సదావర్తి సత్రం భూముల వేలం విషయంలో తమ పార్టీ చెప్పిందే నిజమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు తన మనుషులకు కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు చేసిన కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. దేవుడి భూములనే దోచేయాలని చూశారని, నేటి వేలంపాట ధరతో ప్రభుత్వ అవినీతి బట్టబయలైందన్నారు.