మంత్రి లోకేశ్ కు తాకిన అగ్రిగోల్డ్ సెగ
కడప: తమకు సత్వరమే న్యాయం చేయాలంటూ మంత్రి లోకేశ్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు వినూత్న నిరసన చేపట్టారు. ఆయన వెళుతున్న మైదుకూరు రోడ్ మార్గంలో ప్లకార్డ్స్ పట్టుకుని బారులు తీరి నిరసన తెలిపారు. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని ఆయన ముందుకు వెళ్లారు. తమకు వెంటనే న్యాయం చేయాలనీ, అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్లు గడుస్తున్న తమ కష్టాలు తీరలేదని, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తానూ సత్వరమే స్పందిస్తానని బాధితులకు లోకేశ్ హామీ ఇచ్చారు.