విచారణ పేరుతో వేధింపులు
తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో హైడ్రామా
- వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం ఇన్‌చార్జ్ చల్లా మధుకు పరోక్ష బెదిరింపులు
- తాము చెప్పినట్లు చేయాలని ‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్‌పై తీవ్ర ఒత్తిడి
- టీడీపీ పెట్టిన అసభ్య పోస్టింగులపై ఫిర్యాదు స్వీకరించని పోలీసులు
- 30వ తేదీన మళ్లీ విచారణకు రావాలని ఆదేశం
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగు తోంది. మంత్రి లోకేశ్ మీద వ్యంగ్య పోస్టింగులు పెట్టారన్న ఆరోపణలపై ‘పొలిటికల్ పంచ్’ ఫేస్‌బుక్ పేజీ నిర్వాహకుడు రవి కిరణ్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే అభాసుపాలైంది. అయి నా అదే ఒరవడిని కొనసాగిస్తూ రవికిరణ్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ సెల్ రాష్ట్ర ఇన్‌చార్జ్ చల్లా మధుసూదన్‌రెడ్డిని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు విచారణ పేరిట మంగళవారం తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు పిలి పించి హైడ్రామా నడిపారు.
చల్లా మధు సూదనరెడ్డిని తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో దాదాపు గంట పాటు అదనపు ఎస్పీ వైటీ నాయుడు, ఏఎస్పీ విక్రాంత్‌పాటిల్ విడివిడిగా విచారించారు. రవికిరణ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అని పలుసార్లు ప్రశ్నించారు. ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవని, ఆ ఫేస్‌బుక్ పేజీతో పార్టీకి సంబంధంలేదని మధు సమా« ధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు ఆయన్ను పరోక్షంగా బెదిరించినట్లు సమాచారం. అనంతరం ఈ నెల 30న మరోసారి విచారణకు రావాల్సిం దిగా నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే గంటసేపటి తర్వాత పోలీసులు చల్లా మధుకు ఫోన్ చేసి వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలన్నా రు. తాను అప్పటికే కృష్ణా జిల్లా సరిహద్దు దాటి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించానని, నోటీసులో పేర్కొన్న విధంగా ఈ నెల 30న విచారణకు హాజరవుతానని చెప్పారు.
టీడీపీ అసభ్య పోస్టింగులపై స్పందించని పోలీసులు
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ శాసనసభలను కించపరుస్తూ టీడీపీ సోషల్ మీడియా విభాగం చేసిన పలు అసభ్యకర పోస్టింగులపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని చల్లా మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. విచారణ పేరిట ప్రభుత్వ బెదిరింపులు, వేధింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
బెదిరింపుల పేరిట ఎంతగా అణచివేయాలని ప్రయత్నిస్తే నెటిజన్లు మరింతగా రెచ్చిపోతారన్నారు. రవికిరణ్ పెట్టిన చిన్న పోస్టింగుపై రాద్ధాంతం చేస్తున్న ప్రభుత్వం తమ ఫిర్యాదుపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాగా, పోలీసుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరికీ సంఘీభావంగా పార్టీ తాడికొండ సమన్వయకర్త హెనీ క్రిస్టినా, రాష్ట్ర అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, పార్టీ నేతలు రాకేష్‌రెడ్డి, వెంకటరెడ్డి, బత్తుల కిషోర్ తమ కార్యకర్తలతో తుళ్లూరు పోలీస్‌స్టేషన్ వద్దకు తరలివచ్చారు. పోలీసులు భారీగా మోహరించి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు.
రవికిరణ్‌పై తీవ్ర ఒత్తిడి
రవికిరణ్‌ను అదనపు ఎస్పీ వైటీ నాయుడు, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ పలు దఫాలుగా మంగళవారం రాత్రి 9 గంట ల వరకు విచారించారు. ‘నీకు వైఎస్సార్ సీపీతో సంబంధాలున్నాయని ఒప్పుకో.. ఆ పార్టీ సూచనల మేరకే పోస్టింగులు పెడుతున్నట్లు సంతకాలు చెయ్యి’ అని పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమా చారం. 30న మళ్లీ విచారణకు రావాలని చెప్పి పంపారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ తాను ఫ్రీలాన్స్ జర్నలిస్టునని, తనకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటే అభిమానం తప్ప ఆ పార్టీతో ఏ సంబంధం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సైట్‌లోని అఫీషియల్ పేజీలో పెట్టిన కొన్ని పోస్టింగులను ఆద ర్శంగా తీసుకునే తాను కొన్ని పోస్టింగు లను పెట్టానని, వాటితో వైఎస్సార్ సీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. మంత్రి నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని అణగదొక్కడానికి తనను అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.