nallapareddy prasanna kumar reddy
-
అలాంటి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం
-
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ఫైర్
-
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
-
వేమిరెడ్డి దంపతులకు ప్రసన్న కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
వేమిరెడ్డి దంపతులకి ప్రసన్నకుమార్ రెడ్డి వార్నింగ్
-
సీఎం జగన్ కు బ్రహ్మరథం పడుతున్న నెల్లూరు ప్రజలు
-
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి ప్రసన్నకుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం జగన్
-
షర్మిలకు చంద్రబాబు 2 వందల కోట్లు ఇచ్చాడు ?..షర్మిలపై నల్లపురెడ్డి ఫైర్
-
చంద్రబాబుకి ఇంక సిగ్గు రాదు..ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్
-
నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి కౌంటర్
-
‘ఎన్టీఆర్ హయాంలో రామోజీతో ఇలాంటి ప్రచారమే!’
సాక్షి, నెల్లూరు: యెల్లో మీడియాలో తనపై జరుగుతున్న అసత్యప్రచారంపై కోవూరు(నెల్లూరు) ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి మరోసారి స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ముఖ్యనేత అచ్చెన్నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీతో టచ్‌లో లేరు. మునిగిపోతున్న టీడీపీకీ జీవం పోసుకునేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలకు దిగారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, ఆంబోతు అచ్చెన్నాయుడు డైరెక్షన్లోనే గోబెల్స్ ప్రచారం జరుగుతోందని మండిపడ్డారాయన. గతంలో ఎన్టీఆర్ హయాంలోనూ రామోజీరావును అడ్డంపెట్టుకుని ఇలాంటి ప్రచారాలు చంద్రబాబు చేయించాడని ప్రసన్నకుమార్ గుర్తు చేశారు. మంత్రి పదవి రాలేదని తాను అలిగినట్లు యెల్లో మీడియా ద్వారా అసత్య కథనాలు రాయిస్తున్నారని, రాసి పెట్టి ఉంటే పదవులు ఎక్కడికీ పోవని పేర్కొన్నారాయన. రాజకీయాల్లో వెనుకబడిన దళితులకు మంత్రి పదవులు ఇవ్వడం తప్పు అన్నచందాన చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: టీడీపీ మాజీలకు గెలుపు దూరం, అందుకే ఈ డ్రామా -
‘నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్‌తోనే ఉంటా’
సాక్షి, నెల్లూరు: పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, చివరి రక్తపు బొట్టు వరకు సీఎం జగన్‌తోనే ఉంటానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని ధ్వజమెత్తారు. అందులో భాగమే ఈ దుష్ప్రచారమని.. కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కోవూరులో వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏదేమైనా జగన్‌తోనే తన పయనమని స్పష్టం చేశారు. -
వలంటీర్లను చూస్తే చంద్రబాబుకు వణుకు
కొడవలూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): ‘ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉన్న వలంటీర్ వ్యవస్థను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వణుకు పట్టుకుంది. అందుకే ఎల్లో మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నాడు.’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని నార్తురాజుపాళెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వలంటీర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో అర్హులకు పక్కాగా ప్రభుత్వ పథకాలందిస్తున్నట్లు చెప్పారు. కరోనా గడ్డు కాలంలో ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయిలో ఉండి అండగా నిలిచారన్నారు. వారి పనితీరును చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. దీంతో ఎల్లో మీడియాలో దిగజారుడు రాతలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటును మొత్తం వలంటీర్ వ్యవస్థకు ఆపాదించి ఇష్టం వచ్చినట్లు రాయడం సబబేనా అని ప్రశ్నించారు. పలువురు ముఖ్యమంత్రులు ఈ వ్యవస్థ గురించి తెలుసుకుని ఆయా రాష్ట్రాల్లో అమలుకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఎల్లో మీడియా పనికట్టుకుని వ్యతిరేక వార్తలు రాసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని బాబు పగటికలలు కంటున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వదులుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని బాబు గుర్తించుకోవాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, జెడ్పీటీసీ పి.సరోజనమ్మ, ఎంపీపీ జి.జ్యోతి, సర్పంచ్‌లు బి.సుప్రియ, ఎన్.కామాక్షి, ఎంపీటీసీ పి.అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
నాడు అవినీతి, నేడు పారదర్శక పాలన
కొడవలూరు : గత టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు, స్థలం, పింఛన్ ఇలా ఏ పథకం పొందాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. కొడవలూరు ఇరిగేషన్ అతిథిగృహంలో కొడవలూరు, మానేగుంటపాడు గ్రామ వలంటీర్లతో ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు గ్రామ, మండలస్థాయి అధికారులను లెక్క చేసే వారు కాదని, అధికారులు అర్హులకు న్యాయం చేయాలన్నా చేయలేని పరిస్థతి ఉండేదని చెప్పారు. నేడు సీఎం జగన్మోహన్రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. కొడవలూరులో రెండు చోట్ల సైడ్ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.10 లక్షలు, మానేగుంటపాడులో సైడ్ డ్రెయిన్‌కు రూ.5 లక్షల ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కోవూరు నియోజకవర్గానికి గడిచిన రెండేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.450 కోట్లను అందించడం జరిగిందన్నారు. అనంతరం ఓటీఎస్ లబి్ధదారులకు రిజి్రస్టేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, డీసీఎమ్మెస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ వెంకటశేషయ్య, సర్పంచ్‌లు పాలిచర్ల శ్రీనివాసులురెడ్డి, కామాక్షి, ఎంపీటీసీ సభ్యుడు ప్రతాప్, నాయకులు సునీతమ్మ, తిరుపతమ్మ, సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: నల్లపరెడ్డి
-
ఎంతటి వారైనా ఉపేక్షించం: ఆనం హెచ్చరిక
సాక్షి, నెల్లూరు (కలువాయి): గిరిజన కుటుంబానికి దక్కాల్సిన ప్రభుత్వ సహాయంలో ఎవరు అవకతవకలకు పాల్పడి ఉన్నా, వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరించారు. రమణయ్య అనే వ్యక్తి మృతిచెందగా వైఎస్సార్ భీమా పథకం కింద బాధిత కుటుంబానికి అందాల్సిన రూ.2 లక్షలను స్థానిక పెద్దలు, అధికారులు కలిసి దుర్వినియోగం చేశారు. దీనిపై ఆదివారం సాక్షిలో ‘మనుషులా.. రాబంధులా!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆనం స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తిన్యాయం చేస్తామని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (మనుషులా.. రాబంధులా!) ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని ఎమ్మెల్యే కలువాయి ఎంపీడీఓ సింగయ్యను ఆదేశించారు. ఆయన స్పందించి వెలుగు అధికారులను గ్రామానికి పంపి విచారణ చేయించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నామన్నారు. పొదుపు రుణానికి కట్టేందుకు అని పక్కన పెట్టిన రూ.80 వేలు, అప్పు కింద గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జమ చేసుకున్న రూ.60 వేలు రెండురోజుల్లో వసూలు చేసి రమణయ్య కుమార్తెల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. వారు నగదు తక్షణమే చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. రమణయ్య చిన్న కుమార్తె స్వాతికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. రమణయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం – కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కలువాయి: ‘మనుషులా.. రాబంధులా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పందించారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆ రమణయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన సాక్షితో మాట్లాడుతూ రెండు, మూడురోజుల్లో రమణయ్య పిల్లల పేరున నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. రమణయ్య కుటుంబానికి జరిగిన అన్యాయ్యాన్ని కలెక్టర్, గూడూరు సబ్ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరామన్నారు. వారికి ప్రభుత్వ స్థలం ఇచ్చి, రమణయ్య చిన్న కుమార్తె స్వాతికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేసేలా చర్యలు కలెక్టర్‌ను కోరానన్నారు. -
మనబడి నాడు నేడుతో పాఠశాలను అభివృద్ధిచేస్తాం
-
చంద్రబాబు డైరెక్షన్.. కన్నా యాక్షన్
సాక్షి, కోవూరు: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు. చంద్రబాబునాయుడు డైరెక్షన్లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడు గ్రామంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమ పార్టీ నాయకులకు గౌరవం ఉందన్నారు. అయితే లక్ష్మీనారాయణ వంటి వ్యక్తుల వల్ల ఆ గౌరవం సన్నగిల్లుతోందన్నారు. కన్నాకు గుంటూరులో రౌడీగా ముద్ర ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల విధివిధానాలను అపహాస్యం చేస్తూ కన్నా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఖజానాను ఖాళీ చేసి అప్పుల ఊబిని తమ పార్టీకి అప్పగించడం జరిగిందన్నారు. దానిని ఒక సవాల్‌గా స్వీకరించి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇతర దేశాల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు లాంటి నీచరాజకీయాలు చేసే వ్యక్తితో కన్నా చేయి కలపడం దారుణమన్నారు. చంద్రబాబు, కన్నా వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమి ఒరగదన్నారు. ఎవరెన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీంతో లక్షలాదిమందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సమావేశంలో కాటంరెడ్డి దినేష్‌రెడ్డి, ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, డి.నిరంజన్‌బాబురెడ్డి, మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, ఎస్కే అహ్మద్, సొసైటీ అధ్యక్షులు ములుమూడి సుబ్బరామిరెడ్డి, ఎస్.నరసింహులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌పై హత్యాయత్నంలో చంద్రబాబు హస్తం
సాక్షి,విడవలూరు(నెల్లూర్): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో సీఎం చంద్రబాబు, డీజీపీల హస్తం ఉన్నట్లుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని జాన్‌పేట, ఎస్సీవాడకు చెందినవారు పెద్ద ఎత్తున ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి. వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలను చంద్రబాబు నిండా ముంచేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఘరానా మోసగాడన్నారు. భూ పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని.. అసలు భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. చంద్రబాబుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని.. వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదన్నారు. జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. -
ఆరు దాటితే కమీషన్ల లెక్కల్లో చంద్రబాబు
సాక్షి, కోవూరు: సీఎం చంద్రబాబు మంచి నాటకాలరాయుడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు రామాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఉదయం ఒక జొన్న ఇడ్లీ, టీ, మధ్యాహ్నం రాగిసంగటి, సాయంత్రం ఒక పండు, ఒక గుడ్డు ఆహారంగా తీసుకుంటానని చెప్పారన్నారు. అయితే సాయంత్రం ఆరు గంటలు దాటితే తండ్రీకొడుకులు కూర్చొని రోజువారీ కలెక్షన్లు, కమీషన్ల లెక్కలు చూసుకుంటూ కడుపు నింపుకుంటున్నారని విమర్శించారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు పర్యటనల కోసం ప్రైవేట్ హెలికాప్టర్‌కు రూ.14.33 కోట్లు ఖర్చు చేయడాన్ని కాగ్ విమర్శించిందని చెప్పారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల్లో అంతులేని అక్రమాలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొందన్నారు. దీనికి ప్రధాన కారకులు సీఎం చంద్రబాబేనని చెప్పారు. నెల్లూరు జిల్లాలో నీరు–చెట్టు కార్యక్రమంలో చోటుచేసుకున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. సైకోలా ప్రవర్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్‌కు సీఎం చంద్రబాబుకు తేడా లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నలబోలు సుబ్బారెడ్డి, జిల్లా నాయకులు మల్లికార్జునరెడ్డి, నిరంజన్ బాబురెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బరామిరెడ్డి, సర్పంచ్ దేవేంద్రమ్మ పాల్గొన్నారు. -
హోదా కోసం నేరుగా పోరాడు
పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి హితవు అనుమసముద్రంపేట: జనసేవ అధినేత పవన్‌కళ్యాణ్ దాగుడు మూతలు ఆడితే కుదరదని, హోదా కోసం నేరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి ఏఎస్‌పేట లోని శ్రీహజ్రత్, అమ్మాజీల దర్గా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా సజ్జాదానషీన్ హఫజ్పాషా ప్రార్థనలు చేసి శ్రీహజ్రత్ వారి శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ తిరుపతిలో హడావుడిగా సమావేశం పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. బైట ప్రసంగాలు లోపల లాలూచీ పడకుండా హోదా సాధించేందుకు సీఎం, పీఎంల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడితే తమ పార్టీ కూడా అందుకు మద్దతు తెలుపుతుందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టిన గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు రజిత్‌కుమార్‌రెడ్డి, భార్య గీతమ్మ, కోడలు పూజ, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కలువల శంకర్‌రెడ్డి, పార్టీ మండల ప్రచార కార్యదర్శి పఠాన్ ఖాదర్‌బాషా పాల్గొన్నారు. -
'ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు'
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం పశ్చాత్తాపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, సంజీవయ్య అన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వారు మంగళవారమిక్కడ తెలిపారు. అయితే వారి వివరాలు చెప్పాలని విలేకర్లు అడగగా, సమయం వచ్చినప్పుడు తామే బయటపెడతామని వారు పేర్కొన్నారు. రాజ్యసభకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డిదే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన 17మంది టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. రాజ్యసభకు నాలుగో అభ్యర్థి విషయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు నిన్న సమావేశం అయ్యారు. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు వారిని ముందుగా తిరుపతి, ఆ తర్వాత విజయవాడ, అనంతరం హైదరాబాద్ అంటూ తిప్పుతున్నారు. ఇక చంద్రబాబుతో భేటీ సమయంలో వారి సెల్ఫోన్లు కూడా సెక్యూరిటీ సిబ్బంది తీసుకున్న తర్వాతే లోనికి అనుమతించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వడం ఇష్టం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను విమర్శించేందుకే మహానాడు నిర్వహించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పేదల గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ సీపీని ఏమీ చేయలేరని నల్లపరెడ్డి అన్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. -
'మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్న చంద్రబాబు'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరులో ఎన్ ప్రసన్న కుమార్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... తన పార్టీ అనుచరులతో అక్రమాలు చేయిస్తూ చంద్రబాబు మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు. కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. -
రాజీనామా చేయలేదు..జగన్‌తోనే ఉంటా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఫ్యాక్స్ చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. నల్లపరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ' నేను పార్టీకి రాజీనామా చేయలేదు. రాజీనామా లేఖను పార్టీ ఆఫీసుకు పంపించినట్లు, రాజీనామా చేసినట్లు చెప్పారు. ఏ రాజీనామా లేఖను పంపలేదు. ఫ్యాక్స్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. ఏబీఎన్ ఛానల్‌కు చెందిన హైదరాబాద్ రిపోర్టర్ ఈరోజు ఉదయం నేను రాజీనామా లేఖను వైఎస్ జగన్‌కు ఫ్యాక్స్ చేసినట్లు చెబుతున్నాడు. నెల్లూరు రిపోర్టర్‌ను లైవ్‌లోకి తీసుకుని అడిగితే... నేను రాజీనామా చేయలేదు, ఫ్యాక్స్ చేయలేదని చెప్పాడు. అయినా ఇటువంటి అసత్య ప్రచారాలు ఎందుకు. ఏదైనా ఉంటే నన్నే అడిగితే నేను చెబుతాను. ఏదైనా చేస్తే మీఅందరికీ చెప్పే చేస్తాను. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని నేను అనలేదు. నాకు రాజీనామా చేసే యోచనలేదు. మా మధ్య విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డిగారు నన్ను తిట్టినట్లు...ఆంధ్రజ్యోతి వాళ్లు విన్నారేమో...నాకు అయితే తెలియదు. ఆయన నన్ను ఎప్పుడూ గౌరవంగా చూస్తారు. ...నా చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతాను. 2012లో ఏ మాట అయితే చెప్పానో... ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను. అన్ని విషయాలు మా నాయకుడితో మాట్లాడుకుంటాను' అని అన్నారు. చంద్రబాబు నాయుడు...ఎంపీటీసీలను సంతలో సరుకులను కొన్నట్లు కొంటున్నారని నల్లపరెడ్డి మండిపడ్డారు.