Sadavarti lands
-
‘సదావర్తి’పై విజిలెన్స్ విచారణ
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో సదావర్తి భూముల భూబాగోతంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఒక సీనియర్ అధికారితో విచారణ జరిపించి ఈ బండారం బట్టబయలు చేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. విచారణ నివేదికను 3 నెలల్లో సభలో ఉంచుతామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. అంతకుముందు.. ఆర్కే మాట్లాడుతూ, సదావర్తి భూముల వేలం వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలను వివరించారు. పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం 1885లో రాజా వెంకటాద్రినాయుడు చెన్నైలో 471 ఎకరాల భూమిని కేటాయించారని, అప్పటి నుంచి ఆదాయం వస్తోందన్నారు. కాలక్రమంలో చెన్నైలోని ఆ భూమి అన్యాక్రాంతమై చివరికి 83.11 ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు. ఈ మొత్తం భూమిని తన అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నిందని వివరించారు. ఎవరికీ తెలీకుండా ఉండేందుకు చెన్నైలోని రెండు పత్రికలలో కనీకనబడనట్టుగా ఈ–టెండర్ల ప్రకటన ఇస్తే అందులో చంద్రబాబు మనుషులు వెళ్లి వేలంలో పాల్గొన్నారన్నారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. అలాగే, 83.11 ఎకరాల సదావర్తి భూములను రూ.22 కోట్లకు కట్టబెట్టడాన్ని తాము కోర్టులో సవాల్ చేస్తే మరో 5 కోట్లు ఎక్కువ ఇచ్చి తమనే తీసుకోమన్నారన్నారు. కాగా, తాను రూ.27.5 కోట్లు కడితే తనపై ఐటీ దాడులు చేయిస్తామని చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ బెదిరించారన్నారు. ఈ నేపథ్యంలో సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి అంగీకరించారు. ఆ భూమిని ఎలా వేలం వేయాలనుకున్నారు? చంద్రబాబు మాట్లాడుతూ.. విచారణను స్వాగతిస్తున్నామంటూనే ఆర్కే తదితరుల తీరువల్ల ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం పోయిందన్నారు. ఆ భూములకు టైటిల్ డీడ్, పట్టాలులేవని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ భూమి తమదే అంటున్నదని చంద్రబాబు చెప్పినప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి జోక్యం చేసుకుని అటువంటి భూమిని (టైటిల్ డీడ్స్, పట్టాలు లేని) వేలంవేసి ఒక ప్రభుత్వం మోసం చేయవచ్చా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ నడిచింది. డాక్టర్ వైఎస్సార్‌కు ఇచ్చిన హామీవల్లే కియా మోటార్స్ వచ్చిందని బుగ్గన చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని బుగ్గన దీటుగా తిప్పికొట్టారు. కాగా, సదావర్తి సత్రం భూములపై అసెంబ్లీలో చర్చ జరిగిన తీరును చూస్తే ప్రభుత్వం ఆక్రమణలో ఉన్న ఆలయాల భూములను కాపాడుతుందన్న విశ్వాసం పెరుగుతోందని ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పేర్కొంది. -
సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం
సాక్షి, అమరావతి : సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో దేవదాయ శాఖ భూములపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి వెల్లంపల్లి సమాధానమిచ్చారు. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి అడ్వొకేట్ జనరల్‌తో సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సదావర్తి భూముల్లో అక్రమాలకు సబంధించి పలు అంశాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ‘2018 ఆగస్టులో సదావర్తి భూములను అమ్మేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అప్పటి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో గత ప్రభుత్వం తమిళనాడులోని చిన్న పేపర్లో ప్రకటన ఇస్తే.. గుంటూరులోని చంద్రబాబు బినామీలు వెళ్లి ఆ వేలంలో పాల్గొన్నారు. వేలంలో ఎకరం భూమి ధరను రూ. 50 లక్షలు నిర్ణయిస్తే.. చంద్రబాబు బినామీలు రూ. 22లక్షలకే వేలం పాడారు. ఆ తర్వాత సదావర్తి భూముల వేలం అధికారి తమను బతిమిలాడితే.. మరో రూ. 5లక్షలు అధిక ధరకు పాడినట్టు మినిట్స్‌లో రాసుకున్నారు. దేవదాయ శాఖ అధికారి భ్రమరాంబ ఎకరం భూమి ధర రూ. 6 కోట్లు ఉంటుందని ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలిపారు. దీంతో సదావర్తి భూముల అక్రమాలపై న్యాయం కోసం నేను కోర్టును ఆశ్రయించాను. అయితే కోర్టుకెళ్లిన నాపై ఐటీ దాడులు చేయిస్తామంటూ అప్పటి మంత్రి నారా లోకేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు. అందుకే సదావర్తి భూములపై విజిలెన్స్ దర్యాప్తు చేయించాల’ని ఆర్కే కోరారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. సదావర్తి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సీనియర్ అధికారి ద్వారా దీనిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ.. సదావర్తి భూములకు టైటిల్ డీడ్ లేదని చెప్పుకొచ్చారు. అయితే దీనిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి తప్పుపట్టారు. సదావర్తి భూములకు టైటిల్ డీడ్ లేదని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టైటిట్ డీడ్ లేని భూమిని రాష్ట్ర ప్రభుత్వం మరొకరికి అంటగట్టొచ్చా అని ప్రశ్నించారు. -
సదావర్తికి బాబు సొంత సొమ్ము కట్టాలి
సాక్షి, హైదరాబాద్ : సదావర్తి భూముల వ్యవహరంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూములు ఎవరివో తేల్చాలంటూ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేయటంపై ఆర్కే హర్షం వ్యక్తం చేశారు. రెండు అంశాలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. కేవలం భూములను కాజేసేందుకు చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారని ఆర్కే చెప్పారు. చంద్రబాబు తన బినామీలతో సదావర్తి భూములను చేజిక్కించుకునేందుకు యత్నించాడని.. దమ్ముంటే సొంత డబ్బు కట్టాలని ఆర్కే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బాబు బినామీలు ఇప్పటికే కట్టిన డబ్బు వడ్డీ అడుగుతున్నారని.. ప్రజా ఆస్తిని చివరకు వడ్డీల రూపంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం వసూలు చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఒకవేళ కోర్టు ఆదేశాల ప్రకారం వడ్డీ కట్టాల్సి వస్తే దానిని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా చంద్రబాబు, లోకేశ్ ఆస్తుల నుంచి కట్టేలా చూడాలని కోర్టును కోరారు. 472 ఎకరాలను రాజా వాసిరెడ్డి పేద బ్రాహ్మణులకు ఇచ్చారని.. ఏపీ దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆర్కే అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చి దేవాదయ భూములు అమ్ముకూడదన్న జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆర్కే అభిప్రాయపడ్డారు. తమిళనాడు పిటిషన్ ఆధారంగానే సదావర్తి భూములు ఎవరివో తేల్చాలంటూ హైకోర్టుకు సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలను జారీచేసిన విషయం తెలిసిందే. -
ఆ భూములెవరివో తేల్చండి
-
ఆ భూములెవరివో తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి భూముల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వందల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం, కోర్టుల జోక్యం, రెండుసార్లు వేలం వంటి పరిణామాల నేపథ్యంలో.. తమిళనాడు తెరపైకి రావడంతో అసలు భూములెవరివో తేల్చాలంటూ సుప్రీంకోర్టు పరోక్షంగా స్పష్టం చేసింది. ఈ భూములు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖవి కావని, తమకు చెందినవని, అందువల్ల వేలం నిర్వహిం చరాదంటూ తమిళనాడు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం దీన్ని మళ్లీ విచారించి పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎ.ఎం.ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. భూముల వేలం కేసును ఇంతటితో ముగిస్తున్నట్టు పేర్కొంది. తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు చెందిన వందల కోట్ల విలువ చేసే సదావర్తి సత్రం భూముల (ఇవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి)ను నిబంధనలు ఉల్లంఘించి, ఒక పథకం ప్రకారం అధికార పార్టీ నేతలకు రూ.22 కోట్ల నామమాత్రపు ధరకు దక్కేలా వ్యవహరించారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రూ.27 కోట్లను కనీస ధరగా నిర్ణయించి తిరిగి వేలం పాట నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తాము నిబంధనల ప్రకారమే రూ.22 కోట్లకు వేలం పాడామని, తమకే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని తొలి వేలంలో భూము లను దక్కించుకున్న ఎం.సంజీవరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందుకు నిరాకరిం చిన సుప్రీంకోర్టు రెండోసారి వేలానికి అనుమతించింది. దీనికి అనుగు ణంగా దేవాదాయ శాఖ వేలం నిర్వహించగా బహిరంగ వేలంలో మూడింతలు ధర పలికినా.. మొదటి బిడ్డర్ నగదు చెల్లించలేదు. దీంతో తదుపరి బిడ్డర్‌కు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన తాజా విచారణలో తొలుత దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది ప్రేరణా సింగ్ తాజా పరిణామాలను ధర్మాసనానికి నివేదించారు. మొదటి బిడ్డర్ నగదు చెల్లించ లేకపోయారని, తదుపరి బిడ్డర్ నగదు చెల్లించారని వివరించారు. దీంతో ఇక కేసు ముగించేద్దామని ధర్మాసనం పేర్కొనగా.. తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది సుబ్రమణ్యం ప్రసాద్ తమ వాదన వినాలని కోరారు. ఈ భూములు తమిళనాడు ప్రభు త్వానివని, అందువల్ల వేలం ప్రక్రియను అంగీకరించరాదని, ఈ మేరకు హైదరాబాద్ లోని హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశామని విన్నవించారు. 18 శాతం వడ్డీకి తెచ్చాం..: తొలివేలంలో భూములను కైవసం చేసుకున్న సంజీవరెడ్డి తరఫు న్యాయవాది రామకృష్ణప్రసాద్ వాద నలు వినిపిస్తూ తాము 18 శాతం వడ్డీకి డబ్బు తెచ్చి వేలం పాడి డిపాజిట్ చేశామని, నెలల తరబడి డిపాజిట్ ఉంచుకుని ఇప్పుడు కేవ లం 8 శాతం వడ్డీతో వెనక్కి తిరిగి ఇస్తే తాము నష్టపోతామని, న్యాయం చేయాలని అభ్యర్థిం చారు. సీపీఐ నారాయణ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని, ఈ మేరకు మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశామని చెప్పారు. అయితే ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. పిటిషనర్‌కు వడ్డీతో చెల్లించండి అందరి వాదనలు విన్న తర్వాత ఈ కింది ఆదేశాలు జారీ చేయడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ‘పిటిషనర్ సంజీవరెడ్డి డిపాజిట్ చేసిన మొత్తాన్ని 4 వారాల్లోగా వడ్డీతో సహా చెల్లించాలి. రెండో బిడ్డర్ చేసిన డిపాజిట్‌ను దేవాదాయ శాఖ కమిషనర్ తిరిగి చెల్లించాలి. తమిళనాడు తరపు న్యాయవాది సుబ్రమణ్యం ప్రసాద్ చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు మళ్లీ విచారించి పరిష్కరించాలి. అందుకు అనుగుణంగా స్పెషల్ లీవ్ పిటిషన్‌ను, మధ్యంతర దరఖాస్తుల విచారణ ప్రక్రియను ముగిస్తున్నాం..’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సదావర్తి తెలుగు వారికే..!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాతలు ఇచ్చిన చెన్నైలోని సదావర్తి సత్రం భూములను తక్కువ ధరకు ఏపీలోని ల్యాండ్‌మాఫియాకు అప్పగించేకంటే తమిళనాడులో నివసిస్తున్న తెలుగువారి ప్రయోజనాలకు కేటాయించడం ఉత్తమమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడుకు చెందిన సీపీఐ నేతలతో కలిసి చెన్నై తాలంబూరు, దాని పరిసరాల్లోని సత్రం భూముల్లో నారాయణ శుక్రవారం పర్యటించారు. సత్రం భూముల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి భూములు విలువ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేవలం చెన్నైలోనే 32 లక్షల మంది తెలుగువారు ఉన్నారంటే మొత్తం తమిళనాడులోని మొత్తం తెలుగు జనాభాను కలుపుకుంటే పెద్ద సంఖ్యలో ఉంటారని చెప్పారు. వీరిలో తెలుగు ప్రజానీకానికి, తెలుగు సాహిత్యానికి ఉపయోగపడేవారు ఎందరో ఉన్నారని తెలిపారు. అంతేగాక ఎంతో మంది తెలుగు ప్రజలు సొంతిల్లు లేక పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు. సత్రం భూముల అమ్మకాల్లో తమిళనాడులోని తెలుగు ప్రజల స్థితిగతులను సైతం పరిగణనలోకి తీసుకోవాలేగానీ,లాండ్ మాఫియా గ్యాంగ్ పంచుకోవడానికి చేసే ప్రయత్నాలను మేము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. సబ్ రిజిష్ట్రారు కార్యాలయ సమాచారం ప్రకారం గైడ్ ఎకరా రూ.4.85 కోట్లు పలుకుతుండగా 83.11 ఎకరాలను ఏపీ ప్రభుత్వం వేలం పాటల ద్వారా రూ.22 కోట్లకే ల్యాండ్ మాఫియాకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని అన్నారు. ప్రభుత్వ కుటిలయత్నాలను హైకోర్టులో ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్) వేయడం ద్వారా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అడ్డుకున్నారని తెలిపారు. అయితే హైకోర్టు సైతం ప్రభుత్వానికి సరైన సూచన ఇవ్వకుండా అదనంగా రూ.5 కోట్లు చెల్లించి ఆర్కేనే భూములను తీసుకొమ్మని చెప్పిందని విమర్శించారు. ఇంతలో ఏపీ ప్రభుత్వం మళ్లీ పేచీపెట్టి ఈనెల 18వ తేదీన రెండోసారి వేలానికి తెగబడి రూ.60.30 కోట్లకు అమ్మేందుకు సిద్దమైందని అన్నారు. రూ.500 కోట్ల విలువ చేసే భూములను తమ ప్రభుత్వానికి అనుకూలమైన ల్యాండ్ మాఫియాకు కారుచౌకగా కట్టబెట్టేందుకే ఈ వేలం పాటలని ఆయన వ్యాఖ్యానించారు. సత్రం భూములు వివాదాస్పదం, వాటిని తాము సెటిల్ చేసుకోలేము కాబట్టే వేలం పాటల ద్వారా ప్రయివేటు వ్యక్తులకు అమ్ముతున్నామని కుంటిసాకులు చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. కొందరు ప్రయివేటు వ్యక్తుల కంటే ఏపీ ప్రభుత్వం బలహీనమైనదాని ఆయన ఎద్దేవా చేశారు. తాము అసమర్దులము, ప్రయివేటు వాడు గొప్పవాడని ప్రభుత్వ పెద్దలు అంగీకరించారని అన్నారు. ఈ చేష్టలు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికే కాదు తెలుగు ప్రజానీకానికి అవమానమని ఆయన అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్దిగా తలచకుంటే కష్టమేముంది, సీఎం స్థాయిలో తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే రెండు ప్రభుత్వాలు కలిసి భూములను స్వాధీనం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సత్రం భూములను ల్యాండ్ మాఫియాకు పంచాలని ఉద్దేశ్యపూర్వకంగా సాగించిన ప్రయత్నాల వల్ల సమస్య జఠిలమైందని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని ఒక పాలసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, కాదని వేలం పాటలు నిర్వహిస్తే అడ్డుకుంటాం, సుప్రీం కోర్టులో కూడా మా వాదం వినిపించేందుకు పిటిషన్ వేయబోతున్నామని చెప్పారు. -
ఎంత తేడా.. మేం కళ్లు మూసుకోలేం
సాక్షి, న్యూఢిల్లీ : రెండవసారి నిర్వహించిన వేలంలో సదావర్తి సత్రం భూముల ధర మూడింతలు పెరగడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయ మూర్తులు జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ భూములను తొలిసారి వేలం వేసినప్పుడు తాము వేలం పాడి దక్కించుకున్నామని, తమకే అప్పగిం చాలని ఎం.సంజీవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 12న ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కళ్లు కప్పొద్దని, వేలం తిరిగి నిర్వహించాల్సిం దేనని ఆదేశిస్తూ కేసును 22వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా.. వాది, ప్రతివాది ఇద్దరూ వేలంలో పాల్గొన్నారా? వేలంలో ధర ఎంత పలికింది? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ స్పందిస్తూ వేలం వివరాలను ధర్మాసనానికి వివరించారు. వాది, ప్రతివాది ఇద్దరూ వేలంలో పాల్గొన్నారని, అత్యధికంగా రూ.60.30 కోట్ల ధర పలికిందని వివరించారు. దీంతో ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘చూడండి ఎంత తేడా ఉందో.. దయచేసి మీరు మొదటి వేలానికి, రెండో వేలానికి వ్యత్యాసం చూడండి. రూ.22 కోట్లు ఎక్కడ? రూ.60 కోట్లు ఎక్కడ? దాదాపు రూ.40 కోట్లు. అంటే మూడింతలు. ప్రజల ఆస్తులను, ట్రస్టు ఆస్తులను ఇలా తక్కువ ధరకు అమ్మేయడం సరికాదు. ఇలా జరిగితే మేం కళ్లు మూసుకోలేం..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి బిడ్డర్ సత్యనారాయణ బిల్డర్స్ నిర్ణీత గడువులోగా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించలేదని, దీంతో రెండో బిడ్డర్ చదలవాడ లక్ష్మణ్ (రూ.60.25 కోట్లు)కు శనివారం వరకు డబ్బు చెల్లించేం దుకు అవకాశం ఉందని గుంటూరు ప్రభాకర్ వివరించారు. ఇదే సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం తరపు న్యాయవాది తాము ఈ కేసులో మధ్యంతర దరఖాస్తు సమర్పించామని, ఈ భూములు తమ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. అందువల్ల వీటిపై హక్కులు తమకే చెందుతాయని ధర్మాసనానికి విన్నవించగా.. జస్టిస్ దీపక్ మిశ్రా ఈ విన్నపాన్ని తోసిపుచ్చారు. ‘‘ఏంటి ఇది? మేం ఈ కేసు విచారిస్తున్నది భూముల టైటిల్ ఎవరిదో నిర్ణయించడానికి కాదు..’’ అని చెబుతూ ఆ దరఖాస్తును విచారించేం దుకు నిరాకరించారు. పిటిషనర్ సంజీవరెడ్డి తరఫు న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ స్పందిస్తూ.. ఈ వేలంపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటికి సంబం ధించిన డాక్యుమెంట్ల సమర్పణకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణను ధర్మాసనం అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు ప్రతివాది ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు సుధాకర్‌రెడ్డి, అల్లంకి రమేశ్ హాజరయ్యారు. వేలం వేసిన భూముల విలువ రూ.1,300 కోట్లు సదావర్తి భూముల అమ్మకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల అధికారులు, అనధికారుల అవినీతి వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎం.సంజీవరెడ్డి వర్సెస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులో తనను ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం ఆయన తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. సదావర్తి సత్రం లక్ష్యం, ఉద్దేశాన్ని కాపాడేందుకు ఆ భూములను పరిరక్షించాలని, లేదా ట్రస్టుకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. సదావర్తి భూములు మొత్తం రూ.5 వేల కోట్ల విలువైనవని వివరించారు. ఆక్రమించుకున్నవి, అన్యాక్రాంతమైనవి, తమిళనాడు ప్రభుత్వం కేటాయించినవి పోగా ఇప్పుడు వేలం వేసిన 83.11 ఎకరాల భూముల విలువ దాదాపు రూ.1,300 కోట్లు అని పేర్కొన్నారు. ఈ భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుయుక్తులతో కేవలం రూ.22 కోట్లకే అధికార పార్టీకి చెందిన వారికి కట్టబెట్టేందుకు వేలాన్ని ఎంపిక చేసిన బృందానికి పరిమితం చేసిందన్నారు. కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రెండోసారి వేలం నిర్వహిస్తే తనకు సంబంధం లేకపోయినా మంత్రి ఆదినారాయణరెడ్డి వేలాన్ని నియంత్రించారని, ఈ వేలంలో పాల్గొంటే ఐటీ దాడులు తప్పవని ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారని ఆరోపించారు. ‘‘రూ.22 కోట్లు ఎక్కడ? రూ.60 కోట్లు ఎక్కడ? సదావర్తి భూముల వేలం ధర మూడింతలు పెరిగింది. ట్రస్టు ఆస్తులను అతి తక్కువ ధరకు అమ్మేయడం సరికాదు. ఇలా జరిగితే మేం కళ్లు మూసుకోలేం..’’ – జస్టిస్ దీపక్ మిశ్రా,భారత ప్రధాన న్యాయమూర్తి -
సదావర్తి భూములను పరిశీలించిన నారాయణ
చెన్నై: తమిళనాడులోని నావలూరు,తాళంబూరులోని సదావర్తి భూములను సీపీఐ నేత నారాయణ శుక్రవారం పరిశీలించారు. తిరుపోరూరు తహసీల్దారు వద్ద భూముల విలువను అడిగి తెలుసుకున్నారు. సదావర్తి భూములు ఎకరానికి 4 కోట్ల 67లక్షలు ధర పలుకుతాయని తహసీల్దారు ఆయనకు వివరించారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ పార్టీకి చెందిన వారికే తక్కువ ధరకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని నారాయణ ఆరోపించారు. ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకుని తెలుగు వారి కోసం వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘సదావర్తి’పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
‘సదావర్తి’పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : సదావర్తి సత్రం భూములపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భూములను చౌకగా విక్రయిస్తే చూస్తూ ఊరుకోమలేమని తేల్చి చెప్పింది. తాజాగా జరిగిన బహిరంగ వేలంలో సదావర్తి భూములు మూడు రెట్లు అధికంగా ధర పలకడంపై ఉన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రూ.40 కోట్లు అధికంగా ధర రావడం చిన్న విషయం కాదని వ్యాఖ్యానించింది. రెండోసారి జరిగిన వేలంలో రూ.60.30కోట్లు పలికిన బిల్డర్ డబ్బులు చెల్లించలేకపోయారని, రెండో బిల్డర్‌కు అవకాశం ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే రెండో బిల్డర్ డబ్బులు చెల్లించేందుకు ఇచ్చిన గడువు రేపటితో (శనివారం) ముగుస్తుందని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా పడింది. -
సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరపాలి: ఆర్కే
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పేద బ్రాహ్మణుల వేద విద్య కోసం సదావర్తి భూములను రాజా వాసిరెడ్డి వారసులు రాసిచ్చారన్నారు. అవి బ్రాహ్మణ భూములు అని, ప్రభుత్వ భూములు కాదని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యానించారు. పేద బ్రాహ్మణుల ఆస్తిని తక్కువ ధరకు చంద్రబాబు, లోకేశ్ దక్కించుకున్నారని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించడంతో ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ అడ్డుకుంటుందని టీడీపీ నేతలు తమపై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సదావర్తి భూములను కాపాడేందుకే తాము కోర్టును ఆశ్రయించామని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం వేలం పాట నిర్వహించిందన్నారు. అయితే రెండవ విడత నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రధాన అనుచరుడు బద్వేలు శ్రీనివాసులురెడ్డి గడువులోగా డబ్బులు చెల్లించని విషయం తెలిసిందే. అంతేకాకుండా కేసులు, పిటిషన్లు అంటూ వైఎస్ఆర్ సీపీ బెదిరిస్తోందంటూ శ్రీనివాసులురెడ్డితో ముఖ్యమంత్రి... పత్రికాముఖంగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వేలంపాటలో సదావర్తి భూములను దక్కించుకున్న ఆయనను తాము అభినందించి, స్వాగతించామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక వేలంపాటపై మంత్రి మాణిక్యాలరావు, దేవాదాయా శాఖ కమిషనర్ చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలన్నది చంద్రబాబు ప్లాన్ అని ఆర్కే ఆరోపించారు. సదావర్తి భూముల కేసు విచారణ వాయిదా సదావర్తి భూములపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ వేలంలో అత్యధిక ధరకు కోట్ చేసిన వ్యక్తి ముందుకు రావట్లేదని పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ భూములపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను వచ్చేనెల 3వ తేదీకి వాయిదా వేసింది -
‘సాక్షాత్తూ దేవుడి భూముల్లోనే కుంభకోణం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతోన్న భూ దోపిడీలకు చెన్నైలో జరిగిన సదావర్తి భూముల వేలమే నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ దేవుడి భూములను సైతం కొల్లగొడుతోందని ఆయన విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘సాక్షాత్తూ దేవుడు భూముల్లోనే కుంభకోణం జరిగింది. చంద్రబాబు చేసిన భూ కుంభకోణాల్లో సదావర్తి భూముల వ్యవహారం ఓ మచ్చతునక. సదావర్తి భూముల అడ్డగోలు వేలానికి చంద్రబాబుదే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వానికి మూడు రెట్లు లాభం వచ్చేలా వేలం జరిగింది. అన్ని భూ దోపిడీలపై సమగ్ర విచారణ జరపాలి. ఇప్పుడు సాక్షాత్తూ అమరేశ్వరుడి భూములకే ఎసరు పెట్టారు. భూముల దోపిడీ జరిగిందానికి నిన్న జరిగిన వేలమే నిదర్శనం. ఎస్సీ, మైనార్టీ పేదల భూములను ప్రభుత్వం లాక్కుంది. ప్రజలు, దేవుడి ఆస్తులను ప్రభుత్వం మింగేస్తోంది. టీడీపీ పాలనలో కొనసాగుతున్న భూ కుంభకోణాలను ప్రజలు గుర్తించాలి. ఇప్పటివరకు జరిగిన భూ దోపిడీలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ బాధితులందరికీ వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
‘సాక్షాత్తూ దేవుడి భూముల్లోనే కుంభకోణం’
-
సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే!
-
సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే!
మంత్రి లోకేశ్ స్కెచ్.. మరో మంత్రి ఆది డైరెక్షన్ చెన్నైలో వేలానికి ప్రొద్దుటూరులో మంత్రాంగం - వేలంలో భూములు దక్కించుకున్న టీడీపీ నేత వరద వర్గీయుడు - నాడు పనికిరాని భూములంటూనే నేడు పోటీపడి దక్కించుకున్నారని విమర్శల వెల్లువ సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఎట్టకేలకు పక్కా వ్యూహంతో రెండవసారి వేలంలో కూడా టీడీపీ పెద్దలే దక్కించుకున్నారు. గతంలో తొలిసారి వేలం నిర్వహించి.. ఈ భూములను రూ.22.44 కోట్లకు కారు చౌకగా తమ వారికి ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల విలువ చేసే భూములను కాపు కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత రామానుజయకు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర దాగి ఉందని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు ఎక్కారు. ఆ భూములు విలువైనవి కావని, వాటిని కొనేవారెవరూ లేరని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా.. వేలం పాటలో వచ్చిన రూ.22.44 కోట్ల కంటే రూ.5 కోట్లు ఎక్కువగా ఇచ్చిన వారికి ఆ భూములు ఇచ్చేస్తామని కూడా చెప్పారు. హైకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదనంగా రూ.5 కోట్లు చెల్లించగలరా అంటూ అప్పట్లో ఎమ్మెల్యే ఆర్కేను అడిగింది. ఇందుకు ఆయన సమ్మతించడం.. ఆ మేరకు డబ్బు డిపాజిట్ చేయడం విదితమే. ఆ తర్వాత ఈ భూములకు మళ్లీ వేలం నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం, సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించడం తెలిసిందే. కోర్టు ఆదేశం మేరకు సోమవారం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో నిర్వహించిన వేలం పాటలో ఈసారి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుడిభుజంగా ఉన్న శ్రీనివాసులురెడ్డి రూ.60.30 కోట్లకు 83.11 ఎకరాలను అనూహ్యంగా దక్కించుకున్నారు. వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డితో సహా ఆయన ఈ వేలంపాటకు హాజరై సత్యనారాయణ బిల్డర్స్ సంస్థ పేరు మీద భూములు దక్కించుకోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి ఈ భూములు దక్కించుకున్నారనే విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న జిల్లా వాసులు ఎవరీ శ్రీనివాసులురెడ్డి అని ఆరా తీశారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌లో 8 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో వరదరాజులరెడ్డి కుడిభుజంగా ఉన్న బద్వేలు శ్రీనివాసులురెడ్డి ఒకరు. మాజీ కౌన్సిలర్ అయిన ఇతణ్ని వరదరాజులురెడ్డి సిఫారసుతో గత ఏడాది జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌లో ఇతనితోపాటు వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. రూ.60 – 70 కోట్ల వ్యయంతో ఐదు స్క్రీన్లతో సినిమా థియేటర్ వ్యాపార సముదాయంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం మున్సిపాలిటీ కొన్ని నిబంధనలను సవరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాన్ని వరదరాజులరెడ్డి చేతుల మీదుగానే ప్రారంభించారు. చక్రం తిప్పిన మంత్రి లోకేశ్ భూములు ఎలాగైనా దక్కించుకోవాలని ఉన్న మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్.. మంత్రి ఆదినారాయణరెడ్డి సహకారంతోనే టీడీపీ నేత వరదరాజులురెడ్డి కుడిభుజం శ్రీనివాసులురెడ్డి ఈ భూముల వేలం పాటలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచారనే ఆరోపణలున్నాయి. గతంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయను బినామీగా పెట్టుకుని కథ నడిపించిన లోకేశ్.. ఈసారి మంత్రి ఆది ద్వారా వేలం పాటలో పాల్గొనే బృందాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రొద్దుటూరుకు వచ్చిన మంత్రి ఆదినారాయణరెడ్డి వరదరాజులురెడ్డి కళాశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోనే సదావర్తి భూముల వేలం పాల్గొనే వ్యూహం రచించారని సమాచారం. వేలంపాటకు వరద కుమారుడు కొండారెడ్డి, ఆయన వర్గీయుడు, రాజుపాళెం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తోట మహేశ్వరరెడ్డి హాజరవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. తొలిసారి వేలం నిర్వహించాక తక్కువ ధరకే కట్టబెట్టారని విమర్శలు రావడంతో అవి విలువైన భూములు కాదని సీఎం, మంత్రులు ఊదరగొట్టారు. అవి నిజంగానే విలువైన భూములు కాకపోతే ఇపుడు అంతకు సుమారు మూడు రెట్లు ఎక్కువ ధర ఎందుకు చెల్లిస్తున్నారని, ఈ విషయంలోనే సర్కారు పెద్దల కుట్ర స్పష్టమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ పోరాటం వల్లే పెద్దల నిర్వాకం బట్టబయలైందని పలువురు ప్రజా సంఘాల నేతలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. పోటీ ఉండకూడదని పక్కా వ్యూహం రెండోసారి వేలానికి ప్రముఖ సంస్థలు బరిలోకి రాకుండా ‘పెద్దలు’ పన్నిన వ్యూహం ఫలించింది. సదావర్తి భూములకు తిరిగి వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగానే తమదైన శైలిలో టీడీపీ పెద్దలు చక్రం తిప్పారు. వాస్తవానికి చెన్నైలోని 83.11 ఎకరాల భూములను వేలం వేస్తున్నట్లు చాలా మంది ప్రముఖ బిల్డర్లకు తెలియదు. గడువు ఇచ్చి.. ప్రచారం నిర్వహించలేదు. లేదంటే జాతీయ స్థాయిలో పెద్ద సంస్థలు ముందుకు వచ్చి ఉండేవి. పైగా ఈ భూముల విషయమై చాలా వివాదాలు ఉన్నట్లు తెరపైకి తెచ్చారు. తద్వారా పెద్ద రియల్టర్లు, బిల్డర్లు పాల్గొనకుండా చేశారు. భూములు దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేసివ్వబో మంటూ భయపెట్టారు. అంత పెద్ద ఎత్తున వందల కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ చేసివ్వబోమంటే ఏ సంస్థ ముందుకొస్తుంది? సర్కారు పెద్దలకు కావాల్సింది అదేమరి. ఇదే అదనుగా రెండోసారి ఈ భూములను దక్కించుకుంది. ‘వరద’ కారులో వేలానికి.. చెన్నై : సదావర్తి సత్రం భూముల రెండో విడత వేలంలో అత్యధిక బిడ్డరుగా నిలిచిన సత్యనారాయణ బిల్డర్స్ భాగస్వామి శ్రీనివాçసులు రెడ్డి వెనుక ఉన్నది టీడీపీ పెద్దలే అన్నది స్పష్టమైంది. చెన్నైలో జరిగిన వేలంలో పాల్గొనేందుకు శ్రీనివాసులు రెడ్డి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సొంత కారులో వచ్చారు. ఏపీ 04 బిడి 3355 కారులో అనుచరులతో కలసి వేలం జరిగిన చెన్నై టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రానికి చేరుకున్నారు. ఆ కారు స్వయంగా నంద్యాల వరదరాజులు రెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఈ విషయం సోమవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సదా మాయ
-
సిగ్గుపడాల్సిందిపోయి.. స్వాగతిస్తారా?
-
సిగ్గుపడాల్సిందిపోయి.. స్వాగతిస్తారా?
సాక్షి, విజయవాడ: సదావర్తి సత్రం భూముల వేలం విషయంలో తమ పార్టీ చెప్పిందే నిజమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు తన మనుషులకు కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు చేసిన కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. దేవుడి భూములనే దోచేయాలని చూశారని, నేటి వేలంపాట ధరతో ప్రభుత్వ అవినీతి బట్టబయలైందన్నారు. సదావర్తి భూముల వేలంలో అక్రమాలు బయటపడితే సిగ్గుపడాల్సిందిపోయి, స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతికత ఉన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సదావర్తి భూముల వేలంలో కుట్ర కోణంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం లేదని విమర్శించారు. నారాయణలో విద్యాసంస్థల్లో జరుగుతున్నవి ఆత్మహత్యలు కావు, అవి యాజమాన్యం చేస్తున్న హత్యలని పార్థసారధి వ్యాఖ్యానించారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. -
సదావర్తి భూముల వేలం ఆపండి..
సుప్రీంకోర్టులో తమిళనాడు ఇంప్లీడ్ పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి భూముల వేలం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ భూములతో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేనందున వేలం ఆపాలని, ఈ కేసులో తమ వాదనలు వినాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ (మధ్యంతర దరఖాస్తు) దాఖలు చేసింది. సదావర్తి సత్రం భూములు ఎవరూ క్లెయిం చేయని ఆస్తులని, అందువల్ల అవి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవని పేర్కొంది. ఇందుకు సంబంధించి సదావర్తి సత్రం మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందని, వీటికి పట్టా కూడా లేదని పిటిషన్లో వివరించింది. అందువల్ల సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సంజీవరెడ్డి వర్సెస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులో తమను ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని కోరింది. ఈనెల 18న జరగనున్న వేలాన్ని నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. లేదంటే మద్రాసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌పై వెలువడే తీర్పునకు లోబడి ఈ వేలం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కాగా, ఈ పిటిషన్‌ను ఈనెల 18న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ప్రస్తావించనున్నట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఇదీ సంగతి.. సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల భూములను వేలం వేస్తుండటంపై తమిళనాడుకు చెందిన కొందరు మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. వీరి వాదన విన్న ధర్మాసనం.. ఈ భూములపై ఎవరికి హక్కు ఉందో నవంబర్ 30లోగా తేల్చాలని కాంచీపురం డీఆర్వోను ఆదేసిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సమాచారం అందడంతో తమ వాదన వివరిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ నోట్ సిద్ధం చేస్తోంది. -
మా కళ్లు కప్పొద్దు..!
-
మా కళ్లు కప్పొద్దు..!
- సదావర్తి కేసులో పిటిషనర్‌పై సుప్రీం ఆగ్రహం - వేలం జరగాల్సిందేనని ఆదేశం - ప్రతివాది ఆళ్ల కూడా వేలంలో పాల్గొనాలని ఉత్తర్వు సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి సత్రం భూములకు తిరిగి వేలం నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది. తమ కళ్లను కప్పొద్దంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం జరిపిన వేలంలోనే తాము భూములు కొన్నామని, తమకే కేటాయించాలని, తిరిగి వేలం వేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని సంజీవరెడ్డి అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మంగళవారం పిటిషనర్‌పై మండిపడింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. సదావర్తికి చెందిన 83 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం వేలంలో నిబంధనలు పాటించకుండా అతి తక్కువ ధరకు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టిందని, తద్వారా ఖజానాకు నష్టం చేకూర్చిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు.. వేలంలో సంజీవరెడ్డి, ఇతరులు కోట్ చేసిన రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ. 5 కోట్లు చెల్లించాలని ఆర్కేను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్కే రూ. 27 కోట్లు డిపాజిట్ చేశారు. ఆర్కే వ్యాజ్యాన్ని ఆధారంగా చేసుకుని భూములను చేజిక్కించుకోవాలని చూస్తున్నారని సంజీవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ ఉద్దేశాన్ని పరీక్షించేందుకే డిపాజిట్ చేయాలని ఆదేశించామని, ఖజానాకు నష్టం వాటిల్లకూడ దన్నదే పిటిషనర్ ఉద్దేశమని హైకోర్టు స్పష్టం చేసింది. నెల రోజుల్లో వేలం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ 21కి విచారణ వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను రద్దు చేయాలంటూ సంజీవరెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. వేలంలో కొన్న భూములకు తిరిగి వేలం నిర్వహించడం సబబు కాదని పిటిషనర్ తరపు న్యాయవాది వి.గిరి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ ‘మీరు బిడ్ ఎంతకు వేశారు?’ అంటూ ప్రశ్నించారు. ‘నిబంధనలకు అనుగుణంగా వేలంలో పాల్గొన్నాం. వేలాన్ని తిరిగి చేపట్టాలని కోరడం సబబు కాదు..’ అని వి.గిరి పేర్కొన్నారు. దీనికి జస్టిస్ దీపక్ మిశ్రా ఆగ్రహం వ్యక్తంచేస్తూ... ‘మీరు మా కళ్లను ఎలా కప్పుతారు? మీరు వేలానికి సిద్ధమైతే సరి.. లేదంటే న్యాయస్థాన వేలం(కోర్టు ఆక్షన్)కు సిద్ధమవ్వాల్సి ఉంటుంది..’ అని వ్యాఖ్యానించారు. దీంతో వి.గిరి ప్రభుత్వం జరిపే వేలంలో పాల్గొంటామని పేర్కొన్నారు. ప్రతివాది అయిన ఆర్కే కూడా వేలంలో పాల్గొనాలని, లేదంటే ఇదివరకే డిపాజిట్ చేసిన సొమ్ములో రూ. 10 కోట్లు వదులుకో వాల్సి వస్తుందని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే తాము ఈ–వేలంలో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉందన్న అంశాన్ని ప్రతివాది తరపు న్యాయవాది సుధాకర్‌రెడ్డి ధర్మాసనం ముందు ప్రస్తావించగా గడువును 15వ తేదీ వరకు పెంచారు. అలాగే బహిరంగ వేలం 14వ తేదీన ఉండగా.. దానిని 18వ తేదీకి మార్చుతూ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి: ఆర్కే సదావర్తి సత్రం భూములను తిరిగి వేలం నిర్వహించాలని సుప్రీం కోర్టు సైతం ఉత్తర్వులు జారీచేసిందని, చంద్రబాబు నాయుడు ఇకనైనా కళ్లు తెరవాలని మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు బుద్ధీ జ్ఞానం ఉంటే, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటే హైకోర్టు ఆదేశాలను కాదని మళ్లీ ఇక్కడికి అప్పీలుకు వచ్చి ఉండేవారు కాదన్నారు. సదావర్తి భూములకు ఎకరాకు రూ. 7 కోట్ల విలువ ఉందని సంబంధిత శాఖలోని అంతర్గత నివేదికలు చెబుతున్నా, వాటిని తొక్కిపెట్టి 83 ఎకరాలను కేవలం రూ. 22 కోట్లకే కట్టబెట్టడం ఒక పెద్ద అవినీతి చర్య అని న్యాయవాది సుధాకర్ రెడ్డి చెప్పారు. -
‘సదావర్తి’ భూములు మళ్లీ వేలం
- సెప్టెంబర్ 14న నిర్వహణ - రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, అమరావతి: సదావర్తి సత్రం భూముల అమ్మకానికి సెప్టెంబర్ 14న మళ్లీ వేలం నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సమీపంలో ఉన్న 82.11 ఎకరాల భూమి అమ్మకానికి గతేడాది మార్చి 28న అధికారులు నిబంధన లకు విరుద్ధంగా వేలం నిర్వహించడం.. తెలుగుదేశం పార్టీ నేతలు కారుచౌకగా ఆ భూముల్ని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలను ‘సాక్షి’ బట్టబయలు చేయడం తెలిసిందే. సత్రం భూముల్ని అధికారపార్టీ నేతలు తక్కువ ధరకే కొట్టేసే ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. భూములకు తిరిగి వేలం నిర్వహించాలని న్యాయస్థానం రాష్ట్రప్రభు త్వాన్ని ఆదేశించడం కూడా విదితమే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. సత్రం భూముల అమ్మకానికి తిరిగి వేలం నిర్వహించడంపై కసరత్తు చేసిన దేవాదాయశాఖ ఉన్నతాధికారులు బుధవారం రాష్ట్రప్రభుత్వా నికి నివేదిక అందజేశారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో ఏదో ఒకరోజు వేలం నిర్వహణకు తాము సిద్ధమని నివేదించగా.. 14న వేలం నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం అనుమతి తెలిపింది. కాగా వేలం నిర్వహణకు తొమ్మిదిమంది దేవాదాయశాఖ అధికారుల తో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. -
సర్కారుకు శరాఘాతం
సదావర్తి భూములకు మళ్లీ వేలం.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మూడున్నరేళ్లుగా అన్ని రంగాలనూ అవినీతిమయం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు సర్కారు దేవుడు భూములను సైతం కారుచౌకగా కాజేయాలని చేసిన ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. సరైన టెండర్ కూడా లేకుండా... ఎకరం రూ.6 కోట్లు పలుకుతోందని దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ లిఖితపూర్వకంగా నివేదించినా పట్టించుకోకుండా తన బినామీలకు సదావర్తి భూములు కట్టబెట్టి కమీషన్లు కొట్టేయాలనుకున్న ముఖ్యమంత్రి ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. సత్రం భూములను వేలం వేయాలని అధికారులు, ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టిన సర్కారుకు హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారింది. నిబంధనలన్నీ అతిక్రమించి మరీ బరితెగించిన ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షం చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. కొనేందుకు ఎవడూ ముందుకు రావడం లేదని ఒకసారి, ఆక్రమణలున్నాయని మరోసారి కోర్టును సైతం మభ్యపెట్టబోయిన చంద్రబాబు సర్కారు చివరకు యూటర్న్ తీసుకుంది. హైకోర్టు ఆదేశించినట్లుగా గడువులోగా ఆళ్ల రామకృష్ణారెడ్డి డబ్బు చెల్లించడంతో సర్కారు పెద్దలు కంగుతిన్నారు. రూ. 5 కోట్లు అదనంగా ఇస్తే సత్రం భూములు రాసిచ్చేస్తామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి మాటమార్చారు. తన బినామీల తరఫు న్యాయవాది చేత మరో వితండవాదన చేయించారు. వెయ్యికోట్ల విలువైన భూములు అంటున్నారు కనుక ఆళ్ల చేత రూ.500 కోట్లు కట్టించాలని హైకోర్టులో వాదించారు. న్యాయస్థానంలో తమ ఆటలు ఇక సాగవని గ్రహించి సత్రం భూములను ఎలాగైనా సరేదక్కించుకోవడం కోసం మరో కుయుక్తికి తెరతీశారు. తాజాగా వేలం నిర్వహిస్తామని సన్నాయినొక్కులు నొక్కుతూ రక్తికట్టించే ప్రయత్నం చేశారు. వేలం నిర్వహించాలన్న హైకోర్టు.. సదావర్తి సత్రం భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో దిమ్మతిరిగే ఎదురుదెబ్బ తగిలింది.. వందల కోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను అతి తక్కువ రేటుకే కావాల్సిన వారికి కట్టబెట్టేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ భూములకు తిరిగి వేలం నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.27.44 కోట్లను కనీస ధరగా నిర్ణయించాలంది. చెన్నై సమీపంలో సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల భూమి వేలానికి సంబంధించి జాతీయ పత్రికల్లో కూడా ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సైతం వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని, అలాగే వేలం ఎప్పుడు వేస్తున్నారన్న విషయాన్ని ఆయనకు తెలియచేయాలని స్పష్టం చేసింది. ఆరు వారాల్లో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. ఆ రోజున వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆళ్ల పిటిషన్‌తో కదిలిన డొంక.. సదావర్తి సత్రానికి చెన్నై నగరానికి సమీపంలో ఉన్న 83 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీని వల్ల వందల కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా మొదట జరిగిన వేలంలో రూ.22.44 కోట్లకు భూములు దక్కించుకున్న వారి తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో ఇదే వ్యవహారంపై పిల్ దాఖలైందని, అందులో ఉన్న అంశాలనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన వ్యాజ్యంలో ప్రస్తావించారని తెలిపారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక పిటిషనర్‌కు సదుద్దేశం లేదన్నారు. తాము వేలంలో కొన్న భూముల విలువ వెయ్యి కోట్లు ఉంటుందని పిటిషనర్ చెబుతున్నారని, అలాంటప్పుడు ఆయనను రూ.500 కోట్లనయినా డిపాజిట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే ఆయన రూ.27 కోట్లే చెల్లించారని తెలిపారు. పిటిషనర్ వేలంలో పాల్గొనలేదని, అయితే ఇప్పుడు ఈ వ్యాజ్యం దాఖలు చేసి, దానిని అడ్డంపెట్టుకుని భూమిని కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. తమ అభ్యంతరాలన్నింటినీ రికార్డ్ చేయాలని కోర్టును కోరారు. ఆళ్లది సదుద్దేశమే: ధర్మాసనం వ్యాఖ్య ఈ వ్యాజ్యం దాఖలు విషయంలో పిటిషనర్ సదుద్దేశాన్ని తెలుసుకునేందుకే తాము అదనంగా రూ.5 కోట్లు చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించామని ధర్మాసనం పేర్కొంది. తమ ఆదేశాల మేరకు పిటిషనర్ రూ. 27.44 కోట్లు చెల్లించి తన సదుద్దేశాన్ని చాటుకున్నారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘మాకు కావాల్సింది ప్రభుత్వ ఖజానాకు వేలం ద్వారా ఎక్కువ డబ్బు సమకూరడమే. అవి ప్రజల భూములు. మరోసారి వేలం వేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టే.. పిటిషనర్‌కు కూడా భూములు ఇవ్వడం లేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తర్వాత సదావర్తి భూములకు తిరిగి వేలం నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్ స్పందిస్తూ, నెల రోజుల గడువు సరిపోదని, మరింత గడువు కావాలని కోరారు. సాధ్యం కాదని స్పష్టం చేసిన ధర్మాసనం ఆరు వారాల్లో వేలం ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. -
కొంటే ఐటీ దాడులు.. కొనకుంటే ఓడినట్టు!
‘సదావర్తి’ వ్యవహారంపై మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: సదావర్తి భూములను రూ.5 కోట్లు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తే ఇంత డబ్బు మీకు ఎలా వచ్చిందంటూ ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారని, కొనకుంటే ఛాలెంజ్‌లో వైఎస్సార్సీపీ ఓడినట్టేనని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం సోమవారం రాత్రి ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. సదావర్తి సత్రం భూములకు సంబంధించి హైకోర్టు తీర్పుపై మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సదావర్తి భూముల వేలంలో అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినప్పుడు రూ.5 కోట్లు అదనంగా ఇచ్చి మీరే తీసుకోవచ్చంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారని లోకేశ్ గుర్తు చేశారు. కోర్టు కూడా ఇప్పుడు అదే చెప్పిందని, రెండు వారాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బు కడతారో? ఏం జరుగుతుందో? చూద్దామని లోకేశ్ అన్నారు. -
‘సదావర్తి’లో సర్కారుకు షాక్
సర్కారు సవాల్‌కు సై అన్న ఎమ్మెల్యే ఆర్కేకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు - అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే భూములు వారికే ఇస్తామంటూ సర్కారు సవాల్ - దీనికి హైకోర్టు సాక్షిగా సై అన్న ఎమ్మెల్యే ఆర్కే - రూ.5 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్థంగా ఉన్నారని, - ఆ వ్యక్తి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లిస్తారని వెల్లడి - పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం - మొత్తం డబ్బు జమ చేసేందుకు నాలుగు వారాల గడువు - వరుస పరిణామాలతో బిత్తరపోయిన బాబు సర్కార్ సాక్షి, హైదరాబాద్: సదావర్తి భూములను వేలంపాటల్లో దక్కించుకున్న మొత్తానికి ఎవరైనా అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే వారికే కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్‌కు వైఎస్సార్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు వేదికగా సై అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించడానికి ఆర్కేకు నాలుగు వారాల గడువిచ్చింది. దీంతో వరుస పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం బిత్తరపోయింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే సదావర్తి భూములను కావాల్సిన వారికి నామమాత్రపు ధరకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టులో సోమవారం నాటి పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. రూ.5 కోట్లు తాను చెల్లించే పరిస్థితుల్లో లేకపోయినా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వ్యక్తిని తీసుకొస్తానని రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. రూ.5 కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ధర్మాసనం నాలుగు వారాల గడువు కూడాఇవ్వడంతో ప్రభుత్వం దిమ్మతిరిగింది. హైకోర్టులో జరిగిందిదీ.. తమిళనాడులో సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల భూమికి వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు చెల్లించేందుకు ఒకరు సిద్ధంగా ఉన్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. అదనంగా చెల్లించాల్సిన రూ.5 కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్లను నాలుగు వారాల్లో జమ చేస్తామని ఆయన తెలిపారు. అలా అయితే మొదట విడత కింద రూ.10 కోట్లను రెండు వారాల్లోపు, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సదావర్తి భూముల వేలం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం, గత వారం విచారణ సమయంలో వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా రూ.5 కోట్లు ఇచ్చిన వారికి భూములు ఇచ్చేస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. అంత స్థోమత లేకపోతే ఆ మొత్తాన్ని చెల్లించే వారిని తీసుకొచ్చినా ఫర్వాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, ఆళ్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాలుగు వారాల్లో మొత్తం డబ్బును జమ చేస్తామని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్ స్పందిస్తూ, రూ.5 కోట్లు జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వ్యక్తి రేపు ఆ మొత్తం జమ చేయకపోతే ఎలా అంటూ సందేహం వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అనుకున్న సమయానికి డబ్బు జమ చేయకపోతే పిటిషనర్ రామకృష్ణారెడ్డికి రూ.కోటి జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. ‘మీరు (పొన్నవోలు సుధాకర్‌రెడ్డి) చెప్పిన వాదనలను రికార్డ్ చేస్తాం. ఒకవేళ రేపు డబ్బు కడతానన్న వారు ముందుకు రాకపోతే మిమ్మల్ని పట్టుకోవాల్సి ఉంటుంది.’ అని తెలిపింది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. కోర్టు సాక్షిగా అదనంగా ఐదు కోట్లు ఇస్తే 83 ఎకరాల భూమిని ఇచ్చేస్తామని సర్కారే చెప్పింది. ఇప్పుడు ఆ మాట నుంచి వెనక్కి వెళ్లలేదు. చెప్పినట్లు ఆ వ్యక్తి రూ.27.44 కోట్లు కడితే 83 ఎకరాలు అతనికి అప్పజెప్పాలి. ఇదే జరిగితే సొంత మనుషుల చేతిలో నుంచి వేల కోట్ల విలువైన భూములు జారిపోవడం ప్రభుత్వానికి కళ్ల ముందు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. -
72 గంటల్లో రూ. 28.05 కోట్లు కట్టండి
-
72 గంటల్లో రూ. 28.05 కోట్లు కట్టండి
సదావర్తి భూములపై దేవాదాయ శాఖ పీఎల్ఆర్ సంస్థకు లేఖ సాక్షి, విజయవాడ బ్యూరో : రూ. 28.05 కోట్లు 72 గంటల్లోగా డిపాజిట్ చేస్తే సదావర్తి భూములు మళ్లీ వేలం వేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ పీఎల్ఆర్ ప్రాజెక్ట్సుకు లేఖ రాశారు. ఆ లేఖను శనివారం పత్రికలకు విడుదల చేశారు. గత ంలో రూ.22.44 కోట్లకు సదావర్తి భూములను వేలం వేయగా, ఆ మొత్తానికి మరో 25 శాతం ఎక్కువ సొమ్మును కలిపి డిపాజిట్ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల విలువైన భూములను దేవాదాయశాఖ కారు చౌకగా వేలం వేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి బంధువులు రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఈ భూములను రూ. 22.44 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు రాగా, పలు సంస్థలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ దోపిడీని ప్రశ్నించారు. దాంతో రూ.5 కోట్లు అదనంగా చెల్లించేవారికి ఆ భూములు అప్పగిస్తామని ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి ప్రకటనలుచేశారు. వాటికి స్పందిస్తూ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 5 కోట్లు చెల్లించడానికి సిద్ధమేనని ఆసక్తి ప్రతిపాదనను పంపించింది. దీంతో వారికి కొత్తగా అనేక షరతులు పెడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖ పలు విమర్శలకు దారి తీసింది. ఈ కొత్త షరతులేమిటని ప్రశ్నిస్తూ పీఎల్ఆర్ సంస్థ రాసిన లేఖకు స్పందిస్తూ ఇపుడు దేవాదాయశాఖ ఈలేఖ పంపించింది. ఆ డబ్బు చెల్లించడానికి మేం సిద్ధం సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవాలుకు తాము సిద్ధమని పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. రాష్ర్టప్రభుత్వం అడుగుతున్నట్లుగా రూ. 22.44 కోట్లకు అదనంగా రూ. 5.60 కోట్లు కలిపి మొత్తం రూ. 28.05 కోట్లను 72 గంటల్లోగా డిపాజిట్ చేయడానికి తాము సిద్ధమని ఆ సంస్థ పేర్కొంది. శనివారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తాము డబ్బు కట్టిన వెంటనే తమ సంస్థ పేరిట సదావర్తి భూములను రిజిస్టర్ చేయాలని కోరింది. అందుకు రాష్ర్టప్రభుత్వం సిద్ధమైతే తాము డబ్బు కట్టడానికి సిద్ధమేనని తెలిపింది. అలా కాకుండా సదావర్తి భూములకు మళ్లీ వేలం వేసినా ఆ వేలంలో తాము పాల్గొనడానికి సిద్ధమని, నిబంధ నల ప్రకారం ఈఎండీగా రూ. 10 లక్షలు కట్టి వేలంలో పాల్గొంటామని పేర్కొంది. ‘‘రూ.28.05 కోట్లు కట్టి వేలంలో పాల్గొనాలన్న షరతు మాకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. మిగిలిన బిడ్డర్ల మాదిరిగా రూ.10 లక్షల ఈఎండీ కట్టి వేలంలో పాల్గొనడానికి మాకూ అవకాశం ఇవ్వండి.’’అని పేర్కొంది. తొలిసారి వేలం నిర్వహించినపుడు వేలంలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలు కట్టిన ఈఎండీ మొత్తం అదేనని ఆ సంస్థ తెలిపింది. ఎవరు ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడితే వారికి ఆ భూములు అప్పగించాలని, తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పేర్కొంది. -
మాకివ్వండి...ఐదుకోట్లు ఎక్కువిస్తాం
-
మాకివ్వండి...ఐదుకోట్లు ఎక్కువిస్తాం
- ప్రభుత్వానికి మూడు సంస్థల ప్రతిపాదన - సదావర్తి భూముల వ్యవహారంలో కీలకపరిణామం - ఆ ప్రతిపాదనల గురించి బైటపెట్టని రాష్ర్టప్రభుత్వం - ఎక్కువ వస్తే భూములిచ్చేస్తామని గతంలో హైకోర్టులో ఒప్పుకున్న సర్కారు సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల కుంభకోణంలో కీలకపరిణామం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఇష్టారాజ్యంగా దేవుడి భూములను కొట్టేద్దామనుకున్న ప్రభుత్వ పెద్దలకు గట్టి షాక్ తగిలింది. సదావర్తి భూములను తమకివ్వాలని, వేలం ధరకన్నా రూ. ఐదు కోట్లు అదనంగా చెల్లిస్తామని మూడు సంస్థలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన మూడు ప్రముఖ సంస్థలు ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఆ ప్రతిపాదనల గురించి ముఖ్యమంత్రి గానీ, మంత్రులు లేదా అధికారులు గానీ బైటపెట్టకపోవడం విశేషం. సదావర్తి భూముల కుంభకోణం బట్టబయలై విమర్శలు చెలరేగడంతో వేలంలో వచ్చిన మొత్తం కన్నా ఒక్కరూపాయి అదనంగా వచ్చినా ఆ భూములను వారికి అప్పగిస్తామని రాష్ర్టప్రభుత్వం సవాలు చేసిన సంగతి తెల్సిందే. ఐదుకోట్ల రూపాయలు అదనంగా ఇస్తామని మూడు సంస్థలు ముందుకు రావడంతో ఇపుడు రాష్ర్టప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తిందని అధికారవర్గాలంటున్నాయి. హైకోర్టులోనూ ఒప్పుకున్న ప్రభుత్వం... గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సమీపంలో ఉన్న వెయ్యి కోట్లకు పైగా విలువైన 83.11 ఎకరాల భూములను కేవలం రూ. 22.44 కోట్లకే టీడీపీ నేత రామానుజయ కుటుంబసభ్యులు, వారి మిత్రబృందానికి అప్పజేప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకన్నా ఎక్కువ ధర చెల్లించడానికి ఎవరైనా ముందుకొస్తే ఆ భూములకు తిరిగి వేలం నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఇటీవల ప్రకటించారు. టీడీపీ నేత కుటుంబ సభ్యులు, వారి మిత్రబృందం ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లిస్తామన్న మొత్తానికి అదనంగా మరో ఐదు కోట్లు ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తే వారికి ఆ భూములను అప్పగించడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరుఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు కూడా తెలియజేశారు. ప్రభుత్వ ప్రకటన నేపధ్యంలో రూ. 22.44 కోట్లకు అదనంగా మరో రూ. 5 కోట్లు సత్రం భూములకు చెల్లించడానికి తమ ఆసక్తిని తెలియజేస్తూ 3 సంస్థలు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను పంపించాయి. అధికారుల్లో తర్జన భర్జన సదావర్తి సత్రం భూముల కుంభకోణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అధికారవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేలం నిర్వహించడమే కాక ఆ వేలంలో వచ్చిన మొత్తం కన్నా అదనంగా ఎవరన్నా ఎక్కువిస్తే భూములు అప్పగిస్తామని సవాలు చేసి రాష్ర్టప్రభుత్వం ఇరుక్కుపోయిందని అధికారవర్గాలంటున్నాయి. రాష్ర్టప్రభుత్వం సాక్షాత్తూ హైకోర్టులో ఒప్పుకోవడం, మంత్రి, ముఖ్యమంత్రి పత్రికా సమావేశాలలో పలుమార్లు సవాలు చేశారు. బుధవారం కూడా ముఖ్యమంత్రి రూ. 5 కోట్లు అదనంగా ఇచ్చేవారికి సదావర్తి భూములు ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దాంతో ఇపుడు అదనంగా చెల్లించడానికి ముందుకొచ్చిన సంస్థలలో దేనికో ఒక దానికి ఆ భూములు అప్పగించక తప్పని పరిస్థితి తలెత్తిందని దేవాదాయ శాఖలో ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. దేవుని భూములు కాపాడడం కోసమే.. ప్రజల ఆస్తులను, దేవుడి మాన్యాలను కాపాడాల్సిన రాష్ర్టప్రభుత్వం ఆ బాధ్యతలనుంచి తప్పుకోవడమే కాక వాటిని ఎడాపెడా కైంకర్యం చేస్తోందని, సదావర్తి భూముల వ్యవహారం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఓ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దేవుని భూములను కాపాడడం కోసమే తమ సంస్థ రంగంలోకి దిగిందని, రాష్ర్టప్రభుత్వం సవాల్ చేసినట్లుగా రూ. 5 కోట్లు అదనంగా చెల్లించడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆ ప్రతినిధి తెలిపారు. తాము రాష్ర్టప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన ప్రతులను గవర్నర్‌కు, ఇంకా సంబంధిత అధికారులందరికీ పంపించినట్లు వివరించారు. ఐదుకోట్లు ఎక్కువిస్తే ఇచ్చేస్తాం : సీఎం సదావర్తి భూములపై వేలంలో వచ్చిన రూ. 22 కోట్లు కన్నా రూ. 5 కోట్లు ఎక్కువ ఎవరిస్తే వారికే ఆ భూములు ఇచ్చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. సదావర్తి భూములపై రూ.900 కోట్లు వస్తాయంటున్నారని అందులో ఒక శాతం అదనంగా ఇచ్చినా భూములు వారికిచ్చేస్తామని చెప్పారు. ఈ వార్తలు రాసిన వారికి లీగల్ నోటీసులిచ్చి ప్రాసిక్యూట్ చేయాల్సి వుంటుందని హెచ్చరించారు. తాము వేలం వేసిన సొమ్ము కంటె ఐదు కోట్లు ఎక్కువిస్తే ఎవరికైనా ఆ భూములిచ్చేస్తామన్నారు. ఆ భూములు ఆక్రమణలో ఉన్నాయని, దాని డాక్యుమెంట్ లేదని అందుకే అవి తమవనుకుంటున్నామని ఇష్టమైతే కొనుక్కోమని కమ్ఫర్ట్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీనిపై ఇష్టప్రకారం రాస్తున్నారన్నారు. అయితే రూ. 5 కోట్లు అదనంగా ఇస్తే ఇచ్చేస్తామని ఒకసారి, రూ. 900 కోట్లలో ఒకశాతం అదనంగా ఇస్తే ఇచ్చేస్తామని మరోసారి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. -
గుడులు కూల్చి.. మాన్యాలు మింగుతూ
-
గుడులు కూల్చి.. మాన్యాలు మింగుతూ
ఆపై ముఖ్యమంత్రి ఎదురుదాడి ♦ సదావర్తి కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయినా బెదిరింపులు ♦ సాక్ష్యాలతో సహా బైటపెట్టడమే ‘సాక్షి’ నేరమట.. ♦ పత్రికలకు, పబ్లిషర్లకు నోటీసులిస్తామని హెచ్చరిక సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎంతవారికైనా దైవభీతి ఉంటుంది. దేవుడికి అన్యాయం కాదు కదా కనీసం అపచారం కూడా చేయడానికి భయపడతారు. కానీ విచ్చలవిడి అవినీతిలో విశ్వరూపం చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అలాంటి పట్టింపులేవీ లేనట్లు కనిపిస్తోంది. ఒకవైపు గుడులను కూల్చివేయిస్తున్నారు. కృష్ణాపుష్కరాల పేరుతో ఆలయాల విధ్వంసం జరిపించారు. అన్నివైపుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో కాస్త ఉపశమించారు. అదే సమయంలో గుడి మాన్యాలను కొల్లగొడుతున్నారు. వెయ్యికోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను తమ్ముళ్లతో కలసి హాంఫట్ స్వాహా చేసేశారు. రూ.1,084 కోట్ల విలువైన 83 ఎకరాల సత్రం భూములను రూ.22 కోట్ల కారుచౌక రేటుకు కొట్టేశారు. ఈ కుంభకోణాన్ని ససాక్ష్యంగా ‘సాక్షి’ బైటపెట్టింది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ నిజనిర్ధారణ బృందాలు ఆ ప్రాంతాలలో పర్యటించి తప్పు జరిగినట్లు నిర్ధారించాయి. ఎకరా భూమి విలువ రూ.6 కోట్లు పలుకుతున్నట్లు సాక్షాత్తూ దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ నివేదించినా ప్రభుత్వం పట్టించుకోకుండా పప్పుబెల్లాలకు వేలం వేసేసినట్లు సాక్ష్యాధారాలతో సహా బైటపడింది. రూ. 1,058 కోట్ల మేర ప్రజాధనాన్ని పథకం ప్రకారం లూటీ చేసేసిన సంగతి ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంత జరిగినా ముఖ్యమంత్రి వైఖరిలో వీసమెత్తు మార్పు లేదు. తప్పు చేసినందుకు తలదించుకోవలసింది పోయి దానిని బైటపెట్టినవారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే అనేకరకాలుగా ‘సాక్షి’పై కక్షసాధింపు సాగుతోంది. సదావర్తి వ్యవహారంలో లీగల్ నోటీసులూ అందుతున్నాయి. ఎన్నో నిర్బంధాలను తట్టుకున్న ‘సాక్షి’కి ఇవేవీ కొత్త కాదు. ప్రజల పక్షాన వాస్తవాలను వెల్లడించడం, తప్పు జరిగితే నిలదీయడం వంటివి కొనసాగిస్తూనే ఉంటుంది. సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం నిబంధనల మేరకు నడుచుకోలేదని, ‘బాబు’లంతా పథకం ప్రకారం భూములు కొల్లగొట్టారని బైటపెట్టడం అందులో భాగమే... ముఖ్యమంత్రి బెదిరింపుల నేపథ్యంలో సదావర్తి కుంభకోణం జరిగిన తీరును.. అందులో జవాబులేని ప్రశ్నలను పరిశీలిద్దాం... ఇదీ కుంభకోణం.. అమరావతిలోని అమరేశ్వరాలయానికి చెందిన ‘శ్రీ సదావర్తి సత్రం’ భూములు కబ్జాకు గురవుతున్నాయని గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖరాయడం, ఆ భూమిని విక్రయించాలని ప్రతిపాదించడం, దానికి సీఎం కార్యాలయం ఆగమేఘాలపై అనుమతించడం అంతా పథకం ప్రకారం జరిగింది. ఆ వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబసభ్యులు, మరో ఆరుగురు కలిసి ఆ భూములను వేలంలో కొనుగోలు చేశారు. చెన్నై సమీపంలోని తాలంబూరు ప్రాంతంలో ప్రభుత్వ ధరల ప్రకారమే ఎకరా భూమి రూ.6 కోట్లు ఉంది. అక్కడ ప్రైవేట్ రియల్ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో 200 చదరపు గజాల ఇంటిస్థలం రూ. 55 లక్షలు పలుకుతోంది. అంటే బహిరంగ మార్కెట్లో సదావర్తి భూముల ధర ఎకరా రూ. 13 కోట్లు వరకు ఉంటుంది. అయితే సత్రం ఈవో ఎకరా కేవలం రూ.50 లక్షల చొప్పున అమ్మకానికి ప్రతిపాదించారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఆ ధరను మరింత తగ్గించారు. ఎకరా రూ.27 లక్షల చొప్పున 83.11 ఎకరాలను రూ. 22.44 కోట్లకు కట్టబెట్టారు. అంటే రూ. 1,080.43 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ. 22.44 కోట్లకు కట్టబెట్టేశారన్నమాట. సర్కారు ఖజానాకు రూ. 1,058 కోట్లు నష్టం చేకూర్చారన్నమాట. ఈ ప్రశ్నలకు బదులేది? ► సదావర్తి భూములు ఎకరం రూ.6 కోట్లు విలువ చేస్తాయని తన పరిశీలనలో తేలిందని, భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ నివేదించారా లేదా? ఆ లేఖను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ► సదావర్తి భూముల సమీపంలో సత్యభామ యూనివర్సిటీ, హిందుస్థాన్ యూనివర్సిటీ, టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలు, స్టార్ హోటళ్లు, భారీ అపార్ట్మెంట్లు, రిసార్టులు, గేటెడ్‌కమ్యూనిటీలు ఉన్న మాట వాస్తవం కాదా?అలాంటపుడు అవి విలువైన భూములని ప్రభుత్వానికి ఎందుకు అనిపించలేదు? ► సదావర్తి భూములు ఆక్రమణలో లేవని, ఆ భూముల చుట్టూ చక్కగా కంచె వేసి ఉన్నదని ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ నిజనిర్ధారణ బృందాల పరిశీలనలో తేలిన మాట వాస్తవం కాదా? ► అసలు ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? లేక పప్పు బెల్లాలకు విక్రయించేస్తారా? ► ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే బాధ్యత గలిగిన ఓ ఎమ్మెల్యే ఆ భూమిని రక్షించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిం చాలి. ఎవరైనా చేసేదదే. కానీ కొమ్మాలపాటి శ్రీధర్ మా త్రం అమ్మేయాలని ప్రభుత్వానికి సూచించడంలోని మతలబేమిటి? ఆయన సూచనకు సీఎం కార్యాలయం వెంటనే స్పందించడం, నెల తిరక్కుండానే దేవాదాయశాఖకు ఉత్తర్వులిచ్చేయడం వెనక గూడుపుఠాణీ జరగలేదంటారా? ► భూముల వాస్తవ ధర ఎంత ఉందో తెలిసినా సదావర్తి భూములను చౌకగా విక్రయించడానికి అనుమతి ఇచ్చినట్లు రాష్ర్టప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వివరణ ఇవ్వలేదా? సదావర్తి సత్రం భూముల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగుకు రూ. 1,700 చొప్పున ఎకరాకు రూ. 6 కోట్ల వరకు ధర ఉన్నట్లు ప్రభుత్వానికి తెలుసని దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చిన వివరణ పరిశీలిస్తే ఇందులో కుంభకోణం జరిగినట్లు అర్ధం కావడం లేదా? ► ఆక్రమణలో ఉన్నాయి కాబట్టి వేలంలో ఎకరా రూ.50 లక్షలు బేసిక్ ధరగా నిర్ణయించినట్లు చెబుతున్న ప్రభుత్వం వేలం పాట సమయంలో అప్పటికప్పుడు ఎకరం ధరను రూ. 27 లక్షలకు ఎందుకు తగ్గించి అమ్మాల్సి వచ్చింది? ► విజయవాడ దుర్గగుడి వద్ద ఈ ఏడాది చెప్పుల షాపు నిర్వహణకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. గతేడాది కన్నా రూ. 2 లక్షలు తక్కువకు పాట వచ్చిందని ఆ వేలాన్ని రెండుసార్లు వాయిదా వేసింది. 3వసారి వేలం నిర్వహించి అనుమతి తెలిపింది. అలాంటిది రూ. 1,084 కోట్ల విలువైన భూముల వేలంలో రాష్ర్టప్రభుత్వం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ► రాష్ర్టంలో ఏ గుడి అధీనంలోని దుకాణాన్నైనా అద్దెకు ఇవ్వాలంటే దేవాదాయ శాఖ ఈ - టెండర్ విధానాన్ని అమలు చేస్తోంది. సదావర్తి భూముల విక్రయానికి మాత్రం ఈ టెండర్‌ను పిలవకుండా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ బహిరంగ వేలం గురించి కూడా అధికార పార్టీ నేతలు మినహా ఇతరులెవరికీ తెలియకుండా జాగ్రత్త పడడం వెనక మతలబేమిటి? ► సదావర్తి భూముల వ్యవహారంలో సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్న దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ దానికి తన అభిప్రాయాన్ని జతపరిచి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. సదావర్తి భూముల వేలం వ్యవహారంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదని, ఆ వేలం ను రద్దు చేయాలని ప్రసాద్ సూచించినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్న ఆ నివేదికపై నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి జాప్యం చేయడం వెనక ఉన్న మర్మమేమిటి? -
సదావర్తి భూములను కాపాడేదెవరు ?
-
రూ.400 కోట్ల భూమిని సీఎం కానుకగా ఇచ్చారా?
తిరుపతి కల్చరల్: తమిళనాడులో టీడీపీ నేతలు ఆక్రమ మార్గాల్లో స్వాధీనం చేసుకున్న సదావర్తి సత్రం భూములను తక్షణం ప్రభుత్వానికి అప్పగించాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు పంచుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తిరుపతిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరలింగేశ్వర సదావర్తి సత్రం భూములు తమిళనాడు రాష్ట్రంలో 471 ఎకరాలు ఉన్నాయని, ఇవి దాదాపుగా అన్యాక్రాంతమయ్యాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం 100 ఎకరాలు స్వాధీనం చేసుకుని సాప్ట్వేర్ కంపెనీకి కట్టబెట్టిందన్నారు. కొందరు ఆక్రమించుకుని పట్టాలు పొందారన్నారు. మిగిలిన 87 ఎకరాలు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజ కుమారుడు వేలంలో రూ.23 కోట్లకు కొనుకున్నామని చెబుతున్నారు. నిజానికి వేలం ప్రకటన ఇవ్వకుండా పబ్లిక్ యాక్షన్ లేకుండా ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా ఓ పథకం ప్రకారం వేలం నాటకమాడి వందల కోట్లు విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. రూ.400 కోట్ల విలువైన భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు కానుకగా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి తారా స్థాయికి చేరిందని దానిని అదుపు చేయడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉంటూ జల వివాదాలను పరిష్కరించలేకపోతోందని విమర్శించారు. ఏ సమస్యతో రాష్ట్రం విడిపోయిందో అదే సమస్యలు ఇంకా వెంటాడుతున్నా ముఖ్యమంత్రులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. హైకోర్టు బెంచ్‌ను విభజించడంతో పలు సమస్యలు తలెతుతున్నాయన్నారు. ఈ సమస్యను పట్టించుకోవాల్సిన గవర్నర్ కొండకు వచ్చి ఆ దేవుడే పరిష్కరించాలి చేతులెత్తేయడం భావ్యంకాదన్నారు. గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చూసి టీడీపీ ఎందుకు భయపడుతోందని, రాజకీయ ప్రచారాన్ని ఆహ్వానించాలన్నారు. వారు చూపించే లోటుపాట్లను ప్రభుత్వం సరిదిద్దుకోవాలని ఓ ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. -
సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించే దమ్ముందా ?
కొమ్మాలపాటికి కావటి మనోహర్ సవాల్ పట్నంబజారు(గుంటూరు): పూర్తి నీతి నిజాయితీలతో సదావర్తి భూములు కొనుగోలు చేసి ఉంటే సీనియర్ సిట్టింగ్ జడ్జితోనూ, లేక రిటైర్డ్ జడ్జితోనూ దర్యాప్తు చేయించే దమ్ము ఉందా అని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు సవాల్ విసిరారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లాకార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అమరావతిలోని సదావర్తి సత్రం భూముల విషయంలో నిబంధనలకు తిలోదకాలిచ్చిన మాట వాస్తవం కాదా అని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను ప్రశ్నించారు. భూములు ఆక్రమణలో ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసి, ఆలయ అభివృద్ధికి ఆ నిధులు వెచ్చించాలని కొమ్మాలపాటి లేఖ రాయడం నిజం కాదా అన్నారు. ఈ నెల 26వ తేదీన చెన్నైలో సదావర్తికి సంబంధించిన 83 ఎకరాలను వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ చైర్మన్ ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో పరిశీలించామని తెలిపారు. స్థానికులను, అక్కడి ప్రజలను, మీడియా ప్రతినిధులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నామన్నారు. భూములను పూర్తిస్థాయిలో అక్రమంగా కొనుగోలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎకరం రూ.6.50 కోట్లు ఉందని చెప్పడం నిజం కాదా..? తమిళనాడు ప్రభుత్వమే రూ. 6.50 కోట్లు ఎకరం విలువ ఉందని చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా, దేవాదాయ శాఖ భూములు విక్రయించాలంటే తప్పనిసరిగా హైకోర్టు అనుమతి అవసరమని, వాటిని కూడా బేఖాతరు చేసి కేవలం రూ. 28 లక్షలు చొప్పున భూములు కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రణాళికా బద్ధంగానే భూములు దోచుకునేందుకు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డిని నియమించుకున్నారని ఆరోపించారు. కొమ్మాలపాటి ఆఖరికి దేవుడి భూములను కూడా వదలడం లేదని ధ్వజమెత్తారు. భూములు నిజాయితీతో కొన్నారంటే బహిరంగ చర్చకు రాగలరా... అని ప్రశ్నించారు. స్పష్టంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారి బ్రమరాంబ వేలంపాటలో అక్రమాలు జరిగాయని చెప్పినప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి, సీఎం ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదన్నారు. వైఎస్సార్సీపీ సేవాదళ్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొత్తాచిన్నపరెడ్డి, సయ్యద్ మాబు, పార్టీనేతలు తేలుకుట్ల శ్రీకాంత్, పాలపాటి రఘు, బసవపూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
అమరావతి సెంటర్లో నిలబడతా...
► దమ్ముంటే బహిరంగ చర్చకు రండి ► సదావర్తి భూములపై న్యాయపోరాటానికి సిద్ధం ► టీడీపీ నేతలకు వైఎస్సార్సీపీ నేత కావటి సవాల్ పట్నంబజారు(గుంటూరు) : అమరావతిలోని సదావర్తి సత్రానికి సంబంధించి ఒక్క అంగుళం భూమి కూడా అక్రమార్కులకు దక్కనివ్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నీతిపరుడని, సచ్ఛీలుడని చెబుతున్న ఆ పార్టీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తాను అమరావతి దేవస్థానం వద్ద వచ్చి నిలబడి ఉంటానని, దమ్ముంటే చర్చకు రావొచ్చన్నారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ భూములను లాక్కునే పరిస్థితి వస్తే యుద్ధం తప్పదని చెప్పారు. కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, కచ్చితంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. సదావర్తి భూముల విషయంలో అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమన్నారు.