రాష్ట్ర విభజన ప్రక్రియను ఆర్థిక శాఖ వేగవంతం చేసింది. ఈ నెల 13వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ఖాతా ఏర్పాటునకు ఆర్‌బీఐతో ఒప్పందం జరగనుంది.
జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ఖాతా అమల్లోకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను ఆర్థిక శాఖ వేగవంతం చేసింది. ఈ నెల 13వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ఖాతా ఏర్పాటునకు ఆర్‌బీఐతో ఒప్పందం జరగనుంది. ఇందుకోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి 13వ తేదీన ముంబై వెళ్లనున్నారు. అక్కడ ఆర్‌బీఐ అధికారులు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తరఫున ప్రేమచంద్రారెడ్డి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతా జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ ఖాతా ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించనుంది.