానేత, డ్వాక్రా సంఘనేతపై దాడి చేయడం తీవ్ర అలజడి రేపుతోంది. విశాఖ- పాతనగరంలో డ్వాక్రా గ్రూపులకు దేవుడమ్మ నాయకురాలు. ఆమె గ్రూపులోని సభ్యులను టీడీపీకి చెందిన కొల్లి సింహాచలం అనే మహిళ బెదిరించి తమవైపుకు తిప్పుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తనను అనుచరులతో కొట్టించిందని ఆరోపించింది. ముఖం,వీపుపై పిడిగుద్దులు కొట్టారని,.ఈ విషయాన్ని విశాఖ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకూ సింహాచలంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు. సింహాచలం నుంచి దేవుడమ్మకు ప్రాణహాని ఉందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సింహాచలం దాడులు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవుడమ్మపై దౌర్జన్యం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విద్యార్థి టీసీ ఇచ్చేందుకు సొమ్ములు డిమాండ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాధితులు విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన మారెడ్డి మణికంఠారెడ్డి విశాఖ నగరం 104 ఏరియాలో ప్రియదర్శిని జూనియర్ కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదివాడు. సబ్జెక్టులు చాలా మిగిలిపోవడంతోపాటు సరైన విద్యా ప్రమాణాలు లేవని, హాస్టల్ వసతి కూడా సరిగ్గా లేదని భావించిన మణికంఠ కుటుంబ సభ్యులు కాలేజీ నుంచి టీసీ తీసుకోవాలని భావించారు. విశాఖ నగరం 104 ఏరియాలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ కళాశాల ప్రిన్సిపాల్ మంగళవాణిని సంప్రదించిన విద్యార్థి తల్లి మారెడ్డి ఆదిలక్ష్మి తన కుమారుడి టీసీ ఇవ్వాలని కోరారు. టీసీ ఇవ్వాలంటే రూ.30 వేలు చెల్లించాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశారు. ఫస్టియర్ ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు చెల్లించామని, టీసీ కోసం మళ్లీ రూ.30 వేలు అడగటం ఏమిటని ఆదిలక్ష్మి ప్రశ్నించారు. అంతమొత్తం చెల్లించలేమని స్పష్టం చేశారు. దీంతో కళాశాల సిబ్బంది ఒక్కసారిగా జులుం ప్రదర్శించారు. ‘డబ్బు కట్టకపోతే టీసీ ఇచ్చేది లేదు. బయటకు పొండి’ అంటూ బలవంతంగా గెంటివేశారు. ఇదేమిటని ఎదురు తిరిగిన వారిపై ‘ఇది ఎమ్మెల్యే గారి కాలేజీ. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మమ్మల్ని ఎవ్వరూ పీకలేరు. ఎక్కువ మాట్లాడితే మీరు గుంటూరు కూడా వెళ్లలేరు’ అని బెదిరింపులకు దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆదిలక్ష్మి వెంటనే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్పై ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫొటోతో ఉన్న అకాడమీ బోర్డు కేసు దర్యాప్తు చేస్తున్నాం ప్రియదర్శిని కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీపై ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్‌కుమార్ శనివారం తెలిపారు. ఆదిలక్ష్మితో పాటు మరో ముగ్గురు విద్యార్థుల తల్లితండ్రులు కూడా తమపై కళాశాల ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారన్నారు. అయితే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన విద్యార్థుల నుంచి ఇదే మాదిరి ఫిర్యాదులు సదరు అకాడమీపై అందాయని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు. -
విశాఖలో టీడీపీ పంచాయితీ
సాక్షి, విశాఖపట్నం : సరైన అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా కట్టేసిన నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైఎలా చర్యలు తీసుకోవాలోనని అధికారులు ఓ పక్క మల్లగుల్లాలు పడుతున్నారు.మరోపక్క అదే తెలుగుదేశం కార్యాలయం వేదికగా ఆ పార్టీ నేతలు కుస్తీలు పడుతూ రచ్చకెక్కుతున్నారు.ఎన్నికల ముందు వరకు పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను తప్పించి నాలుగు నెలల కిందట మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్‌ను ఆ పదవిలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నియమించారు. రెహమాన్ నియామకాన్ని తట్టుకోలేని వాసుపల్లి గణేష్ అతను అధ్యక్షుడిగా ఉండగా తాను పార్టీ కార్యాలయంలో అడుగేపెట్టనని శపథం చేయడమే కాదు.. అప్పటినుంచి కార్యాలయంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.సరిగ్గా ఆదే అంశం ఆధారంగా ఎమ్మెల్యే వాసుపల్లితో తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ నగర అధ్యక్షుడు రెహమాన్ భావిస్తున్నారు. ఆ మేరకు షోకాజ్ నోటీసులిచ్చేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.మరోవైపు టీడీపీ హయాంలో మంత్రిగా అధికారం చెలాయించిన గంటా శ్రీనివాసరావు సైతం.. ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నారు. పార్టీ వ్యవహారాలను అసలు పట్టించుకోవడమే మానేశారు. రాష్ట్రమంతటా చావుదెబ్బతిన్నా.. అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్మెయిల్ రాజకీయంతో విశాఖ నగరంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లకుంటే బాగోదని మొక్కుబడిగా హాజరవుతున్న శాసనసభ్యులు.. నగరంలో మాత్రం టీడీపీ కార్యాలయానికి సైతం వెళ్ళకపోవడం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. దాదాపు తొమ్మిదేళ్లు బుగ్గకారుకు అలవాటు పడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికీ వాస్తవ పరిస్థితి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే పార్టీ వ్యవహారాలకు దూరం దూరం.. అన్నట్లుంటున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మధ్య శ్రీలంక, ఇప్పుడు అమెరికా యాత్రలో ఉన్న ఆయన గురు, శుక్రవారాల్లో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టేశారు. సోమవారం మాత్రం అసెంబ్లీ హాజరయ్యారు. ఇక ప్రతిపక్ష పార్టీకి కేటాయించే పీఏసీ చైర్మన్ పదవిపై కన్నేసిన ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ మాదేనని భావించే వెలగపూడి రామకృష్ణబాబులు పార్టీ కార్యాలయానికి అడపాదడపా వెళ్తున్నా... మరో సీనియర్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవహారశైలి మాత్రం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చాంశనీయమవుతోంది. పార్టీ కార్యాలయానికి వెళ్ళనంటే వెళ్ళను వాసుపల్లి గణేష్ విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్ష పదవిలో దాదాపు ఐదేళ్లు కొనసాగారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వాసుపల్లిని తప్పించి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్ఎ రెహమాన్‌కు అర్బన్ టీడీపీ అధ్యక్ష పదవిని పార్టీ అధినేత చంద్రబాబు కట్టబెట్టారు. ప్రజారాజ్యంలో కొన్నాళ్ళు మినహా టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా కొనసాగుతున్న రెహమాన్ ఈసారి వాసుపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గం సీటు ఆశించారు. ఒకవేళ తనకు ఇవ్వకున్నా చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న తన సతీమణి షిరీన్ రెహమాన్‌కైనా ఇవ్వాలని రెహమాన్ పట్టుబట్టారు. అయితే చంద్రబాబు వాసుపల్లికే రెండోసారి టికెట్ కేటాయించి.. పార్టీ అర్బన్ అధ్యక్ష పదవిని తొలగించి రెహమాన్‌కు కట్టబెట్టారు. దీంతో వాసుపల్లి, రెహమాన్‌ల మధ్య మొదటి నుంచీ ఉన్న విభేదాలు మరింత ముదిరాయి. ఎన్నికల సమయంలో రెహమాన్ తనకు సహకరించలేదని వాసుపల్లి ఆరోపిస్తుంటే.. తన మద్దతు లేకుంటే దక్షిణంలో వాసుపల్లి గెలిచేవారా.. అని రెహమాన్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత నుంచి వాసుపల్లి టీడీపీ కార్యాలయం మెట్లెక్కలేదు. జిల్లాలో పార్టీ ఘోరపరాభవం తర్వాత నగరంలోని పార్టీ కార్యాలయంలో ఐదారుసార్లు నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ఎన్నికల ముందు సైకిలెక్కిన మాజీ ఎంపీ సబ్బం హరి సహా దాదాపు మిగిలిన నేతలు హాజరైనా వాసుపల్లి అటువైపు తొంగికూడా చూడలేదు. నోటీసులిచ్చేందుకు రెహమాన్ సిద్ధం? మూడు నెలలుగాపార్టీ కార్యాలయ మెట్లెక్కని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు పార్టీ నియమావళి ప్రకారం నోటీసులివ్వాలని అర్బన్ పార్టీ అధ్యక్షుడు రెహమాన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ నియమావళి ప్రకారం క్రియాశీలక సభ్యత్వం కలిగిన వారు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే నోటీసులివ్వవచ్చని, ఆ క్రమంలో సంజాయిషీ అడగాలని రెహమాన్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఇక్కడ వాసుపల్లి వ్యవహారంతో పాటు పార్టీ కార్యాలయ నిర్వహణ భారం, దుస్థితిపై పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లాలని, ఈలోగానే వాసుపల్లికి నోటీసులివ్వాలని రెహమాన్ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. -
ఓర్నీ యాసాలో.. మళ్లీ మొదలెట్టేశార్రో..!
చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా.. ఎన్నో అనుమానాలు, సందేహాల మధ్య.. జీవీఎంసీలో కొందరు అధికారుల ‘పచ్చ’పాత కుట్రలతో ఎన్నికల్లో గట్టెక్కామనిపించుకున్న టీడీపీ నగర ఎమ్మెల్యేలు తమ పాత శైలినే అందిపుచ్చుకుంటున్నారు. తమ ట్రేడ్‌మార్క్ వెర్రివేషాలు, విన్యాసాలు మళ్లీ మొదలెట్టేశారు. అందులోనూ వెలగపూడి, వాసుపల్లిల ఓవర్ యాక్షన్ ఏపాటిదో నగర ప్రజలకు తెలియంది కాదు. ఒళ్లు తెలియకుండా నోటికొచ్చినట్టు బండబూతులు మాట్లాడే వెలగపూడి..చీప్ ట్రిక్కులు, చిల్లర వేషాలతో వాసుపల్లి చేసే విన్యాసాలు నగర ప్రజలకు కొత్తకాదు. అధికార మదంతో ఇప్పటివరకు విర్రవీగిన వీరిద్దరినీ ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఇక నుంచైనా ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తారని, ప్రజలతో మమేకమవుతారని అందరూ ఆశించారు. కానీ తమ నైజం మారలేదని వారిద్దరు శనివారం నిరూపించారు. ఎన్నికల తర్వాత ఇంతవరకు ప్రజాక్షేత్రంలోకి రాని.. వారి సమస్యలు పట్టని వీరు.. తమ అధినేతను ఎక్కడో ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసి అవమానించారంటూ గగ్గోలు పెడుతూ.. వీరావేశంతో చొక్కాలిప్పి గంతులేశారు. సాక్షి, విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే అదేదో మహాఅపరాధంలా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై విమానాశ్రయాల భద్రత పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్)తోపాటు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెంటనే వివరణ కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్ష నేతలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉండని స్పష్టం చేశారు. పౌర విమానయాన శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం విమానాశ్రయాల్లో చెక్ ఇన్ వద్ద తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రముఖుల జాబితా కూడా బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయినా సరే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చంద్రబాబుకు అన్యాయం, అవమానం జరిగిందంటూ ఊదరగొడుతూ వచ్చాయి. ఇక విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లిలైతే శనివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎయిర్పోర్ట్ నిబంధనలు తెలియని పార్టీ శ్రేణులకు సర్దిచెప్పాల్సిన ఎమ్మెల్యేలే చొక్కాలిప్పేసి, గొంతుచించుకుని గగ్గోలు పెట్టారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ చీప్ ట్రిక్స్ మొదలెట్టేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును నిబంధనల మేరకు తనిఖీ చేసి అవమానించారని గొంతు చించుకుంటున్న టీడీపీ నేతలు.. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్జగన్మోహన్రెడ్డి ఈ నిబంధనలను గౌరవించి.. విమానాశ్రయాల్లో తనను తనిఖీ చేసేందుకు సహకరించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ.. టీడీపీ ఎమ్మెల్యేల వెకిలి వేషాలను ఏవగించుకుంటున్నారు. -
ముస్లిం నేతలను వాసుపల్లి పక్కన పెట్టారు
-
వాసుపల్లీ.. నిన్ను ఓడించడం ఖాయం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): దళితుల ఓట్లతో గద్దెనెక్కిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను ఈ సారి ఆ దళితులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొత్తరముడి శ్రీనివాస్ హెచ్చరించారు. దళితుల్ని చిన్నచూపు చూస్తున్న వాసుపల్లి ఎస్సీల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ నినదించారు. నీకు దళితులంటే ఎందుకంత అసహ్యం అంటూ ఆదివారం డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీ వాసుపల్లికి మరోసారి టికెట్ కేటాయిస్తే దళితులు అతనిని ఓడించడం ఖాయమన్నారు. దక్షిణ నియోజకవర్గంలో దుర్యోధుని పాలన సాగుతుందనుకుంటే దుశ్శాసన పాలన నడుస్తోందని మండిపడ్డారు. దళితుల ఓట్లతో గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్ దళితుల్ని పక్కన పెడుతున్నారని విమర్శించారు. 23వ వార్డులో ముగ్గురు బూత్ ప్రెసిడెంట్లు, శ్రీకనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి నుంచి ఓ దళితుడ్ని తప్పించారంటే వాసుపల్లికి దళితులంటే ఎంత చిన్నచూపో అర్థమవుతోందన్నారు. వాసుపల్లి దళితుల ద్రోహని, దురహంకారంతో వీగిపోతున్నారని మండిపడ్డారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చెంగల చిన్నారావు, చెన్నా రామయ్య, ఇజ్రాయిల్ పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు..
ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత.. ఇటీవలి కాలంలో పార్టీ నుంచి నేతల వలసలతో విలవిల్లాడుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీని ఇంటిపోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి నేతలు సెగలు కక్కుతున్నారు. ‘ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు.. మళ్లీ వారికే టికెట్లు ఇస్తే ఓడిస్తాం’.. అంటూ రోడ్డెక్కి మరీ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకేరోజు ముగ్గురు ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడంతో పార్టీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న పార్టీ అధినేతకు ఈ అసమ్మతి కుంపట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పాయకరావుపేటలో ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా వందలాది టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి.. ఈ ఎమ్మెల్యే మాకొద్దని నినదించారు. విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు కూడా అయిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గ పార్టీ మైనారిటీ, మహిళా విభాగాల నేతలు, మాజీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టి డిమాండ్ చేశారు. ఇక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌పై అక్కడి టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఎదురుతిరిగారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకపోతే వారే పార్టీ అభ్యర్థులను ఓడిస్తారని.. తాను కూడా పోటీలో ఉంటానని అల్టిమేటం జారీ చేశారు. సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అధికార టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాజుకుంటోంది. నిన్న గాక మొన్న మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుని తీరు పట్ల మంత్రి సోదరుడు సన్యాసిపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావుపై అసంతృప్తితో భీమిలి నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. మాడుగులలో పార్టీ ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడుపై సొంత పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలే గ్రూపుకట్టి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తాజాగా ఒకే రోజు ముగ్గురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రెస్మీట్లు పెట్టి మరీ పార్టీ అదిష్టానానికి అల్టిమేటంఇవ్వడమే కాదు.. ర్యాలీలు, ధర్నాలతో రోడ్డెక్కడం సిట్టింగులపై ఏ స్థాయిలో వ్యతిరేకత పెల్లుబికుతుందో తేటతెల్లమవుతోంది. అనితపై ఆగ్రహజ్వాలలు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై గత కొన్ని రోజులుగా అసమ్మతి రాజుకుంటోంది. ఇన్నాళ్లూ ఆమె అవినీతికి వ్యతిరేకంగా పార్టీ సమావేశాల్లో గళం విప్పిన నేతలు ఇప్పుడు రోడ్లెక్కారు. రానున్న ఎన్నికల్లో అనితకు టిక్కెట్ ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే ఓడిస్తామంటూ పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పార్టీ నేతలు, వందలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన, నక్కపల్లి కోఆప్షన్ జడ్పీటీసీ కొప్పిశెట్టి కొండబాబు తదితరులు అనిత విజయానికి పనిచేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె తీరు మారిపోవడంతో.. ఒక్కొక్కరుగా ఆమెకు దూరమయ్యారు. రెండేళ్ల పాటు గుంభనంగా ఉన్న వారంతా ఎన్నికల ముంగిట అసమ్మతి గళమెత్తారు. గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్, విశాఖ డెయిరీ డైరెక్టర్ రెడ్డి రామకృష్ణ, నక్కపల్లి మాజీ ఎంపీపీ బొల్లం బాబ్జి, మరో మాజీ ఎంపీపీ, అతని బందువులు, ఎస్‌రాయవరం పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షుడు దండు గణపతిరాజు, పాయకరావుపేట మాజీ వైస్ ఎంపీపీ గొర్లె రాజబాబు, సీనియర్ నేతలు దేవవరపు వెంకటరమణ, చింతకాయల రాంబాబు, కోటవురట్ల మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వర చంద్రమూర్తి, సీనియర్ నాయకుడు వేగి శ్రీనివాసరావు తదితరులు ఇప్పటికే అనితపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. రెండునెలల క్రితం తోటనగేష్ తన వర్గీయులతో రహస్య సమావేశం నిర్వహించి వారి మద్దతు కూడగట్టారు. ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా పాయకరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు అలాగే నెలరోజుల క్రితం నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వారితో మరో సమావేశం నిర్వహించి అసమ్మతి కార్యకలాపాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. తాజాగా పదిరోజుల క్రితం కోటవుటర్లలో నియోజకవర్గంలోనాలుగు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో మరో సమావేశం నిర్వహించి బాహటంగానే అనితపై విమర్శనాస్త్రాలు సంధించారు. అనితకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని, ఆ ప్రభావం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విజయావకాశాలపై కూడా పడుతుందని హెచ్చరించారు. తాజాగా పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు కూడా అసమ్మతి గూటికి చేరారు. అనిత అవినీతిలో కూరుకుపోయింందంటూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు రంగ ప్రవేశం చేశారు. చంద్రబాబుతోపాటు, పార్టీ సీనియర్ నేతలు కళావెంకటరావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడులను కలుస్తూ తనకు లేదా తన కుమార్తె వెంకటలక్ష్మికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పార్టీ పెద్దల నుంచి ఆ మేరకు హమీ లభించిందని చెప్పుకుంటూ అసమ్మతి నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆయన రంగప్రవేశం చేసినప్పటి నుంచి పార్టీలో అసమ్మతి ఊపందుకుంది. వాసుపల్లిపై అసంతృప్తి సెగలు విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై సొంత పార్టీలో అసంతృప్తి ఎగసిపడుతోంది. గతేడాది వాసుపల్లి తీరుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన దళిత నేతలు పార్టీ కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. తాజాగా వాసుపల్లికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ అర్బన్ టీడీపీ మైనార్టీ వింగ్ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాదిక్, మాజీ కార్పొరేటర్ చెన్నా రామారావు, తెలుగు మహిళ మాజీ ఉపాధ్యక్షురాలు గొర్ల అప్పలనర్సమ్మ తదితరులు బుధవారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించిననేతలపై ఎమ్మెల్యే స్వయంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వారు మండిపడ్డారు. తన కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులతో బెదిరింపులకు దిగుతున్నారని, ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తున్నారంటూ.. ఇంకా పలు ఆరోపణలు చేశారు. పల్లాకు పాకిన సెగలు పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టిన వారికి మళ్లీ టికెట్ ఇస్తే కార్యకర్తలే ఓడిస్తారని మాజీ కార్పొరేటర్, టీడీపీ సీనియర్ నేత లేళ్ల కోటేశ్వరరావు హెచ్చరించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకే అంటూనే.. తాను కూడా టికెట్ రేసులో ఉన్నానని చెప్పుకొచ్చారు. కార్యకర్తలను పక్కన పెట్టిన వారికి టికెట్లు ఇస్తే గెలిపించేందుకు కార్యకర్తలు సిద్దంగా లేరంటూ ఎమ్మెల్యే పల్లానుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరు వల్లే మాజీ కార్పొరేటర్ కోన తాతారావు, వార్డు అధ్యక్షులు చిత్తా కనకరాజు, కరణం కనకారావు తదితరులు పార్టీని వీడారని గుర్తు చేశారు. మళ్లీ పల్లాకు టికెట్ ఇస్తే చాలా మంది పార్టీని వీడతారంటూ హెచ్చరించారు. -
ఎమ్మెల్యే వాసుపల్లిని ఓడించి తీరతాం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. వాసుపల్లికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ ఆయన వైరిపక్ష నేతలు విశాఖ అర్బన్ టీడీపీ మైనార్టీ వింగ్ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ షాదిక్, మాజీ కార్పొరేటర్ చెన్నా రామారావు, తెలుగు మహిళ మాజీ ఉపాధ్యక్షురాలు గొర్ల అప్పలనర్సమ్మ తదితరులు బుధవారం పాతపోస్టాఫీస్ వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించి మరీ తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించిన టీడీపీ నేతలపై తానే స్వయంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. నియోకవర్గంలోని ప్రతి అభివృద్ధి పనికి కమీషన్ తీసుకుంటూ, కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కమిటీల పేరిట నాయకులను తయారుచేసి వారి ద్వారా అక్రమార్జనకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులతో బెదిరింపులకు దిగుతున్నారని, ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తున్నాడని వాపోయారు. హిజ్రాల నుంచి కమీషన్లు దండుకోవడంతోపాటు పోర్టు పూల్ కలాసీలకు అండగా ఉంటానని నమ్మించి పోర్టు యాజమాన్యం నుంచి ముడుపులు తీసుకున్నారని, ప్రతి పనిలోనూ పర్సంటేజ్‌లు దండుకుంటున్నాడని తెలిపారు. పార్టీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా.. తనకు నచ్చినవారిని కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్‌బోర్డులో సభ్యులుగా నియమించాడని అన్నారు. ఒకసారి ట్రస్ట్‌బోర్డులో ఉన్నవారిని రెండో సారి నియమించకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని తోసిపుచ్చి తన సిబ్బందికి రెండోసారి ట్రస్ట్‌బోర్డులో అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. నియోజవర్గం పరిధిలో ఉన్న రౌడీషీటర్లను, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటే రాయబారం నడిపి వారిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులోని సమస్యలు తెలిపేందుకు వెళితే గంటల కొద్దీ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరీక్షించాల్సి రావడం బాధాకరమన్నారు. ఆయన సన్నిహితులను తప్ప ఇతరులను పట్టించుకోని పరిస్థితి నెలకొందన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లికి సీటు ఇస్తే ఆయన్ని ఓడించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు దాడి రామలక్ష్మి, తొట్లమూడి శ్రీనివాస్, అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. -
గిడ్డి ఈశ్వరి, వాసుపల్లి సీట్లకు ఎసరు..
టీడీపీ–కాంగ్రెస్ బంధం బలపడనుండడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కుదిరే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఇరు పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో కూడా ఈ బంధం కొనసాగనుందని స్పష్టమవుతోంది. ఈ పొత్తు వల్ల తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళన అధికార టీడీపీ నేతల్లో మొదలైంది. కాంగ్రెస్‌లో ఆశావహులను సైతం ఇదే గుబులు వేధిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డగోలు విభజనతో రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్‌తో జత కట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి బద్ధ శత్రువులుగా పోరాడుతున్న ఈ రెండు పక్షాలు ఇప్పుడు మిత్రపక్షాలుగా మారాయి. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ నేతలకు వచ్చిన నష్టమేమీ లేదు కానీ, కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమ ఆశలు ఎక్కడ గల్లంతవుతాయోనన్న ఆందోళన అప్పుడే ఒకరిద్దరు టీడీపీ సిట్టింగ్‌లు, పలువురు ఆశావహుల్లో మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌లకు గడిచిన ఎన్నికల్లో విభజన పాపం వెంటాడడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ తర్వాత బాలరాజు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా.. ద్రోణంరాజు మాత్రం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్–టీడీపీ పొత్తు కారణంగా బాలరాజు పాడేరు, శ్రీనివాస్ విశాఖ దక్షిణం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. వాసుపల్లి సీటుకు ఎసరు.. పీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్ టీడీపీ నగర పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినందున శ్రీనివాస్ మళ్లీ ఇదే స్థానాన్ని కోరుకునే అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే వాసుపల్లి సీటు గల్లంతైనట్టే. అయితే గతంలో పొత్తు కారణంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తరం సీటును కాంగ్రెస్‌కు వదిలేస్తామన్న ప్రతిపాదన వచ్చినా ద్రోణంరాజుఆ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపే అవకాశాల్లేవంటున్నారు. దీంతో కాంగ్రెస్ పొత్తుతో వాసుపల్లి సీటు గల్లంతయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే కనుక జరిగితే విశాఖ ఉత్తరం నుంచి వాసుపల్లిని బరిలోకి దించే ఆలోచన పార్టీ అధినాయకత్వం చేస్తుందని భావిస్తున్నారు. గిడ్డి ఆశలు గల్లంతైనట్టే.. టీడీపీలోకి ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తామన్నారని.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైతే అప్పటి వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతారని, తనకు ఇక ఢోకా లేదన్న సాకుతో కన్నతల్లిలాంటి పార్టీనే కాదు ఓట్లేసి గెలిపించిన గిరిజనులను కూడా వెన్నుపోటు పొడిచి పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే ఈశ్వరిలో కనీసం ఎమ్మెల్యే సీటైనా దక్కుతుందా.. లేదా ? అన్న ఆందోళన నెలకొంది. ఈ సీటు కోసం మాజీ మంత్రి మణికుమారితోపాటు మరికొందరు ఈశ్వరికి చెక్ పెట్టేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశాలుండడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి బాలరాజు కోసం పాడేరు స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అదే కనుక జరిగితే ఆశావహుల మాట అటుంచితే.. ఎన్నో ఆశలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ దక్కే అవకాశాలు కనుచూపు మేరలో కన్పిం చడం లేదని స్పష్టమవుతోంది. విశాఖ, అరకు పార్లమెంటు స్థానాల కోసం కాంగ్రెస్ పట్టు గతంలో పోటీ చేసి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహించిన రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, కిశోర్ చంద్రదేవ్‌లు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండడంతో పొత్తులో భాగంగా విశాఖ, అరకు పార్లమెంటు సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరకు నుంచి టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఈ స్థానం కోసమే ఎక్కువగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోసారి పోటీ చేయాలని ఆశిస్తున్న సుబ్బిరామిరెడ్డి విశాఖ పార్లమెంటు సీటును కూడా కోరాలని అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువుచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఒకే జిల్లాలో రెండు స్థానాలు ఇచ్చే అవకాశం లేనందున అరకుకే పొత్తు ఖరారయ్యే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎన్నికలు సమీపిస్తుంటే గుర్తొచ్చామా?
పాతపోస్టాఫీసు(వివిశాఖ దక్షిణ): ‘నాలుగున్నర సంవత్సరాలుగా మా ప్రాంతాన్ని సందర్శించని మీకు ఇప్పుడు గుర్తొచ్చామా? ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఓట్లు దండుకోవడానికి వచ్చారా. మా ప్రాంతంలో సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు’ అంటూ జీవీఎంసీ 21వార్డు కోడిపందాలవీధి, మీదిరెల్లివీధి ప్రజలు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను నిలదీశారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో వార్డు పర్యటనలో భాగంగా మీదిరెల్లివీధి, కోడిపందాలవీధికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు చుట్టుముట్టారు. హుద్‌హుద్ తుపానులో పూరిళ్లు కూలిపోయి, పైకప్పులు ఎగిరిపోయిన వారిలో చాలామందికి నేటికీ పరిహారం అందకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. స్థానికుల ప్రశ్నలకు సమాధానం చెప్పని ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న సమస్యలను చెప్పమనడంతో వారంతా నిరసన తెలిపారు. ఈ క్రమంలో స్థానిక యువకులతో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. మంచినీరు, పారిశుద్ధ్యం, శిథిలమైన మెట్లమార్గం, దరఖాస్తు చేసుకున్నా రాని పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు ఇలా ఒకటనేమిటి అనేక సమస్యలను ఎమ్మెల్యే ముందుంచారు. వాటిని పరిష్కరించనప్పుడే వీధిలో అడుగుపెట్టాలంటూ వాదనకు దిగారు. సర్ది చెప్పడానికి ప్రయత్నించినా స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో ఎమ్మెల్యే వాసుపల్లి వెనుతిరగాల్సి వచ్చింది. -
వాసుపల్లి నోరు అదుపులో పెట్టుకో
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): దక్షిణ ఎమ్మెల్యే, అర్బన్ టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని.. అనవసరంగా జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిల మీద ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమి కొడతారని వైఎస్సార్సీపీ నేత కొండా రాజీవ్ గాంధీ అన్నారు. వాసుపల్లి మాటలు దెయ్యాలు వేదాలను వళ్లించినట్టుందని ఎద్దేవా చేశారు. హత్యలు చేసిన తన మనుషులను కాపాడుకోవటం కోసం పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చే వాసుపల్లికి తమ నేతలను విమర్శించే అర్హత లేదన్నారు. తన అనుచరులతో దందాలు సాగిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాసుపల్లి నీతిమాలిన నిర్ణయాలతో విసుగు చెందిన సొంత పార్టీ నేతలే ఆందోళన చేసిన విషయంప్రజల మదిలో ఉందన్నారు.తగిన బుద్ధి చెబుతారన్నారు. టీపీడీ మోసాలపై చంద్రబాబు, వాసుపల్లి వేషధారణతో ధర్నా చేస్తానని రాజీవ్ చెప్పారు. -
అసలే అతి..అదీ తప్పింది శృతి
చిల్లర చేష్టలకు.. చ్ప్ పబ్లిసిటీ ట్రిక్కులకు,వివాదాలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్పెట్టింది పేరు. సహజంగానే విశాఖ దక్షిణనియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి పేరుచెప్పగానే ఆయన ఓవర్ యాక్షన్లే గుర్తొస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలోఆయనగారి ‘అతి’ చేష్టలు కూడాశృతిమించి పరాకాష్టకు చేరాయి.ఎంతలా అంటే.. చివరికి టీడీపీశ్రేణులు సైతం ఆయన నిర్వాకాలపైఏహ్యభావం వ్యక్తం చేస్తున్నారు. కనీస సామాజిక స్పృహ కూడా లేకుండా నిరసనల పేరుతోచేస్తున్న జుగుప్సాకరమైన విన్యాసాలు.. వాసుపల్లిపై అన్ని వర్గాల్లోనూఅసంతృప్తి రగలిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : టీడీపీ విశాఖ అర్బన్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమే. అధికారం దన్నుతో కన్నూమిన్ను కానకుండా ప్రవర్తించే ఆయన ఇటీవల దళితులను అవమానించడంతో దళిత సంఘాలు ఏకమై కేసు పెట్టాయి. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు కావడం.. అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని స్వయంగా పార్టీ శ్రేణులే మంత్రి నారా లోకేష్‌ను కలిసి విన్నవించడం కలకలం రేపింది. ఆ కేసు నేపథ్యంలోనైనా వాసుపల్లి తీరులో మార్పు వస్తుందని అందరూ భావించారు. కానీ ఆయనలో ఇసుమంతైనా మార్పు లేకుండా పబ్లిసిటీ కోసం మరింత దిగజారి వ్యవహరించడమే ఇప్పుడువివాదాస్పదమవుతోంది. విశాఖను నోడల్ జిల్లాగా తీసుకున్న రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నగరంలోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేపట్టారు. ఆ క్రమంలోనే దక్షిణ నియోజకవర్గంలో కూడా పర్యటించారు. టీడీపీ పాలనలో నయవంచనకు గురైన వివిధ వర్గాల ప్రజలు పాదయాత్రలో ఆయన్ను కలిసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను విన్నవించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ప్రభుత్వతీరును ప్రజాస్వామ్య పద్ధతిలోనే విమర్శించారు. విజయసాయిరెడ్డి వాదనలతో ఏకీభవించని పక్షంలో వాసుపల్లి సహా టీడీపీ నేతలు వివిధ ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు చేపట్టొచ్చు. కానీ వాసుపల్లి కనీస సామాజిక స్పృహ లేకుండా చేసిన నిరసనలు ఇప్పుడు వివాదాస్పదవుతున్నాయి. విజయసాయిరెడ్డి పాదయాత్ర చేసిన రోడ్ల వెంట పసుపు నీళ్ళు చల్లడమే దారుణమైతే.. ఆ తర్వాత బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీసి ర్యాలీగా శ్మశానవాటిక వద్దకు వెళ్ళి అక్కడ గుమ్మడికాయలను నేలకేసి కొట్టడం.. వంటి దిగజారుడు చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇలాంటి పద్ధతుల్లో నిరసనలా.. అంటూ స్వయంగా టీడీపీ నేతలే అంతర్గతంగా వాసుపల్లిపై ధ్వజమెత్తుతున్నారు. వాసుపల్లి వెర్రి పరాకాష్టకు చేరిందంటూ అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాసుపల్లికి పిచ్చెక్కింది:కోలా గురువులు విజయసాయిరెడ్డి పాదయాత్రతో ఎమ్మెల్యే వాసుపల్లికి మైండ్‌బ్లాక్ అయి పిచ్చిపట్టిందని వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు ధ్వజమెత్తారు. మూఢ నమ్మకాలు, బాణామతి, చిల్లంగి వంటివి వాసుపల్లి ఆయుధాలని ఆరోపించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టినా భూతవైద్యుడి మాదిరిగా శుద్ధి పేరిట క్షుద్ర కార్యక్రమాలు చేస్తున్నారని కోలా విమర్శించారు. జన్మభూమి కమిటీల్లో రౌడీలు, గూండాలను సభ్యులుగా చేర్పించి పేదల పెన్షన్లలో కమీషన్లు కొట్టేసే వాసుపల్లికి విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. హిజ్రాలను కూడా మోసం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసి బతికే వాసుపల్లికి విజయసాయిరెడ్డి పేరు కూడా పలికే అర్హత లేదని ధ్వజమెత్తారు. వాసుపల్లిని అరెస్టు చేయాలి:టి.శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై కేసు పెట్టినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దారుణమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు టి.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ వార్డు అధ్యక్షుడి మార్పు విషయంలో దళితులను తూలనాడిన కేసులో ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వాసుపల్లి బెదిరింపులతో పోలీసులు తమపై కౌంటర్ కేసులు పెట్టినా విచారణలో అవన్నీ అసత్యాలేనని రుజువయ్యాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. అధికారం అండతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న వాసుపల్లిని వెంటనే కట్టడి చేయకుంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
హత్యలు చేసేవారికి టీడీపీ పదవులు ఇస్తోంది
-
రూ.10 లక్షలిస్తే నన్ను కూడా చంపేస్తారు..
సాక్షి, అమరావతి : బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో గుండాలకు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.5 లక్షలు ఇస్తే హత్య చేసేవారిని ప్రోత్సహిస్తున్నారని విష్ణుకుమార్ రాజు మంగళవారమిక్కడ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ రూ.10 లక్షలను ఇస్తే నన్ను కూడా చంపేస్తారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ హుందాగా నిరసన చేస్తే బాగుండేది. మోదీ మెడలు వంచినట్లు ఆయన నిరసన తెలిపారు. రౌడీలను అద్దెకు తెచ్చి టీడీపీ ధర్నాలు చేయిస్తోంది. హత్యకేసులో నేరస్తుడు ...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన చేయడమా?. అటువంటి వారికి నగర ఉపాధ్యక్ష పదవి ఎలా ఇచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించం. గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టి ప్రధానిపై నీచంగా నిరసన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. మోదీపై నిరసన చేపట్టిన వారిని అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. వారిపై కేసులు నమోదు చేయాలి. ఇటువంటి వ్యక్తులు ఉన్న టీడీపీ చాలా దారుణంగా ఉంది. మేము నోరు విప్పతే టీడీపీ బండారం బయటపడుతుంది. మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టే సంయమనంతో ఉన్నాం. మేము నోరు తెరిస్తే చాలా చెప్పాల్సి ఉంటుంది’ అని ధ్వజమెత్తారు. -
బాబు సమక్షంలో మంత్రి, ఎమ్మెల్యే వాగ్వాదం
విశాఖపట్టణం: టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యకర్తలను లోపలికి అనుమతించకపోవడంపై మంత్రి కాల్వ శ్రీనివాసులతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంత్రి కాల్వ తన కార్యకర్తలపై వివక్ష చూపుతున్నారని వాసుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వాసుపల్లిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం చినరాజప్ప రంగంలోకి దిగారు. -
ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అవాక్కయిన 'తమ్ముళ్లు'
‘మీలో కాపు సామాజికవర్గీయులెవరు?.. ఒకసారి చేతులెత్తండి’.. నగర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇచ్చిన ఈ పిలుపు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు కుతకుతలాడుతున్నారు. స్కూల్లో పిల్లల్ని ఆదేశించినట్లు తమను చేతులెత్తమనడమేంటి?.. అయినా పాతికేళ్ల నుంచి పార్టీలో ఉన్నాం. ఎవరు.. ఏ సామాజికవర్గానికి చెందినవారో నగర అధ్యక్షుడికి ఇంతవరకు తెలియకపోవడమేంటని మథనపడుతున్నారు. ► వాసుపల్లి ప్రశ్నతో గతుక్కుమన్న టీడీపీ కాపు నేతలు ► 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా గురించి చెప్పుకోవాలా? ► ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కుతున్న ఆ వర్గీయులు ► దసపల్లా హిల్స్ కబ్జాపై టీడీపీ దొంగాట ► కబ్జా చేస్తూ ఆ కొండ తమదేనని బుకాయింపు విశాఖపట్నం: ఒక సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకుందామంటూనే.. టీడీపీ నగర శాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ అనాలోచితంగా అన్న మాటలు ఆ ప్రయత్నానికే గండికొట్టేలా పరిణమించాయి. శుక్రవారం జరిగిన పార్టీ నగర శాఖ సమావేశంలో వాసుపల్లి మాట్లాడుతూ కాపు సామాజికవర్గం పార్టీకి దూరం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. టీడీపీయే ఆ వర్గానికి న్యాయం చేస్తుందన్న వాదనను వినిపించడానికి ఈ నెల 25న ఓ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తటస్థులుగా ఉన్న కాపు వర్గీయులు కూడా ఆ సమావేశానికి వచ్చేట్లు చూడాలి అన్నారు. అంతా చెప్పిన తరువాత ‘ఇంతకీ ఈ సమావేశానికి వచ్చిన వారిలో కాపు కులస్తులు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి’ అని వాసుపల్లి అన్నారు. దాంతో సమావేశంలో పాల్గొన్న కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు బిత్తరపోయారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అధికార ప్రతినిధి పాతర్లగడ్డ రంగబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విల్లా రామకృష్ణ, ఆరిలోవ డివిజన్ పార్టీ అధ్యక్షుడు మోది అప్పారావు, మాజీ కార్పొరేటర్ బండారు శ్రీనివాసరావు తదితర సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. పాతికేళ్లుగా వారంతా టీడీపీలో ఉన్నారు. వాస్తవానికి వాసుపల్లి కంటే ఎంతో సీనియర్లు. కానీ వాసుపల్లి వ్యాఖ్యలతో పార్టీ సమావేశంలో తాము కాపు సామాజికవర్గానికి చెందినవారమని చేతులు పెకైత్తి చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందా? అని ఆవేదన చెందారు. పాతికేళ్లుగా పార్టీలో ఉన్న తాము ఎవరిమో కూడా నగర పార్టీ అధ్యక్షుడికి తెలియదా?.. ఇప్పుడు మేము చేతులు పెకైత్తి మా పేరు, సామాజికవర్గం గురించి కొత్తగా చెప్పుకోవాలా?.. అని లోలోన మథనపడ్డారు. దసపల్లా హిల్స్ కబ్జాపై కథలు చెప్పండి కాగా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి నగర నడిబొడ్డున దసపల్లా హిల్స్ ప్రాంతంలో రెవెన్యూ పోరంబోకు కొండను కబ్జా చేస్తున్న వ్యవహారంపై వాసుపల్లి మల్లగుల్లాలు పడ్డారు. లోకేష్ కనుసన్నల్లో రూ.60 కోట్ల విలువైన కొండను కబ్జా చేస్తూ పార్టీ కార్యాలయం నిర్మించనున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దాంతో టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలపై చర్చించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామనే వాదనను వినిపించమని వాసుపల్లి గణేష్ పార్టీ నేతలను ఆదేశించారు. కానీ వాస్తవానికి టీడీపీకి 1999-2004 మధ్య కేవలం 2వేల చదరపు గజాలు మాత్రమే కేటాయించారు. అందులో అప్పట్లోనే కార్యాలయం నిర్మించారు. ప్రస్తుతం దాదాపు రెండు ఎకరాల కొండను తొలిచేసి భారీ కార్యాలయాన్ని నిర్మంచనున్నారు. దీనిపై ప్రజలకు ఎలా కట్టకథలు చెప్పాలని అని టీడీపీ నేతలే విస్మయం చెందుతున్నారు.