Minister Lokesh
-
మంచినీటి పధకాలు తాకట్టు
-
‘తాగునీటి’ ఆస్తులు తాకట్టు
సాక్షి, అమరావతి:ప్రభుత్వం మీ ఇంటికి శుద్ధమైన మంచినీటినిసరఫరా చేసినా,చేయకపోయినా తాగునీటి పథకానికి సంబంధించిమీ ఊరిలో ఓవర్‌హెడ్ ట్యాంకు, నీళ్ల మోటార్లు, కొన్నిచోట్ల దానికి అనుబంధంగాఓ సమ్మర్ స్టోరేజి ట్యాంకు లాంటివి ఉన్నాయా?వీటన్నింటినీ అప్పుల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. వాటర్ గ్రిడ్ పేరుతో మంచినీటి పథకాలకు సంబంధించిన అన్ని రకాల భూములు, ఇతర స్థిర, చరాస్తులను తాకట్టు పెట్టి రూ.14,769 కోట్లు అప్పు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో కమీషన్ల కోసం తమవారికి రూ.వందల కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల వద్ద అప్పులు చేస్తూ ఆ డబ్బులతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వాటర్ గ్రిడ్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాల పునరుద్ధరణ, కొత్తవి ఏర్పాటు చేస్తామంటూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన మంచినీటి పథకాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి పథక కేంద్రాలు, మోటార్లు, ఓవర్ హెడ్ ట్యాంకులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు అప్పగించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామీణ మంచినీటి పథకాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.5,330 కోట్లు అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో మంచినీటి పథకాలను తాకట్టు పెట్టి రూ.9,439 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఆస్తులు తాకట్టు పెట్టి పలు బ్యాంకుల్లో రుణాలు.. – కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలోని 4,790 గ్రామాల్లో మంచినీటి పథకాల ఆస్తులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ మూడు బ్యాంకులకు తాకట్టు పెట్టేసింది. మూడు బ్యాంకుల నుంచి ఈ ఆస్తులపై రూ.2,500 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించారు. – కృష్ణా జిల్లా గుడివాడ, గన్నవరం, పెనమలూరు, తిరువూరు, పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డ, కైకలూరు, నియోజకవర్గాల పరిధిలో 2,143 ప్రాంతాలకు నీరందించే 1,188 మంచినీటి పథకాలను పంజాబ్ అండ్ సిందు బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.1,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు. – పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, భీమవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని మంచినీటి పథకాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, రామచంద్రాపురం, కొత్తపేట, రాజానగరం నియోజకవర్గాలోని మంచినీటి పథకాలను విజయ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1,000 కోట్లు అప్పు తీసుకోనున్నారు. ఇప్పటికే ఇందులో రూ.300 కోట్లు అప్పు తీసుకున్నారు. – కెనరా బ్యాంకు నుంచి రూ.500 కోట్లు అప్పు కోసం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, జగ్గంపేట, మండపేట నియోజకవర్గాలోని మంచినీటి పథకాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, ఇచ్చాపురం, పాలకొండ, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి, రాజాం నియోజకవర్గాల్లోని మంచినీటి పథకాలను తాకట్టు పెట్టారు. అప్పులకు తోడు అక్రమాలు.. ప్రతి ఒక్కరికీ 70 లీటర్ల చొప్పున ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీటి సరఫరాకు అనుగుణంగా గ్రామాల్లో మంచినీటి పథకాలు ఆధునీకరించడం, లేనిచోట కొత్తవి నిర్మించడం కోసం వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి లోకేష్ ఏడాదిన్నరగా చెబుతున్నారు. ఈ పనులకు సంబందించిన టెండర్ల ప్రక్రియను మాత్రం ఎన్నికల ముందు మొదలుపెట్టారు. శ్రీకా>కుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ పథకం పనులను రెండు విడతల్లో చేపడుతుండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో ఒకే విడతలో అమలుకు టెండర్లు నిర్వహిస్తోంది. రూ. 22 వేల కోట్ల అంచనాతో వాటర్ గ్రిడ్ పథకానికి తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన నేపధ్యంలో అంచనాలు అదనంగా మరో రూ. 3 – 4 వేల కోట్లు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ కింద అదనంగా నిర్మించే మంచినీటి పథకాలకు రూ.852 కోట్లు ఖర్చు అవుతుందని మొదట అంచనా వేయగా తర్వాత ఇది రూ. 994 కోట్లకు పెరిగింది. కొత్త ఎస్ఎస్ఆర్ ధరలను అమలు చేస్తే ఇది మరో రూ. 7 – 10 కోట్ల దాకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పెరిగిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడు జిల్లాలో పథకానికి రూ.10,925 కోట్లు వ్యయం అవుతుందని తొలుత అంచనా వేయగా తర్వాత ఇది రూ.12,525 కోట్లకు పెరిగినట్లు పేర్కొంటున్నారు. ►ఇప్పటికే రుణానికి అనుమతించిన మొత్తం 5,330 కోట్ల రూపాయలు ►తాజాగా అప్పుకు ప్రతిపాదనల విలువ 9,439 కోట్ల రూపాయలు -
‘బాబు’ల కనుసన్నల్లోనే.. బాక్సైట్ మాఫియా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తూర్పు కనుమలుగా పరిగణించే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొండల్లో వందల కోట్ల టన్నులకుపైగా విలువైన బాక్సైట్ ఖనిజ నిక్షేపాలున్నాయి. దేశంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వ రంగ సంస్థలకే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అనుమతులివ్వడానికి వీల్లేదు. ఖనిజంలో అల్యూమినియం 40 శాతం లోపు ఉంటే లేటరైట్‌గా, అంతకు మించి ఉంటే బాక్సైట్గానూ పరిగణిస్తారు. లేటరైట్‌ను సిమెంటు తయారీకి, బాక్సైట్‌ను అల్యూమినియం తయారీకి వినియోగిస్తారు. 2014కి ముందు విశాఖలో తవ్వకాలకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అనుమతులు ఇవ్వలేదు. బాక్సైట్ తవ్వకాలకే కాదు లేటరైట్ తవ్వకాలకూ నాటి ప్రభుత్వాలు అంగీకరించలేదు. 2014లో టీడీపీ సర్కారు కొలువుదీరిన వెంటనే ఖనిజాసురులకు రెక్కలు వచ్చేశాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే కుమారుడు, తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు చెందిన నాయకుడు, విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు, మరో మంత్రి అల్లుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు కలసి ఓ ముఠాగా తయారై తమ బినామీలతో మైనింగ్ కోసం దరఖాస్తు చేయించారు. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ సుందరకోట గ్రామంలో అల్యూమినియం 40 శాతం లోపే ఉందని, అందువల్ల తమకు లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలంటూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన సింగం భవానీతో మైనింగ్ శాఖకు దరఖాస్తు చేయించారు. 2010లో ఆమె దరఖాస్తును తిరస్కరించిన మైనింగ్ శాఖ 2014లో మాత్రం సుందరకోటలో 4.97 హెక్టార్లలో 20 ఏళ్ల పాటు తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. మంత్రి అనుచరులకు లీజులు ఇదే క్రమంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పిట్టాచలం గ్రామస్తుడు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు కిల్లో లోవరాజుకు 2015లో తొరడ గ్రామంలో 20 ఏళ్ల పాటు లేటరైట్ తవ్వకాలకు లీజు అనుమతులిచ్చారు. బమిడికలొద్దు గ్రామంలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో లేటరైట్ తవ్వకాలకు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు జర్తా లక్ష్మణరావుకు కూడా లీజు అనుమతిలిచ్చారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు.. విశాఖ మన్యంలోనూ కొన్నాళ్లుగా తవ్వకాలు సాగిస్తున్నారు. చింతపల్లి మండంలం రాజుపాకలు, గూడెంకొత్త వీధిలో జడుమూరు. చాపరాతి పాలెం, రంపుల వద్ద కొండలు తొలిచేస్తున్నారు. భూ కుంభకోణాల్లో ప్రధానంగా పేరు వినిపించిన ఓ మంత్రి అల్లుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు, అతడి సన్నిహితులు కలిసి కొన్నేళ్లుగా మన్యంలోని కొండల్లో మైనింగ్ చేస్తున్నారు. వీరంతా లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారనే విషయాన్ని గనుల శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అవి బాక్సైట్ నిల్వలేనన్న గనులశాఖ విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడులో ఉన్న నిక్షేపాలు లేటరైట్ గనులు కావని అవి బాక్సైట్ నిల్వలేనని గనుల శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ లభ్యమయ్యే ఖనిజంలో 44 శాతానికి పైగా బాక్సైట్ ఉన్నట్టు తేల్చింది. కానీ గత నాలుగున్నరేళ్లుగా లేటరైట్ పేరిటే బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారు. ఇలా వీరందరికీ తవ్వుకునేందుకు లీజులు ఇప్పించిన సర్కారు పెద్దలు ఓ కచ్చితమైన నిబంధన విధించారు. ఎవరు ఎక్కడ ఎంత తవ్వుకున్నా చివరకు మెటీరియల్ మాత్రం ‘ఆండ్రు మినరల్స్’కే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రి లోకేష్ దగ్గరుండి మరీ ఈ పంచాయితీ చేసినట్టు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మైనింగ్ వ్యాపారవేత్త వెల్లడించారు. ఆండ్రూ దోచిందెంత..? మార్కెట్లో టన్ను లేటరైట్ రూ.850 దాకా ఉండగా బాక్సైట్ రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర పలుకుతోంది. అంటే లేటరైట్ కంటే బాక్సైట్తోనే రెట్టింపు ఆదాయం లభిస్తోందని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో మైనింగ్ శాఖ అనుమతించిన ప్రాంతాల్లో తవ్విన మొత్తం సుమారు 2 కోట్ల టన్నులకుపైనే ఉంటుందని అంచనా. ఆండ్రు మినరల్స్ గత నాలుగున్నరేళ్లలో నెలకు సగటున 4 లక్షల టన్నుల బాక్సైట్‌ను కొనుగోలు చేసి అల్యూమినియం కర్మాగారాలకు విక్రయిస్తోందని ఓ మైనింగ్ వ్యాపారి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. అంటే సగటున ఏడాదికి 48 లక్షలు... నాలుగున్నరేళ్లలో సుమారు 2 కోట్ల టన్నులకుపైనే క్రయవిక్రయాలు చేసిందని అంచనా. ఈ లెక్కన రూ.3,000 కోట్లకుపైగా టర్నోవర్ చేసి ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇందులో సింహభాగం వాటా ముఖ్యనేత, అధికార పార్టీ ముఖ్యులకు ఉండటంతో ఈ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. ఆండ్రు మినరల్స్ లేటరైట్ పేరిట టన్నుకు రూ.200 రాయల్టీ, రూ.37 పన్ను, 5 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లిస్తూ రెట్టింపు విలువైన బాక్సైట్‌ను తరలిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా బడా‘బాబు’కు రూ.వందల కోట్లు నజరానాగా ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం ఆండ్రూ రమేష్‌బాబు భరించేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అందువల్లే మన్యం సహా తూర్పు కనుమల్లో బాక్సైట్ నిక్షేపాలను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నా ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. ఎవరీ ‘ఆండ్రూ’..? తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన ఆండ్రు రమేష్‌బాబు తొలుత పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో స్టోన్క్రషర్గా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తూర్పు గోదావరి జిల్లాలోని మహేశ్వరి మినరల్స్ సంబంధీకులతో తొలుత సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత వారితో విభేదించాడు. అనంతరం మైనింగ్ రంగంలోకి దిగిన రమేష్‌బాబు తన సోదరుడు ఆండ్రు శ్రీనివాస్ అలియాస్ బాబీతో కలిసి ఆండ్రూ మినరల్స్ స్థాపించి స్వల్ప కాలంలోనే మైనింగ్ మాఫియాగా అవతరించాడు. తూర్పు గోదావరి జిల్లా వంతాడ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఏలేశ్వరంలో గనులు లీజుకు తీసుకుని తవ్వకాలు మొదలుపెట్టిన రమేష్‌బాబు 2014 తర్వాత ఈ నాలుగున్నరేళ్లలోనే తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్న బాక్సైట్ కొండలపై గుత్తాధిపత్యం సాధించాడు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎవరు, ఎక్కడ మైనింగ్ చేసినా రమేష్‌బాబుకే విక్రయించాలని మంత్రి లోకేష్ దగ్గరుండి పంచాయితీ చేశారు. ఆండ్రూ మినరల్స్‌కు అమ్మాలని షరతు విధించడంతోపాటు గనులశాఖ ఆంక్షలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వుకోవచ్చని అడ్డగోలుగా అనుమతులిచ్చేశారు. దీంతో ఎవరు ఎక్కడ తవ్వకాలు చేపట్టినా మెటీరియల్ మాత్రం ఆండ్రు మినరల్స్‌కే విక్రయిస్తూ వస్తున్నారు. పచ్చని తూర్పు కనుమల్లో అధికారం అండతో మైనింగ్ మాఫియా గాండ్రిస్తోంది! టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లుగా లేటరైట్ ముసుగులో ఇక్కడ సాగిస్తున్న ఖనిజ దోపిడీ, విచ్చలవిడి అమ్మకాలు చూస్తే ఇదంతా బడా‘బాబు’ల డైరెక్షన్లో సాధ్యమనే సంగతి బోధపడుతోంది. గిరిజనులను బినామీలుగా చేసుకుని.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వి పోస్తూ.. గోరంత అనుమతులతో కొండలకు కొండలు కరిగించేసి కోట్లు కొల్లగొడుతున్న అధికార పార్టీ నేతలు, మంత్రుల కుమారులు ఇక్కడ తవ్విన ఖనిజాన్ని కేవలం ఒక్కడికే కట్టబెట్టాలి. ఆ ఒక్కడే అన్నీ కొనుగోలు చేసి సిమెంట్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలకు విక్రయించుకుని భారీగా వెనకేసుకుంటున్నాడు. ఆ ఒక్కడికే గుత్తాధిపత్యం కట్టబెట్టినందుకు పెద్ద‘బాబు’కు రూ.వందల కోట్లు నజరానాగా ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఖర్చును భరించేలా ఒప్పందం కుదిరింది. ఇంతకీ ఆ ఒక్కడు ఎవరు..? అతడి గుత్తాధిపత్యం గుట్టు ఏమిటి? అనే తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్లాల్సిందే. ఆయనకే ఎందుకు అమ్ముతున్నారో తెలియదు ‘విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతి పరిధిలోని గ్రామాల్లో మైనింగ్ చేస్తున్న ఖనిజాన్ని లీజుదారులందరూ ఆండ్రూ మినరల్స్‌కే విక్రయిస్తున్నారనే విషయం నాకూ తెలిసింది. వాస్తవానికి లీజుల వరకే మా ప్రమేయం ఉంటుంది. మైనింగ్ తర్వాత మెటీరియల్ ఎవరికి అమ్ముకుంటారో మాకు సంబంధం లేదు. గతంలో కొన్ని ఫ్యాక్టరీలకు నేరుగా విక్రయించారు. కానీ ఇప్పుడు ఆండ్రుకే అమ్ముతున్న విషయం వాస్తవమే. అది ఎందుకో మాకు తెలియదు. మాకు ఆ అవసరం లేదు కూడా.’ – శివాజీ, మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు(ఏడీ) -
మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు
సాక్షి, కర్నూలు : ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన జిల్లాలోని గూడూరు మండలం నాగలాపురంలోని పంటలను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై మంత్రి లోకేశ్‌ను మహిళలు నిలదీశారు. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయనను కోరారు. అయితే, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కుదరదని, నీళ్ల ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. -
ఎన్టీఆర్‌ను సీఎం చేసిన ఘనత ఇందిరాగాంధీదే
సాక్షి, కర్నూలు: ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన బ్రాహ్మణకొట్కూరులో ఈ వ్యాఖ్యలు చేశారు. తడబడుతూ చేసిన ప్రసంగంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆనాడు ఫుల్ మెజార్టీ ఉన్నా అన్నగారిని దింపితే తెలుగు ప్రజలు గర్జించారని చెప్పారు. ఆ గర్జనను తట్టుకోలేక మళ్లీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని పేర్కొన్నారు. వర్ధంతిని జయంతి అనడం, జయంతిని వర్ధంతి అనడం, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందనడం, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనల్ని మనమే ఉరి వేసుకున్నట్లు అనడం ఇంతకుముందు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించిన మంత్రి వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా బుట్టా రేణుకను, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు పాతబస్తీలోని ఉస్మానియా కళాశాల మైదానంలో మైనార్టీ పొదుపు మహిళల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ బడ్జెట్లో రూ.16,000 కోట్ల మేర లోటు ఉండేదని, ఆ లోటును సీఎం చంద్రబాబు పూడ్చడమే కాకుండా లోటు రహిత బడ్జెట్‌ను రూపొందించారని చెప్పారు. మంచి పాలన చూసి ఓర్వలేక ప్రధాని మోదీ తమపై కక్ష కట్టారని విమర్శించారు. గొంతెమ్మ కోరికలు కోరొద్దు! వివిధ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన పలువురిపై మంత్రి లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరిన ఉద్యోగులపై ఆగ్రహించారు. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరవద్దన్నారు. ఇది రాష్ట్ర పరిధిలో లేని విషయం అని మీకు తెలియదా అంటూ మండిపడ్డారు. కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఉద్రిక్తత మెడికల్ సీట్ల భర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వెంటనే మొదటి విడత కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు మంత్రి లోకేశ్ కాన్వాయ్‌ను రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద అడ్డుకున్నారు. ఐదుగురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విద్యార్థి నేతలతో మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ సీట్ల భర్తీ విషయం తన శాఖ పరిధిలోకి రాదంటూ తప్పించుకున్నారు. -
‘వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు లోకేష్‌కు లేదు’
సాక్షి, నెల్లూరు : దళితులకు చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీకి లేదని వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో నిర్వహించిన దళిత తేజం కార్యక్రమానికి స్పందన లేదని కాకాణి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పదివేల మంది కూడా సభకు రాలేదని తెలిపారు. అందుకు ఆశ వర్కర్లు, అంగన్వాడీ, పొదుపు మహిళలను తీసుకువచ్చారని కాకాణి పేర్కొన్నారు. దళితులు ఎవరూ సీఎం చంద్రబాబును నమ్మడం లేదనడానికి ఇదే నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు టీడీపీ మంత్రి లోకేష్‌కు లేదని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు దివంగత నేత ఎన్టీఆర్ భారత రత్న ఇప్పించారని చంద్రబాబు చెప్పడం సరికాదని కాకాణి పేర్కొన్నారు. దేశానికి చేసిన సేవలతో రత్నంలా అంబేడ్కర్ ఎదిగారని కొనియాడారు. ఆయనకు ఎవరి సిఫారసు అక్కర్లేదన్నారు. సీఎం రమేష్ దీక్షపై అందరికి అనుమానాలున్నాయని కాకాణి తెలిపారు. రమేష్‌ది ఉక్కు దీక్ష కాదు.. తుక్కు దీక్ష అని టీడీపీ ఎంపీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఏపీ డీజీపీ నియామకంలో లోకేష్ హస్తం!
-
గొప్పలకు పోతే ‘పప్పు'లుడకవ్
సాక్షి, అమరావతి: యాపిల్.. శ్యాంసంగ్.. టీసీఎస్.. మైక్రోసాఫ్ట్ కంపెనీల తరహాలో రాష్ట్రానికి నేను ‘ఫ్లెక్స్ ట్రానిక్స్’ను తెచ్చానంటూ ఐటీ, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడంపై సోషల్ మీడియాలో నిరుద్యోగులు, నెటిజన్ల నుంచి తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లడం, పలు అగ్రశ్రేణి కంపెనీలు వస్తున్నట్లుగా నాలుగేళ్లుగా ఊదరగొట్టినా ఒక్కటీ రాకపోవడం, రూ. లక్షల కోట్ల పెట్టుబడులంటూ రూ.వందల కోట్లు కూడా తేలేకపోవడం ఇదంతా టీడీపీ సర్కారు ప్రచార ఆర్భాటం అని ఎవరికి తెలియదు? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మీరు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఐటీ శాఖ పురోగతి ఏమిటి? నాలుగేళ్లుగా ఐటీ గ్రోత్ రేట్ ఎంతో చెప్పగలరా?’ అని లోకేష్‌ను ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ నాలుగేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలిగే ధైర్యముందా? అని సూటిగా అడుతున్నారు. కొన్ని అనామక కంపెనీలను తెచ్చి భారీ ఉపాధి అవకాశాలంటూ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతుంటే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నవే మూతపడుతున్నాయని, ఈ పరిస్థితికి కారణం ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 80,000 మంది ఐటీలో ఉపాధి పొందుతుండగా ఆయన హయాంలో 1.50 లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించి ఐటీ ఉద్యోగాలను 2.30 లక్షలకు చేర్చారని గుర్తు చేస్తున్నారు. మరి అలా చెప్పుకోవడానికి మీ దగ్గర ఏముంది? అని లోకేష్‌ను ప్రశ్నిస్తున్నారు. ఒక్కటైనా ఇన్నోవేషన్ కేంద్రాలుగానీ, స్టార్టప్ కంపెనీలుగానీ ప్రారభించి ఫలితాలు రాబట్టగలిగారా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను తెలియచేస్తున్న ‘సాక్షి’పై నారా లోకేష్ అక్కసు వెలిబుచ్చుతుండటం గమనార్హం. తాను ‘ఫ్లెక్స్ట్రానిక్’ను రాష్ట్రానికి తెస్తే అన్ని పత్రికలు బాగా ప్రాధాన్యతనిస్తే ‘సాక్షి’ మాత్రం చిన్న వార్తను ఇచ్చి సరిపెట్టిందని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ‘సాక్షి’కి కనిపించడం లేదా? అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మీ ప్రతిభ ఏముంది? ‘ఫ్లెక్స్ ట్రానిక్స్’ రాష్ట్రంలో ఏర్పాటు కావటంలో మీ ప్రతిభ ఏముందని లోకేష్‌ను నెటిజన్లు, పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన శ్రీసిటీ సెజ్‌లో ‘ఫ్లెక్స్’ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని, దీనికి అందించే రాయితీలన్నీ కేంద్రమే భరిస్తోందని పేర్కొంటున్నారు. మరి ఈ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడంలో టీడీపీ సర్కారు పాత్ర ఏముందని ప్రశ్నిస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్ ఏర్పాటు విషయంలో కూడా చంద్రబాబు ఇదేవిధంగా ప్రచారం చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధాన మోదీ కొరియా పర్యటన సందర్భంగా కియా మోటార్స్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తే ఇప్పుడు ఇదంతా తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు. నాలుగేళ్లలో పెద్ద కంపెనీ ఒక్కటీ రాలేదు.. 2019 నాటికి రాష్ట్రంలో రెండు లక్షల ఐటీ ఉద్యోగాలంటూ మంత్రి లోకేష్ చేస్తున్న ప్రచారంలో డొల్లతనం ఇటీవల కలెక్టర్ల సదస్సులో బట్టబయలైంది. రాష్ట్ర ఐటీ రంగంలోకి రూ. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్న ప్రచారాన్ని అధికారిక గణాంకాలే ఖండిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏపీకి ఐటీ రంగంలో కేవలం రూ.1,765 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, ఒక్క పెద్ద కంపెనీని కూడా ఆకర్షించలేకపోయామని కలెక్టర్ల సదస్సులో ఐటీపై రివ్యూ సందర్భంగా అధికారులే స్పష్టం చేశారు. హెచ్‌సీఎల్ కూడా రాష్ట్రంలో ఐటీ సర్వీసులను కాకుండా కేవలం పరిశోధన, నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మంగళగిరి, విజయవాడ ఐటీ పార్కుల్లో చిన్న స్థాయి డీటీపీ, పేటీఎం కాల్ సెంటర్ లాంటి వాటిని పట్టుకుని ఐటీ కంపెనీలంటూ లోకేష్ చెప్పుకోవడాన్ని చూస్తుంటే ప్రచారంలో తండ్రిని మించిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
రాయితీలపై బండరాయి!
‘కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాయితీలు ఇచ్చే ప్రశ్నే లేదు. స్టీలు ప్లాంటు కోసం రాయితీలు కేంద్రానికి ఎందుకివ్వాలి? – మీడియాతో ఇష్టాగోష్టిలో మంత్రి లోకేష్ ‘బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్ని రకాల రాయితీలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే సగం ఖర్చు భరిస్తాం. అక్కడ ప్లాంట్ ఏర్పాటు వల్ల ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజనులకు 15 వేల ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ప్రైవేట్ సంస్థలకే అనేక రాయితీలిస్తున్నాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటే అవసరమైనవన్నీ సమకూరుస్తాం’ – ప్రధానితో భేటీ అనంతరం తెలంగాణ మంత్రి కేటీఆర్ చూశారుగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను రప్పించేందుకు పొరుగు రాష్ట్రం ఎంత సన్నద్ధంగా ఉందో! ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలతోపాటు అభివృద్ధి దిశగా రాష్ట్రం పరుగులు తీసే అవకాశాన్ని ఎవరు మాత్రం కాలదన్నుకుంటారు?.. ఒక్క టీడీపీ సర్కారు మినహా! తాజాగా స్టీల్ ప్లాంట్ నెలకొల్పే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రాయితీలు కల్పించబోమంటూ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం పట్ల పారిశ్రామికవర్గాల్లో, ప్రజల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీకి రావాల్సిన కేంద్ర సంస్థలను పట్టించుకోకుండా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తామంటూ దావోస్ తదితర చోట్లకు విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై అధికార టీడీపీ అసలు బండారం బయటపడింది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకుని కూడా ఉక్కు కర్మాగారాన్ని సాధించకుండా ఇప్పుడు నిరాహార దీక్షల పేరుతో టీడీపీ ఆడుతున్న నాటకాలు కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో తేటతెల్లమయ్యాయి. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్థంగా ఉందని, కానీ ఈ ప్రాజెక్టుకు ఇచ్చే రాయితీల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడమే జాప్యానికి అసలు కారణమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ బుధవారం ఢిల్లీలో తనను కలసిన టీడీపీ ఎంపీలకు స్పష్టం చేయడం గమనార్హం. దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇచ్చే రాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చకపోవడమే కడప ఉక్కు కర్మాగారంపై ఆలస్యానికి కారణమని తేలిపోతోంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ మంగళవారం చేసిన ప్రకటన కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. కడప ఉక్కు యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ఇవ్వదని, మొత్తం ఖర్చంతా కేంద్రమే భరించాల్సి ఉంటుందని లోకేష్ ప్రకటించారు. దీనికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగం భరించడానికి ముందుకు రావడం గమనార్హం. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా 15,000 మంది గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించే బయ్యారం ఫ్యాక్టరీకి అయ్యే ఖర్చులో అవసరమైతే సగం భరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విలేకరులకు వెల్లడించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా... 2009లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా బీహెచ్ఈఎల్– ఎన్టీపీసీ యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పేందుకు భారీగా రాయితీలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ యూనిట్ ఏర్పాటుకు ఎకరం రూ.100 నామమాత్రపు ధరతో 750 ఎకరాలతో పాటు అనేక రాయితీలను వైఎస్ కల్పించారు. నాడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో శంకుస్థాపన చేయించడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వేరే రాష్ట్రానికి తరలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెనుకబడిన రాయలసీమ ప్రజల జీవితాన్ని మార్చే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. కనీసం యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఎక్కడ కేటాయిస్తుంది? కరెంట్, నీటి సరఫరా లాంటి కీలక అంశాలను కూడా వెల్లడించకుంటే ఫీజిబిలిటీ నివేదిక ఎలా ఇస్తామని మెకాన్ సంస్థ ప్రశ్నిస్తోంది. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు సిద్ధమైనా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు రంగ సంస్థలు పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. కానీ ప్రాజెక్టులు ఏర్పాటు కావడానికి అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇదే విషయాన్ని చమురు రంగ సంస్థల ప్రతినిధులు అనేకసార్లు స్పష్టం చేశారు. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్ వంటి సంస్థలు ఏకంగా రాష్ట్రంలో రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. వైజాగ్–కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు అయితే సుమారు రూ.3.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ఒక్క హెచ్‌పీసీఎల్ రూ.55,000 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. హెచ్‌పీసీఎల్, గెయిల్‌తో కలిసి కాకినాడలో మరో రూ.40,000 కోట్లతో క్రాకర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైవేట్‌కు పెద్దపీట.. పూర్తిగా వ్యాపార ప్రయోజనాల కోసం పనిచేసే ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుండటం గమనార్హం. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌కు ఉచితంగా భూములు కేటాయించడమే కాకుండా పలు రాయితీలను ప్రకటించింది. రాజధానిలోని మల్లవరం వద్ద అశోక్ లేలాండ్‌కు, ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు ఎంవీవీఎస్ మూర్తి కుటుంబానికి చెందిన వీబీసీ పెట్రో కెమికల్స్‌కు జగ్గయ్యపేటలో, నాచు కార్పొరేషన్‌కు కర్నూలు జిల్లాలో ప్రభుత్వం భూములు కేటాయించింది. విశాఖ నడిబొడ్డున దుబాయ్‌కి చెందిన లూలూ గ్రూపు వాణిజ్య భవన సముదాయం నిర్మాణానికి తక్కువ ధరకు భూములు కేటాయించడమే కాకుండా రూ.వేల కోట్లలో ప్రయోజనం కల్పించింది. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తే కమీషన్లు దండుకోవచ్చని, అదే కేంద్ర సంస్థలకు రాయితీలు ఇస్తే కమీషన్లు ఉండవనే ఉద్దేశంతోనే వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్‌కు కారుచౌకగా భూములు రాజధాని అమరావతిలో కూడా కేంద్ర సంస్థలకు భూములను రూ.కోట్ల ధరకు కేటాయిస్తూ ప్రైవేట్ సంస్థలకు మాత్రం చౌకగా రూ.లక్షల ధరకు అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు. ఎస్బీఐ, సిండికేట్ బ్యాంక్, ఎల్ఐసీ వంటి సంస్థలకు ఎకరం స్థలాన్ని రూ.4 కోట్ల ధరతో కేటాయిస్తే ఆర్బీఐ, నేవీ సంస్థలకు ఎకరం కోటి రూపాయలకు కేటాయించారు. మరోవైపు ప్రైవేట్ విద్య, వైద్య సంస్థలకు ఎకరం స్థలాన్ని రూ.10 లక్షలకే ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయితీలపై స్పష్టత ఇవ్వాల్సింది ఏపీనే సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన రాయితీల విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ ఎంపీలు కొణకళ్ల నారాయణ, మాగంటి బాబు, దివాకర్‌రెడ్డి, రవీంద్రబాబు, మాల్యాద్రి శ్రీరామ్, మురళీమోహన్ తదితరులు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి, ముడిసరుకు సరఫరా (లింకేజ్)పై కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఈ వివరాలు ఇవ్వగానే మెకాన్ సంస్థ అధ్యయనం అనంతరం ప్లాంట్ ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని వెల్లడించగలుగుతామని స్పష్టం చేశారు. గడువు చెప్పమంటే ఎలా! కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు మధ్యలో కలుగజేసుకొని అసలు ఎప్పట్లోగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారో నిర్దిష్ట గడువును చెప్పాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ అసలు రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వకుండానే ప్లాంట్ ఏర్పాటుకు నిర్దిష్ట గడువు చెప్పమంటే ఎలా! అంటూ అసహనం వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పార్టీ ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
ఆ ఇద్దరే.. కాల్‌నాగులు!
విజయవాడలో కాల్‌నాగులు మళ్లీ చెలరేగిపోయారు. అందరూ సద్దుమణిగిందనుకున్న ఈ దందా నగరంలో చాపకింద నీరులా వ్యాపిస్తుందనే విషయం బుధవారం చోటుచేసుకున్న ఘటనతో రుజువైంది. ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు నగరాన్ని చెరిసగం చొప్పున పంచేసుకుని మరీ కాల్‌మనీ వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. 15 శాతం నుంచి 25 శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పుల వసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. లేదంటే ఆస్తులు గుంజుకుంటున్నారు. బాధితులు ప్రశ్నిస్తే దాడులకు సైతం తెగబడుతున్నారు. ఆస్తులు కోల్పోయిన వారు గగ్గోలు పెడుతున్నా ఆలకించే నాథుడే కరువయ్యాడు. సాక్షి, అమరావతిబ్యూరో : కాల్‌మనీ వ్యాపారంలో విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు సూత్రధారులు... వారిద్దరి అనుచరగణం పాత్రధారులుగా ఉన్నారు. దాదాపు రూ.100 కోట్ల మేర టర్నోవర్ చేస్తున్నారు. కాల్‌మనీ దందా మళ్లీ జూలు విదిలిస్తోంది. వేధింపులతో పసుపులేటి పద్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించడంతో మరోసారి ఈ దందా ఆగడాలు బహిర్గతమయ్యాయి. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల్లో ఒకరు ఒకప్పుడు ఇంద్రకీలాద్రి మీద చిన్న షాపు నిర్వహించేవారు. సినిమా టిక్కెట్ల బ్లాక్ దందా నుంచి ఆయన చేయని పనంటూ లేదు. టీడీపీ అండతో అలా అక్రమ వ్యాపారంతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ప్రజాప్రతినిధి అయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అక్రమాల విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. అందులో ప్రధానమైనదే కాల్‌మనీ రాకెట్. ఆ ప్రజాప్రతినిధి ఏకంగా 60 మంది వరకు అనుచరులను పెట్టుకుని ఈ రాకెట్‌ను విస్తరించారు. నగరంలోని మల్లికార్జునపేట, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కాళేశ్వరమార్కెట్తోపాటు వన్‌టౌన్ అంతటా వేళ్లుకున్నారు. చిరువ్యాపారులు, గృహిణులు, మధ్యతరగతి వర్గీయుల ఆర్థిక అవసరాలను అవకాశంగా మలచుకుని అత్యధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. అనంతరం వడ్డీలు, చక్రవడ్డీలతో సహా వసూళ్ల పేరుతో వేధిస్తున్నారు. అప్పు వసూళ్ల పేరుతో దుకాణాలు, ఇళ్లు, ఇతర ఆస్తులను గుంజుకోవడం పరిపాటిగా మారింది. ఆ ప్రజాప్రతినిధి దాదాపు రూ.50 కోట్లకు పైగా కాల్‌మనీ టర్నోవర్ సాగిస్తున్నట్లు అంచనా. జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, ఇతరులకు అవసరమైతే క్షణాల్లో కోట్లు సమకూర్చిపెట్టగలరని పేరుపొందారు. మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందారు. ‘సెంట్రల్’ దందా ఈయనదే కాల్‌మనీ రాకెట్ సూత్రధారి అయిన మరో ప్రజాప్రతినిధి అంటేనే విజయవాడ హడలెత్తిపోతోంది. అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆయన 2014 నుంచి కబ్జాలు, దాడులతో నగరాన్ని హడలెత్తిస్తున్నారు. ఆయన పకడ్బంధీగా కాల్‌మనీ దందాను సాగిస్తున్నారు. బీసెంట్ రోడ్డు నుంచి అజిత్‌సింగ్‌నగర్ వరకు వాణిజ్య ప్రధాన కేంద్రాన్ని ఆయన గుప్పిట పట్టారు. ఆయన అనుచరులతో పది వరకు బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరీ కాల్‌మనీ రాకెట్ నిర్వహిస్తున్నారు. ఆయన కూడా దాదాపు రూ.50 కోట్ల మేర టర్నోవర్ సాగిస్తున్నారు. రాజరాజేశ్వరిపేటలో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిమరీ కాల్‌మనీ రాకెట్ అరాచకాలు సాగిస్తున్నారు. తాము చెప్పినంత వడ్డీలు చెల్లించలేకపోయినవారిని ఆ కార్యాలయానికి పిలిపించి మరీ దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. బాధితుల షాపులు, ఆస్తులు తమ పేరిట రాయించుకున్నారు. రాజకీయ ఒత్తిడికి పోలీసులు... రాజధానిలో కాల్‌మనీ దందా ఇంత నియంతృత్వం ప్రదర్శిస్తున్నా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది. విజయవాడలో 2015లో కాల్‌మనీ రాకెట్ మొదటి సారి బయటపడినప్పుడు పోలీసు యంత్రాంగం కొంత హడావుడి చేసింది. కాల్‌మనీ కేసుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. కానీ తరువాత ఆ సెల్ క్రియాశీలంగా వ్యవహరించలేకపోయింది. మళ్లీ రెండేళ్లుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న కాల్‌మనీ దందాకు అడ్డుకట్ట వేయడంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందింది. ప్రధానంగా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులే ఈ దందాకు సూత్రధారులు కావడం పోలీసులు చోద్యం చూస్తుండిపోతున్నారు. పలువురు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటిని పోలీస్స్టేషన్స్థాయిలోనే అధికార పార్టీనేతలకు అనుకూలంగా సెటిల్మెంట్లు చేసేస్తూ కప్పిపుచ్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో టీడీపీ నేతల కాల్‌మనీ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఆ ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు కోట్లు కొల్లగొడుతున్నారు. -
మహిళలు సీరియల్స్ చూసి ఆనందించాలి: లోకేష్
చీరాల: మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థన మేరకు రూ.25 కోట్ల నిధులతో సీసీ రోడ్లు నిర్మానానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ నియోజకవర్గంలో 225 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరగలేదని అందులో చీరాల మండలానికి రూ.10 కోట్లు, వేటపాలెం మండలానికి రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తన పర్యటన ముగింపునకు కొద్దిరోజుల క్రితమే చీరాల నియోజకవర్గానికి బీటీ రోడ్లు నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించానని, కొద్ది రోజుల్లో రూ.15 కోట్లు కేటాయించి 225 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. రామాపురంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ మత్య్సకారుల సంక్షేమానికే టీడీపీ ప్రభుత్వం పాటు పడుతోందని, మత్య్సకారులందరికీ డీజిల్ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 150 మందికి ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్లు, ముఖద్వారం ఏర్పాటు చేస్తానన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అందుకే సీరియల్స్ చూసి ఆనందంగా ఉండాలంటూ మహిళలకు సూచించారు. 2020 నాటికి రాష్ట్ర అబభివృద్ధిలో అగ్రభాగాన నిలిపి అంగన్ వాడీ భవనాలు, ఎల్ఈడీ భవనాలు, సీసీ రోడ్లు నిర్మించి ఇస్తామన్నారు. దిక్కులేని రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని సభలో లోకేష్ వాఖ్యానించారు. రైతు రుణమాఫీకి నియోజకవర్గానికి రూ.1.30 కోట్లు విడుదల చేశామన్నారు. హార్బర్ రాదు.. ‘కేంద్రం, రాష్ట్రాన్ని మోసం చేసింది..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా వేధించింది. మత్య్సకారుల చిరకాల వాంఛ అయిన హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు. నీతి ఆయోగ్ పథకం ఒట్టిదే’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వేటపాలెం మండలం రామాపురంలో జరిగిన మత్య్సకారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం 11 గంటలు కష్టపడుతున్నారని, మత్య్సకారుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. మత్య్సకారులకు ముఖ్యమైన హార్బర్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఆమంచి అడుగగా మంత్రి ఆదినారాయణ మాత్రం కేంద్రం హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు....సాగర్ మాల అంతా బూటకం అని వాఖ్యానించారు. డబ్బులు, పెట్రోల్ ఫ్రీ మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు చీరాలకు వచ్చిన మంత్రి లోకేష్ పర్యటనలో తన ఓటు బ్యాంకును చూపించుకోవడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి గ్రామాల నుంచి జన సమీకరణ చేశారు. ప్రతి గ్రామానికి 4 నుంచి 6 ప్రైవేటు స్కూళ్ల బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు బైక్ ర్యాలీతో స్వాగతం పలికించారు. టూవీలర్‌కు 2 లీటర్ల పెట్రోల్, డబ్బులు, పార్ట స్టికర్లు పంపిణీ చేశారు. ఆమంచి వర్సెస్ కలెక్టర్ చీరాల: మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన కొత్తపేట జెడ్పీ హైస్కూల్ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆమంచి మధ్య వాగ్వాదం జరిగింది. హైస్కూల్ నిర్మించిన స్థల వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు. అసలు కొత్తపేట హైస్కూల్ ప్రారంభానికే వచ్చినప్పటికీ కలెక్టర్ సూచనల మేరకు మంత్రి లోకేష్ వెనుతిరిగారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొత్తపేటలో హైస్కూల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో రూ.2.20 కోట్ల అంచనాలతో కేవలం 50 రోజుల్లోనే నూతన భవంతులు నిర్మించారు. ఈ స్కూల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, డైనింగ్ హాల్, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా స్కూల్ నిర్మాణం చేశారు. అయితే కొత్తపేట హైస్కూల్ నిర్మించిన స్థలం ది ఐఎల్టీడీ కోపరేటివ్ సొసైటీకి చెందింది. అందులో కార్మికులు కొందరికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కాగా ఇదే స్థలంలో హైస్కూల్ నిర్మాణం చేపట్టడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో కేసు నడుస్తుండగా స్టే కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో చీరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి అల్పాహారానికి వెళ్లారు. లోకేష్‌తో పాటుగా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులున్నారు. ఇక్కడ సమస్యను కలెక్టర్ వినయ్‌చంద్ లోకేష్‌కు వివరించారు. దీనిపై ఆగ్రహం చెందిన ఆమంచి.. కలెక్టర్‌తో విభేందించారు. ఉదయం 8 గంటలకే మంత్రి లోకేష్‌తో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖాముఖి అన్నారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు పాఠశాల ప్రారంభం కానీ, ముఖాముఖి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
మరోసారి నోరు పారేసుకున్న మంత్రి లోకేష్
-
పవన్.. ఆధారాలుంటే చూపించు: లోకేశ్
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పవన్ తనపై చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని లోకేశ్ అన్నారు. పవన్ అంటే వ్యక్తిగతంగా తనకు గౌరవమేనని పేర్కొన్నారు. పవన్ చుట్టు కొందరు చేరి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి లోకేశ్ అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన అవినీతిని చూసి తాత ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభించి ఉంటుందని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. లోకేశ్, టీడీపీ నేతల అవినీతి, అక్రమాలపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లు టీడీపీకి మిత్రపక్షంగా ఉంటూ.. పల్లెత్తు మాట అనని పవన్.. ఒక్కసారిగా లోకేశ్‌ను టార్గెట్ చేసి.. అవినీతి ఆరోపణలు చేయడంతో టీడీపీని కుదిపేసింది. -
అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి...
సాక్షి, అమరావతి: అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. మంత్రి అమెరికా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. కార్యకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ ‘మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోంది’అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. 67 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. అందుకే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని తెలిపారు. -
అన్ని కోర్సుల్లోనూ ఐటీ: సీఎం
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు, రోబో టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లోకి రూ.వేల కోట్ల పెట్టుబడులు తరలి రానున్నాయని, వాటిని అందిపుచ్చుకునే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించు కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖ అధికారులకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లోనూ ఎప్పటికప్పుడు నూతనత్వం ఉండాలని చెప్పారు. చంద్రబాబు శనివారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సమీక్ష నిర్వహించారు. ఇటీవలే ఫిన్‌టెక్, అగ్రిటెక్, ఎడ్యుకేషన్ ఈవెంట్లను విజయవంతం చేశామని, ప్రతినెలా ఏదో ఒక సదస్సు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకోవచ్చని తెలిపారు. అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ ఐటీని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సూచించారు. అగ్రికల్చర్, మెడికల్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లోనూ ఐటీని తప్పనిసరి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు యువతకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 27న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో 5 లక్షల పంట కుంటలను జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. -
రెండింతలిస్తాం.. మీ ఆస్తులిచ్చేస్తారా?
-
రెండింతలిస్తాం.. మీ ఆస్తులిచ్చేస్తారా?
పీలేరు: సీఎం కుటుంబ సభ్యులు ప్రకటించిన ఆస్తుల విలువకంటే రెండింతలు ఎక్కువ ఇవ్వడానికి తాము సిద్ధమని, మీ ఆస్తులు ఇచ్చేస్తారా అంటూ మంత్రి లోకేష్‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాలు విసిరారు. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కుటుంబం బూటకపు ఆస్తుల వివరాలు ప్రకటించి ప్రజల్ని మభ్యపెడుతోందని విమర్శించారు. ఆస్తుల ప్రకటనను ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు. కల్లబొల్లి మాటలతో నీతివంతులమని గొప్పలు చెప్పుకోవడానికి శ్రమిస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు దమ్ము, ధైర్యముంటే వారు ప్రకటించిన దానికంటే రెండింతలు ఎక్కువ తీసుకుని కుటుంబసభ్యుల ఆస్తులను వదిలేయాలని సవాలు విసిరారు. తద్వారా వచ్చిన డబ్బుల్ని రైతుల రుణమాఫీకి, డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో విశాలమైన భవంతి ఎందుకు? రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 24 గంటలూ కష్టపడుతున్నారని, నిరాడంబరంగా గడుపుతున్నారని, చేతికి ఉంగరం కూడా లేదని నీతులు చెబుతున్న లోకేష్ హైదరాబాద్‌లో విశాలమైన భవంతి ఎందుకు నిర్మించారో చెప్పాలని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కాపురమున్నవారు ఎన్ఆర్ఐలు అన్న లోకేష్ వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావిస్తూ.. కల్లబొల్లి మాటలు కట్టబెట్టి హైదరాబాద్‌లో కట్టిన ఇల్లు అమ్మేసి అమరావతిలో ఇల్లు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ నివాసి కావాలని సూచించారు. -
‘నంది’తో పరువుపోయింది
సాక్షి, అమరావతి: నంది అవార్డుల ప్రకటనతో పరువు పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇంత రచ్చ అవుతుందని తాను అనుకోలేదని, ఇంత రాద్ధాంతం జరుగుతుందనుకుంటే ఇలా చేసే వాడిని కాదని అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నంది అవార్డుల ప్రకటన తీవ్ర వివాదాస్పదంగా మారి అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. టీడీపీ నేతల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అవార్డులు ప్రకటించి తప్పు చేశామని చంద్రబాబు చెప్పారు. ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించి ఉంటే ఐవీఆర్ఎస్ సర్వే చేయించి అభిప్రాయాలు సేకరించేవారమని తెలిపారు. జ్యూరీ ఎంపిక చేసిన వారికే అవార్డులు ఇచ్చామన్నారు. ఏపీలో ఆధార్‌లేని వాళ్లు మాట్లాడతారా?: లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తన తండ్రి, సీఎం చంద్రబాబు చాలా బాధపడ్డారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు. -
అవార్డుల విమర్శలపై లోకేష్ స్పందన
-
సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే!
-
సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే!
మంత్రి లోకేశ్ స్కెచ్.. మరో మంత్రి ఆది డైరెక్షన్ చెన్నైలో వేలానికి ప్రొద్దుటూరులో మంత్రాంగం - వేలంలో భూములు దక్కించుకున్న టీడీపీ నేత వరద వర్గీయుడు - నాడు పనికిరాని భూములంటూనే నేడు పోటీపడి దక్కించుకున్నారని విమర్శల వెల్లువ సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఎట్టకేలకు పక్కా వ్యూహంతో రెండవసారి వేలంలో కూడా టీడీపీ పెద్దలే దక్కించుకున్నారు. గతంలో తొలిసారి వేలం నిర్వహించి.. ఈ భూములను రూ.22.44 కోట్లకు కారు చౌకగా తమ వారికి ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల విలువ చేసే భూములను కాపు కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత రామానుజయకు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర దాగి ఉందని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు ఎక్కారు. ఆ భూములు విలువైనవి కావని, వాటిని కొనేవారెవరూ లేరని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా.. వేలం పాటలో వచ్చిన రూ.22.44 కోట్ల కంటే రూ.5 కోట్లు ఎక్కువగా ఇచ్చిన వారికి ఆ భూములు ఇచ్చేస్తామని కూడా చెప్పారు. హైకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదనంగా రూ.5 కోట్లు చెల్లించగలరా అంటూ అప్పట్లో ఎమ్మెల్యే ఆర్కేను అడిగింది. ఇందుకు ఆయన సమ్మతించడం.. ఆ మేరకు డబ్బు డిపాజిట్ చేయడం విదితమే. ఆ తర్వాత ఈ భూములకు మళ్లీ వేలం నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం, సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించడం తెలిసిందే. కోర్టు ఆదేశం మేరకు సోమవారం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో నిర్వహించిన వేలం పాటలో ఈసారి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుడిభుజంగా ఉన్న శ్రీనివాసులురెడ్డి రూ.60.30 కోట్లకు 83.11 ఎకరాలను అనూహ్యంగా దక్కించుకున్నారు. వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డితో సహా ఆయన ఈ వేలంపాటకు హాజరై సత్యనారాయణ బిల్డర్స్ సంస్థ పేరు మీద భూములు దక్కించుకోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి ఈ భూములు దక్కించుకున్నారనే విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న జిల్లా వాసులు ఎవరీ శ్రీనివాసులురెడ్డి అని ఆరా తీశారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌లో 8 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో వరదరాజులరెడ్డి కుడిభుజంగా ఉన్న బద్వేలు శ్రీనివాసులురెడ్డి ఒకరు. మాజీ కౌన్సిలర్ అయిన ఇతణ్ని వరదరాజులురెడ్డి సిఫారసుతో గత ఏడాది జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌లో ఇతనితోపాటు వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. రూ.60 – 70 కోట్ల వ్యయంతో ఐదు స్క్రీన్లతో సినిమా థియేటర్ వ్యాపార సముదాయంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం మున్సిపాలిటీ కొన్ని నిబంధనలను సవరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాన్ని వరదరాజులరెడ్డి చేతుల మీదుగానే ప్రారంభించారు. చక్రం తిప్పిన మంత్రి లోకేశ్ భూములు ఎలాగైనా దక్కించుకోవాలని ఉన్న మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్.. మంత్రి ఆదినారాయణరెడ్డి సహకారంతోనే టీడీపీ నేత వరదరాజులురెడ్డి కుడిభుజం శ్రీనివాసులురెడ్డి ఈ భూముల వేలం పాటలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచారనే ఆరోపణలున్నాయి. గతంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయను బినామీగా పెట్టుకుని కథ నడిపించిన లోకేశ్.. ఈసారి మంత్రి ఆది ద్వారా వేలం పాటలో పాల్గొనే బృందాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రొద్దుటూరుకు వచ్చిన మంత్రి ఆదినారాయణరెడ్డి వరదరాజులురెడ్డి కళాశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోనే సదావర్తి భూముల వేలం పాల్గొనే వ్యూహం రచించారని సమాచారం. వేలంపాటకు వరద కుమారుడు కొండారెడ్డి, ఆయన వర్గీయుడు, రాజుపాళెం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తోట మహేశ్వరరెడ్డి హాజరవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. తొలిసారి వేలం నిర్వహించాక తక్కువ ధరకే కట్టబెట్టారని విమర్శలు రావడంతో అవి విలువైన భూములు కాదని సీఎం, మంత్రులు ఊదరగొట్టారు. అవి నిజంగానే విలువైన భూములు కాకపోతే ఇపుడు అంతకు సుమారు మూడు రెట్లు ఎక్కువ ధర ఎందుకు చెల్లిస్తున్నారని, ఈ విషయంలోనే సర్కారు పెద్దల కుట్ర స్పష్టమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ పోరాటం వల్లే పెద్దల నిర్వాకం బట్టబయలైందని పలువురు ప్రజా సంఘాల నేతలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. పోటీ ఉండకూడదని పక్కా వ్యూహం రెండోసారి వేలానికి ప్రముఖ సంస్థలు బరిలోకి రాకుండా ‘పెద్దలు’ పన్నిన వ్యూహం ఫలించింది. సదావర్తి భూములకు తిరిగి వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగానే తమదైన శైలిలో టీడీపీ పెద్దలు చక్రం తిప్పారు. వాస్తవానికి చెన్నైలోని 83.11 ఎకరాల భూములను వేలం వేస్తున్నట్లు చాలా మంది ప్రముఖ బిల్డర్లకు తెలియదు. గడువు ఇచ్చి.. ప్రచారం నిర్వహించలేదు. లేదంటే జాతీయ స్థాయిలో పెద్ద సంస్థలు ముందుకు వచ్చి ఉండేవి. పైగా ఈ భూముల విషయమై చాలా వివాదాలు ఉన్నట్లు తెరపైకి తెచ్చారు. తద్వారా పెద్ద రియల్టర్లు, బిల్డర్లు పాల్గొనకుండా చేశారు. భూములు దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేసివ్వబో మంటూ భయపెట్టారు. అంత పెద్ద ఎత్తున వందల కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ చేసివ్వబోమంటే ఏ సంస్థ ముందుకొస్తుంది? సర్కారు పెద్దలకు కావాల్సింది అదేమరి. ఇదే అదనుగా రెండోసారి ఈ భూములను దక్కించుకుంది. ‘వరద’ కారులో వేలానికి.. చెన్నై : సదావర్తి సత్రం భూముల రెండో విడత వేలంలో అత్యధిక బిడ్డరుగా నిలిచిన సత్యనారాయణ బిల్డర్స్ భాగస్వామి శ్రీనివాçసులు రెడ్డి వెనుక ఉన్నది టీడీపీ పెద్దలే అన్నది స్పష్టమైంది. చెన్నైలో జరిగిన వేలంలో పాల్గొనేందుకు శ్రీనివాసులు రెడ్డి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సొంత కారులో వచ్చారు. ఏపీ 04 బిడి 3355 కారులో అనుచరులతో కలసి వేలం జరిగిన చెన్నై టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రానికి చేరుకున్నారు. ఆ కారు స్వయంగా నంద్యాల వరదరాజులు రెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఈ విషయం సోమవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
జయంతికి వర్ధంతికి తేడా తెలియని అచ్చెన్న
- గౌతు లచ్చన్న జయంతిని వర్ధంతి వేడుకలు అన్న వైనం - మంత్రి లోకేశ్ సాహచర్యంతో అలా అన్నానన్న మంత్రి గుంటూరు వెస్ట్: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని మంత్రి అచ్చెన్నాయుడు వర్ధంతి అనడమేకాక, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. గౌతు లచ్చన్న 108వ జయంతి వేడుకలు బుధవారం గుంటూరు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నగరంలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీంతో పక్కన ఉన్న సహచరులు మంత్రి వ్యాఖ్యలను సరిచేశారు. దీనిపై మంత్రి అచ్చెన్న స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేశ్ గతంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని వర్ధంతి అని సంబోధించారని, ఆయన సాహచర్యం వల్ల తనకు కూడా అలానే వచ్చిందని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. -
పంచాయతీల సొమ్ములపై ప్రభుత్వ పెత్తనం
-
మీ నిధులు.. మా ఇష్టం
పంచాయతీల సొమ్ములపై రాష్ట్రప్రభుత్వ పెత్తనం.. 14వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు.. రాజ్యాంగాన్ని పరిహసిస్తూ ఉత్తర్వులు - ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే నిధులు - ఇంటి పన్నుల రూపంలో వసూలైన సొమ్ముపైనా అదుపు - గ్రామాల్లో చెత్త సేకరణకు షెడ్లు నిర్మించాలి - ఫొటోలిస్తేనే నిధులు - నిధులు అందుబాటులో లేక పంచాయతీల అవస్థలు - ఆంక్షలపై సర్పంచ్ల ఆగ్రహం సాక్షి, అమరావతి: ఆర్థిక సంఘం నిధులనేవి గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. గ్రామ పంచాయతీలకు ఆర్ధిక సంఘం ద్వారా కేంద్ర నిధులందాలని, అపుడే అవి పరిపుష్టమై గ్రామ స్వరాజ్య స్వప్నం సాకారమౌతుందని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. 1994లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో గ్రామ పంచాయతీలకు సైతం స్వయం ప్రతిపత్తిని కల్పించారు. కేంద్రం ఇచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ ఉండదు. దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాజ్యాంగ స్ఫూర్తిని పట్టపగలే పరిహాసం చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులపై పెత్తనమంతా తమదే అంటోంది. తాము చెప్పినట్లు చేస్తేనే ఆ నిధులు తీసుకోవాలంటూ ఆంక్షలు విధిస్తోంది. దీంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. ఇవెక్కడి ఆంక్షలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికసంఘం నిధులు సర్పంచ్‌లకు ఇవ్వొద్దు.. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను సంబంధిత సర్పంచులకు ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో వసూలు చేసి, ట్రెజరీల్లో జమ చేసిన ఇంటి పన్నుల సొమ్ము వినియోగంపైనా ఆంక్షలు విధించింది. కేంద్రం విడుదల చేసిన నిధులను, పంచాయతీల సొంత సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులు, గ్రామాల్లో వసూలు చేసిన ఇంటి పన్నుల డబ్బును గ్రామ పంచాయతీల తీర్మానాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోవడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. షెడ్ల నిర్మాణం పంచాయతీల పనేనట! ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సేకరించిన చెత్తను ఒక చోట చేర్చేందుకు షెడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ షెడ్లను పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మించాల్సి ఉంటుంది. కానీ, కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు పంచాయతీల సొంత నిధులను వీటి నిర్మాణం కోసం వెచ్చించాలని ప్రభుత్వం అధికారుల ద్వారా సర్పంచ్‌లపై ఒత్తిడి తీసుకొచ్చింది. అత్యధిక శాతం సర్పంచులు దీన్ని వ్యతిరేకించడంతో ఆంక్షలను తెరపైకి తెచ్చింది. గ్రామ పంచాయతీల పేరిట ఉన్న నిధులను ఆయా సర్పంచ్‌లు డ్రా చేసుకునే వీల్లేకుండా ట్రెజరీలపై ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టమైన ఉత్తర్వులిచ్చేశారు. ట్రెజరీల్లో పంచాయతీల సొమ్ము రూ.1,449 కోట్లు రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీల పేరుతో ప్రస్తుతం ఖజానాలలో(ట్రెజరీ) దాదాపు రూ.1,449 కోట్ల నిధులున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2016–17లో కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు దాదాపు రూ.1,463 కోట్లు నేరుగా విడుదల చేసింది. ఈ నిధుల్లో ఎక్కువ భాగం ఆర్థిక సంవత్సరం చివరన అంటే ఈ ఏడాది మార్చిలో ఇచ్చింది. సర్పంచ్‌లు ఇప్పటిదాకా డ్రా చేసిన నిధులు పోగా.. ప్రస్తుతం దాదాపు రూ.900 కోట్లు గ్రామ పంచాయతీల పేరిట ట్రెజరీల్లో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను రూపంలో వసూలు చేసిన రూ.549 కోట్లను మార్చి నెలలోనే ట్రెజరీల్లో జమ చేశాయి. కేంద్రం ఇచ్చినవాటితో పాటు పంచాయతీల సొంత నిధులను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే వాటిని ట్రెజరీల నుంచి పొందే అవకాశం కల్పిస్తామంటూ సర్కార్ ఆంక్షల అడ్డుగోడ నిర్మించింది. చెల్లింపులు నిలిపివేత గ్రామ పంచాయతీల నిధుల చెల్లింపులపై జూలై 27వ తేదీ నుంచి ట్రెజరీల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ సర్పంచ్‌లకు నిధులు విడుదల చేయొద్దంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. సాధారణ నిధుల నుంచి పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల చెల్లింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. చెత్త సేకరణ షెడ్ల నిర్మాణం పూర్తి చేసి, సంబంధిత ఫోటోలను సమర్పిస్తేనే ట్రెజరీల నుంచి నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. షెడ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి, వాటిని ఫొటోలు తీసి ఇస్తేనే ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల చేతికొస్తాయన్నమాట! వర్షాకాలంలో గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా, వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వలను శుభ్రం చేసుకోవడానికి కూడా నిధులు అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేశ్ వింత నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ పంచాతీయరాజ్ శాఖ మంత్రిగా కుర్చీ ఎక్కాక ఈ శాఖలో ఎన్నడూ లేని వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి లోకేశ్ తన మనసుకు తోచిందే తడవుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారులు ఆయనకు ఎదురు చెప్పలేక ప్రతి నిర్ణయానికీ తలూపుతున్నారు. అందుకే రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. -
నావల్లే హైదరాబాద్‌కు ఐఎస్బీ: సీఎం
సాక్షి, అమరావతి: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) తన వల్లే హైదరాబాద్‌కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా చెన్నై లేదా పుణేలో ఈ సంస్థ క్యాంపస్‌ను పెట్టాలనుకున్నారని, కానీ తాను చొరవ తీసుకుని హైదరాబాద్‌లో నెలకొల్పేలా చేశానన్నారు. నల్సార్ యూనివర్సిటీని కూడా తానే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించానని చెప్పారు. ఈ–ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐఎస్బీ సౌజన్యంతో అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించి మాట్లాడారు. శిక్షణకు 33 శాఖల నుంచి నలుగురిని ఎంపిక చేశామని, ఆరు నెలలపాటు ఐఎస్బీ ప్రొఫెసర్లు వివిధ అంశాల్లో వారికి శిక్షణ ఇస్తారని సీఎం తెలిపారు. టెక్నాలజీలో నా మనుమడు నన్ను మించిపోయాడు..: టెక్నాలజీలో తన కంటె తన మనుమడు ముందున్నాడని, రెండేళ్ల వయసులోనే సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్నాడని సీఎం చంద్రబాబు చెప్పారు.మీడియా ఎప్పుడూ వ్యతిరేక వార్తల కోసం చూస్తుందని, అవి లేకపోతే వారికి పాఠకులు, వీక్షకులు ఉండరని వ్యాఖ్యానించారు. ఇటీవల రెండు మూడు వ్యతిరేక వార్తలు చూశానని, అవేవీ నిజం కాదన్నారు. మౌస్‌లు, విండోస్ల గురించి తెలిసింది మా నాన్న హయాంలోనే: లోకేశ్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ యంత్రాంగం మౌస్‌లు ఎన్ని ఉన్నాయంటే సచివాలయంలో వెతికి ఎలుకలు లేవని చెప్పేవారని, విండోస్‌లు ఎన్ని ఉన్నాయంటే కిటీకీలు లెక్కపెట్టేవారని చెప్పారు. తన తండ్రి హయాంలో ఐటీని అభివృద్ధి చేశాక మౌస్ అంటే కంప్యూటర్ మౌస్‌లని, విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అని తెలుసుకుని వాటిని ఉపయోగించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. -
ఉద్యోగీ.. నీ కులమేంటి?
ప్రభుత్వ ఉద్యోగుల మెడపై కత్తి పెట్టడానికి సమాచార సేకరణ ప్రారంభం - చేరిన తేదీ, కులం, కేసుల వివరాలు నిర్దేశించిన నమూనాలో ఇవ్వాలని ఆదేశం - అత్యవసరంగా వివరాలు పంపాలంటూ ముందు వరుసలో మంత్రి లోకేశ్ - అన్ని జిల్లాల పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు మెమో జారీ - వివరాలు పంపకపోతే చర్యలు తప్పవని స్పష్టీకరణ నీ పేరేంటి..? ఎక్కడ పనిచేస్తున్నావ్? క్రమశిక్షణ కేసులున్నాయా? రిటైర్మెంట్ ఎప్పుడు? నీ కులమేంటి? నీవు పుట్టిన తేదీ? ఎస్సీ, ఎస్టీ అయితే ఏ గ్రూపు? సర్వీసులో చేరిందెప్పుడు? సాక్షి, అమరావతి: చెప్పినట్లు పని చేయని.. నచ్చని ఉద్యోగులు, అధికారులను పనితీరు నెపంతో నిర్ణీత వయసుకు ముందే ఇంటికి పంపించే కార్యక్రమం అమలుకు వారి పుట్టు పూర్వోత్తరాలు సేకరించడం ప్రారంభించింది. కులం ఏమిటని అడుగుతూ.. కులం ప్రాతిపదికగా పనితీరు నిర్ణయిస్తామన్నట్లు వ్యవహరిస్తోంది. ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోయేలా చేస్తోంది. ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునే ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్.. మంత్రిత్వ శాఖ ముందుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారుల వివరాలను అత్యవసరంగా సేకరించాలని 13 జిల్లాల పంచాయతీ ఆఫీసర్లకు మెమోతో పాటు నిర్దేశించిన నమూనా పత్రాన్ని జారీ చేసింది. ఇందులో ఉద్యోగుల కులం వివరాలు కూడా కావాలని కోరడం గమనార్హం. కులం ఆధారంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారా? నచ్చిన కులం వారిని ఒకలా.. నచ్చని కులం వారిని మరోలా చూస్తారా? అనే అనుమానం కలుగుతోంది. ఈ మెమో అన్ని జిల్లాల పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు చేరడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయా శాఖల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగి, అధికారి.. వారి వివరాలను నిర్దేశించిన నమూనాలో ప్రత్యేక మెసెంజర్ ద్వారా పంపించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మెమోలో స్పష్టం చేశారు. పనితీరు నెపంతో 50 ఏళ్లకే ఇంటికి పంపించేందుకు ఉద్దేశించిన జీవోలు ముసాయిదా రూపంలో ఉండగానే లోకేశ్ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పుట్టు పూర్వోత్తరాల సేకరణకు పూనుకోవడం తగదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఉదయం, రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నారని, నిత్యం సమీక్షల పేరుతో ఉదయం 6 గంటలకే కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఒక్కో రోజు రాత్రి పది గంటలకు గానీ ఇంటికి వెళ్లడం లేదని ఒక అధికారి పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో రెగ్యులర్‌గా 50 వేల మంది, అవుట్ సోర్సింగ్‌లో లక్షన్నర మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతటా అదే చర్చ.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరు దారుణం అని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘50 ఏళ్లకే ఇంటికి.. ప్రభుత్వ ఉద్యోగుల మెడపై పెర్ఫార్మెన్స్ కత్తి’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో వెలువడిన కథనం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. సర్కారు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందా.. అని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విషయమై ఉద్యోగులు చర్చించుకున్నారు. ముసాయిదా జీవో ప్రతులు కూడా వెలుగులోకి రావడంతో నివ్వెరపోయారు. ఒకవేళ నిజంగానే ఎవరిదైనా పెర్ఫార్మెన్స్ బాగోలేకపోతే అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించి పనితీరు మెరుగుపడేలా చేయాలే కానీ ఇలా ఇంటికి పంపించే కుట్ర సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలు కూడా వ్యవహరించని రీతిలో ఉద్యోగులను కులం ఏమిటని అడుగుతూ.. ఒకరకమైన ఆత్మన్యూనతా భావంలోకి నెడుతోందని మండిపడ్డారు. ఉద్యోగంలో చేరాక కులంతో ఏం పని? అంటూ ప్రశ్నించారు. వాస్తవానికి ఉద్యోగుల నుంచి ఇపుడు కోరిన వివరాలు ప్రభుత్వం వద్ద లేవా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
లోకేష్ కమ్యూనిస్టుల చరిత్ర ఏంటో తెలుసుకో
అమరావతి: కమ్యూనిస్టుల చరిత్రేంటో లోకేష్ తెలుసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. విజయవాడ అభివృద్ధికి పాటుపడిందే కమ్యూనిస్టులని, విజయవాడకు తొలి మేయర్ కూడా కమ్యూనిస్టేనన్న విషయాన్ని లోకేష్ గుర్తుపెట్టుకోవాలన్నారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని రామకృష్ణ అమరావతిలో కలిశారు. రాష్టంలో వర్షాభావ ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. పంటల భీమా ప్రీమియం చెల్లింపు ఆగస్ట్ 20 వరకూ పొడిగించాలని, గరగపర్రు, చాపరాయి ప్రజలను ఆదుకోవాలని కూడా కోరినట్లు చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో సినిమా, రాజకీయ ప్రముఖులున్నా కఠినంగా శిక్షించాలని, సినీ నటి ఛార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో వర్మ పోల్చడం దురదృష్టకరమన్నారు. -
ప్చ్..!
- నిరాశ మిగిల్చిన లోకేష్ పర్యటన - ఒక్క సమస్యకూ పరిష్కారం చూపని మంత్రి - జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల్లో నిరుత్సాహం కర్నూలు(అర్బన్): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ తొలిసారి మంత్రి హోదాలో కర్నూలుకు వచ్చిన సందర్భంగా తమ సమస్యలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని ఆశించిన స్థానిక ప్రజా ప్రతినిధులకు నిరాశ మిగిలింది. శుక్రవారం మంత్రి లోకేష్ కర్నూలు వచ్చిన సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మంత్రికి సన్మానంతో పాటు స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి వినతిపత్రాన్ని మంత్రికి అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు సిద్దారెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అద్యక్షుడు డీ వాసు, జెడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు ఇ మీనాక్షినాయడు పలు సమస్యలను క్లుప్తంగా వివిరించారు. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగానే 14వ ఆర్థిక సంఘం నిధులు మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని, జిల్లాలోని సర్పంచులకు ఉన్న జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేయాలని, ఎస్డీపీ నిధులను ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కేటాయించాలని వినతి పత్రం ద్వారా కోరారు. గ్రామ పంచాయతీలపై విద్యుత్ బిల్లుల భారం పడకుండా, ప్రభుత్వమే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, మండల, జిల్లా పరిషత్తులకు నాళా నిధులు రూ.360 కోట్లను కేటాయిస్తామని అప్పటి ఇంచార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అలాగే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వేతనాలు పెంచాలని, అన్ని జిల్లా పరిషత్ కార్యాలయాల్లో పంచాయతీరాజ్ చాంబర్‌కు ఒక గదిని కేటాయించాలని కోరారు. అయితే మంత్రి ప్రసంగంలో కేవలం తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు అమలు చేస్తున్న 7 స్టార్స్ పథకాలను వల్లె వేశారు. అలాగే బడ్జెట్‌తో ముడిపడి ఉన్న అంశాలను పీఆర్ ముఖ్య కార్యాదర్శి జవహర్‌రెడ్డితో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమైన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఫైనాన్స్‌తో సంబంధం లేని పలు అంశాలతో పాటు మిగిలిన అంశాలను కూడా మంత్రి లోకేష్ దాటవేసే ధోరణిలో చెప్పడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు నిరాశ చెందారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మణిగాంధీ, జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నిలదీతలు.. నిరసనలు
►మంత్రి లోకేష్‌కు చుక్కెదురు ►నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారంటూ యువకుల మండిపాటు ►కాన్వాయ్‌ను అడ్డుకొని ఆందోళన ►కిరోసిన్, చక్కెర ఇవ్వడం లేదన్న మహిళలు ►పర్యటన ఆలస్యం కావడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం సాక్షినెట్‌వర్క్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ పర్యటన ఆద్యంతం గురువారం.. నిలదీతలు..నిరసనల మధ్య కొనసాగింది. నంద్యాల మండలం కానాల గ్రామంలో జరిగిన సభలో..మీకు నెల నెలా సక్రమంగా రేషన్ అందుతుందా అని అడగ్గానే వృద్ధులు, మహిళలు చక్కెర, కిరోసిన్ రావడం లేదని చెప్పారు. ఉపాధి పనులు సక్రమంగా జరుగుతున్నాయా అని అడగగా..అరకొర అనే సమాధానం వచ్చింది. కానాల నాగమ్మ చెరువు ఆక్రమణకు గురైందని, ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేయలేదని, తాగునీటి సమస్య 45గ్రామాల్లో తీవ్రంగా ఉందని..సమస్యలు ఏకరువు పెట్టారు. నిలదీత.. నంద్యాల ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద మంత్రి లోకేష్ కాన్వాయ్‌ని ఏపీఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో ఓట్లు దండుకొని విద్యావంతులైన యువకులకుతీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. నిరాశతో వెనుదిరిగిన లంబాడీలు షెడ్యూల్ ప్రకారం ఓర్వకల్లు మండలం గుడుంబాయ్ తండాలో లోకేష్ పర్యటించాల్సి ఉంది. అయితే దానిని రద్దు చేసుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వాటర్‌షెడ్ మేనేజ్మెంట్పై తండా వాసులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉండేది. అయితే నంద్యాలలోనే సాయంత్రం ఏడు గంటలైనా పర్యటన ముగియకపోవడంతో గుడుంబాయి తండా పర్యటను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోసం మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్న తండా వాసులకు నిరాశతో వెనుదిరిగారు. నిరుత్సాహం.. పాణ్యంలోని నూతనంగా నిర్మించిన వర్మీకంపోస్టును ప్రారంభించేందుకు మధ్యాహ్నం 2గంటలకు మంత్రి రావాల్సి ఉంది. అయితే రాత్రి 7గంటలకు చేరుకోవడంతో కార్యకర్తలు డీలా పడ్డారు. పూలు చల్లవద్దని చెప్పడంతో మహిళలు వాటిని కింద పడేశారు. మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికే తోపులాటతో ఇద్దరు మహిళలు కింద పడ్డారు. మంత్రి రాత్రి సమయంలో రావడంతో కార్యకర్తలు కొందరు బహిరంగంగానే విమర్శలకు దిగారు. -
ఈ చైర్మన్ మాకొద్దు!
– ఏకమవుతున్న జెడ్పీటీసీ సభ్యులు – నేరుగా లోకేష్ ముందుకు పంచాయితీ – పాణ్యంలోని ఓ హోటల్లో 25 మంది జెడ్పీటీసీల సమావేశం సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా పరిషత్ చైర్మన్‌ను తొలగించాలని పలువురు అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు ఏకమవుతున్నారు. ఏకంగా 25 మంది జెడ్పీటీసీలు ‘ఈ చైర్మన్ మాకొద్దంటూ’ పాణ్యంలో రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశమయ్యింది. నేరుగా మంత్రి లోకేష్ ఎదుటే పంచాయితీ చేసి.. చైర్మన్‌ను తొలగించాలని కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 15న జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని కూడా బాయ్‌కాట్ చేసి నిరసన తెలపాలని ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. చైర్మన్ తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఫోన్ కూడా లిఫ్టు చేయడం లేదని ఈ సందర్భంగా పలువురు వాపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నేరుగా లోకేష్ సమక్షంలో పంచాయితీ తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అన్నింటిలోనూ అవమానాలే! జెడ్పీ చైర్మన్ తమను అన్నింటిలోనూ అవమానిస్తున్నారని ఈ సందర్భంగా జెడ్పీటీసీలు వాపోయారు. తాము ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని, ఒకవేళ బిజీగా ఉంటే తర్వాత కూడా సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. నీరు–చెట్టు పనుల అప్పగింతలో తమ ప్రమేయం లేకుండా వ్యవహారాలు నడుపుతున్నారని ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీలు విమర్శించినట్టు తెలుస్తోంది. హడావుడిగా జెడ్పీ గెస్ట్‌హౌస్‌ను కూల్చివేసి.. మహిళా సభ్యులు కూడా విశ్రాంతి తీసుకునేందుకు వీలు లేకుండా చేశారని మండిపడ్డారు. జెడ్పీ ఆవరణలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారనే కనీస సెక్యూరిటీ లేకుండా పోయిందని, వీటన్నింటికీ కారణం చైర్మన్ నిర్లక్ష్యమేనని అభిప్రాయపడ్డారు. ఇదే వ్యవహారంపై నేరుగా లోకేష్‌ను కలిసి అనంతపురం జిల్లా తరహాలో ఇక్కడ కూడా చైర్మన్‌ను మార్చాలని కోరాలని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు నడిపిస్తున్నారని తెలుస్తోంది. దీంతో జెడ్పీ చైర్మన్ మార్పు తప్పదని అధికారపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, తనకు తానుగా దిగితే తప్ప తనను ఎవ్వరూ దించలేరని, అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగేళ్ల వరకూ ఆగాల్సిందేనని జెడ్పీ చైర్మన్ అనుచరులు పేర్కొంటున్నారు. -
మంత్రి లోకేశ్ కు తాకిన అగ్రిగోల్డ్ సెగ
కడప: తమకు సత్వరమే న్యాయం చేయాలంటూ మంత్రి లోకేశ్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు వినూత్న నిరసన చేపట్టారు. ఆయన వెళుతున్న మైదుకూరు రోడ్ మార్గంలో ప్లకార్డ్స్ పట్టుకుని బారులు తీరి నిరసన తెలిపారు. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని ఆయన ముందుకు వెళ్లారు. తమకు వెంటనే న్యాయం చేయాలనీ, అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్లు గడుస్తున్న తమ కష్టాలు తీరలేదని, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తానూ సత్వరమే స్పందిస్తానని బాధితులకు లోకేశ్ హామీ ఇచ్చారు. -
ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం
బద్వేలు అర్బన్ : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఆపై మాట తప్పిన మంత్రి లోకేష్‌బాబుకు ఇక్కడ పర్యటించే హక్కు లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో భాగంగా మంగళవారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. మూడున్నరేళ్లు అవుతున్నా దాని ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా, పట్టణ కార్యదర్శులు వీరశేఖర్, చంద్రశేఖర్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శులు బి.అనిల్, పి.ప్రభాకర్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు జకరయ్య, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు శివరాం, సూరి, సత్యం, సాయి, సుధాకర్, హరి, మోహన్, పెంచలయ్య పాల్గొన్నారు. -
మంత్రి లోకేశ్‌కు చుక్కలు చూపించారు!
వైఎస్ఆర్ జిల్లా: సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌కు డ్వాక్రా మహిళలు చుక్కలు చూపించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎక్కడ అమలు చేశారంటూ నిలదీశారు. వల్లూరు మండలం తప్పెట్లలో బుధవారం ఈ ఘటన జరిగింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేశ్ మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికంగా రోడ్లు వేశారా? పంటలకు నీళ్లు ఇచ్చారా? అంటూ మహిళలను అడిగారు. ఆ ప్రశ్నలకు మౌనం వహించిన మహిళలు.. అసలు డ్వాక్రా రుణమాఫీ సంగతి ఏమయిందంటూ ప్రశ్నించారు. ఇంకెప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని నిలదీశారు. దీంతో మహిళలకు సర్దిచెప్పేందుకు మంత్రి లోకేశ్ నానా తంటాలు పడ్డారు. -
కొంటే ఐటీ దాడులు.. కొనకుంటే ఓడినట్టు!
‘సదావర్తి’ వ్యవహారంపై మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: సదావర్తి భూములను రూ.5 కోట్లు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తే ఇంత డబ్బు మీకు ఎలా వచ్చిందంటూ ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారని, కొనకుంటే ఛాలెంజ్‌లో వైఎస్సార్సీపీ ఓడినట్టేనని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం సోమవారం రాత్రి ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. సదావర్తి సత్రం భూములకు సంబంధించి హైకోర్టు తీర్పుపై మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సదావర్తి భూముల వేలంలో అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినప్పుడు రూ.5 కోట్లు అదనంగా ఇచ్చి మీరే తీసుకోవచ్చంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారని లోకేశ్ గుర్తు చేశారు. కోర్టు కూడా ఇప్పుడు అదే చెప్పిందని, రెండు వారాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బు కడతారో? ఏం జరుగుతుందో? చూద్దామని లోకేశ్ అన్నారు. -
అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి లోకేశ్ ఫొటోగ్రాఫర్లు
సాక్షి, అమరావతి: శాసనసభ ప్రెస్ గ్యాలరీలో మంగళవారం మంత్రి లోకేశ్ ఫొటో గ్రాఫర్లు కలకలం సృష్టించారు. నిబంధనల ప్రకారం ప్రెస్ గ్యాలరీలోకి సెల్ఫోన్లు, కెమెరాలు, రికార్డర్లు తీసుకురాకూడదు. మీడియా ప్రతినిధులు తప్ప ఇతరులకు అనుమతి ఉండదు. అయితే మంత్రి లోకేశ్ కార్యాలయ అధికారులు పంపారంటూ ఓ మార్షల్‌ను వెంటబెట్టుకుని ఇద్దరు ఫొటోగ్రాఫర్లు ప్రెస్ గ్యాలరీలోకి ప్రవేశించారు. వీరు స్పీకర్ పోడియం ఎదురుగా ఉండే ప్రదేశానికి వెళ్లి ఫొటోలు తీయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలుపుతున్నారు. ఇంతలో కెమెరా ఫ్లాష్ తన ముఖం మీద పడడంతో స్పీకర్.. ఎవరో ఫొటోలు తీస్తున్నారని గమనించి చీఫ్ మార్షల్‌ను అప్రమత్తం చేశారు. దీంతో సిబ్బంది ప్రెస్ గ్యాలరీలోకి వచ్చి ఆ ఇద్దరు ఫొటోగ్రాఫర్లను బయటకు తీసుకువెళ్లారు. -
అమెరికా పర్యటనకు లోకేశ్ దూరం
- సీఎంతో పాటు లోకేశ్, సీఎం పీఎస్ అమెరికా పర్యటనకు వెళ్తారని తొలుత జీవో - వాళ్లిద్దరూ వెళ్లరని ఇప్పుడు మరో జీవో జారీ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కూడా ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు గత నెల 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు అమెరికా పర్యటనకు లోకేశ్‌తో పాటు సీఎం పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు అమెరికా పర్యటనకు వెళ్లడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్‌తో సహా మొత్తం 17 మంది అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు గత నెల 28వ తేదీన జారీ చేసిన జీవోలో పేర్కొ న్నారు. అయితే మంత్రి లోకేశ్, సీఎం పీఎస్ శ్రీనివాసరావు అమెరికా పర్యటనకు వెళ్లడం లేదని, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇతర అధికారులు మొత్తం 15 మంది మాత్రమే అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు మంగళవారం జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలతో లోకేశ్ ఒప్పందాలు చేసుకుంటారని ప్రభుత్వ వర్గాలు ముందుగా ప్రచారం చేశాయి. తీరా అమెరికా పర్యటనలో ఆశించిన స్థాయిలో ఒప్పందాలు జరగకపోతే పరువు పోతుందనే భావనతో పాటు రాజకీయంగా కూడా సరికాదనే భావన కూడా దీనికి తోడైనట్లు తెలుస్తోంది. -
తుళ్లూరులో విచారణ పేరుతో వేధింపులు
-
విచారణ పేరుతో వేధింపులు
తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో హైడ్రామా - వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఇన్చార్జ్ చల్లా మధుకు పరోక్ష బెదిరింపులు - తాము చెప్పినట్లు చేయాలని ‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్‌పై తీవ్ర ఒత్తిడి - టీడీపీ పెట్టిన అసభ్య పోస్టింగులపై ఫిర్యాదు స్వీకరించని పోలీసులు - 30వ తేదీన మళ్లీ విచారణకు రావాలని ఆదేశం సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగు తోంది. మంత్రి లోకేశ్ మీద వ్యంగ్య పోస్టింగులు పెట్టారన్న ఆరోపణలపై ‘పొలిటికల్ పంచ్’ ఫేస్బుక్ పేజీ నిర్వాహకుడు రవి కిరణ్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే అభాసుపాలైంది. అయి నా అదే ఒరవడిని కొనసాగిస్తూ రవికిరణ్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ సెల్ రాష్ట్ర ఇన్చార్జ్ చల్లా మధుసూదన్‌రెడ్డిని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు విచారణ పేరిట మంగళవారం తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు పిలి పించి హైడ్రామా నడిపారు. చల్లా మధు సూదనరెడ్డిని తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో దాదాపు గంట పాటు అదనపు ఎస్పీ వైటీ నాయుడు, ఏఎస్పీ విక్రాంత్‌పాటిల్ విడివిడిగా విచారించారు. రవికిరణ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అని పలుసార్లు ప్రశ్నించారు. ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవని, ఆ ఫేస్బుక్ పేజీతో పార్టీకి సంబంధంలేదని మధు సమా« ధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు ఆయన్ను పరోక్షంగా బెదిరించినట్లు సమాచారం. అనంతరం ఈ నెల 30న మరోసారి విచారణకు రావాల్సిం దిగా నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే గంటసేపటి తర్వాత పోలీసులు చల్లా మధుకు ఫోన్ చేసి వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలన్నా రు. తాను అప్పటికే కృష్ణా జిల్లా సరిహద్దు దాటి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించానని, నోటీసులో పేర్కొన్న విధంగా ఈ నెల 30న విచారణకు హాజరవుతానని చెప్పారు. టీడీపీ అసభ్య పోస్టింగులపై స్పందించని పోలీసులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ శాసనసభలను కించపరుస్తూ టీడీపీ సోషల్ మీడియా విభాగం చేసిన పలు అసభ్యకర పోస్టింగులపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని చల్లా మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. విచారణ పేరిట ప్రభుత్వ బెదిరింపులు, వేధింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపుల పేరిట ఎంతగా అణచివేయాలని ప్రయత్నిస్తే నెటిజన్లు మరింతగా రెచ్చిపోతారన్నారు. రవికిరణ్ పెట్టిన చిన్న పోస్టింగుపై రాద్ధాంతం చేస్తున్న ప్రభుత్వం తమ ఫిర్యాదుపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాగా, పోలీసుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరికీ సంఘీభావంగా పార్టీ తాడికొండ సమన్వయకర్త హెనీ క్రిస్టినా, రాష్ట్ర అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, పార్టీ నేతలు రాకేష్‌రెడ్డి, వెంకటరెడ్డి, బత్తుల కిషోర్ తమ కార్యకర్తలతో తుళ్లూరు పోలీస్‌స్టేషన్ వద్దకు తరలివచ్చారు. పోలీసులు భారీగా మోహరించి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. రవికిరణ్‌పై తీవ్ర ఒత్తిడి రవికిరణ్‌ను అదనపు ఎస్పీ వైటీ నాయుడు, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ పలు దఫాలుగా మంగళవారం రాత్రి 9 గంట ల వరకు విచారించారు. ‘నీకు వైఎస్సార్ సీపీతో సంబంధాలున్నాయని ఒప్పుకో.. ఆ పార్టీ సూచనల మేరకే పోస్టింగులు పెడుతున్నట్లు సంతకాలు చెయ్యి’ అని పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమా చారం. 30న మళ్లీ విచారణకు రావాలని చెప్పి పంపారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ తాను ఫ్రీలాన్స్ జర్నలిస్టునని, తనకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటే అభిమానం తప్ప ఆ పార్టీతో ఏ సంబంధం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సైట్‌లోని అఫీషియల్ పేజీలో పెట్టిన కొన్ని పోస్టింగులను ఆద ర్శంగా తీసుకునే తాను కొన్ని పోస్టింగు లను పెట్టానని, వాటితో వైఎస్సార్ సీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. మంత్రి నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని అణగదొక్కడానికి తనను అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
విమర్శలకు మంత్రి లోకేశ్ ఉక్కిరి బిక్కిరి
-
200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి..
-
200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి..
మరోసారి తడబడిన మంత్రి లోకేశ్ అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు మాట తడబడడం ఆనవాయితీగా మారింది. గురువారం అనంతపురంలో జరిగిన ‘నీరు– ప్రగతి ఉద్యమం’ సమావేశంలో ఆయన మరోసారి ఇలానే వ్యవహరించారు. రాష్ట్రంలో ఉన్నది 175 అసెంబ్లీ స్థానాలయితే.. 2019 ఎన్నికల్లో 200 స్థానాల్లో పార్టీని గెలిపించాలనడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. సమావేశంలో విద్యార్థులు, నీటి వినియోగ సంఘాల అధ్యక్షులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ...‘చివరగా మీకు ఒక మాట చెబుతున్నా. మనం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలి. 2019 ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. భారీ మెజార్టీ అంటే మామూలుగా కాదు. 200 స్థానాలు గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్న విషయం కూడా లోకేశ్‌కు తెలియదా అంటూ అక్కడున్న వారు చర్చించుకోవడం కనిపించింది. -
గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి
అనంతపురం అర్బన్ : గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములై రాయలసీమను రతనాలసీమగా మార్చుకుందామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కేటీఆర్ ఫంక్షన్ హాల్లో నీటి వినియోగ సంఘాల అధ్యక్షులు, ఇంజినీరింగ్ విద్యార్థులతో ‘నీరు ప్రగతి– ఉద్యమం– 90 రోజుల ప్రణాళిక’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధ్యక్షత జరిగిన సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా యువతకు విరివిగా అవకాశాలు వస్తాయన్నారు. రానున్న రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు, ఐదు లక్షల పారిశ్రామిక ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఐదు వేలు జనాభా కలిగిన ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. 2018 నాటికి హంద్రీ–నీవా, గాలేరి–నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీటిని ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.