DWCRA
-
కూటమి పాలనలో కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
-
మహిళలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: డ్వాక్రా మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేశామని పేర్కొన్న భట్టి విక్రమార్క.. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు. -
సీఎం జగన్ గురించి మహిళ ఎమోషనల్ మాటలు
-
విజయనగరం జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికసాయం
-
విశాఖలో అఖిల భారత డ్వాక్రా బజార్ (ఫొటోలు)
-
అక్కచెల్లెమ్మలకు అండగా సీఎం జగన్
మాచర్ల రూరల్(పల్నాడు జిల్లా): ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఐదు మండలాలకు చెందిన డ్వాక్రా సభ్యులకు రూ.4.01 కోట్ల విలువైన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాని వారు ఎవరైనా ఉంటే తనను సంప్రదించవచ్చని, త్వరలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తానే గడపగడపకూ వస్తున్నానని ప్రకటించారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శవంతమైన పాలనను సీఎం జగన్ అందిస్తున్నారని కొనియాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాబు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీలు బూడిద మంగమ్మ, దాసరి చౌడేశ్వరి, యేచూరి సునీత శంకర్, శారద శ్రీనివాసరెడ్డి, రూప్లీబాయి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు శేరెడ్డి గోపిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మండ్లి మల్లుస్వామి, యలమంద, మార్కెట్ యార్డు చైర్మన్లు వెలిదండి ఉమా గోపాల్, పల్లపాటి గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని వినియోగించుకోవాలి మాచర్ల: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకాన్ని వెనుకబడిన మాచర్ల నియోజకవర్గంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో మెట్ట రైతులు నీరు లేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు వైఎస్సార్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి బోరు సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు వివిధ పథకాలు చేపడుతోందన్నారు. అందులో భాగంగా మెట్ట రైతుల నీటి సమస్య తీర్చేందుకు వైఎస్సార్ జలకళ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి బోరు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
మాస్కులు పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయనకు మెప్మా మిషన్ డైరెక్టర్ నవీన్ కుమార్ మాస్కులను అందచేశారు. స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన మాస్క్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, మెప్మా అడిషనల్ డైరెక్టర్ శివపార్వతి పాల్గొన్నారు. (ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు: సీఎం జగన్) కాగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో... విపత్కర పరిస్థితుల్లోనూ మహిళలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు అవకాశం కలిగింది. అయితే ఈ మాస్క్‌ల తయారీని కాంట్రాక్టర్లకు అప్పగించకుండా నేరుగా స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే మాస్కులకు అవసరమైన క్లాత్‌ను ఆప్కోనుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 16 కోట్ల మాస్కులు తయారుచేయడానికి 1 కోటి 50 లక్షల మీటర్లకుపైగా క్లాత్ అవసరం అవుతోంది. ఇప్పటికే 20 లక్షలకు పైగా మీటర్ల క్లాత్‌ను ఆప్కో నుంచి తీసుకున్నారు. మిగతా క్లాత్ త్వరలోనే అందబోతోంది. (కరోనా నుంచి రక్షణకు సరికొత్త మాస్క్‌లు) స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 40వేల మంది టైలర్లను గుర్తించారు. యుద్ధప్రాతిపదికన వారితో పనిచేయిస్తున్నారు. ఒక్కో మాస్క్‌కు దాదాపు రూ.3.50 చొప్పున సుమారు రూ.500లకుపైనే ప్రతి మహిళకూ ఆదాయం లభించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 7,28,201 మాస్క్‌లు తయారుచేయగా వీటిని పంపిణీ కోసం తరలిస్తున్నారు. వచ్చే 4–5 రోజుల్లో రోజుకు 30 లక్షల చొప్పున మాస్క్‌లు తయారీ కోసం సన్నద్ధమవుతున్నారు. మాస్క్‌ల తయారీ, పంపిణీలపై వివరాలతో కూడా రియల్‌టైం డేటాను ఆన్లైన్లో పెడుతున్నారు. (‘16 కోట్ల మాస్కులు తయారు చేసింది ఏపీ మహిళలే’) -
టీడీపీ మహిళా నేత దౌర్జన్యం
సాక్షి, విశాఖ : అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు, పార్టీ కార్యకర్తలు అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అండదండలతో విశాఖ జిల్లాలో టీడీపీ మహిళానేత, డ్వాక్రా సంఘనేతపై దాడి చేయడం తీవ్ర అలజడి రేపుతోంది. విశాఖ- పాతనగరంలో డ్వాక్రా గ్రూపులకు దేవుడమ్మ నాయకురాలు. ఆమె గ్రూపులోని సభ్యులను టీడీపీకి చెందిన కొల్లి సింహాచలం అనే మహిళ బెదిరించి తమవైపుకు తిప్పుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తనను అనుచరులతో కొట్టించిందని ఆరోపించింది. ముఖం,వీపుపై పిడిగుద్దులు కొట్టారని,.ఈ విషయాన్ని విశాఖ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకూ సింహాచలంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు. సింహాచలం నుంచి దేవుడమ్మకు ప్రాణహాని ఉందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సింహాచలం దాడులు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవుడమ్మపై దౌర్జన్యం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పథకాల నగదు లబ్ధిదారులకే అందాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ డబ్బుల్ని బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులు, డ్వాక్రా సభ్యులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. సున్నా వడ్డీ కింద లబ్ధిదారుల తరఫున చెల్లించాల్సిన వడ్డీ డబ్బుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు. రుణాల వసూళ్ల విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను వేధింపులకు గురి చేయొద్దని బ్యాంకర్లకు సూచించారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు కరువు రావడంతో రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని, రుణభారంతో కుంగిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచకపోతే పరిణామాలు ప్రమాదకరంగా మారతాయన్నారు. ఈ విషయాన్ని గమనించే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, నిలదొక్కుకునేలా చూసేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచనతోనే మే నెలలో రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 నేరుగా ఇవ్వబోతున్నట్లు బ్యాంకర్లకు తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో రైతు వద్ద సగటున 1.25 ఎకరాలు మాత్రమే భూమి ఉందని, ఇలాంటి రైతులందరికీ పెట్టుబడి వ్యయంలో దాదాపుగా 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే ఉద్దేశంతోనే రైతు భరోసాను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఇస్తున్న ఈ సొమ్మును, ఇంతకుముందు వారికి ఉన్న అప్పులకు జమ చేసే వీలే ఉండకూడదని బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. రైతు భరోసా కింద గానీ, నవరత్నాల్లో భాగంగా అమలు చేయబోతున్న మరే సంక్షేమ పథకాల్లో గానీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే నగదును జమ చేసుకోవడానికి వీల్లేని విధంగా ఖాతాలను తెరవాలని స్పష్టం చేశారు. ప్రతీ పైసా నేరుగా అందాలి అలాగే రాష్ట్రంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉందని, జాతీయ స్థాయిలో నిరక్షరాస్యత 26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉందన్నారు. ఈ పరిస్థితులు మార్చి ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకే ‘అమ్మ ఒడి’ కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని వారికి కూడా నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. నవరత్నాల్లోని ఈ పథకాలన్నింటి ద్వారా తాము అందించబోయే ప్రతి పైసా వారికే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. నిజంగా ఈ రుణ మొత్తం ఇస్తున్నారా? ఎస్ఎల్బీసీ నివేదికలో ఏటేటా వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు పెరుగుతున్నట్టు చూపిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఈ డబ్బు అంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? లేదా పాత రుణాలను రీషెడ్యూల్ చేయడం వల్ల పెరుగుతున్నాయా అంటూ బ్యాంకర్లను ప్రశ్నించారు. కొత్త అప్పులు ఇవ్వకుండా పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడం వల్ల ఈ అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు అంగీకరించారు. దీనివల్ల రైతులు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలపడకుండా మరింత అప్పుల పాలైనట్లు ఎస్ఎల్బీసీ సమావేశంలో తేలింది. గత ప్రభుత్వం సున్నా వడ్డీ కోసం చెల్లించాల్సిన తన వాటాను చెల్లించిందా అని సీఎం ఆరా తీయగా బ్యాంకర్ల నుంచి లేదన్న సమాధానం వచ్చింది. రైతులకు సున్నా వడ్డీ లభించకపోవడం, రుణమాఫీ రూ.87,612 కోట్లు చేస్తానని చెప్పి చివరకు రూ.15 వేల కోట్లు కూడా చేయకపోవడంతో రైతులు పూర్తిగా అప్పులు పాలైన విషయాన్ని పాదయాత్రలో స్వయంగా చూసినట్లు సీఎం తెలిపారు. రూ.87,612 కోట్ల రుణాల మీద ఏటా రైతులు రూ.7 వేల నుంచి 8 వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు ప్రభుత్వం ఏటా సగటున రూ.3 వేల కోట్లు కూడా రుణమాఫీకి విడుదల చేయలేదని, దీనివల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. శనగ రైతులకు ప్రభుత్వ అండ రాయలసీమలో ఎక్కువగా శనగ రైతులు మద్దతు ధర సమస్యను ఎదుర్కొంటున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చేతికొచ్చిన పంటకు తగు మద్దతు ధర రానప్పుడు కలిగే రుణ భారం నుంచి ఉపశమనం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ధర పడిపోయినందున సరకుపై రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు సరకు వేలంను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకర్లను కోరారు. అప్పటికీ ధర రాకపోతే శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1700 ప్రభుత్వమే చెల్లించే ఆలోచన చేసి ఆదుకుంటుందని ప్రకటించారు. బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్ర బోస్, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు జె.పకీరస్వామి, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్ శుభ్రత్ దాస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.శెల్వరాజ్ పాల్గొన్నారు. 2019-20 పంట రుణాల లక్ష్యం.. రూ.1,15,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణాల మాఫీ వాగ్దానం వల్ల రైతులకు లాభం జరగకపోగా వారు మరింతగా అప్పులు పాలయ్యారని స్పష్టమైంది. 2014, మార్చి 31 నాటికి రూ.87,612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు 2019, మార్చి 31 నాటికి అంటే ఐదేళ్ల తర్వాత రూ.1,49,264 కోట్లకు పెరిగాయి. అలాగే డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోవడంతో 2014, మార్చి 31న రూ.14,204 కోట్లు ఉంటే, 2019, మార్చి 31న అవి రూ.27,451 కోట్లకు పెరిగాయి. 2018–19లో మొత్తంగా రూ.1,01,564 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయిస్తే రూ.1,06,560 కోట్లు రైతులకు అందించామని, 2019–20లో రూ.1,15,000 కోట్లు వ్యవసాయానికి ఇవ్వాలని సంకల్పిస్తున్నామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తన లక్ష్యాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచింది. ఇందులో స్పల్పకాలిక పంట రుణాల కింద రూ.84,000 కోట్లు, టర్మ్ రుణాలు రూ.24,000 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. స్వల్పకాలిక పంట రుణాల లక్ష్యంలో రూ.8,400 కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇతర రంగాల రుణాలను కూడా కలుపుకుంటే 2019–20 సంవత్సరానికి మొత్తం రూ.2,29,200 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. -
రైతు ప్రాణం తీసిన ‘పసుపు–కుంకుమ’
సాక్షి, కురబలకోట (చిత్తూరు జిల్లా): ప్రభుత్వ పసుపు– కుంకుమ పథకం కారణంగా ఓ రైతు భార్య తన ‘పసుపు, కుంకుమ’ కోల్పోయింది. డ్వాక్రా గ్రూపుల్లో నగదు పంపిణీ సక్రమంగా జరక్కపోవడంతో చోటుచేసుకున్న గొడవ కారణంగా మనస్తాపం చెందిన రైతు రెండు రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం రోడ్డు పక్కన నిర్జన ప్రదేశంలో రేకుల షెడ్డులో ఆయన శవం లభ్యమైంది. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి చిత్తూరు జిల్లా ముదివేడు ఎస్ఐ నెట్టి కంఠయ్య కథనం ప్రకారం.. కురబలకోట మండలం పుల్లగూరవారిపల్లెకు చెందిన పి.నరసింహారెడ్డి (66) వ్యవసాయదారుడు. అతనికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజమ్మ డ్వాక్రా గ్రూపులో ఉంది. పసుపు–కుంకుమ కింద తొలి విడత రూ. 2,500 వచ్చింది. ఆ తర్వాత రావాల్సిన డబ్బు రూ. 7,500 ఇవ్వలేదు. ఈ విషయమై ఆయన కుమారులు నాలుగు రోజుల కిందట డ్వాక్రా గ్రూపు లీడర్‌ను అడిగారు. కొంత డబ్బు ముట్టచెబితే ఇస్తామని ఆమె చెప్పడంతో వారి మధ్య గొడవ మొదలయ్యింది. అసలే ఘర్షణలు, కొట్లాటలు ఏమాత్రం నచ్చని నరసింహారెడ్డి కుమారులను వారించాడు. కోపంలో ఉన్న కుమారులు తన మాట వినకపోవడంతో నరసింహారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ముదివేడు క్రాస్‌కు పనిమీద వెళుతున్నానని వెళ్లిన ఆయన కన్పించకుండా పోయాడు. బుధవారం ఉదయం ముదివేడు క్రాస్ దగ్గర అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనున్న ఓ రేకుల షెడ్డులో రైతు శవమై కన్పించాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శవం కుళ్లిన స్థితికి చేరుకోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. శవం పక్కన పురుగుమందు డబ్బాలు కన్పించాయని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న వివాదం కారణంగా కుటుంబపెద్ద ప్రాణాలు తీసుకోవడంతో భార్య, కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పసుపు–కుంకుమ డబ్బుల వల్ల దారితీసిన గొడవతో రైతు మృతి చెందడంపై వెలుగు అధికారులను విచారించగా.. డ్వాక్రా సభ్యురాలికి డబ్బులు ఇవ్వని సమస్య తమ దృష్టికి రాలేదన్నారు. -
టీడీపీపై డ్వాక్రా మహిళల తిరుగుబాటు
-
మైదుకూరులో డ్వాక్రా మహిళల ధర్నా
-
పసుపు-కుంకుమ బూటకమంటూ ఆగ్రహం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా సత్యవేడులో టీడీపీ అభ్యర్థిని డ్వాక్రా మహిళలు నిలదీశారు. చంద్రబాబు తీసుకువచ్చిన పసుపు-కుంకుమ వట్టి బూటకమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పసుపు-కుంకుమ డబ్బులు తీసుకునేందుకు వందలాది మంది మహిళలు ఇరుగులం బ్యాంక్ వద్దకు వచ్చారు. అయితే పాత బకాయిలు చెల్లిస్తేనే పసుపు-కుంకుమ డబ్బులు ఇస్తామని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పడంతో మహిళలు నిరసనకు దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నా.. బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేతలను కడిగిపారేసిన మహిళలు.. ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీంతో టీడీపీ సత్యవేడు అభ్యర్థి జేడీ రాజశేఖర్ మహిళలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. -
చంద్రబాబే మాకు బాకీ
డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం – 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బాబు హామీ ‘‘డ్వాక్రా మహిళలందరికీ చెబుతున్నా.. మీ అప్పులన్నీ నేను మాఫీ చేస్తాను. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు. మీరిక నిశ్చింతగా ఉండొచ్చు’’. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు ఊరూరా తిరిగి ఇలా నమ్మబలికారు. ఎన్నికలు ముగిశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనడం చంద్రబాబు సహజ నైజం. అందుకే నాలుగున్నరేళ్లలో ఒక్కరోజు కూడా డ్వాక్రా అక్కచెల్లెమ్మలు గుర్తుకురాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. మరోవైపు వడ్డీతో సహా కట్టాల్సిందేనంటూ బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతోపాటు అవమానిస్తుండటంతో..అప్పోసప్పోచేసి, తినోతినకో రుణాలు చెల్లిస్తున్నారు మహిళలు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. అకస్మాత్తుగా చంద్రబాబుకు డ్వాక్రా మహిళలు గుర్తుకొచ్చారు. ఏదో ఒక మాయ చేయాలి. అంతే.. పసుపు–కుంకుమ పల్లవి అందుకున్నారు. రుణమాఫీ చేస్తానని నాలుగున్నరేళ్లు మాయ చేసి.. ఇప్పుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ పేరిట మళ్లీ అప్పులు ఇస్తున్నారని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. పసుపు కుంకుమ కింద ఇస్తానంటున్న పదివేలు పోగా.. ఇంకా చంద్రబాబే తమకు బాకీ ఉన్నాడని అక్కచెల్లెమ్మలు కుండబద్దలు కొడుతున్నారు. లంకిరెడ్డి విద్యాధర్‌రెడ్డి సాక్షి, అమరావతి: ‘డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాను.. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు అంటూ.. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు చెబితే నమ్మామని.. నాలుగున్నరేళ్లు రుణాల మాఫీ ఊసే ఎత్తలేదని డ్వాక్రా మహిళలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు ‘పసుపు కుంకుమ’ అంటూ కొత్త పథకం ప్రకటించి.. అప్పు ఇస్తూ పసుపు కుంకుమ పవిత్రతను దెబ్బతీస్తున్నారని అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ మహిళలను మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వెలుగు అధికారులు జారీ చేసిన అంతర్గత సర్క్యులర్‌లో.. ‘కేవలం సంఘాల పొదుపు ఖాతాలో మాత్రమే సభ్యులు అప్పులు తీసుకొను నిమిత్తం జమ చేస్తారు’ అని పేర్కొన్నారు. దీన్ని బట్టి పసుపు కుంకుమ పథకంతో డ్వాక్రా సంఘాలకు మళ్లీ అప్పులు మిగిల్చే పరిస్థితి ఎదురుకానుందని మహిళా సంఘాల నేతలు వాపోతున్నారు. మహిళలకు ఉచితంగా పదివేలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ.. చంద్రబాబు మళ్లీ వారిని మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ పెరిగిపోయి..రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్వాక్రా రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు మళీ ఎన్నికలు రాగానే పసుపు కుంకుమ పేరుతో ముష్టేస్తున్నారని మరికొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా రుణమాఫీ చేయలేదని సాక్షాత్తు మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా రాత పూర్వకంగా చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పొదుపు సంఘాలకు పసుపు–కుంకుమ నగదును అప్పుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ చెల్లని చెక్కులిచ్చి మరోవైపు చెక్కులు బ్యాంకుల్లో మార్చుకునేందుకు మహిళలు నానాపాట్లు పడుతున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ.. చెక్కులు మార్చేకునేందుకు వెళితే కొన్నిచోట్ల చెల్లడం లేదని డ్వాక్రా సంఘాల ఫిర్యాదులు గత వారం రోజులు నుంచి అధికమయ్యాయి. రాష్ట్రంలో 95 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.9వేల కోట్లను తానే ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు సభల్లో ప్రకటించడాన్ని మహిళా సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. టీడీపీ నాయకుల పెత్తనం పసుపు–కుంకుమ చెక్కులను ఆయా గ్రామాల్లో స్ధానిక టీడీపీ నేతల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. చెక్కులు ఇచ్చేటప్పుడు టీడీపీ నాయకులు తమ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని డ్వాక్రా మహిళలు పేర్కొంటున్నారు. ఆర్ధిక సాయం అందించామని తమపై టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ప్రచారానికి పిలిచినా రావాలంటూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారని డ్వాక్రా సంఘాలు వాపోతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లు ఓ వైపు కొనసాగుతుండగా.. మరోవైపు వెలుగు అధికారులు సీఎం సభలకు వెళ్లాలని.. పోలవరం యాత్రలకు పోవాలంటూ బలవంతంగా పంపుతున్నారని డ్వాక్రా మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైసా కూడా డ్వాక్రా రుణమాఫీ చేయలేదని అసెంబ్లీలో మంత్రి పరిటాల సునీత ప్రకటనకు సంబంధించిన వార్త క్లిప్పింగ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు- 9,53,571 డ్వాక్రా సభ్యుల సంఖ్య- 95,69,080 బాబు హామీ ఇచ్చినప్పుడు డ్వాక్రా రుణాలు- రూ. 14,204 కోట్లు రుణాలు మాఫీ కాక వడ్డీలు పెరిగిపోయి ప్రస్తుతం- రూ. 25,424 కోట్లు చంద్రబాబే నాకు రూ.15వేలు బాకీ నా పేరు టి.కృపామణి. ప్రకాశం జిల్లా పర్చూరు. ఎన్నో ఏళ్లుగా స్వయం సహాయక సంఘంలో పొదుపు చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నా. మా గ్రూపు చేస్తున్న పొదుపు కారణంగా గతంలో బ్యాంకు నుంచి రూ.2లక్షలు రుణంగా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.20వేల వంతున రుణం దక్కింది. చంద్రబాబు 2014లో ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. దాంతో నేను తీసుకున్న రుణానికి వడ్డీ రూ.15వేలు అయింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.35వేల వరకు చెల్లించా. ఇప్పుడు పసుపు–కుంకుమ కింద ఇస్తానన్న రూ.10వేలు, గతంలో ఇచ్చిన రూ.10వేలు కలుపుకున్నా..చంద్రబాబే నాకు ఇంకా రూ.15వేల వరకు బాకీ ఉన్నాడు. చంద్రబాబు ఇస్తున్న రూ.పదివేలతోనే మాకు ఏదో అద్భుతం జరుగుతుందని, కష్టాలన్నీ గట్టెక్కుతాయని చెబుతున్నారు. ఆయన డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ గురించి మాట్లాడటం లేదు. ఇచ్చిన ఈ డబ్బు కూడా అప్పుగా ఇచ్చారా అనే అనుమానం కలుగుతోంది. మాఫీ అని మాయ చేసి.. ఎన్నికల ముందు ముష్టి నా పేరు.. కట్టా సుజ్ఞానమ్మ. మాది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు. గతంలో పావలా వడ్డీ పథకం కింద మేలు జరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న రుణానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. డ్వాక్రా రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు మాయ చేసి..ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు ముష్టేస్తున్నారు. ఇన్నాళ్లూ గుర్తుకు రాని పసుపు–కుంకుమ పథకం బాబుగారికి ఎన్నికల ముందు జ్ఞాపకం వచ్చింది. ఆయన జేబులో నుంచి మాకు ఈ డబ్బులు ఇవ్వడం లేదు కదా. చంద్రబాబు ఏ సభ పెట్టినా.. మమ్మల్ని ఒత్తిడి చేసి సభలకు తరలించారు. ఎన్ని పనులున్నా..చేసేదేమీ లేక సభలకు వెళ్లాం. పసుపు–కుంకుమ కింద రూ.పదివేలిచ్చి అదేదో తమ సొంత డబ్బు ఇచ్చినట్లు టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా నిలబెడుతుంది నా పేరు దండిప్రోలు లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం 21వ వార్డు. నా భర్త అనారోగ్యంతో ఏపనీ చేయలేడు. కుమారుడు, కుమార్తె వివాహాలు కావడంతో వారి పిల్లలతో కుటుంబాలను పోషించుకుంటూ తంటాలు పడుతున్నారు. నేను ఇంటి వద్ద లేసు అల్లికలు చేస్తూ, చీపుర్లూ అల్లుతూ ఎంతోకొంత సంపాదించుకుంటున్నా. 2007 నుంచి డ్వాక్రా గ్రూపులో ఉన్నా. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాననే చంద్రబాబు హామీతో వాయిదాలు కట్టలేదు. నిక్షేపంగా నెలనెలా అప్పులు కడుతూ.. మళ్లీ రుణాలు తీసుకునే వాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తామంటే.. అప్పులు కట్టడం మానేశాం. తరువాత బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వడ్డీతో సహా కట్టాం. ఇప్పుడు ఇస్తున్న పసుపు కుంకుమ మాకు అప్పులకు కూడా సరిపోదు. అది అప్పేనని సాక్షాత్తు ప్రభుత్వ సర్క్యులర్‌లోనే పేర్కొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి 40–60 సంవత్సరాలోపు మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఏడాదికి కొంత చొప్పున రూ.75వేలు ఇస్తామంటున్నారు. వైఎస్సాఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణాల మొత్తం మహిళ చేతికే ఇస్తామని, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని, సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పిస్తామని జగన్ చెబుతున్నారు. అలా చేస్తే మా బతుకులు మారతాయని నమ్ముతున్నాం. రుణ మాఫీ కాక.. అప్పుచేసి బాకీ తీర్చాం నా పేరు పెదశింగు రామలక్ష్మి. మాది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం, పీచుపాలెం ప్రాంతం. నేను మత్స్యకార మహిళను. భర్త కోటేశ్వరరావు, పెయింటింగ్ పనిచేస్తాడు. నాకు ఇద్దరు పిల్లలు. 1999 నుంచి సంగీత పేరుతో ఏర్పడిన డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నా. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014 ఎన్నికలకు ముందు నమ్మిస్తే.. రుణాలు కట్టలేదు. దాంతో ఆ రుణాలకు వడ్డీలు రూ.12వేలుపైనే కట్టాం. 2014 ఎన్నికల నాటికి మా గ్రూపునకు రూ.4.80లక్షలు అప్పు ఉంది. అధికారంలోకి వస్తే మొత్తం రుణమాఫీ చేస్తామంటే.. అప్పుకట్టలేదు. 2016 నాటికి వడ్డీ రూ 1.20లక్షలు దాటింది. బ్యాంకువారు నోటీసులు పంపితే అప్పులు చేసి బాకీలు తీర్చాం. మా గ్రూపులో ఒక్కొక్కరూ రూ.12వేలు పైనే వడ్డీకట్టారు. మేం కట్టిన వడ్డీలు అన్నీ కలుపుకుంటే రూ.20వేలు వరకూ లెక్క వస్తుంది. మాకు పసుపు కుంకుమ అని మొన్న రూ.10వేలు చెక్కులు ఇచ్చారు. ఇందులో ఒక చెక్కు మారింది. ఇక మాకు పసుపు కుంకుమ ఎక్కడ ఇచ్చినట్టు? ఇప్పుడిస్తున్న రూ.10వేలు పసుపు కుంకుమ డబ్బు మేం కట్టిందే. మా డబ్బులు మాకిచ్చి.. హంగామా చేయడం ఏమిటి? మమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారు చంద్రబాబు. పసుపు కుంకుమ పేరుతో అప్పా? మా డ్వాక్రా గ్రూపు బ్యాంకు నుంచి రూ.2లక్షలు రుణం తీసుకొని పొదుపు చేసుకుంటూ... ఆర్ధిక పరిపుష్టి సాధించాం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెబితే.. రుణం చెల్లించలేదు. కాని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. దాంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ పెరిగిపోయింది. చేసేదేమీ లేక వన్‌టైం సెటిల్మెంట్ కింద బ్యాంకుకు రుణం చెల్లించాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు రుణ మాఫీ చేయకుండా... పసుపు కుంకుమ పేరుతో మా దగ్గర నుంచి తీసుకున్న వడ్డీ డబ్బులే మాకు ఇవ్వడం ఏమిటి? చంద్రబాబు మాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితిలో అప్పో,సప్పో చేసి బ్యాంకులకు రుణాలు కట్టాం. పసుపు కుంకుమ పేరిట చంద్రబాబు మోసం చేస్తున్నారు. – బాబు తీరుపై మండిపడుతున్న గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంకు చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు శాంతారా, ఎస్కే జాన్‌బీ, రమీజా, మోతి, అషిరిన్ -
టీడీపీ నేతల బరితెగింపు..
సాక్షి, విశాఖపట్నం: ‘మీకు చెక్కు–చీర–గొడుగు కావాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని దేవుడి మీద ప్రమాణం చేయాలి. అది కూడా మేము చెప్పినట్లే ప్రమాణం చేయాలి. లేదంటే మీకు రూ.10 వేల చెక్కు, చీర, గొడుగు ఇవ్వం’. ఇదీ టీడీపీ నేతల బరితెగింపు. అసలేం జరిగిందంటే ..గురువారం సాయంత్రం నర్సీపట్నం మున్సిపాలిటీలోని 26వ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం పంచుతున్న ‘పసుపు–కుంకుమ చెక్కుల కోసం ఆ వార్డులో ఉన్న డ్వాక్రా మహిళలు హనుమాన్ ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చిన్న కుమారుడు రాజేష్ చేతుల మీదుగా చెక్కులు, చీరలు, గొడుగులు పంపిణీ చేశారు. అంతకన్నా ముందు హనుమాన్ ఆలయంలో డ్వాక్రా మహిళలతో ‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని, ఎవరి ఒత్తిడికి .. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వబోమని దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. తప్పని పరిస్థితుల్లో ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలంతా ప్రమాణం చేయక తప్పలేదు. మున్సిపల్ కౌన్సిలర్ పైల గోవింద్, వార్డు మాజీ మెంబర్, రిటైర్డ్ టీచర్ రుత్తల తాతీలు పాల్గొని డ్వాక్రా మహిళలతో ప్రమాణం చేయించారు. కాగా సీఎం చంద్రబాబునాయుడు తరఫున పసుపు–కుంకుమ కింద మహిళలకు రూ.10 వేలు ఇస్తుంటే.. మా కుటుంబం తరఫున మహిళలకు చీరలు ఇస్తున్నామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగ సభల్లో చెబుతున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో మంత్రి సతీమణి పద్మావతి, తనయులు విజయ్, రాజేష్ తమ అనుచరులతో ముందస్తు ఎరగా ముమ్మరంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. ఏదో చీర ఇస్తామంటే వెళ్లాం కానీ.. భగవంతుడి సన్నిధిలో పిల్లా పాపలతో ఉన్న తమచేత ప్రమాణం చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిరాశగా వెనుదిరిగిన డ్వాక్రా మహిళలు..
సాక్షి, ఏలురు/పశ్చిమగోదావరి : డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ... ఎన్నికల ముందు మరో మోసానికి తెరలేపారు. పసుపు కుంకుమ కార్యక్రమం పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. రుణాలను మాఫీ చేయకపోగా తమకు చెల్లని చెక్కులు ఇచ్చారని డ్వాక్రా సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన చెక్కులను బ్యాంకు అధికారులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నారని వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. (‘డ్వాక్వా’పై దద్దరిల్లిన కౌన్సిల్) తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమల్లి మండలం కామయ్యపాలెంలోనూ టీడీపీ ప్రభుత్వ మోసం బయటపడింది. ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో చెక్కులు కొందరికి మాత్రమే వచ్చాయని డ్వాక్రా మహిళలు చెప్తున్నారు. ఆ చెక్కులు తీసుకుని బ్యాంక్‌కు వెళితే.. పాత బాకీలో జమ చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న చేతిలో మరోసారి మోసపోయామని నిరాశతో ఇళ్లకు వెనుదిరిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో డ్వాక్రా సభ్యులెవరూ ఆ రుణాలు చెల్లించలేదు. దాంతో అసలుతో పాటు వడ్డీ కూడా తడిసి మోపెడు అయింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో .... ఓట్లు రాబట్టకునేందుకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాల్సి రావడంతో టీడీపీ సర్కార్ పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చేతులు దులుపుకుంటుందని మహిళలుమండిపడుతున్నారు. -
డ్వాక్రా మహిళల ఆకలికేకలు
సాక్షి, అమరావతి : సెల్ ఫోన్, పదివేల నగదు ఇస్తామని నమ్మించి కనీసం భోజనం కూడా పెట్టలేదని సీఎం చంద్రబాబు నాయుడు సభలకు వెళ్లిన డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు బస్సుల్లో తీసుకెళ్లి, టీడీపీ నేతలు సభప్రాంగణంలో వదిలేశారని నిప్పులు చెరిగారు. సాయంత్రం ఆరు వరకు తిండితిప్పలను కూడా నేతలు పట్టించుకోలేదన్నారు. మహిళల ఆగ్రహంతో సాయంత్రం ఒక్కొక్కరికి రూ.20 చొప్పున పంపిణీ చేశారు. తిరుగు ప్రయాణానికి బస్సులు రావటం ఆలస్యం కావడంతో మహిళలు ఇబ్బందిపడ్డారు. నిన్నటి వరకు డ్వాక్రా మహిళలకు పదివేలు చొప్పున ఇస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈరోజు అమలు దగ్గరికి వచ్చే సరికి పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చేతులు దులుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో చెక్కులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక డబ్బులు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. మరోవైపు డ్వాక్రా సంఘాల ఆత్మీయ సమ్మేళనం పేరుతో చంద్రబాబు నిర్వహించిన సభకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. నందిగామ సోమవారం గ్రామానికి చెందిన జిల్లేపల్లి రామారావు అనే వ్యక్తి తన భార్య డ్వాక్రా సంఘాల బుక్ కీపర్ కావడంతో తనకు సహాయంగా ముఖ్యమంత్రి సభకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్థానిక కంచికచెర్ల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే రామారావు చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. అయితే సభకు వెళ్లిన మహిళలకు కనీస సదుపాయాలు లేవని ఉదయం బయలుదేరి వెళ్లిన వారికి కనీసం భోజన సదుపాయాలు కూడా కల్పించలేదని, ఖాళీ కడుపుతో తిరిగి వచ్చామని మార్గ మధ్యలో నీరసంగా ఉండి రామారావు గుండెపోటుకు గురయ్యారని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోందని, అయినా బ్యాలెన్స్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో సంక్షేమ కార్యక్రమాలకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఇవికాకుండా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాలకు రూ.వేల కోట్లు వెచ్చించామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇంత పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాష్ట్రం మరొకటి లేదని పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్లో సంక్షేమ రంగం, సామాజిక సాధికారితపై మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. సాంఘిక సంక్షేమానికి రూ.40,253 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.14,210 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.39,138 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,215 కోట్లు, కాపు కార్పొరేషన్‌కు రూ.3,004 కోట్లు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. సంక్షేమ రంగంలో తాము అమలు చేసిన కార్యక్రమాలు దేశానికే ఒక మోడల్ అని వెల్లడించారు. ధనిక రాష్ట్రాల్లోనూ ఇంత సంక్షేమం లేదు 2014 సంవత్సరానికి ముందు రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమం లేదని, తాను వచ్చాకే అన్నింటినీ గాడిన పెట్టానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు సంతృప్తకర స్థాయిలో నిత్యావసరాలను అందిస్తున్నామన్నారు. ఉపకార వేతనాలు, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని. ధనిక రాష్ట్రాల్లో కూడా ఇంత సంక్షేమం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా, అందులో లేనివి కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చూస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రూ.2,000 నోట్లను రద్దు చేస్తే తప్ప ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిలువరించలేమని స్పష్టం చేశారు. పోలవరం, రాజధాని కట్టి చూపించా.. ప్రతిపక్ష నాయకుడు అదిస్తాం, ఇదిస్తాం అని హమీలు గుప్పిస్తున్నారని, ఆయనకు ఏం అనుభవం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో మాటలు చెప్పి ఏమీ చేయలేదని, ఆయనకు అనుభవమైనా ఉందని, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకు అది కూడా లేకుండా అన్నీ చేస్తానని చెబుతున్నాడని విమర్శించారు. అన్నీ ఇస్తామని చెప్పిన తర్వాత ఏదీ ఇవ్వలేని పరిస్థితి వస్తే ఏంచేస్తారని, సంపద సృష్టించకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. తనను పోలవరం ప్రాజెక్టు నిర్మించలేరని, రాజధాని నిర్మించలేరని అన్నారని, ఇప్పుడు కట్టి చూపించానని పేర్కొన్నారు. ఏదో ఇచ్చేస్తారనేది ఊహ, ఇప్పుడు ఇస్తున్నది వాస్తవమని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఇక్కడ కాదు.. ఢిల్లీలో ధర్నా చేయాలి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాజీనామాపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసినట్లే తాడేపల్లిగూడేన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు స్థాపించలేకపోయామని, అందుకు భూములు లేవని చెప్పారు. రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదన్నారు. ధర్నా ఇక్కడ కాదు, ఢిల్లీలో చేయాలని హితవు పలికారు. పోలవరం నిధుల కోసం రాజీనామా చేయాలన్నారు. చంద్రబాబుతో ఒడిశా ఎంపీ సౌమ్యారంజన్ పట్నాయక్ భేటీ సీఎం చంద్రబాబుతో ఒడిశాకు చెందిన ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ మంగళవారం భేటీ అయ్యారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా వచ్చిన ఆయన చంద్రబాబును కలసి పలు అంశాలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు వంటి అంశాలపై ప్రస్తావించారు. -
డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు భరోసా : భూమన కరుణాకరరెడ్డి
చిత్తూరు, తిరుపతి సెంట్రల్ : జననేత జగన్ సీఎం కాగానే డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలను చెల్లిస్తారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు వేమూరి జ్యోతి ప్రకాష్, రాజారెడ్డిల ఆధ్వర్యంలో తిరుపతి నగరం ఐదో డివిజన్ కొర్లగుంట మారుతీనగర్ మహిళా సంఘాల ప్రతినిధులు శ్రీలత, రాధ, దేవి, భాగ్యలక్ష్మి, కస్తూరి, సావిత్రి, లక్ష్మి, ధనలక్ష్మి, జయమ్మ, సుబ్బమ్మ, ప్రేమకుమారి, ప్రమీల, నిర్మల, చిట్టెమ్మ, మోహన, తనూజ, సంధ్య, మంజుల, గిరిజ, మమత, సుజాత గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీలో చేరారు. వారికి భూమన కరుణాకరరెడ్డి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు చెల్లిస్తారన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం, ప్రాధాన్యం లభిస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్.జగన్‌ను సీఎంగా గెలిపించుకోవడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎస్కే.బాబు, దుద్దేల బాబు, ఎంవీఎస్ మణి, చెలికం కుసుమ, ఆరె అజయ్‌కుమార్, వాసుయాదవ్, చింతా రమేష్‌యాదవ్, బత్తల గీతాయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, తొండమల్లు పుల్లయ్య, రామకృష్ణారెడ్డి, రవి, చిమటా రమేష్, శాంతారెడ్డి, పద్మజ, పుష్పాచౌదరి పాల్గొన్నారు. -
‘చంద్రబాబును ఛీకొడుతున్నారు’
సాక్షి, విజయవాడ : డ్వాక్రా మహిళలనుద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన మాటలతో ఆయన బేలతనం బయపటపడిందని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు చంద్రబాబును ఛీకొడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్ విమర్శించారు. గురువారం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చన హామీ గుర్తులేదా అంటూ వారిని మోసం చేసిన విషయం మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. పసుపు, కుంకుమ పేరుతో మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో అక్కచెల్లెమ్మలు టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి డ్వాక్రా మహిళలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లు ఓట్లు కాదు వేయించేది చెంప చెల్లుమనేలా లెంపలేస్తారని ఎద్దేవాచేశారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఇంకా ఏ మొహం పెట్టుకొని బీసీ గర్జన పెడతావంటూ ప్రశ్నించారు. ఈనెల 28న విజయవాడలో గౌడ, శెట్టిబలిజ కులస్థుల సమావేశం, వారి సమస్యలపై వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ సమావేశం ఉంటుందని తెలిపారు. -
మోసాన్ని మరిపించేందుకు విచిత్రమైన ఎత్తుగడ
మీ బలవంతాన రాయించి ఇచ్చు పత్రమేమనగా..హామీ ఇచ్చి రుణాలు మాఫీ చేయకున్ననూ,వడ్డీ రాయితీ చెల్లించకున్ననూ,మాట నిలబెట్టుకున్న మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు – ఇట్లు సంఘ సభ్యులు సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి, ప్రజల ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కాక వాటిని నెరవేర్చకుండా మాటలతో మభ్యపెడితే అంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? హామీలను అమలు చేయకున్నా.. అన్నీ చేసేశా, మీరు చచ్చినట్లు ఒప్పుకో వాల్సిందేనంటూ జనంతో బలవంతంగా సంతకాలు చేయించుకుంటే దానికంటే అన్యాయం మరొకటి ఉంటుందా? రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అక్షరాలా ఇలాంటి పనే చేస్తోంది. తాను అధికా రంలోకి రాగానే డ్వాక్రా మహిళా సంఘాల రుణా లన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాక ఆ సంగతే మర్చిపోయారు. బాబు అధికారంలోకి వచ్చే నాటికి బ్యాంకుల్లో డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉండగా, ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే అసెంబ్లీలో ఈ నిజాన్ని అంగీకరించారు. రెండేళ్లుగా డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీని సైతం ప్రభుత్వం ఎగ్గొట్టింది. మహిళలను నమ్మించి, దగా చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తుండడంతో మోసాన్ని మరిపించేందుకు కొత్త డ్రామాకు తెరతీశారు. శిక్షణ ముసుగులో సంతకాల తంతు రాష్ట్రంలో డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేశామని నమ్మబలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు సాక్ష్యంగా డ్వాక్రా సంఘాల మహిళల నుంచి బలవంతంగా సంతకాలు సేకరిస్తోంది. ‘డ్వాక్రా సంఘాల్లో మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ’ పేరుతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వేర్వేరుగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా ముందుగా శిక్షణ పొందిన దాదాపు 2,000 మంది మహిళలు ప్రతిరోజూ పది డ్వాక్రా సంఘాలకు చెందిన 100 మంది సభ్యులతో సమావేశమై, రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందంటూ వివరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పత్రాలపై ప్రతి మహిళతో సంతకాలు చేయిస్తున్నారు. మహిళలను సమీకరించి సంతకాలు చేయించాల్సిన బాధ్యతను ముందుగా శిక్షణ పొందిన వారికి కట్టబెట్టారు. ‘‘ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం– ఇట్లు సంఘ సభ్యులు’’ అని రాసి ఉన్న పత్రంపై డ్వాక్రా మహిళా సంఘాల్లోని సభ్యులందరి నుంచి సంతకాలు తీసుకుంటున్నారు. మహిళలందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డ్వాక్రా సంఘాలకు ఈ శిక్షణా (సంతకాల సేకరణ) కార్యక్రమాలు రెండు రోజుల క్రితం మొదలయ్యాయి. రుణాలను మాఫీ చేయకుండా, కనీసం వడ్డీ రాయితీ కూడా ఇవ్వకుండా ఇన్నాళ్లూ మోసం చేసి, ఇప్పుడు తమను వంచించేందుకు కుట్ర పన్నుతున్న సర్కారు తీరును చూసి డ్వాక్రా మహిళలంతా విస్తుపోతున్నారు. ‘జీరో వడ్డీ’పైనా మాయమాటలు డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు చెల్లించాల్సిన జీరో వడ్డీ డబ్బులను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. అయినా తమకు జీరో వడ్డీ డబ్బులు ముట్టాయంటూ మహిళల నుంచి సంతకాలు సేకరించేలా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అధికారులు కొన్ని పత్రాలను సిద్ధం చేశారు. జీరో వడ్డీ పథకంలో డ్వాక్రా సంఘాలకు 2016 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు రెండేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం వడ్డీ డబ్బులను బ్యాంకులకు చెల్లించలేదు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తంలో 3 శాతం చొప్పున ప్రతినెలా చెల్లిస్తే, దానిపై అయ్యే వడ్డీ ఏ నెలకు ఆ నెల ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించడమే జీరో వడ్డీ పథకం. ప్రభుత్వం బ్యాంకులకు జీరో వడ్డీ డబ్బులు చెల్లించకపోవడంతో ఈ రెండేళ్ల కాలంలోనే డ్వాక్రా మహిళలు దాదాపు రూ.2,200 కోట్ల వడ్డీని బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. ఈ డబ్బులను ప్రభుత్వం చెల్లించినట్టు మహిళల నుంచి సంతకాల సేకరించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సంతకాలతో ఏం చేస్తారు? గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయలేదని, వడ్డీ రాయితీ సొమ్ము కూడా ఇవ్వలేదని, తమను దగా చేశారని డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోసే అవకాశం ఉండడంతో టీడీపీ ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల ప్రచారంలో ఈ పత్రాలను, వీడియోలను వాడుకోవాలని అధికార పార్టీ పెద్దలు నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ‘‘ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. డ్వాక్రా మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ఇవిగో.. చూడండి సాక్ష్యాలు. మహిళలే స్వయంగా సంతకాలు పెట్టి ఇచ్చారు’’ అంటూ ఈ పత్రాలను చూపిస్తూ జనం చెవుల్లో పువ్వులు పెడతారన్నమాట! -
డ్వాక్రా రుణమాఫీపై బట్టబయలైన టీడీపీ మోసం
-
బట్టబయలైన టీడీపీ మోసం
అమరావతి: డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైంది. అసెంబ్లీ వేదికగా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎటువంటి రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత సమాధానమిచ్చారు. 2014 నాటికి ఉన్న రుణాలపై ఎటువంటి మాఫీ చేయలేదని వెల్లడించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు.. రుణమాఫీ చేసే ఆలోచన లేదని సభలో సమాధానం ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో రూ.14200 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం బహిరంగ సభల్లో మహిళలకు పూర్తిగా డ్వాక్రారుణాలు మాఫీ చేసినట్లు ప్రచారం చేయడం గమనర్హం. లిఖితపూర్వక లేఖ -
‘డ్వాక్వా’పై దద్దరిల్లిన కౌన్సిల్
పటమట(విజయవాడ తూర్పు): డ్వాక్వా రుణ మాఫీ, ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకం తదితర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. పాలకపక్ష అనూకూల నిర్ణయాలు తీర్మానించుకునేందుకు, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలను ఆఫీసు రిమార్కులకు పంపే వేదికగా ఇది మారింది. సోమవారం నగర మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలను ప్రస్తావిస్తుంటే యథాలాపంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కౌన్సిల్ తీర్మానం తిరస్కరించి ప్రభుత్వానికి పంపినప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక జీవోలు తీసుకువచ్చి స్థానిక సంస్థలకున్న స్వయంప్రతిపత్తిని నీరుగారుస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఎం కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మీ లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు అసంతృప్తిగా సమాధానాలు ఇస్తున్నారని, అధికారులు కౌన్సిల్‌ను ఖాతరు చేయడం లేదని ప్రస్తావించడంతో సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ షేక్ బీజాన్బీ మైనార్టీ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి తన వార్డుకు నిధులు రాని పక్షంలో కార్పొరేషనే ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. 177 అంశాలు కౌన్సిల్ ఎజండాకు రాగా అందులో 61 అంశాలను ఆమోదించారు. 22 అంశాలు ఆఫీస్ రిమార్కుకు కోరగా, 24 అంశాలు ఆఫీస్ వారు తగు చర్యలు తీసుకునేలా తీర్మానం చేశారు. మిగిలిన అంశాలను స్థానిక అభ్యంతరాలతో వాయిదా వేశారు. రుణమాఫీపై రగడ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ నగరంలో పీఎంఈవై అమలు తీరుపై గందరగోళ వాతావరణం నెలకొందని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. నగరంలో 12 వేలకు పైగా డ్వాక్వా గ్రూపులు ఉన్నాయని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల స్వయం సహాయక గ్రూపులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని చెప్పారు. దీనిపై టీడీపీ నాయకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, చోడిశెట్టి సుజాత, అవుతు శ్రీశైలజ, బీజాన్బీ, వామపక్ష సభ్యురాలు ఆదిలక్ష్మీ మాట్లాడుతూ నగరంలో రుణమాఫీ జరగడం లేదని చెప్పారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించిన పాలకపక్షం చకచకా పలు తీర్మానాలు ఆమోదించుకుంది. వీధులకు, భవనాలకు పేర్లు పెట్టే అంశాలపై వైఎస్సార్సీపీ సభ్యులు అధికారపక్షాన్ని నిలదీశారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ని«ధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనానికి స్థానికులు బూదాల ఆదాం పేరు ప్రస్తావించడంపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం లేకుండా భవనానికి పేరెలా పెట్టారని పుణ్యశీల నిలదీశారు. కౌన్సిల్ తీర్మానాలు.. ♦ అడ్‌హక్ కమిటీ ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదించింది. ♦ 47వ డివిజన్లో నిర్మించిన అంతిమయాత్ర భవనం నిర్వహణ వీఎంసీనే చూస్తుందని కౌన్సిల్ తీర్మానించింది. ♦ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నూతన దోభీఘాట్లు, మరమ్మతులకు గురైన దోభీఘాట్లపై వచ్చిన ప్రతిపాదనపై కౌన్సిల్ ఆమోదం తెలిపింది. భాగ్య నగర్ గ్యాస్ ఏజెన్సీపై.. నగరంలో ఇంటింటికీ పైప్లైన్ల ద్వారా గ్యాస్ అందించేందుకు భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ప్రతిపాదనపై కౌన్సిల్లో చర్చ జరిగింది. చాలా ప్రాంతాల్లో సంబంధిత సంస్థ సిబ్బంది రోడ్లను తవ్వేస్తున్నారని, తవ్విన తర్వాత వాటిని పూడ్చకపోవడంతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఓవైపు ఎల్అండ్టీ, మరోవైపు ఇంజినీరింగ్, ఇంకోవైపు గ్యాస్ ఏజెన్సీ ఇలా నగరంలోని రోడ్లను తవ్వుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిల్ సభ్యులు ప్రస్తావించారు. ఈ ఏజెన్సీకి ఇప్పుడు నగరంలో నాలుగు ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్ల నిమిత్తం భూములను కేటాయించాలని ప్రతిపాదన రావడంతో సభ్యులు అభ్యంతరం తెలిపారు. భూముల కేటాయింపు ప్రతిపాదనపై కౌన్సిల్ ఆఫీస్ రిమార్కుకు పంపింది. ఎమ్మెల్యేలపై వ్యతిరేక గళం నగరంలోని ఎమ్మెల్యేలు కార్పొరేషన్‌కు ఒనగూరే నిధులపై కూడా కన్నేయడంపై కౌన్సిల్ సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరో డివిజన్లో రూ. 68.65 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన సీసీ రోడ్డుపై కౌన్సిల్‌ల్లో ఆసక్తికర చర్చ జరిగింది. కార్పొరేటర్లు ఈ ప్రతిపాదనను ఆమోదించినప్పటికీ స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, ఎమ్యెల్యేలకు ప్రత్యేక నిధులు కేటాయించడం ఇప్పటి వరకు వీఎంసీకి అలవాటులేదని, ఈ నూతన సంప్రదాయాన్ని భవిష్యత్‌లో కొనసాగించకూడదని సభ్యులు కోరారు. కార్పొరేషన్లో బీపీఎస్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఎమ్యెల్యేలకు రెండు కోట్ల చొప్పున కే టాయించామని, ఆ పరిధి దాటితే తప్పనిసరిగా మేయర్ సమక్షంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు అంచనాలతో సహా పనుల వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. చెన్నుపాటి గాంధీ వర్సెస్కమిషనర్ నివాస్ నగరంలోని వరద నీటి ముంపును నిరోధించేందుకు ఎల్అండ్టీ చేపట్టిన స్ట్రామ్‌వాటర్ పనులు నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఎల్ఐసీ కాలనీలో జరుగుతున్న ఈ పనులు నిలుపుదల చేయాలని కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించగా దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో కార్పోరేటర్ గాంధీకి, కమిషనర్ జె. నివాస్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ సందర్భంలో కమిషనర్ ఎల్అండ్టీ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గాంధీ ఆరోపించినప్పటికీ కమిషనర్ సుతిమెత్తగా వివరించారు. -
‘కేసీఆర్‌కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చిన రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో మహిళా అభయహస్తం కింద రూ.360 కట్టారని తెలిపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలమంది డబ్బులు కట్టారని ఆయన పేర్కొన్నారు. అభయహస్తం డబ్బులను ప్రభుత్వం సొంతానికి వాడుకుంటుందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. మీ పైసలు తీసుకున్నారు.. ఎందుకు వాపస్ ఇవ్వరు? మీ ఉసురు తగులుతుందని ఆయన మండిపడ్డారు. అన్ని విధాలుగా మహిళలను అవమాన పరిచి మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూపులపై ఆయన వరాలు కురిపించారు. డ్వాక్రా గ్రూపులకు రూ. లక్ష గ్రాంట్, గ్రూపులకు రూ. 10లక్షల రుణం ఇప్పిస్తూ.. దాని వడ్డీ భారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తోందని హామీ ఇచ్చారు. అంతేకాక డ్వాక్రా సంఘాలకు కార్యాలయాలు లేని చోట కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. అభయహస్తం భీమా పునరుద్ధరించి రూ. 5లక్షలకు పెంచుతామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. -
ఏపీలో తెలుగు తమ్ముళ్ల ఇసుక దోపిడీ
-
న్యాయం కోసం డ్వాక్రా మహిళల అభ్యర్థన
భీమవరం(ప్రకాశం చౌక్): తమ డ్వాక్రా గ్రూపులోని సభ్యులే రూ.40 వేల సొమ్ము స్వాహా చేశారని మున్సిపాలిటీ కమిషనర్‌కు తెలియజేయడానికి వెళ్తే ఆయనను కలవనీయకుండా డ్వామా సీఎంఎం ఎం.ఫణికుమార్ అడ్డుకుని అసభ్యకరంగా మాట్లాడారని డ్వాక్రా గ్రూపు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు భీమవరం 7వ వార్డుకు చెందిన మదర్ థెరిస్సా డ్వాక్రా గ్రూపు సభ్యులు వేండ్ర ముత్యవతి, మొల్లేటి లక్ష్మీ గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. మా మదర్ థెరిస్సా గ్రూపులో 10 మంది గ్రూపు సభ్యులుగా ఉన్నాం. ఆంధ్రాబ్యాంకులో రుణం రూ.5 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించి ఈ ఏడాది రూ.7 లక్షలు కావాలని మేనేజర్‌ను అడిగాం. దీంతో ఆయన మీ అప్పు ఇంకా రూ.1.2 లక్షలు ఉందని చెప్పారు. మా పుస్తకాలు చూస్తే దానిలో రూ.40 వేలు వరకు కట్టకుండా మా గ్రూపు కార్యదర్శి సాయిలక్ష్మి, మరో సభ్యురాలు వాడేసుకున్నట్టు తేలింది. వారిని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఇది ఇలా ఉండగా మా గ్రూపునకు రూ.7 లక్షల రుణం ఇప్పించాలంటే రూ.10 వేలు ఇవ్వాలని సీఆర్పీ సుభాషిణి అడిగారు. దీంతో మా సమస్య పరిష్కారం కోసం మునిసిపాలిటీ కమిషనర్ వద్దకు వెళ్తే మెప్మా సీఎంఎం ఫణికుమార్ అడ్డు తగిలారు. తన ఆఫీసుకు పిలిచి ‘నేను సీఎం చంద్రబాబు బంధువును.. మీరు ఎక్కడకి వెళ్లినా నా దగ్గరకు రావాల్సిందేనని వ్యంగ్యంగా, అసభ్యంగా మాట్లాడారు. మాకు న్యాయం చేయకుండా నెల రోజుల పాటు తన ఆఫీసు చుట్టూ తిప్పించుకున్నారు. అలాగే 5వ వార్డు కౌన్సిలర్ అల్లూరి నాగవల్లి కూడా మమ్మల్ని బెదిరించారు’ అని బాధిత గ్రూపు మహిళలు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు విలేకరుల సమక్షంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మెప్మా సీఎంఎం ఎం.ఫణికుమార్‌ను వివరణ కోరగా సదరు డ్వాక్రా గ్రూపు సభ్యులతో తాను అసభ్యకరంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. -
ఆ బాధ్యత సాధికార మిత్రలదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించి, వారికి ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడేలా నచ్చజెప్పే బాధ్యత సాధికార మిత్రలదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి 35 ఇళ్లకు ఒక డ్వాక్రా మహిళను సాధికార మిత్రలుగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన అధికార నివాసం నుంచి 500 మంది సాధికార మిత్రలతో ప్రత్యక్షంగా, మిగిలిన 4.60 లక్షల మంది సాధికార మిత్రలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘మీకు కేటాయించిన 35 కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో గుర్తించాలి. రాష్ట్రంలో 99 శాతం మంది ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందేలా నచ్చజెప్పాల్సిన బాధ్యత మీదే’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సాధికార మిత్రలకు త్వరలో ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు అందజేస్తుందని, ఫోన్ బిల్లులు సైతం చెల్లిస్తుందని చెప్పారు. ఫోన్లోని ప్రత్యేక యాప్‌లో ప్రభుత్వ పథకాల వివరాలుంటాయని, సాధికార మిత్రలు ఆ వివరాలను ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. కేటాయించిన 35 కుటుంబాలకు సాధికార మిత్రలు తోడ్పాటు అందిస్తే, సాధికార మిత్రలకు అండగా నిలిచే బాధ్యత తనదేనని చంద్రబాబు వెల్లడించారు. రైతులకు రెట్టింపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలే చెబుతోందని.. కానీ, రెండింతల ఆదాయం ఎలా పెంచాలన్నది రాష్ట్రంలో మనం చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు ఖర్చు పెట్టి, మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ అందజేస్తోందని తెలిపారు. ఈ ప్యాడ్స్‌కు ‘రక్ష’ పేరు ఖరారు చేస్తున్నామన్నారు. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తాం ఏటా జూన్ 1వ తేదీనే కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబుఅన్నారు. ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న తూర్పు కాలువపై కొత్తగా నిర్మించిన రెగ్యులేటరీ ద్వారా కృష్ణా డెల్టాకు సీఎం బుధవారం నీరు విడుదల చేశారు. కృష్ణా కాలువలో గంగపూజ నిర్వహించిన అనంతరం కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి తరలిస్తారు. సీఎం మాట్లాడుతూ గతేడాది కంటే వారం ముందే కాలువలకు నీరు విడుదల చేశామని తెలిపారు. తద్వారా కృష్ణా తూర్పు డెల్టాలో 7.36లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. 160 ఏళ్లలో మొదటిసారిగా ఈ ఏడాది కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి జీరో అవుట్ ఫ్లో ఉందన్నారు. వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిపై ఎగువ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా గడిచిన 15ఏళ్లలో కృష్ణా డెల్టాలో అదను తప్పి సాగు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పట్టిసీమ నిర్మాణం, కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం ద్వారా ఈ సమస్య అధిగమించామన్నారు. భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. -
అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ
కామారెడ్డి రూరల్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. సోమవారం చిన్నమల్లారెడ్డి, లింగాయిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం చిన్నమల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని, ప్రత్యక్ష దాడులతోపాటు భూ కబ్జాలు, ఇసుక దందాలు, కాంట్రాక్టులతో లక్షల రూపాయలు అర్జిస్తున్నారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్.. ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండానే అతను మాత్రం నాలుగు అంతస్తుల భవనాన్ని కట్టుకోవడంతో పాటు రామాయంపేట నుంచి కామారెడ్డి వరకు భూములు, ప్లాట్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులకే సబ్సిడీ ట్రాక్టర్లు, కార్పొరేషన్ రుణాలు, ఇసుక తవ్వకాలు, మిషన్ కాకతీయ తదితర పథకాల కాంట్రాక్టులన్నీ దక్కుతున్నాయన్నారు. టీఆర్ఎస్ నాయకులు నిజాంను మించి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు 9 రకాల సరుకులను అందజేశామని, ప్రస్తుతం బియ్యం మాత్ర మే ఇస్తున్నారని, అవి కూడా త్వరలో రద్దు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ వడ్డీ భారం అలాగే ఉంచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇంది రమ్మ పథకం కింద ఎవరి స్థలాల్లో వారికే ఇళ్లు కట్టిస్తామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు ని మ్మ మోహన్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, నయీం, కైలాస్ శ్రీనివాస్‌రావు, రాములు, బాల్‌రాజు, భూపాల్‌రెడ్డి, వెం కటి, పండ్ల రాజు, ఆనంద్‌రావు, కిషన్, నరేశ్, భూలక్ష్మి, ఎల్లంరెడ్డి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ పనులకు ప్రభుత్వ ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కుతోంది. జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పటికే స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమకు అనుకూలంగా ఉండే డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించుకుని, నిస్సిగ్గుగా పార్టీ పనులకు వాడుకుంటోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తామంటూ మహిళలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం బహూశా ఎక్కడా ఉండదేమో! టీడీపీ ప్రచారానికి, అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడానికి 4.46 లక్షల మంది డ్వాక్రా మహిళలను ప్రభుత్వం సాధికార మిత్రలుగా నియమించింది. వీరు పూర్తిస్థాయిలో అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేయనున్నారు. సాధికార మిత్రల శిక్షణకు, ప్రతినెలా వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిం చేందుకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే చెల్లిస్తుండడం గమనార్హం. టీడీపీకి ఓట్లు వేయించాలట! ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడమే సాధికార మిత్రల విధి అని పైకి చెబుతున్నా.. అసలు పని మాత్రం వేరే ఉంది. ముఖ్యమంత్రి అప్పగించిన విధి ఏమిటంటే.. సాధికార మిత్రలు తమకు కేటాయించిన 35 కుటుంబాల సమగ్ర సమాచారాన్ని స్థానిక టీడీపీ నేతలకు చేరవేయాలి. ఆయా కుటుంబాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. ప్రభుత్వ ఘనకార్యాలను వివరిస్తూనే ప్రతిపక్షాల గురించి వీలైనంత మేర దుష్ప్రచారం సాగించాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓట్లు వేసేలా జనాన్ని సన్నద్ధం చేయాలి. అంతేకాకుండా సాధికార మిత్రల బ్యాంకు ఖాతాల వివరాలను ప్రభుత్వం సేకరించినట్లు తెలిసింది. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో వారి బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ సొమ్మంతా సాధికార మిత్రల పరిధిలోని కుటుంబాలకు చేరేలా వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. సాధికార మిత్రలకు త్వరలో సర్కారు ఖజానా నుంచే వేతనాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 4.46 లక్షల మంది నియామకం రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో 1,32,28,199 కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకున్నాయి. ఆయా కుటుంబాలను 35 చొప్పున ఒక క్లస్టర్‌గా 4,66,624 క్లస్టర్లుగా వర్గీకరించారు. అందులో 4,46,529 క్లస్టర్లకు నాలుగు నెలల క్రితమే సాధికార మిత్రలను ప్రభుత్వం నియమించింది. సాధికార మిత్రల శిక్షణకు, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు రాకపోకలకు దారి ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. 4.46 లక్షల మంది సాధికార మిత్రలకు శిక్షణ ఇవ్వడానికి, ప్రతినెలా వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే చెల్లిస్తున్నారు. ఎన్ఆర్ఎల్ఎం నిధులకు ఎసరు పొదుపు, స్వయం ఉపాధి అవకాశాలపై డ్వాక్రా మహిళల్లో అవగాహన పెంచే కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా అన్ని రాష్ట్రాలకూ నిధులు అందజేస్తోంది. వీటిని ఎన్ఆర్ఎల్ఎం నిధులు అంటారు. కేంద్రం గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు రూ.57 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది మరో రూ.47 కోట్లు ఇచ్చేందుకు అనుమతి తెలిపింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. సాధికార మిత్రల శిక్షణకు, జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనలకు వారు హాజరయ్యేందుకు ఖర్చు పెడుతోంది. ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రతినెలా 300 మంది సాధికా>ర మిత్రలను జిల్లాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. కేంద్రమిచ్చే ఎన్ఆర్ఎల్ఎమ్ నిధులనే ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. సాధికార మిత్రల రవాణా ఖర్చులకు కేంద్రమిచ్చే నిధులనే వాడుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికార పార్టీ అనుకూలురే మిత్రలు సాధికార మిత్రలుగా ఎవరిని నియమించాలి? అనేదానిపై ప్రభుత్వ పెద్దలు ముందుగానే జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు, చర్యలపై వ్యతిరేక భావం ఉన్న డ్వాక్రా మహిళలను నియమించవద్దని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారినే సాధికార మిత్రలుగా నియమించాలని దిశానిర్దేశం చేశారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతలు కూడా తమకు అనుకూలమైన వారే సాధికార మిత్రలుగా ఎంపికయ్యేలా జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో ముఖ్యమంత్రి సెక్రటరీగా పనిచేస్తున్న ఓ అధికారి ఈ నెల 11వ తేదీన విజయవాడలో కొందరు సాధికార మిత్రలతో గోప్యంగా సమావేశం నిర్వహించారు. ఓట్లు కొల్లగొట్టే కుతంత్రం రాష్ట్రంలో ప్రతి కుటుంబం వివరాలను ప్రభుత్వం ఇప్పటికే పల్స్ సర్వేలో సేకరించింది. ఇప్పుడు సాధికార మిత్రల ద్వారా కుటుంబాల వారీగా సమగ్ర సమాచారం రాబడుతోంది. కులం, కుటుంబానికి ఉన్న భూమి, ఆ కుటుంబం వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధి వంటి వివరాలను సేకరిస్తోంది. దీనిద్వారా సదరు కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమిటి? వారి ఓట్లు కొల్లగొట్టాలంటే ఏం చేయాలన్నది టీడీపీ నేతలకు తెలిసిపోనుంది. డ్వాక్రా మహిళలే కాబట్టి కేంద్ర నిధులు వాడుతున్నాం.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేయడానికే సాధికార మిత్రలను నియమించింది. వీరంతా డ్వాక్రా మహిళలే కాబట్టి కేంద్రమిచ్చే ఎన్ఆర్ఎల్ఎం నిధులను సాధికార మిత్రల శిక్షణ కోసం ఖర్చు పెడుతున్నాం’’ – కృష్ణమోహన్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో -
జనం కరువాయే.. దీక్షలు బరువాయే..!
సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఈనెల శుక్రవారం నుంచి చేపట్టిన నవ నిర్మాణ దీక్షలకు జనాలు కరువయ్యారు. తమ పరువు కాపాడుకోవడానికి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. జనాలు రాక సభల నిర్వహణ అధికారులకు బరువవుతోంది. ఎక్కడ చూసినా జనం నుంచి నవ నిర్మాణదీక్షలకు స్పందన లేదు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు, టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేకుండాపోతోంది. కేవలం పింఛన్ ఇస్తామని లబ్ధిదారులు సభలకు తిప్పుకోండం.. ఇవ్వకుండా రేపురండని అంటూ ఉద్యోగులు చెప్పడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సభలకు జనాలు రాకపోవడానికి కారణం.. నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ అందలేదు. దీంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి ఎసరుపెట్టి కేవలం పసుపు కుంకుమగా మార్చి అంతో ఇంతో ఇచ్చే సొమ్మును కూడా కంతుల రూపంలో ఆలస్యం చేయడంపై మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్, నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం, నిరుపేదలకు ఇల్లు ఇలా అనేక రకాల హామీలిచ్చి అంతంత మాత్రంగా కూడా అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ గ్రామసభలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. కేవలం దీక్షల్లో అధికారులు మాత్రమే ఉంటున్నారు. అంతటా.. అంతంత మాత్రంగానే జిల్లాలో ఎక్కడ చూసినా నవ నిర్మాణ దీక్షలు వెలవెలబోతున్నాయి. కలెక్టర్ హరికిరణ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరైన దీక్షలు మినహా అన్ని చోట్ల జనం కరువవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని తరహాలో ఈ సారి మండల కేంద్రాలతోపాటు పంచాయతీల్లో ఎనిమిది రోజుల నవ నిర్మాణ దీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్లెల్లో ఎక్కడా జనం లేని దీక్షలే కనిపిస్తున్నాయి. జనాలు నిండుగా ఉండే దీక్షలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీక్షల్లో ఒక అంకె దాటని జనం.. జిల్లాలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో జనం ముగ్గురు, అయిదు మంది, ఏడు మంది, పది మంది ఇలా కనిపిస్తున్నారు. వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల్లో కేవలం ఐదారు మందే కనిపించారు. అలాగే రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల్లోని పలు చోట్ల కేవలం పది మందిలోపే జనాలు కనిపించా రు. పులివెందులలోని మిస్సమ్మ బంగ్లాలో నిర్వహించిన దీక్షకు జనం లేక చిన్న పిల్లలను తీసుకొచ్చి నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలోని మండలాల్లో నిర్వహిస్తున్న సభలకు కూ డా జనాలు లేక కేవలం డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి నడిపిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో ప్రజలు లేక నవ నిర్మాణదీక్ష బోసిపోయింది. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల జనం లేని సభలే దర్శనమిస్తున్నా యి. అందునా పింఛన్ల కోసం వృద్ధులను తీసుకొ స్తుండగా.. డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్క ర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. జనం లేకపోవడంతో ఎవరో ఒకరు కనిపిస్తే కొంతైనా దీక్షలకు స్పందనగా చూపించవచ్చని అధికార యంత్రాంగం ఆరాట పడుతోంది. -
డ్వాక్రా మహిళలకు తప్పనిపాట్లు
నరసన్నపేట : సారవకోట మండలం రంగసారం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభ కోసం బస్సుల్లో వచ్చిన డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం.. సభాస్థలికి ఐదు కిలో మీటర్లు దూరంలో బస్సులు నిలిపివేయడంతో వాటి వద్దకు చేరుకొనే సరికి నానా అవస్థలు పడ్డారు. పులిహోరా ప్యాకెట్లు ఇచ్చినా మంచి నీరు ఇవ్వలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఆంక్షల పేరున కిలో మీటర్ల దూరంలో బస్సులు నిలిపి వేయడంతో ఎండ తీవ్రతకు గురయ్యారు. సభ అనంతరం వచ్చిపోయో వాహనాలతో సారవకోట–రంగసాగరంల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదిలా ఉండగా, స్వయం శక్తి సంఘాల మహిళలతో పాటు ఉపాధి వేతనదారులు కూడా అధిక సంఖ్యలో సభా ప్రాంగణానికి తరలించారు. ఇందుకు ప్రతిఫలంగా ఉపాధి వేతనదారులకు ఫ్రీ మస్తర్ వేసి ఒక్కో కూలీకి రూ.150 వచ్చేలా ఫీల్డు అసిస్టెంట్లు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. -
డ్వాక్రా మహిళలకు టోకరా
కడప కార్పొరేషన్ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. పనులు మానుకొని బ్యాంకులకు వెళ్లలేని స్వయం సహాయక సంఘాల మహిళలు కంతులు చెల్లించమని ఇచ్చిన డబ్బులను ఆర్పీలు వాడేసుకున్నారు. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా బాధితులు గుర్తించలేకపోయారు. రుణానికి సంబంధించి కంతులన్నీ కట్టేశాం కదా మళ్లీ రుణం తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన మహిళలు ఒక్క కంతు కూడా కట్టలేదని తెలిసి కంగుతిన్నారు. తమ డబ్బులు ఏమయ్యాయని ఆర్పీలను నిలదీయడంతో ఈ బాగోతం వెలుగు చూసింది. ఇందులో లక్ష్మిదేవి, లీలావతి అనే ఇద్దరు ఆర్పీలు ప్రధాన భూమిక పోషించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారికంగా రూ.15 లక్షలు మోసం జరిగిందని చెప్తున్నా, వాస్తవానికి రూ.30లక్షల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు మంగళవారం సాయంత్రం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామమోహన్‌రెడ్డి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. అయితే డ్వాక్రా మహిళల డబ్బులను సొంతానికి వాడుకున్న వారికి మద్దతుగా టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్ పంచాయితీకి వచ్చి పీడీ కార్యాలయంలో కూర్చోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.... కడప నగరం శంకపురానికి చెందిన కావ్య స్వయం సహాయక సంఘ సభ్యులకు గత ఏడాది బ్యాంకు లింకేజీ ద్వారా జయనగర్ కాలనీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి రూ.7లక్షల రుణం మంజూరైంది. అయితే రూ.3.50 లక్షలు విత్ డ్రా చేయించి ఏడుగురు సభ్యులకు రూ.50వేల చొప్పున ఇచ్చిన ఆర్పీలు మిగతా రూ.3.50 లక్షలను వారికి ఇవ్వలేదు. ఆ మొత్తాన్ని స్త్రీ నిధికి జమ చేశామని చెప్తున్నా, అందులో వివరాలు నమోదు కాలేదు. అలాగే మరో ఇందిరా స్వయం సహాయక గ్రూపునకు సంబంధించి సభ్యులు 21 నెలలుగా చెల్లిస్తున్న సొమ్మును ఆర్పీలు సొంతానికి వాడుకున్నారు. ఆ గ్రూపు సభ్యులు రెండేళ్ల క్రితం జయనగర్ ఏపీజీబీలో రూ.5లక్షలు రుణంగా తీసుకున్నారు. మొదటి మూడు కంతులు సభ్యులే బ్యాంకుకు వెళ్లి చెల్లించారు. తర్వాత గ్రూప్ లీడర్ వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో సభ్యులంతా తాము చెల్లించాల్సిన కంతులను ఒక్కొక్కరు రూ.2500 చొప్పున నెలకు రూ.25వేలు ఆర్పీలకు ఇచ్చేవారు. వారు ఆ మొత్తాన్ని బ్యాంకులో చెల్లించకుండా తమ సొంతానికి వాడుకున్నారు. తీరా అన్ని కంతులు అయిపోయాయి కదా మళ్లీ రుణం తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన వారికి వారు చెల్లించిన మూడు కంతులు తప్పా ఇంకేమీ కట్టలేదని తెలియడంతో ఆశ్చర్యపోయారు. న్యాయం చేయాలని పీడీ కార్యాలయానికి వచ్చారు. ఈ రెండు గ్రూపులేగాక మరో ఆరు గ్రూపులకు సంబంధించిన సభ్యుల నుంచి కూడా డబ్బులు తీసుకొని బ్యాంకులకు చెల్లించకుండా వారు మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోతే కేసు నమోదు– పీడీ డ్వాక్రా సభ్యులు బ్యాంకులో కట్టమని ఇచ్చిన డబ్బులు ఆర్పీలు సొంతానికి వాడుకున్నారని, అందువల్లే ఈ సమస్య వచ్చిందని మెప్మా పీడీ రామమోహన్‌రెడ్డి తెలిపారు. ఇలా వారు వాడుకున్న మొత్తం రూ.15లక్షల వరకూ ఉందని, ఇద్దరు ఆర్పీలు ఈ వ్యవహారం నడిపారని, ఆర్పీలు డ్వాక్రా సభ్యుల వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
'టీఆర్ఎస్ కార్యకర్తలుగా డ్వాక్రా మహిళలు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మహిళల పట్ల చిన్నచూపని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. డ్వాక్రా మహిళలను టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాడుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ డ్వాక్రా మహిళలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. క్యాబినెట్లో మహిళలకు అవకాశం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. -
బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు..
-
పొదుపు డబ్బులపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: ‘మిత్ర’ మహిళా సంఘంలో పది మంది సభ్యులున్నారు. వీరంతా ప్రతి నెలా వంద రూపాయల చొప్పున బ్యాంకు పొదుపు ఖాతాకు జమ చేస్తున్నారు. పిల్లలు చదువులు, చిరు వ్యాపారం, కుటుంబ అవసరాలకు ఇది అక్కరకు వస్తుందని ముందుచూపుతో పొదుపు చేసినా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా వారి ఆశలు నెరవేరటం లేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు ఖాతాలో దాచుకున్న డబ్బులు తీసుకునేందుకు సంఘాలను బ్యాంకులు అనుమతించటం లేదు. రాష్ట్రంలోని మెజారిటీ బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రావటం గమనార్హం. దాచుకున్న డబ్బులున్నా ప్రైవేట్ అప్పులే దిక్కు ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ కుదరదని తేల్చి ప్రతి మహిళకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి నిధిగా ఇస్తానంటూ మాట మార్చటం తెలిసిందే. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు కింద బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు. మహిళా సంఘాలు సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకులు అనుమతించడం లేదు. దీంతో పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం మహిళా సంఘాలు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తోంది. రుణమాఫీ చేయకపోవటమే కారణం ఒకపక్క బ్యాంకులో వారి డబ్బులుండి కూడా డ్వాక్రా మహిళలకు అప్పు చేయాల్సిన దుస్థితి రావడం శోచనీయమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి, ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతన లేదని భేటీలో అధికారులు స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడమే దీనికంతటికీ ప్రధాన కారణమని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. మహిళా సంఘాల పేరుతో ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవటంతో అవి అలాగే ఉన్నాయని, పొదుపు ఖాతాల నుంచి సంఘాలకు డబ్బులు ఇచ్చేస్తే రుణాలు ఎవరు తీరుస్తారని బ్యాంకర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలపై చార్జీల మోత మరోపక్క మెజార్టీ బ్యాంకులు నిర్ధారించిన వడ్డీ కన్నా ఎక్కువకు రుణాలు ఇస్తున్నాయని, వివిధ రకాల చార్జీల పేరుతో సంఘాల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలిందని సమావేశంలో అధికారులు తెలిపారు. కొన్ని బ్యాంకులు మహిళా సంఘాలకు 12.5 శాతం వడ్డీకి, మరి కొన్ని బ్యాంకులు 14.5 శాతం వడ్డీకి రుణాలను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతకంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వివిధ రకాల చార్జీల రూపంలో బ్యాంకులు ఎక్కువ మొత్తంలో సంఘాల నుంచి వసూలు చేస్తున్నాయని వెల్లడైంది. కొన్ని బ్యాంకులు రుణాల మంజూరు సమయంలో జీవిత బీమా, వైద్య బీమా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో చెల్లించినా ప్రయోజనం ‘సున్నా’ సకాలంలో అప్పు చెల్లించిన డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలను వర్తింప చేయాలి. అయితే 2015 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు సున్నా వడ్డీకి చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో సకాలంలో రుణాలను చెల్లించిన మహిళా సంఘాలకు సున్నా వడ్డీ ప్రయోజనం దక్కటం లేదు. ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో మెలగిన రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. -
టీడీపీకి ఓట్లేయించే బాధ్యత డ్వాక్రా సంఘాలదే
సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ‘ఎవ్వరికైనా తిండి పెట్టినవాడిని అన్నదాత అని ఆశీర్వదించడం మన సంస్కృతి. డ్వాక్రా సంఘాలను నేనే ప్రారంభించాను. రూ.6 వేలు చొప్పున పసుపు కుంకుమ కింద ఇచ్చాను. రుణాలపై వడ్డీ మాఫీ చేశాను. నెలకు రూ.10 వేల చొప్పున ఆదాయం చూపిస్తాను. ఇంకా రూ.20 వేల ఆదాయం వచ్చేట్లు చేస్తాను. ఇది గుర్తుంచుకోండి. 65 లక్షల మంది టీడీపీ కార్యకర్తలతో 90 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు కలిసి పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 80 శాతం ఓట్లేయించాలి...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు మరోసారి ఎర వేశారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లా పాల కొండ నియోజకవర్గం పరిధి వీరఘట్టం మండలంలోని తెట్టంగి గ్రామంలో ‘ఇంటింటా టీడీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. ప్రాజెక్టుల తనఖాతో రుణం సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రూ.3 వేల కోట్ల రుణాన్ని సమీకరిం చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. -
వడ్డీలేని రుణ పథకం.. లేనట్టేనా?
- డ్వాక్రా సంఘాలకు అందని రుణాలు - బ్యాంకులకు వడ్డీ చెల్లింపుల్లో సర్కారు వెనుకంజ సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా మహిళలకు అమలుచేసే వడ్డీ లేని రుణ పథకం కొండెక్కింది. పైగా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు నిలిచిపోయాయి. పథకానికి సర్కారు సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో వడ్డీలేని రుణాల పథకం ప్రస్తుతం మూలనపడిందన్న చర్చ జరుగుతోంది. దీంతో డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం మూడేళ్ల నుంచి కుంటుపడింది. సెర్ప్ నుంచి రెండేళ్లుగా వడ్డీలేని రుణాల పథకం కింద ప్రతిపాదనలు వెళుతున్నా సర్కారు నుంచి స్పందన కనిపించడంలేదని సెర్ప్ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.2 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాల్సి ఉండగా, అవి ఇప్పటివరకు మహిళలకు చేరలేదు. దీంతో బకాయిలుగానే ఉండిపోయాయి. ఫలితంగా స్వయం ఉపాధిపై ఆధారపడే మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు 15 లక్షలకుపైగా ఉన్న డ్వాక్రా సంఘాల్లోని సుమారు కోటి మంది మహిళలు ప్రభుత్వ సాయంకోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు లక్షలాది సంఘాల్లోని సభ్యులు వడ్డీ లేని రుణాల కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పటికే తీసుకున్నవారు వడ్డీ భారాన్ని మోస్తున్నారు. -
మంత్రి లోకేశ్‌కు చుక్కలు చూపించారు!
వైఎస్ఆర్ జిల్లా: సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌కు డ్వాక్రా మహిళలు చుక్కలు చూపించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎక్కడ అమలు చేశారంటూ నిలదీశారు. వల్లూరు మండలం తప్పెట్లలో బుధవారం ఈ ఘటన జరిగింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేశ్ మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికంగా రోడ్లు వేశారా? పంటలకు నీళ్లు ఇచ్చారా? అంటూ మహిళలను అడిగారు. ఆ ప్రశ్నలకు మౌనం వహించిన మహిళలు.. అసలు డ్వాక్రా రుణమాఫీ సంగతి ఏమయిందంటూ ప్రశ్నించారు. ఇంకెప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని నిలదీశారు. దీంతో మహిళలకు సర్దిచెప్పేందుకు మంత్రి లోకేశ్ నానా తంటాలు పడ్డారు. -
కోర్టుకు లాగారు!
డ్వాక్రా మహిళలకు సర్కార్ మోసం రుణమాఫీ పేరుతో దగా చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తిసిన వైనం మాఫీ అవుతుందనుకున్న మహిళలకు నిరాశ తేరుకునే లోపు కోర్టు నుంచి నోటీసులు గౌరవంగా బతుకుతున్న తమను బజారుకీడుస్తారా? ‘జీవనోపాధుల కోసం తీసుకున్న రుణాలను ఏ ఒక్కరూ చెల్లించకండి. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మీ రుణాలన్నీ మాఫీ చేస్తాను’ అంటూ ఎన్నికలకు ముందు మహిళా సంఘాలకు చంద్రబాబు ఇచ్చిన హామీలో డొల్లతనం బయటపడింది. అప్పటి వరకూ రుణాలు సక్రమంగా చెల్లిస్తూ వచ్చిన మహిళా సంఘాలు సైతం చంద్రబాబు హామీతో చెల్లింపులపై మిన్నకుండి పోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై పూటకోమాట మాట్లాడుతూ వచ్చిన సర్కార్... చివరకు మహిళలను కోర్టుకు లాగింది. తీసుకున్న రుణాలను నయాపైసాతో సహా చెల్లించాలంటూ కోర్టు ద్వారా పంపిన బ్యాంకర్లు నోటీసులతో మహిళలు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సంసారం నెట్టుకు వస్తున్న తమను బజారు కీడ్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - ఉరవకొండ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన మహిళా సంఘాలు.. చంద్రబాబు రుణమాఫీ మాయాజాలంలో చిక్కుకుని బ్యాంక్‌లలో డీఫాల్డ్ గ్రూపులుగా మారాయి. 2012 నుంచి 2014 వరకూ ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 4,567 మహిళా సంఘాల్లోని 46,107 మంది సభ్యులకు జీవనోపాధుల కోసం ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేశాయి. వీటి కంతులను సకాలంలో ఆయా మహిళా సంఘాలు చెల్లిస్తూ వచ్చాయి. సంఘానికి రూ. 10 వేల ప్రకారం రెండు విడతలుగా రూ. 30.18 కోట్ల పెట్టుబడి నిధిని బ్యాంకర్లు మంజూరు చేయగా... వీటిలో అత్యధిక శాతాన్ని మహిళా సంఘాలు చెల్లించాయి. ప్రస్తుతం బ్యాంక్‌లకు మహిళా సంఘాలు రూ. 14.90 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా రుణమాఫీ ప్రకటనతో నిలిచిపోయిన సొమ్ము కావడం గమనార్హం. అధికారం దక్కించుకోవడంలో భాగంగా మహిళా సంఘాలను మభ్యపెట్టి కంతులు చెల్లించకుండా అప్పట్లో చంద్రబాబు నిలువరించి ఉండకపోయి ఉంటే ఈ బకాయి కూడా ఉండేది కాదని పలువురు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందే తీసుకున్న రుణాలను చెల్లించాలంటూ కోర్టు ద్వారా వందలాది మహిళా సంఘాలకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలకు చెందిన 670 మహిళా సంఘాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ల నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మహిళా సంఘాల సభ్యుల్లో గగ్గోలు మొదలైంది. ఏనాడూ కోర్టు మెట్టు ఎక్కని మహిళలు... న్యాయస్థానంపై గౌరవంతో రెండ్రోజుల క్రితం కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి తాము మోసపోయామంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. వడ్డీతో రుణాలు చెల్లించలేమని, అసలు మాత్రమే చెల్లిస్తామని, ఇందుకు నెల రోజుల గడవు తీసుకుని వచ్చారు. రుణమాఫీ అయివుంటే తమకు ఆర్థికంగా కొంత ఉపశమనం దొరికేదని, అయితే ముఖ్యమంత్రి తమను ఇలా దగా చేస్తారని ఊహించలేదంటూ ఈ సందర్భంగా పలువురు మహిళలు వాపోయారు. అవమానపరిచారు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు కోర్టు ద్వారా నోటీసులు పంపి మమ్మల్ని అవమానపరిచారు. సంఘంలో మొత్తం 10 మంది రోజూ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాం. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో ఒక్కసారిగా వడ్డీ భారం పెరిగిపోయింది. దీంతో రుణం చెల్లించలేని దుస్థితి నెలకొంది. - ముత్యాలమ్మ,, షెక్షానుపల్లి సీఎం సమాధానం చెప్పాలి రుణమాఫీ చేస్తానంటూ హమీ ఇచ్చిన సీఎం సార్ సమాధానం చెప్పాలి. ఆయన చెప్పిన మాట విని మేము డబ్బు కట్టలేదు. అయినా రుణాలు మాఫీ చేయడం చేతకానప్పుడు ఎందుకు హమీ ఇవ్వాలి? మమ్మల్ని బజారుకీడ్చడానికా? - రామాంజినమ్మ, షెక్షానుపల్లి -
రుణమాఫీ మాయ
డ్వాక్రా మహిళలకు కోర్టు నోటీసులు లోక్ అదాలత్ ద్వారా బకాయిల వసూలుకు చర్యలు కళ్యాణదుర్గం : చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రుణమాఫీ హామీ మహిళల పాలిట శాపంగా మారింది. రుణమాఫీ అవుతుందని అప్పు చెల్లించని డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా నోటీసులు అందడంతో కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. కళ్యాణదుర్గం పట్టణంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్‌లో రుణం పొందిన దాదాపు 75 మహిళా సంఘాల సభ్యుల నుంచి వన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.38 లక్షల బకాయిల రికవరీ కోసం అధికారులు జాతీయ లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌కు బాధిత మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు. లోక్‌అదాలత్‌లో ఇన్చార్జ్ జడ్జి అప్పలస్వామి, బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు, బాధిత మహిళా సంఘాల సభ్యులు రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రుణమాఫీ హామీ నమ్మి మోసపోయామని, ఎస్బీఐలో మహిళా సంఘం రుణానికి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని సంఘం సభ్యులు వాపోయారు. బకాయిల వసూలు కోసమే.. మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణాలు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. లోక్‌అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా బకాయిల సమస్యల పరిష్కారం కోసమే ప్రయత్నిస్తున్నాం. అంతకు మించి మహిళలను కోర్టుకు పిలిపించాలనేది మా అభిమతం కాదు. అధిక వడ్డీలు వసూలు చేశామని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – నాగేశ్వరరావు, ఎస్బీఐ మేనేజర్, కళ్యాణదుర్గం -
డ్వాక్రా బజార్ ప్రారంభం
కర్నూలు (టౌన్): స్థానిక సి. క్యాంపు సెంటర్లో డ్వాక్రా బజారు ప్రారంభమైంది. బుధవారం జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ జ్యోతి ప్రజ్వలనతో దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన వస్తువులకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, ఆర్అండ్బీ ఈఈ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళలపై జులుం !
- రుణాలు చెల్లించకపోతే ఇళ్లకు తాళం - బ్యాంకు అధికారులు, ఐకేసీ సిబ్బంది హెచ్చరికలు – వేధిస్తే ఆత్మహత్యలే శరణ్యమంటున్న బాధితులు డీ.హీరేహాళ్ : రుణాలు చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బ్యాంకు అధికారులు, ఐకేపి సిబ్బంది వేధిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. ఎం.హనుమాపురం గ్రామానికి చెందిన ఎస్సీకాలనీ మహిళలు మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని చంద్రబాబునాయుడు చెప్పడంతో తాము చెల్లించలేదన్నారు. తమ కాలనీలో 12 సంఘాలు ఉన్నాయన్నారు. ఒక్కొక్కరు రూ.14వేల చొప్పున సంఘం తరుపున అప్పుతీసుకున్నామన్నారు. దీనికి రూ.40వేలు వడ్డీ, అసలు కట్టాలని అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అంతకు ముందే ఒక్కొక్కరు తీసుకున్న డబ్బుకు రూ.15వేల వరకు చెల్లించామని వారు వాపోయారు. ప్రస్తుతం వాయిదాల రూపంలో చెల్లించేందుకు లక్షకు మరో లక్ష అప్పుఇస్తూ కొత్తలోన్లు అంటూ ఒక్కొక్కరికి రూ.40వేల చొప్పున కొత్త అప్పును కట్టిపెట్టారన్నారు. తాము తీసుకున్నది రూ.14వేలు మాత్రమేనని చెప్పారు. వాయిదాలు చెల్లించినా ఐకేపీ సిబ్బంది సక్రమంగా బ్యాంకుకు చెల్లించక తమని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి రూ.7 వేలకు మించి అప్పువుండదన్నారు. అయితే బ్యాంకు అధికారులు ఒక్కో సంఘంలో సభ్యులు అందరూ కలిసి రూ.2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. ఐకేపి సిబ్బంది అప్పు వసూలుకు వచ్చిన ప్రతిసారి పెట్రోల్ ఖర్చుకు తమ నుంచి డబ్బు గుంజుతున్నారన్నారు. పంటలు లేక, ఊర్లో పనులు లేవని, అయినా డబ్బు కోసం అధికారులు మాత్రం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి తాళం వేస్తామంటున్నారు.. డ్వాక్రా అప్పు చెల్లించకపోతే ఇంటికి తాళం వేస్తామని భయపెడుతున్నారు. సంఘంలో తీసుకున్న అసలు డబ్బు చెల్లించాం. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంది. వడ్డీకి మారువడ్డీ వేసి, అప్పుకన్న వడ్డీనే రూ.40 వేలు ఉందని చెబుతున్నారు. – కాడమ్మ, ఓబక్క, జ్యోతి సంఘం. పొదుపు డబ్బునూ జమా చేసుకున్నారు .... అప్పుతోపాటు పొదుపును కూడా చేసేవారం. అప్పుతీసుకున్న తరువాత వాయిదాలతోపాటు పొదుపును కూడా పెంచుకుంటూ వచ్చాం. అప్పులు మాఫీ చేస్తామని చెప్పడంతో డబ్బు కట్టలేదు. పొదుపు డబ్బునూ అప్పునకు జమా వేసుకున్నారు. అప్పు తెగలేదు. వడ్డీ పెరిగింది. – రేణుకమ్మ, పెన్నక్క, స్వయంశక్తి సంఘం -
తలుపులు మూసి ఉపన్యాసం
తణుకు: తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. సోమవారం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపులకు రెండో విడత పెట్టుబడి నిధి రూ. 13.65 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మహిళలను ఉద్దేశించి ఉపన్యసించారు. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ఉండడంతో నీరసించిన మహిళలు బయటకు వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే సమావేశం అయ్యేంత వరకూ కదలడానికి వీల్లేదని స్థానిక నేతలు హుకుం జారీచేశారు. తలుపులు మూసివేశారు. దీంతో చేసేది లేక మహిళలు కూర్చుండిపోయారు. రెండు గంటల తర్వాత ప్రసంగం పూర్తికావడంతో హమ్మయ్య బతుకుజీవుడా.. అంటూ బయటపడ్డారు. అంతకు ముందు యనమల తణుకు పట్టణంలో రూ. 16 లక్షలతో నిర్మించిన స్వాగత ముఖద్వారం, హౌసింగ్ బోర్డు కాలనీలో స్విమ్మింగ్ పూల్, ఎనిమిదో వార్డులో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, ఏఎంసీ చైర్మన్ బసవా రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వావిలాల సరళాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పట్టణంలోని ఎనిమిదో వార్డలో మంత్రులు యనమల, చినరాజప్ప జనచైతన్య యాత్ర మొక్కుబడిగా నిర్వహించారు. వార్డులోని మహిళలను ఒక చోటకు చేర్చి వారితో మాట్లాడారు. అయితే వారికి సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే హౌసింగ్‌బోర్డు కాలనీలో ప్రారంభించిన స్విమ్మింగ్ పూల్‌లో నీళ్లు పసర్లు తేలి ఉన్నాయని, ఇలా అయితే ఎలా అని మంత్రి యనమల మునిసిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. పచ్చరంగులో టైల్స్ వేయించారా అంటూ ఛమత్కరించారు. -
ఎమ్మెల్యే సారూ... ఇలాగేనా రుణమాఫీ
అనపర్తి ఎమ్మెల్యేను నిలదీసిన డ్వాక్రా మహిళ పాతకోటపాడు (రంగంపేట) : డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారే తప్ప ఒక్కరికీ రుణమాఫీ జరగలేదని ఎ.దుర్గమ్మ అనే మహిళ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని నిలదీసింది. టీడీపీ జనచైతన్య యాత్ర, మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పాత కోటపాడులో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రుణమాఫీ విషయమై ఎమ్మెల్యేను ఆమె నిలదీసింది. మాఫీ చేయలేనప్పుడు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించింది. కంటితుడుపు చర్యగా రూ.3.వేలు ఇచ్చారే తప్ప దాని వల్ల తమకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల హామీ నమ్మి రుణం తీర్చకపోవడంతో చాలా వడ్డీ పెరిగిపోయిం దన్నారు. దీనిపై ఎమ్మెల్యే మా ట్లాడుతూ సీఎం ఎన్నికల్లో ఇచ్చి న హామీ మేర కు మొదటి విడతగా కొంత మొత్తం అందించారని, మిగిలినది తరువాత విడుదల చేస్తారని చెప్పారు. -
మాఫీమంటలు
కొవ్వూరు రూరల్ : డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడి హామీ పేద కుటుంబాలను నిలువునా దహించివేస్తోంది. మాట తప్పిన సర్కారు వివిధ రూపాల్లో మహిళల ఉసురు పోసుకుంటోంది. ఓ వైపు కోర్టు సమన్లు, మరోవైపు నడ్డివిరిచే వడ్డీలతో బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులతో డ్వాక్రా మహిళలు తల్లడిల్లిపోతుండగా.. తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటున్న మహిళా కూలీలకు చెల్లించే కూలి డబ్బులను బ్యాంకులు డ్వాక్రా రుణాలకు జమ చేసుకుంటున్నాయి. దీంతో డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళా కూలీల కుటుంబాలు పట్టెడన్నం తినే అవకాశం లేక ఆకలితో అలమటిస్తున్నాయి. కడుపు కాల్చడమూ ప్రయోగాత్మకమే కొవ్వూరు మండలంలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ ఉపాధి హామీ పనులు చేసుకునే కూలీలకు ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా కూలి సొమ్ము చెల్లించేది. త్వరలో ఈ విధానాన్ని మార్చి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయిం చారు. తొలి విడతగా కొవ్వూరు మండలంలోని ధర్మవరం, దొమ్మేరు గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని 9 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వచ్చేనెల నుంచి అన్ని గ్రామాల్లోని ఉపాధి కూలీలకు బ్యాంకుల ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో సుమారు 20 మంది ఉపాధి కూలీల సొమ్ము రూ.50 వేల వరకు బ్యాంకులు డ్వాక్రా రుణాల ఖాతాల్లో జమ చేసుకున్నాయి. పైగా ఈ మొత్తాలను ఆయా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా గ్రూప్ ఖాతాల్లో జమ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి ఆయనకు ఓటేస్తే.. రెక్కలు ముక్కలు చేసుకునే తమ నోటిదగ్గర కూడు లాగేసుకుంటున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఇదేం దారుణమయ్యా నాలుగు వారాలు కష్టపడితే రూ.4 వేలు కూలి డబ్బులు వచ్చాయి. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలో వేశామని అధికారులు చెప్పారు. తీసుకోవడానికి వెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకుంటున్నామని బ్యాంకోళ్లు చెప్పారు. మా తండ్రి దినకర్మలు ఉన్నాయని చెప్పి బతిమాలడంతో రూ.2 వేలు అప్పుకు జమ చేసుకుని రూ.2 వేలు ఇచ్చారు. మా గ్రూపు సభ్యులంతా కలిసి తీసుకున్న అప్పుకు ఆ సొమ్ము జమ చేశామంటున్నారు. నేను తీసుకున్న వ్యక్తిగత బాకీలో రాసుకోమంటే కుదరదంటున్నారు. నమ్మి ఓటేస్తే మా కడుపులు కాలుస్తారా. ఇదేం దారుణమయ్యా. – వానపల్లి దుర్గ, ఉపాధి కూలీ, ధర్మవరం ఎలా బతకాలి ఏ పనులూ దొరక్కపోవడంతో ఉపాధి పనులకు వెళుతున్నాం. చేతిదాకా వచ్చిన కూడు నోటిదాకా రావడం లేదు. కూలి డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేశారు. బ్యాంకుకెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకున్నామని చెప్పారు. కూలి డబ్బులు లేకపోతే మాలాంటోళ్లు ఎలా బతికేది. ఊరి పెద్దల సాయంతో వెళ్లి బ్యాంకోళ్లను బతిమాలుకుంటే రూ.2 వేలు కట్ చేసుకుని మిగిలిన సొమ్ము ఇచ్చారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దంటే మానేశాం. ఇప్పుడు కూలి డబ్బులు కూడా మాకు దక్కనివ్వటం లేదయ్యా. ఇలాగైతే మేమెలా బతకాలి. – పొలుమాటి వెంకాయమ్మ, ఉపాధి కూలి, ధర్మవరం కూలీలకు ఇబ్బందే కూలీలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పనులు చేసిన కూలీలకు బ్యాంకుల ద్వారా కూలి డబ్బు చెల్లిస్తున్నాం. డ్వాక్రా రుణాలు బకాయి ఉన్నారన్న కారణంగా మహిళా కూలీల వేతనాలను బ్యాంకర్లు ఆ ఖాతాలకు జమ చేసుకుంటున్నారని తెలిసింది. ప్రభుత్వం కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. వారి కూలి డబ్బుల్ని బకాయిలకు జమ చేసుకోవడం వల్ల ఆయా కుటుంబాలు ఇబ్బందిపడతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం – ఎ.రాము, ఎంపీడీవో, కొవ్వూరు -
అప్పుడు కట్టొద్దన్నారు
జంగారెడ్డిగూడెం : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్ నుంచి 170 మంది మహిళలకు నోటీసులు అందాయి. దీంతో ఆ మహిళలంతా బ్యాంక్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక జగ్జీవన్‌రామ్ నగర్లో 17 గ్రూపులకు సంబంధించి 170 మందికి బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాటిని అందుకున్న మహిళలంతా బ్యాంక్ వద్దకు చేరుకుని ఇదేం దారుణమంటూ అధికారులను నిలదీశారు. మరణించిన వారినీ వదల్లేదు మృతి చెందిన డ్వాక్రా మహిళల పేరిట కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వర్షిత గ్రూపునకు చెందిన పినెల్లి సావిత్రి ఏడాది క్రితం మరణించింది. సావిత్రి తల్లి ముప్పిడి వీరమ్మ కూలి పనులు చేసుకుంటూ మనుమరాలిని చదివించుకుంటోంది. వర్షిత గ్రూప్‌లోని సభ్యులంతా కలసి రూ.50 వేలు రుణం తీసుకోగా, రూ. 80వేలు చెల్లించాలని అధికారులు నోటీసు పంపించారు. మృతురాలు సావిత్రికి పిన్నికూతురైన మల్లెల రఘుపతి ఆ నోటీసు తీసుకుని ఆందోళనతో బ్యాంక్‌కు చేరుకుంది. నడ్డివిరిచే వడ్డీలు జగ్జీవన్‌రామ్ నగర్‌లోని పావని గ్రూప్ మహిళలు రూ.1.47 లక్షలను రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.92 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. ఇదే గ్రూప్ సభ్యులు గృహ రుణం కింద రూ.80 వేలు తీసుకోగా, రూ.2.46 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. భార్గవి గ్రూప్ మహిళలు రూ.లక్ష తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.87 లక్షలు చెల్లించాలని.. అరుంధతి గ్రూప్ సభ్యులు రూ.1.81 లక్షల రుణం తీసుకోగా, రూ 3.51 లక్షలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు. అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు నోటీసులా నోటీసులు అందుకున్న 17 గ్రూపులకు చెందిన 170 మంది మహిళలు బ్యాంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని నమ్మబలికారని, ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ రుణం చెల్లించవద్దని ఎన్నికల సభల్లో చెప్పారని బాధిత మహిళలంతా గుర్తు చేశారు. ఇప్పుడు అసలుకు రెండింతలు వడ్డీ వేసి తమ నడ్డి విరిగేలా నోటీసులు ఇచ్చి రుణాల వసూళ్లకు తమ ఇళ్లపైకి వస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రుణం చెల్లించకపోతే తమ ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపారని మహిళలు ధ్వజమెత్తారు. ‘తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీలు చెల్లించవద్దన్నారు. అసలుతోపాటు వడ్డీలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ మాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు ఆ హామీల విషయం మాకు తెలియదంటున్నారు. రుణం కట్టాల్సిందే అంటున్నారు. ఇదేం ఇరకాటమో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. రుణమాఫీ చేయడం చేతకాదని చెబితే తినో, తినకో రుణాలు తీర్చుకునే వాళ్లమని, ఇప్పుడు పెద్దఎత్తున వడ్డీలు వేసి అసలు కంటే రెండు రెట్లు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హామీలు అమలు చేయడమా.. ప్రజలను వంచించడమా అని ప్రశ్నించారు. దారుణంగా మోసగించారు కూలీ నాలీ చేసుకుని బతుకున్నాం. అంతంత వడ్డీలు ఎలా కట్టాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారని కట్టలేదు. తీరా.. రుణం రద్దుకాకపోగా రూ.1.20 లక్షలు తీసుకుంటే ఇప్పుడు రూ.3 లక్షలు కట్టమని నోటీసులు అందాయి. ఈ మొత్తాన్ని మేం ఎలా కట్టాలి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – బొబ్బర వెంకాయమ్మ, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం అధికారులు బెదిరిస్తున్నారు బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు. డ్వాక్రా రుణం చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణం మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.లక్ష తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.2.50 లక్షలు అయ్యింది. రోజువారీ పనిచేసుకునే మేం ఇంత సొమ్ము ఎక్కడినుంచి తెచ్చి కట్టాలి. – కొత్తూరు లక్ష్మి, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం చనిపోయిన వాళ్లకూ నోటీసులు ఇచ్చారు మా పెద్దమ్మ కూతురు పినెల్లి సావిత్రి. ఆమె మృతిచెంది ఏడాదైంది. చనిపోయిన సావిత్రి పేరిట కూడా రుణం కట్టాలని నోటీసులు ఇచ్చారు. మా పెద్దమ్మ ముప్పిడి వీరమ్మ వృద్ధురాలు. కూలి పనులు చేసుకుంటూ సావిత్రి కూతుర్ని చదివిస్తోంది. ఆ వృద్ధురాలు బకాయిల్ని ఎలా చెల్లించగలదు. – మల్లెల రఘుపతి, జంగారెడ్డిగూడెం -
అప్పుడు కట్టొద్దన్నారు
జంగారెడ్డిగూడెం : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్ నుంచి 170 మంది మహిళలకు నోటీసులు అందాయి. దీంతో ఆ మహిళలంతా బ్యాంక్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక జగ్జీవన్‌రామ్ నగర్లో 17 గ్రూపులకు సంబంధించి 170 మందికి బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాటిని అందుకున్న మహిళలంతా బ్యాంక్ వద్దకు చేరుకుని ఇదేం దారుణమంటూ అధికారులను నిలదీశారు. మరణించిన వారినీ వదల్లేదు మృతి చెందిన డ్వాక్రా మహిళల పేరిట కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వర్షిత గ్రూపునకు చెందిన పినెల్లి సావిత్రి ఏడాది క్రితం మరణించింది. సావిత్రి తల్లి ముప్పిడి వీరమ్మ కూలి పనులు చేసుకుంటూ మనుమరాలిని చదివించుకుంటోంది. వర్షిత గ్రూప్‌లోని సభ్యులంతా కలసి రూ.50 వేలు రుణం తీసుకోగా, రూ. 80వేలు చెల్లించాలని అధికారులు నోటీసు పంపించారు. మృతురాలు సావిత్రికి పిన్నికూతురైన మల్లెల రఘుపతి ఆ నోటీసు తీసుకుని ఆందోళనతో బ్యాంక్‌కు చేరుకుంది. నడ్డివిరిచే వడ్డీలు జగ్జీవన్‌రామ్ నగర్‌లోని పావని గ్రూప్ మహిళలు రూ.1.47 లక్షలను రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.92 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. ఇదే గ్రూప్ సభ్యులు గృహ రుణం కింద రూ.80 వేలు తీసుకోగా, రూ.2.46 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. భార్గవి గ్రూప్ మహిళలు రూ.లక్ష తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.87 లక్షలు చెల్లించాలని.. అరుంధతి గ్రూప్ సభ్యులు రూ.1.81 లక్షల రుణం తీసుకోగా, రూ 3.51 లక్షలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు. అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు నోటీసులా నోటీసులు అందుకున్న 17 గ్రూపులకు చెందిన 170 మంది మహిళలు బ్యాంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని నమ్మబలికారని, ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ రుణం చెల్లించవద్దని ఎన్నికల సభల్లో చెప్పారని బాధిత మహిళలంతా గుర్తు చేశారు. ఇప్పుడు అసలుకు రెండింతలు వడ్డీ వేసి తమ నడ్డి విరిగేలా నోటీసులు ఇచ్చి రుణాల వసూళ్లకు తమ ఇళ్లపైకి వస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రుణం చెల్లించకపోతే తమ ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపారని మహిళలు ధ్వజమెత్తారు. ‘తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీలు చెల్లించవద్దన్నారు. అసలుతోపాటు వడ్డీలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ మాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు ఆ హామీల విషయం మాకు తెలియదంటున్నారు. రుణం కట్టాల్సిందే అంటున్నారు. ఇదేం ఇరకాటమో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. రుణమాఫీ చేయడం చేతకాదని చెబితే తినో, తినకో రుణాలు తీర్చుకునే వాళ్లమని, ఇప్పుడు పెద్దఎత్తున వడ్డీలు వేసి అసలు కంటే రెండు రెట్లు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హామీలు అమలు చేయడమా.. ప్రజలను వంచించడమా అని ప్రశ్నించారు. దారుణంగా మోసగించారు కూలీ నాలీ చేసుకుని బతుకున్నాం. అంతంత వడ్డీలు ఎలా కట్టాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారని కట్టలేదు. తీరా.. రుణం రద్దుకాకపోగా రూ.1.20 లక్షలు తీసుకుంటే ఇప్పుడు రూ.3 లక్షలు కట్టమని నోటీసులు అందాయి. ఈ మొత్తాన్ని మేం ఎలా కట్టాలి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – బొబ్బర వెంకాయమ్మ, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం అధికారులు బెదిరిస్తున్నారు బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు. డ్వాక్రా రుణం చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణం మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.లక్ష తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.2.50 లక్షలు అయ్యింది. రోజువారీ పనిచేసుకునే మేం ఇంత సొమ్ము ఎక్కడినుంచి తెచ్చి కట్టాలి. – కొత్తూరు లక్ష్మి, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం చనిపోయిన వాళ్లకూ నోటీసులు ఇచ్చారు మా పెద్దమ్మ కూతురు పినెల్లి సావిత్రి. ఆమె మృతిచెంది ఏడాదైంది. చనిపోయిన సావిత్రి పేరిట కూడా రుణం కట్టాలని నోటీసులు ఇచ్చారు. మా పెద్దమ్మ ముప్పిడి వీరమ్మ వృద్ధురాలు. కూలి పనులు చేసుకుంటూ సావిత్రి కూతుర్ని చదివిస్తోంది. ఆ వృద్ధురాలు బకాయిల్ని ఎలా చెల్లించగలదు. – మల్లెల రఘుపతి, జంగారెడ్డిగూడెం -
అప్పుడు కట్టొద్దన్నారు
జంగారెడ్డిగూడెం : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్ నుంచి 170 మంది మహిళలకు నోటీసులు అందాయి. దీంతో ఆ మహిళలంతా బ్యాంక్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక జగ్జీవన్‌రామ్ నగర్లో 17 గ్రూపులకు సంబంధించి 170 మందికి బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాటిని అందుకున్న మహిళలంతా బ్యాంక్ వద్దకు చేరుకుని ఇదేం దారుణమంటూ అధికారులను నిలదీశారు. మరణించిన వారినీ వదల్లేదు మృతి చెందిన డ్వాక్రా మహిళల పేరిట కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వర్షిత గ్రూపునకు చెందిన పినెల్లి సావిత్రి ఏడాది క్రితం మరణించింది. సావిత్రి తల్లి ముప్పిడి వీరమ్మ కూలి పనులు చేసుకుంటూ మనుమరాలిని చదివించుకుంటోంది. వర్షిత గ్రూప్‌లోని సభ్యులంతా కలసి రూ.50 వేలు రుణం తీసుకోగా, రూ. 80వేలు చెల్లించాలని అధికారులు నోటీసు పంపించారు. మృతురాలు సావిత్రికి పిన్నికూతురైన మల్లెల రఘుపతి ఆ నోటీసు తీసుకుని ఆందోళనతో బ్యాంక్‌కు చేరుకుంది. నడ్డివిరిచే వడ్డీలు జగ్జీవన్‌రామ్ నగర్‌లోని పావని గ్రూప్ మహిళలు రూ.1.47 లక్షలను రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.92 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. ఇదే గ్రూప్ సభ్యులు గృహ రుణం కింద రూ.80 వేలు తీసుకోగా, రూ.2.46 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. భార్గవి గ్రూప్ మహిళలు రూ.లక్ష తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.87 లక్షలు చెల్లించాలని.. అరుంధతి గ్రూప్ సభ్యులు రూ.1.81 లక్షల రుణం తీసుకోగా, రూ 3.51 లక్షలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు. అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు నోటీసులా నోటీసులు అందుకున్న 17 గ్రూపులకు చెందిన 170 మంది మహిళలు బ్యాంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని నమ్మబలికారని, ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ రుణం చెల్లించవద్దని ఎన్నికల సభల్లో చెప్పారని బాధిత మహిళలంతా గుర్తు చేశారు. ఇప్పుడు అసలుకు రెండింతలు వడ్డీ వేసి తమ నడ్డి విరిగేలా నోటీసులు ఇచ్చి రుణాల వసూళ్లకు తమ ఇళ్లపైకి వస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రుణం చెల్లించకపోతే తమ ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపారని మహిళలు ధ్వజమెత్తారు. ‘తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీలు చెల్లించవద్దన్నారు. అసలుతోపాటు వడ్డీలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ మాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు ఆ హామీల విషయం మాకు తెలియదంటున్నారు. రుణం కట్టాల్సిందే అంటున్నారు. ఇదేం ఇరకాటమో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. రుణమాఫీ చేయడం చేతకాదని చెబితే తినో, తినకో రుణాలు తీర్చుకునే వాళ్లమని, ఇప్పుడు పెద్దఎత్తున వడ్డీలు వేసి అసలు కంటే రెండు రెట్లు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హామీలు అమలు చేయడమా.. ప్రజలను వంచించడమా అని ప్రశ్నించారు. దారుణంగా మోసగించారు కూలీ నాలీ చేసుకుని బతుకున్నాం. అంతంత వడ్డీలు ఎలా కట్టాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారని కట్టలేదు. తీరా.. రుణం రద్దుకాకపోగా రూ.1.20 లక్షలు తీసుకుంటే ఇప్పుడు రూ.3 లక్షలు కట్టమని నోటీసులు అందాయి. ఈ మొత్తాన్ని మేం ఎలా కట్టాలి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – బొబ్బర వెంకాయమ్మ, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం అధికారులు బెదిరిస్తున్నారు బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు. డ్వాక్రా రుణం చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణం మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.లక్ష తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.2.50 లక్షలు అయ్యింది. రోజువారీ పనిచేసుకునే మేం ఇంత సొమ్ము ఎక్కడినుంచి తెచ్చి కట్టాలి. – కొత్తూరు లక్ష్మి, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం చనిపోయిన వాళ్లకూ నోటీసులు ఇచ్చారు మా పెద్దమ్మ కూతురు పినెల్లి సావిత్రి. ఆమె మృతిచెంది ఏడాదైంది. చనిపోయిన సావిత్రి పేరిట కూడా రుణం కట్టాలని నోటీసులు ఇచ్చారు. మా పెద్దమ్మ ముప్పిడి వీరమ్మ వృద్ధురాలు. కూలి పనులు చేసుకుంటూ సావిత్రి కూతుర్ని చదివిస్తోంది. ఆ వృద్ధురాలు బకాయిల్ని ఎలా చెల్లించగలదు. – మల్లెల రఘుపతి, జంగారెడ్డిగూడెం -
రుణాల వసూళ్లపై అలసత్వం వహిస్తే చర్యలు
పులివెందుల రూరల్ : రుణాల వసూళ్లపై సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయ భవనంలో నియోజకవర్గంలోని డీఆర్డీఏలోని ఏపీఎం, సీసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులకు బ్యాంకర్ల నుంచి విరివిగా రుణాలు అందించి.. వాటిని సభ్యులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్వాక్రా మెంబర్లు, సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్మీ కంపోస్ట్ యూనిట్లు, పొట్టేళ్ల పెంపకం, మనకోడితో పాటు ఇతర పథకాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏరియా కో ఆర్డినేటర్ వసంతకుమారి, ఏపీఎం, సీసీలు తదితరులు పాల్గొన్నారు. -
ఆయన మాట.. ముంచె నట్టేట!
డ్వాక్రా మహిళలకు బ్యాంకర్ల బెదిరింపులు ఆస్తులు జప్తు అంటూ బ్యాంకు నోటీసులు బెంబేలెత్తుతున్న డ్వాక్రా మహిళలు వైఎస్సార్ సీపీ నేతల వద్ద ఆవేదన ‘సకాలంలో వాయిదాలు కట్టకపోవడం వల్ల మీకు వడ్డీ రాయితీ రాకపోవడంతో పాటు చట్టరీత్యా తీసుకునే చర్యలకు మీరే బాధ్యులు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే అవకాశంతో పాటు అర్హత కోల్పోతారు. బాకీ వసూలుకు కోర్టు, పోలీసు, రెవెన్యూ వారి సహకారంతో మీ ఆస్తులు, సామగ్రి, ఇతర వస్తువులను జప్తు చేస్తాం.’ – డ్వాక్రా రుణాలు చెల్లించాలంటూ మండపేట మండలం తాపేశ్వరంలోని ఐఓబీ ఇచ్చిన నోటీసు సారాంశమిది. – మండపేట డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది నేనేనని చెప్పుకొనే చంద్రబాబు ఇప్పుడు ఆ సంఘాలను నిండా ముంచారు. రుణమాఫీ జరగక వడ్డీతో కలి పి రుణభారం పెరిగిపోగా, తిరిగి చెల్లించకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. నమ్మి ఓట్లేస్తే, కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే మండలంలోని తాపేశ్వరంలో డ్వాక్రా మహిళలకు కోర్టు ద్వారా బ్యాంకు నోటీసులు జారీ చేయగా, జిల్లాలోని పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. మాట మార్చిన బాబు డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తాం, బకాయిలు ఎవరూ చెల్లించనవసరం లేదంటూ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం డ్వాక్రా సంఘాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు హామీని నమ్మి ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచీ మహిళలు రుణాలు చెల్లించడం మానేశారు. అధికారంలోకి వచ్చాక రుణాలన్నీ రద్దు కావు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వరకు భారం మాత్రమే తగ్గిస్తామంటూ మాటమార్చారు. ఆ మొత్తాన్ని మూడు దఫాలుగా పొదుపు ఖాతాలకు జమ చేస్తామనడంతో కంగుతినడం మహిళల వంతైంది. వారి అప్పులపై వడ్డీ భారం పెరిగిపోయింది. బ్యాంకుల వేధింపులు జిల్లావ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో సుమారు 18 వేల గ్రూపులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 77,800 సంఘాలున్నాయి. అధిక శాతం సంఘాలు వడ్డీ రాయితీకి దూరమయ్యాయి. పాత బకాయిలు పేరుకుపోయాయంటూ కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపుతుండటంతో, రుణ లక్ష్యాలను చేరుకోవడం గగనంగా మారింది. పొదుపు ఖాతాల్లోని సొమ్మును వడ్డీకి జమ చేసుకుంటున్నారని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్యాంకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. సకాలంలో రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ ఇప్పటికే మండపేట మండలం తాపేశ్వరంలోని బ్యాంకు అధికారులు డ్వాక్రా సంఘాలకు కోర్టు నోటీసులు జారీచేయడం వెలుగుచూసింది. నమ్మించి మోసగించారు : వైఎస్సార్ సీపీ నేతల వద్ద ఆవేదన రుణాలు మాఫీ చేస్తామంటూ నమ్మించి మోసగించారని తాపేశ్వరంలోని డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు సొమ్మును వడ్డీగా జమ చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు రెండు రోజుల క్రితం డ్వాక్రా మహిళలను కలిశారు. బ్యాంకు నుంచి వచ్చిన కోర్టు నోటీసులను మహిళలు వారికి చూపించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి డ్వాక్రా మహిళలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. అధైర్యపడవద్దని, రుణమాఫీ హామీ అమలుకు అధికార పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు వారి వెంట ఉన్నారు. నమ్మి ఓట్లేస్తే.. నోటీసులిప్పిస్తున్నారు గతంలో సకాలంలో రుణాలు చెల్లించేవాళ్లం. రుణమాఫీ చేయక అసలు, వడ్డీ కలిపి రుణభారం బాగా పెరిగిపోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మాకు కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నారు. – దొండపాటి సరస్వతి, తాపేశ్వరం ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు రుణాలు చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. మా ఖాతాలోని పొదుపు సొమ్మును కూడా వడ్డీగా జమ చేసుకున్నారు. తరచూ వచ్చి మమ్మిల్ని బెదిరించి వెళుతున్నారు. రేషన్ సరుకులు, మీ పిల్లల స్కాలర్షిప్లు, పింఛను సాయాన్ని ఆపేస్తామంటున్నారు. – కౌరోజు మంగ, తాపేశ్వరం చెప్పిన వారిని తీసుకురమ్మంటున్నారు రుణాలు రద్దయిపోతాయి, కట్టొద్దని చెప్పడం వల్లే చెల్లించలేదని చెబితే, మాకు సంబంధం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రు ణాలు కట్టొద్దని చెప్పిన వారిని తీసుకురమ్మంటున్నారు. వచ్చినప్పుడల్లా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాం. – తాతపూడి పాప, తాపేశ్వరం -
ఏ పంట వేసినా నష్టాలే: జగన్
-
ఏ పంట వేసినా నష్టాలే: జగన్
అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తా.. వేలేరుపాడు : ‘పోలవరం ప్రాజెక్ట్ కోసం మీరు త్యాగం చేస్తున్నారు.. మీకు జరిగిన అన్యాయంపై మీరడిగేది న్యాయమేకదన్నా.. అత్యాశ కాదు.. సమంజసంగానే అడుగుతున్నారు.. మీ కోర్కెలు ఎవరూ కాదనలేరు.. పాలకులపై ఒత్తిడి తెచ్చి.. మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తా..’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వాసిత రైతులకు భరోసా ఇచ్చారు. తమ సమస్యలు తీర్చాలని కుక్కునూరులో 17 రోజులుగా వారు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, జంగారెడ్డిగూడెం: ‘‘రాష్ట్రంలో పొగాకు రైతులు అతి దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఏ పంట కూ మద్దతు ధర రావడం లేదు. వరి దగ్గర నుంచి పామాయిల్, పొగాకు దాకా సాగు చేసినా రైతన్నలకు నష్టాలే మిగులుతున్నాయి. కోనసీమలో రైతులు పంట విరామం(క్రాప్ హాలిడే) ప్రకటిస్తామంటున్నారు. పంటలకు మద్దతు ధర దక్కడం లేదని ధర్నా చేస్తామన్న అన్నదాతలను సాక్షాత్తూ హోంమంత్రే హెచ్చరించారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఆయన బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని 1వ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పొగాకు రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అధైర్యపడవద్దు.. జీలుగుమిల్లి : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చేతగాని సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలకు కోర్టు నుంచి నోటీసులు పంపించడంపై జగన్ మండిపడ్డారు. జీలుగుమిల్లి మండలానికి వచ్చిన వైఎస్ జగన్‌ను లక్ష్మీపురం, జీలుగుమిల్లి, తాటియాకులగూడెం గ్రామాల్లో డ్వాక్రా మహిళలు కలిశారు. రుణమాఫీ చేయకపోగా తమకు లీగల్ నోటీసులు ఇస్తున్నారని వాపోయారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టకోకుండా డ్వాక్రా మహిళలను మోసగించారని, అక్కడితో ఆగకుండా కోర్టుల నుంచి నోటీసులు ఇవ్వడం చాలా దారుణమని అన్నారు. డ్వాక్రా మహిళలెవరూ అధైర్యపడవద్దని, వారందరికీ తాను అండగా ఉంటానని అభయమిచ్చారు. -
పాలకుడు చేసిన పాపం...అక్క చెల్లెళ్లకు శాపం
- పశ్చిమగోదావరిలో డ్వాక్రా మహిళలకు కోర్టు సమన్లు - నాడు రుణాలన్నీ మాఫీ అన్నారు.. ఇపుడు కోర్టులకీడుస్తున్నారు.. - ఘొల్లుమంటున్న డ్వాక్రా మహిళలు..అప్పు చెల్లించినా కొందరికి సమన్లు సాక్షి, నరసాపురం : ‘డ్వాక్రా మహిళలూ.. మీరు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల బకాయిల్లో ఒక్క పైసా కూడా కట్టొద్దు. నేను అధికారంలోకి రాగానే మీ అప్పులన్నీ మాఫీ చేసేస్తా’ ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఎన్నికలయిపోయాయి.. వాగ్దానాలన్నీ అటకెక్కిపోయాయి... డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలలో పైసా కూడా మాఫీ కాలేదు. అప్పులు తడిసిమోపెడయ్యాయి. వడ్డీలు తలకుమించిన భారంగా పరిణమించాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో బ్యాంకుల నుంచి నోటీసులు, వత్తిళ్లతో మహిళలు సతమతమవుతున్నారు. ఇదే తరుణంలో వారి తలపై మరో పిడుగుపడింది. కోర్టుల నుంచి ఏకంగా సమన్లు అందుతున్నాయి. తక్షణమే అప్పు చెల్లించాలని... లేదంటే కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందన్నది ఆ సమన్ల సారాంశం. కోర్టు సమన్లతో మహిళలంతా బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలకు రెండురోజులుగా కోర్టు సమన్లు అందుతున్నాయి. అసలు అప్పు తీసుకోని వారికి సైతం సమన్లు అందుతుండడంతో వారు ఘొల్లుమంటున్నారు. బకాయి మొత్తం చెల్లించినా.. సీతారామపురంలోని 7 గ్రూపులకు చెందిన 70 మంది మహిళలు 2009-13 సంవత్సరాల మధ్య గ్రామంలోని ఎస్బీఐ శాఖ నుంచి అప్పు తీసుకున్నారు. వారిలో చాలామంది ఆ మొత్తాలను తిరిగి చెల్లించారు. అయినా ఇంకా బకాయిలు ఉన్నాయని, తక్షణమే వాటిని చెల్లించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవంటూ నరసాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి అందరికీ సమన్లు అందాయి. అప్పు తీసుకున్నవారికి, తీసుకోని వారికి, అప్పు కట్టేసిన వారికి కూడా ఈ నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బకాయిదారులంతా న్యాయవాది ద్వారా కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో ఆగస్టు 9న కోర్టుకు హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. బకాయి చెల్లించినా నోటీసులు వచ్చాయని, ఆ అప్పులతో సంబంధం లేని వారికీ నోటీసులు ఇచ్చారని మహిళలు చెబుతున్నారు. బ్యాంకుకు వెళ్లి నోటీసులు గురించి అడిగితే కోర్టులో తేల్చుకోండని బ్యాంకు అధికారులు సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కోర్టుకు వెళ్లాల్సినంత తప్పు ఏం చేశామని వాపోతున్నారు. ఈ మహిళలు బ్యాంకు నుంచి రూ.17 లక్షల రుణం తీసుకున్నారు. అయితే వడ్డీతో కలిపి రూ.28 లక్షలు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొనడం విశేషం. దీంతో దిక్కుతోచని మహిళలు ఏం చేయాలో తెలియక ఐకేపీ కార్యాలయాల చుట్టూ, బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయం తమ పరిధిలో లేదని, కోర్టు ద్వారానే తేల్చుకోండని బ్యాంకు అధికారులు సమాధానం ఇవ్వడంతో అవాక్కవుతున్నారు. మహిళల ఆందోళనబాట... కోర్టు నుంచి సమన్లు అందుకున్న మహిళలంతా తమను నిలువునా మోసం చేసిన చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా ఆందోళన బాటపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. స్పందన, విజయా సింగ్, ప్రియాంక గాంధీ, జ్యోతి, అరుణ, ప్రియదర్శిని గ్రూపులకు చెందిన సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమబాట పట్టాలని, అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని నిర్ణయించారు. సొమ్ము మొత్తం కట్టేశాను 2008లో బ్యాంకు నుంచి రూ.20 వేలు అప్పు తీసుకున్నా. వడ్డీతో పాటు తిరిగి చెల్లించాను. ఇప్పుడు రూ.2 లక్షలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. - పిల్లి అనితాబాబూజీ, పిల్లివారి పేట, సీతారామపురం కట్టినవారికీ సమన్లు దుర్మార్గం మా గ్రూపులో ఎవరైనా సొమ్ము చెల్లించకపోతే వారికి నోటీసులు ఇవ్వాలి. అంతేతప్ప లక్షల్లో అప్పు ఉన్నారంటూ మిగతా వారందరికీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గం. - పట్టా లక్ష్మీకాంతం,పిల్లివారి పేట, సీతారామపురం వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు బ్యాంకులో 2008-13 మధ్య కాలంలో డ్వాక్రా రుణాలు పొందిన 70 మంది మహిళలకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేశాం. ఈ రుణాలన్నీ స్వయం సహాయక సంఘాల ద్వారా తీసుకున్నవే. ఏ ఒక్కరు చెల్లించకపోయినా గ్రూపు సభ్యులందరూ బాధ్యులే. ప్రస్తుతం వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. -పి.వాసుదేవరావు, బ్యాంక్ మేనేజర్ -
బోడుప్పల్ లో డ్వాక్రా మహిళల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని బోడుప్పల్‌లోని ఆంధ్రాబ్యాంక్ శాఖ వద్ద డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం దర్నా చేపట్టిన మహిళలు రుణాలు ఇవ్వకుండా మేనేజర్ వేధిస్తున్నాడని తెలిపారు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. బ్యాంకు అధికారులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా..వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
అవాక్కయ్యారు..!
డ్వాక్రా మహిళలకు అత్తెసరుగా ఇసుక ఆదాయం రుణ మాఫీ తరహాలోనే పంపిణీ ఉందంటూ పెదవి విరుపు సాక్షి ప్రతినిధి, గుంటూరు : డ్వాక్రా గ్రూపు సభ్యులు మరోసారి మోసపోయారు. ఇసుక రీచ్‌ల్లో వచ్చిన ఆదాయాన్ని సభ్యులకు పంచి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రతీ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేసుకొంటున్నారు. దానికనుగుణంగా తమకు భారీ ఆదాయం వస్తుందని సభ్యులు ఆశపడ్డారు. రీచ్‌ల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను చూసి, ప్రభుత్వం పంచనున్న ఆదాయాన్ని ఊహించుకుని ఊహల్లో విహరించారు. వీటికి భిన్నంగా సంవత్సర కాలానికి రూ.800 లోపే ఆదాయం లభించడంతో సభ్యులు బిత్తరపోతున్నారు. డ్వాక్రా రుణాల రద్దు హామీ తరహాలోనే రీచ్‌ల్లోని ఆదాయం పంపిణీ ఉందని సభ్యులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని తొమ్మిది రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల్లో ఈ రీచ్‌లు కొనసాగుతున్నాయి. కొన్ని రీచ్‌లు సంవత్సరం క్రితం మరి కొన్ని ఐదారు నెలల కిందట ప్రారంభమయ్యాయి. సంవత్సరం క్రితం ప్రారంభమైన రీచ్‌ల్లో ప్రభుత్వానికి లభించిన ఆదాయం నుంచి డ్వాక్రా గ్రూపులకు కొంత మొత్తాన్ని కేటాయించారు. దీన్ని లెక్క చూస్తే ఒక్కో సభ్యునికి నామమాత్రంగానే ఆదాయం సమకూరుతోంది. డ్వాక్రా గ్రూపులకు లభించిన ఆదాయ వివరాలు ... తాడేపల్లి మండలం ఉండవల్లి రీచ్‌లో సంవత్సరకాలంగా డ్వాక్రా గ్రూపు సభ్యులు పనిచేస్తున్నారు. జూలై నెలాఖరునాటికి 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించగా రూ. 15.60 కోట్లు ఆదాయం లభించింది. ఒక్కో క్యూబిక్‌మీటరుకు రూ.5 చొప్పున డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ.12 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఉండవల్లి గ్రామంలోని 720 గ్రూపులకు చెందిన 1740 మంది సభ్యులు ప్రభుత్వం కేటాయించిన ఆదాయాన్ని పంచుకుంటే ఒకొక్కరికి రూ.690లు లభించనుంది. అమరావతి మండలం మునగోడు ఇసుక రీచ్ నవంబరు నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1.60లక్షల క్యూబిక్ మీటర్లు విక్రయించారు. సభ్యులకు ఒక్కో క్యూబిక్ మీటర్‌కు 5 రూపాయల చొప్పున డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ.8 లక్షల ఆదాయం లభించనుంది. 500 సభ్యులు మునగోడు గ్రూపులో ఉంటే, ఒకొక్కరికి రూ.1600 ఆదాయం లభించనుంది. అచ్చంపేట మండలం కస్తల గ్రామంలో 38 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఇక్కడి రీచ్‌లో నవంబరు నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 2.43 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఈ రీచ్‌లో తవ్వారు. క్యూబిక్ మీటరుకు రూ.5 చొప్పున రూ.12.15 లక్షల ఆదాయాన్ని గ్రూపులకు కేటయించారు. కోనూరు గ్రామంలో 72 డ్వాక్రా సంఘాలున్నాయి. 2.49 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వడానికి అనుమతి ఉండగా 1.90 క్యూబిక్‌మీటర్ల ఇసుక తవ్వకాలు పూర్తిచేశారు. క్యూబిక్‌మీటరుకు రూ.5 చొప్పున రూ. 9.5 లక్షలు అదాయం గ్రూపునకు లభిస్తే, ఒక్కో సభ్యునికి రూ.1319 ఆదాయం లభించనుంది. ఇసుక రీచ్‌ల నుంచి తమకు నామమాత్రంగానే ఆదాయం లభిస్తోందని, వాహనాల రద్దీ, పొల్యూషన్ సమస్యలు తమను వెన్నాడుతుంటే ప్రభుత్వం మాత్రం కోట్లాది రూపాయాల ఆదాయాన్ని పొందుతోందని, రీచ్‌లు ఉన్న ప్రాంతాల గ్రూపులకు ప్రాధాన్యత ఇచ్చి లాభం శాతం పెంచాలని సభ్యులు కోరుతున్నారు. -
గాలికొదిలేశారు..!
డీఆర్డీఏకు తొమ్మిది నెలలుగా సారథి కరువు డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని విస్మరించిన అధికారులు రుణాల మంజూరు మృగ్యం రూ. 1,015 కోట్లకు గాను రూ.30 కోట్లు మాత్రమే మంజూరు అనంతపురం సెంట్రల్ : జిల్లాలో స్వయం సహాయక సంఘాల పనితీరు ఇంతకుముందు ఎంతో మెరుగ్గా ఉండేది. దీనివల్ల బ్యాంకర్లు లక్ష్యానికి మించి రుణాలిచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. లక్ష్యంలో 50 శాతం రుణాలివ్వడం కూడా గగనంగా మారింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాలకు రూ.1,015 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా రూ.30 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. గతంలో ప్రతి సంఘానికి రూ.5 లక్షల వరకూ రుణాలిచ్చేవారు. ఈ మొత్తాన్ని డ్వాక్రా మహిళలు జీవనోపాధి కోసం ఉపయోగించుకునేవారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు రుణాలివ్వాలంటేనే బ్యాంకర్లు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోయినా జిల్లాలో వేలాది సంఘాలు కంతులు సక్రమంగానే చెల్లిస్తున్నాయి. అయినా బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. కంతులు చెల్లిస్తున్నా రుణాలు ఎందుకివ్వరని బ్యాంకర్లను గట్టిగా ప్రశ్నించే అధికారులే కరువయ్యారు. గతంలో బ్యాంకర్లతో, క్షేత్రస్థాయి అధికారులతో వెలుగు సిబ్బంది నిత్యం సమావేశాలు నిర్వహిస్తుండేవారు. విరివిగా రుణాలు ఇప్పించేవారు. లక్ష్యానికి మంచి రుణాలిచ్చిన సమయంలో బ్యాంకర్లకు గౌరవంగా విందు కూడా ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం బ్యాంకర్లను సమన్వయం చేసుకోవడంలో ఐకేపీ అధికారులు విఫలమయ్యారు. దీనివల్ల సంఘాల పనితీరు అధ్వానంగా తయారవుతోంది. జిల్లాలో 52 వేల సంఘాలుంటే 6,700 మాత్రమే ఏ గ్రేడ్‌లో(పనితీరు మెరుగు) ఉన్నాయి. మరో 5 వేల సంఘాలు బీ గ్రేడ్(పర్వాలేదు)లో ఉన్నాయి. మిగిలిన 40,300 సంఘాలు సీ,డీ గ్రేడ్‌లో అంటే పూర్తి అధ్వానంగా నడుస్తున్నాయి. వరుస కరువుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల ఆర్థిక లావాదేవీలు పూర్తిగా పడిపోయాయి. ఉన్న ఊళ్లో ఉపాధి లేక వలస పోతున్నారు. ఇలాంటి సమయంలో డ్వాక్రా మహిళలకు విరివిగా రుణాలిప్పించి.. సొంతూళ్లలోనే ఉపాధి కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. డీఆర్డీఏ-వెలుగులో కీలకమైన ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టే ఖాళీగా ఉంది. రెండు ఏపీడీ పోస్టులు, కదిరి, ధర్మవరం, పామిడి, తాడిపత్రి ఏరియా కో ఆర్డినేటర్ పోస్టులు కొన్నేళ్ల నుంచి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ స్థానాల్లో ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన అధికారులు రెండు పడవలపై ప్రయాణం సజావుగా సాగించలేకపోతున్నారు. -
ఏయ్.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి?!
సాక్షి, విజయవాడ బ్యూరో: సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన మహిళా సంఘాల నేతలపై చంద్రబాబు పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి’ అంటూ తీవ్ర అసహనం ప్రదర్శించారు. దీనిపై వారు అభ్యంతరం తెలపడంతో క్షమాపణలు చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వామపక్ష మహిళా సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సు తర్వాత మహిళలంతా ర్యాలీగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారించి సీఎం వద్దకు 10 మందిని అనుమతించారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని, దీనివల్ల వారు ఇబ్బంది పడుతున్నారని ప్రగతి శీల మహిళా సంఘం నేత ఎం.లక్ష్మి చెప్పగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల జేబులో వేసుకోవడానికి ఎంతంటే అంత డబ్బులు ఇవ్వలేమని, ఉపాధి కోసమే డబ్బు ఇస్తామని చెప్పారు. ఇతర నేతలు ఇసుక ర్యాంపుల్లో మహిళలకు 25 శాతం వాటా రావాల్సివున్నా రావడంలేదని, రూ.150 కూలి మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. దీంతో సీఎం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఏయ్ ఎక్కువమాట్లాడుతున్నావేంటి.. నువ్వు నాకు చెప్పాలా’ అని లక్ష్మిపై విరుచుకుపడ్డారు. మిగిలిన నేతలు అభ్యంతరం చెప్పడంతో... సీఎం క్షమాణలు చెప్పారు. అనంతరం గుడి, బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు పెడుతున్నారని, దీనివల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా... ఎక్కడున్నాయో చూపించాలని గద్దించారు. రామకృష్ణాపురం బుడమేరు వంతెన దగ్గరే బెల్టుషాపు ఉందని దీంతో ఏపీ మహిళా సమాఖ్య నేత చెప్పగా... దాని సంగతి చూస్తానంటూ వెళ్లిపోయారు. తాము మాట్లాడుతుండగానే సీఎం వెళ్లిపోవడంపై మహిళా సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు బయటకు పంపించివేశారు. ప్రగతిశీల మహిళా సంఘం నేత లక్ష్మి మాట్లాడుతూ... ఇలాంటి సీఎంను ఎప్పుడూచూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కోరుమిల్లిలో పోలీసుల దాష్టీకం
-
మొండిచేయి
♦ డ్వాక్రా మహిళలకు కొత్త రుణం లేనట్లే ♦ ఖాతాల్లో మూలుగుతున్న ♦ రూ. 147 కోట్ల పెట్టుబడి నిధి డ్వాక్రా మహిళలకు రోజుకో కొత్త సమస్య ఎదురవుతోంది. కొత్త రుణాలైనా వస్తాయని ఆశిస్తే ఇప్పుడు వాటిపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. బ్యాంకర్లు మొండిచెయ్యి చూపుతుండడం, అధికారులు స్పందించక పోవడంతో డ్వాక్రా మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టుబడి నిధి పేరుతో సర్కారు బ్యాంకులకు రూ.147 కోట్లు పంపింది. దానికి 6 రెట్లు అధికంగా రుణాలు పొందే అవకాశం ఉన్నా డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదు. అనంతపురం సెంట్రల్ : జిల్లాలో డ్వాక్రా మహిళలకు రూ. 995 కోట్లు(పూర్తిగా రుణమాఫీ చేసింటే) రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇటీవల ప్రభుత్వం రూ.147 కోట్లు మంజూరు చేసింది. వీటిని వాడుకోవడానికి వీలులేదని ప్రభుత్వం మెల్లికపెట్టింది. పెట్టుబడి నిధిగా చూపించి బ్యాంకర్ల నుంచి అధికంగా రుణాలు తీసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వం ఉద్దేశం. రుణమాఫీ నిధులు విడుదల చేసే సమయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు చేసుకున్న పొదుపులో 6 రెట్లు అధికంగా బ్యాంకర్లు రుణాలు మంజూరుచేయాలనేది నిబంధన. ఈ ప్రకారం రూ. 147 కోట్లు స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ చేశారు. అలా సంఘాలకు దాదాపు రూ. 900 కోట్లు మంజూరు చేయాలి. అయితే డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయించాలనే ద్యాస అధికారుల్లో కన్పించడం లేదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా కొత్తగా ఏ ఒక్కరికీ రుణాలు మంజూరు కాలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్వాక్రా మహిళల జీవనోపాధి మెరుగుపర్చాలనే ద్యాస అధికారుల్లో కన్పించడం లేదు. గతంలో బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించి వారు ఆర్థికంగా అభివృద్ది చెందేలా ఒక కార్యచరణ ప్రణాళికల ద్వారా ముందుకు వెళ్లేవారు. రుణాలన్నీ చెల్లించిన సంఘాలకు కూడా కొత్త రుణం మంజూరు చేయక పోవడంతో మళ్ళీ మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోందని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రుణాలూ ఇవ్వలేదు : సంఘంలో రూ. 50 వేలు అప్పు తీసుకున్నా. ఇదంతా మాఫీ అవుతుందని అనుకున్నా కాలేదు. పెట్టుబడి నిధి రూపంలో ఇస్తున్న డబ్బు ద్వారా అదనంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుల మాత్రం రుణాలు మంజూరు చేయడం లేదు. మేము కట్టేదే తప్పా వచ్చేది ఏందీ లేదన్నట్లు తయారైంది. నరసమ్మ, మాదవరాజు మహిళా సంఘం, సిద్దరాంపురం, బుక్కరాయసముద్రం మండలం -
లంచం అడుగుతున్నారు..
మెప్మా కార్యాలయంలో డ్వాక్రా మహిళల ధర్నా ఖమ్మం సిటీ : బ్యాంకు రుణం అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి మెప్మా కార్యాలయంలో లంచం అడుగుతున్నారని ఆరోపిస్తూ..ఖమ్మం గాంధీ సమాఖ్యకు చెందిన మూడు డ్వాక్రా సంఘాల మహిళలు బుధవారం ఆందోళన చేశారు. కార్పొరేషన్ కార్యాలయం అవరణలోని నగర మెప్మా కార్యాలయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లక్షకు రూ.500 మామూలు ఇస్తేనే సంతకం పెడతామని డిమాండ్ చేశారని ఆరోపించారు. అలా ఇవ్వకపోతే డ్యాక్యుమెంటేషన్ సరిగా లేదని, తీర్మానం కాపీ లేదని, డ్యాకుమెంటేషన్ తనిఖీలు చేశాక సంతకం పెడతమని ఇబ్బంది పెడుతున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. సంతకం చేయాలని జూనియర్ మ్రైక్రో ఫైనాన్స్ అధికారి వెంకటేశ్వర్లను కోరితే..అరగంటలో వస్తానని కార్యాలయం నుంచి వెళ్లి గంటల తరబడి రాలేదని తెలిపారు. సీఓ సుల్తానా దురుసుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సిబ్బంది ఆందోళన విషయూన్ని పీడీ వేణుమనోహర్రావుకు, బిల్డింగ్ ఇన్‌స్ట్రక్చర్ కమలశ్రీకి ఫోన్లో సమస్యను వివరించారు. సీఓ ఉపేంద్రమ్మను వెళ్లి డాంక్యుమెంటేషన్పై సంతకం చేసి ఇవ్వాలని ఆదేశించడంతో డ్వాక్రా మహిళలు ఆందోళన విరమించారు. ఈ విషయమై..మైక్రో ఫైనాన్స్ అధికారి వెంకటేశ్వర్లుకు ‘సాక్షి’ వివరణ కోరగా..తాము ఎవ్వరినీ లంచం అడగలేదని, అలా అడిగి ఉంటే రుజువు చేయూలని అన్నారు. డ్యాక్యుమెంటేషన్లను సీఓతో విచారణ చేయించి, అన్నీ పరిశీలించాకనే అందజేస్తామని తెలిపారు. -
నాటి అర్జీలకు దిక్కు లేదు..
నేటి నుంచి రెండో విడత జన్మభూమి- మావూరు డ్వాక్రాసంఘాల పొదుపు ఖాతాలకు రూ.3వేల జమ కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు సాక్షి, విశాఖపట్నం : జన్మభూమి -మావూరు మళ్లీ మొదలవుతోంది. గతేడాది అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందిన అర్జీలకు నేటికీ అతిగతిలేదు. మళ్లీ మరోసారి ఈ జాతర ప్రారంభ మవుతోంది. ఒక వైపు రుణమాఫీ వర్తించని రైతులు, మాఫీ పేరుతో మోసపోయిన డ్వాక్రా మహిళలు, తొలిగించిన పింఛన్, రేషన్‌కార్డుదారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడాదిగా నాన్చుతూ ఎట్టకేలకు డ్వాక్రా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి పేరిట రూ.3వేలు జమకు ఈ గ్రామసభలను వేదికగా చేసుకుంటున్నారు. దాదాపు మూడో వంతు సంఘాలకు ఒక్కోదానికి రూ.2 నుంచి 5లక్షల వరకు వడ్డీతో కలిపి అప్పులు పేరుకుపోయాయి. అలాంటిది సంఘానికి రూ.10వేల చొప్పున రివాల్వింగ్ పండ్ జమ చేస్తామని చెప్పిన సర్కార్ చివరకు మొడటి విడతగా రూ.3వేల చొప్పున వారి పొదుపు ఖాతాలో జమకు సిద్ధమైంది. తొలుత జిల్లాకు రూ.213 కోట్లు మంజూరు చేశామని చెప్పిన ప్రభుత్వం చివరకు ఆ మొత్తాన్ని రూ.187 కోట్లకు కుదించింది. అలాగే అమలులో ఏడాది జాప్యం జరిగినందున వడ్డీ రాయితీ ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చిన పాలకులు చివరకు ఆ వడ్డీలో కూడా భారీగానే కోతపెడుతున్నారు. రూ.65కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రూ.44కోట్లు మాత్రమే విడుదల చేసింది. అసలే రుణమాపీ అమలుకాకపోవడంతో మంచికాకమీద ఉన్న డ్వాక్రా సంఘాలు ఈ గ్రామ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. మరొక పక్క రుణమాఫీ మాయలో పడిఅప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల నుంచి ఇప్పటికే 40వేలకు పైగా అర్జీలందాయి. అతీ గతి లేని వీటి పరిస్థితిపై నిలదీసేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. గతేడాది నిర్వహించిన జన్మభూమి మావూరులో ఏకంగా 3.54లక్షల అర్జీలు రాగా, అధికారుల పరిశీలన తర్వాత వాటిలో అర్హమైనవంటూ లక్షా 92 వేల 202 అర్జీలను అప్లోడ్ చేశారు. వీటిలో అత్యధికంగా గృహరుణాలకోసం 48,224 మందిదరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత రేషన్‌కార్డుల కోసం 39,541 దరఖాస్తులొచ్చాయి. ఇంటి స్థలాలు..ఇతర రెవెన్యూ సమస్యల కోసం 32,791, కొత్త పింఛన్ల కోసం 30,231 అర్జీలొచ్చాయి. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్, ఉపాధి, గ్రామీణ నీటి సరఫరా తదితర 28 శాఖలకు చెందిన వేలాది అర్జీలు అప్లోడ్ చేశారు. ఇది చేపట్టి ఎనిమిదినెలలు గడుస్తున్నా వీటిలో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. పింఛన్ల కోసం జన్మభూమి మావూరుతో పాటు మండల, జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో అందిన దరఖాస్తులన్నీ పరిశీలించి పార్టీలకతీతంగా 44వేల మంది అర్హులుగా అధికారులు తేల్చారు. కానీ జన్మభూమి కమిటీలు మాత్రం వాటిలో 20వేల మందికి కోత పెట్టి కేవలం 24వేల మందికి మాత్రమే సిఫారసు చేశారు. వీటిలో 12.500 పింఛన్లకు మాత్రమే సర్కార్ ఆమోదముద్రవేసింది. వీటిని కూడా తొలగించిన వాటి స్థానంలోనే కొత్తగా మంజూరు చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ నేటినుంచి పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. -
పింఛన్ల మంజూరులో భారీ కోత
మచిలీపట్నం : ప్రభుత్వం పింఛనుదారులకు మొండిచేయి చూపింది. రైతు, డ్వాక్రా రుణమాఫీ మాదిరిగానే పింఛన్ల పంపిణీలోనూ కోత పెట్టింది. ఖర్చు తగ్గించుకోవటం, లేక ఇతరత్రా కారణాలు చూపి అర్హుల జాబితా నుంచి మూడొంతుల మందికి కోత పెడుతూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబరు, నవంబరుల్లో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా జన్మభూమి కమిటీ సభ్యులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పరిశీలించి జిల్లా వ్యాప్తంగా 41 వేల 927 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలో 13 వేల 203 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ఇటీవల తెగేసి చెప్పింది. పాత జాబితా కాకుండా అర్హుల జాబితాను మరోసారి తయారుచేసి పంపాలని జన్మభూమి కమిటీ సభ్యులకే ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో జన్మభూమి కమిటీ సభ్యులు కంగుతినాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి జాబితాలో 41 వేల 927 మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం నెలరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో అర్హత పొందిన వారి గృహాలకు వెళ్లి ఆ విషయం తెలియజేశామని జన్మభూమి కమిటీ సభ్యులు అంటున్నారు. ప్రభుత్వం పాత జాబితాలోని మూడొంతుల మంది లబ్ధిదారులకు పింఛను ఇవ్వబోమని, అర్హులను మీరే నిర్ధారించాలని తాజాగా సూచించటంతో తమ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని జన్మభూమి కమిటీ సభ్యులు వాపోతున్నారు. జూన్ మూడో తేదీ నుంచి జన్మభూమి కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో నూతన జాబితా ప్రకారం అర్హులకు పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. మళ్లీ జాబితాల తయారీ... ప్రభుత్వం మూడో వంతు మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేయడంతో జన్మభూమి కమిటీ సభ్యులు అందుకనుగునంగా జాబితాలను రాసే పనిలో పడ్డారు. టీడీపీకి ఓటు వేసినవారికి, తమ బంధువులు, అనుయాయులు, గ్రామ ప్రముఖులు సిఫార్సు చేసిన వారి పేర్లను మాత్రమే జాబితాలో ఉంచి మిగిలినవి తొలగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మచిలీపట్నానికి సమీపంలోని ఓ మండలంలో 470 మంది వివిధ రకాల పింఛన్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. తొలుత వీరందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వారిలో 240 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తామని చెప్పటంతో జన్మభూమి కమిటీ సభ్యులు తమ చిత్తానుసారం జాబితాలు తయారుచేస్తున్నట్లు సమాచారం. దివిసీమలోని ఓ పంచాయతీలో 70 మందికి వివిధ రకాల పింఛన్లు మంజూరయ్యాయి. వాటిలో 37 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తామని, ఈ జాబితాను మీరే తయారు చేయాలని జన్మభూమి కమిటీ సభ్యులకు అప్పగించటంతో ఎవరి పేరు తొలగిస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనని జన్మభూమి కమిటీ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పిన పాలకులు మాట మార్చి కొంతమందికే అందజేస్తామంటుండటం గమనార్హం. -
డ్వాక్రా మహిళలకు బాబు వెన్నుపోటు
-
డ్వాక్రా సంఘాల్లో నిస్తేజం
రుణమాఫీ ప్రకటనతో ప్రతిష్టంభన స్తంభించిన రుణ లావాదేవీలు కొత్త రుణాలు మంజూరు కాక సభ్యుల డీలా పాడేరు : ఏజెన్సీలోని డ్వాక్రా సంఘాల్లో ఏడాది కాలంగా ప్రతిష్టంభన నెలకొంది. అప్పటి వరకూ ఎంతో ఉత్సాహంతో పని చేసిన సంఘాలు ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన డ్వాక్రా రుణ మాఫీ ప్రకటనతో రుణ బకాయిల చెల్లింపులు నిలిపివేశారు. దీంతో డ్వాక్రా సంఘాల బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. కొత్త రుణాలు మం జూరు కాకపోవడంతో సంఘాల్లో నిస్తేజం అల ముకుంది. ఏజెన్సీ 11 మండలాల్లోని 9,278 డ్వాక్రా సంఘాల్లో 1,03,404 మంది సభ్యులు ఉన్నారు. తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో గతంలోనే 650 డ్వాక్రా సంఘాలు వెనుకబడ్డాయి. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎదు రు చూసిన మిగిలిన డ్వాక్రా సంఘాలకు తీవ్ర నిరాశే మిగిలింది. ప్రతి నెల బ్యాంకులకు చెల్లిం చాల్సిన రుణాల వాయిదా క్రమం తప్పిం ది. సక్రమంగా నడుస్తున్న డ్వాక్రా సంఘాలు కూడా ప్రస్తుతం రుణమాఫీ ఆశతో వెనుకబడ్డాయి. కొన్ని నెలలుగా ఏజెన్సీలోని సంఘాలు పొదుపు సొమ్మును కూడా చెల్లించక బ్యాంకులకు ముఖం చాటేశాయి. ఏజెన్సీలో బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న సంఘాలలో సుమారు రూ.52.63 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. అంతకు ముందు రుణాలు చెల్లించ లేని డ్వాక్రా సంఘాల వద్ద దాదాపు రూ.14 కోట్ల బ కాయిలు ఉండిపోయాయి. రుణమాఫీ ఇప్పట్లో జరగదని అవగతమైనా రుణాలు చెల్లింపునకు సంఘాలు ముందు కు రావడం లేదు. తాము బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకు అధికారులు తమ రుణాల వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని డ్వాక్రా సంఘాలు సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి రూ.1 లక్ష చొప్పున పెట్టుబడి నిధిని డ్వాక్రా గ్రూపుల పొదుపు ఖాతా ల్లో జమ చేస్తామని, 2014 ఫిబ్రవరి నుంచి2015 ఏప్రిల్ వరకు వడ్డీ మాఫీ సొమ్ము రుణ ఖాతాల్లో జూన్ నుంచి జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. డ్వాక్రా సంఘాల రుణ బకాయిలను బ్యాంకులు రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలను మంజూరు చేయడంపై ప్రభుత్వం తేల్చలేదు. రుణ మాఫీ లేకపోగా కొత్తగా రుణాలు మంజూరు అయ్యే పరిస్థితులు కానరాకపోవడంతో డ్వాక్రా సంఘాలన్నీ డీలా పడ్డాయి. -
చెల్లెమ్మలకు టోకరా
ఏడాదైనా మాఫీ కాని డ్వాక్రా రుణాలు రుణాలు చెల్లించాలంటూ మహిళలపై అధికారుల ఒత్తిడి రుణాలు మాఫీ కాకపోవటంతో కొత్త రుణాలు ఇవ్వని వైనం మొదట్లో మాఫీ రూ.10 వేలన్నారు.. ఇప్పుడు రూ.3 వేలకు తగ్గించారు బాబు జమానాలో.. దగాపడ్డ పొదుపుమహిళ నా పేరు వాకాటి రాజేశ్వరమ్మ, మాది కల్లూరు కొత్తపాళెం. నేను సాయినాథ పొదుపు గ్రూపు లీడర్‌గా ఉన్నాను. మండలంలోనే మంచి గ్రూపుగా అధికారులచే మన్ననలు పొందిన మేం ఇప్పుడు బాబు పుణ్యమా అంటూ ఇబ్బం దులు పడుతున్నాం. రూ. 3 లక్షలు రుణం తీసుకుని రూ.75 వేలు వడ్డీ కడుతున్నాం. ఇచ్చే ఆ రూ.3 వేలు నువ్వే ఉంచుకో. సింగపూర్, చైనా పర్యాటనకైనా పనికొస్తుంది. నా పేరు యర్రమతి వజ్రమ్మ. మాది వాకాడు మండలం కొత్తపాళెం నేను గణపతి గ్రూపులో ఉన్నాను. మా గ్రూపు తరఫున రూ.3 లక్షలు రుణం తీసుకున్నాం. రుణమాఫీ పేరుతో కట్టడం మానేశాం. రుణమాఫీ జరగకపోగా మా గ్రూపునకు రూ.70 వేలు వడ్డీభారం పడింది. మేం దాచుకున్న పొదుపు డబ్బంతా నిలువునా జమ చేసుకున్నారు. తెలివైన మోసగాడు ఎవరని అడిగితే చంద్రబాబేనని చెప్పాలి. సాక్షిప్రతినిధి, నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు అధికారం కోసం ‘పొదుపు మహిళలూ మీరు తీసుకున్న రుణాలు బ్యాంకులకు కట్టొద్దు. మనం అధికారంలోకి వస్తున్నాం. వచ్చాక మీ రుణాలన్నీ నేను తీరుస్తాను. మీకు టీడీపీ తరుఫున భరోసా ఇస్తున్నాను. నన్ను నమ్మండి. టీడీపీకి ఓటేయండి’ అని హామీ ఇచ్చారు. బాబు మాటలు నమ్మిన జనం ఆయనకు ఓట్లేసి.. తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ కూడా కట్టకుండా నిలిపేశారు. దీంతో అసలు, వడ్డీ పెరిగి పోయింది. సాధారణ రుణాలకు మొదటి ఏడాదికి వడ్డీ మొత్తం రూ.39.06 కోట్లు. చంద్రబాబు ప్రకటనతో ఏప్రిల్ వరకు అదనంగా చెల్లించాల్సినమొత్తం రూ.98.12 కోట్లు. అసలు, వడ్డీలు చెల్లించాలంటూ ఇటీవల జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. తీసుకున్న రుణాలు చెల్లించేలా డ్వాక్రా లీడర్లు కృషిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశా రు. దీంతో బ్యాంకు అధికారులు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, గ్రామాల్లో తిరిగారు. అసలు, వడ్డీ చెల్లించకపోతే గ్రూపును రద్దుచేస్తామని హెచ్చరించారు కూడా. మాఫీ హామీతో నష్టపోయిన మహిళలు బాబు ఇచ్చిన హామీతో డ్వాక్రాసభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరులో ఓ మహిళా సంక్షేమ సంఘంలో 20 మంది సభ్యులు బ్యాంకు నుంచి రూ.3లక్షలు రుణం తీసుకున్నారు. ఎన్నికల ముందు బాబు మాఫీ వాగ్దానం చేయడంతో అప్పటి నుంచి రుణాలు కట్టడం మానేశారు. ఏడాది కావస్తుండటంతోనెలకు రూ.18వేల చొప్పున రూ.2.16 లక్షలతో పాటు వడ్డీ చెల్లించమని అధికారులు మహిళలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. బకాయిలు చెల్లించకపోతే డిఫాల్టర్లుగా చేస్తామని హెచ్చరిస్తున్నట్లు మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే 2014-2015కి జిల్లాలోని డ్వాక్రా సభ్యులకు వివిద బ్యాంకులు రూ.665 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రుణమాఫీ ప్రకటనతో డ్వాక్రా సభ్యులు అసలు, వడ్డీ చెల్లించకపోవటంతో బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వకపోవటం గమనార్హం. మొన్న రూ.10 వేలు.. నేడు రూ.3 వేలు డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాకపోవటంతో మహిళల నుంచి వ్యతిరేకత మొదలైంది. దీంతో సీఎం చంద్రబాబు రుణమాఫీ కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. అదికూడా చెల్లించటం ఇష్టం లేక కొద్దిరోజులకు రూ.3వేలకు తగ్గించారు. గత ఏడాది మార్చి 31 నాటికి సంఘంలో సభ్యులుగా ఉన్నవారికి మాత్రమే రూ.3వేలు చెల్లిస్తామని ప్రభుత్వం నిబంధనపెట్టింది. అదే విధంగా సంఘంలో సభ్యురాలిగా ఉంటూ మొబైల్ బుక్కీపింగ్, డేటాబేస్‌లో వారి పేరు లేకుంటే రూ.3వేలు ఇవ్వరు. ఆధార్‌ను అన్లై న్లో సీడింగ్ చేయకపోయినా అనర్హులే. ప్రభుత్వం ఇచ్చే రూ.3 వేలును నేరుగా సభ్యులకు ఇవ్వరు, వ్యక్తిగత ఖాతాలో జమచేయరు. సంబంధిత గ్రూపు ఖాతాలో మాత్రమే జమచేస్తారు. తీసుకున్న రూ.3వేలకు వడ్డీ చెల్లిస్తుండాల్సిందే. -
మాయాజాలం
అనంతపురం సెంట్రల్ : పామిడి మున్సిపాలిటీలోఈ నెల 21న మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మహిళల నుంచి నిరసన గళం వ్యక్తమయ్యింది. రుణమాఫీ అంటూ సభ్యురాలికి రూ.3 వేలు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. సభ్యురాలికి రూ.10 వేల చొప్పున వ్యక్తిగత ఖాతాలోకి జమ చేయాలని డిమాండ్ చేస్తూ సభ్యులంతా మూకుమ్మడిగా సమావేశాన్ని బహిష్కరించారు. అదే రోజు రొద్దం మండలం కేంద్రంలోనూ డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. సభ్యురాలికి రూ. 3 వేల చొప్పున మంజూరు చేస్తున్న మొత్తాన్ని సొంత ఖర్చులకు వాడుకోవడానికి వీల్లేదని, పెట్టుబడి నిధిగా వినియోగించాలని అధికారులు సూచించడంతో మహిళలు ఆగ్రహించారు. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తారా అంటూ మండిపడ్డారు. వెలుగు ప్రాజెక్టు ఏరియా కో ఆర్డినేటర్ రమణప్ప, ఏపీఎం భారతి, ఎంపీటీసీ సభ్యుడు నారాయణప్ప, స్థానిక సర్పంచు అశ్వర్థనారాయణ, టీడీపీ మండల కన్వీనర్ చంద్రమోహన్‌లను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిం చారు. తర్వాత రోడ్డుపై బైఠాయిం చారు. ఈ రెండుచోట్ల మాత్రమే కా దు.. ప్రతిరోజూ జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో మహిళలు నిరసన గళం విన్పిస్తూనే ఉన్నారు. ‘ఏరు దాటేంత వరకూ ఏటి మల్లన్న... దాటాక బోడి మల్లన్న’ అన్న చందాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 54 వేల స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 5.70 లక్షల మంది సభ్యులున్నారు. ఎన్నికల సమయానికి వీరిపై రూ. 995 కోట్ల అప్పు నిల్వ ఉంది. ఎన్నికల ముందు ప్రకటించిన వాగ్దానం మేరకు అయితే ఈ రుణాలన్నీ మాఫీ కావాలి. అయితే.. సంఘానికి రూ.లక్ష మాఫీ ప్రకటించడంతో 54 వేల సంఘాలకు రూ. 540 కోట్లు మాఫీ అవుతాయని జిల్లా యంత్రాంగం లెక్కలు తయారుచేసింది. తాజా నిర్ణయంతో అధికారులే కాకుండా డ్వాక్రా మహిళలు కూడా డైలమాలో పడ్డారు. సభ్యురాలికి రూ.3 వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 3 నుంచి గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది కూడా సభ్యురాలి ఖాతాలో జమ చేయడం లేదు. సంఘం ఆర్థిక పరిపుష్టికోసం పెట్టుబడి నిధిగా వాడుకోవాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, ఏదైనా వ్యాపారం చేసుకోవాలని భావించే వారు సంఘానికి ఇచ్చే రూ. 30 వేలను తీసుకొని తిరిగి కంతుల రూపంలో చెల్లించాలి. దీని వల్ల 54 వేల సంఘాల్లో మొత్తం 5.70 లక్షల మంది సభ్యులుంటే సంఘానికి ఒకరు చొప్పున 54 వేల మంది మాత్రమే లబ్ధి పొందగలరు. మాఫీ మాయతో మహిళలకు చిక్కులు చంద్రబాబు చేసిన మాఫీ మాయ వల్ల డ్వాక్రా మహిళలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త అప్పు పుట్టక... పాత అప్పులు తీరక సతమతమవుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా రుణాలు మాఫీ చేసి ఉంటే దాదాపు రూ. 995 కోట్లు మహిళలపై భారం తగ్గేది. కనీసం సభ్యురాలికి రూ.10 వేలు మాఫీ చేసినా రూ.570 కోట్లు లబ్ధి చేకూరేది. ప్రస్తుతం రూ.3 వేలు మంజూరు చేస్తున్నా వాడుకోవడానికి వీల్లేదనడంతో మహిళలు లబోదిబోమంటున్నారు. రుణ మాఫీ హామీని నమ్మి మహిళలెవరూ కంతులు కట్టకపోవడంతో బ్యాంకులు రుణాలివ్వడం కూడా మానేశాయి. గతేడాది రూ.1100 కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి రూ. 530 కోట్లు (రెన్యువల్స్‌తో కలుపుకొని) రుణాలిచ్చినట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి కొత్తగా రుణాలిచ్చింది రూ.100 కోట్లు లోపే. -
చంద్రబాబు కోటి మంది మహిళలను మోసం చేశారు
డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకు ఉద్యమం మహిళల ధర్నాలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : డ్వాక్రా మహిళల రుణాలపై సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలను మోసం చేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. మూలధనం కాకుండా డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున మహిళలతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన జరిగిన తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుతగా డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ప్రకటించారని అన్నారు. మళ్లీ లక్ష రూపాయలు మాత్రమేననడం, ఆ తర్వాత ఒక్కో సభ్యురాలికి రూ.10 వేలు అని చెప్పి, చివరకు రూ.3 వేలు మూలధనం పేరిట ఇస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. అది కూడా వాడకూడదనే నిబంధనలు విధించడంతో మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఒక్కో మారు ఒక్కో విధంగా మహిళల మైండ్ సెట్‌ను మార్చి చివరికి మోసపుచ్చారన్నారు. దీనిపై దశల వారీగా ఆందోళన చేస్తామన్నారు. ఇందులో భాగంగా పుట్టపర్తి సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, ప్రొద్దుటూరు పట్టణ బంద్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రొద్దుటూరు కేంద్రంగా ఆందోళన సాగిస్తామని తెలిపారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖరరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సుమారు 2 వేల మంది మహిళలు ధర్నాకు హాజరు కావడం గమనార్హం. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, ఎంపీపీ మల్లేల ఝాన్సీరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు గోర్ల రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా సంఘాలకు రూ. 275 కోట్ల లబ్ధి
►వడ్డీ కింద సంఘానికి సగటున రూ. 25వేలు మంజూరు ►జూన్ 3 నుంచి పంపిణీ చేసే అవకాశం ►జిల్లా సమాఖ్య సమావేశంలో డీఆర్డీఏ పీడీ వెంకటేశం అనంతపురం సెంట్రల్ : జిల్లాలోని డ్వాక్రా మహిళలకు రూ. 275 కోట్లు లబ్ధి కలుగుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ- వెలుగు ప్రాజెక్టు డెరైక్టర్ జి. వెంకటేశం స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని పెట్టుబడి నిధిగా మార్చుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. శనివారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షురాలు పార్వతి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పీడీ వెంకటేశం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యురాలికి రూ. 10 వేలు చొప్పున మంజూరు చేస్తే, జిల్లాలోని మహిళలకు రూ. 490 కోట్లు లబ్ధి కలుగుతుందన్నారు. తొలివిడతలో రూ. 3 వేలు చొప్పున రూ. 147 కోట్లు మంజూరైందన్నారు. ప్రభుత్వం వడ్డీ కూడా మాఫీ చేయడంతో సరాసరిన సంఘానికి రూ. 22 వేలు చొప్పున వర్తిస్తుందన్నారు. మొత్తం తొలివిడతలో రూ. 275 కోట్లు వస్తుందన్నారు. ఈ మొత్తం జూన్ 3 నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వ్యాపార అవసరాల కోసం ఈ మొత్తాన్ని పెట్టుబడి నిధిగా భావించాలని కోరారు. వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించరాదని సూచించారు. ఆధార్ అనుసంధానంలో నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 98.4 శాతం మాత్రమే అనుసంధానం అయిందన్నారు. దీనివల్ల మిగిలినవారు ప్రభుత్వం మంజూరు చేస్తున్న నగదును కోల్పోతున్నారన్నారు. ప్రతి మహిళకు ఆధార్‌కార్డు తీయించి ఎన్రోల్ చేయాలని ఈసీ మెంబర్లను, వెలుగు సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పార్వతి, కార్యదర్శి పార్వతమ్మ, ఐబీ ఇన్చార్జ్ డీపీఎం, ఏసీ గంగాధర్, ఏరియా కో ఆర్డినేటర్ ఈశ్వరయ్య, సబ్జెక్టు యాంకర్ పర్సన్లు ఖలీల్, శివప్రసాద్, నారాయణస్వామి, హరిప్రసాద్, జేడీఎం సూర్యానారాయణ వెలుగు అధికారులు, జిల్లా సమాఖ్య ఈసీ మెంబర్లు పాల్గొన్నారు. -
మహిళలను వంచించిన చంద్రబాబు
షరతులు లేకుండా డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి డ్వాక్రా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ స్వరూపరాణి అనంతపురం సిటీ : ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే షరతులు విధించి మహిళలను వంచిస్తున్న దగాకోరు చంద్రబాబు అని డ్వాక్రా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె.స్వరూపరాణి ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించడంతోనే మహిళలు ఆశతో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రమాణ స్వీకారం రోజు డ్వాక్రా రుణాల మాఫీ ఫైలుపై ఆయన సంతకం చేశారని గుర్తు చేశారు. మొత్తం రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఒక్కో గ్రూపునకు రూ.లక్ష ఇస్తానని అంటూనే ఆ లక్ష రూపాయలను కూడా 3 దఫాలుగా బ్యాంకులో వేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా బ్యాంకులో వడ్డీ డబ్బు మూల ధనంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా వాడుకోవడానికి వీల్లేదని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిం చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలు విని రుణాలు తిరిగి కట్టని గ్రూపులకు వడ్డీ భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 6,57,538 గ్రూపుల్లో 69,84,569 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. బకాయిలు మొత్తం రూ.14,699 కోట్లు ఉన్నాయన్నారు. రుణమాఫీ చేయకుండా మొదటి విడత ఒక్కో గ్రూపునకు రూ.30 వేలు బ్యాంకులో వేస్తామనడం, ఆ డబ్బు వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని చెప్పటాన్ని ఖండిస్తామన్నారు. మరోపక్క ఆధార్ కార్డు లేదనే వంకతో 11 లక్షల మందికి పథకాన్ని వర్తింప జేయకపోవడం దారుణమన్నారు. రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, నగర కార్యదర్శి చంద్రిక, అరుణ తదితరులు పాల్గొన్నారు. భోజన పథకం కార్మిక సమస్యలు పరిష్కరించండి అనంతపురం టౌన్ : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని ఏపీ మధ్యాహ్న బోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి స్వరూపరాణి అన్నారు.స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షునిగా పి.నారాయణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులతో కలిసి డీఈఓను కలిసి సమస్యలు వివరించారు. బకాయి బిల్లులు చెల్లించాలని, వంట షెడ్లు నిర్మించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పాఠశాలలకే బియ్యం సరఫరా చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేంద్ర, మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి, నాయకులు సోమశేఖర్, పద్మావతి, లక్ష్మిదేవి, శుభలత, తదితరులు పాల్గొన్నారు. -
మాఫీలో..మతలబు
►పొదుపు మొత్తంలాగే వాడుకోవాలని ఆదేశాలు ►మండిపడుతున్న డ్వాక్రా మహిళలు ►మాఫీ ఎవరు ప్రకటించమన్నారు..? ►అధికారులను నిలదీసిన మహిళలు సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొదలుకొని.. గోడలపై రాతల పూతల వరకు ఒకటే ప్రచారం.. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే.. డ్వాక్రా మహిళల రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తారంటూ ఊదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు నేడు జనంలోకి రావాలంటేనే జంకుతున్నారు. మొన్న రైతులకు రుణమాఫీ పేరుతో కేవలం వడ్డీకి కూడా సరిపోనంత సొమ్మును అందించి చేతులు దులుపుకున్న బాబు.. ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి పేరుతో ఇస్తున్న సొమ్మును కూడా పొదుపు మొత్తం లాగే వాడుకోవాలని ఆదేశాలు ఇవ్వడం డ్వాక్రా మహిళల్లో ఆగ్రహావేశానికి గురిచేసింది. ప్రస్తుతానికి మాఫీ చేయలేనని.. ఒకేసారి రూ.10వేలు ఇస్తానంటూ బహిరంగ సభల్లో ప్రకటించిన చంద్రబాబు.. లోటు బడ్జెట్ పేరుతో ఈసారికి రూ.3వేలు మాత్రమే ఇచ్చి.. తర్వాత కంతుల ప్రకారం మిగతా సొమ్మును చెల్లిస్తామని పేర్కొనడం కూడా మహిళలను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం జమచేసే రూ.3వేలు కూడా వాడుకోకుండా గ్రూపు మొత్తం మీద వచ్చే సొమ్మునంతా పొదుపులాగే అకౌంట్లల్లో ఉంచుకొని వడ్డీని మాత్రమే తీసుకోవాలని మెలిక పెట్టడంపై తీవ్రస్థాయిలో మహిళలు మండిపడుతున్నారు. రుణమాఫీ ప్రకటించడమెందుకు.. ఇప్పుడు జారుకోవడమెందుకంటూ మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయాల్సిందే... : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రుణమాఫీ చేసి తీరాల్సిందేనంటూ డ్వాక్రా మహిళలు నినదిస్తున్నారు. బుధవారం మండలస్థాయిల్లో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశాలన్నింటిలోనూ తీవ్రస్థాయిలో మండిపడిన మహిళలు గురువారం నియోజకవర్గస్థాయిలో జరిగిన డ్వాక్రా మహిళల సదస్సుల్లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుపాలెంలో సదస్సు సందర్భంగా చంద్రబాబు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డ్వాక్రా మహిళలంతా నినాదాలు చేశారు. పేరుకు మాఫీ చేస్తున్నారని మహిళలను మోసం చేయడం అన్యాయమంటూ వారు దుమ్మెత్తిపోశారు. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, వేంపల్లె, వేముల, రాజంపేట, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, రాజంపేట, మైదుకూరు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల మహిళలు అధికారులను నిలదీస్తున్నారు. అకౌంటులోనే పెట్టుకోవాలని నిబంధన పెట్టడం ఏమిటి.. : ఎన్నికలలో డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కేవలం మూడు వేలు చేసినారు. అది కూడా సంఘం అకౌంట్లో వేసుకోవాలని తీసుకోకూడదని నిబంధన పెట్టడం దారుణం. ఇంత మాత్రానికి రుణ మాఫీ అని చెప్పడం ఎందుకు. అంతా మాఫీ చేస్తామని చెప్పి కేవలం మూడు వేలేనా... ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి నమ్మించారు. ఇప్పడు ఏడాది తర్వాత కేవలం మూడు వేలు రుణమాఫీ చేసినట్లు సంఘాల అకౌంటులో గ్రూపునకు రూ.30వేలు వేశారు. ఈ డబ్బును సంఘం నిధిలో జమా చేయాలని నిబంధన పెట్టారు. ఇదేనా చంద్రబాబు రుణమాఫీ. - వి.లక్ష్మిదేవి(శ్రీ తేజ గ్రూపు లీడర్) ఎర్రగుంట్ల మాఫీ చేయాలి.. : డ్వాక్రా మహిళలకు ఇచ్చే మొత్తం పూర్తిగా మాఫీ చేయాలి. రూ.10 వేలు మూడు విడతలుగా కాకుండా ఒక్కసారే ఇవ్వాలి. - కొండమ్మ(డ్వాక్రా సంఘ సభ్యురాలు) రాజుపాళెం డ్వాక్రా మహిళలను మభ్యపెడుతున్నాడు : డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు రుణం మాఫీ చేస్తామని చెప్పి మభ్యపెడుతున్నారు. రూ.10 వేలు ఇచ్చి తిరిగి మళ్లీ కట్టమని చెప్పడం ఏమిటి. - ప్రభావతమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు , రాజుపాళెం -
సీఎం గారూ... తొలి సంతకం ఏమైంది?
కడప అగ్రికల్చర్ :‘ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బాబుగారూ.. తొలి సంతకం రుణమాఫీపైనే అని ప్రగల్భాలు పలికినా సీఎంగారూ.. ఆ సంతకం ఏమైంది’ అంటూ ఏపీ మహిళా సమాఖ్య సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. బుధవారం కడప కలెక్టరేట్ వద్ద ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు మౌనదీక్ష నిరసన చేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బషీరున్నీషా, కార్యదర్శి విజయలక్ష్మీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణమాఫీపై మాట తప్పారని ఘాటుగా విమర్శించారు. డ్వాక్రా మహిళలతో కలిసి ఉద్యమాలు చేయగా ఆఘమేఘాలపై గ్రూపునకు రూ 10 వేలు రుణమాఫీ అని ప్రకటించారన్నారు. దీనికి కూడా సవాలక్ష లింకులు పెట్టి, మెలికలు పెట్టి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ అవుతుందన్న ఆశతో అక్కచెల్లెళ్లు బ్యాంకులకు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో ఆ బకాయి తడిసి మోపెడైందని, ఇప్పుడు ఆయా రుణాలు చెల్లించలేక పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావని ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య నాయకురాళ్లు ఆచారమ్మ, క్రిష్ణవేణి, సుభాషిణి, సుబ్బలక్షుమ్మ, ప్రమీల, మున్నీ, నారాయణమ్మ, సుగుణమ్మ పాల్గొన్నారు. -
మహిళల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యం
ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అనంతపురం అర్బన్ : మహిళల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డ్వామా సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాల ఆర్థిక పరిపుష్టి, పెట్టుబడి నిధి నిర్వహణ, వడ్డిలేని రుణాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. మంత్రి పల్లె మాట్లాడుతూ డ్వాకా రుణమాఫీలో భాగంగా ప్రతి మహిళా సభ్యురాలి ఖాతాలో మూడు విడతలుగా రూ.10 వేలు జమ చేస్తామని తెలిపారు. జిల్లాలోని 51,532 డ్వాక్రా గ్రూపుల పరిధిలో 5,53,715 మంది సభ్యులు ఉన్నారని, వీరికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 544.32 కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 2014 నుంచి 2015 మే నెల వరకు తీసుకున్న డ్వాక్రా రుణాలపై ఉన్న రూ. 155.02 కోట్ల వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో నవ నిర్మాణ మౌనదీక్ష, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, పేదరిక నిర్మూలన తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీటిని విజయవంతం చేయాలని కోరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, డీఎఫ్ఓ రాఘవయ్య, డ్వామా పీడీ నాగభూషణం పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణమాఫీకి పంగనామాలు
మూడు విడతల్లో రూ.లక్ష మాఫీ మాఫీ మొత్తాన్ని వ్యాపారం కోసమే వాడుకోవాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు అనంతపురం సెంట్రల్ : ఒక్కో మహిళకు రూ.3 వేలు మంజూరు చేస్తామని, ఈ మొత్తంతో ఆర్థిక పరిపుష్టి చెందాలని చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళల ఓట్ల కోసం రుణాలన్నీ మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు చెల్లించొద్దన్న చంద్రబాబునాయుడు అధికారంలో వచ్చాక మాట మార్చారు. ఒక మహిళకు కాదు, ఒక సంఘానికి రూ.లక్ష మాఫీ చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం ఆ మాటను కూడా వెనక్కు తీసుకొని లక్ష మొత్తాన్ని కూడా మూడు విడతల్లో మాఫీ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 54వేల స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 5.7 లక్షల మంది సభ్యులున్నారు. ఎన్నికల సమయానికి వీరిపై రూ.995 కోట్ల అప్పు ఉంది. ఎన్నికల ముందు ప్రకటించిన వాగ్దానం మేరకు అయితే ఈ రుణాలన్నీ మాఫీ కావాలి. అయితే సంఘానికి రూ.లక్ష మాఫీ ప్రకటించడంతో 54 వేల సంఘాలకు రూ.540 కోట్లు మాఫీ అవుతాయని జిల్లా యంత్రాంగం లెక్కలు తయారుచేసింది. అయితే మూడు విడతల్లో సంఘానికి లక్ష ఇస్తే ఒక్కో సభ్యురాలికి రూ.3 వేలు కూడా రాదంటున్నారు. ఎందుకంటే ప్రతి సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే మాఫీ అపరాధ రుసుం పేరుతో బ్యాంకులకు చెల్లించిన మొత్తంలో సగం కూడా రాకపోవడం గమనార్హం. ఆ మూడు వేలకూ మెలిక ఆ రూ.3వేలు చొప్పున మూడు విడతల్లో మంజూరు చేసే మొత్తాన్ని సొంత అవసరాలకు కాకుండా సంఘం ఆర్థిక పరిపుష్టికోసం వాడుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ఈ మొత్తం సంఘం ఖాతాకు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని పెట్టుబడి చేసుకొని వ్యాపారాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఒక్కో మహిళకు రూ.3 వేలు మంజూరు చేస్తే దీంతో ఏం వ్యాపారం చేపట్టాలని డ్వాక్రా మహిళలు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా 9,885 మంది డ్వాక్రా మహిళలకు ఆధార్ అనుసంధానం కాలేదు. తొలివిడతలో వీరి రుణమాఫీపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. -
జూన్ 2 నుంచి డ్వాక్రా రుణాల మాఫీ
సామర్లకోట (తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డ్వాక్రా సంఘాలకు జూన్ 2వ తేదీ నుంచి రుణమాఫీ అమలు చేయనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండల పరిధిలో నీరు-చెట్టు పనుల పరిశీలన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రతి సంఘానికి రూ.1 లక్ష చొప్పున, ప్రతి సభ్యురాలికి రూ.10 వేలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో 36 చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఏలేరు కాలువ అభివృద్ధికి గతంలో రూ.24 లక్షలు మంజూరు కాగా ప్రస్తుతం మరో 19 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. -
ర్యాంపులకొస్తా.. సంగతి తేలుస్తా
ఏలూరు (టూటౌన్) : ‘ఇసుక ర్యాంపుల్లో తనిఖీ లకు వస్తా. అక్రమాలు బయటపడితే కేసులు పెట్టిస్తా. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుం టా’నని కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. జిల్లాలో ఇసుక విక్రయాల తీరుపై డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, ఇందిరాక్రాంతిపథం ఏపీఎంలతో కలెక్టరేట్లో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక తవ్వకం, విక్రయాల్లో అక్రమాల నిరోధానికి చర్యలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా వారంలో రెండు ర్యాంపులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. అక్రమాలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. ర్యాంపుల్లో అక్రమాలకు తావు లేకుండా ఎలక్ట్రానిక్ వే బిల్లులను రూపొందించామని చెప్పారు. కొంతమంది బయట వ్యక్తులతో కుమ్మక్కై ఇసుక రీచ్‌లలో అక్రమ తవ్వకాలు, అమ్మకాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిం దన్నారు. 3 క్యూబిక్ మీటర్ల ఇసుక కోసం వేబిల్లు తీసుకువచ్చిన వారికి 5 క్యూబిక్ మీటర్ల ఇసుక ఇస్తున్నారని, కొన్నిచోట్ల వేబిల్లు లేకపోయినా వాహనాల్లో ఇసుక తరలించేందుకు సహకరి స్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ర్యాంపుల్లోకి బయటి వ్యక్తులు వస్తుం టే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిం చారు. కొంతమంది ఏపీఎంలు, సీసీలు ఉద్యోగ ధర్మాన్ని వదిలి బయ ట వ్యక్తులకు ఊడిగం చేస్తున్నారన్నారు. ‘మీకు ఆత్మాభిమానం లేదా.. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత మీది కాదా.. స్వలాభం కోసం ఇతరుల చేతుల్లో కీలుబొమ్మల్లా ఎందుకు మారుతున్నారు’ అని ప్రశ్నించారు. పలుచోట్ల ఉదయం 10 గంటల సమయంలో ఇసుక వాహనాన్ని పట్టుకుని వే బిల్లు అడిగితే, 11.30 గంటలకు చూపించారని, గంటన్నర తరువాత వేబిల్లు పొందినట్టు నిరూపణ అయ్యిందని కలెక్టర్ పేర్కొన్నారు. దీనినిబట్టి ఆ వాహనంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు స్పష్టమైందన్నారు. ఇసుక రీచ్‌లలో మహిళలను ఎవరూ బెదిరించకుండా ప్రత్యేకంగా గన్మెన్లను ఏర్పాటు చేస్తామన్నారు. బయటి వ్యక్తులు ఇసుక రీచ్‌లలో ప్రవేశించినా బెదిరింపులకు పాల్పడినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఎ.శ్యాంప్రసాద్, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీపీవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, డీటీసీ సీహెచ్ శ్రీదేవి పాల్గొన్నారు. 6 ర్యాంపులు తెరిచేందుకు ప్రతిపాదనలు జిల్లాలో కొత్తగా ఆరు ర్యాంపులను తెరిచి ఇసుక విక్రయాలు జరిపేందుకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని ఇసుక వాహనాలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుంచి రావాల్సి ఉన్నందున, ఆ రాష్ట్రం నుంచి తగిన అనుమతులు పొందేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొవ్వూరు మండలం చిడిపి, కుకునూరు మండలంలోని వింజరం, దాచవరం, ఇబ్రహీంపట్నం, వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రకోట గ్రామాల్లోని ఇసుక రీచ్‌లలో 5 మీటర్ల ఎత్తున ఇసుక నిల్వలు ఉన్నట్టు గుర్తించామని కలెక్టర్ వివరించారు. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు ప్రాంతాల్లో పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి డిపోల వద్ద సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 1 నుంచి విజయరాయి ఇసుక ర్యాంపు నుంచి నిర్ధేశించిన వాహనాల్లోనే ఇసుక రవాణా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు
• అధికారులు పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగిన మహిళలు • అదనంగా తరలిస్తున్న ఏడు ఇసుక లారీలు పట్టివేత • ఆలస్యంగా వచ్చిన రెవెన్యూ అధికారులు • ర్యాంపు వద్ద ఉద్రిక్తత నిడదవోలు : మండలంలోని పందలపర్రు ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారంటూ ఆ గ్రామానికి చెందిన డ్వాక్రా మిహళలు, గ్రామస్తులు బుధవారం ర్యాంపు వద్ద లారీలను తనిఖీలు చేసి అడ్డుకున్నారు. పందలపర్రు ఇసుక ర్యాంపులో ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఇసుక రవాణా చేస్తున్న ఏడు లారీలను గుర్తించి రెవె న్యూ అధికారులకు అప్పగించారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్ధేశించిన స్థలంలో కాకుండా ఇతర సరిహద్దుల్లో ఇసుక తవ్వుతున్నట్లు గుర్తించారు. కొంతకాలంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారంటూ ఆరోపిస్తూ గ్రామస్తులు రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే వారు కూడా పట్టించుకోకపోవడంతో పందలపర్రు గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు ర్యాంపు వద్దకు చేరుకుని లారీలను తనిఖీలు చేశారు. సొంతంగా వీడియో కెమేరాను పెట్టుకుని అదనంగా ఇసుకను తరలిస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. రెండు యూనిట్లకు డీడీలు తీసుకుని అదనంగా ఇసుక రవాణా చేస్తున్న ఎనిమిది లారీలను పట్టుకున్నారు. విషయం తెలుసుకుంటున్న ఆర్ఐ సావిత్రి రాం్యపు వద్దకు వచ్చి విచారించారు. ఇదిలా ఉండగా ర్యాంపు వద్ద డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు, పలువురు టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. అదనంగా ఇసుక తరలిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని ఇసుక లారీలను ఎందుకు ఆపుతున్నారంటూ మహిళలు, గ్రామస్తులతో గొడవకు దిగారు. ర్యాంపు వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న సమిశ్రగూడెం ఎస్సై పవన్‌కుమార్ ర్యాంపు వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. డ్వాక్రా మహిళలు పట్టుకున్న లారీలను పరిశీలించేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వేయింగ్ మిషన్ దగ్గరకు వెళ్లారు. డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు పట్టుకున్న ఏడు లారీలు, ఒక ట్రాక్టర్‌ను ఆర్ఐ సావిత్రి గోపవరంలో ఉన్న వేయింగ్ మిషన్ వద్ద కాటా పెట్టించారు. 18 యూనిట్ల ఇసుక అదనంగా ఉంది. లారీలను, ట్రాక్టర్‌ను సమిశ్రగూడెం పోలీసుల అధీనంలో ఉంచారు. -
సౌకర్యాలున్నా.. శాలరీ ఏదీ?
ఇసుక క్వారీలో పనిచేస్తున్న డ్వాక్రా మహిళల ఆవేదన అందని జనవరి నెల జీతాలు తుళ్ళూరు మండలంలోరి బోరుపాలెం ఇసుక రేవులు, రాయపూడి ఇసుక క్వారీని నిర్వహిస్తున్న డ్వాక్రామహిళలకు ఆశించిన స్థాయిలో పారితోషికాలు, సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చొరవచూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాను అరి కట్టేందుకు డ్వామా నేతృత్వంలో రాయపూడి ఇసుక రీచ్‌ను అధికారుల అండదండలతో ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న డ్వాక్రామహిళలకు రోజూ కూలి కేవలం రూ 300 మాత్రమే ఇస్తున్నారని అవి కూడా సకాలంలో ఇవ్వకుంటే తమ పరిస్థితి ఏమిటని మహిళలు అంటున్నారు. ఎంతో ప్రయాసతో ఇసుక రేవులో విధులు నిర్వహిస్తున్న మహిళలకు కనీస వసతులు, మరుగుదొడ్లు లేక చాలాకాలం ఇబ్బందులు పడ్డారు. అనంతరం సాక్షిలో వచ్చిన పలు కధనాల అనంతరం స్పందించిన అధికారులు వారికి వసతులు కల్పించారు. ప్రస్తుతం జనవరి నెల జీతాలు ఫిబ్రవరి నెలలో 17 రోజులు గడిచినా రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇసుక క్వారీ ఇన్చార్జి శేఖర్‌ను వివరణ కోరగా ఫైల్ కలెక్టర్ వద్ద వుందని రెండు రోజుల్లో జీతాలు విడుదలవుతాయని తెలియజేశారు. డిసెంబర్ నెలలో ఇసుక రవాణా చేసిన ట్రాక్టర్ లారీ డ్రైవర్ల కిరాయిలు కూడా ఇవ్వలేదని అడగ్గా డిసెంబర్ 21వ తేదీనుంచి 31వ తేదీ వరకు ఇసుక రావాణా చేసిన వారికి కిరాయిలు రావలసి వుందన్నారు. -
అండగా ఉంటా!
అంగన్వాడీ, డ్వాక్రా మహిళలతో ప్రతిపక్షనేత పరామర్శలు..శుభకార్యాలలో బిజీబిజీ శంఖవరం ఆలయ స్థలాల పరిరక్షణకు వినతి కౌన్సిలర్ల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర నేతలతో చర్చ సాక్షి, కడప/పులివెందుల : డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో ఆయనను కలిసిన డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్కర్లు తమ కష్టాలు వినిపించారు. 13నెలలుగా టీఏ బిల్లులు రాలేదని.. 8నెలలుగా అంగన్వాడీ భవనాలకు అద్దె బిల్లులు కూడా ఇవ్వలేదని వైఎస్ జగన్‌కు వివరించారు. మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి రూ.3వేలు ఇవ్వాలని.. రెండు నెలలుగా అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా సీడీపీవో వేధిస్తున్నారని వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే వారం రోజులుగా ఆందోళన చేస్తున్నామని.. కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోరుుందన్నారు. వారి కష్టాలన్నీ విని చలించిపోరుున జగన్మోహన్రెడ్డి తాను అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓదార్చారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారిణితో మాట్లాడారు. పది రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి.. : బుధవారం 10.15 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్న ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా పలు వివాహాలకు హాజరయ్యారు. ముందుగా పార్నపల్లె రోడ్డులోని సాయిబాబా ఆలయంలో జరుగుతున్న వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్న గంగరాజు వివాహానికి హాజరై ఆశీర్వదించారు. అనంతరం తొండూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న కాంబల్లెకు చెందిన రామకృష్ణారెడ్డి కుమారుడు గంగాధర రెడ్డి, అనూషల వివాహ మహోత్సవానికి హాజరయ్యూరు. అనంతరం ఇటీవల వివాహం అరుున వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి బండి రమణారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, హరితలను ఆశీర్విదించేందుకు తేలూరు తుమ్మలపల్లెలోని వరుని ఇంటికి వెళ్లి నిండు నూరేళ్లు చల్లగా వర్థిల్లాలని ఆశీర్వదించారు. అనంతరం గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ నాయకుడు బండి శ్రీనివాసులరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. .అనంతరం నేరుగా పులివెందులకు చేరుకుని కడప రోడ్డులో ఉన్న విజయా హోమ్స్‌లో కాంట్రాక్టర్ వై.నారాయణరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం వివాహమైన వేముల ఎంపీడీవో రాజశేఖరరెడ్డి కుమార్తె సాగర్మ్య్ర, అరుణ్‌రెడ్డి దంపతులను ఇంటికెళ్లి ఆశీర్వదించారు. ఆ సమీపంలోనే ఉన్న డాక్టర్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కుశల ప్రశ్నలు అడిగారు. తర్వాత పులివెందులలోని సుజాత హాలు సమీపంలో నివసిస్తున్న మురారిచింతల మాజీ సర్పంచ్ ఓబుళరెడ్డి కుమారుడు, నూతన దంపతులైన శశిధర్‌రెడ్డి, జయలను, చెక్క డిపో హరి కుమార్తె కృష్ణవేణి, అల్లుడు అనంద్కుమార్లకు శుభాకాంక్షలు తెలియజే శారు. అలాగే సింహాద్రిపురం మండల వైఎస్ఆర్ సీపీ నాయకుడు రామగిరి జనార్థన్‌రెడ్డి సోదరుడి కుమారుడు దామోదర్‌రెడ్డి, శాంతిల దంపతులను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆశీర్వదించారు. వైఎస్ జగన్‌పై పూలవర్షం : ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి తణుకులో దీక్షను విజయవంతమైన నేపధ్యంలో పులివెందులలో ఘన స్వాగతం లభించింది. శ్రీరామాహాలు రోడ్డులో నివసిస్తున్న కౌన్సిలర్ కోడి రమణ ప్రత్యేకంగా వైఎస్ జగన్ కాన్వాయ్ రాగానే భారీ ఎత్తున బాణా సంచా పేల్చుతూ స్వాగతం పలికారు. అంతేకాకుండా గజమాల వేసి వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడ నుంచి ఇతర వివాహ కార్యక్రమాలకు వెళుతున్న వైఎస్ జగన్‌పై పూల వర్షం కురిపిస్తూ.. భారీగా ముందుకు కదిలారు. కౌన్సిలర్లతో కాసేపు : పులివెందులలోని కడప రోడ్డులో ఉన్న విజయా హోమ్ వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, వైస్ చెర్మైన్ చిన్నప్పలతోపాటు కౌన్సిలర్లతో చర్చించారు. ప్రధానంగా వారికి ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడాలని.. భవిష్యత్‌లో మంచి రోజులు రానున్నాయని వారికి భరోసా ఇచ్చారు. శంఖవరం ఆలయ స్థలాలను పరిరక్షించండి : కలసపాడు మండలం శంఖవరం గ్రామంలో ఉన్న చెన్నకేశవ, ఆంజనేయస్వామి, వీరభద్రస్వామి, శివాలయం తదితర ఆలయాలకు సంబంధించిన స్థలాలను పరిరక్షించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డికి గ్రామానికి చెందిన ఉద్దండం శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు ఆలయ మాన్యం భూములలో పశువులతోపాటు గడ్డి వాములు వేసి ఆక్రమించుకున్నారని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్‌ను కోరారు. ఆలయాలకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెస్తామని శివప్రసాద్‌కు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పులివెందులలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు రైల్వేకోడూరు, కదిరి ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, డీసీసీబీ చెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇ.వి.మహేశ్వరరెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, ఎన్ఎస్పీ కన్స్ట్రక్షన్స్ అధినేత నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి చర్చించారు. -
'డ్వాక్రా రుణాలు మాఫీ చేసేవరకు నిద్రపోనివ్వం'
బొబ్బిలి(విజయనగరం): డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేసేవరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సంపూర్ణంగా రుణమాఫీ చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులు కొత్త రుణాల మంజూరు చేయటం లేదన్నారు. దీంతో రైతులకు కొత్త రుణాలు అందకపోగా..డ్వాక్రా మహిళలపై బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా రుణమాఫీ చేయకపోవడం వల్లే డ్వాక్రా మహిళలకు అండగా జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన చెప్పారు. -
వాగ్దాన భంగం దెబ్బకు డ్వాక్రా ఢమాల్!
-
జగన్ ధర్నా అన్నపుడే రుణమాఫీ గుర్తుకొస్తుందా?
బాబుపై ధ్వజమెత్తిన పేర్ని నాని పూటకో మాట చెప్పి రైతులను ఏమార్చాలని చూస్తున్నారు రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ అయ్యేదాకా పోరాడతాం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ధర్నా కార్యక్రమం ప్రకటించినపుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకూ, ఆయన మంత్రులకూ రైతుల రుణమాఫీ అంశం గుర్తుకు వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ‘బ్యాంకులకు ఒక్క పైసా కూడా రుణాలు చెల్లించొద్దు, నేను అధికారంలోకి రాగానే మీ ఇంటి పెద్ద కొడుకుగా వాటన్నింటినీ రద్దు చేస్తాను. తాకట్టులో ఉన్న మహిళల నగలన్నింటినీ ఒక పెద్దన్నయ్యలాగా రుణం క ట్టకుండానే మీ ఇంటికి చేరుస్తాను’ అని ఎన్నికలపుడు పదే పదే చెప్పిన చంద్రబాబు, ఆయన మంత్రులు అధికారంలోకి వచ్చాక పూటకో మాట చెప్పి రైతులను ఏమార్చే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.రుణాల మాఫీపై ధర్నా చేస్తామని జగన్ ప్రకటించగానే చంద్రబాబు, ఆయన మంత్రులు రైతులను వంచించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మా అధ్యక్షుడు ధర్నాలు చేస్తామని ప్రకటించినపుడే వారికి రైతుల రుణమాఫీ గుర్తుకొస్తుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు జపాన్ పర్యటన నుంచి తిరిగి రాగానే రుణాల మాఫీ చేస్తారని మంత్రులు చెప్పారని గుర్తుచేశారు. కానీ ఆయన రాగానే ‘ఇంకా రుణాల మాఫీ జరగలేదా...?’ అని మంత్రులపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన హావభావాలన్నీ వివిధ టీవీ చానెళ్లు రకరకాలుగా చూపించడం నాటకీయంగా ఉందని ఎద్దేవా చేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో రూ. 87 వేల కోట్ల రుణాలుండగా... రాష్ట్రంలో నిజమైన రైతులు 43 లక్షల మందేనని తేల్చి, రైతు రుణాలను ఏ 5 వేల కోట్లో, పది వేల కోట్ల రూపాయలకో పరిమితం చేసేలా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. చేపలు, రొయ్యల రైతులు, ట్రాక్టర్లు, ఉద్యానవన పంటలకోసం తీసుకున్న రుణాలను మాఫీ పరిధి నుంచి మినహాయించారని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి పూర్తిగా రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ అయ్యేంతవరకూ తమ పార్టీ పోరాటం చేస్తుందని నాని స్పష్టం చేశారు. రైతులకు వెన్నంటి నడుస్తామన్నారు. -
వాగ్దాన భంగం దెబ్బకు డ్వాక్రా ఢమాల్!
* చంద్రబాబు హామీలతో కుదేలైన పొదుపు సంఘాలు * సగానికి సగం పడిపోయిన సభ్యుల పొదుపు.. బ్యాంకు లోన్లూ లేవు * సంఘాల సమావేశాలకే దూరమైన మహిళలు * తొలుత రుణ మాఫీ హామీ, తర్వాత కార్పస్ ఫండ్ అంటూ మాట మార్పు * తాజాగా ఒక్కో సభ్యురాలికి రూ.10 వేలు ఇచ్చే యోచన.. ఇప్పటికి రూపాయి కూడా అందని సాయం * పొదుపు ఖాతాల్లోని సొమ్ముతో పాటు దాదాపు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ కూడా జమ * లబోదిబోమంటున్న మహిళలు.. ఇసుక రీచ్‌ల పేరిటా సర్కారు దగా సాక్షి, హైదరాబాద్: అమలుకు నోచని చంద్రబాబునాయుడు హామీలతో అన్నదాతలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలూ దారుణంగా మోసపోయారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన సుమారు రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ హామీపై.. అధికారంలోకి రాగానే చంద్రబాబు మాట మార్చారు. కార్పస్ ఫండ్ ఇస్తామన్నారు. ఇప్పుడు మంత్రులు సభ్యురాలికి రూ.10 వేల చొప్పున సాయం అంటున్నారు. ఇప్పటికి మహిళలకు రూపాయి కూడా అందలేదు. రాష్ట్రంలో పదిహేనేళ్ల పాటు ఇటుక ఇటుక పేర్చి నిర్మించుకున్న డ్వాక్రా వ్యవస్థ కేవలం ఆరు నెలల్లోనే కకావికలమైపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 6,64,723 సంఘాల్లో సుమారు 6.5 లక్షల సంఘాల పనితీరు గణనీయంగా మందగించింది. కేవలం 708 సంఘాలే ‘ఏ’ గ్రేడ్‌లో ఉండటం గమనార్హం. మహిళల్లో విప్లవం మాదిరి వెల్లివిరిసిన పొదుపు చైతన్యం ఒక్కసారిగా చతికిలపడిపోయింది. సభ్యుల పొదుపు సగానికి సగం పడిపోయింది. వారానికో, నెలకొకసారో తప్పనిసరిగా సంఘాల వారీగా సమావే శమయ్యే సభ్యులు అటువైపే వెళ్లడం లేదు. దీంతో మహిళల పొదుపు విషయంలోనూ, వారికి రుణాలు అందడంలోనూ ఒకనాడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో.. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకే బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6,64,723 వరకు పొదుపు సంఘాలుండగా, ఆరు నెలల కిందటి వరకు అందులో 5 లక్షల వరకు సంఘా లు బాగా పనిచేసే ఏ గ్రేడ్ (సంఘాల పనితీరు ఆధారంగా ప్రభుత్వమే సంఘాలకు గ్రేడ్లు ఇస్తుంది)లో ఉండేవి. కానీ నవంబర్ నెల గణాంకాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుత పొదుపు సంఘాల దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. 6,64,723 సంఘాల్లో కేవలం 708 సంఘాలు మాత్రమే ‘ఏ’ గ్రేడ్ కిందకు వచ్చాయి. రెండో కేటగిరీలో మరో 29,850 సంఘాలు ఉంటే.. మిగిలిన దాదాపు 6.3 లక్షల సంఘాలు సీ, డీ కేటగిరీలో ఉన్నాయి. క్రమం తప్పకుండా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడం, సభ్యుల హాజరు, పొదుపు తీరు, సంఘాలు అంతర్గతంగా, బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలను సకాలం చెల్లించడం వంటి 11 అంశాల ఆధారంగా సెర్ప్ అధికారులు సంఘాలకు గ్రేడ్లను ఇస్తుంటారు. మహిళలు తాము తీసుకున్న రుణాలను బాబు హామీలను నమ్మి తిరిగి బ్యాంకులకు చెల్లించకపోవడంతో.. అవి డ్వాక్రా గ్రూపులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఇచ్చిన రుణాల బకాయిలు చెల్లించాలని ఒత్తిడిచేస్తున్నాయి. పొదుపు ఖాతాల్లోని నిధులతో పాటు, కార్పస్ ఫండ్‌ను బకాయిలకు జమ చేసుకుంటున్నాయి. కార్పస్ ఫండ్‌కూ ఎసరు ఆగస్టు రెండో పక్షంలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నివేదిక సమర్పిస్తూ.. అప్పటివరకు రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల పేరిట రూ.4,025 కోట్ల కార్పస్ ఫండ్ (సంచిత నిధి) ఉందని పేర్కొన్నారు. (సభ్యులు చేసుకున్న పొదుపు మొత్తం, దానిపై వచ్చిన వడ్డీ, సంఘాలకు ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఇచ్చే మొత్తం కలిపి కార్పస్ ఫండ్‌గా పిలుస్తారు) మంత్రి అసెంబ్లీకి నివేదిక సమర్పించిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో డ్వాక్రా మహిళలు ప్రతి నెలా రూ.30 కోట్ల వరకు పొదుపు చేసుకున్నారు. ఆ మేరకు రూ.4,100 కోట్లకు పైగా పెరగాల్సిన కార్పస్ ఫండ్ విచిత్రంగా తరిగిపోయిం ది. నవంబర్ 15వ తేదీ నాటికి రూ.4,022 కోట్ల కార్పస్ ఫండ్ మాత్రమే ఉందని సెర్ప్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు వంద కోట్ల కార్పస్ ఫండ్‌ను బ్యాంకులు బకాయిలు కింద జమ చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఇసుక వ్యాపారం మహిళలది.. లాభం ప్రభుత్వానిది! డ్వాక్రా రుణాలు మాఫీ చేయని ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను ఆ సంఘాలకు అప్పగించినట్టు చెప్పుకుంటోంది. వారి ఆధ్వర్యంలోనే అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ మహిళలకు చిల్లర మాత్రమే దక్కుతోంది. రాష్ట్రంలో రూ.42 కోట్ల విలువైన ఆరున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరగగా, వ్యాపారం చేసిన డ్వాక్రా సంఘాలకు దక్కుతున్నది రూ.20 లక్షలు మాత్రమే. రూ.42 కోట్ల లో ఖర్చులు పోను ప్రభుత్వానికి సుమారు రూ.30 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి క్యూబిక్ మీటరు ఇసుక అమ్మకంపై మహిళలకు మూడు రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. చంద్రబాబు కప్పదాట్లు ఇలా.. 2014 మార్చి 30: టీడీపీ అధినేతగా చంద్రబాబు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. ‘ఆర్థిక చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం’ అంటూ హామీ ఇచ్చారు. 2014 జూన్ 8: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేసిన సందర్భంగా రైతు, చేనేత రుణాలతో పాటు డ్వాక్రా రుణాలు మాఫీకి ఉద్దేశించిన ఫైలుపై తొలి సంతకం. 2014 జూలై 21: రాష్ట్ర రెండవ మంత్రివర్గ సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా గ్రూపు రుణాలు మాఫీకి బదులు ప్రతి గ్రూపునకు లక్ష రూపాయల చొప్పన ఆయా సంఘాల కార్పస్ ఫండ్‌కు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. (ఇప్పుడు మంత్రు లు చెబుతున్న దాన్నిబట్టి ప్రతి డ్వాక్రా గ్రూపునకు లక్ష రూపాయల సాయానికి బదులు, సంఘం లో ప్రతి సభ్యునికి పది వేలు సాయంగా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే సంఘం లో పది మంది సభ్యులుంటే లక్ష, 8 మందే సభ్యులుంటే రూ.80 వేలే చెల్లిస్తారన్నమాట) తాజా పరిస్థితి: చంద్రబాబు అధికారం చేపట్టి రేపోమాపో ఆరు నెలలు పూర్తి కావస్తోంది. ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా చెప్పినా.. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు రూపాయి సాయం కూడా అందలేదు. బ్యాంకుల్లో మర్యాద పోయింది.. మీ బాధలు గమనిస్తున్నా. కష్టాల్లో తోడుంటామన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటల గారడీ చేశారు. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ఇంతకుముందు బ్యాంకుకు వెళితే మర్యాదగా చూసేవారు. హామీ నమ్మి బ్యాంకుల్లో విశ్వాసం కోల్పోయాం. - జయశీల, గృహిణి, విజయవాడ -
పంట రుణాలనే మాఫీ చేస్తానన్నా
టీడీపీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు * ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు రద్దు చేస్తామని హామీ ఇచ్చా * మొదటి విడత చెల్లించిన తర్వాత రుణాలు రీషెడ్యూలు చేయిస్తాం * డ్వాక్రా మహిళలు ఎక్కడంటే అక్కడ డబ్బులు తీసుకోవడం వల్లే అప్పులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతులు పంట పైన తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామని చెప్పామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నా రూ.1.50 లక్షలు మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చానన్నారు. మహిళలు ఎక్కడంటే అక్కడ రుణాలు తీసుకోవడం వల్ల తిరిగి చెల్లించే శక్తి లేక అప్పుల ఊబిలో చిక్కుకుపోయారని వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహిం చారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల ప్రతినిధులు హాజరైనా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు 113 మంది ఆహ్వానితులు డుమ్మా కొట్టడం గమనార్హం. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సంతకాలు పెట్టాను. వీటిలో రైతుల రుణాల మాఫీ ముఖ్యమైనది. అయితే ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తాం. తర్వాత రుణాలు రీషెడ్యూల్ చేయిస్తాం. ఈ నెలాఖరులోగా ఈ హామీని నిలబెట్టుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఆరు నెలల్లోపు దీనిని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. డ్వాక్రా సభ్యులు ప్రతి ఒక్కరికీ రూ. 10 వేల చొప్పున రుణ విముక్తులను చేస్తామని హామీ ఇచ్చాం. కొన్ని బ్యాంకులు రుణాలకు వడ్డీ తీసుకుంటున్నాయి. మహిళలు వడ్డీ కడితే తిరిగి ఇస్తాం. వడ్డీ కట్టకపోతే పూర్తిగా చెల్లిస్తాం. రైతులను రుణ విముక్తులను చేయడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతు సాధికారిత సంస్థ పెట్టాం. రాష్ట్రమంతా ఇసుకను ఇష్టానుసారంగా దోచుకున్నారు. అందుకనే డ్వాక్రా సంఘాలకు ఇచ్చాం. వాళ్లకు ఖర్చులు ఇస్తాం. పని కల్పిస్తాం. ్హ కరెంటు విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఇళ్లకు 24 గంటలు, వ్యవసాయానికి 7 గంటలు కరెంటు ఇస్తున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ్హ ఎర్రచందనం దొంగల భరతం పడతాం. స్మగ్లర్లు పగలంతా రాజకీయాలు చేస్తారు. రాత్రులు స్మగ్లింగ్ చేస్తారు. కరెంటు, సాగునీటి విషయంలో రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న దానినే అమలుచేస్తున్నాం. కానీ, దాన్ని వక్రీకరించి సమస్యలు సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదని అక్కడుండే వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి పెన్నాలో కలిపితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది. -
ఇక ఏటా వనమహోత్సవం
విశాఖ రూరల్ : ఇకపై ప్రతి సంవత్సరం వనభోజనాలను ప్రభుత్వపరంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం వుడా కైలాసగిరిని సందర్శించిన సీఎం అక్కడ డ్వాక్రా మహిళలతో కలిసి వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం నాల్గో సోమవారం చాలా దివ్యమైన రోజని, కైలాసగిరిపై వనభోజనాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వనభోజనాలంటే చెట్లకు పూజ చేస్తారని, చెట్ల కింద కూర్చొని భోజనం చేయాలని, ఆ విధంగా ప్రకృతిని ప్రేమించడం మన సంప్రదాయమన్నారు. ప్రతి చోటా వన భోజనాలు చేసుకోవాలని, గ్రామంలోని ప్రజలందరూ పా ల్గొనాలని పిలుపునిచ్చారు. చెట్లను నాటడం, వాటిని పెంచడం పవిత్ర కార్యమని చెప్పారు. డ్వాక్రా మహిళలు వనమహోత్సం, వనభోజన కార్యక్రమాల్లో పాల్గొని చెట్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. చెట్లను పెంచితే వర్షాలు బాగా కురుస్తాయని, గాలిలో ఆక్సిజన్ పెరుగుతుందని, ఎండలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఇది వరకే ఆ విషయాన్ని నిరూపించారని తెలిపారు. వారి కృషి మూలంగా జనాభా నియంత్రణ, అక్షరాస్యతలో అభివృద్ధి సాధించామన్నారు. ప్రత్యేక కోర్సు: డ్వాక్రా సంఘాల మహిళల ఆదాయం పెంచుకొనేందుకు, స్త్రీల ఆరోగ్య రక్షణపై డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేకమైన కోర్సును ప్రవేశపెడతామని వెల్లడించారు. దానిపై పరీక్షలు కూడా నిర్వహిస్తామని, ఈ కోర్సులో డిగ్రీ వరకు చదువుకోవచ్చని చెప్పారు. కైలాసగిరిపై చెట్ల ప్రూనింగ్ చక్కగా చేశారని అధికారులను అభినందించారు. గేట్ వేగా విశాఖ : సముద్ర తీర ప్రాంతంలో ఉన్న విశాఖతో పాటు తీర ప్రాంత పట్టణాలను గేట్‌వే ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మన రాష్ట్రం పల్లపు ప్రాంతంలో ఉం దని, పై రాష్ట్రాల నుంచి వచ్చిన గోదావరి, కృ ష్ణా, వంశధార, నాగావళి వంటి నదుల ద్వారా వచ్చిన నీరు ఎక్కువ భాగం వృథాగా సముద్రంలో కలిసిపోతుందని తెలిపారు. ఒక్క గోదావరిలోనే 500 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోందన్నారు. ఆ నీటిని ఒడిసి పట్టి ఉపయోగించుకోవాలని సూచించారు. తద్వారా వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవచ్చని వివరించారు. ప్రజా చైతన్యం ద్వారానే ఇవి సాధ్యపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.నారాయణ, సిహెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ల కక్కుర్తి
డ్వాక్రా సంఘాల నుంచి ఐకేపీ సిబ్బంది అక్రమ వసూళ్లు లక్ష రూపాయల రుణం ఇస్తే రూ.2 వేలు పైనే ముడుపులు పీఆర్పీలు, సీవోలు, సీసీ, సమాఖ్య ప్రతినిధులకు వాటాలు జనశ్రీ బీమా సొమ్ము అందజేతలోనూ చేతివాటం చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు మచిలీపట్నం : డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు సహకరించాల్సిన సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. ఏదైనా డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల రుణం వస్తే రెండు నుంచి మూడు శాతం కమీషన్ రూపంలో కాజేస్తున్నారు. ఇందిరా క్రాంతి పథం, మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాల పనితీరును పర్యవేక్షంచి వారికి వివిధ బ్యాంకుల్లో రుణాలు మంజూరయ్యేందుకు సిఫార్సు చేయాల్సిన సిబ్బంది ఇందుకు గాను కమీషన్లు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 58,250 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 27,321 సంఘాలకు రూ.893.66 కోట్లు, ఈ ఏడాది 6,912 గ్రూపులకు రూ.236.57 కోట్లు రుణాలుగా అందజేశారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణం మంజూరైన వెంటనే సంఘానికి సంబంధించిన లీడర్, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్, రిసోర్స్ పర్సన్, గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు, బుక్‌కీపర్లు, బ్యాంకు మిత్ర తదితరులకు నగదు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా ఒక డ్వాక్రా సంఘం బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకుంటే వెయ్యి రూపాయలు కమ్యూనిటీ కో-ఆర్డినేటరుకు, రూ.200 నుంచి రూ.300 గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు, రూ.200 బుక్ కీపరుకు, రూ.100 బ్యాంకు మిత్రకు, మరో రూ.200 ఇతరత్రా ఖర్చుల కోసం కమీషన్ రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. లక్ష రూపాయలకు రూ.2 వేలు చొప్పున కమీషన్లకే సరిపోవటంతో బ్యాంకులో రుణం తీసుకున్న డ్వాక్రా సంఘ సభ్యులకు అప్పులు మిగులుతుండగా ఐకేపీ, మెప్మాలలో పనిచేస్తున్న సిబ్బంది లక్షలు కళ్లజూస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.100 కోట్లు రుణాలుగా అందజేస్తే దీనిలో రూ.2 కోట్లు కమీషన్ల రూపంలోనే సమర్పించాల్సిన దుస్థితి నెలకొంది. ఇంతా జరుగుతున్నా ఈ కమీషన్ల వ్యవహారాన్ని కట్టడి చేసే వారే కరువయ్యారు. రుణాలు మంజూరు చేసేదిలా... డ్వాక్రా సంఘానికి రుణం మంజూరు చేయాలంటే ఈ సంఘం సక్రమంగా పనిచేస్తున్నట్లు ముందుగా గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ధ్రువీకరించాలి. అక్కడి నుంచి ఈ సంఘం ఏ ఇతర బ్యాంకులోనూ రుణం తీసుకోలేదని కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ధ్రువీకరిస్తూ సంతకాలు చేయాలి. గ్రామైక్య సంఘాల వద్ద ఉండే బుక్‌కీపర్లు దీనికి సంబంధించిన రికార్డులు రాయాలి. దీంతో పాటు రిసోర్స్పర్సన్లు డ్వాక్రా సంఘం సక్రమంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ చేయాలి. వీరంతా సంతకాలు చేసి సంబంధిత పత్రాలను బ్యాంకులో సమర్పించిన తర్వాత.. అన్నీ సక్రమంగా ఉంటే బ్యాంకు మేనేజరు రుణం మంజూరు చేస్తారు. రుణం మంజూరైన వెంటనే గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, బుక్‌కీపర్లు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లకు మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది రూ.236.57 కోట్లు మాత్రమే రుణాలుగా అందజేసినా, కమీషన్ల రూపంలో రూ.4.7 కోట్లు చేతులు మారటం గమనార్హం. జనశ్రీ బీమా మంజూరులోనూ చేతివాటం డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు ఎవరైనా మరణిస్తే వారికి జనశ్రీ బీమా యోజన పథకం ద్వారా బీమా సొమ్ము చెల్లిస్తారు. ఎవరైనా సభ్యురాలు సహజ మరణం పొందితే ఆమె కుటుంబానికి రూ.30 వేలు అందజేస్తారు. గత ఏడాది జనశ్రీ బీమా యోజన పథకాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న బందరు మండలంలో ఐకేపీలో పనిచేసిన ఓ ఎకౌంటెంట్ దాదాపు రూ.50 లక్షల వరకు సొమ్ము కాజేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో కమ్యూనిటీ కో-ఆర్డినేటర్‌ను, ఎకౌంటెంట్‌ను సస్పెండ్ చేసిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ సొమ్ము ఇప్పటి వరకు రికవరీ కాకపోవటం గమనార్హం. తాజాగా మచిలీపట్నం పురపాలక సంఘంలోని 34వ వార్డులో ఓ డ్వాక్రా మహిళ చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యురాలు వరలక్ష్మి నామినీగా ఉన్నారు. ఈ వార్డులో వరలక్ష్మి అనే మహిళ రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన బీమా మిత్ర నామినీ ఖాతాలో కాకుండా రిసోర్స్ పర్సన్ ఖాతాలో ఈ నగదును జమ చేయించి గుట్టుచప్పుడు కాకుండా డ్రా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేకం జరుగుతూనే ఉన్నాయని, అధికారులు వీటిపై దృష్టిపెట్టాలని పలువురు డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. -
రండి.. ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు (అగ్రికల్చర్): షరతుల్లేని రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టేందుకు పిలుపునిచ్చింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ నగరంలో కార్పొరేషన్ ఎదుట, అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టేందుకు పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికా రంలోకి రావడమే ధ్యేయంగా అన్ని రకాల వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే హామీలకు నీళ్లొదలడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతు రుణమాఫీకి రోజుకో ప్రకటన.. పూటకో నిబంధన మారుస్తూ అడ్డగోలు కోత విధుస్తుండటంతో రైతులు గుర్రుమంటున్నారు. 2013 డిసెంబర్ చివరి వరకు రుణాలు తీసుకున్న 5.24 లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదించారు. వీటిని ఆధార్, ఇతరత్రా నిబంధనల పేరిట కోత విధిస్తుండటంతో రుణమాఫీ కొందరికే పరిమితమవుతోంది. ఈ విషయంలోనూ స్పష్టత లేకపోవడంతో రైతులపై జనవరి 1 నుంచి అక్టోబర్ వరకు రూ.261 కోట్ల వడ్డీ భారం పడుతోంది. ఇక ఎన్నికల ముందు డ్వాక్రా రుణాల మాఫీకి బాబు స్పష్టమైన హామీ ఇచ్చినా.. అధికారంలోకి రాగానే తూట్లు పొడిచారు. రివాల్వింగ్ ఫండ్ కింద సంఘానికి రూ.లక్ష ఇస్తున్నట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఈ మొత్తం ఎప్పటికి విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. రైతులు, డ్వాక్రా మహిళల నమ్మకాన్ని వమ్ము చేసిన ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బుధవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళనలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా కర్నూలులో నగరపాలక సంస్థ ఎదుట చేపట్టనున్న ఆందోళనకు రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. -
‘ఇసుక'ను మించిన కిరాయి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్వాక్రా గ్రూపులకు రీచ్‌లు కేటాయించినా ఇసుక కొనుగోలు భారంగానే మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు డ్వాక్రా గ్రూపులు ఇసుకు విక్రయిస్తున్నా ట్రాన్స్‌పోర్టు రంగం సిండికేట్ కావడంతో ఇసుక భారం తగ్గడం లేదు. రీచ్‌ల ప్రారంభ దశలోనే ఇలా ఉంటే మున్ముందు ధర ఇంకా పెరగనుందని వ్యాపారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇసుక ధర అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు రీచ్‌లు కేటాయించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొత్త విధానం ఆరంభంలోనే పక్కదారి పడుతోంది. జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, తుళ్లూరు, రాయపూడి రీచ్‌లను ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు కేటాయించింది. రీచ్ వద్ద క్యూబిక్ మీటరు ఇసుకు రూ.650ల చొప్పున ట్రాక్టరు ట్రక్కు (మూడు క్యూబిక్ మీటర్ల)ను రూ.1950లకు అమ్ముతున్నారు. అయితే ట్రాక్టర్ల యజమానులు పది కిలోమీటర్ల దూరానికి రూ.2,500 రవాణా చార్జీ వసూలు చేస్తుండటంతో మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక రూ.4500 లకు కొనుగోలు చేసినట్టవుతోంది. పది నుంచి 20 కిలోమీటర్ల దూరానికి రవాణా చార్జీలుగా రూ. నాలుగు వేలు వసూలు చేస్తున్నారు. మంగళగిరి, విజయవాడ బెంజి సర్కిల్ వంటి ప్రాంతాల వారు ట్రక్కు ఇసుకను రూ.6 వేలకు కొనుగోలు చేసినట్టవుతోంది. తాడేపల్లి మండలంలోనే దాదాపు 100 ట్రాక్టర్లు వరకు ఉన్నాయి. యజమానులు రవాణా చార్జీలను తగ్గించకపోవడంతో ఇసుక కొనుగోలులో పెద్దగా మార్పు రాలేదు. ఇసుక ధర కంటే రవాణా చార్జీలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. తుళ్లూరు మండలం రాయపూడి రీచ్ ప్రారంభమైనా, వే బిల్లులు లేకపోవడంతో ఇసుక అమ్మకాలు రెండో రోజు నుంచి నిలిచి పోయాయి. రెండు రోజుల్లో ఇసుక అమ్మకాలు ప్రారంభమవుతాయని గ్రూపు సభ్యులు చెబుతున్నారు. పక్కదారి పట్టిన నిబంధనలు ... ఇసుక ధర తగ్గింపు, రీచ్‌ల వద్ద కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు కేటాయించింది. అయితే ట్రాక్టర్ల యజమానుల వల్ల ఇసుక కొనుగోలు భారం తగ్గడం లేదు. అదే విధంగా రీచ్‌ల వద్ద పొక్లయిన్ల వాడకం వల్ల కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటం లేదు. ఉండవల్లి రీచ్‌లో నది నుంచి పడవలపై తీసుకువచ్చిన ఇసుక ను డంపింగ్ యార్డులో నిల్వ చేయాలి. ఈ విధానంలో కార్మికులకు ఉపాధి లభిస్తుంది. పడవల నుంచి తీసుకువచ్చిన ఇసుకను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేయకుండా నేరుగా పడవల నుంచి పొక్లయిన్ సహాయంతో ట్రాక్టరుకు లోడ్ చేస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. -
మాయ చేస్తే ఉద్యమిస్తాం
రుణమాఫీ అంశంపై సీపీఎం నేత రాంభూపాల్‌రెడ్డి గుంతకల్లు టౌన్: రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయకపోతే ఉద్యమించక తప్పదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మార్కెట్ యార్డులో గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లోని సీపీఎం కార్యకర్తలకు వర్క్‌షాప్ నిర్వహించారు. సీపీఎం గుంతకల్లు డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ రుణాలమాఫీకి సంబంధించి ఎంపీ సుజనాచౌదరి తాజాగా చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. రుణాల మాఫీపై ఒక్కో మంత్రి ఒక్కో ప్రకటన చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రుణాలను మాఫీ చేయకపోతే చంద్రబాబును ప్రజలు రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేయడం ఖాయమన్నారు. అక్టోబర్ 13 లోగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు నల్లప్ప, గుంతకల్లు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళలకు ఐపాడ్లు: మంత్రి పల్లె
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి డ్వాక్రా మహిళకూ త్వరలో ఓ ఐపాడ్‌ను అందించి ప్రతి ఇంటినీ ఒక పారిశ్రామిక గృహంగా మార్చనున్నామని రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ రంగంలో 5, ఎలక్ట్రానిక్స్ రంగంలో 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విజయవాడలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పాత్రికేయులకు నగదు రహిత ఎన్టీఆర్ ఆరోగ్య కార్డులను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి విలేకరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
పింఛన్లకు ‘సర్వే' కత్తెర
జిల్లాలోని పింఛన్లు.. వృద్ధాప్య 151103 వితంతువులు 113459 వికలాంగులు 38343 చేనేత కార్మికులు 4067 కల్లుగీత కార్మికులు 124 అభయహస్తం 18,869 మొత్తం 3,25,965 కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికలకు ముందు అధికారం కోసం హామీలిచ్చిన చంద్రబాబు, అధికారం చేపట్టిన తర్వాత హామీల అమలుకు ఎలా గండికొట్టాలో చూస్తున్నారు. ఆల్‌ఫ్రీ బాబు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల రుణమాఫీకి నిబంధనల పేరుతో అవరోధాలు సృష్టించారు. డ్వాక్రా రుణాల మాఫీ లేదని తేల్చేశారు. ఇప్పుడు సామాజిక భద్రతా పింఛన్లకు కోత పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రావడంతో లబ్ధిదారులు సంతోషించారు. అయితే సర్వే పేరుతో లబ్ధిదారులను తగ్గించడానికి మార్గదర్శకాలు విడుదల చేయడంతో వారిలో ఆందోళన నెలకొంది. సామాజిక భద్రతా పింఛన్ల మొత్తాన్ని అక్టోబర్ 2 నుంచి పెంచుతున్న ప్రభుత్వం అంతకుముందు వాటిలో భారీగా కోత వేయడానికి సిద్ధమైంది. అనర్హత పేరుతో పింఛన్లను తొలగించడం ద్వారా ఆదా అయ్యే మొత్తంతో పెంపు ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది. పింఛన్‌దారులకు అర్హత ఉందా లేదా అని నిర్ణయించే అధికారం రాజకీయ పదవుల్లో ఉన్నవారికి అప్పగించడం వల్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులకే పింఛన్లు దక్కే అవకాశం ఉంది. గ్రామ, వార్డు స్థాయి కమిటీల్లో తెలుగుదేశం కార్యకర్తలకే పెద్దపీట వేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ఎంపిక చేయకుండా పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారిని సభ్యులుగా నియమించడాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. పింఛన్లకు ఆధార్, రేషన్ కార్డులను అనుసంధానం చేస్తుండటం వల్ల చాలా మంది పింఛన్లు కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు నిబంధనలను కఠినతరం చేయడం వల్ల అనేక మంది పింఛన్‌దారులపై అనర్హత వేటు పడే అవకాశముంది. మార్గదర్శకాలు.. పింఛన్లను విధిగా ఆధార్, రేషన్ కార్డులతో అనుసంధానం చేస్తారు. 2.5 ఎకరాలలోపు ఆయకట్టు లేదా 5 ఎకరాలు మెట్ట లేదా రెండూ కలిపి 5 ఎకరాలలోపు భూమి కల్గినవారే అర్హులు. ఏడాదికి ప్రభుత్వపరంగా కానీ లేదా ప్రైవేటుపరంగా కాని రూ.60 వేల పైబడి ఆదాయం వచ్చేవారికి అర్హత ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా అర్హతను కోల్పోతారు. వితంతు పింఛన్ తీసుకునే మహిళలు విధిగా భర్త మరణించినట్లు ధ్రువీకరణ పత్రం చూపాలి. చేనేత కార్మికులు కూడా తగిన గుర్తింపు పత్రాలు చూపాల్సి ఉంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికే పింఛన్లు వరిస్తాయి. భారీగా పింఛన్లు కోల్పోయే ప్రమాదం.. ప్రభుత్వం చేపట్టిన విచారణ వల్ల భారీ ఎత్తున పింఛన్లు రద్దు అయ్యే అవకాశం ఉంది. అయిదేళ్ల క్రితమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లపై సర్వే చేసి బోగస్ పింఛన్లను తొలగించింది. ఇందువల్ల బోగస్ పింఛన్‌కు తావు లేదు. కానీ పింఛన్లలో భారీ కోత పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులకు పెద్దపీట వేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ పదవుల్లో ఉన్నవారితో సర్వే చేపట్టడం చర్చనీయాంశం అయింది. గ్రామస్థాయిలో సర్పంచు, అర్బన్ ప్రాంతాల్లో వార్డు సభ్యుల ఆధ్వర్యంలోని కమిటీల ముందు పింఛన్‌దారులందరూ హాజరు కావాల్సిందే. వెరిఫికేషన్‌కు రాకపోతే బోగస్‌గా భావించి తొలగిస్తారు. వెరిఫికేషన్ కమిటీ ముందుకు రాలేని వారిని కనీసం పంచాయతీ సెక్రటరీ, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ మహిళలు గుర్తించాల్సి ఉంది. మొత్తం మీద వెరిఫికేషన్ పింఛన్దారులలో గుబులు రేపుతోంది. హడావుడిగా పరిశీలన.. సామాజిక భద్రతా పింఛన్లను తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం హడావుడిగా పరిశీలన కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇది కూడా ఈ నెల 21వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇంతవరకు కమిటీలు కూడా ఏర్పడలేదు. వెరిఫికేషన్ ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో 3.27 లక్షలకుపైగా పింఛన్లు ఉన్నాయి. ఇన్ని పింఛన్లను ఇంత తక్కువ సమయంలో వెరిఫికేషన్ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. సర్పంచు/వార్డు సభ్యుడు సూచించిన వారికే పింఛన్లు ఉంటాయి. పింఛన్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల లబ్ధిదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పింఛన్ల మొత్తాన్ని పెంచినట్లే పెంచి లబ్ధిదారుల్లో భారీగా కోత కోయడానికి సిద్ధం కావడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
చంద్రబాబు హామీ..అమాస నాటి వెన్నెలే
‘చేసిన బాసను విస్మరించిన మోసకారి చంద్రబాబు’ అని డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ సంక్షేమం కోసం తపిస్తున్నట్టు.. ఎన్నికల ముందు ఆయన ఆడిందంతా నాటకమని నిందిస్తున్నారు. అధికారం దక్కాక.. ఎప్పటి లాగే నిజరూపం చూపారని, నయవంచనకు పాల్పడ్డారని నిప్పులు కక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో చేసిన దగాయే అందుకు సాక్ష్యమని ఎలుగెత్తుతున్నారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదిస్తున్నారు. సాక్షి, కాకినాడ : రుణాలను మాఫీ చేసి, రైతులు, డ్వాక్రా మహిళల బతుకుల్లో కొత్తవెలుగు నింపుతానన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వాగ్దానం.. ‘అమాస నాటి వెన్నెల’ బాపతేనని ఆ ఇరువర్గాలూ మండిపడుతున్నాయి. ఆయన గద్దెనెక్కి వంద రోజులు దాటిపోయినా ఏ రుణాల మాఫీకి సంబంధించీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా.. అమలుపై రోజురోజుకూ అయోమయం ముసురుకుంటోంది. బేషరతుగా రుణమాఫీ అమలు చేసి తీరాలంటూ ఒకపక్క రైతులు, మరొక పక్క డ్వాక్రా మహిళలు ఉద్యమిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి వందరోజులైన సందర్భంగా సోమవారం డ్వాక్రా మహిళలు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రోడ్డెక్కారు. మాట తప్పిన బాబుపై భగ్గుమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకు ఉన్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని 9.50 లక్షల మంది మహిళలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూశారు. అయితే ఆయన తొలిసంతకం నాటకంగా, రుణమాఫీ బూటకంగా మారిపోవడంతో వీరంతా రుణగ్రస్తులుగా మిగిలారు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్తోనైనా ఊరట చెందవచ్చని ఆశిస్తే.. ఆ మొత్తం ఎప్పుడు తమ ఖాతాల్లో జమవుతుందో చెప్పే దిక్కే లేకుండా పోయింది. దీంతో వడ్డీరాయితీ కోల్పోవడంతో పాటు పేరుకు పోయిన రుణబకాయిల్ని 14 శాతం వడ్డీతో చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతనెల రోజులుగా అడపా దడపా ఆందోళనలు చేస్తున్న మహిళలు.. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సోమవారం వేలాదిమంది ఆందోళనబాట పట్టారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదించారు.ముట్టడులు, బైఠాయింపులు, ర్యాలీలు అమలాపురంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమణి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో ఆవరణలోకి చొరబడి పోర్టికో వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచార ని వాపోయారు. కాగా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వందలాదిమంది సీఐటీయూ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు రంపచోడవరంలో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా చేసిన అనంతరం ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడుకు వినతిపత్రం సమర్పించారు.రాజవొమ్మంగిలో స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలో డ్వాక్రా మహిళలు ప్ర దాన రహదారిపై బైఠాయించారు. కరప ప్రధాన రహదారిపై డ్వాక్రా మహిళలు బైఠాయించి రుణమాఫీ అమలు చేయాలని నినదించారు. బాబు వాగ్దానా న్ని వందరోజులైనా అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. గంటపాటు జరి గిన ఈ ఆందోళన వల్ల ట్రాఫిక్ స్తంభించింది. బేషరతుగా రుణ మాఫీ చేయాలన్న డిమాండ్‌తో పదిగ్రామాల నుంచి వచ్చిన వందలాదిమంది మహిళలు కొత్తపేట లో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఆత్రేయపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన మహిళలు తహశీల్దార్ సత్యవతికి వినతిపత్రం సమర్పించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట బైఠాయించి మేనేజర్ కోటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. -
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన బాబు
అమలాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బూ టకపు హామీ ఇచ్చి నమ్మించి.. నట్టేట ముంచారంటూ మహిళలు మండిపడ్డారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు కోనసీమవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. తొలుత ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇన్చార్జ్ ఆర్డీఓ కుమార్ తమ నిరసనపై కనీసం స్పందించడంలేదంటూ మహిళలు ఎదురుగా ఎన్టీఆర్ మార్గ్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఒక దశలో ఆర్డీఓ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు ఇన్చార్జ్ ఆర్డీఓ వచ్చి మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్.రమణి మాట్లాడుతూ రుణమాఫీ హామీతో సక్రమంగా కార్యకలాపాలు నడిచే డ్వాక్రా గ్రూపులను ఇబ్బందులపాలుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ హామీతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయిన మహిళలకు ఇప్పుడు వడ్డీలు నడ్డివిరుస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఒక పక్క చెబుతూనే అస్పష్టమైన జీఓ ఇవ్వడం వల్ల బ్యాంకులు అప్పులకు వడ్డీలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయని వాపోయారు. నిర్ధిష్ట జీఓ వచ్చే వరకు ఐద్వా ఇలా పోరాటాలు చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 26 నుంచి విజయవాడలో మూడు రోజులపాటు జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలో ప్రధానంగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కె.రాఘవమ్మ మాట్లాడుతూ డ్వాక్రా రుణాల బకాయిలపై వడ్డీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పేలా మహిళలంతా ఐక్యంగా ఉండి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐద్వా అమలాపురం పట్టణ కార్యదర్శి టీఎన్ వరలక్ష్మి, మండల అధ్యక్షురాలు కె.వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మహిళల నిరసనకు మద్దతు తెలిపారు. ఐద్వా నాయకురాళ్లు జి.పద్మ, కె.బీబీకుమారి, డి.మీనాక్షీదేవి, జి.కుమారి తదితరులు పాల్గొన్నారు. -
100 దినాలు..1000 దిగుళ్లు
సాక్షి, కాకినాడ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారని ప్రజలు నిరసిస్తున్నారు. పగ్గాలు చేపట్టగానే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ నమ్మబలికి, పబ్బం గడిచాక మరిన్ని కష్టాల్లోకి నెట్టారని నిట్టూరుస్తున్నారు. రుణమాఫీపై ఆశలు పెంచుకున్న రైతులు, డ్వాక్రా మహిళలైతే.. బాబుపై కారాలుమిరియాలు నూరుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారంతో వందరోజులు పూర్తయ్యాయి. ఈ నూరురోజుల్లోనే ఆయన నిజస్వరూపం విశ్వరూపంలో వ్యక్తమైందని వివిధ వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. ‘పెనం మీంచి పొయ్యి లోకి దూకినట్టు’ ఈ సర్కారును ఎందుకు ఎన్నుకున్నామా అని పదే పదే దిగులు పడుతున్నాయి. జిల్లాలో రూ.8,480 కోట్ల వరకు రుణాలు మాఫీ అవుతాయని నాలుగున్నర లక్షల మంది రైతులు ఆశించగా, రుణమాఫీని లక్షన్నరకే పరిమితం చేసి చంద్రబాబు తొలిదెబ్బ కొట్టారు. పోనీ, అలాగైనా రూ.3500 కోట్లమేర రుణాలు మాఫీ అవుతాయనుకున్నా.. ఇంతవరకూ ఒక్క రైతుకైనా, ఒక్క రూపాయైనా మాఫీ కాలేదు. ఇక జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకున్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆశించిన 9.50 లక్షల మంది మహిళలనూ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా పరిహసించారు. మాఫీ కాదు..రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే ఇస్తామని హతాశుల్ని చేశారు. కనీసం ఆ మొత్తమైనా ఎప్పుడు జమవుతుందో తెలియక వారంతా ఆందోళన బాటపట్టారు. జాడలేని తొమ్మిది గంటల విద్యుత్ అధికారంలోకి రాగానే రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. జిల్లాలో 34,570 ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. తొమ్మిది గంటల స్థానంలో ఏడుగంటలంటూ మాట మార్చిన బాబు అక్టోబర్ 2 నుంచి సరఫరా చేస్తామంటూ వాయిదా వేశారు. ప్రస్తుతం ఏడు గంటలు కాదు కదా కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించడం లేదు. ‘సుజల స్రవంతి’కి సొమ్ములు కరువు ప్రతి కుటుంబానికీ రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తానని ఇచ్చిన హామీ కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. అక్టోబర్ 2 నుంచే ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పేరిట అమలుచేయ తలపెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ‘సొమ్మొకడిది..సోకొకడిది’ అన్నచందంగా కార్పొరేట్ సంస్థలు, దాతల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఇంటికో ఉద్యోగం కాదు.. ఉద్యోగులే ఇంటికి అధికారంలోకి రాగానే ఇంటికోఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దాని మాటెలా ఉన్నా ఉద్యోగాల్ని ఊడబీకే ఉద్యమం చేపట్టినట్టున్నారు. జిల్లాలో 10 వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లను, వెయ్యిమందికి పైగా ఆదర్శ రైతులను, ఏడొందలమందికి పైగా గృహ నిర్మాణశాఖ అవుట్సోర్సింగ్ సిబ్బంది కొలువులను రద్దు చేసి, ఇంటికి సాగనంపారు. ఇక అర్హులైన నిరుద్యోగులకు రూ.2 వేల భృతి ఇస్తామన్న హామీ అటకెక్కింది. సర్వే పేరుతో పేదల గూటికి చేటు.. అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు లక్షన్నరతో, సెంటున్నర భూమిలో ఇల్లు కట్టి ఇంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. పగ్గాలు చేపట్టి మూడు నెలలైనా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ఇల్లు నిర్మించిన దాఖలా లేదు. పైగా ఇందిరమ్మ లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుని జిల్లాలో 10,448 ఇళ్లను రద్దు చేసేందుకు సర్వే చేయిస్తున్నారు. ఆధార లంకెతో పింఛన్లకు కోత.. వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు పెంచుతామన్న బాబు ఆ హామీ అమలకు వాయిదా మంత్రం జపిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయని ఆయన సర్కార్ ఉన్న పింఛన్లకు ఆధార్ లంకె పెట్టి, కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా.. ఎన్నికల ముందు మాదిరిగానే బాబు తన మాయ మాటలతో ప్రజలను ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్మార్ట్‌సిటీలు, ఐటీ హబ్, పెట్రో కారి డార్లంటూ మాటలను కోటలు దాటిస్తున్నారు. నూరురోజుల ఏలుబడిలో..ఎన్నికల హామీలను అణుమాత్రం అమలు చేయని చంద్రబాబు ఇప్పటికీ అరచేతిలో వైకుంఠం చూపే తన గారడీని నమ్ముతారనుకోవడం భ్రమేనని జనం నిరసిస్తున్నారు. ఇకనైనా ‘కోతలు’ మాని, ఎన్నికల హామీల్ని చేతల్లో చూపాలని కోరుతున్నారు. -
రుణమాఫీ కోసం.. పోస్ట్‌కార్డు ఉద్యమం
-
రుణమాఫీ చేయాల్సిందే
రాయచోటి : ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు రైతు, డ్వాక్రా రుణాలు రూ.లక్షా రెండు వేల కోట్లు ఉన్నాయని, తక్షణం వాటిని మాఫీ చేయాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు, డ్వాక్రా మహిళలను వంచించినట్లేన ని ఆయన అన్నారు. రాయచోటిలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రుణాలమాఫీ కోసం కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. అంతటితో ఆగక విడతల వారిగా మాఫీ చేస్తామంటూ రైతులను అయోమయానికి గురి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత రైతులకు తొలుత రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అందాల్సిన పంటనష్ట పరిహారం, పంటల బీమా సైతం రుణమాఫీకే జమ చేస్తామనడం ఏమిటో అంతుబట్టడం లేదన్నారు. దీన్ని బట్టి రైతులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఏమిటో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ లో చర్చించాలని కోరితే అందుకు ప్రభుత్వం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గతంలో బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్న రుణాలకు సైతం మాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో వాటిని రెన్యువల్ చేసుకోలేకపోయారన్నారు. మాఫీతో తాకట్టుపెట్టిన బం గారు తాళిబొట్లను తెచ్చుకోవచ్చని ఆశించారన్నారు. ఇప్పుడు ఉన్నపళంగా నగలు వేలం వేస్తామంటూ బ్యాంకర్లు నోటీసులు పంపడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారన్నారు ప్రభుత్వం స్పందించి వేలం పాటలను నిలిపివేయాలని కోరారు. -
మహిళా సంఘాల నెత్తిన ఇసుక
►విపరిణామాలకు దారి తీయనున్న సర్కారు నిర్ణయం ►ఇసుక ర్యాంపులు డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు సన్నాహాలు ►మాఫియా ఉచ్చులో మహిళలు చిక్కుకునే ప్రమాదం ►రాజకీయ జోక్యాన్నీ అరికట్టలేని పరిస్థితి ►ఫలితంగా ప్రశ్నార్థకం కానున్న సంఘాల ఉనికి ►ఇప్పటికే రుణమాఫీ చిక్కులతో విలవిల శ్రీకాకుళం పాతబస్టాండ్: పొదుపు చేసి.. రుణాలు పొంది.. చిన్నచిన్న వ్యాపార, ఉపాధి యూనిట్లు పెట్టుకోవడం ద్వారా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్న మహిళా సంఘాల నెత్తిన సర్కారు నిర్ణయం ఇసుక కుమ్మరించేలా ఉంది. కలిసికట్టుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలకు ఇసుక క్వారీలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం, అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుండటం తెలిసిందే. అయితే దీనివల్ల తలెత్తే పరిణామాల ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇసుక క్వారీల నిర్వహణ అంటేనే.. మాఫియాలు, రాజకీయ హస్తం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ఇంకెన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నా వీటి జోక్యానికి అడ్డుకట్ట వేయడం సాధ్యంకాదన్నది సుస్పష్టం. గత అనుభవాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇప్పుడు ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగిస్తే వాటిపైనా ఇసుక మాఫియా పెత్తనం పెరుగుతుంది. రాజకీయ జోక్యం అనివార్యమవుతుంది. అదే జరిగితే ఇంతవరకు ప్రశాంతంగా గ్రూపులను, వ్యాపారాలను నిర్వహించుకుంటున్న మహిళా సంఘాలు వివాదాల ఉచ్చులో చిక్కుకుని బలహీనపడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇసుక క్వారీ నిర్వహణ లాభసాటి వ్యాపారం కావడంతో దీన్ని వదులుకొనేందుకు మాఫియా గ్యాంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడవు. ఏదో ఒక విధంగా సంఘాల్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తాయి. ఫలితంగా ఈ సంఘాల పేరుతో బినామీలు పట్టుకొస్తారు. అనైక్యత పెరుగుతుంది. దీనివల్ల సహకార స్ఫూర్తి దెబ్బతిని సంఘాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం విసిరిన రుణమాఫి వలలో చిక్కుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘాల సభ్యులు ఇసుక దందాలతోమరింత అవస్థలపాలవుతారు. 18 రీచ్‌ల గుర్తింపు గతంలో జిల్లాలో నాగావళి, వంశధార నదుల పరివాహక ప్రాంతాల్లో 24 ఇసుక ర్యాంపులు ఉండేవి. క్రమంగా అవి తగ్గుతూ వచ్చాయి. గత కొన్నాళ్లు అధికారిక ర్యాంపులు లేకపోయినా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి. తాజాగా మహిళా సంఘాలకు వీటిని అప్పగించి తవ్వకాలు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాల్లో 18 ర్యాంపులను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ, మౌలిక సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.. నదులు నిండుగా నీటితో కళకళలాడుతుండటంతో ఫిబ్రవరి నెల ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. -
ఇంత మోసమా చంద్రబాబూ?
రుణాలు మాఫీకాకపోవడంపై దుమ్మెత్తిపోసిన డ్వాక్రా మహిళలు తూ.గో., అనంతపురం జిల్లాల్లో ధర్నాలు షరతులు లేని రుణమాఫీ అమలుకు డిమాండ్ మామిడికుదురు/గుత్తి/బుక్కపట్నం: తమ రుణాల రద్దుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విస్మరించడంపై డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోశారు. షరతులు లేని రుణ మాఫీ కోసం సోమవారం ఉద్యమించారు. రుణాలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో టీడీపీ మహిళా నాయకులు సైతం పాల్గొనడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన 40 డ్వాక్రా గ్రూపులకు చెందిన దాదాపు 300 మంది మహిళలు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద బైఠాయించారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘రుణాలు రద్దు చేయమని మేము మిమ్మల్ని అడిగామా? రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చింది మీరే. తీరా అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారా?’ అంటూ మండిపడ్డారు. సక్రమంగా సాగుతున్న డ్వాక్రా గ్రూపుల లావాదేవీలు నిలిచిపోవడానికి రుణమాఫీ హామీ కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ ఎంపీడీఓ ధనలక్ష్మీదేవికి వినతిపత్రం ఇచ్చారు. టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు మొల్లేటి పార్వతి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మొల్లేటి అలివేలు మంగతో పాటు కంచి విజయలక్ష్మి, గుబ్బల వరలక్ష్మి, జక్కంపూడి శాంతమ్మ, కంచి లక్ష్మీకుమారి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఏజెన్సీలోని రాజవొమ్మంగిలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూడా మహిళలు రుణమాఫీ అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్లలోని 28 డ్వాక్రా సంఘాల మహిళలు గుత్తిలోని సిండికేట్ బ్యాంకును గంటన్నరపాటు ముట్టడించారు. రాస్తారోకో, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ర్యాలీగా వెళ్లి ఐకేపీ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ఇలా చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. -
నమ్మించి మోసం చేస్తారా?
గుత్తి/గుత్తి రూరల్/ బుక్కపట్నం : రుణ మాఫీకి షరతులు విధించడంపై డ్వాక్రా మహిళలు కన్నెర్రజేశారు. మాట తప్పితే తమ ఉసురు కొట్టుకుని పోతారంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. నమ్మించి నిండా ముంచారని సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గుత్తి, బుక్కపట్నం మండల కేంద్రాల్లో సోమవారం డ్వాక్రా మహిళలు రుణ మాఫీ కోసం ఉద్యమించారు. ఊబిచెర్లలోని 28 స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలు దాదాపు 400 మంది గుత్తిలోని సిండికేట్ బ్యాంకును గంటన్నరపాటు ముట్టడించారు. బ్యాంకు సీనియర్ మేనేజర్ రెజితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్యాంకు వద్ద నుంచి ఎస్బీఐ, రాజీవ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ర్యాలీతో వెళ్లి గాంధీ సర్కిల్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన ‘రుణ మాఫీ’ హామీని నమ్మి ఆయన్ను అందలం ఎక్కించడంతో పాటు బ్యాంకులకు కంతుల చెల్లింపు ఆపేశామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు మొహం చాటేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ ఆలస్యం కావడంతో తమ పొదుపు ఖాతాల్లోని సొమ్మును తమ ప్రమేయం లేకుండానే కంతులకు జమ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాహన రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించి రాస్తారోకో విరమించారు. అనంతరం అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడా కాసేపు ధర్నా చేశారు. పైసా కూడా తాము చెల్లించేది లేదని, రుణాలన్నీ షరతులు లేకుండా మాఫీ చేసే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. తొలుత ఇందిరక్రాంతి పథం (ఐకేపీ), తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించి, అక్కడే కాసేపు ధర్నా చేశారు. రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో ఐదారు నెలలుగా కంతులు చెల్లించలేదని, ఇప్పుడు అపరాధపు వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకు, ఐకేపీ అధికారులు హుకుం జారీ చేస్తున్నారన్నారు. రుణ మాఫీ చేయకుండా.. బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడికి గురి చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు. వీరి ఆందోళనకు సీపీఐ మండల కార్యదర్శి బ్యాళ్ల అంజి మద్దతు తెలిపారు. -
జగన్ వల్లే రుణమాఫీ అమలు
వైఎస్సార్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం: రైతు, డ్వాక్రా రుణాలపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిని నిలదీయడం వల్లే ఆమాత్రమైనా రుణమాఫీ ప్రకటించారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసిన బాబు అధికారం చేపట్టిన తరువాత కమిటీలతో కాలయాపన చేశార ని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా జగన్ నిలదీయగా షరతులతో కూడిన రుణమాఫీకి బాబు ఒప్పుకున్నారన్నారు. దీన్ని అంగీకరించేది లేదని పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని ధర్మాన ప్రస్తావించారు. రాజధాని నిర్మాణంపై బాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు. తమ వారికి ప్రయోజనం కల్పించేందుకే మంత్రులతో రకరకాలుగా లీకులు చేయిస్తున్నారన్నారు. అధికారం చేపట్టి మూడు నెలలు కావస్తున్నా చంద్రబాబు పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదని విమర్శించారు. వైఎస్ తన పాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగిస్తే బాబు తన పాల నతో ప్రజలను విసిగిస్తున్నారన్నారు. -
మాఫియాకు దేశం దన్ను
ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వాటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించనున్నట్టు టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు...మరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న నిర్వాకం తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే...వారి అక్రమ సంపాదన చూసి అవాక్కవ్వాల్సిందే...రూ.కోట్లకు పడగలెత్తుతున్న కోటరీలను చూస్తే ఖంగుతినాల్సిందే... ఎమ్మెల్యేలనే బెదిరించే స్థాయికి ఇసుక మాఫియా ఎదిగిందంటే ఆశ్చర్యపోవాల్సిందే..! సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక మాఫియా భరతం పడతానంటూ చేస్తున్న హెచ్చరికలను జిల్లాలోని ఆ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మాఫియాకు వెన్నుదన్నుగా నిలుస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సామాన్యులు ఇసుక కొనలేని పరిస్థితిని కల్పిస్తూ అక్రమార్కుల కొమ్ముకాస్తున్నారు. * మామూలుగా రీచ్‌లోకి వెళ్లిన లారీకి రూ. 2,700 తీసుకుని బిల్లు ఇవ్వాల్సి ఉండగా, మొదటి గేటులో ఈ తంతు ముగించి, ఇసుక లోడ్ చేస్తున్న సమయంలో మరో రూ.5 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్క వైకుంఠపురం రీచ్‌లోనే రోజుకు సుమారు మూడు వందల లారీలకు ఇసుక లోడ్ చేస్తున్నారు. * ఇలారోజుకు రూ.15 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారంటే మాఫియా దందా స్థాయి ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు. * గతంలో లారీ ఇసుక మార్కెట్లో రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకూ ధర ఉండేది. మాఫియా అక్రమ వసూళ్ల కారణంగా రెట్టింపు ధర పలుకుతోంది. ప్రస్తుతం లారీ ఇసుకను రూ.12 వేల వద్ద విక్రయిస్తున్నారు. ఇది పేద,మధ్య తరగతి ప్రజలకు భారంగా మారి ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు. * ఈ తంతును మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా, వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు రూరల్ ఎస్పీ పీహెచ్‌డి రామకృష్ణ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సైతం అధికార పార్టీ నేతలకు భజన చేస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. * ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యహరించారనే కారణంతో కొల్లిపర సబ్ఇన్స్పెక్టర్ను వి.ఆర్కు పంపి పోలీసు ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. * అమరావతిలో భారీ స్థాయిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ ఎమ్మెల్యేకి ఇసుక రీచ్‌లో వాటాలు * అక్రమ వసూళ్లకు పాల్పడే ఇసుక రీచ్‌ల్లో జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వాటాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. * ఆయన వాటా కింద నెలకు ఒక్కో రీచ్ నుంచి రూ.10 లక్షలు పంపుతున్నట్లు సమాచారం. అధికారులు ఈ రీచ్‌ల జోలికి రాకుండా ఆ ఎమ్మెల్యే కాపు కాస్తున్నారని అంటున్నారు. * ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డప్పాలు కొడుతుంటే, ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే మాఫీయాతో చేతులు కలపడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేతలను బెదిరించే స్థాయికి మాఫియా.. * రూ. కోట్లలో ఆదాయం వస్తుండటంతో ఇసుక మాఫియా ఎవ్వరినీ లెక్కచేయకుండా వ్యవహరిస్తోంది. రూరల్ ఎస్పీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ వసూళ్లను కొనసాగిస్తూ ఆ శాఖకే సవాలు విసురుతోంది. * ఇసుక అక్రమ తవ్వకాలపై పోరాటానికి దిగిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి మాఫియా నుంచి బెదిరింపు లేఖ రావడాన్ని చూస్తుంటే వారి అరాచకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. * టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తుంటే, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వారిపై పోరాటాలు చేస్తుండడాన్ని ప్రజలు గమనిస్తునే ఉన్నారు. కలెక్టర్, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూలు చేస్తున్నారంటూ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, మైనింగ్ ఏడీ జగన్నాథరావుకు ఫిర్యాదులు చేశారు. లారీకి రూ. 2, 700 వసూలు చేస్తూనే అదనంగా మరో రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని వాపోయారు. స్పందించిన కలెక్టర్ దీనిపై బుధవారం జేసీ వివేక్ యాదవ్‌తో సమావేశం నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
జనానికి ఏం చెప్తారు?
హామీల అమలుకు బడ్జెట్లో నిధులేవీ? ప్రభుత్వంపై విపక్ష నేత జగన్ ధ్వజం ‘‘రాష్ట్రంలో కోటిమంది రైతులు రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. 70 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు రుణాలు రద్దవుతాయని ఆశపడుతున్నారు. రాష్ట్రంలో 1.5 కోట్ల ఇళ్లు ఉన్నాయి.. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవ్వలేకపోతే.. ప్రతి నెలా రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి కోసం యువత ఎదురు చూస్తోంది. పదో వేతన సవరణ సంఘం సిఫారసుల అమలు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్లో నిధులు ఇవ్వలేదు. వాటి అమలు సాధ్యం కాదని, నెపాన్ని గత ప్రభుత్వాల మీద నెట్టాలని చూస్తున్నారు. ఫలితంగా కోట్లాది కుటుంబాల్లో నిరాశ నెలకొంది. అందుకే ఇది నిరాశను నింపే బడ్జెట్.. తప్పుదోవ పట్టించే బడ్జెట్...’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో టీడీపీ సర్కారు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం తదితర ఎన్నికల హామీలకు అధికారంలోకి రాగానే తిలోదకాలు ఇచ్చినట్లు.. ఇప్పుడు కూడా రుణ మాఫీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను తుంగలో తొక్కేస్తారని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రుణ మాఫీ కోసం నిరీక్షిస్తున్న రైతులకు, మహిళలకు, నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్న యువతకు టీడీపీ సర్కారు ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సోమవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేదని తూర్పారబట్టారు. సామాజిక పెన్షన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను కూడా బడ్జెట్లో కేటాయించకపోవడంతో.. వాటి అమలులో కోతలు విధిస్తారన్నది స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. అధికారపక్ష సభ్యులు పలు దఫాలు అడ్డుతగిలినప్పటికీ.. ఆయన గణాంకాలతో సహా విడమరిచి చెప్పారు. అభివృద్ది విషయంలో సర్కారు శ్వేతపత్రాల రూపంలో చేస్తున్న అసత్య, అర్ధసత్య ప్రచారాన్ని దునుమాడుతూ... గత పదేళ్లలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందని పేర్కొంటూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు, తలసరి ఆదాయం పెరిగిన తీరు, రెవెన్యూ మిగులు, జీఎస్డీపీలో అప్పుల శాతం, ఆస్తులు - అప్పుల నిష్పత్తి.. గణాంకాలను సభ ముందు ఉంచారు. జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే... బాబు పాలనకు 57 మార్కులైతే.. వైఎస్ పాలనకు 96 మార్కులు ఏ రాష్ట్రంలోనైనా పాలన ఎలా ఉంది, అభివృద్ధి తీరు ఎలా ఉందో చెప్పడానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ), తలసరి ఆదాయం, రెవెన్యూ లోటు, మిగులు, మొత్తం వ్యయంలో ప్రణాళిక వ్యయం వాటా, జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి, ఆస్తులు - అప్పుల నిష్పత్తి గణాంకాలు, ఆర్థిక నిర్వహణ తీరు, మానవాభివృద్ధి సూచీ, ఆర్థిక స్వేచ్ఛ సూచీ.. ఇవే ఆధారం. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన అయినా.. ఎలా ఉందో చెప్పడానికైనా ఈ అంశాలే గీటురాయి. ఈ ప్రమాణాలు, సూచీల ప్రకారం చూస్తే.. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి జరగలేదని స్పష్టమవుతోంది. జీఎస్డీపీలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు ఇమిడి ఉంటాయి. చంద్రబాబు నాటి హయాంతో పాటు అంతకు ముందు పదేళ్లు, తర్వాత 10 సంవత్సరాల్లో జీఎస్డీపీ వృద్ధిరేటును చూస్తే అభివృద్ధి తీరు అర్థమవుతుంది. జీఎస్డీపీ వృద్ధి రేటును సాధారణ పరిభాషలో చెప్తే.. చంద్రబాబు నాటి హయానికి ముందు పది సంవత్సరాల్లో (1984-94 కాలంలో) 53 మార్కులు వస్తే, చంద్రబాబుకు (1994-2004 కాలంలో) 57 మార్కులు, వై.ఎస్.రాజశేఖరరెడ్డికి (2004 నుంచి 2009 వరకు) 96 మార్కులు, తర్వాత ప్రభుత్వాలకు (2009 నుంచి 2014 వరకు) 68 మార్కులు వచ్చాయి. తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో రూ. 15,502 నుంచి రూ. 23,448కి పెరిగింది. అంటే పెరుగుదల రూ. 7,946. వైఎస్ హయాంలో తలసరి ఆదాయం రూ. 23,448 నుంచి రూ. 46,345కు పెరిగింది. అంటే రూ. 22,897 పెరిగింది.ఆర్థిక నిర్వహణ కూడా గత పదేళ్లలో బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్న పదేళ్లలో రెవెన్యూ లోటు రూ. 21,994 కోట్లు ఉండగా, తర్వాత రెండేళ్లలోనే వై.ఎస్.రాజశేఖరరెడ్డి లోటును పూడ్చారు. 2004 నుంచి 2014 వరకు రూ. 10,329 కోట్ల మిగులు సాధించారు. ఆస్తులు - అప్పుల నిష్పత్తి చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టే నాటికి ప్రతి రూ. 100 అప్పుకు రూ. 101 విలువైన ఆస్తులు ఉండేవి. తర్వాత అప్పులు బాగా పెరగడంతో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరు బడ్జెట్ నాటకి (2004లో) ప్రతి రూ. 100 అప్పుకు రూ. 44 విలువైన ఆస్తులే ఉన్నాయి. వైఎస్ హయాంలో ఆస్తుల విలువ రూ. 139 పెరిగింది. 2004-14 మధ్య చూసినా.. ఆస్తులు - అప్పుల నిష్పత్తి 103:100గా ఉంది. చంద్రబాబు పాలనలో అప్పుల భారం పెరిగింది. చంద్రబాబు అధికారం చేపట్టిన 1995లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 20.5 శాతం ఉండగా.. జీఎస్డీపీలో వృద్ధి రేటు తగ్గడం, అప్పుల భారం పెరగడం వల్ల ఆయన దిగిపోయే సమయానికి 32.4 శాతానికి అప్పుల భారం పెరిగింది. వైఎస్ హయాంలో అది 28.5 శాతానికి తగ్గింది.ఆర్థిక స్వేచ్ఛ సూచీలో 2005లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉండగా, 2009లో వైఎస్ హయాంలో సూచీ మెరుగుపడి రాష్ట్రం 3వ స్థానానికి పెరిగింది. మానవాభివృద్ధి సూచీలో మన రాష్ట్రం గత పదేళ్లలో 15వ స్థానానికి పడిపోయిందని ఆర్థికమంత్రి యనమల చెప్పిన విషయంలో వాస్తవం లేదు. 1991, 2001లో 15 రాష్ట్రాలకే మానవాభివృద్ధి సూచీ తయారు చేయగా ఏపీకి 9, 10 స్థానాలు వచ్చాయి. తర్వాత 28 రాష్ట్రాలకు చేసినప్పుడు 1999లో 15 స్థానంలో నిలిచింది. 2007-08 లోనూ అదే స్థానాన్ని కొనసాగించింది. గత పదేళ్లలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటే.. గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వ శ్వేతపత్రాలు, బడ్జెట్ ప్రసంగం.. అన్నిట్లోనూ గత పదేళ్లలో రాష్ట్రం నాశనం అయిపోయినట్లు అసత్యాలు చెప్పారు. ఆ ‘విత్తనాలకు మొలకలు’ వచ్చింది వైఎస్ దక్షతతోనే... గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద జరిగిన చర్చకు చంద్రబాబు సమాధానం ఇస్తూ.. విత్తనం, మొలక సిద్ధాంతం చెప్పారు. తాను వేసిన అభివృద్ధి విత్తనాల వల్లే తర్వాత వైఎస్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. చంద్రబాబు 9 సంవత్సరాల్లో ఒక్క విత్తనమూ మొలక రాలేదు. కానీ వైఎస్ హయాంలో విత్తనాలన్నీ విపరీతంగా మొలకలు వచ్చాయి. ఎన్టీఆర్ వేసిన విత్తనాలు కూడా చంద్రబాబు హయాంలో మొలక రాలేదు. అవి కూడా వైఎస్ హయాంలోనే మొలకలు వచ్చాయి. పాలన ఒక దక్షత. యథా రాజా తథా ప్రజ అని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాస్తవానికి దూరంగా బడ్జెట్ గణాంకాలు బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలనూ మార్చకుండా కొత్త బడ్జెట్లో ‘కట్ అండ్ పేస్ట్’ చేశారు. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ అంచనాలను సవరించకపోతే.. పరిస్థితి మొత్తం అగమ్యగోచరంగా మారిపోతుంది. తప్పుడు గణాంకాల వల్ల అంచనాలు తప్పే ప్రమాదం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ‘గ్రాంట్స్ ఇన్ ఎయిడ్’ 2012-13 ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా రూ. 7,680 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ. 28,830 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. కేంద్రం నుంచి అన్ని నిధులు వస్తే మంచిదే. కానీ పరిస్థితిని సరిగా అంచనా వేయాలి {V>…s్స ఇన్ ఎయిడ్ కంటే ప్రణాళికా వ్యయం తక్కువగా ఉండటం గమనార్హం. సాధారణంగా మొత్తం వ్యయం (బడ్జెట్ పరిమాణం)లో ప్రణాళికా వ్యయం 34-35 శాతం ఉంటుంది. కానీ ప్రస్తుత బడ్జెట్లో 23 శాతమే ఉంది. పెట్టుబడుల వ్యయం (కేపిటల్ ఎక్స్పెండిచర్) శాతం కూడా గణనీయంగా తగ్గింది. ఫలితంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఘనంగా గణాంకాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. తప్పుదోవ పట్టించడానికి తప్ప తప్పుడు గణాంకాలు దేనికీ ఉపయోగపడవు. అందుకే.. ఇది తప్పుదోవ పట్టించే బడ్జెట్ అని చెప్తున్నా. పూర్తి అవగాహనతోనే హామీలు ఇచ్చామన్నారు... రాష్ట్ర ప్రభుత్వం వనరులు ఏమిటి? విభజన తర్వాత వచ్చే ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలు అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూన్‌లో జరిగిన 181 రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ. 1.25 లక్షల కోట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక అందరికీ అందుబాటులో ఉంది. విభజన బిల్లు మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. రాష్ట్రాల ఆవిర్భావ దినం జూన్ 2 అని మార్చి 14న కేంద్రం ప్రకటించింది. అదే నెల 31న టీడీపీ రెండు మేనిఫెస్టోలు విడుదల చేసింది. రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, ఇంటింటికీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ మేనిఫెస్టోల్లో చెప్పారు. వనరుల లభ్యత మీద పూర్తి అవగాహన ఉందని, ఆ మేరకు హామీలు ఇచ్చానని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో చంద్రబాబు చెప్పారు. హామీల గురించి చంద్రబాబు సంతకం చేసిన కరపత్రాలను ఇంటింటికి పంచారు. ఇప్పుడేమో వాటి అమలు సాధ్యం కాదని నెపాన్ని గత ప్రభుత్వాల మీద నెట్టాలని చూస్తున్నారు. ఫలితంగా కోట్లాది కుటుంబాల్లో నిరాశ నెలకొంది. అందుకే దీన్ని నిరాశను నింపే బడ్జెట్ అంటున్నాం. రైతు రుణ మాఫీకి ఎన్ని పరిమితులో..! వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లు, స్వయం సహాయక బృందాల రుణాలు రూ. 14,204 కోట్లని ఈ ఏడాది జూన్ 30న జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాంకర్లు నివేదించారు. రుణాలు రద్దవుతాయని రైతులు రుణాలు చెల్లించలేదని, ఫలితంగా ‘వడ్డీ లేని రుణం’ (సున్నా శాతం వడ్డీ) అర్హతను రైతులు కోల్పోయారని, రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి పంటల బీమా లేకుండా రైతులు సాగు మొదలు పెట్టారని బ్యాంకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సమాచారం కావాలని కోరితే రెండు మూడు రోజుల్లో సమగ్ర సమాచారం వస్తుంది. కానీ సమగ్ర సమాచారం లేదని కొంత కాలం జాప్యం చేశారు. ఎట్టకేలకు ఇచ్చిన మార్గదర్శకాల జీవో 174లో ఎన్నో పరిమితులు పెట్టారు. అన్ని రుణాలు, వడ్డీతో కలిపి కుటుంబానికి రూ. 1.5 లక్షలు మాత్రమే మాఫీ అని రాశారు. డ్వాక్రా రుణాల రద్దు హామీని మరిచి.. సరికొత్త పెట్టుబడి రూ. లక్ష అందిస్తామని కొత్త పాట ఎత్తుకున్నారు. ఈ ఏడాది మార్చి 31 వరకు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్వయంగా వెల్లడించారు. కానీ 2013 డిసెంబర్ ఆఖరు వరకు తీసుకున్న రుణాలకే రద్దు వర్తిస్తుందని తాజా జీవోలో పేర్కొన్నారు. మహిళలతో చేతులెత్తించి మరీ చెప్పారు... ఎన్నికలప్పుడు టీవీల్లో వచ్చిన ప్రకటన గుర్తు చేస్తా. తనఖాకు మంగళసూత్రం తీసుకెళుతున్న మహిళలకు.. ‘బాబు వస్తారు.. బంగారం విడిపిస్తారు’ అని ఆ ప్రకటనలో చెప్తారు. బహిరంగ సభల్లో.. ‘బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న మహిళలు చేతులెత్తండి’ అని చంద్రబాబు అడుగుతారు. పెద్ద సంఖ్యలో మహిళలు చేతులు ఎత్తుతారు. ‘బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తా’నని చంద్రబాబు గట్టిగా చెప్తారు. ఎన్నికల సభల్లో చాలా చోట్ల ఇదే చెప్పారు. ఇప్పుడేమో మాటమారుస్తున్నారు. డ్వాక్రా మహిళల పరిస్థితి ఘోరంగా ఉంది. వారి ఖాతాల్లో ఉన్న సొమ్మును బ్యాంకులు రుణాలకు జమ వేసుకుంటున్నాయి. బ్యాంకులు నోటీసులిస్తున్నాయి రైతులు రుణాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. నోటీసు అందిన 15 రోజుల్లోగా రుణాలు చెల్లించకపోతే.. తనఖాలో ఉన్న బంగారం వేలం వేస్తామంటున్నాయి. ‘నోటీసు అందిన 15 రోజుల్లో రుణం, వడ్డీ చెల్లించాలి. లేదంటే.. పత్రికా ప్రకటన ఇవ్వడానికి అయిన ఖర్చు, వేలం నిర్వహణకు అయ్యే ఖర్చునూ కలిపి వేలంలో వచ్చిన సొమ్మును మినహాయించుకుంటాం’ అని నోటీసులో ఉంది. ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు? బడ్జెట్లో పదో పీఆర్సీ ప్రస్తావన ఎక్కడా లేదు. ధరలు మండుతున్నాయి. సగటు ఉద్యోగి బతుకు భారమవుతోంది. గత ఏడాది (2013) జూలై నుంచే పదో పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నా.. సంవత్సరం తర్వాత కూడా కొత్త పీఆర్సీ ఎప్పుడు వస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త వేతనాలు అందుతాయని, కొత్త రాష్ట్రం తొలి బడ్జెట్లో పీఆర్సీ అమలుకు నిధులు కేటాయిస్తారని ఎదురు చూసిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అంది రెండు నెలలు దాటింది. ఇప్పటికీ నివేదికనే బయటపెట్టలేదు. వెంటనే నివేదిక బహిర్గతం చేసి.. ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలి. వీలయినంత త్వరగా పీఆర్సీని అమలు చేసి 4 లక్షల మంది ఉద్యోగులను, వారి కుటుంబాలను ఆదుకోవాలి. పెన్షనర్ల పరిస్థితి మరీ ఘోరం. జీవిత మలిసంధ్యలో ధరాభారాన్ని మోయలేక రాష్ట్రంలోని 3.58 లక్షల మంది పెన్షనర్లు సతమతమవుతున్నారు. కొత్త పీఆర్సీ అమలు చేస్తే వారికి.. మండుతున్న ధరల నుంచి కాస్తంత ఉపశమనం కలుగుతుంది. సామాజిక పెన్షన్లకు నిధులివ్వలేదు రాష్ట్రంలో 43 లక్షల మంది సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం నెలకు రూ. 130 కోట్లు పింఛన్ల కోసం అవసరం. పింఛను మొత్తాన్ని రూ. 200 నుంచి రూ. 1000 పెంచితే ప్రతి నెలా రూ. 450 కోట్లు కావాలి. పాత బకాయిలు, పెంచిన మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పింఛన్లు చెల్లించడానికి రూ. 3,730 కోట్లు అవసరం. కానీ రూ. 1,338 కోట్లే ఇచ్చారు. అరకొర నిధులతో పింఛన్లు ఎలా ఇస్తారు? ఉచిత విద్యుత్‌కు నిధులేవి? వ్యవసాయానికి 5 హెచ్‌పీ మోటార్ 7 గంటలు వాడితే 26.25 యూనిట్ల విద్యుత్ అవసరం. ఏడాదికి 300 రోజులు మోటారు నడుస్తుందని అంచనా వేస్తే.. 7,875 యూనిట్లు విద్యుత్ కావాలి. రాష్ట్రంలో 14.5 లక్షల మోటార్లున్నాయి. వీటికి 1,145 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం. యూనిట్‌కు కనీసం రూ. 4 సబ్సిడీ లెక్కగట్టినా.. రూ. 4,580 కోట్లు కావాలి. కానీ కేటాయించింది రూ. 3,188 కోట్లే. మరి ఉచిత విద్యుత్ కొనసాగిస్తారా? లేక మధ్యలో మాట తప్పుతారా? అనే అనుమానం ప్రజలకు ఉంది.’’ ఆఖరు దశలో ఉన్న ప్రాజెక్టుల మీదైనా దృష్టి పెట్టాలి... జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఇప్పటి వరకు 19.696 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని, మరో 3.036 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని 2013-14 సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద 52.05 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందకు తీసుకురావడం, 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా 54 ప్రాజెక్టుల (26 మేజర్, 18 మీడియం, 4 ఫ్లడ్ బ్యాంక్స్, 6 ప్రాజెక్టుల ఆధునీకరణ)ను చేపట్టారు. ఇప్పటివరకు 13 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 14 ప్రాజెక్టులు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. జలయజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 19.696 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి కల్పించారు. 3.036 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మినహాయిస్తే.. మరో 39 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 17,368 కోట్లు అవసరమని సాగునీటి శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. చాలా ప్రాజెక్టుల పనులు 70 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయడం మీద దృష్టి పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది. రూ. 4,500 కోట్ల ఖర్చుతో ఆఖరు దశలో ఉన్న 9 ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చు. ఫలితంగా 15 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. కానీ ప్రభుత్వం రూ. 310 కోట్లే బడ్జెట్లో కేటాయించింది. ఏఐబీపీ ప్రాజెక్టుల మీద దృష్టి పెడితే మూడింట రెండొంతుల సాయం కేంద్రం నుంచి అందుతుంది. ఫలితంగా తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. శ్వేతపత్రాలన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే... శ్వేతపత్రాల్లో అసత్యాలు, అర్ధసత్యాలతో నింపేశారు. వైఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, మునిసిపల్ పన్నులు, నీటి తీరువా, వ్యాట్ పెంచలేదు. ప్రజల మీద అదనంగా ఒక్క పైసా కూడా భారం వేయలేదు. కానీ ఈ విషయాన్ని ఏ శ్వేతపత్రంలోనూ ప్రభుత్వం కనీస ప్రస్తావన కూడా చేయలేదు.1999-2004 మధ్య విద్యుత్ చార్జీలు కేవలం 30 శాతమే పెంచారని విద్యుత్‌పై విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 1994-1999 వరకు మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయారు.విద్యుత్ లోటు గురించీ అలాగే చెప్పారు. విద్యుత్ సరఫరా రంగంలో చంద్రబాబు హయాంలో సరాసరి వార్షిక వృద్ధి రేటు 4.05 శాతం కాగా, వైఎస్ హయాంలో 11.41 శాతం. 2004-14 మధ్య చూసినా.. సరాసరి వార్షిక వృద్ధి రేటు 9.09 శాతం ఉంది. చంద్రబాబు తన 9 సంవత్సరాల పాలనలో ఒక్కో హార్స్‌పవర్‌కు రూ. 625 చొప్పున రైతులకు 800 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేశారు. కానీ వైఎస్ తన హయాంలో 1,500 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను రైతులకు ఉచితంగా ఇచ్చారనే మాటనూ ఎక్కడా రాయలేదు.ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) వైఎస్ హయాంలో తక్కువగా ఉందని శ్వేతపత్రంలో నిస్సిగ్గుగా రాశారు. 2003-04లో 86 శాతం ఉండగా, 2009-10లో 86.6 శాతం నమోదయిందని పవర్ డెవలెప్మెంట్ స్టాటిస్టిక్స్ అధికారిక పత్రంలో పేర్కొంది.వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసినవన్నీ తప్పులని, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం చేసినవన్నీ గొప్పలని శ్వేతపత్రాల్లో రాసుకోవడం విడ్డూరంగా ఉంది. ఐఎంజీకి, గంగవరం, కృష్ణపట్నం పోర్టులు, జీఎంఆర్ విమానాశ్రయానికీ భూములివ్వడం కూడా తప్పుకాదనే విధంగా ప్రభుత్వ తీరు ఉంది. బాబు గత చరిత్ర చూసి జనం భయపడుతున్నారు... ఎన్నికలప్పుడు హామీలు గుప్పించడం, తర్వాత మాట తప్పడం చంద్రబాబుకు అలవాటే. 1994 ఎన్నికల్లో ఇచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం హామీ, సంపూర్ణ మద్య నిషేధం హామీ, రూ. 50కే ఒక హార్స్పవర్ వ్యవసాయ విద్యుత్ హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. రూ. 2 కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం పథకాలు భారమయ్యాయంటూ పెద్ద ఎత్తున పన్నులు, చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ చార్జీలూ పెంచారు. బాధతో ఈ నిర్ణయం తీసుకున్నామని, సహకరించాలని చంద్రబాబు ప్రజలకు లేఖ రాశారు. తర్వాత రెండు హామీలను.. సబ్సిడీ బియ్యం, మద్య నిషేధం తొలగించారు. కానీ పెంచిన పన్నులు తగ్గించలేదు. 1999 ఎన్నికల్లో ఇచ్చిన.. 35 లక్షల ఇళ్ల నిర్మాణం, కోటి మందికి ఉద్యోగాలు, 25 లక్షల ఎకరాలకు సాగునీరు తదితర హామీలను తుంగలో తొక్కారు. 25 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని.. 5 లక్షల ఎకరాలకూ ఇవ్వలేకపోయారు. కోటి ఉద్యోగాలిస్తామని.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. ఇళ్ల నిర్మాణం నామమాత్రమే. ఇప్పుడు కూడా గతంలో మాదిరే చేస్తున్నారు. గత ప్రభుత్వాల మీద నెపం నెట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రుణ మాఫీ కంటే రీషెడ్యూలే మేలంటూ టీడీపీ అధికార గజిట్ ‘ఈనాడు’ పత్రికలో కథనాలు వండివారిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. గతంలో మాదిరే మాట తప్పుతారని, చంద్రబాబు మళ్లీ ప్రజలకు లేఖ రాస్తారేమోనని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ యువత భయాందోళనల్లో ఉన్నారు. అందుకే అసెంబ్లీలో గట్టిగా అడుగుతున్నాం. రుణ మాఫీ, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం ఏం చెప్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. శాసనసభ సాగుతున్న తీరును గమనిస్తున్నారు. -
ఉత్తుత్తి ఉత్తర్వులు!
ఇదో ‘ఉత్త’ హామీ..! రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు ఎక్కడికక్కడ నిలదీస్తోండడంతో ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేమని తేల్చిచెప్పింది.. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున మూలధనంగా అందిస్తామంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వంతున పంట రుణం మాఫీ చేస్తామని చెప్పింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం: 174)ను జారీచేసింది. కానీ.. ఎప్పటిలోగా అమలుచేస్తామన్నది మాత్రం ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. దీంతో వీటిని ఉత్తుత్తి ఉత్తర్వులని బ్యాంకర్లు కొట్టిపారేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలోని రైతులు అన్ని రకాల పంటరుణాలు కలిపి బ్యాంకర్లకు రూ.11,180.25 కోట్లు బకాయిపడ్డారు. అలాగే జిల్లాలోని 55,602 స్వయం సహాయక సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా పంట రుణాలు, డ్వాక్రా రుణాల రూపంలో ఒక్క మన జిల్లాలోనే రూ.12,791.28 కోట్లను మాఫీ చేయాలి. కానీ.. ఇందుకు చంద్రబాబు షరతులు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల వంతున రుణ మాఫీ చేస్తానని జూన్ 10న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం: 31) జారీచేశారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయలేమని తేల్చిచెబుతూ ఈ నెల 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం: 164) జారీచేశారు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున మూలధనంగా ఇస్తామని అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గురువారం తాజాగా ఆ రెండు ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలనే పునరుద్ఘాటిస్తూ సరి కొత్త ఉత్తర్వులు జారీచేశారు. పనిలో పనిగా రుణ మాఫీకి విధి విధానాలను జారీచేశారు. కానీ.. మాఫీని ఎప్పటిలోగా చేస్తామన్నది.. డ్వాక్రా సంఘాలకు ఎప్పటిలోగా మూలధనం అందిస్తామన్నది మాత్రం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. 31 అంశాల ఆధారంగా జాబితా.. పంట రుణాల మాఫీ లబ్ధిదారులను గుర్తించడానికి 31 అంశాల ఆధారంగా ప్రొఫార్మా రూపొందించారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్నెంబర్లను కూడా ఆ ప్రొఫార్మాలో చేర్చారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్ నెంబర్లలో ఏ ఒక్కటి లేకున్నా రుణమాఫీ కింద లబ్ధిదారులుగా ఎంపిక చేయరన్న మాట. డిసెంబర్ 31, 2013 వరకూ తీసుకున్న పంట రుణాలు.. మార్చి 31, 2014 నాటికి పేరుకుపోయిన బకాయిలకు రుణమాఫీని వర్తింప జేస్తామని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు(అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు మినహా), గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టీకరించింది. కలెక్టర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కలిసి పంట రుణాల మాఫీకి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. ప్రభుత్వం రుణమాఫీకి నోటిఫికేషన్ జారీచేసిన 14 రోజుల్లోగా బకాయిదారుల జాబితాను రూపొందించాలని నిర్దేశించింది. ప్రతి రైతు పట్టాదారు పాసుపుస్తకంలోనూ ఆ రైతు తీసుకున్న పంట రుణం.. మాఫీ చేసే మొత్తాన్ని విధిగా నమోదు చేయాలని సూచించింది. బకాయిదారుల జాబితా తయారుచేసిన వారం రోజుల్లోగా రైతులకు రుణ మాఫీ చేసే మొత్తాన్ని ఆయా రైతుల సర్వే నెంబర్ల వారీగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత 31 అంశాల ఆధారంగా రూపొందించిన ప్రొఫార్మాలో నమోదు చేయాలంది. భర్త, భార్య, ఆధారపడిన పిల్లలను ఒక కుటుంబంగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలకు మించకుండా రుణా మాఫీ వర్తింపజేస్తామని స్పష్టీకరించింది. కానీ.. రుణమాఫీకి నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేస్తామన్న అంశంపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దాంతో.. వీటిని ఉత్తుత్తిఉత్తర్వులుగా బ్యాంకర్లు కొట్టిపారేస్తున్నారు. మహిళల ఆగ్రహం.. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా ఒక్కో సంఘానికి రూ.లక్షకు మించకుండా మూలధనం ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఓట్లేయించుకుని.. ఇప్పుడు నట్టేట ముంచారని మండిపడుతున్నారు. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు(టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) పథకం కింద ఒక్కో మహిళా సంఘానికి గరిష్టంగా రూ.ఐదు లక్షల వరకూ రుణాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఒక్కో సంఘానికి రూ.5 లక్షల చొప్పున 60 శాతం మహిళా సంఘాలు.. రూ.4 లక్షల వంతున పది శాతం సంఘాలు.. రూ.3 లక్షల చొప్పున 12 శాతం సంఘాలు.. రూ.2 లక్షల చొప్పున ఎనిమిది శాతం సంఘాలు, రూ.లక్ష చొప్పున ఐదు శాతం సంఘాలు.. రూ.50 వేల చొప్పున ఐదు శాతం సంఘాలు రుణాలు తీసుకున్నాయి. అంటే.. రూ.లక్ష వంతున మూలధనం అందించడం వల్ల కేవలం పది శాతం సంఘాల్లోని మహిళలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. తక్కిన 90 శాతం సంఘాల్లోని మహిళలకు మూలధనం అందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. పోనీ.. ఆ మూలధనం కూడా ఎప్పటిలోగా అందిస్తామన్నది ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. కేవలం రైతులు, మహిళల ఆగ్రహాన్ని, నిరసనల నుంచి తప్పించుకోవడానికి జీవో 174ను గురువారం జారీచేసిందని.. ఈ ఉత్తర్వుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని జాతీయ బ్యాంకుకు చెందిన కీలకాధికారి ‘సాక్షి’తో స్పష్టీకరించడం గమనార్హం. -
నీలమేఘశ్యాముని నాల్గు నగరాలు
శ్రీకృష్ణుని లీలలు ఎన్ని చెప్పిన తరగవు. కన్నయ్య నడయాడిన ప్రదేశాల గురించి ఎంత చెప్పినా తరగదు. గోపబాలుడుగా జన్మించిన మధుర... గానామృతాలు పంచిన బృందావనం... రాజసంగా కొలువుదీరిన ద్వారక...సర్వవ్యాప్తుడైన ఆయన సంచరించిన ప్రదేశాలెన్నో! కృష్ణాష్టమి సందర్భంగా ఆ మురారికి ప్రీతిపాత్రమైనపట్టణాల గురించి, ఆలయవైభవాలగురించి తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లితీరాల్సిందే! ద్వారక, మధుర ఉత్తరభారతదేశంలో ఉన్నాయి. గురువాయూర్, ఉడిపి దక్షిణభారతదేశంలో ఉన్నాయి. ద్వారకాధీశుడు శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో సముద్రమట్టానికి సమానంగా ఉంటుంది. ద్వార్ అంటే సంస్కృతంలో వాకిలి, ద్వారం వంటి అర్థాలు ఉన్నాయి. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్లలో ద్వారకాపురి ఒకటి. జరాసంధుని బారి నుండి తప్పించుకునేందుకు కృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ద్వారకాధీశుని మందిరం అతి పురాతమైంది. శ్రీకృష్ణుని మునిమనమడు వజ్రనాభుడు క్రీస్తు పూర్వం 2వేల సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని నిర్మించినట్టు పురాణాలలో ప్రస్థావన ఉంది. ఆ తర్వాత క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 5 అంతస్తులతో, 72 స్తంభాలతో అలరారుతుంటుంది. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు, రుసుములు లేవు. ఎక్కువ మెట్లు లేవు. అందువల్ల వయోవృద్ధులు కూడా దర్శనం చేసుకోవచ్చు. పక్కనే గోమతి నది పరవళ్లు తొక్కుతుంటుంది. గోమతి నది సముద్రంలో కలసే చోటే ద్వారక ఉంది. ఈ ఆలయం నుంచే ఆ సంగమ ప్రదేశాన్ని చూడవచ్చు. బేట్ ద్వారక: శ్రీకృష్ణుడు తన రాణులను కలిసిన చోటు గా ఈ ప్రాంతానికి పేరుంది. ఇది రేవు పట్టణం. శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లిన తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెబుతుంటారు. ద్వారక నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేదారిలో రుక్మిణీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి. ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, జాంబవతి, సత్యభామ ఆలయాలు కూడా ఉన్నాయి. చూడలవసినవి: గాయత్రి మందిరం, గీతా మందిరం. 20 కి.మీ దూరంలో గల నాగనాథ్ (జ్యోతిర్లింగం), ద్వారక నుండి 250 కి.మీ. దూరంలో గల సోమనాథ దేవాలయం (జ్యోతిర్లింగం), అక్కడి నుంచి 10 కి.మీ దూరంలో శ్రీకృష్ణుని నిర్యాణ స్థలం. రైలు మార్గం: హైదరాబాద్ నుంచి రామేశ్వరం-ఓఖా ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. ప్రయాణ సమయం 36 గంటలు. ద్వారకలో భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయి. ఉడిపి చిన్నికన్నయ్య కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు 58 కి.మీ దూరంలో ఉంది ఉడిపి. ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయంగా దీనికి పేరుంది. స్వామి దర్శనం నవరంధ్రా లున్న కిటికీగుండా చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలోని కృష్ణుని విగ్రహం చిన్ని బాలుడి రూపంలో ఉంటుంది. 12వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ జరిపి, ఎనిమిదిమంది బ్రహ్మచారి శిష్యులతో పూజలు జరిపించారట. ఇక్కడి తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపమొకటి ఉంది. ఇందులోనే శ్రీ మధ్వాచార్యుల దివ్యప్రతిమ ఉంది. ఉత్సవాలు, పండగలపుడు ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి త్రిశూర్ 150 కి.మీ. ఉంటుంది. ఉడిపిలో కృష్ణమందిరం దర్శంచుకొని త్రిశూర్‌కు రైలులో చేరుకోవచ్చు. అక్కడ నుంచి గురువాయూర్ చేరుకోవాలి. రోడ్డు మార్గం: ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మంగళూరుకు నేరుగా వెళ్లి, అక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. ఉడిపిలో అన్ని వసతులు ఉన్నాయి. దక్షణాది నవభోజనాలు ఆలయానికి దగ్గరలోనే లభిస్తాయి. గురువాయూర్ బాలగోపాలుడు కేరళ రాష్ట్రంలో త్రిశూర్ పట్టణానికి 30 కి.మీ. దూరంలో గురువాయూర్ ఉంది. కేరళ సంప్రదాయ పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పాతాళ జలశిలతో కృష్ణుని విగ్రహం మలచినట్టుగా, శంకరాచార్యులవారు దీన్ని ప్రతిష్ఠాపన చేసినట్టుగా చెబుతారు. నాలుగు చేతులలో పాంచజన్యం, శంఖం, చక్రం, కౌమోదకం పద్మాలను ధరించి ముగ్ధమనోహర రూపంలో అలరించే బాలగోపాలుడు గురువాయూర్. అతి ప్రాచీనమైన ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు దర్శనార్ధం చేరుకుంటుంటారు. అయ్యప్పకు వెళ్లే భక్తజనావళి గురువాయూర్ను దర్శించుకొని వెళతారు. ఇక్కడ స్వామిని ఉన్నికృష్ణన్, కన్నన్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు తన అవతార పరిసమాప్తి కాలంలో సహచరుడైన ఉద్దీపునికి కృష్ణవిగ్రహం ఇచ్చాడట. లోక కళ్యాణార్థం జలప్రళయ అనంతరం విగ్రహాన్ని వాయువు కాపాడి దేవగురువు బృహస్పతికి ఇచ్చాడట. గురువు వాయువుతో కలిసి ఈ విగ్రహం ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్ అని పేరొచ్చిందని పెద్దలు చెబుతుంటారు. రైలుమార్గం: హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో త్రిశూర్ చేరుకొని, అక్కడ నుంచి బస్సుమార్గం ద్వారా గురువాయూర్ చేరుకోవచ్చు. మధుర హృదయవల్లభుడు మానవ హృదయంతో మధురను పోల్చుతారు. ప్రేమకు, భక్తి భావనకు, ఆనందాతిశయాలకు నెలవుగా ఈ ప్రాంతాన్ని కొనియాడుతారు. ఆగ్రా నుండి ఢిల్లీ వెళ్లే తోవలో 50 కి.మీ. దూరంలో ఉంది మధుర. యమునానదికి ఆనుకొని ఉంటుంది. ఢిల్లీ సందర్శనకు వెళ్లినప్పుడు మధుర చూసి రావచ్చు. కృష్ణుని జన్మస్థానమైన ఈ నగరం అతి ప్రాచీనమైనది. ఇక్కడ కృష్ణుని ఆలయాన్ని నాలుగు పర్యాయాలు నిర్మించినట్టు కథనాలు ఉన్నాయి. 1965లో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయభాగమే శ్రీకృష్ణుని జన్మస్థానం. చూడలవసినవి: కృష్ణమందిరం, దేవకీ వసుదేవుల జైలు, కంసరాఖిల్లా, బలిదేవ్, కంసవిఖండన మందిరాలు ఉన్నాయి. ఇంకా గోకులం, మహావనం, బృందావనం చూడదగినవి. ఇక్కడ కృష్ణాష్టమి, దీపావళి, ఆషాఢపౌర్ణమి, శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాలలో ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. మధురలో అన్ని ప్రాంతాలను దర్శించాలనుకునేవారు గైడ్ సాయం తీసుకోవడం మంచిది. - ఎస్.వి. సత్యభగవానులు, విశ్రాంత డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒంగోలు -
సెల్ఫోన్లు ఉన్నాయి -మరుగుదొడ్లు లేవు!
విశాఖపట్నం: డ్వాక్రా మహిళల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయిగానీ, వారి ఇళ్లలో మరుగు దొడ్లు మాత్రం లేవని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. జిల్లాలోని నక్కపల్లిలో జరిగిన డ్వాక్రా మహిళల సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్లు ఉన్నవారు చేతులు ఎత్తాలని అడిగారు. చాలా మంది చేతులు ఎత్తారు. కొద్ది మంది మాత్రం చేతులు ఎత్తలేదు. దాంతో సెల్ఫోన్లు లేని డ్వాక్రా మహిళలకు త్వరలో సెల్ఫోన్లు ఇస్తామని చెప్పారు. ఆ తరువాత తమ ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నవారు చేతులెత్తాలని అడిగారు. చాలా తక్కువ మంది మాత్రమే చేతులు ఎత్తారు. దాంతో సెల్ఫోన్లు ఉన్నాయి గానీ, మరుగుదొడ్లు మాత్రం లేవన్నారు. వచ్చే అయిదేళ్లలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టిస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర ఉండాలన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే అభివృద్ధి సాధ్యం అని చెప్పారు. మహిళా శక్తి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. అభివృద్ధిలో కేసిఆర్‌తో పోటీపడటానికి సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. గతంలో చాలా మంది తనతో పోటీపడటానికి ప్రయత్నించారని చెప్పారు. అయితే ఎవరూ పోటీపడలేకపోయారన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, దాంతో ఆదాయం పెరిగిందని చెప్పారు. అభివృద్ధిలో పోటీపడటం మంచిదేనన్నారు. -
డ్వాక్రా మహిళలకూ టోపీ!
రూ.లక్షలోపు అప్పు తీసుకున్న సంఘాలకే రుణ మాఫీ వర్తింపు తిరుపతి: రైతులకు రుణమాఫీ విషయంలో టోపీపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా డ్వాక్రా మహిళలకూ టోపీ పెడుతున్నారు. డ్వాక్రా రుణ మాఫీ భారాన్ని గణనీయంగా తగ్గించుకునేం దుకు ఎత్తులు వేస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న మహిళా సంఘాలకు మాత్రమే రుణ మాఫీ వర్తింపజేసి.. తక్కిన సంఘాలకు ప్రోత్సాహంగా రూ.లక్ష మూలధన పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయిం చారు. మూలధన పెట్టుబడికి సంబంధించి శనివారం జీవో (ఎంఎస్ నం: 164) జారీ అరుున విషయం తెలిసిందే. ఇక లక్షలోపు రుణాలకు మాత్రమే మాఫీ పరిమితం చేయడం ద్వారా డ్వాక్రా రుణ మాఫీ భారం మొత్తాన్ని రూ.3,500 కోట్లకే పరిమితం చేయూలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. వ్యవసాయ, డ్వాక్రా సంఘాల రుణమాఫీపై ఏర్పాటైన కోటయ్య కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సీఎం ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష వంతున రాష్ట్రంలోని 7.6 లక్షల సంఘాలకు రూ.7,600 కోట్ల రుణాలను మాఫీ చేస్తానన్నారు. తాజాగా ఆ భారాన్ని కూడా తగ్గించుకోవడానికి యత్నిస్తున్నారు. రాష్ట్రం లోని 7.6 లక్షల సంఘాలకు చెందిన 89 లక్షల మంది మహిళలు రూ.14,204 కోట్లు బకాయి పడ్డారు. -
కుటుంబానికి లక్షన్నరే రుణ మాఫీ
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు స్పష్టీకరణ ఒకే కుటుంబానికి వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న రుణాల అనుసంధానం.. తర్వాతే రుణ మాఫీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఒక కుటుంబానికి లక్షన్నర రూపాయలు మాత్రమే రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టంచేశారు. శనివారం తన క్యాంప్ కార్యాలయం లేక్‌వ్యూ అతిథి గృహం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఎంత రుణం ఉన్నా లక్షన్నర వరకే రద్దవుతుందని చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి రెండు, మూడు బ్యాంకుల్లో వేర్వేరు పేర్లతో రుణాలుంటే వాటన్నిం టినీ అనుసంధానం చేస్తామన్నారు. ఆ తరువాతే రుణ మాఫీ అమలు చేస్తామని తెలిపారు. జిల్లాల్లోని బ్యాంకర్లకు, రైతులకు రుణ మాఫీ గురించి వివరించాలని కలెక్టర్లకు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు రాష్ట్రం లోని అన్ని స్థాయిల అధికారులు పట్టుదలతో పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విభజన అనంతరం రాష్ట్రం రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉందని తెలిపారు. ఈ లోటును పూడ్చేందుకు కేంద్రం సాయం చేస్తుందని వివరించారు. ప్రతి మంగళ, బుధవారాల్లో కలెక్టర్, ఇతర అధికారులు రోజుకు రెండు గ్రామాలను సందర్శించి ప్రజలకు ఆధునిక సేద్యపు పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు. వైద్య శాఖ అధికారులపై అసంతృప్తి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం పరిస్థితి దేశంలోనే దారుణంగా ఉందని చెప్పారు. అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయటంలేదని అన్నారు. ఆరు జిల్లాల్లో మలేరియా వ్యాపించిందని, నాలుగు జిల్లాల్లో డెంగ్యూ, గుంటూరులో చికెన్‌గున్యా వ్యాధులు విజృంభిస్తున్నాయని, వీటి నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాల్లో డ్వాక్రా సంఘాల సేవలు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన ఇసుక విధానం వెంటనే అమల్లోకి వస్తుందని సీఎం చెప్పారు. ఇసుక తవ్వకం, అమ్మకాలను ఏపీఎండీసీ నిర్వహిస్తుందని, ఇందులో డ్వాక్రా సంఘాల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. వీరి సేవలకు కొంత నగదు చెల్లిస్తామని, ఆదాయంలో 25 శాతం కూడా డ్వాక్రా సంఘాలకు ఇస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు ప్రవేశపెడతామన్నారు. -
అబద్ధాల బాబును నిలదీయండి : జగన్
-
అబద్ధాల బాబును నిలదీయండి
ప్రజలకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు బాబు మాటలు నమ్మి రుణాలు కట్టని రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రూ. లక్ష రుణానికి 13 వేలు వడ్డీ.. డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల నుంచి బ్యాంకులు సొమ్మును తీసుకుంటున్నాయి బాబుపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా అని ప్రజలడుగుతున్నారు గుంటూరు: పూటకో అబద్ధంతో రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిలదీయాలని ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై కర్తవ్యబోధ చేశారు. పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ► ఇటీవలి ఎన్నికల్లో సంస్థాగతంగా మనం తప్పులు చేసి ఉంటే అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీకి కోటీ ముప్పై లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదించారు. చంద్రబాబునాయుడు కూటమికి సుమారు కోటీ ముప్పై ఐదు లక్షల మంది ఓట్లు వేశారు. ఇద్దరి మధ్య తేడా 5.6 లక్షలు మాత్రమే. అది పెద్ద తేడా కాదు. నాకు పార్లమెంటు ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ 5.5 లక్షలు. ఆ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను పెంచింది. 14వ లోక్‌సభలో అగ్రగామిగా నిలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2.8 లక్షల ఓట్లు అటు వైపు నుంచి ఇటు వైపు వచ్చి ఉంటే మనం అధికార పక్షంలో ఉండేవాళ్లం. చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఉండేవారు. ఆ తేడా ఎందుకు వచ్చిందో మనం విశ్లేషించుకోవాలి. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్రమోడీ గాలి పట్టణాల్లో పనిచేయడం. రెండో కారణం చంద్రబాబు అబద్ధాలు. ► చంద్రబాబు 87 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రజలను నమ్మించాడు. అది సాధ్యం కాదని తెలిసి మనం కూడా హామీలు ఇచ్చినా, ఆయన ఆడిన అబద్ధాలు మనం ఆడినా మూడు లక్షలు, అంతకన్నా ఎక్కువ ఓట్లు మనకు వచ్చేవి. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఉండేవాడిని. రెండు, మూడు నెలలు తిరగకుండానే రాష్ట్రంలో ప్రతి రైతూ మనల్ని తిట్టుకునేవారు. మీరు కూడా వచ్చి నన్ను ప్రశ్నించేవారు. ఎందుకన్నా మోసం చేశావు అని నిలదీసేవారు. ► ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకని అబద్ధాలు ఆడి, మోసాలు చేసి గడ్డి తిని ఉంటే .. ప్రజలకు న్యాయం చేయగలమా? నాకూ గొప్ప ముఖ్యమంత్రిని కావాలనే కోరిక ఉంది. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్లు నిజాయితీతో కూడిన పాలన ఇవ్వాలని ఉంది. 30 ఏళ్లు ఎంత మంచి చేయాలంటే ఆ మంచిని చూసి ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండాలనే తాపత్రయం ఉంది. ఆ తాపత్రయమే నన్ను ఈరోజు రాజకీయాల్లో నడిపిస్తోంది. అలాంటప్పుడు అబద్ధాలు చెప్పి, మోసం చేసి ఏదో ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ తరువాత ఐదేళ్లకే ఇంటికి పంపించేస్తారు. ఆ తరువాతి ఎన్నికల్లోనూ ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. అబద్ధాలు చెప్పేవారి ఫొటోలను ఎవ్వరూ ఇళ్లల్లో పెట్టుకోరు. అందుకే చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పలేదు. నిజాయితీగా రాజకీయాలు చేశా. ► చంద్రబాటు మాటలు నమ్మి రైతులు జూన్ 30వ తేదీలోపు రుణాలు కట్టలేదు. ఇప్పుడు 13 శాతం వడ్డీతో రుణం కట్టాలని రైతులకు బ్యాంకులు చెబుతున్నాయి. అంటే బాబు మాటలు నమ్మి రైతు ఒక లక్షకు రూ. 13 వేలు వడ్డీ కట్టాల్సివస్తోంది. ఓ పక్క కరువు ఛాయలున్నా, పంటలు వేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అయినా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడంలేదు. పాత రుణాలు కడితేగాని కొత్తవి ఇచ్చే పరిస్థితి లేదు. బకాయిలు కడితేగాని పంటల బీమా కూడా రాదు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ► డ్వాక్రా అక్కా చెల్లెళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వారి పొదుపు ఖాతాల నుంచి వారికి చెప్పకుండానే సొమ్మును బ్యాంకులు తీసుకుంటున్నాయి. లక్ష రూపాయలకు రూ. 13 వేలు వడ్డీని బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. వీటిపై బాబును అసెంబ్లీలో నిలదీశాను. ► ఇంటికో ఉద్యోగం, ‘బాబు వస్తాడు - జాబు తేస్తాడని’ ప్రకటనలిచ్చారు. ఈ రోజు బాబు వచ్చాడు.. ఉన్న జాబులు పోతున్నాయనే పరిస్థితి. 24 వేల మంది ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. కోటీ యాభై లక్షల కుటుంబాలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాయి. నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో యూ టర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదని అసెంబ్లీలో పట్ట పగలే మాట మార్చారు. ప్రైవేటు ఉద్యోగాలు అయితే ఎవరైనా ఇస్తారు. దానికి బాబు ఎందుకు? నిరుద్యోగ భృతి గురించి బాబు అసలు మాట్లాడటమే లేదు. ► కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తానన్నారు. ప్రైవేటు స్కూళ్లలో యజమాన్యాలు రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలు ఫీజు కట్టాలని అడుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజు కట్టాల్సిన పనిలేదు. ప్రైవేటు పాఠశాలల ఫీజు కడతారన్న భరోసాతోనే ప్రజలు బాబుకు ఓట్లు వేశారు. ఇప్పుడు చంద్రబాబును ప్రశ్నిస్తే నోట్లో నుంచి మాట రావటంలేదు. ► బాబు ప్రతి విషయంలోనూ ఇలాంటి అబద్ధాలే చెబుతున్నారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి వంద అబద్ధాలు. రోజుకో అబద్ధం, పూటకో అబద్ధం. అందుకే చంద్రబాబును ప్రజలు రాళ్లతో తరిమి కొడతారు. ► ఇసుక క్వారీలను సెక్యూరిటైజ్ చేసి రుణాలు తెస్తున్నానంటున్నాడు. ఇసుక తవ్వకాలపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో బ్యాన్ ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు థాయిలాండ్ నుంచి ఇసుకను తెచ్చుకుంటున్నాయి. ► ఎర్రచందనం అమ్మి రుణ మాఫీ చేస్తామంటున్నారు. ఓ మంత్రేమో 8 వేల టన్నుల ఎర్రచందనం వేలం వేస్తే టన్నుకు రూ. 10 లక్షలు చొప్పున రూ. 800 కోట్లు వస్తుందన్నారు. కానీ, చంద్రబాబు 15 వేల టన్నులు అంటున్నారు. పోనీ 15వేల టన్నులే అనుకుందాం. దాన్ని వేలం వేస్తే టన్నుకు రూ. 10 లక్షలు చొప్పున రూ. 1,500 కోట్లు వస్తుంది. ఈ 1,500 కోట్ల రూపాయలతో 1.02 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని బాబు అబద్ధాలు ఆడుతున్నారు. అంతటితో ఆగకుండా.. అడవిలో కోయని ఎర్రచందనం చెట్లను బ్యాంకుల్లో తాకట్టు పెడతానని ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ► ఇన్ని అబద్ధాలతో చంద్రబాబు ప్రజలను నమ్మించాడంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఒక్కటవడమే కారణం. ఎన్నికల ముందు రోజుకో కట్టుకథ, పూటకో అభాండం.. నిజంగా వీళ్లు మనుషులేనా అనిపించేలా చంద్రబాబు దారుణాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ►మనకున్నది, చంద్రబాబుకు లేనిది దేవుడి దయ, ప్రజల గుండెల్లో స్థానం. రాబోయే రోజుల్లో ప్రజలను, దేవుడిని నమ్ముకుని వాళ్లు చేస్తున్న మోసాలను, వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ప్రజలతో కలిసి చంద్రబాబును ప్రశ్నించాలి. ► ఈమధ్య కాలంలో చాలా మంది నా దగ్గరకు వచ్చారు. ‘అన్నా ఎవరైనా పిక్‌పాకెట్ చేస్తే పోలీసులు 420 కేసు పెడతారు. ఎవరైనా చిట్‌ఫండ్ మోసం, లేకపోతే డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేస్తే వెంటనే 420 కేసు పెడతారన్న. దేశంలో ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే అతనిపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా’ అని అడుగుతున్నారు. ► చంద్రబాబు రాబోయే రోజుల్లో ప్రజల వేడిని, ఆక్రోశాన్ని చవిచూసే పరిస్థితి ఉంది. మళ్లీ జరగబోయే ధర్మపోరాటంలో మనం ప్రజల్లోకి వెళ్లి చెప్పబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇందుకోసం పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలి’ అని జగన్ కార్యకర్తల్ని కోరారు. సమీక్ష సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. -
డ్వాక్రా సంఘాలకు ఇసుక మైనింగ్!
ఆలోచిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇసుక మైనింగ్‌పై సీఎం సమీక్ష హైదరాబాద్: ఇసుక మైనింగ్‌ను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. నూతన ఇసుక తవ్వకం విధానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఇసుక తవ్వకాలను డ్వాక్రా సంఘాలకు అప్పగించే అంశంపై చర్చ జరిగింది. ఇసుక మైనింగ్‌ను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తే మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరుగుతాయనే భావనతో ప్రభుత్వం ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయం పెరిగేలా ఇసుక కొత్త విధానంలో మార్పులు చేయాలని సూచించారు. రాష్ర్టంలో ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కొత్త రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ఆదాయానికి గండిపడకుండా చూడాలని చెప్పారు. ఇసుక క్వారీయింగ్‌కు తమిళనాడు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలన్నారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని, సీసీ టీవీలతో మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని సూచించారు. ఇసుక కేటాయింపులో వినియోగదారులకు తొలి ప్రాధాన్యతనివ్వాలని, ప్రభుత్వ ప్రాజెక్టులు, పనులకు తరువాతి ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పనులకు 200 లక్షల టన్నుల ఇసుక అవసరం అవుతుందని, ప్రైవేటు అవసరాలకు 175 లక్షల టన్నుల ఇసుక కావాల్సి ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. సమావేశంలో గనులశాఖ మంత్రి పి.సుజాత, ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, పరిశ్రమలశాఖ సీనియర్ అధికారి జేఎస్వీ ప్రసాద్ , గనులశాఖ సంచాలకుడు సుశీల్‌కుమార్ పాల్గొన్నారు. -
అధికారం దక్కాక బీద అరుపులా?: రఘువీరా
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టక ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీద అరుపులు అరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో ధ్వజమెత్తారు. రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని అధికారం చేజిక్కించుకున్న బాబు మాట మార్చుతున్నారని విమర్శించారు. సచివాలయంలో బల్లలు లేవు.. కుర్చీలు లేవనే కుంటి సాకులతో ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం ఎవరిని మోసగించడానికి? అని మండిపడ్డారు. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ స్కూళ్లలో వసతులు లేవని, అంతమాత్రాన ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుంటే చంద్రబాబు ఊరుకుంటారా? అని నిలదీశారు. సచివాలయంలో సీఎం కార్యాలయానికి రూ.కోట్లు ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సిద్ధం కాకముందే పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేయటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. -
ఆగ్రహించిన అన్నదాత
ఏపీ సర్కారు తీరుపై మండిపడ్డ రైతులు, డ్వాక్రా మహిళలు సాక్షి యంత్రాంగం: ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. అప్పులన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పి, ముఖ్యమంత్రి కాగానే మాట మార్చిన చంద్రబాబు నాయుడు వైఖరిపై నిప్పులు చెరిగారు. ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నా రుణమాఫీ చేయకుండా కమిటీలంటూ కాలయాపన చేస్తూ, రోజుకో మాట మార్చుతున్న టీడీపీ సర్కారు వైఖరిపై ఆగ్రహోదగ్రులయ్యారు. రూ.87వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14వేల కోట్ల డ్వాక్రా రుణాల్లో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా, మాయమాటలు చెప్తూ అంతా చేసేసినట్లు అనుకూల మీడియాలో డప్పు కొట్టించుకుంటున్నా సీఎం వైఖరిపై మండిపడ్డారు. మూడురోజుల పాటు తప్పుడు హామీల నరకాసుర వధ కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా ‘నరకాసుర వధ’ నిర్వహించారు. గ్రామాగ్రామాన భారీగా ఆందోళనలు నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. అన్నదాతను, ఆడపడుచులను మోసం చేసిన ముఖ్యమంత్రిపై 420 కేసు పెట్టాలని నినదించారు. మొత్తం రుణాలు మాఫీ చేస్తామని హామీలిచ్చి ఓట్లేయించుకుని ఇప్పుడు మాటమార్చి మాయచేయాలని చూస్తే సహించబోమని, తగిన గుణపాఠం చెబుతామని అనంతపురం జిల్లాలో ఒక రైతు హెచ్చరించారు. ‘‘అప్పులు మాఫీ చేస్తామంటే కట్టకుండా మానేశాం. ఇప్పుడు కట్టాలన్నా డబ్బుల్లేవు. బ్యాంకుకు వెళితే గత ఏడాదికి కూడా 13శాతం వడ్డీ కట్టాల్సిందేనంటున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిండా మునిగిపోయాం’’ అని చిత్తూరుజిల్లాకు చెందిన ఒక డ్వాక్రా మహిళ ఆవేదన వ్యక్తంచేసింది. మాట తప్పిన తెలుగుదేశం పార్టీ సర్కారు మెడలు వంచుతామని రాష్ట్రవ్యాప్తంగా రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించాయి. అనంతపురంజిల్లాలో సీపీఐ కూడా రుణమాఫీపై ఉద్యమించింది. విపక్షాల ఆందోళనలు చూసి భయపడిన అధికారపక్షం అనేకచోట్ల ఆందోళనలు అడ్డుకునేందుకు ప్రయత్నించింది. -
నేనిచ్చిన లక్ష..రూ.50లక్షలు కావాలి...
రుణమాఫీపై మహిళలతో సీఎం బాబు వ్యాఖ్య సాక్షి, అనంతపురం: ‘‘ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష రుణం మాఫీ చేశాను.. మాఫీ అయ్యే రూ.లక్షను మీ భర్తల చేతికివ్వద్దు.. మీరే ఆ సొమ్ముతో వ్యాపారాలు చేసి రూ.50 లక్షలు సంపాదించాలి. మరో నాలుగు నెలల తర్వాత నేను మళ్లీ జిల్లాకు వస్తాను.. అప్పుడు రూ.లక్షతో రూ.50 లక్షలు ఎలా సంపాదించాలో చెపుతా’’నని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం సీఎం అనంతపురం జిల్లాకు వచ్చారు. తొలిరోజు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి ఎనుములపల్లి క్రాస్ మైదానంలో డ్వాక్రా మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖితో పాటు నల్లమాడ, కదిరి రూరల్ మండలం కొండమనాయనిపల్లెల్లో మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్లున్నాయి కానీ 60 శాతం మంది ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో వీటిని పూర్తి స్థాయిలో నిర్మిస్తాం’’ అని బాబు చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులు పుస్తకాల బరువును మోయకుండా ఉండేందుకు వీలుగా విద్యార్థికో ఐప్యాడ్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు సైతం సెల్ఫోన్ల స్థానంలో ఐప్యాడ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నారు. -
లక్ష్యం మించి డ్వాక్రా రుణాలు
మాకవరపాలెం : జిల్లాలో లక్షా ్యన్ని మించి రూ.443 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళలకు అందజేశామని డీర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. రూ.380 కోట్లు లక్ష ్యంకాగా రూ.443కోట్లు అందజేశామన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 38 వేల డ్వాక్రా సంఘాలకు 1999 నుంచి ఇప్పటి వరకు రూ.1600 కోట్లు రుణాలిచ్చామన్నారు. ప్రస్తుతం వీరంతా రూ. 593కోట్లు బ్యాంకులకు చెల్లించాలన్నారు. వీటిలో మొండి బకాయిలు రూ.16 కోట్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 3.19లక్షల మందికి పింఛన్లుగా ప్రతి నెలా రూ.8కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఆధార్ సీడింగ్ 1.08లక్షల మంది పెన్షన్‌దారులకు పూర్తయిందన్నారు. బయోమెట్రిక్‌లో భాగంగా ఇంకా 46వేల మంది నుంచి వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. వేలి ముద్రలు పడని వారుంటే వారి బంధువుల వేలి ముద్రలు ఇవ్వవచ్చన్నారు. నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చనిపోయిన 3450మంది పింఛనుదారుల పేర్లను తొలగించామన్నారు. బోగస్ పింఛన్లను తొలగించేందుకు ఆధార్ సీడింగ్ చేపడుతున్నామన్నారు. కొత్తగా 29,600 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించా రు. డ్వాక్రా సంఘాల సభ్యుల పిల్లలయిన 54వేల మంది విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 1200చొప్పున ఏటా రూ.5.66కోట్లు అందజేస్తున్నామన్నారు. జనశ్రీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తం గా లక్ష మంది ఎస్సీ,ఎస్టీలను ఈ పథకంలో చేర్చడమే లక్ష ్యమన్నారు. ఒక్కొక్కరు రూ.15 చెల్లించి ఈ బీమా పథకంలో చేరితే సాధారణ మరణానికి రూ. 30వేలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.75వేలు అందుతుందన్నారు. వచ్చేనెల 16నుంచి 23వ తేదీ వరకు ఐకేపీ ఆధ్వర్యంలో బీమా వారోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ష్కాలర్‌షిప్‌లను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఇన్సూరెన్స్ విభాగం ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. బైక్ ఎక్కిన పీడీ గొలుగొండ : డ్వాక్రా మహిళలు సమావేశమై పొదుపు, బకాయిలు తీర్చేపద్ధతులపై చర్చించుకోవాలని డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని చీడిగుమ్మల పంచాయతీ యరకంపేటలో మంగళవారం డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో ఎన్ని సంఘాలున్నాయి? ఎంత మేర రుణం తీర్చారు? తదితర విషయాలు తెలుసుకున్నారు. విధిగా వారానికి ఒకసారి సమావేశం కావాలన్నారు. మద్యపాన నిషేధంపై కూడా చర్చించుకోవాలన్నారు. ఉపాధి హామీలో కూరగాయల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో మారుమూల డొంకాడ వెళ్లి, అక్కడి ఐకేపీ బాలబడి కేంద్రాన్ని పరిశీలించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు ద్విచక్ర వాహనం, మరో రెండు కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. గిరిజనులు తాగునీరు, విద్యుత్, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని పీడీని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ, బాలబడుల జిల్లా ఇన్చార్జి గోవిందరావు, డివిజన్ ఇన్చార్జి కొండలరావు,ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
డ్వాక్రా..బాబు టోకరా
కలిదిండి మండలం పోతుమర్రు గ్రామంలో 27 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపు సభ్యులు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో 27 గ్రూపుల వారు అప్పటి నుంచి వడ్డీలు చెల్లించడం మానేశారు. సీఎం అయ్యాక చంద్రబాబు మాటమార్చారు. ఒక్కో గ్రూపునకు రూ.లక్ష మాత్రమే రద్దు చేస్తామని ప్రకటించడంతో మహిళలు దిక్కుతోచక అల్లాడుతున్నారు. విజయవాడ : ... ఒక్క పోతుమర్రు గ్రామంలోనే కాదు జిల్లా అంతటా ఇదే పరిస్థితి. చంద్రబాబు మాటలు నమ్మిన ప్రతి ఆడపడుచూ గడపదాటి రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు ప్రకటించిన రుణమాఫీని కేవలం కంటితుడుపు చర్యగానే అమలుచేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తమను నమ్మించి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో సభ్యురాలికి రూ.10వేలలోపే మాఫీ..! జిల్లాలో సుమారు 54వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 30వేల గ్రూపులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఒక్కో గూపులో 10 నుంచి 15 మంది వరకు సభ్యులున్నారు. మొత్తం 6.24లక్షల మంది మహిళలు డ్వాక్రా సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయల చొప్పున రద్దు చేస్తే 30వేల గ్రూపుల్లోని మూడు లక్షల మంది మహిళలకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ అవుతుంది. పది మంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికీ రూ.10వేలు, అంతకన్నా సభ్యులు ఎక్కువ ఉండే రుణమాఫీ మొత్తం ఇంకా తగ్గే అవకాశం ఉంది. పేరుకుపోయిన బకాయిలు డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో రూ.938 కోట్ల వరకు డ్వాక్రా సంఘాలు రుణాలు పొందాయి. గత ఫిబ్రవరి నంచి జూలై వరకు ఆరు నెలలుగా వడ్డీలు కూడా చెల్లించడంలేదు. సాధారణంగా డ్వాక్రా రుణాలకు 14 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఆరు నెలల నుంచి వాయిదాలు పెండింగ్‌లో ఉండటంతో వడ్డీపై రెండు శాతం పెనాల్టీ కూడా వసూలు చేస్తారు. అసలు, వడ్డీ, పెనాల్టీ మొత్తం చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు స్పష్టంచేస్తున్నారు. రుణమాఫీ అయిన మొత్తం బకాయిలకు సరి.. ఒక్కో మహిళకు రుణమాఫీగా వచ్చిన రూ. 10వేలను కూడా బ్యాంకర్లు పెండింగులో ఉన్న బకాయి కింద జమచేసుకునే అవకాశం ఉంది. మిగిలిన వాయిదాల డబ్బును మహిళలు ఒకేసారి వడ్డీ సహా చెల్లించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించుకునే తమకు రుణమాఫీ ఆశ చూపి ఇప్పుడు రోడ్డుపాలు చేశారని పలువురు మహిళలు మండిపడుతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తాము పెద్దమొత్తంలో బకాయిలను ఒకేసారి ఎలా చెల్లించగలమని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో సంఘానికి లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం పలు ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలు ఆందోళనబాట పట్టారు. మొత్తం రద్దు చేయాలి డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు రూ.లక్ష మాత్రమే అంటే ఎలా.. సంఘంలో పది మంది సభ్యులు కలిపి రూ.5 లక్షలుపైనే రుణం తీసుకున్నాం. వీటిని రద్దు చేస్తారని నమ్మి ఐదు నెలలుగా సొమ్ము జమచేయడంలేదు. పాలకులు పునరాలోచించాలి. - డి.సువర్ణ, డ్వాక్రా మహిళ, ఉయ్యూరు -
రుణమో ఫణమో!
-
రుణమో ఫణమో..!
-
కుటుంబానికి లక్షన్నర మాఫీ
రుణాల మాఫీపై బాబు ప్రకటన ఒక కుటుంబం పంట, బంగారం రుణాలన్నీ కలిపి లక్షన్నర వరకే పరిమితం గత మార్చి వరకు ఉన్న రుణాలు మాఫీ.. రుణాలు చెల్లించిన వారికి కూడా వర్తింపు డ్వాక్రా సంఘాలకు లక్ష వరకు రుణ మాఫీ.. చేనేత, ఎస్సీ రుణాలు కూడా రుణమాఫీ ఎప్పుడు అమల్లోకి వస్తుందో స్పష్టతనివ్వని చంద్రబాబు నిధుల సమీకరణ జరిగిన దానినిబట్టి అమలు చేస్తామని వెల్లడి నిధుల సమీకరణకు కొత్తగా మరో కమిటీ మార్కెట్ కమిటీల రద్దుకు అర్డినెన్స్ తేవాలని కేబినెట్ నిర్ణయం హైదరాబాద్: రైతుల వ్యవసాయ రుణాలు ఒక్కొక్క కుటుంబానికి లక్షన్నర వరకు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒక కుటుంబంలోని సభ్యులు పంట, బంగారం రుణాలు ఎన్ని బ్యాంకుల్లో, ఎన్ని ఖాతాల ద్వారా తీసుకున్నప్పటికీ.. మొత్తం లెక్క తేల్చి అందులో లక్షన్నరకు మాత్రమే మాఫీ వర్తింప జేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఉన్న వ్యవసాయ రుణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మాఫీ అమలయ్యే సమయానికి రుణాలు చెల్లించిన రైతులకు కూడా దీనిని వర్తింపజేస్తామన్నారు. ఒకే భూమిని తాకట్టు పెట్టి యజమాని, కౌలు రైతు ఇద్దరూ రుణం తీసుకుని ఉంటే.. కౌలు రైతు రుణమాఫీకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. లక్ష వరకు డ్వాక్రా, చేనేత, ఎస్సీ రుణాలను కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే రుణ మాఫీ ఎప్పుడు అమలులోకి వస్తుందన్న దానిపై ఆయన పూర్తి స్పష్టత ఇవ్వలేదు. సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై రైతు రుణాల మాఫీతో పాటు పలు కీలకాంశాలపై చర్చించింది. అనంతరం మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, నారాయణ, రావెల కిశోర్‌బాబు, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, కుటుంబరావులతో కలిసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద రుణ మాఫీకి అవసరమైన ఆదాయ వనరులు లేని కారణంగా మాఫీ సొమ్మును ప్రభుత్వం తిరిగి బ్యాంకుకు చెల్లించే ఏర్పాట్లపై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. రుణమాఫీకి అవసరమమైన నిధుల సమీకరణ కోసం ఒక కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు. నిధుల సమీకరణ జరిగిన దానిని బట్టి మాఫీ అమలు చేస్తామన్నారు. అన్ని రకాల రుణ మాఫీకి గాను రాష్ట్ర ప్రభుత్వానికి రూ.37,900 కోట్లు వరకు అవసరమని చెప్పారు. ఆర్ధిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) ప్రకారం రాష్ట్రానికి కేవలం రూ.15,539 కోట్లు మాత్రమే రుణంగా తీసుకునే వెసులుబాటు ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇతరత్రా అవకాశాలను పరిశీలించినప్పటికీ రూ.25 వేల కోట్ల నిధుల సమీకరణకు మాత్రమే అవకాశం ఉందని అన్నారు. రీషెడ్యూల్పైనా స్పష్టత రావాలి రుణ మాఫీకి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఆర్బీఐ తగిన విధంగా స్పందించలేదని చంద్రబాబు చెప్పారు. రూ.12 వేల కోట్ల రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి మాత్రమే అంగీకరించిందన్నారు. వాటినీ ఏడేళ్ల కాలంలో చెల్లించేందుకు అవకాశం కోరినప్పటికీ మూడేళ్లలోనే చెల్లించాలన్న నిబంధన పెడుతోందని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం.. పోలీసులు స్వాధీనం చేసుకున్న 15 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం వేలం వేయడంతో పాటు.. అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం మొత్తాన్ని బ్యాంకులకు ష్యూరిటీగా ఉంచాలనే ఆలోచన చేస్తున్నట్టు సీఎం తెలిపారు. గనులు, ఇసుక రీచ్‌ల నుంచి వచ్చే ఆదాయూన్ని ఎస్క్రో ఖాతాకు జమ చేసి, ఆ డబ్బు రుణమాఫీ అప్పుకు జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. 96.27% రైతులకు పూర్తిగా రుణమాఫీ! ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 96.27 శాతం మంది రైతులకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని.. మిగిలిన 3.73 శాతం మంది రైతులకు లక్షన్నర మేర లబ్ది కలుగుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతులు మొత్తం 85 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా మాఫీ అయ్యే మొత్తం ఎంతన్న లెక్క తేల్చడానికి బ్యాంకర్ల కమిటీ వద్దే స్పష్టమైన సమాచారం లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. రాష్ట్రంలో 7.60 లక్షల వరకు ఉన్న డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్క లక్ష చొప్పున రూ.7,600 కోట్ల మేరకు మాఫీ చేస్తున్న సొమ్మును ఆ సంఘాల సీడ్ క్యాపిటల్గానో, మూలనిధిగానో జమ చేస్తామన్నారు. చేనేత కార్మికులు, ఎస్సీలకు చెందిన రుణాల మొత్తం ఎంతన్న దానిపై ప్రభుత్వానికి సమాచారం లేకపోయినప్పటికీ ఆ రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమని, దేశంలో అతి పెద్ద మాఫీ ఇదే అవుతుందని అన్నారు. కాగా, విద్యార్థుల స్థానికతపై నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరికీ అధికారాలు లేవని, వాటికి కొన్ని చట్టాలు ఉన్నాయని బాబు చెప్పారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తక్షణమే జరిగేలా జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతున్నట్టు తెలిపారు. సంక్షేమానికి తాత్కాలిక విరామం! హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం దాని అమలు సాకుతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని చూస్తోంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో రుణమాఫీ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రుణ మాఫీపై రైతులు అనేక ఆశలు పెట్టుకున్నారని, ఎప్పుడు అమలవుతుందా? అని ఆతృతతో ఎదురుచూస్తున్నారని ఈ సమయంలో ఇంకా ఆలస్యం అయితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని మంత్రులు చెప్పారు. ప్రస్తుతం ఈ ఒక్క హామీపైనే రైతులతో పాటు ప్రజలందరి దృష్టీ ఉందన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే నిధుల సమీకరణ ఎలా అన్నదే సమస్యగా మారిందని బాబు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇప్పటికే శ్వేతపత్రాల ద్వారా వివరించి ఉన్నందున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సంక్షేమ పథకాలకు విరామం ప్రకటించినా ప్రజలు అర్థంచేసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. అయితే ఏ ఏ పథకాలను నిలిపివేయాలన్న దానిపై స్పష్టత రాలేదు. భూములు, ఆస్తుల తనఖా ద్వారా రుణాల సేకరణపై చర్చ సాగినా అది వెసులుబాటు ఇచ్చేది కాదన్న అభిప్రాయానికి వచ్చారు. గనులు, ఎక్సయిజ్, రవాణా సుంకాల ద్వారా వచ్చే మొత్తంలో కొంత శాతాన్ని రుణమాఫీకి బదలాయించాలని అభిప్రాయపడ్డారు. లాభాల్లో ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని బ్యాంకులకు ష్యూరిటీగా చూపించి రుణాల మాఫీకి అంగీకరింపచేయవచ్చన్న చర్చ సాగించారు. బాండ్ల జారీపైనా చర్చించినా దాన్ని చివరి ప్రత్నామ్నాయంగా తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు. -
ఆరిన ‘దీపం’
పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు సర్కారు మరో షాకిచ్చింది. ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీ హామీని అటకెక్కించి, స్త్రీ నిధి రుణాలపై వడ్డీ పెంచి వారిపై పెనుభారాన్ని మోపిన బాబు..తాజాగా మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయడం పేదవారి వంటింట్లో అలజడి రేపుతోంది. సాక్షి, ఒంగోలు: మేలు చేస్తుందనే ఆశతో ఓటేసి అధికారంలోకి తెచ్చిన టీడీపీ.. మిహిళలకు షాకుల మీద షాకులిస్తోంది. బ్యాంకు రుణాలు చెల్లించొద్దంటూ నమ్మబలికి రుణాల మాఫీ చేయని టీడీపీ సర్కారుపై డ్వాక్రా మహిళలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు. బిడ్డల చదువులకు అక్కరకొస్తాయని దాచుకున్న పొదుపు సొమ్మునూ.. బ్యాంకర్లు రికవరీ పేరుతో జమ చేసుకోవడంతో బాధితుల కడుపు రగిలిపోతోంది. పుండు మీద కారం చల్లినట్లు ‘దీపం’ గ్యాస్ కనెక్షన్ల రద్దు వ్యవహారంతో వారిలో ఆగ్రహం పెళ్లుబుకుతోంది. అటు రైతులను, ఇటు మహిళలనూ పనిగట్టుకుని చంద్రబాబు సర్కారు ఇబ్బందులకు గురిచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 7,874 దీపం గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయి. జిల్లాకు ప్రభుత్వం 2012-13 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా మొత్తం 28,494 గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. అయితే, వాటిని అధికారులు సకాలంలో అర్హులకు అందజేయలేకపోయారు. మండల పరిషత్ అధికారులు గ్రామసభలు నిర్వహించి అర్హతలను బట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉండగా, అప్పట్లో వారు నిర్లక్ష్యం ప్రదర్శించారు. మంజూరైన కనెక్షన్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికీ పూర్తి చేయలేదు. వాస్తవానికి, వాటి ల్లో ఇప్పటికి 7,135 కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. మిగిలిన వాటినైనా లబ్ధిదారులకు అందించారా..? అంటే అదీ జరగలేదు. సగం కనెక్షన్లు మాత్రమే గ్రౌండింగ్ పూర్తయి లబ్ధిదారుల చేతికి సిలిండర్లు అందాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఆ గ్యాస్ కనెక్షన్లన్నీ రద్దయ్యాయి. మరలా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకోవడం... అధికారులు విచారణ చేసి అర్హతలను ధ్రువీకరించడం.. ఆ తర్వాత కొత్తప్రభుత్వం దీపం కనెక్షన్లు మంజూరు చేస్తుందో.. లేదో చూడాల్సి ఉంది. ఇక, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 10,300 కనెక్షన్లను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేయగా, వాటిల్లో ఇంకా 735 గ్రౌండింగ్ చేయాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. గుర్తింపునకు తాపత్రయం: ‘దీపం’ పథకం 1999 నుంచి రాష్ట్రంలో అమలవుతోంది. అప్పటి నుంచి ఏటా వేలాది కనెక్షన్లు ఈ పథకం కింద జిల్లాకు మంజూరవుతున్నాయి. అయితే, రాజకీయ నాయకుల జోక్యం.. అధికారుల నిర్లక్ష్యం కలిసి ఎంపికకు తూట్లు పొడుస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో లబ్ధిదారులను ఎంపిక చేయకుండా నిర్లక్ష్యం వహించడం ఒక కారణమైతే.. అధికారులు పంపిన జాబి తాల్లో అనర్హుల పేర్లు చోటుచేసుకోవడం అర్హులకు శాపమవుతోంది. అయితే, పాత జాబితాలను రద్దు చేసి.త. మరలా కొత్తగా అర్హులను గుర్తించి ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామనడంపై డ్వాక్రా మహిళలు విస్తుపోతున్నారు. కేవలం, అధికార టీడీపీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోందని.. గ్రామీణ మహిళల ఇబ్బందులు ఆలకించినట్లైతే మంజూరైన కనెక్షన్లను రద్దు చేయదంటున్నారు. -
హామీలిచ్చి డబ్బుల్లేవంటే ఎలా?
* పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబును నిలదీసిన మహిళలు * నా వద్ద మంత్రదండం లేదు.. అయినా రుణమాఫీకి కట్టుబడి ఉన్నానన్న బాబు * డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, అయితే టైం పడుతుందని వెల్లడి * రైతులతో ముఖాముఖిలోనూ రుణ మాఫీపై ప్రశ్నించిన అన్నదాతలు * డబ్బులు చెట్లకు కాయడంలేదు. సమస్య పరిష్కారానికి చూస్తా’ అంటూ సీఎం అసహనం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘మీరే కదా రుణ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవంటే ఎలా’ అని పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. గురువారం నరసన్నపాలెం, బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం గ్రామాల్లో రైతులు, మహిళలతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. ఆయన ఆగిన ప్రతిచోట గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. సీతంపేటలో అనిశెట్టి పుణ్యవతి, మంగరాజు గంగారత్నం, తోటవరపు సీత తదితరులు బాబు కాన్వాయ్‌కు ఎదురుపడి రుణ మాఫీపై ప్రశ్నిం చారు. ‘కొంచెం సమయం ఇవ్వండి. ప్రస్తుతానికి రీషెడ్యూల్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఆదాయం లేదు. అప్పులే ఉన్నాయ్. నావద్ద మంత్రదండం లేదు’ అని అన్నారు. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో జరిగిన ముఖాముఖిలో కూడా మహిళలు రుణ మాఫీపైనే ప్రశ్నించారు. వారికి బాబు సమాధానమిస్తూ.. ‘మీ కష్టాలు మీకుంటే నా కష్టాలు నాకున్నాయ్. అందరికీ న్యాయం చేద్దాంలే’ అని అన్నారు. ‘ఎన్నికల సమయంలో మీరే కదా హామీలు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవం టే ఎలా’ అని నోముల దుర్గమ్మ గట్టిగా నిలదీసింది. కొయ్యలగూడెంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ డ్వాక్రా రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నానని, ఇప్పటికే కట్టిన వారికి, కట్టని వారికి మాఫీ చేస్తానని, అయితే టైం పడుతుందని చెప్పారు. రాజధాని సంగతి తర్వాత.. రైతుల విషయం చూడండి జంగారెడ్డిగూడెంలో జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష అనంతరం చంద్రబాబు నరసన్నపాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. హైదరాబాద్ వంటి నగరాలు మూడు, నాలుగు నిర్మించే శక్తి ఉందంటూ సీఎం చెప్తుండగా.. టిడిపికే చెందిన మాజీ ఎంపీటీసీ కట్టా సత్యనారాయణ, మరికొందరు రైతులు కల్పించుకొని.. ‘రాజధాని సంగతి తర్వాత. ముందు మీరన్న రుణ మాఫీ, పొగాకు గిట్టుబాటు ధరల గురించి మాట్లాడండి’ అని అన్నారు. ఏపీలో సరుకు రవాణా విప్లవం జంగారెడ్డిగూడెం: ఏపీలో సరుకు రవాణా విప్లవం రానుందని, వాణిజ్యపరంగా రాష్ట్రాన్ని ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా మారుస్తామని చంద్రబాబు చెప్పారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘సముద్ర తీరానికి దూరంగా ఉన్న 50 శాతం ప్రాంతాలను రాష్ట్రంలో నిర్మించే పోర్టులకు అనుసంధానం చేయడమే నా లక్ష్యం. నవ్యాంధ్రలో లాజిస్టిక్స్ (సరుకు రవాణా) విప్లవంతో ముందుకు సాగడానికి ప్రణాళికలు చేస్తున్నా. కాలువల ద్వారా జల రవాణాను పునరుద్దరిస్తాం. కాకినాడ నుంచి విజయవాడ మీదుగా పాండిచ్చేరి వరకు విస్తరిస్తాం. ఉత్పత్తిదారు, వినియోగదారుల రాజ్యం సృ ష్టించేలా ప్రణాళికలు తయారుచేస్తాం’’ అని బాబు తెలిపారు. హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా.. నరసన్నపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో గంగరాజు అనే రైతు కరెంటు సమస్యను ప్రస్తావించారు. ‘గవర్నర్ పాలనలోనే 4 గంటలు కరెంట్ వచ్చేది. మీరు వచ్చిన తర్వాత రోజుకు 2 గంటలే ఉంటోంది’ అని ప్రశ్నించారు. దీంతో బాబు ఆగ్రహిం చారు. ‘ఏం మాట్లాడుతున్నావ్. కథలు చెప్పొద్దు’ అంటూ గదమాయించారు. ‘సార్ నేను చెబుతోంది నిజమే’ అని ఆ రైతు అనగా.. బాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. ‘ఏయ్ నువ్ ఊరికే అరవొద్దు. నేను ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడతా. నీకు సమస్యలు వస్తాయ్. నీ అడ్రస్ కనుక్కుని హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా’ అని ఒకింత బెదిరింపు ధోరణితో మాట్లాడారు. గంగరాజు మళ్లీ స్పందిస్తూ.. ‘రెండు రోజులుగా కరెంట్ సరఫరా సరిగా లేదు. మంగళవారం అయితే గంట కూడా రాలేదు’ అని తెగేసి చెప్పారు. ఇందుకు సంఘీభావంగా పక్కనున్న రైతులు పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. దీంతో బాబు ‘సరే.. నాకు పనుంది. డ్వాక్రా మహిళలతో కొయ్యలగూడెంలో సమావేశం ఉంది. నువ్వు అక్కడికి రా. నీ విషయం అక్కడ తేలుస్తా’ అంటూ ముందుకు సాగారు. కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు విద్యార్థుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పిచ్చి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, బయ్యన్నగూడెం గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ కేసీఆర్ తీరును తప్పుబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లేనిపోని సమస్యలు సృష్టిస్తోంది. అక్కడి ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు ఇండియా, పాకిస్థాన్ కాదు’ అని బాబు అన్నారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. -
డ్వాక్రా మహిళలను మోసగించిన బాబు
ఒంగోలు టౌన్ : తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు రద్దు చేస్తూ సంతకం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ తరువాత దాని ఊసే ఎత్తకుండా మోసగించారని రాయలసీమ ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. ఐద్వా జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవన్లో సోమవారం మోసగించిన బాబు నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెలరోజులు దాటినప్పటికీ డ్వాక్రా రుణాల రద్దు గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు. అవి ఎప్పుడు రద్దు చేస్తారా అని మహిళలు ఎదురు చూస్తుంటే, వారిని తప్పించుకునే ప్రయత్నం బాబు చేస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలు తక్కువ మొత్తంలోనే ఉన్నాయన్నారు. త్వరలో జరగనున్న మండలి సమావేశాల్లో డ్వాక్రా రుణాల రద్దు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కారుసాల సుబ్బరావమ్మ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో ఎక్కువ మంది మహిళలు నమ్మి చంద్రబాబును గెలిపిస్తే చివరకు మోసగించారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డ్వాక్రా రుణాలు రద్దుచేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్కే మున్వర్ సుల్తానా మాట్లాడుతూ పొదుపు డబ్బులను సభ్యులకు తెలియకుండా రుణాలకు జమ చేయరాదని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యూ ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో నాయకురాళ్లు జే అన్నపూర్ణ, కే రమాదేవి, కే సృజన, కే రాజేశ్వరి పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఐద్వా నాయకురాళ్లు, కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి కలెక్టర్ విజయకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. -
‘డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి’
గంట్యాడ : డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ డిమాండ్ చేశారు. నీలావతి ఎస్సీ కాలనీలో డ్వాక్రా మహిళలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రుణాలు రద్దు చేయాలని కోరుతూ మహిళల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలని కోరారు. రుణాల మాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం రోజుకో మాట చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసేవరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్పారు. అందులోభాగంగానే సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్. పరదేశమ్మ, బి. ఎల్లమ్మ, ఆర్. ముత్యాలమ్మ, దాలమ్మ, టి. పరదేశి, తదితరులు పాల్గొన్నారు. -
రైతు రుణాలతోపాటే డ్వాక్రా రుణాలూ..!
డ్వాక్రా రుణాల మాఫీకి తాము కట్టుబడి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇవ్వొద్దని బ్యాంకర్లను కోరుతామని చెప్పారు. రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నప్పుడే డ్వాక్రా రుణాల మాఫీపై కూడా నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఇకపై పింఛన్ల మంజూరుకు, ఇళ్ల లబ్ధిదార్ల ఎంపికకు ఆధార్‌ను అనుసంధానం చేస్తామని మృణాళిని తెలిపారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, 50 లక్షల ఇళ్ల లబ్ధిదారులపై జియో టెక్నాలజీ ద్వారా విచారణ జరిపించి అక్రమాలు బయటపడ్డాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఈ విచారణ పూర్తయ్యాక మాత్రమే కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని మృణాళిని అన్నారు. -
‘రుణమాఫీ’పై నమ్మకం సడలుతోంది
దర్శి : దర్శిలో బ్యాంకర్ల తీరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీపై నమ్మకం సడలుతోందని స్థానిక పొదుపు సంఘాల సభ్యులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. పొదుపు గ్రూపు సభ్యుల కథనం మేరకు... దర్శిలోని సాయిప్రసన్న పొదుపు గ్రూపు సభ్యులు పదేళ్లుగా స్థానిక స్టేట్ బ్యాంకులో డబ్బు పొదుపు చేస్తున్నారు. వీరు పొదుపు చేయడం ద్వారా రుణాలు పొంది నెలవారీ కిస్తీలను సక్రమంగానే తిరిగి చెల్లిస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించినప్పటికీ ఏ నెలా చెల్లింపులు ఆపలేదు. ఈ గ్రూపు ఖాతాలో ప్రస్తుతం రూ.1,03,500 పొదుపు సొమ్ము ఉంది. ఈ నేపథ్యంలో గ్రూపు సభ్యురాలు కె.ఏడుకొండలమ్మకు శుభకార్యం కోసం రూ.50 వేలు అవసరమైంది. సభ్యులందరి అంగీకారంతో రుణం కోసం సోమవారం బ్యాంకుకు వెళ్లారు. సంబంధిత అధికారి ఒకరు అంగీకరించి రుణం మంజూరు చేస్తూ సంతకం పెట్టారు. అయితే శ్రీనివాస్ అనే మరో అధికారి రుణం ఇచ్చేదిలేదంటూ గ్రూపు సభ్యులతో దురుసుగా మాట్లాడారు. ఖాతాలో పొదుపు డబ్బు ఉన్నప్పుడు రుణాలు ఎందుకివ్వరని సభ్యులంతా ఆ అధికారిని ప్రశ్నించారు. గతంలో రూ.లక్ష రుణం తీసుకున్నారని, ఆ డబ్బులు కట్టి ఖాతాలో మిగిలిన నగదు తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో బాబు రుణమాఫీ ప్రకటన ఒట్టిమాటేనా అనుకుంటూ గ్రూపు సభ్యులు విస్తుపోవాల్సి వచ్చింది. పొదుపు చేసుకున్న డబ్బును తాము తీసుకున్న రుణానికి బ్యాంకర్లు జమ చేసుకుంటారేమోనని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అనుమానంగా ఉంది :ఎ.రాజ్యలక్ష్మి, సాయిప్రసన్న గ్రూపు లీడర్ రుణం ఇవ్వకపోవడంతో మా బాకీలు రద్దు కావేమోనని భయమేస్తోంది. పొదుపు సొమ్ము జమ చేసుకుంటారేమోనని అనుమానంగా ఉంది. అధికారులు డ్వాక్రా రుణమాఫీపై నిజాలను భయటపెట్టడం లేదు. పొదుపు డబ్బుతో ముడిపెడుతున్నారు :ఎన్.సుకన్య, సెకండ్ లీడర్ రుణాలకు, పొదుపు సొమ్ముకు సంబంధం లేదని చెప్పారు. రుణమాఫీతో బాకీలన్నీ రద్దవుతాయని చంద్రబాబు ప్రకటించారు. పొదుపును మాత్రం కట్టుకోమన్నారు. ఇప్పుడు మాత్రం పొదుపు డబ్బుతో రుణానికి ముడిపెడుతున్నారు. -
ఐకేపీ మహిళలకు అరెస్ట్ వారెంట్
రాష్ట్రీయ మహిళాకోశ్ రుణం చెల్లించకపోవడంతో కేసు నమోదు కొత్తగూడెం, న్యూస్‌లైన్: డ్వాక్రా మహిళలకు అందించిన రుణాలు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మహిళా సమాఖ్యల సభ్యులకు అరెస్టు వారెంట్లు జారీచేసింది. రాష్ట్రీయ మహిళాకోశ్ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడం, రుణానికి పూచీకత్తుగా ఉన్న బ్యాంకు చెక్కులు బౌన్స్ కావడంతో ఢిల్లీ పోలీసులు వారెంట్లతో జిల్లాకు వచ్చారు. వివరాలివీ.. 2007లో జిల్లాలోని 14 మండల సమాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ మహిళా కోశ్ నుంచి ఒక్కో మండలానికి రూ.50 లక్షల చొప్పున రుణం ఇచ్చింది. మహిళా కోశ్ అధికారులు 50 పైసల వడ్డీకి ఈ రుణాలను అందించగా, సమాఖ్యలు వీవోలకు రూ.1 చొప్పున ఈ రుణాలను పంపిణీ చేశారుు. వీవోలు డ్వాక్రా సంఘాలకు రూ.1.50వడ్డీ చొప్పున అందించారు. ప్రతినెలా డ్వాక్రా సంఘాలు చెల్లించిన రుణాలను వీవోలు సేకరించి వాటిని సమాఖ్యలకు అందించాల్సి ఉం టుంది. ఈ రుణాలిచ్చేందుకు అగ్రిమెంట్‌తోపాటు మండల సమాఖ్యల నుంచి ఖాళీ చెక్‌లను తీసుకున్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం 2014 జనవరిలోగా ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే జిల్లాలోని కొత్తగూడెం, కామేపల్లి, చింతకాని, బోనకల్ మండలాలకు చెందిన సమాఖ్యలు పూర్తిగా చెల్లించలేదు. కొత్తగూడెం మండల సమాఖ్య ఇప్పటికి రూ.30 లక్షలు చెల్లించగా రూ.26 లక్షల బకాయి ఉంది. కామేపల్లి సమాఖ్య రూ.20 లక్షలు, చింతకాని మండల సమాఖ్య రూ.40 లక్షలు, బోనకల్ మండల సమాఖ్య రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. రుణ కాలపరిమితి ముగియడంతో రాష్ట్రీయ స్వయం కోశ్ అధికారులు మండల సమాఖ్యలు ఇచ్చిన చెక్కులను బ్యాంక్‌లో వేయగా, అవి బౌన్సయ్యాయి. దీంతో సమాఖ్య సభ్యులకు అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు శనివారం జిల్లాకు చేరుకుని వారికి నోటీసులు అందించారు. జూన్ 4న ఢిల్లీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా బకాయి పడిన మండల సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై మండల సమాఖ్యలతో చర్చించి రుణం తిరిగి చెల్లించేలా చూస్తామని తెలిపారు. -
'డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం'
-
ఫ్లాప్ షో
సాక్షి, ఏలూరు : అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలను బలవంతగానైనా తరలించి సభల్లో కుర్చీల్ని నింపేవారు. ఇప్పుడు ఆయన వస్తే రోడ్లపై పలకరించేవారే కరువయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం రాత్రి ఏలూరులో నిర్వహించిన రోడ్ షో వెలవెలబోయింది. ఫ్లెక్సీల ఖర్చుకు కూడా ఫలితం దక్కలేదు. సాయంత్రం 6 గంటలకు పెద ఎడ్లగాడి వద్ద జిల్లాలో ప్రవేశించిన కిరణ్ రోడ్‌షో శ్రీపర్రు, మాదేపల్లి, గజ్జెలవారి చెరువు, బిర్లా భవన్ మీదుగా 6.45గంటలకు పాత బస్టాండ్‌కు చేరుకుంది. మూడుచోట్లకిరణ్కుమార్రెడ్డి ప్రసంగించారు. మాదేపల్లి, గజ్జెలవారి చెరువు వద్ద 50 మంది కూడా జనం లేరు. పాత బస్టాండ్ వద్దకు మధ్యాహ్నం నుంచే జనాలను తరలించడం వల్ల వచ్చిన కొంతమంది సాయంత్రం నాలుగు గంటల నుంచి కూర్చున్నారు. ఎంతసేపు ఎదురుచూడాలంటూ స్థానిక నాయకులపై వారు అసహనం వ్యక్తం చేశారు. ఎంత దూరం వచ్చారయ్యా అంటూ కనిపించిన మీడియా ప్రతినిధినల్లా అడిగారు. ఎట్టకేలకు కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చేసరికి ఆ ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. సెంట్రల్ లైటింగ్ వెలగకపోవడంతో బస్సుపై ఉన్న నాయకులు జనాలకు సరిగా కనిపించలేదు. కొందరైతే అక్కడున్న నాయకుల్లో కిరణ్ ఎవరంటూ పక్కవారిని అడిగి తెలుసుకున్నారు. కిరణ్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ, గంటా మోహన్‌రావు(జీఎంఆర్), ఎమ్మార్డీ బలరామ్ ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో నిమిషం మాట్లాడారు. అందరూ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రజల కోసం పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. సమైక్యాంధ్ర పార్టీని ఆదరించాలంటూ పితాని ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టారు. కిరణ్ ప్రసంగానికి ప్రజల నుంచి స్పందన లేకపోయింది. కేసీఆర్‌ను విమర్శిస్తున్నప్పుడు ‘ఆయన బాత్రూమ్లో బక్కెట్లోకి వచ్చే నీళ్లా.. నింపుకోగానే కట్టేయడానికి’ అన్నప్పుడు ఇదేం పోలికంటూ జనం గుసగుసలాడుకున్నారు. చంద్రబాబుని, కాంగ్రెస్ పార్టీని కిరణ్ విమర్శించారు. అక్కడి నుంచి పవర్‌పేట గేటు మీదుగా ఆర్ఆర్ పేట నుంచి ఫైర్‌స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్ వరకూ కిరణ్ రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షోను ఎక్కడా జనం పట్టించుకోలేదు. తనవైపు చూసిన వారికి అభివాదం చేస్తూ రాత్రి 8 గంటలకు యాత్ర ముగించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడు తెలుగు జాతి కలిసుండాలని నోటితో చెప్పలేని పిరికివాడు చంద్రబాబు అని ఎన్..కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు వెళ్లినప్పుడు తన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పుకున్న చంద్రబాబు.. సీమాంధ్రకు వచ్చినప్పుడు మాత్రం రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ రెండు నాల్కల ధోరణి అవలంబించారన్నారు. విభజనపై అసెంబ్లీలో 40 రోజులు చర్చ జరి గితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏనాడూ చెప్పలేదన్నారు. రాష్ట్రాన్ని విభజించుకోమని కేంద్రానికి రెండు లేఖలు రాసిన వ్యక్తి చంద్రబాబు అని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 1,800 రోజలు పదవిలో ఉండి ఉద్యోగులకు జీతాలివ్వడం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.40 వేల కోట్లు అప్పు తీసుకువచ్చిన ఆయన పరిపాలనాదక్షుడా అంటూ దుయ్యబట్టారు. నీళ్లు ఆపేస్తానని అంటున్న కేసీఆర్‌కు ఆ శక్తి లేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండి విభజనను అడ్డుకోలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అంటున్నారని, అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును తలుపులు మూసి వారి సహకారంతో పార్లమెంట్లో పాస్ చేస్తారని తమకెలా తెలుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి, జ్ఞానం ఉంటే విభజన నిర్ణయం తీసుకుని ఉండేవి కాదన్నారు. కిరణ్ వెంట జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పలువురు జిల్లా నేతలు ఉన్నారు. ఏలూరులో పర్యటన ముగించుకుని రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కిరణ్ హైదరాబాద్ బయలుదేరారు. -
హోలీకి ఎన్నికల రంగు..
అభ్యర్థుల నుంచి నేరుగా ఇనామ్‌లు చిక్కడు, దొరకడు విధంగా వ్యవహరిస్తున్న అభ్యర్థులు ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ‘రం గోళీ’ అభ్యర్థులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. హోలీకి ఎన్నికల రంగు పులుముకుంటోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వా ర్డుల్లో ప్రధానంగా హోలీ ఇనామ్‌ల పేరిట అ భ్యర్థులు వేలు ఎగజిమ్ముతున్నారు. ఇందులో ప్రధానంలో డ్వాక్రా మహిళలు, యువత...ఇతరాత్ర సంఘాల నాయకులకే ఎక్కువగా ఇ నామ్‌లు అందుతున్నాయి. హోలీ వస్తుదంటే చాలు పల్లె ప్రాంతాల్లో మహిళలు..యువకులు..కాస్తకారులకు ఇనామ్‌ల పేరిట డబ్బులు..ధాన్యాలు పంచుతుండేవారు. అయితే ము న్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఇదే అదును గా భావించి హోలీకి ఎన్నికల రంగు పులుముతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు, సంఘాల నాయకులకు ముందస్తుగా స మాచారం అందించి డబ్బులు పంచుతున్నా రు. ఇనామ్‌ల కోసం పట్టణంలోని పలు పార్టీ ల నాయకుల ఇళ్ల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు,యువకులు పడిగాపులు కాస్తున్నారు. సంప్రదాయానికి ఎన్నికల రంగు అనాదిగా జరుపుకుంటు వస్తున్న హోలీ పర్వదినానికి ఎన్నికల రంగు అంటుకుంటుంది. ఇనామ్‌ల పేరిట అభ్యర్థుల ఇళ్లలో పెద్దసంఖ్య లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం. ఇ టీవల ఒక వ్యక్తి ఇంట్లో పలువురు మహిళలు హోలీ ఇనామ్ కోసం వెళ్లి డబ్బులు తీసుకున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే సంప్రదా యం ముసుగులో కాలనీల్లో తిరుగుతూ యు వతకు కావాల్సిన వస్తువులు.. డబ్బులు అంది స్తూ..ఓటు వేయించాలని ప్రచారం చేస్తున్నా రు. ఈ తతంగం రాత్రి వేళల్లో ఎక్కువ జరుగుతోంది. ఈ విధానంతో ఎన్నికల కోడ్‌తోపాటు తమ లక్షలోపు ఖర్చు పెట్టాలనే నిబంధన నుంచి సులువుగా అభ్యర్థులు తప్పించుకునే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అభ్యర్థులను అధికారులు పట్టుకోవాలంటే ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
మహిళాసాధికారిత వైఎస్సార్ చలువే: ప్రసన్నకుమార్‌రెడ్డి
కొడవలూరు, న్యూస్‌లైన్: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే మహిళా సాధికారిత జరిగిందని కోవూరు ఎమ్మెలే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని బసవాయపాళెం, రామాపురం పంచాయతీల్లో సోమవారం ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే మహిళలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో మహిళలను ఇబ్బందులు, అవమానాలకు గురిచేశారన్నారు. బహిరంగ సభలకు మహిళలు రాకుంటే, బస్సులు పెట్టి డ్వాక్రా మహిళలను తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. అయితే మహిళలు తీసుకున్న రుణాలపై కనీసం వడ్డీని మాఫీ చేయలేదన్నారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీలో సీట్లు కేటాయించాలని తీర్మానం చేసిన చంద్రబాబు, పార్లమెంట్ ఆమోదానికి వేచిచూడకుండా మహిళలకు సీట్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రూపాయి సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. 1994 వరకు మహిళలు సాధించిన మద్యపాన నిషేధాన్ని సీఎంగా బాధ్యలు చేపట్టిన తరువాత ఎత్తివేసిన చరిత్ర నీది కాదా అని బాబును ప్రశ్నించారు. మహిళల అభివృద్ధికి నాడు ఎన్టీఆర్ కృషి చేస్తే మరణించేవరకు మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 1994 నుంచి 2004 వరకు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు, నేడు బూటకపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యపాన నిషేధంపై తొలిసంతకం చేస్తానని బాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. గ్రామాల్లో టీ దుకాణాల్లో బెల్టుదుకాణాలు పెట్టి ప్రజలను మత్తులో మునిగేలా చేసిన చ రిత్ర చంద్రబాబుదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే మహిళాసాధికారితకు 20 వేల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారని ప్రకటించారన్నారు. అదే విధంగా ఏడాదికి 12 సిలిండర్లతో పాటు 100 సబ్సిడీ ఇవ్వనున్నామన్నారు. తెలంగాణ విభజనకు సూత్రధారి అయిన చంద్రబాబుకు సీమాంధ్రలో బుద్ధి చెబుతారని తెలిసి, అధికారంలోకి రావాలన్న తపనతో ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వీరి చలపతిరావు, నల్లావుల శ్రీనివాసులు, కొడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు మం డల కన్వీనర్లు గంధం వెంకట శేషయ్య, మావులూరు శ్రీనివాసులు రెడ్డి, ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు వీరి సంపత్, కోడూరు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎండీ కరీముల్లా పాల్గొన్నారు. -
ఐకేపీ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం
అధికారంలోకి రాగానే నిర్ణయం ఐకేపీ ఉద్యోగ సంఘాల నేతలకు జగన్ అభయం డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని పునరుద్ఘాటన సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) కింద పనిచేస్తోన్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. శనివారం విశాఖ జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా చోడవరం బహిరంగ సభకు వెళుతున్న జగన్‌ను.. కొత్తూరు జంక్షన్ వద్ద సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగ సంఘాల తరఫున 30 మంది ఉద్యోగులు కలిశారు. సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2008లో ముఖ్యమంత్రి వైఎస్‌ను కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 42వేల మంది ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరామని, ఎన్నికల తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఆయన మరణం తర్వాత తమను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వారి కష్టాలు విన్న జగన్ స్పందిస్తూ.. ‘‘మహిళలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభాలు.. వారి మొహాల్లో చిరునవ్వు చూడాలన్నదే మా లక్ష్యం. అందుకోసం దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకు వస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దీనిపై సంతకం చేస్తాం. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపాలి.. ఆ పిల్లలు చదివి ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి తల్లిదండ్రులకు అన్నంపెట్టే పరిస్థితిలోకి రావాలి. ఆ అక్క చెల్లెమ్మలు పిల్లల్ని ఇలా బడికి పంపినందుకు.. ఒక్కో చిన్నారికీ నెలకు రూ. 500 చొప్పున అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. ఒక్కో కుటుంబంలో ఇలా చదువుకునే ఇద్దరు పిల్లలకు ఈ పథకం వర్తింపజేస్తాం. అంతేకాదు మహిళల జీవితంలో కొత్తదనం తెచ్చే దిశగా అక్క, చెల్లెళ్ల డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేస్తాం. ఈ మాఫీ చేసే కార్యక్రమంలో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే వీవోఏలు, సంఘమిత్రలు, సీసీలందరినీ కచ్చితంగా క్రమబద్ధీకరించి వారికి అండగా నిలుస్తాం’’ అని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం తమ పార్టీ అధికారంలోకి వస్తూనే ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇందిర క్రాంతి పథం ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. దశాబ్దాలుగా అరకొర వేతనంలో అత్తెసరు జీవితాలు గడుపుతున్న ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న హామీ ద్వారా జగన్ తమ జీవితాల్లో వెలుగు నింపారని సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.ధనంజయ, డి.వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కె.ఎస్.గురురాజు సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత కిందిస్థాయి ఉద్యోగుల కష్టాలను తొలగించాలనే జగనన్న ఉదాత్త ఆశయానికి ఆయన హామీనే నిదర్శనం. ఐకేపీ ఉద్యోగుల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్న జగనన్నకు మా ఐకేపీ సిబ్బంది, సభ్యులంతా అండగా ఉంటాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కలసికట్టుగా కృషిచేస్తాం’’ అని సంఘం నేతలు ‘సాక్షి’తో చెప్పారు. -
డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం
అక్కాచెల్లెళ్లకు జగన్మోహన్రెడ్డి భరోసా ‘ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మరో నాలుగు నెలల్లో అధికారంలోకి వచ్చీరాగానే రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకున్న రూ.20 వేల కోట్ల రుణాలను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మహిళల కన్నీరు తుడవడానికి, యువకులు మద్యం జోలికి పోకుండా ఉండేందుకు బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామన్నారు. అక్రమ మద్యం అమ్మకాల నిరోధం కోసం వెయ్యి మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన పది మంది మహిళలను పోలీసులుగా నియమిస్తామన్నారు. మద్యం జోలికి పోవాలంటేనే షాక్ కొట్టేంత రీతిలో మద్యం ధరలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రైతు ముఖంలో ఆనందం కనిపిస్తేనే రైతు కూలీలు, రాష్ట్రం బాగుంటుందనే లక్ష్యంతో తమ ప్రభుత్వంలో వ్యవసాయానికి ఇద్దరు మంత్రులను నియమించనున్నట్లు వెల్లడించారు. పేదలకు కిలో రూపాయికే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ)లో ఆయన మాట్లాడారు. పార్టీ పరంగా ఆయన ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజల కష్టాలు ‘ఓదార్పు’లో కళ్లారా చూశాను.. ‘‘ఓదార్పు యాత్రలో నేను వందలాది కుటుంబాలను కలిశాను. వేలాది మంది పేదలను కలిసి వారి గుండె చప్పుడు విన్నాను. వారి కష్టాలను కళ్లారా చూశాను. పనులు చేస్తున్న అవ్వలు, తాతలను పనులెందుకు చేస్తున్నారని అడిగితే ‘మీ నాయన ఇచ్చిన రూ.200 ఫించన్ మాకు మూడు పూటలా తినడానికి సరిపోవడం లేద’ని చెప్పారు. అందుకే అధికారంలోకి వస్తూనే వారికి రూ.700 ఫించన్ ఇవ్వాలని నిర్ణయించాం. ఓదార్పులో నేను వెళ్లినన్ని పూరి గుడిసెలకు ఏ నాయకుడూ పోయి ఉండడు. ఆత్మీయ, అనురాగాల మధ్య ఆ పేద కుటుంబాలు చెప్పిన మాటలు నా జీవితంలో మరచిపోలేను. అయితే ఆ కుటుంబాల్లో ఐదో తరగతి తర్వాత స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు పనులకు పోతున్నారని వారు చెబుతున్నప్పుడు చాలా బాధనిపించింది. వారు పనులకు పోతేనే రూ.100 లేదా రూ.150 వస్తాయని, వాటితో రెండు రోజులు తమ ఇల్లు గడుస్తుందని వారు చెప్పినప్పుడు చాలా చాలా బాధనిపించింది. అందుకే పిల్లల్ని పనికి కాకుండా బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో(చిన్నారికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు) ప్రతినెలా రూ.వెయ్యి జమచేయాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతి స్కూల్లోనూ ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెట్టి పేదలను పెద్ద చదువులు చదివిస్తాం. అన్నీ నిర్వీర్యం చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే.. కిరణ్ సర్కారు అందులో నుంచి 133 వ్యాధులను తొలగించి పథకాన్ని నిర్యీర్యం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.6 వేల కోట్లు అవసరమైతే రూ.3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు రెండో సెమిస్టర్‌లోకి వచ్చినప్పటికీ ఇప్పటి దాకా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. ప్రజల మీద రూ.32 వేల కరెంటు బిల్లులు బాదడంతో జనానికి బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది. బిల్లు సరిపోదన్నట్లు సర్ చార్జీలు వేసి ఎంత కరెంటు చార్జీలు వేశారో తెలియని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇంతవరకు పేదలకు ఒక్క కొత్త ఇల్లు, ఒక్క కొత్త రేషన్ కార్డు, ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు ఈ కిరణ్ సర్కారు. బాబు రైతు రుణాల హామీ నమ్మవద్దు: రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మాట చెబితే దాని మీద నిలబడాలి. నాయకుడంటే ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. నాయకుడు చేయగలిగేదే చెప్పాలి. ఎన్నికల్లో తాము ఇది చేస్తాం అని చెప్పి ధైర్యంగా ఓట్లు అడగాలి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతు రుణాలు మాఫీ చేస్తామని ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.27 లక్షల కోట్ల రైతు రుణాలు ఉన్నట్లు జనవరి 4న జరిగిన 182వ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ప్రకటించింది. 2008లో కేంద్రమే దేశవ్యాప్తంగా రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రైతులకు మాత్రమే సంబంధించిన 65 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే అందులో రాష్ట్రానికి రూ.11,500 కోట్లు వచ్చింది. కేంద్ర ప్రభుత్వమే మొత్తం వ్యవసాయ రుణాలు రద్దు చేయడానికి అనుకూలించని పరిస్థితులు ఉంటే.. చంద్రబాబు రూ.1.27 లక్షల కోట్లను మాఫీ చేస్తానని దొంగ హామీలిస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ కుర్చీని లాక్కొని ఆయన చనిపోవడానికి కారణమైన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ ఫొటోను పక్కన పెట్టుకుని ఓట్లడుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో మనం 30 ఎంపీ సీట్లు గెలిచి కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రైతులకు ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. రైతులు దయచేసి చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మవద్దు.’’ -
డ్వాక్రా రుణాలు చెల్లించొద్దు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: మహిళలు డ్వాక్రా రుణాలను చెల్లించకూడదని, తమ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. వారికి బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు ఇప్పించి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయుల్లో, ఫిబ్రవరిలో లక్షమంది మహిళలతో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామని తెలిపారు. -
ఐకేపీ అధికారుల నిర్బంధం
మధిర, న్యూస్‌లైన్: మండలంలోని మాటూరు ఎస్సీ కానీ లో ఐకేపీ అధికారులను గ్రామస్తులు మంగళవారం రాత్రి నిర్బంధించారు. అవకతవకలకు పాల్పడుతున్న గ్రామదీపిక వెంకట్రావమ్మ ఎందుకు తొలగించడం లేదంటూ గ్రామంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఏపీఎం సురేంద్రబాబు, సీసీ చలమయ్యను నిలదీశారు. శ్రీనిధి, డ్వాక్రా రుణాలు, పలువురు విద్యార్థుల స్కాలర్షిప్లను గ్రామదీపిక వాడుకుందని, ఆమెను తొలగించాలని కొంతకాలంగా ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామదీపిక వెంకట్రావమ్మను తాత్కాలికంగా తొలగిస్తున్నామని ఏపీఎం సురేంద్రబాబు ప్రకటించడంతో గ్రామస్తులు శాంతించారు. అదేవిధంగా నూతన వీవోను ఎన్నుకున్నట్లు మెజార్టీ సభ్యుల తీర్మానంచేసి పంపితే గ్రామదీపిక గా పరిగణిస్తామని చెప్పారు. ఐకేపీ అధికారులను నిర్బంధించిన విషయాన్ని తెలుసుకున్న మధిర రూరల్ ఏఎస్సై చిట్టిమోదు వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని బందోబస్తు చేపట్టారు.