
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నిర్వాకం వల్లే ఆర్టీసీకి దుస్థితి దాపురించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ అస్థిత్వం డోలాయమానంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన అనుచరుల కన్ను ఆర్టీసీపై పడిందని.. అందుకే దీనిని కబళించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీని బంగారు బాతులాగా భావించారే గాని, నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చంద్రబాబు కనీస చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టాక్స్ భారం మోపి నష్టాల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది కార్మికుల ఆవేదనకు చంద్రబాబు తీరే కారణమని మండిపడ్డారు.
ప్రభుత్వంలో విలీనం చేస్తాం..
‘ పోలవరం, నవ నిర్మాణ దీక్షలకి ఆర్టీసీ బస్సులు వాడి చెల్లింపులు చేశారా. దొంగ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ ల ద్వారా ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న విషయం చంద్రబాబుకు తెలీదా. కార్మికుల కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పార్థసారథి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment