కొడవలూరు, న్యూస్‌లైన్: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే మహిళా సాధికారిత జరిగిందని కోవూరు ఎమ్మెలే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని బసవాయపాళెం, రామాపురం పంచాయతీల్లో సోమవారం ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే మహిళలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో మహిళలను ఇబ్బందులు, అవమానాలకు గురిచేశారన్నారు. బహిరంగ సభలకు మహిళలు రాకుంటే, బస్సులు పెట్టి డ్వాక్రా మహిళలను తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. అయితే మహిళలు తీసుకున్న రుణాలపై కనీసం వడ్డీని మాఫీ చేయలేదన్నారు.
మహిళలకు 33 శాతం అసెంబ్లీలో సీట్లు కేటాయించాలని తీర్మానం చేసిన చంద్రబాబు, పార్లమెంట్ ఆమోదానికి వేచిచూడకుండా మహిళలకు సీట్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రూపాయి సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. 1994 వరకు మహిళలు సాధించిన మద్యపాన నిషేధాన్ని సీఎంగా బాధ్యలు చేపట్టిన తరువాత ఎత్తివేసిన చరిత్ర నీది కాదా అని బాబును ప్రశ్నించారు. మహిళల అభివృద్ధికి నాడు ఎన్టీఆర్ కృషి చేస్తే మరణించేవరకు మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 1994 నుంచి 2004 వరకు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు, నేడు బూటకపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యపాన నిషేధంపై తొలిసంతకం చేస్తానని బాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. గ్రామాల్లో టీ దుకాణాల్లో బెల్టుదుకాణాలు పెట్టి ప్రజలను మత్తులో మునిగేలా చేసిన చ రిత్ర చంద్రబాబుదని తెలిపారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే మహిళాసాధికారితకు 20 వేల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారని ప్రకటించారన్నారు. అదే విధంగా ఏడాదికి 12 సిలిండర్లతో పాటు 100 సబ్సిడీ ఇవ్వనున్నామన్నారు. తెలంగాణ విభజనకు సూత్రధారి అయిన చంద్రబాబుకు సీమాంధ్రలో బుద్ధి చెబుతారని తెలిసి, అధికారంలోకి రావాలన్న తపనతో ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వీరి చలపతిరావు, నల్లావుల శ్రీనివాసులు, కొడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు మం డల కన్వీనర్లు గంధం వెంకట శేషయ్య, మావులూరు శ్రీనివాసులు రెడ్డి, ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు వీరి సంపత్, కోడూరు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎండీ కరీముల్లా పాల్గొన్నారు.
మహిళాసాధికారిత వైఎస్సార్ చలువే: ప్రసన్నకుమార్‌రెడ్డి
Published Tue, Feb 25 2014 3:43 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
Advertisement
Advertisement