లోకేష్‌ కమ్యూనిస్టుల చరిత్ర ఏంటో తెలుసుకో | cpi leader fired on minister lokesh | Sakshi
Sakshi News home page

లోకేష్‌ కమ్యూనిస్టుల చరిత్ర ఏంటో తెలుసుకో

Published Thu, Jul 27 2017 6:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

cpi leader fired on minister lokesh

అమరావతి: కమ్యూనిస్టుల చరిత్రేంటో లోకేష్ తెలుసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. విజయవాడ అభివృద్ధికి పాటుపడిందే కమ్యూనిస్టులని, విజయవాడకు తొలి మేయర్ కూడా కమ్యూనిస్టేనన్న విషయాన్ని లోకేష్ గుర్తుపెట్టుకోవాలన్నారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని రామకృష్ణ అమరావతిలో కలిశారు. రాష్టంలో వర్షాభావ ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. పంటల భీమా ప్రీమియం చెల్లింపు ఆగస్ట్ 20 వరకూ పొడిగించాలని, గరగపర్రు, చాపరాయి ప్రజలను ఆదుకోవాలని కూడా కోరినట్లు చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో సినిమా, రాజకీయ ప్రముఖులున్నా కఠినంగా శిక్షించాలని, సినీ నటి ఛార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో వర్మ పోల్చడం దురదృష్టకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement