ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.
సాక్షి, విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ హాస్టళ్లకు అధికారులు ఆదివారం నుంచి సెలవులు ప్రకటించారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ దృష్ట్యా హాస్టళ్లను తెరిచే ఉంచాలని విద్యార్థులు కోరారు. అయితే యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు నిరసన తెలిపారు.