సీలింగ్ ఫ్యాన్ టీం రెఢీ | ysrcp team ready for elections | Sakshi
Sakshi News home page

సీలింగ్ ఫ్యాన్ టీం రెఢీ

Published Tue, Apr 15 2014 3:54 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సీలింగ్ ఫ్యాన్ టీం రెఢీ - Sakshi

సీలింగ్ ఫ్యాన్ టీం రెఢీ

 సాక్షి,నెల్లూరు:  సీలింగ్ ఫ్యాన్ టీం రెడీ అయింది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన సమన్వయకర్తలనే పార్లమెంట్, శాసనసభ అభ్యర్థులుగా వైఎస్సార్సీపీ ఎన్నికల బరిలో నిలిపింది. ఈ మేరకు అధిష్టానం సోమవారం జాబితాను వెల్లడించింది.

విశ్వసనీయతకు, నమ్మకానికి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. తనను నమ్ముకున్న వారికి, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి టికెట్లు ఇచ్చి విశ్వాసాన్ని చాటారు. తొలి నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి టికెట్లు దక్కాయి.
 
నెల్లూరు సిటీ నుంచి యువకుడైన డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్‌కు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టికెట్ లభించింది. ఇక జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోవూరు నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డినే తిరిగి ఖరారు చేశారు. సర్వేపల్లి నుంచి వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు.

సూళ్లూరుపేట, గూడూరు నుంచి కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్‌ను ఎంపిక చేశారు. కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వెంకటగిరి అభ్యర్థిగా కొమ్మి లక్ష్మయ్యనాయుడును ఎంపిక చేశారు. ఇక నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాద్‌కు టికెట్ లభించింది.  
 
 వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు

నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ నెల 17న కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు.
తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్  ఈ నెల 16న జెడ్పీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ నెల 16న నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు.
సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ నెల 16న వెంకటాచలం తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కోవూరు అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఈ నెల 15న కోవూరు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ నెల 16న ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు.
ఉదయగిరి అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఈ నెల 17న ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గూడూరు అభ్యర్థిగా పాశం సునీల్‌కుమార్ ఈ నెల 17న గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సూళ్లూరుపేట అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య ఈ నెల 16న తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వెంకటగిరి అభ్యర్థిగా కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఈ నెల 16న వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు.
కావలి అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఈ నెల 16న కావలి ఆర్డీఓ  కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయ నున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement