APPSC Notification
-
ఆంధ్రప్రదేశ్‌లో 3220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
-
730 పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. ఏం చదవాలి.. ఎలా చదవాలి..?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఒకేసారి ఏడు వందలకు పైగా పోస్ట్‌లతో నోటిఫికేషన్లు వెలువరించడంతో.. ఉద్యోగార్థులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లయింది. గత కొంత కాలంగా క్రమం తప్పకుండా పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లతో అభ్యర్థుల ముందుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 పోస్ట్‌లకు.. ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. ఏపీపీఎస్సీ ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఇందుకోసం ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. రెండు శాఖలు, 730 పోస్ట్‌లు ►ఏపీపీఎస్సీ రెండు శాఖల్లో మొత్తం 730 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. అవి.. ►ఏపీ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు–670. ►దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3–పోస్టులు– 60. ►అభ్యర్థులు ఈ రెండు నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ►బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ రెండు రకాల పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. రాత పరీక్షలో మెరిట్ ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టుల భర్తీ చేపడతారు. ఈ రెండు పోస్ట్‌లకు సంబంధించిన రాత పరీక్షలో ఒక పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. రెండో పేపర్ మాత్రం జూనియర్ అసిస్టెంట్స్ పోస్ట్‌లకు,ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్‌లకు వేర్వేరుగా ఉంటుంది. దీంతో..బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు సమయ పాలన, నిర్దిష్ట వ్యూహంతో..ప్రిపరేషన్ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధమై.. రెండు పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం ఉంది. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ►ఒక్కో పోస్ట్‌కు దరఖాస్తుల సంఖ్య 200 దాటితే.. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారిని తదుపరి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ►ఒక్కో పోస్ట్‌కు నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. మెయిన్ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేయనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌లు ఇలా ►రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష విధానాలు.. ►జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్ష రెండు విభాగాలుగా రెండు సబ్జెక్ట్‌లలో 150 మార్కులకు జరగనుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 స్క్రీనింగ్ టెస్ట్: ►ఈ పరీక్ష కూడా రెండు విభాగాలుగా 150 మార్కులకు జరుగనుంది. వివరాలు.. ►రెండు పోస్ట్‌లకు నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిగా పెన్ పేపర్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు నింపాలి. ►నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 మార్కులు తగ్గిస్తారు. ►రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్‌లకు నిర్వహించే పార్ట్–బి పేపర్లో.. జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. మెయిన్ పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్(ఆన్లైన్) టెస్ట్‌గా ఉంటుంది. ►జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మెయిన్: ఈ పరీక్ష రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు జరగనుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వివరాలు.. ►పేపర్–2లో జనరల్ ఇంగ్లిష్ నుంచి 75 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. ►ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (ఎండోమెంట్ సబ్ సర్వీస్) మెయిన్: ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా 300 మార్కులకు జరగనుంది. వివరాలు.. ►ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ►ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. నిర్దిష్ట ప్రణాళికతో.. విజయం దిశగా ►రెండు శాఖల్లోని పోస్టులకు కూడా స్క్రీనింగ్ టెస్ట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లనే మెయిన్ పరీక్షలోనూ పేర్కొన్నారు. ►స్క్రీనింగ్, మెయిన్లకు ఒకే సిలబస్ అంశాలను పేపర్లుగా నిర్దేశించినా.. మెయిన్‌లో అడిగే ప్రశ్నలు లోతుగా ఉండే అవకాశం ఉంది. ►కాబట్టి మొదటి నుంచే మెయిన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా స్క్రీనింగ్ టెస్ట్‌లో సులభంగా విజయం సాధించి మెయిన్‌కు అర్హత పొందొచ్చు. ►అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ముందే ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లను ఆమూలాగ్రం పరిశీలించాలి. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల సిలబస్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. ►భిన్నంగా ఉన్న అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకొని.. వాటి ప్రిపరేషన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి. ►దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్‌లకు స్క్రీనింగ్, మెయిన్‌లో ఉన్న హిందూతత్వం, దేవాలయ వ్యవస్థ పేపర్‌కు సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం కొనసాగించాలి. ►పురాణాలు, ఇతిహాసాలు, వేద సంస్కృతి, కళలు, ఉపనిషత్తులు, కుటుంబ వ్యవస్థ, దేవాలయాలకు వచ్చే ఆదాయ మార్గాలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు, ఎండోమెంట్ భూములకు సంబంధించిన చట్టాలు, భూ రికార్డులపై అవగాహన పెంచుకోవాలి. ►జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి. ►ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి. ►మెంటల్ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి. ►రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్‌లకు పేర్కొన్న జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు పేపర్ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్ గ్రామర్ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్‌లపై పట్టు సాధించాలి. ఒకే సమయంలో రెండు పోస్ట్‌లకు ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. ఒకే సమయంలో రెండు శాఖల్లోని పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రెండు శాఖల్లోని పోస్ట్‌లకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంది. ఈ పేపర్‌కు ఉమ్మడి ప్రిపరేషన్ సాగిస్తూ.. రెండో పేపర్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఇలా సిలబస్ పరిశీలన నుంచి ప్రిపరేషన్ వరకు ప్రత్యేక వ్యూహంతో.. అడుగులు వేస్తే విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (ఏపీ ఎండోమెంట్స్ సబ్ సర్వీస్) ►మొత్తం పోస్టుల సంఖ్య: 60 ►వేతన శ్రేణి: రూ.16,400 – రూ.49,870 ►అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ►వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ►దరఖాస్తులకు చివరి తేదీ: 19.01.2022 ►వెబ్సైట్: https://psc.ap.gov.in జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ శాఖ) (గ్రూప్–4 సర్వీసెస్) ►మొత్తం పోస్టుల సంఖ్య: 670 ►ప్రారంభ వేతన శ్రేణి: రూ.16,400 –రూ.49,870. ►అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. తుది ఎంపికకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ►వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ►వెబ్సైట్: https://psc.ap.gov.in -
APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటన జారీచేశారు. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసి స్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు లు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం కమిషన్ నోటిఫి కేషన్ జారీచేసినట్టు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి సూచించారు. ఏపీపీఎస్సీ 730 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ►మొత్తం పోస్టుల సంఖ్య: 730 ►పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ డిపార్ట్మెంట్): 670 ►అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ►ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ►పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3(ఎండో మెంట్స్ సబ్ సర్వీస్): 60 ►అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ►ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021 ►ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ►వెబ్సైట్: psc.ap.gov.in -
మేలుకో మహిళ.. ఈ మేటి కొలువులు నీకోసమే!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. మరో చక్కటి నోటిఫికేషన్‌తో ఉద్యోగార్థుల ముందుకొచ్చింది! మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగంలోని..ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. హోంసైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, సోషల్ వర్క్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలు ఈ కొలువులకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకు అర్హతలు, ఎంపిక విధానం, విజయం సాధించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విభాగాల్లో ఒకటి. అంతటి కీలక విభాగంలో ఖాళీగా ఉన్న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్లపై పట్టున్న వారు ఈ పరీక్షలో విజయం సాధించడం సులభమే అంటున్నారు నిపుణులు. ► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 22 ► పోస్టుల వివరాలు: ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1(సూపర్వైజర్) అర్హతలు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకటి గ్రూప్ సబ్జెక్ట్‌గా బీఎస్సీ (బీజెడ్సీ) ఉత్తీర్ణత ఉండాలి. ► హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో.. ఉన్నత విద్య అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వయో పరిమితి ►వయసు జూలై 1, 2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ప్రారంభ వేతనం ► ఏపీపీఎస్సీ భర్తీ చేయనున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని సబార్డినేట్ సర్వీస్‌లోని ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను గ్రేడ్–1 హోదా పోస్ట్‌లుగా పేర్కొన్నారు. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లనే సూపర్వైజర్లుగా కూడా పిలుస్తారు. వీరికి వేతన శ్రేణి రూ.24,440–రూ.71,510గా ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో జరిగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు. ఈ ఆన్లైన్ పరీక్షలో రెండు పేపర్లు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్ 2 హోం సైన్స్ అండ్ సోషల్ వర్క్ 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు. ► ప్రశ్నలన్నింటినీ ఆబ్జెక్టివ్ తరహా బహుళైచ్ఛిక విధానంలోనే అడుగుతారు. ► ఈ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)గా నిర్వహిస్తారు. ► ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది. ► ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 తగ్గిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకు అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వ్డ్ కేటగిరీలకు కేటాయించిన పోస్ట్‌లు తదితర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని.. ఆయా కేటగిరీల్లో మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. దరఖాస్తు విధానం: ► ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: నవంబర్ 18–డిసెంబర్ 8, 2021 ► అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెంబర్ 7, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులో సవరణ:దరఖాస్తు చివరి తేదీ నుంచి ఏడు రోజుల లోపు సవరణలు చేసుకోవచ్చు. ► వెబ్సైట్ https://psc.ap.gov.in/ రాత పరీక్షలో రాణించాలంటే ► రెండు పేపర్లుగా నిర్వహించే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రాత పరీక్షలో రాణించేందుకు అభ్యర్థులు పక్కా ప్రిపరేషన్ ప్రణాళికతో ముందుకు సాగాలి. ► పేపర్–1(జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ) అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సమకాలీన పరిణామాలపై పట్టు సాధించాలి. తాజాగా ముగిసిన కాప్ సదస్సు, ఆయా అంశాలకు సంబంధించి ఐరాస నివేదికలు, భారత్–ఇతర దేశాల మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ►రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కళలు, క్రీడలు, సంస్కృతి, పాలనకు సంబంధించి జాతీయ అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై పట్టు సాధించాలి. ► కరెంట్ ఆఫైర్స్‌కు సంబంధించి.. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి అంతకుముందు సంవత్సర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి పెట్టాలి. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమకాలీన అంశాలకు సంబంధించి తాజా పాలసీలు, పథకాలు, నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై గణాంక సహిత సమాచారంతో సిద్ధంగా ఉండాలి. ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన పోస్ట్‌లకు పరీక్ష నిర్వహిస్తున్న∙నేపథ్యంలో.. ఏపీలో మహిళలు, చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వారి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలుసుకోవాలి. ► ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆధునిక భారత దేశ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలపై పట్టు సాధించాలి. పాలిటీ, గవర్నెన్స్‌కు సంబంధించి రాజ్యాంగం, ఇటీవల కాలంలో పాలనలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిణామాలు(ఈ–గవర్నెన్స్ తదితర), తాజా విధానాల గురించి తెలుసుకోవాలి. ఈ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలన పరమైన నూతన విధానాలపై ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. ► ఆర్ధికాభివృద్ధికి సంబంధించి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు.. దేశ ఆర్థిక ప్రగతి, ఆర్థికాంశాల క్రమాన్ని తెలుసుకోవాలి. ► జాగ్రఫీలో.. భారత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సహజ వనరులు, అవి లభించే ప్రాంతాలు, అభివృద్ధికి దోహదపడే తీరుపై అవగాహన పెంచుకోవాలి. ► ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న డిజాస్టర్ మేనేజ్మెంట్, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తాజా పరిణామాలు, అదే విధంగా ప్రాథమిక లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. ► మెంటల్ ఎబిలిటీలో... లాజికల్ రీజనింగ్, డేటాలు, ఫ్లో చార్ట్స్, డేటా విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి. ► అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతర పరిణామాలు, సమస్యలను ప్రత్యేక దృష్టితో చదవాలి. ► 2021–22 బడ్జెట్లోని ముఖ్యమైన అంశాలు, ఏపీ, ఇండియా సోషియో–ఎకనామిక్ సర్వేలు, వాటిలో పేర్కొన్న ముఖ్య వివరాలను, గణాంకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పేపర్–2కు ఇలా ► హోంసైన్స్, సోషల్ వర్క్ సబ్జెక్ట్ అంశాలు రెండు విభాగాలుగా ఉండే పేపర్–2లో రాణించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు.. ► ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్ట్‌లోని పలు రకాల ఆహార ధాన్యాలు, బలమైన ఆరోగ్యానికి దోహదం చేసే తృణ ధాన్యాలు గురించి తెలుసుకోవాలి. ► అదే విధంగా పోషకాహార పదార్థాలు, వాటి నిల్వ, వాటి వల్ల కలిగే లాభాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. ► ఆయా ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకోవాలి. ► వయో వర్గాల వారీగా అవసరమైన ఆహార, పోషకాల వివరాలు గురించి తెలుసుకోవడం కూడా మేలు చేస్తుంది. ► ఆయా వ్యాధులకు సంబంధించి అనుసరించాల్సిన ఆరోగ్య, ఆహార నియమాల గురించి తెలుసుకోవాలి. ► శిశు అభివృద్ధికి సంబంధించి ఇమ్యునైజేషన్, మానసిక–శారీరక అభివృద్ధి, ప్రీ–స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యం, పాపులేషన్ ఎడ్యుకేషన్‌లపై దృష్టిపెట్టాలి. ► అదే విధంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆయా ఏజెన్సీలు/సంస్థల ఆధ్వర్యంలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ సేవల గురించి తెలుసుకోవాలి. ► చిన్నారులకు రాజ్యాంగ, శాసన పరంగా అందుబాటులో ఉన్న హక్కుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. ► ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి విషయంలో చేపడుతున్న చర్యలపై దృష్టి పెట్టాలి. ► వ్యవసాయానికి సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా ఆహార ధాన్యాల డిమాండ్–సప్లయ్, సాగు ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల గురించి తెలుసుకోవాలి. ► ఎక్స్టెన్షన్ వర్క్‌కు సంబంధించిన విధానాలు, పద్ధతులు, ప్రోగ్రామ్ ప్లానింగ్, నిర్వహణ, మూల్యాంకన, గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలోని స్వయంసహాయక సంస్థల ► అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ► సోషల్ వర్క్‌కు సంబంధించి మూల భావన, పరిధి, స్వరూపం తెలుసుకోవాలి. ► భారతీయ సంస్కృతిలో మార్పు విషయంలో సోషల్ వర్క్ సిద్ధాంతం ప్రాముఖ్యతపై అవగాహన ఏర్పరచుకోవాలి. ► సోషల్ వర్క్‌లో.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు, స్థానిక సంస్థలు, కుటుంబం, శిశు సంక్షేమ చర్యలు, మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ స్వరూపం, విధులపై అవగాహన అవసరం. డిగ్రీ పుస్తకాల అధ్యయనం పేపర్–2కు సంబంధించిన విభాగాల్లోని ప్రశ్నలు డిగ్రీ స్థాయి పుస్తకాల నుంచే అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిద్ధాంతాలు, మూల భావనలకు సంబంధించి డిగ్రీ స్థాయి పుస్తకాల అభ్యసనం మేలు చేస్తుంది. సంక్షేమ పథకాలు, సేవలు, సమస్యలకు సంబంధించి సమకాలీన అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇలా ఒకవైపు బేసిక్స్, మరోవైపు సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకుంటూ.. ప్రిపరేషన్ సాగిస్తే విజయావకాశాలు మెరుగవుతాయి. -
ఆంధ్రప్రదేశ్: డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు శుభవార్త...
ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు శుభ వార్త. రాష్ట్రంలో ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది! దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గత కొద్ది రోజులుగా వరుస నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగార్థుల్లో ఆశలు నింపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నోటిఫికేషన్‌తో ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో.. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. చదవండి: ఆర్ఆర్సీ– ఎన్సీఆర్లో భారీగా అప్రెంటిస్ ఖాళీలు మొత్తం పోస్టులు 190 ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్‌లు(గత నోటిఫికేషన్లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు. ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది. అర్హతలు ► ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు. ► దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. ► వయోపరిమితి: జూలై 1,2021 నాటికి 18–42ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. చదవండి: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు ఎంపిక విధానం రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు చేస్తారు. రాత పరీక్ష ఇలా రాత పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రశ్నపత్రం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 150 150ని 2 సివిల్/మెకానికల్ 150 150 150ని 3 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/ సివిల్ 150 150 150ని ► పేపర్–3 పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో ఎన్విరాన్మెంట్/సివిల్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే (పోస్ట్ కోడ్–3) నిర్వహిస్తారు. ► పేపర్ 2 అన్ని శాఖల్లోని సివిల్/మెకానికల్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఈ ప్రశ్న పత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. ► నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలు చేయనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు. విజయానికి మార్గం ఇదిగో పేపర్–1 ఇలా ► పేపర్–1 జనరల్ స్టడీస్‌లో.. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ; ఏపీ, ఇండియా హిస్టరీ; పాలిటీ, గవర్నెన్స్; ఏపీలో అమలవుతున్న ఈ–గవర్నెన్స్ విధానాలు; ఆర్థికాభివృద్ధి అంశాలు, ఏపీలో ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న చర్యలు; డిజాస్టర్ మేనేజ్మెంట్; ఏపీ, ఇండియా ఫిజికల్ జాగ్రఫీ అంశాలపై దృష్టి పెట్టాలి. ► అదేవిధంగా లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్లను ప్రాక్టీస్ చేయాలి. ► డేటా అనాలిసిస్ విషయంలో డేటా విశదీకరణ, విశ్లేషణ, డేటా రూపకల్పన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పేపర్–2లో ఉమ్మడిగా సివిల్, మెకానికల్ ఏఈ పోస్ట్‌లకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్ ఇది. ఇందులో విజయానికి అభ్యర్థులు సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌లోని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. డిప్లొమా స్థాయిలో ప్రశ్నలు ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలకు సంబంధించి డిప్లొమా లేదా బీటెక్ పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది. అదే విధంగా ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన ఏఈ ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పేపర్–3లో రాణించాలంటే ► పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో.. ఎన్విరాన్మెంట్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే నిర్వహించే ఈ పేపర్లో ఎన్విరాన్మెంటల్/సివిల్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వాటర్ సప్లయి ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, వాయు, శబ్ద కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్,డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్,బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ విభాగాల్లోని ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి. ► ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో అమలవుతున్న విధానాలు,చేపడుతున్న చర్యలు,పర్యావరణ పరిరక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. సిలబస్ క్షుణ్నంగా అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌లు, వాటికి సంబంధించి రాత పరీక్షలో పేర్కొన్న సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. దాని ఆధారంగా తాము కొత్తగా చదవాల్సిన అంశాలతోపాటు, ఇప్పటికే అవగాహన ఉన్న టాపిక్స్‌పై స్పష్టత లభిస్తుంది. ఫలితంగా ప్రిపరేషన్లో ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా సమయ పాలనతో ముందుకు సాగాలి. అకడమిక్ పుస్తకాలు ► సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకున్నాక..ఆయా అంశాలకు సంబంధించి బీటెక్ లేదా డిప్లొమా స్థాయిలోని అకడమిక్ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్లో అప్లికేషన్ అప్రోచ్‌ను అనుసరించాలి. దీనివల్ల ప్రాక్టికల్ థింకింగ్ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. ► మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. అదే విధంగా ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి ఈసెట్, పీజీఈసెట్ తదితర ఇంజనీరింగ్ సెట్ల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ► పేపర్–2లోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలోనే ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాని అభ్యర్థులు బీటెక్ స్థాయిలోని అంశాలపైనా దృష్టిపెడితే విజయావకాశాలు మరింత మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. -
190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగాల్లోని 190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు. -
ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులు 6, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(డీపీఆర్వో) పోస్టులు నాలుగు భర్తీ చేయడానికి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు, డీపీఆర్వో పోస్టులకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు. -
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ల విడుదల ఎప్పుడన్నది తేలడం లేదు. ఈ నాలుగున్నరేళ్లలో 2016లో ఒకే ఒక్కసారి 4,275 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులోనూ 2 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. తక్కినవన్నీ ఖాళీగానే మిగిలిపోయాయి. మళ్లీ ఇప్పటివరకు నోటిఫికేషన్ల ఊసెత్తలేదు. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఎట్టకేలకు సెప్టెంబర్ 19న 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించింది. ఇందులో కొన్ని పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా, మరొకొన్ని పోలీస్ రిక్రూట్మెంట్, విద్యాశాఖ, సంక్షేమ గురుకులాల విభాగాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి. కానీ ఉత్తర్వులు వెలువడి నెలన్నర దాటుతున్నా రోస్టర్ వారీగా సమాచారం ఖరారు చేయించి నోటిఫికేషన్లు విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేయిస్తోంది. కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సహా అనే శాఖలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ ఆయా శాఖల నుంచి తగిన సమాచారం లేకపోవడంతో నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. ఇప్పటికే ఏపీపీఎస్సీ ఆయా శాఖలకు లేఖలు రాసి, సమావేశాలు నిర్వహించినా కొన్ని శాఖలు మాత్రమే స్పందించాయి. మరోవైపు విద్యాశాఖకు సంబంధించి గతనెల 26న డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడగా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవలే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. తేలని గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 పోస్టుల జాబితా ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా జారీ చేసిన జీవో 153లో గ్రూప్1 పోస్టులు 182, గ్రూప్–2 337, గ్రూప్ 3 పోస్టులు 1670 ఉన్నాయి. అన్ని శాఖల నుంచి సమాచారం వస్తేనే ఈ పోస్టుల నోటిఫికేషన్ల విడుదలకు అవకాశం ఉంటుంది. రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. గ్రూప్–3లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ శాఖకు సంబంధించి జూనియర్ అసిస్టెంటు పోస్టులు ఉన్నాయి. అయితే జిల్లాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ల సమాచారం ఇంకా ఏపీపీఎస్సీకి అందలేదు. ఇక గ్రూప్ 2లోని 337 పోస్టులకు సంబంధించి అసెంబ్లీ సచివాలయం, జీఏడీ, ఆర్థిక, న్యాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. గ్రూప్ 1లో గతంలో కేవలం 78 పోస్టులు మాత్రమే ప్రకటించగా ఈసారి వాటి సంఖ్య 182కు పెంచారు. ఇందులో రెవెన్యూ, హోమ్, ఫైనాన్స్, రహదారులు, భవనాల శాఖల నుంచి పోస్టుల సమాచారం ఇంకా పూర్తిగా అందాల్సి ఉందని కమిషన్ వర్గాలు వివరించాయి. సమాచారం రాకపోవడంతో ఈ మూడు గ్రూప్ నోటిఫికేషన్ల విడుదల జాప్యమవుతోందని పేర్కొంటున్నాయి. లెక్చరర్లు, అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తదితర పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి సమాచారం అందింనందున వారం పదిరోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీలుంటందని చెబుతున్నాయి. నోటిపికేషన్ల విడుదలలో జాప్యంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ప్రతి నిరుద్యోగినీ...ఉద్యోగిగా
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, పేద విద్యార్థులకు భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్సి నిర్వహించు గ్రూప్ -1, 2, 3, 4, వీఆర్ఓ, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 28న నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో తరగతులు ప్రారంభమవుతాయి. తెల్లరేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించినా వారికి మరొక అవకాశం కల్పిస్తామని, అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి తరగతులకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు లక్ష్మణ్ గారు తెలిపారు. అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణా కాలంలో మెటీరియల్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వారికి మరొక అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.krishnamma.org వెబ్సైట్లో లేదా సంస్థ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రోత్సాహకాలు అందిస్తారని తెలిపారు. రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 28వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు సెప్టెంబర్ 30వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 62814 63267 నెంబర్‌ను సంప్రదించగలరు. -
నాల్గో రోజుకు ఏయూ విద్యార్థి ఆమరణ దీక్ష
సాక్షి, విశాఖపట్నం : అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రవేశపరీక్షను వ్యతిరేకిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి, ఏయూ డాక్టరేట్లు, స్కాలర్స్ జేఏసీ సభ్యుడు తుళ్లి చంద్రశేఖర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గో రోజుకు చేరుకుంది. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడుతున్నారని, వెంటనే నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చంద్రశేఖర్‌కు మద్దతుగా పలువురు ప్రముఖులు దీక్షా శిబిరానికి చేరుకుని తమ సంఘీభావాన్ని తెలియ జేశారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మళ్ళ విజయ్ ప్రసాద్, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు. విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కాంతారావు, ఉషాకిరణ్, కొయ్య ప్రసాద్ రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, కోలాగురువులు, జాన్ వెస్లీ, పీలా వెంకటలక్ష్మి, యువశ్రీ తో పాటు, విద్యార్ది, పరిశోధక సంఘాలు తమ మద్ధతు తెలిపాయి. -
మరో 361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు నోటిఫికేషన్లు జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. జనవరి 23వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి సాయి వివరించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్ ప్రొఫైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 259 డిప్యూటీ సర్వేయర్లు, 13 టౌన్‌ప్లానింగ్ సర్వేయర్లు, 39 మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీచేయనున్నట్లు తెలిపారు. -
పంచాయతీ కొలువులు
-
త్వరలో జీపీ కార్యదర్శుల నియామకం
జిల్లాకు 350 పోస్టులు విడుదలైన నోటిఫికేషన్ పాలమూరు, న్యూస్‌లైన్ : నిరుద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రా ష్ట్ర వ్యాప్తంగా 2,677 పోస్టులను నిర్ణయించగా అందులో మహబూబ్‌నగర్ జి ల్లాకు 350 జీపీ కార్యదర్శుల పోస్టులను కేటాయించింది. డిగ్రీ విద్యార్హతతో చేపట్టనున్న ఈ నియామకాలకోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సోమవారం ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల నియామకాని కి నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగాలకోసం అభ్యర్థుల ఎదురు చూ పులకు తెరపడింది. వచ్చేనెల 4వ తేది నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. దరఖాస్తుదారులు జనవరి 20వ తేది లోపు రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగార్ధు ల వయసు 18 నుంచి 36 ఏళ్లుగా నిర్ధారించారు. వేత నం స్కేల్ రూ.7,520 నుంచి రూ.22,430 గా నిర్ణయిం చారు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష విధానం ద్వారా ఎంపిక చేయనున్నారు. పేపర్-1 పరీక్షలో జనరల్ స్టడీస్ అం శాలు, పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామాల్లో నెల కొన్న సమస్యలు, మన రాష్ట్రంలోని అంశాలను ప్రత్యేక ఉదాహరణలతో వివరించే విధంగా ప్రశ్నాపత్రం ఉం టుంది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు ప్రతీ పేపర్ గం టన్నర కేటాయిస్తారు. ఒక్కో ప్రశ్న పత్రంలో 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు ఉంటాయి. పంచాయతీ కా ర్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కేటగిరీల వారిగా పోస్టుల వివరాలిలా... -
పంచాయతీ కొలువులు
సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నూతన సంవత్సరం కానుకగా ఆశావహులకు తీపి కబురందించింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో జిల్లాలో పలువురు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారమే ఏపీపీఎస్సీ ఛైర్మన్ బిశ్వాల్ ప్రకటన జారీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తం 2,677 ఖాళీల భర్తీకి గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో జిల్లాలో 26 పోస్టుల భర్తీకి అవకాశం పంచాయతీ కొలువులు దక్కింది. అయితే జిల్లాలో 50 పోస్టులు ఖాళీలున్నాయి. జిల్లాలో మొత్తం 1,011 పంచాయతీలు వున్నాయి. క్లస్టర్లుగా విభజించడంతో 575 క్లస్టర్లున్నాయి. పంచాయతీ కార్యదర్శులు 525 మంది వరకు ఉన్నారు. ఏపీపీఎస్సీ ప్రకటనతో ఇవన్నీ భర్తీ జరుగుతాయని అధికారులు భావించారు. అయితే 26 పోస్టుల భర్తీకే ఏపీపీఎస్సీ అనుమతివ్వడం గమనార్హం. ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం 300 మార్కుల (150 చొప్పున)కు రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు జనరల్ స్టడీస్, రెండో పేపరులో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలపై ప్రశ్నలుంటాయి. జనవరి 4 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23న పరీక్ష ఉంటుంది. మార్చి 24న జిల్లా స్థాయిలో ర్యాంకింగ్ జాబితాలు తయారు చేస్తారు. డిగ్రీ అర్హతతో 18 ఏళ్ల నుంచి 36 లోపు జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వికలాంగులకు 46 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వివరాలకు www.apspsc.gov.in లో తెలుసుకోవచ్చు. -
త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు!
తెలంగాణ, సీమాంధ్ర అభ్యర్థులకు వేర్వేరు మెరిట్ జాబితాలు! సాక్షి, హైదరాబాద్: వివిధ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలా వద్దా అనే అంశంపై వివరణ కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాయడం.., దానిపై సాంకేతికంగా అడ్డంకులు లేనప్పుడు మమ్మల్ని అడగడం ఎందుకని ప్రభుత్వ వర్గాలు అంటున్న నేపథ్యంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరో వారం పది రోజుల్లో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన 63,518 ఉద్యోగాల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 11,250 ఉన్నాయి. విభజన వల్ల ఇబ్బందులు తలెత్తకుండా రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా మెరిట్ జాబితాలను రూపొందిస్తామని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి తెలియజేసింది. 12 నుంచి డిపార్ట్మెంటల్ టెస్టులు: ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న డిపార్ట్మెంటల్ టెస్టుల హాల్‌టికెట్లను (www.apspsc.gov.in) వెబ్సైట్లో 4వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలుంటే ఏపీపీఎస్సీ హెల్ప్‌డెస్క్ - 040 235 574 55, అదనపు కార్యదర్శి - 040 247 442 32, అసిస్టెంట్ సెక్రటరీ - 8498098244, సెక్షన్ ఆఫీసర్ - 8498098303 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది. కాగా, మే నెల డిపార్ట్మెంటల్ టెస్టుల ఫలితాలను విడుదల చేసినట్లు పేర్కొంది. -
ఉద్యోగాలకు ‘ఉరి’ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయిలో ఫుల్స్టాప్ పడింది. 63,518 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించినా ఫలితం లేకుండా పోయింది. నోటిఫికేషన్ల జారీకి సాంకేతికంగా అడ్డంకులు లేకపోయినా.. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో నెలకొన్న గందరగోళంతో ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్లను జారీ చేయాలా? వద్దా? అని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసి రెండు నెలలు గడిచినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సీఆర్ బిశ్వాల్ రెండురోజుల కిందట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. అయినా నోటిఫికేషన్ల జారీ అంశంపై స్పష్టత రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్ కోటా భర్తీ విషయంలో అపోహలు వస్తాయనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్ల జారీని పక ్కనబెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నా.. దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. దీంతో ఏళ్ల తరబడి శిక్షణ పొందుతూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఎదురుచూపులు చూస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి సిద్ధమైనా పరీక్షల నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్, ఎస్సై వంటి పోస్టులు, ఏపీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1, 2 తదితర పోస్టులకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందుకు హైదరాబాద్‌కు వచ్చిన నిరుద్యోగులు ఏం చేయాలో పాలుపోని అయోమయంలో ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ శిక్షణ పొందుతున్న అనేకమంది అభ్యర్థులు ఆర్థికభారం దృష్ట్యా ఇంటిదారి పడుతున్నారు. మూలనపడిన ఏపీపీఎస్సీ షెడ్యూల్ గత నాలుగు నెలల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 63,518 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన దాదాపు 13 వేల పోస్టులకు నోటిఫికేషన్ల జారీకి సిద్ధమైంది. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి తేదీల వివరాలతో షెడ్యూల్ ఖరారు చేసింది. ఇంతలోనే ‘రాష్ట్ర విభజన’ అంశం తెరపైకి వచ్చింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో షెడ్యూలు కాస్తా కాగితాలకే పరిమితమైపోయింది. పోలీసు శాఖలో, డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీల ద్వారా కూడా పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సిద్ధంగా ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన అన్ని పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వారీ వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వం ఓకే అంటే నోటిఫికేషన్లను జారీ చేస్తామని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. అయితే మరో నాలుగైదు నెలల్లో రాష్ట్ర విడిపోయే అవకాశాలున్న దృష్ట్యా ఇంత భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ సరికాదని, విభజన తరువాత ఆయా రాష్ట్రాల్లో నియామకాలకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆమోదం పొందిన పోస్టుల వివరాలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదరిశ గత ఏప్రిల్ 28న వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల్లోనూ కలిపి 63,621 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అందులో తేల్చారు. వాటిల్లో ఇప్పటివరకు 63,518 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3వ తేదీన 33,738 పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. అందులో ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు (గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4, లెక్చరర్ తదితర అన్ని కేటగిరీలు), పోలీసు శాఖలో 11,623 పోస్టులు (కానిస్టేబుల్, ఎస్సై), డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీల (డీఎస్సీలు) ద్వారా 10,865 పోస్టులను భర్తీ చేసుకోవచ్చని పేర్కొంది. ఇక జూలై 2వ తేదీన 20,508 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి, ఏపీపీఎస్సీ ద్వారా మరో 1,127 పోస్టుల భర్తీకి, డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 2,443 పోస్టుల భర్తీకి ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందే 2,677 గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. తాజాగా సెప్టెంబర్ 30వ తేదీన కూడా మరో 3,025 పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. ఆ తరువాత మూడు రోజులకే తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్ల జారీపై పూర్తిస్థాయిలో నీలినీడలు కమ్ముకున్నాయి. -
గ్రూప్-1కు మళ్లీ మెయిన్స్
ఏపీపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన 2011 గ్రూప్-1 కేసులో తీర్పు వివాదాస్పద 6 ప్రశ్నలు తీసేసి మెరిట్ జాబితా రూపొందించండి దాని ప్రకారం అర్హులకు మెయిన్స్ నిర్వహించాలంటూ ఉత్తర్వులు సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన 2011-నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు.. ఇపుడు మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలోని వివాదాస్పద ప్రశ్నలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసును సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించి మిగిలిన ప్రశ్నలకు లభించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను కొత్తగా రూపొందించాలని సుప్రీంకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. అంతేకాదు, ఆ మెరిట్ జాబితాను అనుసరించి అర్హులకు మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కూడా ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు కేసును పరిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీనిపై కమిషన్ వర్గాలను సంప్రదించగా.. కోర్టు తీర్పు కాపీ అందాక పరిశీలించి, కమిషన్‌లో చర్చించి చర్యలు చేపడతామని పేర్కొన్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇంటర్వ్యూలు పూర్తయిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అసలేం జరిగిందంటే... 2011 నవంబర్‌లో 314 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ 2012 మే 27న ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలను జూన్ 13న ప్రకటించింది. ఇందులో 1:50 చొప్పున 16,426 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. అయితే పలువురు అభ్యర్థులు ఇందులో కటాఫ్ మార్కులు తెలియజేయాలని, కీని ప్రకటించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆగస్టు 31న ఏపీపీఎస్సీ కీని ప్రకటించింది. ఆ కీలో తప్పులు దొర్లాయని, 13 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలనే ఏపీపీఎస్సీ కీలో సరైనవిగా పేర్కొందని అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కమిషన్ వర్గాలు మొదట పట్టించుకోలేదు. మెయిన్స్ రాత పరీక్షలకు వారం రోజుల ముందు కమిషన్ వేసిన నిపుణుల కమిటీ 7 తప్పులను మాత్రమే సరిదిద్దింది. దీంతో కటాఫ్ మారింది. మొదట మెయిన్స్‌కు ఎంపిక చేసిన జాబితా నుంచి 845 మంది అభ్యర్థులను తొలగించగా, 1,201 మంది కొత్త వారికి మెయిన్స్ రాసే అవకాశం వచ్చింది. వారంతా ప్రిపేర్ కాకుండానే మెయిన్స్ పరీక్షలు రాయాల్సి వచ్చింది. మరోవైపు అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా మిగిలిన ఆరు తప్పులను సరిదిద్దలేదు. 2012 సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు 10 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా 606 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. వారికి గత జనవరి 28 నుంచి మార్చి 22వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అభ్యర్థుల న్యాయపోరాటం.. మరోవైపు పలువురు అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో దొర్లిన ఆ ఆరు తప్పులను కూడా సరిదిద్దాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు... నాలుగు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ న్యాయవివాదం జరుగుతుండగానే ఏపీపీఎస్సీ 2011 నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షను, ఇంటర్వ్యూను పూర్తిచేసింది. దీంతో హైకోర్టు తుది ఫలితాల ప్రకటనను నిలుపుదల చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఏపీపీఎస్సీ ఈ ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వేసింది. జస్టిస్ గోఖలే, జస్టిస్ చలమేశ్వర్‌ల ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను ఆలకించిన మీదట కేసును పరిష్కరిస్తూ తాజా ఆదేశాలిచ్చింది.