సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పవన్ తనపై చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని లోకేశ్ అన్నారు. పవన్ అంటే వ్యక్తిగతంగా తనకు గౌరవమేనని పేర్కొన్నారు. పవన్ చుట్టు కొందరు చేరి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
మంత్రి లోకేశ్ అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన అవినీతిని చూసి తాత ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభించి ఉంటుందని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. లోకేశ్, టీడీపీ నేతల అవినీతి, అక్రమాలపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లు టీడీపీకి మిత్రపక్షంగా ఉంటూ.. పల్లెత్తు మాట అనని పవన్.. ఒక్కసారిగా లోకేశ్‌ను టార్గెట్ చేసి.. అవినీతి ఆరోపణలు చేయడంతో టీడీపీని కుదిపేసింది.
Comments
Please login to add a commentAdd a comment