రూ. 28.05 కోట్లు 72 గంటల్లోగా డిపాజిట్ చేస్తే సదావర్తి భూములు మళ్లీ వేలం వేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్సుకు లేఖ రాశారు. ఆ లేఖను శనివారం పత్రికలకు విడుదల చేశారు. గత ంలో రూ.22.44 కోట్లకు సదావర్తి భూములను వేలం వేయగా, ఆ మొత్తానికి మరో 25 శాతం ఎక్కువ సొమ్మును కలిపి డిపాజిట్ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల విలువైన భూములను దేవాదాయశాఖ కారు చౌకగా వేలం వేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి బంధువులు రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఈ భూములను రూ. 22.44 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు.