జయంతికి వర్ధంతికి తేడా తెలియని అచ్చెన్న | Minister achennayudu controversial comments | Sakshi
Sakshi News home page

జయంతికి వర్ధంతికి తేడా తెలియని అచ్చెన్న

Published Thu, Aug 17 2017 2:13 AM | Last Updated on Wed, Aug 29 2018 7:50 PM

జయంతికి వర్ధంతికి తేడా తెలియని అచ్చెన్న - Sakshi

జయంతికి వర్ధంతికి తేడా తెలియని అచ్చెన్న

- గౌతు లచ్చన్న జయంతిని వర్ధంతి వేడుకలు అన్న వైనం
-  మంత్రి లోకేశ్‌ సాహచర్యంతో అలా అన్నానన్న మంత్రి
 
గుంటూరు వెస్ట్‌: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతిని మంత్రి అచ్చెన్నాయుడు వర్ధంతి అనడమేకాక, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. గౌతు లచ్చన్న 108వ జయంతి వేడుకలు బుధవారం గుంటూరు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నగరంలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీంతో పక్కన ఉన్న సహచరులు మంత్రి వ్యాఖ్యలను సరిచేశారు. దీనిపై మంత్రి అచ్చెన్న స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేశ్‌ గతంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని వర్ధంతి అని సంబోధించారని, ఆయన సాహచర్యం వల్ల తనకు కూడా అలానే వచ్చిందని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement