విద్యార్థులను అడ్డుకున్నపోలీసులు | chandrababu vijits kadapa distirict | Sakshi
Sakshi News home page

విద్యార్థులను అడ్డుకున్నపోలీసులు

Published Fri, Feb 27 2015 2:59 PM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM

chandrababu  vijits kadapa distirict

కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలసేందుకు వెళ్లిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు గండికోట వస్తున్నారని తెలుసుకుని.. గోపీకృష్ణ డీఈడీ కళాశాలకు చెందిన విద్యార్థులు, ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్ల మీదుగా గండికోటకు బయలుదేరారు.

తమకు ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించలేదని దీనికి సంబంధించిన సమస్యలు వివరిద్దామని బయలుదేరామని విద్యార్థులు చెప్తుతున్నారు. అకారణంగా పోలీసులు ఎర్రగుంట్ల వద్ద వారిని అడ్డుకోవడంతో నిరసనగా విద్యార్థులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం విద్యార్థులను తిరిగి ప్రొద్దుటూరు పంపారు.
(ఎర్రగుంట్ల)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement