‘పోలవరం ప్రాజెక్ట్ కోసం మీరు త్యాగం చేస్తున్నారు.. మీకు జరిగిన అన్యాయంపై మీరడిగేది న్యాయమేకదన్నా.. అత్యాశ కాదు.. సమంజసంగానే అడుగుతున్నారు.. మీ కోర్కెలు ఎవరూ కాదనలేరు.. పాలకులపై ఒత్తిడి తెచ్చి.. మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తా..’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసిత రైతులకు భరోసా ఇచ్చారు. తమ సమస్యలు తీర్చాలని కుక్కునూరులో 17 రోజులుగా వారు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.