ఘనంగా ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌ | Grand Wedding Reception of MLA Vasupalli Ganesh son Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఘనంగా ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌

Published Wed, Aug 10 2022 1:17 PM | Last Updated on Wed, Aug 10 2022 1:26 PM

Grand Wedding Reception of MLA Vasupalli Ganesh son Visakhapatnam - Sakshi

పుష్పగుచ్ఛం అందిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున

సాక్షి, సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కుమారుడు సూర్య, రాశిల వివాహ రిసెప్షన్‌ బీచ్‌ రోడ్డులోని ఎంజీఎం పార్కులో మంగళవారం ఘనంగా జరిగింది. నూతన వధూవరులకు ఉమ్మడి విశాఖ వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తిరుపతి ప్రసాదం అందించారు. తిరుమల నుంచి వచ్చిన అర్చక బృందం వేద మంత్రాలతో దంపతులను ఆశీర్వదించారు.


వధూవరులను ఆశీర్వదిస్తున్న టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రజిని, మంత్రి బూడి తదితరులు 

ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, రాజన్న దొర, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కొలగట్ల వీరభద్రస్వామి, గంటా శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, బి.అప్పలనాయుడు, అప్పలనర్సయ్య, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, పి.వి.ఎన్‌.మాధవ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి, రైల్వే డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ జి.లక్ష్మీశ, పోర్ట్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కె.కె.రాజు, వైఎస్సార్‌సీపీ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనందరావు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ మేయర్లు కటుమూరి సతీష్‌ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు జాన్‌వెస్లీ, కోలా గురువులు, సీతంరాజు సుధాకర్, వడ్డాది మధుసూదనరావు, జీసీసీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నాయకులు, పార్టీ శ్రేణులు, వివిధ విభాగాల అధికారులు కొత్తజంటను దీవించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement