
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
మరో ముగ్గురికి గాయాలు
సాక్షి, చెన్నై / నెల్లూరు(క్రైమ్): చెన్నైలోని ఓ కళాశాలలో చదువుతున్న మిత్రుడ్ని చూసి సరదాగా గడపాలని భావించారు. అనుకున్నదే తడవుగా అక్కడికెళ్లి ఉత్సాహంగా గడిపారు. వీరు ఒకటి సంకల్పంచగా, విధి మరోలా తలచి రోడ్డు ప్రమాద(road accident) రూపంలో ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న హృదయ విదారక ఘటన చెన్నైలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఆనందం.. అంతలోనే ఆవిరి
పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన ధనిష్ రెడ్డి (21) చెన్నై శివార్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్(B.Tech students) తృతీయ సంవత్సరం చదువుతున్నారు. నెల్లూరులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న శ్రేయాష్ (21), మరో ఇద్దరు విద్యార్థులు.. ధనిష్‌రెడ్డిని చూసేందుకు కారులో వచ్చారు. బుధవారం రాత్రి కలిసి, అర్ధరాత్రి వేళ వీరితో పాటు ధనిష్ కళాశాల మిత్రుడు జయంత్‌తో పాటు కారులో సిటీ వైపు బయల్దేరారు.
మార్గమధ్యలో ఊరపాక్కం దాటగానే కిలాంబాక్కం బస్ టెర్మినల్‌కు కూతవేటు దూరంలో ముందుగా వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న కారు ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఘటన స్థలంలోనే ధని‹Ùరెడ్డి, శ్రేయాష్ మరణించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు, జయంత్‌ను చికిత్స నిమిత్తం పోతేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శోకసంద్రం
చెన్నై శివార్లలో జరిగిన రోడ్డుప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టోన్‌హౌస్‌పేటకు చెందిన ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకుడు సుధాకర్‌రెడ్డి కుమారుడు ఎర్రగుంట ధని‹Ùరెడ్డి, రితి్వక్ ఎన్‌క్లేవ్‌కు చెందిన న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాష్ మరణవార్తతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన చెన్నై వెళ్లారు. మృతదేహాలు నెల్లూరుకు గురువారం రాత్రి చేరుకున్నాయి. పలువురు ప్రముఖులు నివాళులరి్పంచి బాధిత కుటుంబాలను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment