APPSC Recruitment 2021 for 730 Posts- Sakshi
Sakshi News home page

APPSC Recruitment 2021: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..

Published Wed, Dec 29 2021 9:15 AM | Last Updated on Thu, Dec 30 2021 12:40 PM

APPSC Recruitment 2021 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటన జారీచేశారు. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్‌ అసి స్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టు లు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకోసం కమిషన్‌ నోటిఫి కేషన్‌ జారీచేసినట్టు తెలిపారు. డిసెంబర్‌ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి సూచించారు.    

ఏపీపీఎస్సీ 730 ఉద్యోగాలు 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్‌ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 730
పోస్టు: జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌(రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌): 670

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్‌ నిర్వహించే కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పోస్టు: ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3(ఎండో మెంట్స్‌ సబ్‌ సర్వీస్‌): 60

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022
వెబ్‌సైట్‌: psc.ap.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement