ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనైతికంగా దిగజారి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. ఆయన ఆదివారం తాడేపల్లిలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ఏ నాయకుడైనా ఓటమికి గల తప్పులను అన్వేషిస్తారని.. చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు పోలీసుల అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. పత్రికల్లో రాయలేని భాషను మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని సీఎం జగన్‌పై విమర్శలు చేసేందుకే ఉపయోగిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.