త్వరలో వైఎస్సార్ స్వర్ణయుగం | coming soon ysr congress party Golden government says in nallapareddy prasanna kumar reddy | Sakshi
Sakshi News home page

త్వరలో వైఎస్సార్ స్వర్ణయుగం

Published Tue, Dec 3 2013 3:44 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

coming soon ysr congress party Golden government says in  nallapareddy prasanna kumar reddy

కోవూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని రాక్షస పాలనకు త్వరలోనే తెరపడి, వైఎస్సార్ స్వర్ణయుగం ప్రజల ముందుకు వస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పడుగుపాడులోని వైఎస్సార్‌సీపీ నేత రామిరెడ్డి మల్లికార్జున్‌రెడ్డి నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ఆయన తెచ్చే స్వర్ణయుగంలో వృద్ధులు, వితంతవులకు రూ.700, వికలాంగులకు రూ.వెయ్యి వంతున పింఛన్ అందుతుందన్నారు. మహిళలు, రైతులు, చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తారన్నారు. ఏటా 10 లక్షల ఇళ్లు కట్టించి పేదలందరి సొంతింటి కల నెరవేరుస్తారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధినిపెంచి పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళతామన్నారు. 
 
 అమ్మఒడి పథకం ద్వారా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లభిస్తుందన్నారు. పిల్లలు చదివే తరగతిని బట్టి వారి తల్లుల బ్యాంకు అకౌంట్‌లో నగదు జమ చేస్తారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారన్నారు. ప్రస్తుతం తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నానన్నారు. గతంలో తాను టీడీపీ ఎమ్మెల్యే వ్యవహరించిన సమయంలో ఆ పార్టీ అధికారంలో ఉండటంతో ఏ స్థాయి అభివృద్ధి పనులు చేశానో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇవేమి తెలియని కొందరు మాట్లాడుతున్న మాటలను ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల కన్వీనర్ ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, సుబ్బారెడ్డి, నరసింహులురెడ్డి, సుధీర్‌రెడ్డి, కోటపూరి  రమణయ్య, ఆదిశేషయ్య, అట్లూరు సుబ్రమణ్యం, యానాదయ్య, గడ్డం రమణమ్మ, కాటంరెడ్డి దినేష్‌రెడ్డి, సామేల్, అన్ను తదితరులు  ఉన్నారు. 
 
 సమస్యలు పరిష్కరించాలని వినతి 
 కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పోతిరెడ్డిపాళెం వాసులు కోరారు. సాలుచింతల సెంటర్‌లో గాజుల మల్లికార్జున నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి వారు తమ సమస్యలు వివరించారు. మరుగుదొడ్లు నిర్మించుకుని చాలా కాలమైనా, బిల్లులు మంజూరు చేయలేదన్నారు. తాగునీటి కోసం నిత్యం కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సుబ్బారెడ్డి, రవీంద్రరెడ్డి, తిరుపతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సీహెచ్ శ్రీనివాసులురెడ్డి, గాజుల మల్లికార్జున్, నాగరాజు,శ్రీనివాసులు, పన్నెం సుబ్రహ్మణ్యం, హరిప్రసాద్‌రెడ్డి, రాజ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement