Rajnanth Singh
-
ములాయం సింగ్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనారోగ్యంత గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్‌కు మొదట ప్రవేటు వార్డులో చికిత్స అందించారు వైద్యులు. అయితే అకస్మాతుగా ఆక్సీజన్ స్థాయిలు తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం హూటాహుటిన ఐసీయూకు తరలించారు. దీంతో అఖిలేశ్ సహా ఇతర కుటుంబసభ్యులంతా ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి. అయితే ములాయం సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అఖిలేశ్ యాదవ్ ఎస్పీ కార్యకర్తలకు తెలిపారు. ఆయనను చూసేందుకు ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ మేరకు ఆదివారం వెల్లడించారు. చదవండి: మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక -
విశ్వసనీయ వారధిగా మారండి
న్యూఢిల్లీ: పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ఎండీసీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా, సంకల్పం, అంకితభావం అనే విలువలపై ఆధారపడి బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం చుట్టే తిరగడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, ఒక కుటుంబం పెత్తనం కింద కొనసాగడం లేదన్నారు. ప్రజా సంక్షేమం అనే సంస్కృతే బీజేపీకి ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజల బాగు కోసం పని చేస్తోంది కాబట్టే కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని వివరించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కార్యకర్తలు ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే బీజేపీకి పరమావధి అని స్పష్టం చేశారు. అభివృద్ధి ఎజెండాకు ప్రజామోదం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని మోదీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ ఉప ఎన్నికలోనూ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుందని వివరించారు. బద్వేల్ ఉప ఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి కేవలం 750 ఓట్లు వచ్చాయని, ఈసారి ఏకంగా 21,000కుపైగా ఓట్లు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి అజెండాకు ప్రజామోదం లభిస్తోందనడానికి ఇవే నిదర్శనాలని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకోవాలని, వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు. కార్యకర్తలకు నడ్డా దిశానిర్దేశం వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షులు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి 10.40 లక్షల పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటును పూర్తిచేస్తామన్నారు. రాజకీయ తీర్మానం ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను కొనియాడుతూ, ప్రతిపక్షాల అవకాశవాద వైఖరిని ఎండగడుతూ బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధించడం ఖాయమని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం పట్ల మోదీని అభినందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతిపక్షాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. -
మహాత్ముని తర్వాత మోదీయే: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ తర్వాత భారత సమాజం, ప్రజల అంతరంగం లోతుగా తెలిసిన ఏకైక నేత ప్రధాని మోదీయేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పొగడ్తల వర్షం కురిపించారు. సవాళ్లను ఆయన ఎలా అధిగమించారో చూస్తే సమాజంపై ఆయనకు ఎంతటి అవగాహన ఉందో తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వాధినేతగా నరేంద్రమోదీ రెండు దశాబ్దాల పాలన అంశంపై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన శుక్రవారం మాట్లాడారు. మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు ‘సమర్థ నాయకత్వం, సమర్థవ పాలన‘ అంశంపై రెండు దశాబ్దాల మోదీ రాజకీయ ప్రస్థానాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నారు. 20 ఏళ్ల పాలనాకాలంలో ఆయనపై ఎటువంటి అవినీతి మరక పడలేదన్నారు. ప్రధాని మోదీని 24 క్యారెట్ల బంగారం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 100 ఏళ్ల క్రితం గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం ప్రధాని మోదీ స్వదేశీ 4.0కు కొత్త నిర్వచనం చెప్పారన్నారు. 2001–2014 సంవత్సరాల్లో మోదీ గుజరాత్ సీఎంగా, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. -
భారత్ మాకు బలమైన భాగస్వామి
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా తీర్మానించుకున్నాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రక్షణ సంబంధాలను విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమని నిర్ణయానికొచ్చాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు బలమైన భాగస్వామి అని అమెరికా ఉద్ఘాటించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ శనివారం పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇండో–యూఎస్ రక్షణ భాగస్వామ్యానికి జో బైడెన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని లాయిడ్ అస్టిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామిగా మారుతోందని తెలిపారు. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో అమెరికాకు ఇండియా ఒక మూలస్తంభం అని వ్యాఖ్యానించారు. ఇండియాతో సమగ్రమైన రక్షణ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని వివరించారు. తద్వారా జో బైడెన్ ప్రభుత్వ విదేశాంగ విధానంలోని ప్రాధాన్యతలపై అస్టిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. చైనా ఆగడాలపై చర్చ అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్‌తో చర్చలు సమగ్రంగా, ఫలవంతంగా జరిగాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భారత సైన్యం, అమెరికాకు చెందిన ఇండో–పసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఆఫ్రికా కమాండ్ మధ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండియా–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సాగిస్తున్న ఆగడాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు. రక్షణ సహకారంపై ఇండియా–అమెరికా మధ్య గతంలో కొన్ని ఒప్పందాలు కుదిరాయని, వాటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చించామని పేర్కొన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచిపోవాలని రాజ్‌నాథ్‌సింగ్ ఆకాంక్షించారు. త్రివిధ దళాల అవసరాల కోసం అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన 30 మల్టీ–మిషన్ ఆర్మ్డ్ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్, లాయిడ్ అస్టిన్ చర్చించినట్లు సమాచారం. మీడియం–ఆల్టిట్యూడ్ లాండ్ ఎండ్యురెన్స్ (ఎంఏఎల్‌ఈ) ప్రిడేటర్–బి డ్రోన్లుగా పిలిచే ఈ డ్రోన్లు ఏకంగా 35 గంటలపాటు గాలిలో సంచరించగలవు. భూమిపై, సముద్రంపై ఉన్న లక్ష్యాలను వేటాడే సామర్థ్యం వీటి సొంతం. రాజ్‌నాథ్‌తో చర్చల అనంతరం లాయిడ్ అస్టిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఇరాన్‌తో చర్చలు ఫలవంతం
టెహ్రాన్: ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై పరస్పరం అభి ప్రాయాలు పంచుకున్నామని, ఈ చర్చలు ఫలవంతమయ్యా యని రాజ్ నాథ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజ్‌నాథ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని అక్కడి నుంచి శనివారం ఇరాన్‌కు వచ్చారు. ఇరాన్ రక్షణ మంత్రి వినతి మేరకే ఈ భేటీ జరిగిందని రక్షణ శాఖ తెలిపింది. ఇరువురు నేతలు సాంస్కృతిక, భాషా, పౌర సంబంధాలు తదితర అంశాలపై సుహృ ద్భావ వాతావరణంలో చర్చలు జరిపారని చెప్పింది. ప్రాంతీయ భద్ర త, శాంతి పరిరక్షణ కోసం ఇరు దేశాల అధికారులు పరస్పరం సం ప్రదింపులు జరుపుతూనే ఉన్నారంది. ‘ఈ రీజియన్‌లోని దేశాలతో భా రత్ స్నేహ సంబంధాలను కోరుకుంటుంది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు , ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతరుల జో క్యం నివారణకు కృషి చేస్తాం’అని రాజ్‌నాథ్ చెప్పారు. అంతర్యుద్ధం తో అతలా కుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిపై భారత్ ఆం దోళ న వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ మంత్రితో భేటీ ప్రాధాన్యం సంత రించుకుంది. తాలిబాన్లు అమెరికాతో శాంతి ఒప్పందం కుదు ర్చు కు న్న తర్వాత రాజకీయ సుస్థిరత ఏర్పాటుపై భారత్ మరింత దృష్టిసారించింది. -
యోధులారా.. వందనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు త్రివిధ దళాలు ఆదివారం ఘనమైన రీతిలో సంఘీభావం ప్రకటించాయి. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు ప్రధాన నగరాల్లో ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్నాయి. అలాగే సముద్ర తీరాల్లో యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. కరోనా భయం వదిలి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలన్న స్ఫూర్తిని చాటాయి. ఆసుపత్రుల వద్ద సైనికులు ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పోలీసు స్మారకాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, గువాహటి, పట్నా, లక్నో, శ్రీనగర్, చండీగఢ్, భోపాల్, కోయంబత్తూరు, తిరువనంతపురం తదితర నగరాల్లో యుద్ధ విమానాల ఫ్లై పాస్టు ప్రజలను అబ్బురపరిచింది. వైమానిక దళం, నావికా దళానికి చెందిన హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూల జల్లు కురిపించాయి. కరోనా యోధులకు మద్దతుగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రదర్శనల పట్ల హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వందనాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్న యోధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వైరస్ వ్యాప్తిని అంతం చేసే దిశగా ధైర్యంగా ముందుకు సాగుతున్న యోధులకు వందనాలు. మన సైనిక దళాలు వారికి గొప్పగా కృతజ్ఞతలు తెలిపాయి’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై పూలు చల్లుతున్న హెలికాప్టర్లు, సైనిక బ్యాండ్ ప్రదర్శన వీడియోను పోస్టు చేశారు. ఢిల్లీలో జాతీయ పోలీసు స్మారక స్థూపంపై పూల వర్షం కురిపిస్తున్న భారత వైమానిక దళం హెలికాప్టర్ -
లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసిని పూర్తిగా అంతమొందించేందుకు ఏప్రిల్ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్‌ను కనీసం 2 వారాలైనా కొనసాగించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ –19పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఇతర శాఖల సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలను తగినన్ని అందుబాటులో ఉంచుతామని ప్రధాని సీఎంలకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా కుదేలయిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు, కోవిడ్–19పై పోరు కొనసాగించేందుకు కేంద్రం సాయం అందించాలని పలువురు సీఎంలు ప్రధానిని అభ్యర్థించారు. కరోనా వైరస్ వ్యాప్తిని సంపూర్ణంగా అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే అత్యుత్తమ, ఏకైక మార్గమని పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి సూచించారు. ఏప్రిల్ ఆఖరు దాకా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని వారు ప్రధానికి సూచించారు. పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తెల్లని వస్త్రంతో చేసిన మాస్క్‌ను ధరించగా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా మాస్క్‌లతో ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలను ఇచ్చాయన్నది రానున్న 3, 4 వారాల్లో తేలుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. వైరస్‌ను పూర్తిగా రూపుమాపేందుకు రానున్న 3, 4 వారాలు అత్యంత కీలకమన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ (బెంగాల్), యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర), ఎంఎల్ ఖట్టర్(హరియాణా), నితీశ్‌కుమార్(బిహార్) తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కొన్ని ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నారన్న వార్తల నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ప్రాణాలూ ముఖ్యమే.. అభివృద్ధీ ముఖ్యమే మొదట లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వాల ప్రాథామ్యమని చెప్పామని, అయితే, ఇప్పుడు ప్రభుత్వాల లక్ష్యం ప్రాణాలను కాపాడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటం కూడా అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘లాక్డౌన్ ప్రకటిస్తున్న సమయంలో ప్రాణాలు ఉంటేనే అభివృద్ధి అన్నాను. నా మాటలను అర్థం చేసుకున్న దేశప్రజలు లాక్డౌన్ నిబంధనలను అద్భుతంగా పాటించారు. ఇప్పుడు ప్రాణాలతో పాటు దేశాభివృద్ధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అన్నారు. కరోనా కట్టడిలో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఔషధాలు, నిత్యావసర వస్తువులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, వాటిని అక్రమంగా నిల్వ చేస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైద్య సిబ్బంది, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ విద్యార్థులపై దాడులను ప్రధాని ఖండించారు. కోవిడ్ 19కి చికిత్స లేనందున భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పని సరి అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం కావడానికి ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకోవాలన్నారు. -
అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
బాలాసోర్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన గగనతలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతంలో అస్త్ర క్షిపణిని భారత వైమానిక దళం పరీక్షించింది. సుఖోయ్–30 ఎంకేఐ ద్వారా అస్త్రను ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. అస్త్ర సమర్థంగా, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఈవోటీఎస్), సెన్సార్లు అస్త్ర క్షిపణి గమనాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి చూశాయని, ఎంతో కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని వెల్లడైందని‘ ఆ ప్రకటన తెలిపింది. ఈ సందర్భంగా డీఆర్డీఓ, వాయుసేన బృందానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం వాయుసేన రష్యాకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఐ–డెర్బీ, స్వదేశీయంగా రూపొందించిన అస్త్రను వాయుసేనలో చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది. అస్త్ర ప్రత్యేకతలు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), మరో 50 ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలతో కలిసి అస్త్ర క్షిపణిని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. గాల్లో నుంచి గాల్లోకి 70 కి.మీ. పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఈ పరిధిని 300 కి.మీ.లకు పెంచడానికి డీఆర్డీఓ ప్రణాళికలు రూపొందిస్తోంది. నిర్దేశిత లక్ష్యానికి చేరుకోవడానికి ఈ క్షిపణి గంటకి 5,555 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. 15 కిలోగ్రాముల పేలుడు పదార్థాలతో ప్రత్యేకమైన వార్‌హెడ్ ఉంటుంది. -
కశ్మీర్‌పై మీ ఏడుపు ఆపండి
లేహ్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, కశ్మీర్‌పై ఆ దేశం ఏడుపు ఆపాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్తాన్‌కు సూచించారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు ఒక విధానమంటూ లేదని, ఆ విషయంలో ఆ దేశం చేస్తున్న యాగీకి అంతర్జాతీయంగా ఏ దేశమూ మద్దతు ప్రకటించలేదని రక్షణ మంత్రి చెప్పారు. ‘నేను పాకిస్తాన్‌ను ప్రశ్నిస్తున్నా.. మీకేం సంబంధం ఉందని కశ్మీర్ విషయంలో రోదిస్తున్నారు? నిజానికి పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయిన ప్రాంతమే. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, గిల్గిత్, బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై రోదించండి’అని పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై అంతర్జాతీయంగా మద్దతు సంపాదించాలని పాకిస్తాన్ చేసిన కుటిల ప్రయత్నాలను ఏ దేశమూ సమర్థించలేదని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్–జవాన్ విజ్ఞాన్ మేళా’సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్న పొరుగు దేశంతో చర్చలు అసాధ్యమని ఆయన చెప్పారు. భారత్ పాకిస్తాన్‌తో సత్సంబంధాలనే కోరుకుంటోంది. అయితే పాకిస్తాన్ మొదట ఉగ్రవాదులను భారత్‌లోకి చొప్పించడం మానుకోవాలి. కశ్మీర్‌పై మాట్లాడేముందు వారు పీవోకే, బలూ చిస్తాన్‌పై మాట్లాడాలి అని రాజ్‌నాథ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలూచిస్తాన్ భారతదేశంలో భాగమేనంటూ 1994లో భారత పార్లమెంట్లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. -
ట్రంప్‌తో భేటీలో కశ్మీర్ ప్రస్తావనే లేదు
న్యూఢిల్లీ: జపాన్‌లో జరిగిన జీ–20 సమావేశాల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయినప్పుడు కశ్మీర్ ప్రస్తావనే రాలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. కశ్మీర్ వివాదంపై భారత్, పాక్‌ల మధ్యలోకి మూడో దేశం మధ్యవర్తిత్వం కుదరదని ఆయన తెలిపారు. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా మోదీ తనను కోరారంటూ సోమవారం ట్రంప్ చెప్పడంతో దేశంలో రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. ఈ విషయంపై స్వయంగా మోదీనే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు డిమాండ్ చేస్తూ బుధవారం లోక్‌సభలో ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఆ విషయంపై చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా సమయం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం, వారికి సమాధానం చెప్పేందుకు లోక్‌సభ ఉప నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ లేచిన వెంటనే విపక్షం మళ్లీ ఆందోళనకు సిద్ధమైంది. మోదీనే వచ్చి రెండు సభల్లోనూ సమాధానం చెప్పాలంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడుతూ కశ్మీర్ దేశానికి గర్వకారణమనీ, ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదని చెప్పారు. ట్రంప్‌తో భేటీలో మోదీ అస్సలు కశ్మీర్ గురించి మాట్లాడిందే లేదనీ, ఇక మధ్యవర్తిత్వం ప్రస్తావన ఎక్కడినుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు. -
ఆ ముగ్గురికి కీలక శాఖలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్లో మంత్రులకు శాఖలను కేటాయించారు. నెంబర్ టూగా వ్యవహరిస్తున్న అమిత్ షాకు హోంశాఖను కేటాయించారు. కీలక ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్‌కు కట్టబెట్టారు. ఇక రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖను కేటాయించారు. గత మోదీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన అరుణ్ జైట్లీ అనారోగ్య కారణంతో మంత్రి పదవిని చేపట్టలేనని ప్రధానికి స్పష్టం చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను అప్పగించారు. ఇందిరా గాంధీ తర్వాత ఆమే.. ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ నిర్మలా సీతారామన్ కావడం గమనార్హం. 1969-70ల్లో కొద్ది కాలం ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖనూ చేపట్టారు. ఇక 2017లో మోదీ క్యాబినెట్లో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దేశ రక్షణశాఖను నిర్వహించిన తొలి మహిళాగా ఖ్యాతికెక్కారు నిర్మలాసీతారామన్. ఆ శాఖ బాధ్యతలను ఏడాదిన్నరపాటు నిష్కళంకంగా.. సమర్థంగా నిర్వహిస్తూ మోదీ ప్రశంసలు అందుకున్నారు. రఫేల్ ఒప్పందంపై ప్రతిపక్షనేత రాహూల్‌గాంధీ తీవ్రస్థాయిలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ సందర్భంలో నిర్మలాసీతారామన్ పార్లమెంటులో మోదీకి వెన్నుదన్నుగా తన వాణిని వినిపించారు. కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన జవానులను మట్టుపెట్టిన తరువాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నేపథ్యంలో నిర్మలాసీతారామన్ పనితీరుపై ప్రశంసలు వచ్చాయి అమిత్ షాకు అందలం బీజేపీ చీఫ్‌గా లోక్‌సభ ఎన్నికల్లో మోదీతో పాటు పార్టీ అఖండ విజయానికి బాటలు పరిచిన అమిత్ షా తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా పలు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ట్రబుల్ షూటర్‌గానూ ఆయన పేరొందారు. బీజేపీ ఉనికిలేని రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణకు వ్యూహాలకు పదునుపెట్టడంలో అమిత్ షా ఆరితేరారు. మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. ఒకానొక దశలో అమిత్ షా గుజరాత్ మంత్రిగా పలు పోర్ట్పోలియాలను నిర్వహించారు. స్టాక్ మార్కెట్ బ్రోకర్ నుంచి అంచెలంచెలుగా ఆయన అత్యున్నత స్ధాయికి చేరుకున్నారు. విధేయతకు పట్టం ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గత క్యాబినెట్లో హోంశాఖను సమర్ధంగా నిర్వహించిన అనుభవం ఉంది. సీనియర్ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీ సన్నిహితుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రిగా, బీజేపీ చీఫ్‌గానూ వ్యవహరించిన రాజ్‌నాథ్ సింగ్‌కు పార్టీ దిగ్గజ నేతలతో పాటు ఆరెస్సెస్ అగ్ర నేతలతోనూ విస్తృత పరిచయాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయతీరాలకు చేరాలంటే మోదీ నాయకత్వం అవసరమంటూ ఎల్కే అద్వాణీ సహా పార్టీ కురువృద్ధులను ఒప్పించడంలో రాజ్‌నాథ్ కీలక పాత్ర పోషించారు. -
రాహుల్‌పై హత్యాయత్నమా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హత్యకు ఎవరైనా కుట్ర పన్నారా? అమేథీలో నామినేషన్ దాఖలుచేసిన అనంతరం ఆయన్ను స్నైపర్ తుపాకీతో చంపేందుకు ప్రయత్నించారా? అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే జవాబు ఇస్తున్నాయి. బుధవారం యూపీలోని అమేథీలో రాహుల్ తలపై కనీసం ఏడుసార్లు ఆకుపచ్చ రంగు లేజర్ లైట్ తాకిందనీ, ఇలాంటి లేజర్‌ను స్నైపర్ తుపాకుల్లోనే వాడతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసింది. కణతపై గురిపెట్టారు.. కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్, జైరాం రమేశ్, రణ్‌దీప్ సూర్జేవాలా సంతకం చేసిన ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ‘యూపీలోని అమేథీలో నామినేషన్ అనంతరం రోడ్‌షో, మీడియా సమావేశం నేపథ్యంలో రాహుల్ తలపై ఏడుసార్లు లేజర్ లైట్ పడింది. వీటిలో రెండు సార్లు రాహుల్ కణతపైనే గురిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన మాజీ భద్రతాధికారులు.. ఇలాంటి లేజర్ లైట్లు కేవలం స్నైపర్ గన్‌లాంటి అత్యాధునిక ఆయుధాల్లోనే ఉంటాయని తేల్చారు. ఇలాంటి ఘటన జరగడం రాహుల్ గాంధీ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రస్తుతం హైరిస్క్ టార్గెట్‌గా ఉన్నారు. ఆయన కుటుంబంలో ఇప్పటికే ఇద్దరిని (ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ) ఉగ్రశక్తులు హత్యచేశాయి. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని హోంశాఖను కోరుతున్నాం. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాహుల్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని తెలిపింది. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కిందకు జారిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన డీజీసీఏ ఆటో–పైలట్ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించింది. అది తుపాకీ కాదు: హోంశాఖ రాహుల్ గాంధీపై హత్యాయత్నానికి గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారన్న కాంగ్రెస్ పార్టీ వాదనను కేంద్ర హోంశాఖ ఖండించింది. ఆయన ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై హోంశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘రాహుల్‌పై లేజర్ లైట్ పడిందన్న వార్తలు మీడియాలో రాగానే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) డైరెక్టర్‌ను హోంశాఖ ఆదేశించింది. ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీజీ నిపుణుల బృందం.. అందులోని ఆకుపచ్చ రంగు లేజర్ లైట్ ఏఐసీసీ ఫొటోగ్రాఫర్ ఫోన్ నుంచి వచ్చినట్లు గుర్తించింది. రాహుల్ రోడ్ షోతో పాటు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఫొటోగ్రాఫర్ రాహుల్ వీడియోలను ఫోన్ ద్వారా చిత్రీకరించారు. ఈ విషయాన్ని ఎస్పీజీ డైరెక్టర్ హోంశాఖతో పాటు రాహుల్ వ్యక్తిగత సిబ్బందికి చెప్పారు’ అని అన్నారు. రాహుల్ భద్రతపై కాంగ్రెస్ లేఖ రాయలేదన్నారు. -
అధికారం కోసమే కూటమి ఏర్పాటు
సాక్షి, వనపర్తి: కాంగ్రెస్, టీడీపీల పార్టీల కలయిక అపవిత్రమైనదని, అధికారం కోసమే ప్రజాకూటమిగా ఏర్పడ్డారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించారని అన్నారు. కానీ చంద్రబాబు అదేపార్టీతో జతకట్టడం చూస్తే అధికారమే వారి లక్ష్యమని, ప్రజా సమస్యలు, అభివృద్ధి వారికి పట్టవనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కొత్త అమరేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఏ పార్టీ అయినా కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేయవద్దని, అభివృద్ధి, సంక్షేమం తద్వారా దేశఅభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలని హితవు పలికారు. గతంలో బీజేపీ ప్రభుత్వం చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఏర్పాటుచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెనుకబడుటకు గల కారణాలను చెప్పాలని కేసీఆర్, చంద్రబాబును కోరారు. రెండు రాష్ట్రాల్లోనూ మానవ వనరులు, నైపుణ్యం, ప్రకృతి వనరులకు ఎలాంటి కొరత లేదన్నారు. ఇక్కడి రాజకీయ నాయకుల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంలేదని అందుకే వెనుకబాటుకు గురవుతున్నాయని అన్నారు. నిధుల దారి మళ్లింపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని, కేసీఆర్ అడ్డుకుంటున్నాడని, ఇళ్లులేని నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో మోది ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దారి మళ్లించిందని అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం మద్దతు ధరను పెంచిందని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని అన్నారు. అభివృద్ధి చేయలేదు కాబట్టే.. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి చేయలేదు కాబట్టే, ప్రజల దృష్టిని మరల్చడానికి మెనార్టీల రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెస్తున్నాడని రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపించారు. ఎవరి రిజర్వేషన్లను తొలగించి మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలో, ఎలాంటి రాజ్యాంగ బద్దంగా అది సాధ్యమవుతుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 55ఏళ్ల పాలనలో దేశంలో కేవలం 2 సెల్‌ఫోన్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయని కానీ నేడు 120 సెల్‌ఫోన్ ఉత్పత్తి చేసే కంపనీలు దేశంలో నెలకొల్పబడ్డాయని తెలిపారు. మరో ఆరు నెలలకు వస్తా 2019 ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని , తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆరు ఇంతలు చేస్తామని అన్నారు. దేశంలో సుపరిపాలన అందించడం బీజేపీకి మాత్రమే సాధ్యమని, గుజరాత్లో గడిచిన 22ఏళ్లుగా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో గడిచిన 15ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నామని అన్నారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయినా అక్కడ మరోసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. వనపర్తిలో అభ్యర్థి అమరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయకురాలు బంగారు శృతి, నాయకులు బి.కృష్ణ, సబ్బిరెడ్డివెంకట్రెడ్డి, బి.పరుశురాం తదితరులు పాల్గొన్నారు. తెలుగులో మాట్లాడిన సింగ్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. సోదరి, సోదరిమణులారా.. మీ అందరికీ నమస్కారాలు.. ఈ సభలోని మీ అందరికీ అభినందనలు. ఇంత పెద్దఎత్తున సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ అమర వీరులకు జోహార్లు అని తెలుగులో చెప్పారు. -
మత విభేదాలు సృష్టించేందుకే!
న్యూఢిల్లీ: స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే ఎన్నార్సీ (జాతీయ పౌర రిజిస్టర్)పై వివాదం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. మత కల్లోలాలు సృష్టించేందుకే సోషల్ మీడియాలో విద్వేషపూరిత సందేశాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం రాజ్యసభలో ఎన్నార్సీ తుది ముసాయిదాపై ప్రభుత్వ ప్రకటనలో భాగంగా రాజ్‌నాథ్ మాట్లాడారు. తుది జాబితా రూపకల్పనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నార్సీ తుది ముసాయిదాలో 40 లక్షల మందికి చోటు దక్కకపోవడంతో వివాదమవడం తెల్సిందే. పారదర్శకంగా ఎన్నార్సీ ప్రక్రియ ‘ఎన్నార్సీ ముసాయిదా రూపకల్పన ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమం. వివక్షకు చోటు లేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి వివక్ష ఉండదని భరోసా ఇస్తున్నా. తన పౌరులెవరో తెలుసుకోవాలనుకోవడం ప్రతిదేశానికున్న బాధ్యత. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం’ అని అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనను పలు పార్టీల నేతలు స్వాగతించగా మరికొందరు ఎన్నార్సీపై సూచల విషయంలో స్పష్టత కావాలనికోరారు. కాగా, దేశ భద్రత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. జాబితాలో లేని వారికి చొరబాటుదారులని పిలవడం సరికాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ప్రభుత్వాన్ని కోరారు. ఈశాన్యంలో ‘అస్సాం’ ప్రకంపనలు అరుణాచల్‌ప్రదేశ్: స్థానికతను ధ్రువీకరించే పత్రాల్లేకుండా నివాసం ఉంటున్న స్థానికేతరులు 15రోజుల్లోగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆల్ అరుణాచల్‌ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ (ఆప్సు) హెచ్చరించింది. రాష్ట్రంలో అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఆగస్టు 17 నుంచి ‘ఆపరేషన్ క్లీన్ డ్రైవ్’ను చేపట్టనున్నట్లు ప్రకటించింది. మణిపూర్: రాష్ట్రంలోకి ఎవరూ అక్రమంగా ప్రవేశించకుండా పర్యవేక్షించేందుకు అధికార బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కూడా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసింది. నాగాలాండ్: సరిహద్దు ప్రాంతాల నుంచి ఎవరూ ప్రవేశించకుండా చూడాలని నాగాలాండ్ హోంశాఖ ఆదేశించింది. నాగాలాండ్‌లోనూ ఎన్నార్సీ చేపట్టాలని అధికార ఎన్డీపీపీ.. కేంద్రాన్ని కోరింది. మేఘాలయ: స్థానిక గిరిజనుల హక్కుల రక్షణ కోసం ఎన్నార్సీ తరహా చర్యలు చేపట్టాలని ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ) ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. అస్సాం ఎన్నార్సీ విడుదల అనంతరం అక్రమ వలసదారుల గుర్తింపు, ప్రవేశాన్ని అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో కేఎస్‌యూ 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. త్రిపుర: త్రిపురలోనూ ఎన్నార్సీ చేపట్టాలని ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) డిమాండ్ చేస్తోంది. అయితే ఈ డిమాండ్‌ను అధికార బీజేపీ తోసిపుచ్చింది. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ ఎన్నార్సీ నిర్వహించాలని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి సంఘం (ఎన్ఈఎస్ఓ) డిమాండ్ చేస్తోంది. -
ప్రధాని భద్రతపై రాజ్‌నాథ్ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం హోం శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రికి కల్పిస్తున్న భద్రత ప్రమాణాలు, పెంచాల్సిన ఆవశ్యకతను అధికారులతో చర్చించారు. భీమా-కోరేగావ్ ఘటనలో నిందితులైన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖల్లో మోదీ హత్యకు కుట్ర జరుగుతోందన్న విషయాలను పోలీసులు బయటపెట్టారు. కాగా భీమా-కోరేగావ్‌లో దళితులకు, హిందూత్వవాదులకు మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒకరు మరణించగా చాలా మంది గాయపడ్డారు. భీమా-కోరేగావ్ ఘటనలో ప్రధాన నిందితుడై మిలింద్ ఎక్‌బోతేను గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లు చెలరేగడంలో కారణమైన దళిత నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో రోనా విల్సన్ వద్ద దొరికిన లేఖల్లో ప్రధాని మోదీ హత్యకు సంబంధించి కుట్ర బయటపడిన విషయం తెలిసిందే. -
‘చివరి అంచుల్లో నక్సలిజం’
గుర్గావ్ : దేశంలో నక్సజలిం చివరి అంచుల్లో ఉందని, భద్రతా దళాలు నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో విజయవంతం అయ్యాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హరియాణాలోని గుర్గావ్లో శనివారం సీఆర్పీఎఫ్ దళాల 79వ రైసింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుక్మా ఎన్కౌంటర్లో మరణించిన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘నక్సలిజాన్ని ఎదుర్కొవడం పెద్ద సవాల్. కానీ, సీఆర్పీఎఫ్ సహా భద్రతాదళాలు దానిని కట్టడి చేయటంలో కృషి చేస్తున్నాయి. భద్రతా దళాలను నేరుగా ఎదుర్కొనే శక్తిలేక మావోయిస్టులు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. దీనివల్ల భద్రతా సిబ్బంది మరణాల రేటు తీవ్రంగా పెరిగింది. అందుకే నక్సల్ వ్యతిరేక చర్యలను పోత్సహిస్తున్నాం. నిర్ణయాత్మక చర్యలతో వారి చేష్టలను తిప్పికొడుతున్నాం’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. వాళ్లే నష్టపోతున్నారు... ‘మావోయిస్టుల చర్యల వల్ల సామాన్య ప్రజానీకం కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. వారి చర్యల వల్ల వారే నష్టపోతున్నారు’ అని రాజ్‌నాథ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా మావోయిస్టులు పని చేస్తున్నారని, చివరకు రోడ్లు వేస్తున్న సిబ్బందిని కూడా హతమారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిజానికి రైసింగ్ డే మార్చి 19నే కాగా, రాజ్‌నాథ్ బిజీ షెడ్యూల్ మూలంగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేరాల్లో యూపీ టాప్
న్యూఢిల్లీ: జనాభాలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నేరాల్లోనూ పెద్ద పేరే సంపాదించింది. హత్యలు, మహిళలపై నేరాలు వంటివి 2016లో ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. మెట్రో నగరాలపరంగా చూస్తే ఢిల్లీలో ఎక్కువగా రేప్‌లు జరిగినట్లు తెలిపింది. అలాగే విదేశీయులకు ఢిల్లీ ఏ మాత్రం సురక్షితం కాదని కుండ బద్దలు కొట్టింది. 2016లో చోటుచేసుకున్న నేరాలను 2015తో పోలుస్తూ ఎన్సీఆర్బీ రూపొందించిన సమగ్ర నివేదికను గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. అందులోని వివరాలు... ► జనాభాలో అగ్ర స్థానంలో ఉన్న యూపీలో 2016లో అత్యధికంగా 4889 హత్యలు జరిగాయి. ఇది మొత్తం దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న వాటిలో 16.1 శాతానికి సమానం. తరువాతి స్థానంలో బిహార్ (2581 హత్యలు–8.4%) ఉంది. ► మహిళలపై నేరాలకు సంబంధించి యూపీలో 49,262(14.5%) కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్లో 32,513 (9.6) కేసులు నమోదయ్యాయి. ► దేశవ్యాప్తంగా రేప్ కేసులు 2015తో పోల్చితే 12.4 శాతం పెరిగాయి. ► రేప్ కేసుల్లో మధ్యప్రదేశ్(4882), యూపీ (4816), మహారాష్ట్ర(4,189) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ► ఐపీసీ కింద నమోదైన కేసుల్లో 9.5 శాతం యూపీలోనే ఉన్నాయి. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (8.9%), మహారాష్ట్ర (8.8%), కేరళ(8.7%) ఉన్నాయి. ► హత్యా నేరాలు గత మూడేళ్లుగా తగ్గుతున్నాయి. 2015తో పోలిస్తే 2016లో ఇవి 5.2 శాతం పడిపోయాయి. ► అపహరణ కేసులు 6 శాతం పెరిగాయి. ► పిల్లలపై నేరాలు 13.6 శాతం పెరిగాయి. ► షెడ్యూల్డ్ కులాలపై దాడులు 5.5%, షెడ్యూల్డ్ తెగలపై 4.7 శాతం పెరిగాయి. యూపీలోనే ఎస్సీలపై దాడులు అత్యధికంగా 25.6% నమోదవగా, తరువాతి స్థానంలో బిహార్ (14%), రాజస్తాన్ (12.6%) ఉన్నాయి. ఎస్టీలపై దాడుల కేసుల్లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1823(27.8 శాతం) కేసులు నమోదయ్యాయి. ► వేర్వేరు నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 37,37, 870 మంది అరెస్టవగా, 32,71,262 మందిపై చార్జిషీట్ నమోదుచేశారు. ఇందులో 7,94,616 మంది దోషులుగా తేలగా, 11,48,824 మంది నిర్దోషులుగా బయటపడ్డారు. ► దేశంలోని మెట్రో నగరాల్లో చూస్తే ఒక్క ఢిల్లీలోనే 40% రేప్ కేసుల నమోదు. ► మెట్రో నగరాల్లో మహిళలపై జరిగిన నేరాల్లో ఢిల్లీలోనే 33 శాతం చోటుచేసుకోగా, ముంబైలో 12.3% కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐపీసీ కేసుల్లో ఢిల్లీ వాటా 38.8 శాతం కాగా, బెంగళూరులో 8.9 శాతం, ముంబైలో 7.7% చొప్పున నమోదయ్యాయి. -
రాజ్‌నాథ్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
-
రాజ్‌నాథ్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
న్యూఢిల్లీ: టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. యూనివర్సిటీలో మహానాడు నిర్వహించొద్దని అన్నందుకు తమపై కక్ష కట్టారని వెల్లడించారు. సోషల్ మీడియా కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తోందని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను టీడీపీ సర్కారు కాలరాస్తోందని రాజ్‌నాథ్‌తో చెప్పారు. ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహించాన్ని వ్యతిరేకిస్తూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. విద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలు వద్దంటూ ధర్నాలు, నిరసనలు చేశాయి.