Kolusu Partha Sarathy
-
ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి మృతికి సీఎం జగన్ నివాళి
-
ప్రెసిడెంట్ మెడల్ అనేది టీడీపీ బ్రాండ్: ఎమ్మెల్యే పార్థసారథి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాపాన నిషేధాన్ని ఎత్తేసేందుకు చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతోందని ఆనాడు చంద్రబాబు మద్యానికి తలుపులు తెరిచారని అన్నారు. డిస్టిలరీస్ నుంచి రూ.వేల కోట్లు వసూలు చేశారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ప్రెసిడెంట్ మెడల్ అనేది టీడీపీ బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. ప్రెసిడెంట్ మెడల్ అనేదానికి చంద్రబాబే పర్మిషన్ ఇచ్చారని అన్నారు. ఊరూరా మద్యాన్ని ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. -
మోసం చేశామని టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి: కొలుసు పార్థసారధి
సాక్షి, తాడేపల్లి: అన్నపూర్ణ లాంటి ఆంద్రప్రదేశ్‌ను చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి నిప్పులు చెరిగారు. కేవలం టీడీపీ తాబేదార్లకు లాభం చేకూర్చేలా దోచుకున్నారని ధ్వజమెత్తారు. అయిదేళ్లలో చేసిన పాపానికి చంద్రబాబును జనం ఛీత్కరించినా సిగ్గురాలేదని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలు దేహీ అని ఆదుకునే పరిస్థితి కల్పించాడని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై టీడీపీ చార్జ్‌షీట్ వేయ్యడంపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత 90శాతం మేనిఫెస్టో అమలు చేసిన తమపై ఛార్జ్ షీట్ వేయడం హాస్యాస్పదమన్నారు.. అదీ ఈఎస్ఐ స్కాం చేసిన అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్ వేయడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన దానిపై చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులకు కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకుపోయిన చంద్రబాబు సిగ్గులేకుండా చార్జ్ షీట్ వేస్తాడా అని ప్రశ్నించారు. చదవండి: గెలిచింది మేమే.. బుర్ర పనిచేయడం లేదా?: కొడాలి నాని అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షన్నర మందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ‘ఆ రోజు ఎస్సీ, బీసీ, మహిళలను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు. మేము వాళ్ళ అభ్యున్నతికి చట్టాలు చేసి రిజర్వేషన్లు ఇస్తే మాపై చార్జ్ షీట్ వేయడానికి సిగ్గులేదా..? అధికారంలో ఉన్నప్పుడు ఏ పేదవారికైనా ఇళ్లస్థలం ఇచ్చావా..? జగనన్న 30 లక్షల మంది మహిళకు ఇల్లు కట్టిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప రైతులకు కాదు. తుఫాను పరిహారం సైతం మీరు ఎగ్గొట్టలేదా..? ఏదన్నా చార్జ్ షీట్ వేయాల్సి వస్తే టీడీపీపై వేయాలి. ఎంతసేపు విధ్వంసం చేయడం తప్ప ఈ రాష్ట్ర బాగు కోసం ఏమైనా చేశారా..? మీ దోపిడీ మాఫియా కోసం ఆఖరికి మహిళా అధికారులను సైతం జుట్టుపట్టుకుని దాడి చేశారు. మీ అయిదేళ్ల అధికార మదంతో కాల్ మనీ వ్యవహారం నడిపిన విషయం ప్రజలు మర్చిపోలేదు. స్కోచ్ అవార్డుల్లో మొదటి స్థానం రావడం ఓర్వలేక ఈ చార్జ్ షీట్ నాటకం ఆడుతున్నారు. ఆఖరికి సీఎంఆర్ఎఫ్లో లంచాలు మేసిన మీరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారా..? చదవండి: ప్రతి మండలానికి రెండు జూనియర్ కళాశాలలు: సీఎం జగన్ మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు చూడలేదా...మీరు ఎలా గెలుస్తారు..? ఇక చంద్రబాబును అండమాన్ పంపాల్సిన అవసరం వచ్చినది అని వాళ్ళ పార్టీ వారే అనుకుంటున్నారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడే ఛార్జ్ షీట్ వేయడం విడ్డూరం. చార్జ్ షీట్ కాదు మేము ప్రజల్ని మోసం చేశామని టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి క్షమాపణలు చెప్పాలి. తప్పకుండా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి...అప్పుడు చూద్దాం అచ్చెన్నాయుడు’ అని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పేర్కొన్నారు -
రైతులపై కాల్పుల ఘటనకు 21 ఏళ్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ ధరలు తగ్గించాలని పోరాటం చేస్తున్న రైతులపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో చంద్రబాబు కాల్పులు జరిపించి నేటికి 21 ఏళ్లు పూర్తి అవుతాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కాల్పుల్లో ముగ్గురు అన్నదాతలను పొట్టనబెట్టుకున్నారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. బషీర్‌బాగ్ ఘటనను నేటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదన్నారు. బాబు తొలి నుంచి రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ అంటే హేళన చేసిన చరిత్ర బాబు సొంతమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల్లో ఘోర పరాజయం పాలయ్యాక మతి భ్రమించి ఉన్మాదిలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను దేశంలో అందరూ మెచ్చుకుంటుంటే చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు జరిగితే చూసి ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. పెట్రోల్, డీజిల్ మీద ఒకేసారి రూ.4 టీడీపీ ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. రూ.2.5 లక్షల కోట్లు అప్పులు చేసి.. ఒక్క కొత్త రోడ్‌ను వేయలేదని.. ఉన్న రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి సెస్‌తో వచ్చే ఆదాయంతో రోడ్లను బాగు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చంద్రబాబు తన హయాంలో అమ్మఒడి, నాడు–నేడు, ఆర్బీకేలు, సచివాలయాలు వంటి ఒక్క కార్యక్రమాన్ని అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా.. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా రూ. 1,04,241 కోట్లను ప్రజల ఖాతాల్లో జగన్ ప్రభు త్వం జమ చేసిందన్నారు. పరోక్షంగా మరో రూ.36 వేల కోట్లను ప్రజల జీవితాల మెరుగుకు వెచ్చించిందన్నారు. రెండు, మూడు రకాల పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వారిని లెక్కిస్తే రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారన్నారు. రాష్ట్రానికి ఆదాయం రాకుండా బాబు తన మనుషుల ద్వారా ఆర్బీఐ, కేంద్రానికి ఫిర్యాదులు చేయించడంతోపాటు బ్యాంకర్ల దగ్గరకు వెళ్లి ప్రభుత్వానికి అప్పులు ఇవ్వొద్దని చెబుతున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఆ డబ్బులో 10 శాతం కూడా ప్రజలకు చేరకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు ధర్నా చేస్తారా అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లీటర్ డీజిల్, పెట్రోల్‌పై రూ.25 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఎప్పుడూ కేంద్రంపై ఒత్తిడి చేయలేదన్నారు. ఇవీ చదవండి: రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ -
పంచాయతీలకు మించిన ఫలితాలు రాబోతున్నాయి..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 వార్డుల్లో మహిళా అభ్యర్థులు ఏకంగా 13 వార్డుల నుంచి బరిలో నిలిచారు. ప్రచారంలో ఎమ్మెల్యే పార్థసారధి అన్నీ తానై వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ అభ్యర్ధులని ఆశీర్వదించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపోల్స్‌లో ప్రచార సరళిపై ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు బహ్మరధం పడుతున్నారన్నారు. మున్సిపోల్స్‌లో పంచాయితీలకు మించిన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం జగన్ మీద ఉన్న నమ్మకానికి ఫలితాలు ప్రతిబింబంగా నిలుస్తాయన్నారు. టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమం అటకెక్కిందని, దాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ ఏడాదిన్నర కాలంగా అహర్నిశలా శ్రమిస్తున్నారన్నారు. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో సీఎం జగన్ ప్రజలకు చూపించారన్నారు. ప్రజల గుండెల్లో సీఎం జగన్ చెరగని స్థానం సంపాదించుకున్నారని ఆకాశానికెత్తారు. పల్లె తీర్పుతో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ప్రస్తుత టీడీపీ పరిస్థితి నడి సముద్రంలో మునుగుతున్న నావ లాంటిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు వేసినా తెలుగుదేశాన్ని ఒడ్డుకు చేర్చలేరని, ఆయన రిటైరెంట్ తీసుకొంటే ఉన్న కాస్త పరువైనా మిగులుతుందని సూచించారు. -
‘ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’
సాక్షి, కృష్ణా జిల్లా: మహానేత, తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తండ్రిని మించిన పాలన అందిస్తున్నారని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పార్థసారథి పాల్గొన్నారు. కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి ప్రధాన రహదారి నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు ఎడ్ల బండిపై ర్యాలీగా వచ్చి.. వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.(అపర భగీరథుడు.. తండ్రికి తగ్గ తనయుడు! ) ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయం దండగ.. ఐటీ అభివృద్ధితోనే పండగ అన్న వ్యక్తి చంద్రబాబు. టీడీపీ పాలనలో రైతు సంక్షేమాన్ని గాలికొదిలేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రైతులకు మంచి రోజులు వచ్చాయి. అనేక ప్రాజెక్టులు పురుడు పోసుకొన్నాయి. రైతు సంక్షేమానికి మెరుగైన బాటలు పడ్డాయి. పేదలకు ఆరోగ్య రక్ష , ఉన్నత చదువులు, రైతు సంక్షేమాన్ని సమపాళ్లలో అందించారు. తండ్రికి తనయుడైన సీఎం వైఎస్ జగన్.. మాటల టీడీపీ ప్రభుత్వానికి , చేతల వైఎస్సార్ సీపీ పాలనకు ఏడాదిలోనే వ్యత్యాసం చూపించారు. ఆయనకు ఉన్న జనాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఆటంకాలు సృష్టించే కుట్రలు చేస్తున్నారు. టీడీపీ విధ్వంసకర రాజకీయాలకు పచ్చమీడియా వత్తాసు పలుకుతోంది. గతంలో వైఎస్సార్ సీపీ వాళ్ళకి పెన్షన్ తొలగించిన టీడీపీ నేతకు ఈ రోజు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మాది. 30 లక్షల మందికి ఇంటి స్థలాల పట్టాలు సిద్ధం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’’ అని పేర్కొన్నారు.(ప్రజల మనిషి.. ప్రజలు మెచ్చిన మనిషి ) -
చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి: పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఇసుకను అడ్డం పెట్టుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. వరద తగ్గిన కారణంగా ఇసుక తీయడం ఎక్కువైందని.. ప్రస్తుతం సగటున రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులో ఉందని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అయినప్పటికీ ఇసుక దీక్ష పేరిట చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని.. ఇందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని చురకలు అంటించారు. ఇసుకపై చంద్రబాబు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి విజయవాడ బందరురోడ్డులో తన క్యాంపు ఆఫీసు సమీపంలో గురువారం ధర్నాకు దిగారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇసుక మాఫియాతో దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబుకు అసలు ఇసుక గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయాన్ని మంత్రి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వర్షాలు పడ్డాయి. వరదల కారణంగా ఇసుక తీయడం కష్టమైంది. దీంతో చంద్రబాబు ఇసుకపై తప్పుడు రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క ధర్నా జరగనీయలేదు. ఇప్పుడేమో ఇసుకను అడ్డం పెట్టుకుని దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారు. దీక్ష అంటూ నాటకాలు ఆడుతున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకరు. మా పాలనలో ఎక్కడా ఇసుక మాఫియా లేదు. తప్పుడు చార్జిషీటు విడుదల చేసి దుష్ప్రచారం చేయడం సరికాదు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు సాగనివ్వం’ అని చంద్రబాబు తీరును మంత్రి ఎండగట్టారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా.. చంద్రబాబుది దొంగ దీక్ష అని.. ఆయనను ప్రజలు ఎవ్వరు నమ్మడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అలాంటిది ఆయన దీక్ష చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ‘చంద్రబాబు వేసిన చార్జిషీటు పరమ బోగస్. ఇసుక దోపిడిలో చంద్రబాబుకు ఎన్జీటీ వంద కోట్ల జరిమానా వేసింది. ఇలా దొంగ దీక్షలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావు’ అని ఎద్దేవా చేశారు. -
మీలా.. హామీలు వదిలేయమంటావా బాబూ..
-
గెలిస్తే ‘బాబు’ కృషి.. ఓడితే కార్యకర్తలదా లోకేశా..!
సాక్షి, విజయవాడ : తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీ నాయకులు ఓటమి బాధ్యతను తోసేయకుండా పునరాలోచన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి హితవు పలికారు. టీడీపీ ఓటమికి కార్యకర్తలు, నేతలదే బాధ్యత అని మాజీమంత్రి లోకేశ్ వ్యాఖ్యానించడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే అది చంద్రబాబు గెలుపు అని.. నేడు ఓడిపోతే కార్యకర్తలు, నేతలే కారణమని చెప్పడం లోకేశ్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల సందర్భంగా విజయమైనా.. ఓటమైనా తనదే బాధ్యత అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. లోకేశ్, చంద్రబాబు పిరికిపందలని అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. (చంద్రబాబును టీడీపీ నేతలే మోసం చేశారు: లోకేష్) అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నామని ప్రకటించిన చోటనే చంద్రబాబుకు ప్రజలు తగిన బుధ్ది చెప్పారని అన్నారు. ఏం పని చేసినా.. చివరికి ప్రజల సౌకర్యార్థం రోడ్డువేసినా తామే చేశామని, పెన్షన్ ఇచ్చినా తామే ఇచ్చామని అహంకారపూరిత ధోరణితో మాట్లాడిన టీడీపీ నేతలకు ప్రజలు తగిన శాస్తి చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడు అని చెప్పిన చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచారని.. ఇవన్నీ ప్రజలు మరచిపోతారనకుంటే పొరపాటే అవుతుందని పార్థసారథి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ సమాధిని అలంకరించలేని దయనీయ పరిస్దితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికభారం పడకుండా ప్రమాణస్వీకారం.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అదించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. 50 శాతం ఓట్లతో విజయం ఆషామాషిగా వచ్చింది కాదు. వైఎస్ జగన్ ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేశారు. 14 నెలలపాటు మూడువేల ఆరు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఇద్దరితో ప్రారంభమైన వైఎస్సార్సీపీ నేడు ప్రజాభిమానంతో అధికారంలోకి చేరుకుంది. టీడీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దుష్పరిపాలనను గుర్తించని ఎల్లోమీడియా నేడు వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని వక్రీకరించాలని చూస్తోంది. గెలిచిన మరుక్షణం రాష్ట్రానికి మేలు చేయాలనే ఉధ్దేశంతో ఆయన తెలంగాణ సీఎం కేసిఆర్‌తో నదీజలాల గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్దితిని గురించి వివరించారు. సహాయం కోరారు. కానీ, కొన్ని మీడియా సంస్థలు కేంద్రంతో యుద్ధం ప్రకటించాలని ప్రచారం చేస్తున్నాయి. ముందు మేం రిక్వెస్ట్ చేస్తాం...అని ప్రకటిస్తే అడుక్కోవడం అని వక్రీకరించారు. వైఎస్ జగన్ పోరాట పటిమ రాష్ట్ర్ర ప్రజలకు తెలుసు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో ఆయన చిత్తశుద్దితో ఉంటారని అందరికీ తెలుసు. కేవలం రాజకీయ శక్తిగా ఎదగాలనేకాదు.. ప్రజలకు మేలైన పరిపాలన అందించి వారి హృదయాల్లో స్థానం సంపాదించాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అవినీతికి అడ్డుకట్ట వేసి రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు తీసుకువెళ్లే బృహత్తర బాధ్యతను ఆయన తలకెత్తుకున్నారు. ప్రతి పైసా సద్వినియోగం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలు నిర్వహించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా.. ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30 (గురువారం)న మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు’ అని పార్థసారథి అన్నారు. -
బాబు కన్ను పడినందుకే ఈ దుస్థితి..
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నిర్వాకం వల్లే ఆర్టీసీకి దుస్థితి దాపురించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ అస్థిత్వం డోలాయమానంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన అనుచరుల కన్ను ఆర్టీసీపై పడిందని.. అందుకే దీనిని కబళించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీని బంగారు బాతులాగా భావించారే గాని, నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చంద్రబాబు కనీస చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టాక్స్ భారం మోపి నష్టాల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది కార్మికుల ఆవేదనకు చంద్రబాబు తీరే కారణమని మండిపడ్డారు. ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ‘ పోలవరం, నవ నిర్మాణ దీక్షలకి ఆర్టీసీ బస్సులు వాడి చెల్లింపులు చేశారా. దొంగ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ల ద్వారా ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న విషయం చంద్రబాబుకు తెలీదా. కార్మికుల కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పార్థసారథి పేర్కొన్నారు. -
‘బాబూ’ అసలు నీకు సిగ్గుందా?
సాక్షి, అమరావతి/హైదరాబాద్ : తెలంగాణాలో బీసీ కులాలను అక్కడి సీఎం కేసీఆర్ తొలగించారని చెబుతున్న చంద్రబాబు ఈ విషయమై ఏనాడైనా ఎవరికైనా ఒక లేఖ అయినా రాశారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తో తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి కుమ్మక్కయ్యారంటావా అని చంద్రబాబును నిలదీశారు. నిజంగా తెలంగాణాలో కేసీఆర్ బీసీ కులాలను తొలగించి ఉంటే ఆ విషయంపై కేసీఆర్‌కు కనీసం లేఖ రాశావా? వారిని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని గవర్నర్‌ను అయినా కోరావా? అని ఆయన ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో అనేక పర్యాయాలు కేసీఆర్‌ను కలిసిన చంద్రబాబు ఆయనను ఏమాత్రం ప్రశ్నించకుండా, కేటీఆర్ కేవలం ఒకసారి జగన్మోహన్రెడ్డిని కలిస్తే అనవసరంగా నిందలేస్తావా అని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ బాబు కాపీ కొడుతున్నారని ఆక్షేపించారు. ఇలాంటి కాపీమాస్టర్ మరెక్కడా కనబడరని విమర్శించారు. ప్రతీ బీసీ కులానికి కార్పోరేషన్ ఏర్పాటుచేస్తామని జగన్ ప్రకటించారన్నారు. టీటీడీలో సన్నిధి గొల్లలు పదవిని లేకుండా చేసి అవమానిస్తే దానిని జగన్ సరిదిద్దుతానని హామీ ఇచ్చారన్నారు. బీసీల పట్ల చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమలేదని, బీసీలపై ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలోనే మొసలికన్నీరు కారుస్తున్న విషయాన్ని బీసీలు గమనించాలన్నారు. దగా చేసేందుకే జయహో బీసీ : పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలోని బీసీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు మరో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మరోమారు మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రాజమండ్రిలో హడావుడిగా జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ కులాలకు కార్పొరేషన్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ప్రతి ఏటా బడ్జెట్లో బీసీలకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. ఐదేళ్లలో కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అది కూడా పూర్తిగా ఖర్చు చేయలేదని చెప్పారు. చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న చంద్రబాబు ఎక్కడా అమలు చేయలేదన్నారు. నూలు కొనుగోలుపై సబ్సిడీ, హ్యాండ్లూమ్ విక్రయాలపై 30 శాతం రాయితీలు ఇస్తామని పట్టించుకోలేదని విమర్శించారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో..కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: మూడున్నరేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వారి తరపున న్యాయపోరాటంలో కూడా భాగస్వాములం అవుతామని పార్టీ నేతలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 లక్షల కుటుంబాలతో ముడిపడి ఉన్న అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాల్సింది పోయి ఇంకా జటిలం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయిస్తే 20 లక్షల బాధిత కుటుంబాల్లో ముందుగా 14 లక్షల కుటుంబాల సమస్య తీరిపోతుందన్నారు. బాధితుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీ తరపున పోరాడుతామన్నారు. రాష్ట్రస్థాయిలో కూడా కమిటీ వేస్తామన్నారు. -
సిగ్గుపడాల్సిందిపోయి.. స్వాగతిస్తారా?
-
సిగ్గుపడాల్సిందిపోయి.. స్వాగతిస్తారా?
సాక్షి, విజయవాడ: సదావర్తి సత్రం భూముల వేలం విషయంలో తమ పార్టీ చెప్పిందే నిజమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు తన మనుషులకు కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు చేసిన కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. దేవుడి భూములనే దోచేయాలని చూశారని, నేటి వేలంపాట ధరతో ప్రభుత్వ అవినీతి బట్టబయలైందన్నారు. సదావర్తి భూముల వేలంలో అక్రమాలు బయటపడితే సిగ్గుపడాల్సిందిపోయి, స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతికత ఉన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సదావర్తి భూముల వేలంలో కుట్ర కోణంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం లేదని విమర్శించారు. నారాయణలో విద్యాసంస్థల్లో జరుగుతున్నవి ఆత్మహత్యలు కావు, అవి యాజమాన్యం చేస్తున్న హత్యలని పార్థసారధి వ్యాఖ్యానించారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.