త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు! | APPSC Notifications will be declared soon | Sakshi
Sakshi News home page

త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు!

Published Wed, Dec 4 2013 12:47 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

APPSC Notifications will be declared soon

తెలంగాణ, సీమాంధ్ర అభ్యర్థులకు వేర్వేరు మెరిట్ జాబితాలు!
 సాక్షి, హైదరాబాద్: వివిధ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలా వద్దా అనే అంశంపై వివరణ కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాయడం.., దానిపై సాంకేతికంగా అడ్డంకులు లేనప్పుడు మమ్మల్ని అడగడం ఎందుకని ప్రభుత్వ వర్గాలు అంటున్న నేపథ్యంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరో వారం పది రోజుల్లో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన 63,518 ఉద్యోగాల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 11,250 ఉన్నాయి. విభజన వల్ల ఇబ్బందులు తలెత్తకుండా రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా మెరిట్ జాబితాలను రూపొందిస్తామని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి తెలియజేసింది.
 
 12 నుంచి డిపార్ట్‌మెంటల్ టెస్టులు:
ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న డిపార్ట్‌మెంటల్ టెస్టుల హాల్‌టికెట్లను (www.apspsc.gov.in) వెబ్‌సైట్‌లో  4వ తేదీ నుంచి   డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలుంటే ఏపీపీఎస్సీ హెల్ప్‌డెస్క్ - 040 235 574 55, అదనపు కార్యదర్శి - 040 247 442 32, అసిస్టెంట్ సెక్రటరీ - 8498098244, సెక్షన్ ఆఫీసర్ - 8498098303 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది. కాగా, మే నెల డిపార్ట్‌మెంటల్ టెస్టుల ఫలితాలను విడుదల చేసినట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement