ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ప్రిన్సిపాల్
ఫెర్గూసన్ కాలేజీలో ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా దళిత విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. తమపై వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు లేఖ రాసినందుకు తమకు ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారని అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
నినాదాలు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఆందోళన ఉధృతం చేయడం, తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం, ఇతరత్ర కారణాలతో ఫెర్గూసన్ కాలేజీ ప్రిన్సిపాల్ తన లేఖను ఉపసంహరించుకున్నారు. ఓవైపు హైదరాబాద్ లోని హెచ్సీయూతో పాటు జేఎన్యూలోనూ జాతివ్యతిరేఖ నినాదాలు చేయడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశాలుగా మారిన విషయం తెలిసిందే.