
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం హోం శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రికి కల్పిస్తున్న భద్రత ప్రమాణాలు, పెంచాల్సిన ఆవశ్యకతను అధికారులతో చర్చించారు. భీమా-కోరేగావ్ ఘటనలో నిందితులైన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖల్లో మోదీ హత్యకు కుట్ర జరుగుతోందన్న విషయాలను పోలీసులు బయటపెట్టారు.
కాగా భీమా-కోరేగావ్‌లో దళితులకు, హిందూత్వవాదులకు మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒకరు మరణించగా చాలా మంది గాయపడ్డారు. భీమా-కోరేగావ్ ఘటనలో ప్రధాన నిందితుడై మిలింద్ ఎక్‌బోతేను గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లు చెలరేగడంలో కారణమైన దళిత నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో రోనా విల్సన్ వద్ద దొరికిన లేఖల్లో ప్రధాని మోదీ హత్యకు సంబంధించి కుట్ర బయటపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment