AU students
-
వైఎస్సార్సీపీలో చేరిన ఏయూ విద్యార్థులు
-
‘పెన్‌స్టేట్’ వర్సిటీ అధ్యక్షురాలిగా నీలి బెండపూడి
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఏయూ పూర్వవిద్యార్థిని నీలి బెండపూడి నియమితులయ్యారు. ఈ నెల 9వ తేదీన జరిగిన పెన్సిల్వేనియా (పెన్‌స్టేట్) యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఏకగ్రీవంగా నీలి బెండపూడిని నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం నీలి బెండపూడి యూనివర్సిటీ ఆఫ్ లూయిన్ విల్లీ కెంటగీ అధ్యక్షురాలిగా, మార్కెటింగ్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నీలి బెండపూడి విశాఖ నగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా స్వీకరించారు. అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతంలో ఆమె కేన్సాస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చాన్సలర్‌గా సేవలందించారు. నీలి బెండపూడి తల్లిదండ్రులు ఆచార్య రమేష్ దత్త, పద్మదత్త ఇరువురూ ఏయూ ఆంగ్ల విభాగం ఆచార్యులుగా పనిచేశారు. నీలి బెండపూడిని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి అభినందించారు. రికార్డు సృష్టించారు : సీఎం జగన్ పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. విశాఖపట్నంకు చెందిన ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థిని అయిన నీలి బెండపూడి ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ పెన్ స్టేట్‌కి ఎన్నికైన తొలి మహిళా ప్రెసిడెంటుగా రికార్డు సృష్టించారన్నారు. కుమార్ అన్నవరపు అభినందనలు.. పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) కుమార్ అన్నవరపు అభినందనలు తెలిపారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఢిల్లీ విమానాశ్రయంలో ఏయూ విద్యార్థులు కలిశారు. గత ప్రభుత్వం తమపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో జీవో జారీ చేసి, కేసులు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. కాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల అంశంపై జరిగిన ఈ చర్చలో 21 రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్ జగన్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పార్లమెంట్ వరకూ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. -
సముద్రంలో ఏయూ విద్యార్థి గల్లంతు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సముద్రంలో స్నానం చేస్తుండగా ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు గల్లంతయ్యారు. అతని స్నేహితులు, మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఆర్కేబీచ్లో శనివారం ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారిలోని నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు కురుసుర జలాంతర్గామి మ్యూజియం వెనుక భాగంలో సముద్రంలో స్నానాలకు దిగారు. వీరిలో బర్రి నీలేష్(18) బలమైన కెరటాల ఉధృతికి సముద్రంలో ఉదయం 8.30 గంటల సమయంలో కొట్టుకుపోయాడు. వెంటనే ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు విషయాన్ని బీచ్ పెట్రోలింగ్, మూడో పట్టణ బ్లూ కోట్ పోలీసులకు తెలియజేశారు. వారు ఘటనాస్థలికి చేరుకున్నాక లైఫ్‌గార్డులు సముద్రంలో నీలేష్ కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. నీలేష్ ఏయూలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మద్దిలపాలెం చైతన్యనగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. నీలేష్ తండ్రి బర్రి రవిశంకర్ నేవీలో యూసీడీగా పనిచేస్తున్నారు. అతనికి ఒక సోదరి కూడా ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఇమ్మానియేల్‌రాజు పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాశరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చైతన్యనగర్‌లో విషాదం మద్దిలపాలెం చైతన్యనగర్‌లో విషాదం నెలకొంది. సముద్రంలో ఉదయం నీలేష్ కొట్టుకుపోయాడని సమాచారం అందగానే అతని తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. కాలనీలో ఎప్పుడూ అందరితోనూ చలాకీగా వుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఉదయం బీచ్‌లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి ఇలా గల్లంతవడంతో కాలనీవాసులు విషాదంలో మునిగిపోయారు. -
విశాఖలో ఏయూ విద్యార్థుల దీక్ష భగ్నం
-
ప్రత్యేక హోదా: ఏయూ వైఎస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం నిరసన
-
టీడీపీ నేతల నుంచి రక్షణ కల్పించండి
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరిన ఏయూ విద్యార్థులు సాక్షి, న్యూఢిల్లీ/విశాఖ సిటీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని పలువురు ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆశ్రయించారు. యూనివర్సిటీల్లో ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదన్న నిబంధనల మేరకు ఏయూ గ్రౌండ్స్‌లో టీడీపీ మహానాడు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందుకు కొంత మంది టీడీపీ నేతలు తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని పరిశోధక విద్యార్థి జానకిరాం ఆరోపించారు. వీరి నుంచి తమకు రక్షణ కల్పించాల్సిందిగా విద్యార్థులు జానకిరాం, కాంతారావు, పోతల ప్రసాద్ తదితరులు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసి విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు పెరిగిపోతున్నాయని, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిని ఆరెస్టులు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నారని రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. -
రాజ్‌నాథ్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
-
రాజ్‌నాథ్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
న్యూఢిల్లీ: టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. యూనివర్సిటీలో మహానాడు నిర్వహించొద్దని అన్నందుకు తమపై కక్ష కట్టారని వెల్లడించారు. సోషల్ మీడియా కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తోందని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను టీడీపీ సర్కారు కాలరాస్తోందని రాజ్‌నాథ్‌తో చెప్పారు. ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహించాన్ని వ్యతిరేకిస్తూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. విద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలు వద్దంటూ ధర్నాలు, నిరసనలు చేశాయి. -
ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలి
-
'24 గంటల్లో ఆ ఎంపీలు రాజీనామా చేయాలి'
-
జగన్ సైకత శిల్పాన్ని రూపొందించిన ఏయూ..
-
ఏయూలో విద్యార్థుల దీక్ష భగ్నం