సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను ఆయనకు విన్నవించారు. వీటితోపాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సీఎం చెప్పడం సంతోషం అనిపించిందని వాసుపల్లి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సీఎం కోరారని చెప్పారు. (దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment