టీడీపీ మహిళా నేత దౌర్జన్యం | Dwcra woman dragged, assaulted by TDP leader simhachalam in Visakha | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో టీడీపీ మహిళా నేత దౌర్జన్యం

Published Fri, Aug 2 2019 11:41 AM | Last Updated on Fri, Aug 2 2019 1:08 PM

Dwcra woman dragged, assaulted by TDP leader simhachalam in Visakha - Sakshi

సాక్షి, విశాఖ : అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు, పార్టీ కార్యకర్తలు అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ అండదండలతో విశాఖ జిల్లాలో టీడీపీ మహిళానేత, డ్వాక్రా సంఘనేతపై దాడి చేయడం తీవ్ర అలజడి రేపుతోంది. విశాఖ- పాతనగరంలో డ్వాక్రా గ్రూపులకు దేవుడమ్మ నాయకురాలు. ఆమె గ్రూపులోని సభ్యులను టీడీపీకి చెందిన కొల్లి సింహాచలం అనే మహిళ బెదిరించి తమవైపుకు తిప్పుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తనను  అనుచరులతో కొట్టించిందని ఆరోపించింది.

ముఖం,వీపుపై పిడిగుద్దులు కొట్టారని,.ఈ విషయాన్ని విశాఖ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకూ సింహాచలంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు. సింహాచలం నుంచి దేవుడమ్మకు ప్రాణహాని ఉందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సింహాచలం దాడులు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవుడమ్మపై దౌర్జన్యం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement