ఏయూ లో విద్యార్థినుల ఆందోళన
ఏయూ క్యాంపస్: తమకు సరైన వసతులు కల్పించడం లేదని ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థినులు సోమవారం ఉదయం క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థినులు కళాశాలలకు వెళ్లటానికి యూనివర్సిటీ 8 బస్సులను ఏర్పాటుచేసింది. అయితే, సోమవారం మూడు బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో వారంతా ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
క్యాంపస్‌లో ఉదయం మాత్రమే నీరు సరఫరా అవుతోందని, సాయంత్రం కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హాస్టల్‌లో ఒక్కో గదికి ఐదుగురు చొప్పున ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. భోజనం నాణ్యంగా ఉండటం లేదన్నారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రిజిస్ట్రార్ చర్చలు జరిపారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. వారంలోగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో విద్యార్థినులు