
రాజ్‌నాథ్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
న్యూఢిల్లీ: టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. యూనివర్సిటీలో మహానాడు నిర్వహించొద్దని అన్నందుకు తమపై కక్ష కట్టారని వెల్లడించారు. సోషల్ మీడియా కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తోందని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను టీడీపీ సర్కారు కాలరాస్తోందని రాజ్‌నాథ్‌తో చెప్పారు.
ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహించాన్ని వ్యతిరేకిస్తూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. విద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలు వద్దంటూ ధర్నాలు, నిరసనలు చేశాయి.