తిరుపతి: తిరుపతి వ్యవసాయ కళాశాల విద్యార్థులు గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. దూరవిద్య, ప్రైవేటు కళాశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మంత్రి పత్తిపాటి పుల్లారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విద్యార్థులకు మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళన ఉదృతంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.