నెల్లూరు: అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడుకు అన్నా ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత లేదని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇందుకూరుపేటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.... అవకాశ రాజకీయాల కోసం ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటున్నారని నల్లపరెడ్డి మండిపడ్డారు.