
మంత్రి లోకేశ్‌కు చుక్కలు చూపించారు!
వైఎస్‌ఆర్ జిల్లా: సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌కు డ్వాక్రా మహిళలు చుక్కలు చూపించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎక్కడ అమలు చేశారంటూ నిలదీశారు. వల్లూరు మండలం తప్పెట్లలో బుధవారం ఈ ఘటన జరిగింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేశ్ మహిళలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా స్థానికంగా రోడ్లు వేశారా? పంటలకు నీళ్లు ఇచ్చారా? అంటూ మహిళలను అడిగారు. ఆ ప్రశ్నలకు మౌనం వహించిన మహిళలు.. అసలు డ్వాక్రా రుణమాఫీ సంగతి ఏమయిందంటూ ప్రశ్నించారు. ఇంకెప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని నిలదీశారు. దీంతో మహిళలకు సర్దిచెప్పేందుకు మంత్రి లోకేశ్ నానా తంటాలు పడ్డారు.