కొంటే ఐటీ దాడులు.. కొనకుంటే ఓడినట్టు! | Minister Lokesh comments on Sadavarti lands | Sakshi
Sakshi News home page

కొంటే ఐటీ దాడులు.. కొనకుంటే ఓడినట్టు!

Published Tue, Jul 4 2017 1:54 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

కొంటే ఐటీ దాడులు.. కొనకుంటే ఓడినట్టు! - Sakshi

కొంటే ఐటీ దాడులు.. కొనకుంటే ఓడినట్టు!

‘సదావర్తి’ వ్యవహారంపై మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యలు
 
సాక్షి, అమరావతి: సదావర్తి భూములను రూ.5 కోట్లు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తే ఇంత డబ్బు మీకు ఎలా వచ్చిందంటూ ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారని, కొనకుంటే ఛాలెంజ్‌లో వైఎస్సార్‌సీపీ ఓడినట్టేనని మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం సోమవారం రాత్రి ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. సదావర్తి సత్రం భూములకు సంబంధించి హైకోర్టు తీర్పుపై మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

సదావర్తి భూముల వేలంలో అక్రమాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేసినప్పుడు రూ.5 కోట్లు అదనంగా ఇచ్చి మీరే తీసుకోవచ్చంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారని లోకేశ్‌ గుర్తు చేశారు. కోర్టు కూడా ఇప్పుడు అదే చెప్పిందని, రెండు వారాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డబ్బు కడతారో? ఏం జరుగుతుందో? చూద్దామని లోకేశ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement