andra university
-
టాప్–5లో ఏయూ నిలవాలి
ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోని ఐదు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం–వేవ్స్ 2019కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అరి్పంచారు. అనంతరం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ప్రతి విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘాలు పటిష్టం కావాల్సిన అవసరం ఉందన్నారు. తాము చదువుకుని, తమ ప్రగతికి మూలస్థంభంగా నిలిచిన వర్సిటీకి సహకారం అందించడానికి పూర్వ విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. చదువుల దేవాలయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తోందన్నారు. కలలు కనాలని, వాటిని సాధించే దిశగా పని చేయాలని సూచించారు. ఆచార్యుల భర్తీలో జాప్యం విచారకరం.. తమ మంత్రి వర్గంలో విద్యా శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆదిమూలపు సురేష్ ఓ దళితుడని, తన ఏడో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలోకి మారి ఐఆర్ఎస్ అధికారిగా ఎదిగారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. అతనికి అంతటి తపన, పట్టుదల ఉండబట్టే రాణించారన్నారు. వీటిని చూసి అతనికి విద్యా శాఖ మంత్రిగా నియమించామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 459 ఆచార్యుల పోస్టులు భర్తీ కావాల్సి ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇంత కాలం నియామక ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడం విచారకరమని సీఎం అన్నారు. వర్సిటీ ప్రతిపాదనలకు సహకారం : టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీ విశిష్ట అతిథి టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ మాట్లాడుతూ ఏయూ నుంచి వచ్చే ప్రతిపాదనలకు పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తి నిత్యం నూతన జ్ఞానాన్ని పొందడం, ధనాన్ని సంపాదించడం, పొందిన దానికి తిరిగి ప్రతిఫలాన్ని సమాజానికి చెల్లించడం అనే లక్షణాలను కలిగి ఉండాలని సూచించారు. సాంకేతికత మనకంటే గొప్పది కాదని, సాంకేతికతను వినియోగించుకుంటూ లాభపడుతున్న మానవులే నిజమైన మేధావులని అభిప్రాయపడ్డారు. ఆరి్టఫీíÙయల్ ఇంటిలిజెన్స్ కంటే మన ఇంటిలిజెన్స్ ఎంతో గొప్పదన్నారు. భవిష్యత్తులో సాధించాల్సినవి చాలా ఉన్నాయని, దీనికి సమష్టిగా పనిచేయడం ఎంతో అవసరమని చెప్పారు. తాను ఏయూకు రాక ముందు ఒక వృద్ధ విశ్వవిద్యాలయానికి వెళుతున్నానని భావించానన్నారు. ఇక్కడ యువతలోని ఉత్సాహం, పూర్వ విద్యార్థుల సహకారం, వర్సిటీ వీసీ దార్శనికతతో కూడిన పనితనం తనను అబ్బురపరిచాయన్నారు. ఈ రోజు తనకు అత్యంత స్ఫూర్తిని నింపిన రోజుగా నిలుస్తుందని చెప్పారు. ఉన్నత అవకాశాలకు వారధి ఆంగ్ల భాష : జీఎంఆర్ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్దం దిశగా అడుగులు వేస్తోందన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆవిర్భావం వికాసాలను వివరించారు. విద్యను ప్రోత్సహించే ముఖ్యమంత్రిని రాష్ట్రం కలిగి ఉండడం ప్రజల అదృష్టమన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన మంచి నిర్ణయమన్నారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చి ఇంజినీరింగ్‌లో చేరిన తొలినాళ్లలో పడిన ఇబ్బందులను వివరించారు. ఉన్నత అవకాశాలకు ఆంగ్ల భాష ఒక వారధిగా నిలుస్తుందన్నారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సమర్థతను విశ్వవిద్యాలయం ఒక అలవాటుగా మార్చుకుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో ఇంజినీరింగ్ కళాశాల సీట్లు రెట్టింపు చేయడం సాధ్యమైందన్నారు. నాక్ గ్రేడింగ్, రూసా పథకం అమలు, ఎంహెచ్ఆర్డీ ర్యాంకుల్లో ఏయూ ముందుంటోందన్నారు. ప్రతి కుటుంబం నుంచి విద్యావంతులు రావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, దీనిని సాకారం చేసే దిశగా పని చేస్తున్నామని చెప్పారు. ఆచార్యుల పదవీ విరమణ కారణంగా తాత్కాలిక ఉద్యోగులతో వర్సిటీ నిర్వహణ కొనసాగిస్తున్నామన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలతో కూడిన ఉపాధిని పొందేలా తీర్చిదిద్దుతామన్నారు. అంబేడ్కర్ చెప్పిన విధంగా ఆంగ్ల మాధ్యమం బోధనను రాష్ట్రంలో ప్రతి విద్యారి్థకి అందించే ప్రక్రియ ఆరంభం అవుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజలకు ఉన్నత విద్యను చేరువ చేశారన్నారు. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం అమలు చారిత్రాత్మకంగా నిలుస్తున్నాయన్నారు. జన హృదయ నేతగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిలుస్తారన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ ఆచార్య బీల సత్యనారాయణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న యువతకు దిశానిర్దేశం చేయాలన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు స్థిర లక్ష్యంతో సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, గొట్టేటి మాధవి, కె.సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, చెట్టి పాల్గుణ, లవ్ అండ్ కేర్ సంస్థ నిర్వాహకులు పి.యేసుపాదం, రిజి్రస్టార్ ఆచార్య వి.కృష్ణమోహన్, కార్యదర్శి బి.మోహనవెంకటరామ్, సంయుక్త కార్యదర్శి కుమార్‌రాజ, పలువురు వీసీలు, మాజీ వీసీలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రూ.50 కోట్ల సాయం.. విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రభుత్వ తరఫున రూ.50 కోట్ల సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. పూర్వ విద్యార్థుల సంఘం రూ.50 కోట్లు నిధులను కార్పస్ ఫండ్‌గా సమీకరించాలని, దీనికి సమానంగా రూ.50 కోట్లు ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు. విద్యతోనే మెరుగైన జీవనం.. విద్య మెరుగైన జీవనాన్ని అందిస్తుందని తాను నమ్ముతానని, అందుకే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలను మూడు దశల్లో రూ.12 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తొమ్మిది ఆవశ్యక అంశాలను ప్రధానంగా తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తామన్నారు. ఉపాధిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరగాలని, ప్రస్తుతం ఉన్న డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులకు మరో ఏడాది పెంచి హానర్స్ డిగ్రీలు అందిస్తామన్నారు. ఒక ఏడాది కాలం విద్యార్థికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి వినియోగిస్తామన్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు విశాఖకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుక్రవారం ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, పార్టీ నగర, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, శరగడం చిన అప్పలనాయుడు, సమన్వయకర్తలు కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, ముఖ్య నాయకులు, అధికారులు.. సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు బొత్స సత్యనారాయణ,ముత్తంశెట్టి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, సీఎం ప్రొగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం ఉన్నారు. తనను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్‌రావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాం«దీ, ముఖ్యనేతలు కుంబా రవిబాబు, కొయ్యప్రసాద్‌రెడ్డి, దాడి రత్నాకర్, వంశీరెడ్డి, రొంగల జగన్నాథం, చొక్కాకుల వెంకట్రావ్, సూర్యనారాయణరాజు, ఫరూఖీ, సనపల చంద్రమౌళి, బొడ్డేటి ప్రసాద్, రవిరెడ్డి, పక్కి దివాకర్, మంత్రి రాజశేఖర్, ప్రేమ్‌బాబు, బోని శివరామకృష్ణ, సుధాకర్, గుంటూరు నరసింహమూర్తి, మంత్రి రాజశేఖర్, సతీష్ వర్మ, శ్రీకాంత్‌రాజు, కిరణ్‌రాజు, శ్రీనివాస్‌రెడ్డి, కాంతారావు, సురేష్, భర్కత్ అలీ, తుల్లి చంద్రశేఖర్, రేయి వెంకటరమణ, శ్రీనివాస్ గౌడ్, షరీఫ్, శ్రీదేవి వర్మ, యువశ్రీ, పవన్, బాకి శ్యాంకుమార్‌రెడ్డి, ఎ.రాజుబాబు, సునీల్ పాల్గొన్నారు. సాదర వీడ్కోలు.. విమానాశ్రయం నుంచి నేరుగా ఏయూలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరై.. అక్కడ ప్రసంగించాక ముఖ్యమంత్రి మళ్లీ విమానాశ్రయానికి సాయంత్రం 7.30 గంటలకు చేరుకుని గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. వీడ్కోలు సమయంలోనూ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు విచ్చేశారు. -
సివిల్ ఇంజనీరింగ్ నూతన భవనం ప్రారంభం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి నూతనంగా నిర్మించిన అదనపు భవన సదుపాయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 2.38 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ భవనాలను తలపించే రీతిలో ఆధునికత ఉట్టేపడే విధంగా భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. బోధన విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను సబ్ కమిటీ సూచనలకు అనుగుణంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలలో సుదీర్ఘ కాలం తరువాత నియామకాలు చేపట్టడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జగదీష్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్ అవధాని, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామమోహనరావు, పాలక మండలి సభ్యుడు డాక్టర్ పి.సోమనాథరావు, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య జి.వి.ఆర్ శ్రీనివాస రావు, వజీర్ మహ్మద్, ఎం.జి మాధవబాబు తదితరులు పాల్గొన్నారు. -
వివాదాస్పదులకు డాక్టరేటా?
ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 31న జరిగే కాన్వొకేషన్ నిర్వహణకు అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు అందరి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిని ఆహ్వానించడం, వేదిక మార్పు, కళాప్రపూర్ణల ఎంపిక ప్రక్రియ.. ఇలా ప్రతి అంశం వివాదానికి కేంద్రంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. విశాఖ సిటీ : ఆంధ్రవిశ్వవిద్యాలయానికి తొమ్మిది దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. లక్షలాది మంది విద్యార్థులకు అక్షర భిక్ష పెట్టిందీ విద్యా సంస్థ. ఇంతటి విశిష్ట విశ్వవిద్యాలయంలో పాలకులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వర్సిటీకి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి. ప్రధానంగా స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా ఆహ్వానించే వ్యక్తి ఎంతో ప్రముఖుడై ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్‌ను పాలకులు ఆహ్వానించారు. విభజన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇవ్వరాదని కేంద్రానికి చెప్పిన ఆ పెద్దమనిషికి ఏయూ ఎర్ర తివాచీ పరవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆయనకు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేయనుండడం అందరి మనో భావాలను దెబ్బ తీయడమే. సమైక్యాంధ్ర, ప్రత్యే క హోదా ఉద్యమాలకు ఊపిరిలూదినది ఏయూ నే. అటువంటి ఉద్యమ గడ్డపై హోదావాదాన్ని పక్కన పెట్టడానికి కారణమైన వ్యక్తికి ఉన్నతాసనం వేసి గౌరవించాలనే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో తమ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికే ఏయూ పెద్దలు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నారనే గుసగుసలు వర్సిటీలో వినిపిస్తున్నాయి. దీనిని బహిరంగంగా వ్యతిరేకించడానికి పలు వర్గాలు సిద్ధమవుతున్నాయి. వేదిక మార్పు తగదు స్నాతకోత్సవ వేదిక మార్పు సైతం ఆక్షేపణలకు గురవుతోంది. దశాబ్దాల క్రితం నిర్మించి పదుల సంఖ్యలో స్నాతకోత్సవాలకు వేదికగా నిలచిన కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మంది రాన్ని కాదని.. బీచ్‌రోడ్డులో హంగు, ఆర్భాటానికి ప్రాధాన్యం ఇస్తూ నిర్మించిన కన్వెన్షన్ కేంద్రంలో కాన్వొకేషన్ నిర్వహించాలని వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం అందరినీ బాధించింది. దీనిపై పాలకమండలి సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, బాహాటంగానే వర్సిటీ అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు సమాచారం. స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథి, గవర్నర్, ఇతర అతిథులను తోడ్కొని వీసీ సభికుల మధ్య నుంచి వేదికను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. కన్వెన్షన్ కేంద్రంలో ఇటా జరగాలంటే మొదటి అంతస్థుకు ఎక్కాల్సిందే. మెట్ల మార్గం లో గవర్నర్ వంటి వ్యక్తిని ఎక్కి రావాలని కోరడం సమంజసం కాదు. దీనితో ఈ ప్రక్రియ నామమాత్రంగా ముగిసే అవకాశం ఉంది. వేదికకు అనుకుని ఉన్న వీవీఐపీ గది వైపు నుంచి మాత్రమే అతిథులు లోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రముఖుల విస్మరణ కళాప్రపూర్ణల ఎంపికలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా, హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులను, సాహితీవేత్తలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, జానపదానికి చిరునామాగా నిలుస్తున్న వంగపండు ప్రసాదరావులకు కళాప్రపూర్ణకు పరిశీలించక పోవడం విచారకరమని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతవరకు కేంద్రం పద్మశ్రీ ఇవ్వకపోయినా కనీసం ఆంధ్రవిశ్వవిద్యాలయమైనా గౌరవించి సముచితంగా సత్కరించి ఉండాల్సిందని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జన్మించి తెలుగు రాష్ట్రాలలో జానపదానికి పెద్ద దిక్కుగా నిలచిన వంగపండు ప్రసాదరావు కళాప్రపూర్ణకు ఏవిధంగా అర్హులు కాదో తెలపాలని వీరు వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. విశ్రాంత ఆచా ర్యులు నలుగురైదుగురితో ముందుగానే ప్రత్యే కం కమిటీ వేసి పేర్లు పరిశీలించాల్సిందని సూ చిస్తున్నారు. ఆదరాబాదరాగా ఆరు రోజుల ముందు పాలక మండలి సమావేశం నిర్వహిం చి నలుగురి పేర్లు గవర్నర్ ఆమోదానికి పం పడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది. -
నాల్గో రోజుకు ఏయూ విద్యార్థి ఆమరణ దీక్ష
సాక్షి, విశాఖపట్నం : అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రవేశపరీక్షను వ్యతిరేకిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి, ఏయూ డాక్టరేట్లు, స్కాలర్స్ జేఏసీ సభ్యుడు తుళ్లి చంద్రశేఖర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గో రోజుకు చేరుకుంది. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడుతున్నారని, వెంటనే నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చంద్రశేఖర్‌కు మద్దతుగా పలువురు ప్రముఖులు దీక్షా శిబిరానికి చేరుకుని తమ సంఘీభావాన్ని తెలియ జేశారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మళ్ళ విజయ్ ప్రసాద్, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు. విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కాంతారావు, ఉషాకిరణ్, కొయ్య ప్రసాద్ రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, కోలాగురువులు, జాన్ వెస్లీ, పీలా వెంకటలక్ష్మి, యువశ్రీ తో పాటు, విద్యార్ది, పరిశోధక సంఘాలు తమ మద్ధతు తెలిపాయి. -
ఏయూలో విద్యార్థుల ఆందోళన
సాక్షి, విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ హాస్టళ్లకు అధికారులు ఆదివారం నుంచి సెలవులు ప్రకటించారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ దృష్ట్యా హాస్టళ్లను తెరిచే ఉంచాలని విద్యార్థులు కోరారు. అయితే యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు నిరసన తెలిపారు. -
ఏయూ అధ్యాపక సిబ్బంది ఆందోళన
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) దెయ్యాల కొంప అంటూ టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి, అధ్యాపక, అధ్యాపకేతర, రాజకీయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. దీనిపై ఏయూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మెయిన్ గేటు ముందు బైఠాయించారు. ఎమ్మెల్సీ మూర్తి తన మాటలను ఉపసంహరించుకోవాలని, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. -
ఏయూలో కొనసాగుతున్న బంద్
ఏయూ క్యాంపస్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా ఆంధ్రా యూనివర్సిటీ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్ నిర్వహిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ, మహిళా చేతన, సీఐటీయూ సహా వివిధ సంఘాలు, ప్రొఫెసర్లు, స్కాలర్లు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ఆందోళన చేపట్టారు. వర్సిటీలో మతోన్మాద శక్తులను తరిమికొట్టాలంటూ బీజేపీ, ఏబీవీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఏయూ లో విద్యార్థినుల ఆందోళన
ఏయూ క్యాంపస్: తమకు సరైన వసతులు కల్పించడం లేదని ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థినులు సోమవారం ఉదయం క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థినులు కళాశాలలకు వెళ్లటానికి యూనివర్సిటీ 8 బస్సులను ఏర్పాటుచేసింది. అయితే, సోమవారం మూడు బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో వారంతా ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యాంపస్‌లో ఉదయం మాత్రమే నీరు సరఫరా అవుతోందని, సాయంత్రం కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హాస్టల్లో ఒక్కో గదికి ఐదుగురు చొప్పున ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. భోజనం నాణ్యంగా ఉండటం లేదన్నారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రిజిస్ట్రార్ చర్చలు జరిపారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. వారంలోగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో విద్యార్థినులు -
ఏయూలో విద్యార్థుల దీక్ష భగ్నం