ENDOMENTS DEPARTMENT
-
APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటన జారీచేశారు. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసి స్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు లు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం కమిషన్ నోటిఫి కేషన్ జారీచేసినట్టు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి సూచించారు. ఏపీపీఎస్సీ 730 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ►మొత్తం పోస్టుల సంఖ్య: 730 ►పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ డిపార్ట్మెంట్): 670 ►అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ►ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ►పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3(ఎండో మెంట్స్ సబ్ సర్వీస్): 60 ►అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ►ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021 ►ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ►వెబ్సైట్: psc.ap.gov.in -
కేసులు వేసే అధికారం ఈఓ, ఏసీలకు..
సాక్షి, అమరావతి: దేవుడి భూములు, ఆలయాల ఇతర ఆస్తులను ఆక్రమించుకునే వారిపై కోర్టుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారాన్ని సంబంధిత ఆలయ ఈఓ లేదా జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలంటే దేవదాయ శాఖ చట్టంలోని 86(3) సెక్షన్ ప్రకారం సంబంధిత ఆలయ ఈఓలు దేవదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ అధికారాన్ని సంబంధిత ఆలయ ఈఓ లేదా జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లకు బదలాయిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేవుడి భూములు, ఇతర ఆస్తుల ఆక్రమణదారులపై ఎటువంటి జాప్యం లేకుండా స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. దేవదాయశాఖ పరిధిలో వివిధ ఆలయాల పేరిట దాదాపు 4.09 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో అందులో 67,525 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. మరో 3,613 ఎకరాలను వాటి లీజు గడువు ముగిసినా సంబంధిత లీజుదారులు వాటిని తమ అధీనంలో ఉంచుకున్నారు. ట్రస్టు బోర్డులకుదరఖాస్తుల స్వీకరణ అధికారం ఇక 6 (ఏ), (బీ) కేటగిరి ఆలయాల్లో ట్రస్టు బోర్డుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేయడం, ట్రస్టు బోర్డు సభ్యుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ అధికారం ఇప్పటివరకు దేవదాయ శాఖ కమిషనర్‌కే ఉంది. తాజాగా.. 6 (ఏ) కేటగిరీ ఆలయాలకు నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ అధికారం దేవదాయ శాఖ డివిజనల్ కమిషనర్లకు. 6 (బీ) ఆలయాల అధికారం జిల్లా దేవదాయ శాఖ కమిషనర్లకు బదలాయిస్తున్నట్లు కూడా వాణీమోహన్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సింహాచలం కొండపై నేలకొరిగిన ధ్వజస్తంభం
సాక్షి,విశాఖపట్నం: సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం అర్థరాత్రి అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పాడై పోవడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ఆలయ సాంప్రదాయరీతిలో ధ్వజస్తంభం పునః ప్రతిష్ట చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఏమిటీ కక్ష!
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేవాదాయ శాఖలో పని చేస్తున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ఇటీవల ఆలయ ఉద్యోగులను ఏకపక్షంగా బదిలీ చేసి విమర్శలు మూటగట్టుకున్న ప్రభుత్వం.. తాజాగా మేనేజర్లను తక్కువ ఆదాయం వచ్చే ఆలయాలకు బదిలీచేసి వారికి జీతాలు కూడా అందని పరిస్థితి కల్పించింది. దీంతో ఆలయాల మేనేజర్లు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఉన్నతాధికారులు మేనేజర్లను వారి మాతృసంస్థకు బదిలీ చేయాలని, మేనేజర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆ శాఖ ప్రిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ మంగళవారం 604248 నంబర్‌తో మెమో జారీ చేశారు. దీంతో అవాక్కవడం మేనేజర్ల వంతయ్యింది. 2001 నుంచి మేనేజర్లుగా.. గతంలో వివిధ గ్రామాల్లో ఉన్న సుమారు 30 ఆలయాలను ఒకే కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించాల్సి వచ్చేది. దీంతో 2001లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి దివంగత దండు శివరామరాజు అర్హత గల సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను మేనేజర్లుగా నియమించి.. వారికి కొన్ని ఆలయాల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,250 మంది మేనేజర్లుగా బాధ్యతలు స్వీకరించారు. కాలక్రమంలో వారిలో కొందరు కార్యనిర్వహణాధికారులుగా పదోన్నతి పొందగా, ప్రస్తుతం విభజిత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 86 మంది మేనేజర్లు పనిచేస్తున్నారు. హోదా తగ్గించడంతో జీతాలు రాని పరిస్థితి సుమారు 16 సంవత్సరాల నుంచి మేనేజర్లుగా పని చేస్తున్న వారిని వెనక్కి పంపుతూ మెమో విడుదల చేయడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మేనేజర్ల స్థాయి నుంచి తిరిగి గుమాస్తాల స్థాయికి హోదాను తగ్గించడంతో వారు మాతృ సంస్థకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. వారి మాతృ సంస్థలు తక్కువ ఆదాయం పొందుతుండటంతో జీతాలు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదని మేనేజర్లు వాపోతున్నారు. దీనికితోడు ఇప్పటివరకూ పదోన్నతుల జాబితాలో ఉన్న తామంతా కార్యనిర్వహణాధికారులుగా ఎదిగే అవకాశం పోతుందని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగాలు ఉంటాయో.. లేదో మేనేజర్లను రివర్ట్ చేస్తూ జారీ చేసిన మెమో అమల్లోకి వస్తే సంబంధిత మేనేజర్లు వారి మాతృ సంస్థలకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటివరకూ ఆయా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు తమ కొలువులు రెగ్యులర్ అవుతాయని భావిస్తుండగా.. వారంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే ప్రమాదముంది.