
దీక్ష చేస్తున్న చంద్రశేఖర్
సాక్షి, విశాఖపట్నం : అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రవేశపరీక్షను వ్యతిరేకిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి, ఏయూ డాక్టరేట్లు, స్కాలర్స్ జేఏసీ సభ్యుడు తుళ్లి చంద్రశేఖర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గో రోజుకు చేరుకుంది. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడుతున్నారని, వెంటనే నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చంద్రశేఖర్‌కు మద్దతుగా పలువురు ప్రముఖులు దీక్షా శిబిరానికి చేరుకుని తమ సంఘీభావాన్ని తెలియ జేశారు.
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మళ్ళ విజయ్ ప్రసాద్, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు. విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కాంతారావు, ఉషాకిరణ్, కొయ్య ప్రసాద్ రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, కోలాగురువులు, జాన్ వెస్లీ, పీలా వెంకటలక్ష్మి, యువశ్రీ తో పాటు, విద్యార్ది, పరిశోధక సంఘాలు తమ మద్ధతు తెలిపాయి.