ఏయూలో విద్యార్థుల దీక్ష భగ్నం | Samaikyandhra Movement: AU Students refuses to end fast | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 4 2013 3:51 PM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM

సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థుల చేపట్టిన దీక్షనుపోలీసులు భగ్నం చేశారు. కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయ తీసుకున్న అనంరతం సీమాంధ్ర ప్రాంతంలో నిరసనల సెగ రాజుకుంది. దీంతో దీక్ష చేపట్టిన విద్యార్థులను అరెస్టు చేసి దీక్షను భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణించిన విద్యార్థులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా గోదావరి జిల్లాలలో పలు చోట్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. వరుసగా అయిదోరోజూ పశ్చిమగోదావరి జిల్లాలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఏలూరు నగరంలో వాణిజ్య, వర్తక దుకాణాలన్నీ మూతబడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. వట్లూరు గ్రామస్ధులు కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఫైర్ స్టేషన్ సెంటర్‌లో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్ వేషధారణతో ఓ వ్యక్తిని అలకరించి, ఊరేగించారు. బొత్స, చిరంజీవి బ్యానర్లను ప్రదరిస్తూ ... సమైక్యాంధ్ర కావాలని నినదించారు. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement