హోదా కోసం నేరుగా పోరాడు | directly fight for special status | Sakshi
Sakshi News home page

హోదా కోసం నేరుగా పోరాడు

Published Mon, Aug 29 2016 1:00 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా కోసం నేరుగా పోరాడు - Sakshi

హోదా కోసం నేరుగా పోరాడు

 
  • పవన్‌ కళ్యాణ్‌కు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి హితవు
అనుమసముద్రంపేట:
జనసేవ అధినేత పవన్‌కళ్యాణ్‌  దాగుడు మూతలు ఆడితే కుదరదని, హోదా కోసం నేరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి ఏఎస్‌పేట లోని శ్రీహజ్రత్, అమ్మాజీల దర్గా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా సజ్జాదానషీన్‌ హఫజ్‌పాషా ప్రార్థనలు చేసి శ్రీహజ్రత్‌ వారి శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ తిరుపతిలో హడావుడిగా సమావేశం పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. బైట ప్రసంగాలు లోపల లాలూచీ పడకుండా హోదా సాధించేందుకు సీఎం, పీఎంల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడితే తమ పార్టీ కూడా అందుకు మద్దతు తెలుపుతుందన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు రజిత్‌కుమార్‌రెడ్డి, భార్య గీతమ్మ, కోడలు పూజ, పార్టీ రాష్ట్ర యూత్‌ కార్యదర్శి కలువల శంకర్‌రెడ్డి, పార్టీ మండల ప్రచార కార్యదర్శి పఠాన్‌ ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement